Sunday, December 31, 2023

Vishnu1000 Namams

upanishad



VISHNU STOTRAM — 1000 NAMES

viśvaṁ viṣṇurvaṣaṭkārō bhūtabhavyabhavatprabhuḥ,

bhūtakṛdbhūtabhṛdbhāvō bhūtātmā bhūtabhāvanaḥ. (1)

1. Viśvaṁ: The all or the Universe.

1 ఓం విశ్వం - అతడు సృష్టి

సమన్వయము: ఉన్నదంతా విష్ణువే. కొందరు అతన్ని బ్రహ్మన్ అని పిలుస్తారు. బ్రహ్మన్ అద్వితీయుడు అంటే తనకంటే వేరే వస్తువుగానీ, జీవిగానీ లేదు. ఎలాగైతే సాలె పురుగు తన లాలాజలంతో గూడు కట్టుకుందో బ్రహ్మన్ కూడా తన మాయా శక్తితో విశ్వం సృష్టించేడు. అది అతనికన్నా వేరు కాదు. కొందరంటారు, సృష్టి అతని క్రీడ అని. అతను ఒక పద్దతిలో విశ్వాన్ని సృష్టించి విష్ణువుని దాన్ని సంరక్షింపడానికి సృష్టించేడు. కాబట్టి బ్రహ్మన్ విష్ణు రూపములో వ్యవహరించేవాడు

2. Viṣṇuḥ: He who pervades everything.

2 ఓం విష్ణుః - అతడు సర్వాంతర్యామి

సమన్వయము: అతడు లేని ప్రదేశములేదు. శూన్యం కూడా శక్తితో కూడినదని నేటి భౌతిక శాస్త్రజ్ఞులు ప్రతిపాదించేరు. అంటే శక్తి (energy), పదార్థము (matter) రెండూ లేని ప్రదేశమే లేదు

3. Vaṣaṭkāraḥ: For whom the sacrificial versus are uttered in the yajnas.

3 ఓం వషట్కారః - అతడు యజ్ఞములలో మంత్ర రూపము

సమన్వయము: యజ్ఞాలను చేసేవారు సాధారణంగా లోక కళ్యాణానికై చేస్తారు: వర్షాలు పడాలి, శాంతి కలగాలి లేదా సంతతి కలగాలి. యజ్ఞంలో చదివే మంత్రాలు దివ్యమైనవి. అందుకే విష్ణువుని ఆ మంత్రాల స్వరూపం తో పోల్చేరు

4. Bhūta-bhavya-bhavat-prabhuḥ: The one who is the master and beyond the past, present and the future.

4 ఓం భూత భవ్య భవత ప్రభుః - అతడు సర్వకాలములయందు ఉండే సృష్టి పరిపాలకుడు

5. Bhūtakṛd: The creator and destroyer of all existences in the universe.

5 ఓం భూతకృద్ - అతడు సృష్టి కర్త, లయమునకు కారకుడు

6. Būtabhṛd: One who supports or sustains or governs the universe.

6 ఓం భూత బృద్ - అతడు సృష్టిని పోషించి పరిపాలించే వాడు

7. Bhāvaḥ: Pure existence.

7 ఓం భావః - అతడు శుద్ధమై ఉండేవాడు

8. Bhūtātmā: The essence of all beings.

8 ఓం భూతాత్మా: - అతడు జీవుల స్వస్వరూపము

9. Bhūta-bhāvanaḥ: He who originates and develops all Elements.

9 ఓం భూత భావన : - అతడు అన్ని పదార్థాలను సృష్టించేవాడు, వాటికి ఆధారము

సమన్వయము: సృష్టి అంతా ఆయన కల్పితమే కాబట్టి అన్నీ అతనే సృష్టించాడు అనడంలో ఎటువంటి అనుమానం ఉండకూడదు.

pūtātmā paramātmā ca muktānāṁ paramā gatiḥ,

avyayaḥ puruṣaḥ sākṣī kṣetrajñōkṣara eva ca. (2)

10. Pūtātmā: One whose nature is purity/who is purity.

10 ఓం పూతాత్మా - అతడు శుద్ధ చైతన్యము

11. Paramātmā: He who is the supreme one and the Atman.

11 ఓం పరమాత్మ - అతడు పరమాత్మ

12. Muktānāṁ paramā gatiḥ: The highest goal of the liberated ones.

12 ఓం ముక్తానాం పరమా గతిః - అతడు ముక్తుల చివరి లక్ష్యం

సమన్వయము: ముక్తిని పొందిన వారికి పునర్జన్మము ఉండదు. వారిలో జీవన్ముక్తులు బ్రతికుండగానే మోక్ష స్థితిని పొందినవారు. ఉదాహరణకు ధ్రువుడు. ఇంకొందరు విదేహముక్తులు. వారు మరణము తరువాత ముక్తిని పొందేవారు. ముక్తి అనగా సూక్ష్మ శరీరంతో విష్ణువులో ఐక్యమవ్వడం అనవచ్చు.

13. Avyayaḥ: One for whom there is no decay.

13 ఓం అవ్యయః - అతడు క్షయము లేనివాడు

14. Puruṣaḥ: One who abides in the body or pura.

14 ఓం పురుషాః - అతడు పురము (దేహము) నందు ఉండేవాడు

సమన్వయము: సృష్టి పురుషుడు, ప్రకృతుల కల్పన. ప్రకృతి పురుషుని -- అనగా విష్ణుని -- మాయ వల్ల ఆవిర్భవించినది. జీవులు ప్రకృతిలో పుట్టి, చరిస్తారు. పురుషుడు సాక్షి మాత్రమే. సృష్టి అతని క్రీడ.

15. Sākṣī: One who witnesses everything.

15 ఓం సాక్షిః - అతడు సర్వమునకు సాక్షి

సమన్వయము: ఇక్కడ విష్ణువు బ్రహ్మన్ తో పోల్చబడినవాడు. బ్రహ్మన్ ఏ కర్మా చెయ్యదు . అది నిర్గుణము అనగా గుణములు లేనిది. దానికి పుట్టుక, మరణం లేదు. కానీ విష్ణువు అవతారములలో గుణములు కలిగియుండేవాడు. ఏలనగా సామాన్య మానవులకు అతని తత్త్వం అర్థం చేసుకోవడానికి ఆకృతి ఎంతో అవసరం

16. Kṣetrajñaḥ: The knower of the field or body.

16 ఓం క్షేత్రజ్ఞః - అతడు దేహమును ఎరిగినవాడు

సమన్వయము: గీతలోపదమూడవ అధ్యాయములో --క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం లో -- కృష్ణుడు "కౌన్తేయా! ఈ శరీరమును క్షేత్రమనియు, దీనిని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడని తత్త్వజ్ఞులు తెలిపిరి" అని చెప్పెను. తక్కిన శ్లోకాలు దానిని విశిదీకరించాయి.

17. Akṣara: He who is without destruction.

17 ఓం అక్షర - అతడు నాశము లేనివాడు

సమన్వయము: క్షరము అంటే క్షీణించేది. ఉదాహరణకి సూర్యుని తేజస్సు ఒకనాటికి క్షీణించేదే. అలా చూస్తూ పోతే సృష్టిలో జన్మించిన వన్నీ తిరిగి ఆ బ్రహ్మన్ లో కలిసిపోయేవే.

yōgō yōgavidāṁ netā pradhānapuruṣeśvaraḥ,

nārasiṁhavapuḥ śrīmān keśavaḥ puruṣōttamaḥ. (3)

18. Yogaḥ: One attainable through Yoga.

18 ఓం యోగాః - అతడు యోగముచే పొందబడువాడు

సమన్వయము: యోగ మనగా ఐక్యమవ్వుట లేదా కలిసిపోవుట. పతంజలి యోగ సూత్రాలలో జీవుని అనేక విధాలైన యోగములచే భగవంతుని పొందవచ్చని చెప్పబడినది. ముఖ్యంగా ఇక్కడ సమాధి స్థితి.

19. Yogavidāṁ netā: The master of those who are established in the above-mentioned Yoga.

19 ఓం యోగవిదం నేతాః - అతడు యోగమునందుండేవారి ఆరాధ్య దైవము

20. Pradhāna-puruṣeśvaraḥ: The master of pradhana or Prakriti and Purusha or Jiva.

20 ఓం ప్రధాన పురుషేశ్వరః - అతడు ప్రకృతికి, జీవుడికి యజమాని

21. Nārasiṁha-vapuḥ: One in whom the bodies of a man and a lion are combined.

21 ఓం నారసింహ వపుః - అతడు సగం సింహ దేహము దాల్చినవాడు

సమన్వయము: ఇక్కడ నరసింహావతారము సూచింపబడినది. ఈ అవతారంలో అతడు హిరణ్యకశిపుని సంహరించి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించెను. ఇక్కడ ముఖ్యమైన విషయము బ్రహ్మ వరము వలన హిరణ్యకశిపునికి మనుష్యులు, దేవతలు మొదలగు వాటివలన మృత్యువు రాదు. అందుకు విష్ణువు తెలివిగా సగం నరుడు, తక్కిన సగం సింహం యొక్క ఆకారాన్ని ధరించి వానిని సంహరించేడు. భాగవత సప్తమ స్కంధంలో పోతన ఇట్లు వివరించెను:

నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరిమాయారచిత మగు యథార్థము చూడన్.

ఈ విధంగా అతడు లోక కంటకుడైన వానిని నిర్మూలించెను. భాగవతంలో చెప్పినట్లు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేవారు విష్ణు భటులైన జయ విజయులే. వారు ముని శాపమువలన రాక్షస రూపములు పొందేరు.

22. Śrimān: One on whose chest the goddess Shri always dwells.

22 ఓం శ్రీమాన్ - అతడు వక్ష స్థలమందు లక్ష్మీ దేవిని కలవాడు

23. Keśavaḥ: One whose Kesa or locks are beautiful.

23 ఓం కేశవాః - అతడు అందమైన కేశములు గలవాడు

24. Puruṣottamaḥ: The greatest among all Purushas.

24 ఓం పురుషోత్తమాః - అతడు పురుషులలో శ్రేష్టుడు

సమన్వయము: పురుష + ఉత్తమ

sarvaḥ śarvaḥ śivaḥ sthāṇurbhūtādirnidhiravyayaḥ,

saṁbhavō bhāvanō bhartā prabhavaḥ prabhurīśvaraḥ. (4)

25. Sarvaḥ: The omniscient source of all existence.

25 ఓం సర్వాః - అతడు సృష్టి అంతటిలో సర్వజ్ఞుడు

26. Śarvaḥ: Destroyer.

26 ఓం శర్వాః - అతడు సృష్టికి లయ కర్త

27. Śivaḥ: One pure.

27 ఓం శివాః - అతడు పరిశుద్ధుడు

28. Sthāṇur: One who is steady, immovable and changeless.

28 ఓం శ్థానుర్: - అతడు శాశ్వతుడు, స్థిరుడు, వికారము లేనివాడు

29. Bhūtādiḥ: Source of all elements or existing things.

29 ఓం భూతాదిః - అతడు అన్ని పదార్థములకు యోని

సమన్వయము: భూత + ఆది; భూత అంటే జీవులు, ఆది అంటే జననము. కావున విష్ణువు జీవుల జననానికి కారకుడు. సృష్టి అంతా బ్రహ్మన్ నుండి ఆవిర్భవించినదే. ఇందులో మనం పరలోకాలకు పట్టుకుపోయేది ఏదీ లేదు. కేవలం మనమాచరించిన పాపపుణ్యాలే సూక్ష్మ శరీరముతో పరలోకాలకు ప్రయాణిస్తాయి.

30. Nidhir-avyayaḥ: The changeless and indestructible Being in whom the whole universe becomes merged and remains in seminal condition at the time of Pralaya or cosmic dissolution.

30 ఓం నిధిర్ అవ్యయః - అతడు మార్పు లేని, నాశము లేని వాడు; ప్రళయ కాలములో సృష్టిని తనలో నిక్షిప్తము చేసేవాడు

31. Sambhavaḥ: One born out of His own will as incarnation.

31 ఓం సంభవః - అతడు తలంపు మాత్రములో తన ఇష్టానుసారం అవతారము దాల్చగలడు

సమన్వయము: బ్రహ్మన్ తన సంకల్ప మాత్రముననే అవతారము దాల్చగలడు. కానీ విష్ణువు ధర్మమునకు హాని కలిగినప్పుడు దుష్ట శిక్షణకై అవతారమెత్తుతాడు. రాక్షసులు కూడా బ్రహ్మన్ చే సృష్టింపబడినవారు. కాబట్టి వారిని తుదముట్టడించడం ఎందుకంటే, వారి వలన ధర్మానికి లేదా ఒక క్రమములో నడిచే సృష్టికి హాని కలిగింది. ఉదాహరణకి రామావతారంలో రావణుడు సీతనపహరించి మిక్కిలి పాపం చేసుకొన్నాడు. అంతకు ముందు అనేకమంది కన్యలను, సతులను అపహరించేడు. కాబట్టి అతడు ధర్మ హాని చేసినవాడు.

32. Bhāvanaḥ: One who generates the fruits or Karmas of all Jivas for them to enjoy.

32 ఓం భావనః - అతడు జీవులకు కర్మ ఫల ప్రదాత; వారికి ఆనందము ప్రసాదించేవాడు

సమన్వయము: గీతలో కృష్ణుడు రెండవ అధ్యాయం (సాంఖ్య యోగం) లో జీవులకు కర్మను చేయడానికి అధికారముందిగానీ దాని ఫలితమునకై లేదు అని చెప్పెను. అలాగని మనం కర్మలు చెయ్యడం మాన కూడదు. అలాగే మనమే దేవతనైనా పూజించవచ్చు. ఆ పూజలన్నీ విష్ణువుకే తుదకు చెందుతాయి. కాబట్టి అతడు దేవతలకు కూడా ఆరాధ్య దైవము

33. Bhartā: One who supports the universe as its substratum.

33 ఓం భర్తా - అతడు సృష్టికి ఆధారము

సమన్వయము: అతడు సృష్టి గావించి అందులో మనం నివసించడానికి అనేక వసతులు ప్రసాదించేడు. ఉదాహరణకి "అన్నము వలన ప్రాణులు పుట్టుచున్నవి. మేఘము వలన అన్నము కలుగుచున్నది. యజ్ఞము వలన మేఘము ఏర్పడుచున్నది. అట్టి యజ్ఞము కర్మవలననే సంభవమగుచున్నది" అని గీత మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పియున్నాడు. అలాగే జీవులకు ఆధారమైన సూర్యుడు అతని సృష్టిలోని భాగమే. సూర్యుడు లేనిదే జీవులు లేరు. ఆ సూర్యుడు ఉనికి విష్ణువు వలననే. కాబట్టి విష్ణువే అన్నిటికీ ఆధారం

34. Prabhavaḥ: One from whom all the great elements have their birth. Or one who has exalted births as incarnations.

34 ఓం ప్రభవః - అతడు గొప్ప పదార్థముల పుట్టుకకు కారకుడు; గొప్ప అవతారాలకు మూలము

సమన్వయము: ప్రభవ అంటే దీని నుండి పుట్టును. మొదటి ప్రకాశము; ప్రభవ సంవత్సరము; పరాక్రమము.

35. Prabhuḥ: One who is an adept in all rites.

35 ఓం ప్రభుః - అతడు అన్ని సంస్కారాలలో ఆరితేరినవాడు

36. Iśvaraḥ: One who has unlimited lordliness or power over all things.

36 ఓం ఈశ్వరాః - అతడు అన్నిటినీ నియంత్రించే శక్తి గలవాడు

సమన్వయము: అతడు ఒక గొప్ప నియంత. అతని యందలి భయము వలననే సూర్యుడు స్థిరమైన కక్ష్యలో ప్రయాణిస్తున్నాడు. ఈ సృష్టి అంతా అతని వైభవమే. న్యూటన్ వంటి మహానుభావులు కొన్ని సృష్టి రహస్యాలనే తెలుసుకొన్నారు. మానవ జాతికి తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

svayaṁbhūḥ śaṁbhurādityaḥ puṣkarākṣō mahāsvanaḥ,

anādinidhanō dhātā vidhātā dhāturuttamaḥ. (5)

37. Svayambhūḥ: One who exists by Himself, uncaused by any other.

37 ఓం స్వయంభూః - అతడు ఇతరుల ప్రమేయము లేక తనంతట తాను ఉన్నవాడు

సమన్వయము: అతడు తన స్వశక్తితోనే సృష్టి కార్యము చేసినవాడు. అతనికి సృష్టి ఒక క్రీడ. కంప్యూటరు శాస్త్రవేత్తలు యానిమేషన్, అనగా మానవరూపాల్లో, జంతువుల రూపాల్లో చలన చిత్రాలు మన ఆనందానికై చేస్తారు. అలాగే బ్రహ్మన్ సృష్టినంతటినీ చేసి అందులో జీవులు సుఖంగా, ఆనందంగా ఉండడానికి అనేక వసతులు కల్పించేడు.

38. Śaṁbhuḥ: One who bestows happiness on devotees.

38 ఓం శంభుః - అతడు భక్తులను ఆనందింపజేసేవాడు

సమన్వయము: శంభు అంటే ఇతని నుండి శుభము జరుగును. శివుడు; బ్రహ్మ.

39. Ādityaḥ: The golden-hued person in the sun's orb.

39 ఓం ఆదిత్యః - అతడు సూర్యునిలో సువర్ణ వర్ణములో నుండేవాడు

సమన్వయము: సువర్ణము తుప్పు పట్టదు. మనకి కావలసిన రూపం పొందుతుంది. దానికంటూ ఒక రూపం లేదు. ఇలా చెప్పుకుపోతే అతడు సువర్ణమును ఎందుకు ఎంచుకున్నాడో తెలియవస్తుంది. నిజానికి సువర్ణ వర్ఛస్సు ఒకానొక విభూతి మాత్రమే. కృష్ణావతారంలో అతడు నలుపు, తెలుపు కాని నీలి వర్ణంలో జన్మించేడు.

40. Puṣkarākṣaḥ: One who has eyes resembling the petals of Pushkara or lotus.

40 ఓం పుష్కరాక్షః - అతడు పద్మమును పోలు నేత్రములు గలవాడు

సమన్వయము: పుష్కర + అక్ష -- పుష్కరమంటే పద్మము, అక్ష అంటే కన్నులు

41. Mahāsvanaḥ: One from whom comes the great sound – the Veda.

41 ఓం మహాస్వనః - అతడు వేదములకు నిలయము

సమన్వయము: వేదం అపౌరుషము. అంటే మానవ మాత్రుడు దాని పుట్టుకకు కారణము కాదు. భాగవతంలో హాయగ్రీవుడనే దానవుడు వేదాలను ఎలా అపహరించేడో చెప్పబడినది. వాటిని రక్షించడానికై విష్ణువు అవతారమును దాల్చ వలసి వచ్చినది.

42. Anāndi-nidhanaḥ: The one existence that has neither birth nor death.

42 ఓం ఆనంది నిధనః - అతడు చావుపుట్టకలు లేనివాడు

43. Dhātā: One who is the support of the universe.

43 ఓం ధాతాః - అతడు జగత్తుకు ఆధారము

44. Vidhātā: He who generates Karmas and their fruits.

44 ఓం విధాతః - అతడు కర్మ ఫలమును ప్రసాదించేవాడు

45. Dhāturuttamaḥ: The ultimate support of every thing.

45 ఓం ధాతురుత్తమః - అతడు అన్ని పదార్థాలకు మూలాధారము

aprameyō hṛṣīkeśaḥ padmanābho’maraprabhuḥ,

viśvakarmā manusvtaṣṭā sthaviṣṭhaḥ sthaviro dhruvaḥ. (6)

46. Aprameyaḥ: One who is not measurable or understandable by any of the accepted means of knowledge like sense, perception, inference etc.

46 ఓం అప్రమేయః - అతడు ప్రమాణముల, ఇంద్రియాల వలన తెలియనివాడు

సమన్వయము: మనం చూసినది, విన్నది మొదలైన ఇంద్రియ సంభందిత మార్గాల్లో వస్తువులను గ్రహిస్తాము. వీటిని ప్రత్యక్ష ప్రమాణములంటారు. ఇక పరోక్షంగా కూడా మనము విషయాలను గ్రహిస్తాము. ఉదాహరణకు పొగ చూస్తే అక్కడ నిప్పు కూడా వుండాలను భావిస్తాము. అలాగే వేదములు కూడా ప్రమాణములే. విష్ణువు ఎట్టి ప్రమాణమువలన తెలుసుకోబడలేడు. ఎందుకంటే అతడు శుద్ధ చైతన్య స్వరూపుడు. మనకు తెలిసి శరీరము జడమైతే -- చైతన్యము కోల్పోతే-- దానికి ప్రాణము లేదని. కాని మనము ప్రాణాన్ని ఏ ప్రమాణంవలనా చూడలేము.

47. Hṛṣīkeśaḥ: The master of the senses or He under whose control the senses subsist.

47 ఓం హృషీకేశః - అతడు ఇంద్రియములను జయించిన వాడు

48. Padmanābhaḥ: He in whose navel (nabhi) the lotus (padma), the source of the universe, stands.

48 ఓం పద్మనాభః - అతడు నాభి యందు సర్వ జగత్తు ఉండే పద్మము గలవాడు

సమన్వయము: భాగవతంలో సృష్టికి పూర్వము బ్రహ్మ దేవుడు ఒక కమలం లోనుంచి వచ్చేడని చెప్పబడినది. వానికి ఎటువంటి జీవి కనపడలేదు. ఆ పద్మం యొక్క కాండంలో ప్రవేశించి చూడగా ఏమీ కానరాలేదు. నేనెందుకు వచ్చాను అనే దానిపై ధ్యానం చేయగా విష్ణువు అతనికి ప్రత్యక్షమై సృష్టి కార్యము మొదలపెట్టమని అజ్ఞాపించేడు. ఈ విధంగా సర్వ జగత్తు ఆ కమలం నుండి, ఆ కమలం విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినదని తెలియబడుచున్నది.

49. Amara-prabhuḥ: The master of Amaras or the deathless ones, i.e.the Devas.

49 ఓం అమర ప్రభుః - అతడు మరణము లేని దేవతలకు అధినేత

సమన్వయము: విష్ణువు దేవతల పక్షపాతి అనడంలో పూర్తి నిజం లేదు. పాల సముద్ర మదనంలో అమృతము ఆవిర్భవించినప్పుడు అతడు మోహినీ రూపమును దాల్చి దానిని దేవతలకు పంచిపెట్టెను. రాక్షసులు జరిగిన మోసం తెలుసుకొని వారు కృద్ధులైనారు. తరచి చూస్తే దైవ గణములు గలవారిని విష్ణువు రక్షిస్తాడు. బ్రహ్మన్ కేవలం సాక్షి మాత్రమే. ఎట్టి కర్మ చెయ్యడు. కానీ విష్ణువు పరిపాలకుడుగా తనకు కావలసిన విధముగా కర్మల నాచరిస్తాడు.

50. Viśvakarmā: He whose Karma (work) has resulted in all that exists (Vishvam) or He whose power of creation is unique and wonderful.

50 ఓం విశ్వ కర్మ - అతడు విశ్వమును తయారు చేసినవాడు

51. Manuḥ: He who thinks.

51 ఓం మనుః - అతడు యోచన చేసేవాడు

52. Tvaṣṭā: He who makes all beings shrunken (Tanukarana) at the time of cosmic dissolution.

52 ఓం త్వస్తా - అతడు ప్రళయకాలమున అన్ని జీవులను సూక్ష్మ శరీరములో నుంచేవాడు

53. Sthaviṣṭaḥ: He who excels in everything in bulk or substantiality.

53 ఓం స్తవిస్తః - అతడు స్థూలమై అన్నిటిలోనూ ప్రజ్ఞ గలవాడు

54. Sthaviraḥ-dhruvaḥ: Eternal One, being the most ancient. It is taken as a single phrase, the name along with its qualification.

54 ఓం స్తవిరః ధృవః - అతడు బహు పురాతనమై నిత్యము ఉండేవాడు

సమన్వయము: అతనికి పుట్టుక లేదు, మృత్యువు లేదు. అవతార సమాప్తములో అతడు మానవ మాత్రుడిలా, లేదా ఒక జంతువులా మరణించేవాడు. కానీ నిజానికి అతనికి మృత్యువు లేదు. బ్రహ్మన్ కి పుట్టుక లేదు. అతడు నిత్యమూ ఉండేవాడు. అలాగే విష్ణువు కూడా

agrāhyaḥ śāśvataḥ kṛṣṇō lōhitākṣaḥ pratardanaḥ,

prabhūtastrikakubdhāma pavitraṁ maṁgalaṁ param. (7)

55. Agrāhyaḥ: One who cannot be grasped by the organs or knowledge or conceived by the mind.

55 ఓం అగ్రాహ్యః - అతడు ఊహకి, జ్ఞానానికి అందనివాడు

56. Śāśvataḥ: One who exists at all times.

56 ఓం శాశ్వతః - అతడు అన్ని కాలములయందు ఉండేవాడు

57. Kṛṣṇaḥ: The existence-Knowledge-Bliss.

57 ఓం కృష్ణః - అతడు సత్, జ్ఞానము, ఆహ్లాదము

58. Lohitākṣaḥ: One whose eyes are tinged red.

58 ఓం లోహితాక్షః - అతని కన్నులు ఎర్ర జీరలు గలవి

సమన్వయము: లోహిత + అక్ష ; లోహిత అంటే ఎర్రని; అక్ష అంటే కన్నులు

59. Pratardanaḥ: Destroyer of all at the time of cosmic dissolution.

59 ఓం ప్రతర్దనః - అతడు సృష్టి లయమందు సర్వులను సంహరించువాడు

సమన్వయము: సృష్టి అంతములో ప్రళయము సంభవించి నప్పుడు జీవులన్నీ అతనిని ఆశ్రయిస్తాయి. అవి సూక్ష్మ రూపం కలిగిన ఆత్మ స్వరూపాలు. మళ్ళీ సృష్టి ఆవిర్భవించినప్పుడు తమ కర్మాను సారం తిరిగి జన్మిస్తాయి. అంటే ఎంతటి జీవన్ముక్తుడికైనా పునర్జన్మ మరొక సృష్టిలో తప్పదు. బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి ఆవిర్భావమునకు ముందు పరమ శివుడు ఒక యజ్ఞం చేసి, అగ్ని కుండలంలో దేవతల్ని ప్రవేశించమంటాడు. వారు కొంత కాలం తరువాత లలితాదేవిచే పునర్జీవులవుతారు. అదే విధంగా మర్త్య భూమి లేదా దైవ లోకం మొదలైనవాటిలో శాశ్వతమైనదేమీ లేదు. ఒక్క విష్ణువే శాశ్వతమైన వాడు

60. Prabhūtaḥ: Great because of unique qualities like omnipotence, omniscience etc.

60 ఓం ప్రభూతః - అతడు సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు, మిక్కిలి ఉత్కృష్టుడు

61. Tri-kakub-dhāma: He who is the support (dharma) of the three regions above, below and in the middle.

61 ఓం త్రి కకుబ్ధామః - అతడు ముల్లోకాలలో ధర్మమునకు ఆధారము

62. Pavitraṁ: That which purifies everything.

62 ఓం పవిత్రం - అతడు సర్వమును పవిత్రము చేయగలవాడు

63. Maṅgalaṁ param: Supremely auspicious.

63 ఓం మంగళం పరమ్ - అతడు సర్వ మంగళుడు

naḥ prāṇadaḥ prāṇō jyeṣṭhaḥ śreṣṭhaḥ prajāpatiḥ,

hiraṇyagarbhō bhūgarbhō mādhavō madhusūdanaḥ. (8)

64. Īśānaḥ: He who controls and regulates everything.

64 ఓం ఈశానః - అతడు సర్వమును నియంత్రించువాడు

65. Prāṇadaḥ: One who bestows or activates the Prana, the vital energy.

65 ఓం ప్రాణదః - అతడు ప్రాణమును ప్రసాదించేవాడు

66. Prāṇaḥ: The Supreme Being.

66 ఓం ప్రాణః - అతడు ఉత్కృష్టమైనవాడు

67. Jyeṣṭhaḥ: The eldest of all; for there is nothing before Him.

67 ఓం జ్వేష్ఠః - అతడు అందరికన్నా పూర్వుడు

68. Śreṣṭhaḥ: One deserving the highest praise.

68 ఓం శ్రేష్ఠః - అతడు మిక్కిలి ప్రశంసకు తగినవాడు

69. Prajāpatiḥ: The master of all living beings, because He is Ishvara.

69 ఓం ప్రజాపతిః - అతడు అన్ని జీవులకు యజమాని

70. Hiraṇyagarbhaḥ: One who is Atman of even Brahma the creator.

70 ఓం హిరణ్యగర్భః - అతడు సృష్టి గావించిన బ్రహ్మ స్వరూపము

సమన్వయము: హిరణ్యము అంటే బంగారము; గర్భ అంటే కుక్షి. బ్రహ్మ బంగారు అండము నుండి పుట్టినవాడు

71. Bhūgarbhaḥ: One who has got the world within Himself.

71 ఓం భూగర్భః - అతడు సృష్టి కుక్షిలో ఉన్నవాడు

72. Mādhavaḥ: The Consort of Ma or Mahalakshmi or one who is fit to be known through Madhu-Vidya.

72 ఓం మాధవః - అతడు లక్షీ దేవిచే కూడి వుండి, మధు విద్య ద్వారా తెలియబడేవాడు

73. Madhusūdanaḥ: The destroyer of the demon Madhu.

73 ఓం మధుసూదనః - అతడు మధు అనే అసురుడుని సంహరించినవాడు

సమన్వయము: మధు కైటభులు అనబడే ఇద్దరు యోగనిద్రలో ఉన్న విష్ణువు చెవులనుండి ఆవిర్భవించేరు. వారు మహాదేవి గురించి తపస్సు చేసి, ఆమె నుండి తాము కోరుకున్నప్పుడే మరణం సంభవించాలనే వరము పొందేరు. వారు చెలరేగి బ్రహ్మ నుండి వేదాలను సంగ్రహించి పాతాళంలో దాక్కొన్నారు. బ్రహ్మ వేరే త్రావు లేక విష్ణువుని ప్రార్ధించెను. విష్ణువు మధుకైటభులతో యుద్ధం చేసెను. కానీ వారు పరాజితులు కాలేదు. అప్పుడు విష్ణువు మహాదేవి సలహాననుసరించి వారిని పొగిడెను. వారు ఉప్పొంగి విష్ణువుని ఏమైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు విష్ణువు వారు తనచే సంహరింపబడాలని కోరెను. చివరికి సుధర్శన చక్రంతో విష్ణువు వారిని సంహరించెను.

varō vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ,

anuttamō durādharṣaḥ kṛtajñaḥ kṛtirātmavān. (9)

74. Īśvaraḥ: The Omnipotent Being.

74 ఓం ఈశ్వరః - అతడు సర్వ శక్తిమంతుడు

75. Vikramī: The courageous One.

75 ఓం విక్రమీ - అతడు మిక్కిలి ధైర్య సాహసములు గలవాడు

76. Dhanvī: One armed with bow.

76 ఓం ధన్వీ - అతడు విల్లును ధరించినవాడు

77. Medhāvī: He who has great intelligence capable of grasping all texts.

77 ఓం మేధావీ - అతడు ఉత్కృష్టమైన మేధస్సు గలవాడు; సర్వజ్ఞుడు

78. Vikramaḥ: He who crosses (Karmana) i.e. transcends samsara. Or one who has Vih, bird i.e. Garuda as His mount.

78 ఓం విక్రమః - అతడు సంసారమునకు అతీతుడు; గరుడ వాహనము గలవాడు

79. Kramaḥ: Vishnu is called Kramah, because He is the cause of Kramana or crossing of the ocean of samsara by devotees, or because from Him all Krama or manifestation of the universe, has taken place.

79 ఓం క్రమః - అతడు జీవులను సంసార సాగరమును దాటించేవాడు; సృష్టింపబడిన వన్నిటికీ కారణము

80. Anuttamaḥ: He than whom there is none greater.

80 ఓం అనుత్తమః - అతనికన్నా ఉత్కృష్టమైనదేమీ లేనివాడు

81. Durādharṣaḥ: One whom none (Asuras) can overcome.

81 ఓం దురాదర్శః - అతనిని ఏ ఒక్క అసురుడూ మించలేడు

82. Kṛtajñaḥ: One who knows everything about what has been done (Kruta) by Jivas. Also one who is pleased even with those who offer such simple offerings as leaves, flowers, fruits and water.

82 ఓం కృతజ్ఞః - అతడు జీవుల కర్మలు ఎరిగిన వాడు; భక్తులిచ్చిన పుష్పం, ఫలం, తోయం తో సంతృప్తిపడేవాడు

83. Kṛtiḥ: The word means what is achieved through all human efforts or works.

83 ఓం కృతిః - అతడు మానవుల క్రియలతో సాధించేవాటికి కారకుడు

84. Ātmavān: One established in his own greatness i.e. requiring no other support than Himself.

84 ఓం ఆత్మవాన్ - అతడు స్వయం ప్రపత్తితో ఉత్కృష్టమైనవాడు

sureśaḥ śaraṇaṁ śarma viśvaretāḥ prajābhavaḥ,

ahaḥ saṁvatsarō vyālaḥ pratyayassarvadarśanaḥ. (10)

85. Sureśaḥ: The lord of the Suras or Devas. It can also mean the greatest of those who bestow good.

85 ఓం సురేశః - అతడు దేవతలచే పూజింపబడువాడు; శుభము చేకూర్చేవారిలో ప్రథముడు

86. Śaraṇaṁ: One who removes the sorrows of those in distress.

86 ఓం శరణం - అతడు దుఃఖములో ఉన్న భక్తులను రక్షించేవాడు

87. Śarma: One who is of the nature of supreme bliss.

87 ఓం శర్మ - అతడు సదా ఆనందముతో ఉండేవాడు

88. Viśvaretāḥ: The seed of the universe.

88 ఓం విశ్వరేతః - అతడు లోకాలకు బీజము వంటివాడు

89. Prajābhavaḥ: He from whom all beings have originated.

89 ఓం ప్రజాభవః - అతడు సర్వ జీవుల సృష్టికి కారణము

90. Ahaḥ: Luminous one.

90 ఓం అః - అతడు మిక్కిలి తేజోవంతుడు

91. Saṁvatsaraḥ: As Time is a from of Vishnu, He is called Samvasara or a year.

91 ఓం సంవత్సరః - అతడు కాల స్వరూపుడు

సమన్వయము: కాలము అతనిచే సృష్టింప బడినది. నేటి భౌతిక శాస్త్రజ్ఞులు కాలము యొక్క సాపేక్షితను ప్రతిపాదించారు. అంటే ఒకే గడియారంలో ఒక లోకంలో నిమిషము, మరొక లోకంలోని నిమిషము వేరువేరు. అలాగే ఇద్దరు కవలల్లో ఒకరు కాంతి వేగంతో ప్రయాణించి కొన్ని సంవత్సరముల తరువాత తిరిగివస్తే వాని రూపు రేఖలు మారవు. కాలము బిగ్ బ్యాంగ్ నుండి అనగా 1400 కోట్ల సంవత్సరాల క్రింద మొదలయిందని భౌతిక శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కానీ ఈ నామములు 5000 సంవత్సరాల క్రింద మహాభారత యుద్ధములో ప్రస్తావించబడినవి.

92. Vyālaḥ: Being ungraspable like a serpent, He is called Vyalah.

92 ఓం వ్యాలః - అతడు పాము వలె పట్టబడనివాడు

సమన్వయము: ఇక్కడ విష్ణువుని పాముతో పోల్చుట ఎందుకంటే అతని నుంచే అన్ని జీవులు ఆవిర్భవించేయి. కానీ అన్ని జీవులలో పాము విలక్షణమై విష్ణువు తల్పముగా ఉపయోగింపబడినది. కావున దాని విశేషము ఇచ్చట తెలుపబడుచున్నది.

93. Pratyayaḥ: One who is of the nature of Pratiti or Prajna (consciousness).

93 ఓం ప్రత్యయః - అతడు మిక్కిలి ప్రజ్ఞ గలవాడు

94. Sarva-darśanaḥ: One with eyes everywhere. As the Lord has assumed all forms, the eye-sight of all beings is His.

94 ఓం సర్వ దర్శనః - అతడు సర్వుల కనులలో యుండి సర్వము దర్శించువాడు

సమన్వయము: కేనోపనిషత్తులో చూసేది కన్నా, మరొకటా అనే ప్రశ్న ఎదురవుతుంది. కన్ను చూసేదైనా దానికి జ్ఞానము లేదు. ఇంద్రియ జ్ఞానము మనస్సు, బుద్ధి మొదలగువాటిచే కలిగేది. ఈ విధముగా కన్నుకు కన్నయిన ఆ విష్ణువు సర్వాన్ని దర్శించగలడు. మరి ఎక్కడో నిర్జనమైన అడవిలో చెట్టు పడిపోతే దాన్ని చూసినవారెవరని అనుమానము రావచ్చు. అడవి అంటే ఏన్నొ జీవరాశులు ఉంటాయి. వాటి కన్నులతో చూసేదీ ఆ పరమాత్మే.

ajaḥ sarveśvaraḥ siddhaḥ siddhiḥ sarvādiracyutaḥ,

vṛṣākapirameyātmā sarvayōgaviniḥsṛtaḥ. (11)

95. Ajah: One who has no birth.

95 ఓం అజః - అతడు పుట్టుక లేనివాడు

96. Sarveśvaraḥ: The Lord of all Lords or the supreme Lord.

96 ఓం సర్వేశ్వరః - అతడు రాజాధి రాజు; సర్వులకు అతీతుడు

97. Siddhaḥ: One ever established in one's own nature.

97 ఓం సిద్దః - అతడు తనయందు తాను ఉండేవాడు

సమన్వయము: అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇషిత, వశిష్ట సిద్ధులను అష్ట సిద్ధులంటారు. ఇవి యోగాభ్యాసము వలన సంక్రమించేవి. విష్ణువు వాటిని అధిగమించినవాడు. ఎలాగైతే ఒక యోగి సమాధిలో తనంతట తాను ఉండి రమిస్తూ ఉంటాడో అలాగ విష్ణువు స్వస్వరూపంలో ఆనందాన్ని అనుభవిస్తాడు.

98. Siddhiḥ: One who is of the nature of Consciousness in all.

98 ఓం సిద్ధిః - అతడు అందరి చేతనమునకు కారణము

99. Sarvādiḥ: One who is the first cause of all elements.

99 ఓం సర్వాదిః - అన్ని ఆత్మ, అనాత్మలకు మొదటి కారణము

సమన్వయము: ప్రపంచములో ఎన్నో వస్తువులు ఉన్నా, వాటిని ఆత్మ లేదా అనాత్మ అని విభజించవచ్చును. జీవించే వన్నీ ఆత్మ గలవి. తక్కినవి అనాత్మ క్రింద వస్తాయి. వీటన్నిటి ఉనికికి పరమాత్మే కారణము. ఉదాహరణకి బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు కాంతి, శబ్దం మొదట పుట్టేయని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆ కాంతినే వేదాలు చైతన్యమంటాయి; ఆ శబ్దమే ఓంకారము. ఈ విధంగా పరమాత్మ సృష్టి లోకి ప్రవేశించి అన్నిటికీ ప్రప్రధమ కారణమై ఉన్నాడు.

100. Achyutaḥ: One who never lost and will never lose his inherent nature and powers.

100 ఓం అచ్యుతః - అతని శక్తులు, మనస్తత్వం సదా ఉండేది

101. Vṛṣākapiḥ: One who showers all objects of desire.

101 ఓం వృషాకపిః - అతడు భక్తుల కోర్కెలు తీర్చువాడు

సమన్వయము: వేంకటేశ్వరుడు కలియుగంలో భక్తులపాలి కల్ప తరువు అంటారు. అతడు విష్ణువు అవతారమంటారు. భృగు మహర్షి విష్ణువును వక్ష స్థలముపై కాలితో తన్నేడని, లక్ష్మీ దేవి వైకుంఠం నుంచి నిష్క్రమించెను. అప్పుడు విష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకం వచ్చి, కాల క్రమేన, వేంకటేశ్వరునిగా వెలిసేడని చెప్తారు. ఈ విధంగా లక్ష్మీ నాథుడైన విష్ణువుకి ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు.

102. Ameyātmā: One whose form or nature cannot be measured and determined.

102 ఓం అమేయాత్మా - అతడు ఊహకు అందనివాడు; పరిమితి లేని వాడు

103. Sarvayoga-viniḥsṛutaḥ: One who stands aside completely from all bondage.

103ఓం సర్వ యోగ వినిః సృతః - అతడు బంధములకు అతీతుడు

సమన్వయము: బంధములు లేనివాడు లక్ష్మీ నాథుడైనాడు. పాల సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి దేవతలందరినీ పరికించి చూసి, వాళ్ళను కాదని, విష్ణువుని ఆశ్రయించెను. అంటే ఆమెకి విష్ణువుతో బంధముండచ్చు కాక, కానీ విష్ణువుకి ఎటువంటి బంధాలు లేవు. గజేంద్ర మోక్షంలో విష్ణువుని ఇలా పోతనామాత్యుడు వర్ణించేడు:

 సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

ఇందిలో ముఖ్యాంశము విష్ణువు తన భక్తులను రక్షించుటకు అన్ని బంధాలను విడిచి వస్తాడు.

vasurvasumanāḥ satyaḥ samātmā sammitaḥ samaḥ,

amōghaḥ puṇḍarīkākṣō vṛṣakarmā vṛṣākṛtiḥ. (12)

104. Vasuḥ: One in whom all beings dwell and one who dwells in all beings.

104 ఓం వసుః - అతనిలో అన్నీ ఉండును; అతడు అన్నిటిలోనూ ఉండును

సమన్వయము: ఒకే సూర్యుడు అనేక అద్దాలలో ప్రతిబింబిస్తాడు అనేది మనకు తెలిసిన సామాన్య విషయం. అదే విధంగా ఆ పరమాత్మ ఒక్కడే మనలో -- దహరాకాశమనే హృదయ స్థానంలో -- ప్రకాశిస్తాడు. సూర్యుడు గ్రహాలను ఎలా తన గురుత్వాకర్షణతో నియంత్రిస్తాడో, అలాగే పరమాత్మ విశ్వాన్ని నడుపుతాడు.

105. Vasumanāḥ: The term Vasu means wealth or riches. Here it indicates greatness. So it means one possessed of a great mind i.e. a mind free from attachments, anger and other evil qualities.

105 ఓం వసుమనః - అతడు బంధములు, క్రోధము, చెడు తలంపులు లేని గొప్ప మనస్సు గలవాడు

106. Satyaḥ: One whose nature is Truth.

106 ఓం సత్యః - అతడు సత్యవంతుడు

107. Samātmā: One whose mind is Sama, without partiality or anger and thus the same towards all beings.

107 ఓం సమాత్మా - అతడు పక్షపాతము, క్రోధము లేనివాడు

108. Sammitaḥ: This name and the previous (samatma) occurring together, can be split in two ways – as samātmā + sammitaḥ and as samātmā + asammitaḥ.

108 ఓం సమ్మితః - అతనికి ప్రియము, అప్రియములు లేవు

సమన్వయము: కృష్ణావతారంలో విష్ణువు పాండవ పక్షపాతి అనబడ్డాడు. కానీ అది అతిశయోక్తి. అతడు ధర్మానికి కట్టుబడినవాడు. ధర్మం ఎటు వైపు ఉంటే, దాని పక్షాన అతనూ ఉంటాడు. గీతలో అర్జునుని పాండవులందరికన్నా ప్రియమైన వాడని అంటాడు. ఎందుకంటే అర్జునుడు వీరుడు, కృష్ణుడంటే ప్రేమ, గౌరవము గలవాడు.

109. Samaḥ: One unpertubed at all times.

109 ఓం సమః - అతడు సదా అలజడి చెందడు

110. Amoghaḥ: One whose worship will never go in vain, but will bear ample fruits.

110 ఓం అమోఘః - అతని అర్చన వ్యర్థము కాక ఫలములను ప్రసాదించునది

సమన్వయము: విష్ణువుని ప్రసన్నము చేసుకొనుట మిక్కిలి కష్టమంటారు. అయినప్పటికీ అతని అవతారాలను పూజించి ఫలములు పొందుతాము. ఈ విధంగా విష్ణువు మనకు సులభముగా పొందబడేవాడని అనవచ్చు.

111. Puṇḍarīkākṣaḥ: One who has pervaded, i.e. is realized in, the lotus of the heart. Or One whose eyes resemble the petals of a lotus.

111 ఓం పుండరీకాక్షః - అతడు హృదయములోని కమలము; అతని కన్నులు పద్మముల వలె ఉండేవి

112. Vṛṣakarmā: One whose actions are according to Vrushas i.e. Dharma.

112 ఓం వృషకర్మః - అతని కర్మలు ధర్మానికి కట్టుబడి యుండేవి

113. Vṛṣāakṛtiḥ: One who takes form for the sake of Vrushas or Dharma.

113 ఓం వృషాకృతిః - అతడు ధర్మమును పరిరక్షించుటకై అవతారములు దాల్చేవాడు

rudrō bahuśirā babhrurviśvayōniḥ śuciśravāḥ,

amṛtaḥ śāśvataḥ sthāṇurvarārōhō mahātapāḥ. (13)

114. Rudraḥ: One who makes all beings cry at the time of cosmic dissolution.

114 ఓం రుద్రః - అతడు సృష్టి లయములో జీవులను బాధించెడివాడు

సమన్వయము: రుద్రుడు అంటే ఇక్కడ శివుడు కాడు. ఎవరైతే దుఃఖాన్ని సమూలంగా నాశనం చేస్తాడో అతనే రుద్రుడు. జీవుల సంస్కారము వలన అనేక బంధాలతో ఉంటాయి. వాటన్నిటినీ కూకటి వేళ్ళతో తీసివేసేవాడు అతడు. అంటే వైరాగ్యము లేనివారికి బాధ కలిగిస్తాడు. అదే ఆత్మ జ్ఞానులకు బాధ అనిపించదు.

115. Bahuśirāḥ: One with innumerable heads.

115 ఓం బహుశిరాః - అతడు అసంఖ్యాకమైన శిరస్సులు గలవాడు

సమన్వయము: గీతాచార్యుని విశ్వరూప సందర్శనములో -- 11 వ అధ్యాయము--అర్జునుడు ఇలా వివరిస్తాడు: "కృష్ణా! అనేక ముఖములు, నేత్రములు గలిగినట్టియు, అనేకములగు బాహువులు, ఊరువులు, పాదములు గలిగినట్టియు, అనేక ఉదరములు గలిగినట్టియు, అనేక కోఱలచే భయంకరమైనట్టియు నగు నీ అద్భుత రూపమును జూచి జనులందరును భయపడుచున్నారు. నేనును అలాగే భయపడుచున్నాను"

116. Babhruḥ: One who governs the world.

116 ఓం బభృః - అతడు సృష్టిని పరిపాలించేవాడు

117. Viśvayoniḥ: One who is the cause of the world.

117 ఓం విశ్వయోనిః - అతడు సృష్టికి కారకుడు

సమన్వయము: భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలో ఈ విధంగా పోతనామాత్యుడు వర్ణించెను:

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

గజేంద్రుడు ఏ దేవతనీ రక్షింపమని కోరలేదు. అతడు కోరినదల్లా సృష్టికర్తను. సృష్టికర్త కేవలము సాక్షి మాత్రమే. అది విష్ణువుని పురమాయించదు.

118. Śuciśravāḥ: One whose names and glories are very holy and purifying to be heart

118 ఓం శుచిశ్రవాః - అతని నామములు, లీలలు పవిత్రమైనవి, ప్రక్షాళనము చేయునవి

119. Amṛtaḥ: One who is deathless.

119 ఓం అమృతః - అతడు నాశము లేనివాడు

120. Śāśvata-sthāṇuḥ: One who is both eternal and firmly established, unchanging.

120 ఓం శాశ్వత స్థాణుః - అతడు శాశ్వతుడు, స్థిరమైనవాడు, నిర్వికారుడు

121. Varārohaḥ: He whose lap gives the highest blessings.

121 ఓం వరారోహః - అతని ఒడి అనేక అనేక మంగళములు చేకూర్చునది

సమన్వయము: దేవుని ఒడిలో కూర్చునే వారు ప్రియమైనవారు. శివుని ఒడిలో పార్వతి మాత్రమే కూర్చునేది. విష్ణువు ఒడిలో కూర్చోడమంటే అతని పాదాల చెంత నుండడం. అదే లక్ష్మి దేవి చేసేది. కానీ విష్ణువు తన కుక్షిలో సమస్త విశ్వాన్నీ ధరించినవాడు. కాబట్టి మనమంతా అతని ఒడిలో ఉన్నవారలమే.

122. Mahātapāḥ: The austerity connected with creation, which is of the nature of knowledge is of great potency.

122 ఓం మహాతపః - అతడు చేసిన సృష్టి జ్ఞాన పూరితమైన మిక్కిలి సారవంతమైనది

సమన్వయము: సృష్టి అంటే జడము లేక చైతన్యముతో ఉండేదనేది సామాన్య అర్థం. నిజానికి సృష్టి జ్ఞానవంతం. భౌతిక శాస్త్రజ్ఞులు చెప్పే క్వాంటమ్ (quantum mechanics) మెకానిక్స్ దీనితో అంగీకరిస్తుంది. అలాగే సృష్టి ఇంకా వ్యాపిస్తున్నదని ప్రతిపాదించే శాస్త్రజ్ఞులు ఉన్నారు. వారు నక్షత్ర కాంతిని విశ్లేషణము చేసి ఈ విషయం కనుగొన్నారు. అంటే నక్షత్ర కాంతితో (doppler effect) ఎన్నో విషయాలు తెలిసికోవచ్చు. ఉదాహరణకి నక్షత్రం ఎంత దూరంలో ఉన్నది; దానిలో ఏ లోహాలు ఉన్నాయి; అది ఎంత వేగంతో ప్రయాణిస్తోంది; దానికి గ్రహాలూ, ఉపగ్రహాలూ ఉన్నాయా, మొదలైనవి.

sarvagaḥ sarvavidbhānurviṣvaksenō janārdanaḥ,

vedō vedavidavyaṅgō vedāṅgō vedavit kaviḥ. (14)

123. Sarvagaḥ: One who pervades everything, being of the nature of their material cause.

123 ఓం సర్వగః - అతడు సర్వాంతర్యామి

124. Sarvavid-bhānuḥ: One who is omniscient and illumines everything.

124 ఓం సర్వవిద్ భానుః - అతడు సర్వజ్ఞుడు, సర్వమును ప్రకాశింప జేయువాడు

125. Viṣvakśenaḥ: He before whom all Asura armies get scattered.

125 ఓం విశ్వక్సేనః - అతని ముందు అసురులు పరాజితులై పారిపోయెడి వారు

126. Janārdanaḥ: One who inflicts suffering on evil men.

126 ఓం జనార్దనః - అతడు పాపులను శిక్షించువాడు

127. Vedaḥ: He who is of the form of the Veda.

127 ఓం వేదః - అతడు వేద స్వరూపుడు

128. Vedavid: One who knows the Veda and its meaning.

128 ఓం వేదవిద్ - అతడు వేదము యొక్క సారము తెలిసినవాడు

129. Avyaṅgaḥ: One who is self-fulfilled by knowledge and other great attributes and is free from every defect.

129 ఓం అవ్యంగః - అతడు జ్ఞానము, సుగుణములతో గూడి ఎటువంటి వెలితి లేనివాడు

130. Vedāṅgaḥ: He to whom the Vedas stand as organs.

130 ఓం వేదాంగః - వేదములు అతని శరీరావయములై యున్నవి

131. Vedavit: One who knows all the Vedas.

131 ఓం వేదవిత్ - అతడు అన్ని వేదములను తెలిసినవాడు

132. Kaviḥ: One who sees everything.

132 ఓం కవిః - అతడు సర్వము దర్శించేవాడు

lōkādhyakṣaḥ surādhyakṣō dharmādhyakṣaḥ kṛtākṛta:

caturātmā caturvyūhaścaturdaṁṣṭraścaturbhujaḥ. (15)

133. Lokādhyakṣaḥ: He who witnesses the whole universe.

133 ఓం లోకాధ్యక్షః - అతడు సర్వ జగత్తుకు సాక్షి స్వరూపము

134. Surādhyakṣaḥ: One who is the overlord of the protecting Divinities of all regions.

134 ఓం సురాధ్యక్షః - అతడు దేవతలను పర్యవేక్షించి వారిని ఆపదల నుండి కాపాడేవాడు

135. Dharmādhyakṣaḥ: One who directly sees the merits (Dharma) and demerits (Adharma) of beings by bestwing their due rewards on all beings.

135 ఓం ధర్మాధ్యక్షః - అతడు అందరి ధర్మాధర్మములు తెలిసికొని తగిన ఫలము నిచ్చేవాడు

136. Kṛtākṛtaḥ: One who is an effect in the form of the worlds and also a non-effect as their cause.

136 ఓం కృతాకృతః - అతడు సర్వ సృష్టి కారణమై, వాటికి కార్యమై యున్నాడు (ఉపాదాన, నిమిత్త కారకుడు)

137. Caturātmā: One who for the sake of creation, sustentation and dissolution assumes forms.

137 ఓం చతురాత్మా - అతడు సృష్టి ఆవిర్భావమునకు, స్థితికి, లయమునకు అనేక ఆకృతులు ధరించేవాడు

138. Chaturvyūhaḥ: One who adopts a fourfold manifestation.

138 ఓం చతుర్ వ్యూహః - అతడు నాలుగు విధములుగా వ్యక్తమయ్యేవాడు

139. Chatur-daṁṣṭraḥ: One with four fangs in His Incarnation as Narasimha.

139 ఓం చతుర్ దంష్ట్రః - అతడు నరసింహ అవతారంలో నాలుగు కోరలు గలిగినవాడు

140. Chatur-bhujaḥ: One with four arms.

140 ఓం చతుర్ భుజః - అతడు నాలుగు కరములు గలవాడు

bhrājiṣṇurbhōjanaṁ bhōktā sahiṣṇurjagadādijaḥ,

anaghō vijayō jetā viśvayōniḥ punarvasuḥ. (16)

141. Bhrājiṣṇuḥ: One who is pure luminosity.

141 ఓం భ్రాజిష్ణుః - అతడు శుద్ధమైన ప్రకాశము

142. Bhojanam: Prakruti or Maya is called Bhojanam or what is enjoyed by the Lord.

142 ఓం భోజనం - అతడు ప్రకృతి మాయను ఆస్వాదించేవాడు

143. Bhoktā: As he, purusha, enjoys the prakruti, He is called the enjoyer or Bhokta.

143 ఓం భోక్తః - అతడు ప్రకృతిచే ఆనందింపబడేవాడు

144. Sahiṣṇuḥ: As He suppresses Asuras like Kiranyaksha, He is Sahishnu.

144 ఓం సహిష్ణుః - అతడు అసురులను నియంత్రించేవాడు

145. Jagadādhijaḥ: One who manifested as Hiranyagarbha by Himself at the beginning of creation.

145 ఓం జగదాదిజః - సృష్టి ఆదియందు అతడు స్వయముగా హిరణ్యగర్భునిగా అవతరించెను

146. Anaghaḥ: The sinless one.

146 ఓం అనఘః - అతడు పాప కర్మలు చేయనివాడు

147. Vijayaḥ: One who has mastery over the whole universe by virtue of his six special excellences like omnipotence, omniscience etc. known as Bhagas.

147 ఓం విజయః - అతడు శక్తి, సర్వజ్ఞత మొదలైన లక్షణాల వలన సృష్టినంతా పాలించేవాడు

148. Jetā: One who is naturally victorious over beings, i.e. superior to all beings.

148 ఓం జేతా - అతడు శర్వులకన్న ఉన్నతమైనవాడు; సర్వులను జయింపగలవాడు

149. Viśvayoniḥ: The source of the universe.

149 ఓం విశ్వయోనిః - అతడు సృష్టికి యోని

150. Punarvasuḥ: One who dwells again and again in the bodies as the Jivas.

150 ఓం పునర్వసుః - అతడు మరల మరల జీవుల శరీరాల్లో నివసించేవాడు

upendrō vāmanaḥ prāṁśuramōghaḥ śucirūrjitaḥ.

atīndraḥ saṅgrahaḥ sargō dhṛtātmā niyamō yama. (17)

151. Upendraḥ: One born as the younger brother of Indra.

151 ఓం ఉపేంద్రః - అతడు ఇంద్రుని తమ్ముడుగా జన్మించినవాడు

సమన్వయము: వామనావతారంలో విష్ణువు కశ్యపుడు, అదితికి వామనుడిగా జన్మించెను; అంతకు పూర్వము అదితి తపస్సు చేసి ఇంద్రుని కన్నది; ఈ విధంగా విష్ణువు ఇంద్రుని సహోదరుడయ్యెను.

152. Vāmanaḥ: One who, in the form of Vamana (dwarf), went begging to Bali.

152 ఓం వామనః - అతడు వామన అవతారమును దాల్చినవాడు

సమన్వయము: బలి చక్రవర్తిని అసురుల గురువు శుక్రాచార్యుడు వామనుడు విష్ణువని హెచ్చరించెను. కానీ బలి మిక్కిలి దాన శీలుడు. పోతానామాత్యుడు ఇలా వర్ణించెను "

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

అంటే లక్ష్మీ దేవిని అనేక విధములుగా స్పృశించిన విష్ణువు యొక్క చెయ్యి క్రిందన, తన చెయ్యి మీదన ఉండడం కన్నా మిన్న ఏది అని బలి తలచెను. అందుకే విష్ణువు బలిని సంహరింపక రసాతలానికి పంపేడు.

153. Prāṁśuḥ: One of great height.

153 ఓం ప్రాంశుః - అతడు మిక్కిలి పొడగరి

సమన్వయము: మనిషి ఎత్తు సాధారణంగా ఆరు అడుగులు ఉండవచ్చు. కానీ విష్ణువు వామనుడుగా మరిగుజ్జు వేషం వేసినా, అతను నిజానికి అంతకన్నా పొడుగైనవాడని చెప్పుకోవాలి. ఇదే పోతనామాత్యుడు భాగవతంలో వామనుడి చరిత్రలో ఇలా వర్ణించెను:

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

ఇక్కడ సమన్వయము చేసికోవలసినది విష్ణువు తన ఆకారమును ఇష్టానుసారము మార్చుకోగలడు.

154. Amoghaḥ: One whose acts do not go in vain.

154 ఓం ఆమోఘః - అతని కర్మలు ఎన్నటికీ వ్యర్థము కావు

155. Śuchiḥ: One who purifies those who adore and praise Him.

155 ఓం శుచిః - అతడు తనను ప్రేమించి, కీర్తించిన వారలను శుద్ధము జేసెడి వాడు

156. Ūrjitaḥ: One of infinite strength.

156 ఓం ఊర్జితః - అతడు అపరితమైన శక్తి గలవాడు

157. Atīndraḥ: One who is superior to Indra by His inherent attributes like omnipotence, omniscience etc.

157 ఓం అతీంద్రః - అతడు ఇంద్రుని కన్న గొప్ప జ్ఞాని, శక్తిమంతుడు

158. Saṅgrahaḥ: One who is of the subtle form of the universe to be created.

158 ఓం సంగ్రహః - అతడు జరగబోవు సృష్టికి సూక్ష్మ రూపము ధరించినవాడు

159. Sargaḥ: The creator of Himself

159 ఓం సర్గః - అతడు తనను తానే సృష్టించుకొన్నవాడు

సమన్వయము: సృష్టి ఆదిలో బ్రహ్మన్ ఒక్కటే యున్నది. అది సృష్టిని చేయదలచెను. తన మాయాశక్తి నుపయోగించి, ఎలాగైతే ఒక సాలె పురుగు తననుండే గూడు నిర్మించుకొంటుందో, సృష్టి కార్యము గావించెను. దానికి సృష్టి ఒక క్రీడ, నాటకము. అన్నమాచార్య కీర్తన "నానాటికీ బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము" బ్రహ్మన్ క్రీడలో మనమందరమూ నటుల మనే సత్యాన్ని వివరిస్తుంది.

160. Dhṛtātmā: One who is ever in His inherent form or nature, without the transformation involved in birth and death.

160 ఓం ధృతాత్మా - అతడు జనన మరణములు లేక తన స్వస్వరూపములో నుండెడివాడు

161. Niyamaḥ: One who appoints His creatures in particular stations.

161 ఓం నియమః - అతడు నియమిత స్థానములలో జీవులను, దేవతలను ఉంచెడివాడు

సమన్వయము: దేవతల వ్యవస్థ నేటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వముతో పోల్చవచ్చు. ఉదాహరణకి విష్ణువు వర్షాలు కురిపించే విభాగాన్ని దేవతయైన వరుణుడికి ఇచ్చేడు. అది మన ప్రభుత్వాలలో ముఖ్య మంత్రి లేదా ప్రధాన మంత్రి ఒకనికి పాడిపంటల విభాగాన్ని ఇచ్చినట్లే. కాబట్టి విష్ణువు అటు దేవతలను, ఇటు మానవులను తగిన స్థానాల్లో ఉంచి సృష్టిని పాలిస్తాడు.

162. Yamaḥ: One who regulates all, remaining within them.

162 ఓం యమః - అతడు జీవుల, దేవతల లోన ఉండి వారిని నియంత్రించువాడు

vedyō vaidyaḥ sadāyōgī vīrahā mādhavō madhuḥ,

atīndriyō mahāmāyō mahōtsāhō mahābalaḥ. (18)

163. Vedyaḥ: One who has to be known by those who aspire for Mokshas.

163 ఓం వేద్యః - మోక్షమునందు ఆసక్తి గలవారిచే అతడు తెలిసికోదగువాడు

164. Vaidhyaḥ: One who knows all Vidyas or branches of knowledge.

164 ఓం వైద్యః - అతడు సర్వ విద్యా పారంగతుడు

సమన్వయము: ఇక్కడ విష్ణువు ఒక గొప్ప కంప్యూటరు ఇంజనీర్ అని చెప్పలేము. కాని దానికి కావలసిన అన్ని అర్హతలూ అతనికి ఉన్నాయి. ఈ కాలంలో ఒక ఆరేళ్ళ వయస్సు వాడు కూడా కంప్యూటర్ ని ఎలా వాడాలో నేర్చుకోవచ్చు. మరి సృష్టిని ఆవిర్భవింపజేసి, దానిని నడిపేవాడు ఒక కంప్యూటరు ద్వారా మన నందరినీ నియంత్రించలేడా! అందుకే కొందరు భౌతిక శాస్త్రజ్ఞులు సృష్టి ఒక అనుకరణ (simulation) అని నమ్ముతారు. అంటే సృష్టికర్త అనుకరుణ గావించేవాడు, మనమందరమూ దానిలో వివిధ పాత్రలను ధరించేవారలము.

165. Sadāyogī: One who is ever experienceble, being ever existent.

165 ఓం సదాయోగిః - అతడు సర్వ కాలములయుందుండి తెలిసికొనదగినవాడు

166. Vīrahā: One who destroys heroic Asuras for the protection of Dharma.

166 ఓం వీరః - అతడు అసురులను సంహరించి ధర్మమును కాపాడేవాడు

167. Mādhavaḥ: One who is the Lord or Master of Ma or knowledge.

167 ఓం మాధవః - అతడు జ్ఞానమునకు అధిపతి

168. Madhuḥ: Honey, because the Lord gives joy, just like honey.

168 ఓం మధుః - అతడు మకరందము వలె ఆహ్లాదాన్ని కలిగించేవాడు

సమన్వయము: విష్ణువుని మనము రుచి చూడాలంటే, మకరందాన్ని సేవించవచ్చు లేదా ఆయనను కీర్తించే పద్యాలను చదవవచ్చు. ఎందుకంటే మకరందము, పద్యము అతనివలననే ఉనికి కలిగినవి. కానీ వాటిని సేవించడం వలన మనకు కలిగే అనుభవము ఆహ్లాదము. ఎలాగైతే "ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్" (a thing of beauty is joy for ever) అని కీట్స్ చెప్పేడో అదే నిజం.

169. Atīndriyaḥ: One who is not knowable by the senses.

169 ఓం అతీంద్రియః - అతడు ఇంద్రియములచే తెలిసికొనబడనివాడు. అంటే ఇంద్రియాతీతుడు.

170. Mahāmāyaḥ: One who can cause illusion even over other great illusionists.

170 ఓం మహామాయః - అతడు మాయావులను అధిగమించే మాయావి

171. Mahotsāhaḥ: One who is ever busy in the work of creation, sustentation and dissolution.

171 ఓం మహోత్సాహః - అతడు సృష్టి కార్యము, స్థితిలయముల కొరకై సదా ఉండేవాడు

172. Mahābalaḥ: The strongest among all who have strength.

172 ఓం మహాబలః - అతడు మిక్కిలి శక్తి వంతులకన్నా ఎక్కువ శక్తిగలవాడు

సమన్వయము: ఇలా చెప్పడంలో ఉద్దేశ్యం: తాము అందరికన్నా శక్తివంతులమనుకునే వారి గర్వమణచుటకు. ఒకప్పుడు చక్రవర్తులు తామే మిక్కిలి శక్తివంతులమని తలచేవారు. మహాభారత యుద్ధానికి ముందు దుర్యోధనుడు అటువంటి భావనలు కలిగినవాడే. దేవుడైన కృష్ణుని తూల నాడి, చివరకు అధోగతి పాలైనాడు.

mahābuddhirmahāvīryō mahāśaktirmahādyutiḥ,

anirdeśyavapuḥ śrīmānameyātmā mahādridhṛk. (19)

173. Mahābuddiḥ: The wisest among the wise.

173 ఓం మహాబుద్ధిః - అతడు మేధావులకు మేధావి

సమన్వయము: ఇక్కడ తామే గొప్ప మేధావులనుకునే వారిని ఉద్దేశించి చెప్పబడినది. మేధస్సు, తెలివి తేటలు జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మానవుల సమిష్టి మేధస్సు భూగోళాన్ని అనేక పర్యాయములు అణు అస్త్రాలతో నాశనము చెయ్యగల క్షిపణుల తయారీకై లేక పర్యావరణాన్ని కాలుష్యంతో నింపడానికి ఉపయోగింపబడింది. ఒక్క ఐన్ స్టీన్ తన మేధస్సుతో అణు అస్త్రాలకి కారకుడైనాడు. అలాగే నేటి ఇంజనీర్ లు తమ కార్యకలాపాలతో ప్రకృతిని ప్లాస్టిక్ (plastic) వంటి కల్మషాలతో నింపుతున్నారు. వ్యష్టిగా మానవుడు దేవుని ప్రార్ధించినా లాభం లేదనే స్థితికి దిగజారుతున్నాడు. కాబట్టి ఆ పరమాత్ముడిని ప్రార్ధిస్తే మనకు ఉత్తమమైన మేధస్సు కలిగే యోగ్యత లభిస్తుంది.

174. Mahāvīryaḥ: The most powerful one, because Ignorance which is the cause of Samsara is His great power.

174 ఓం మహావీర్యః - అతడు మిక్కిలి శక్తిమంతుడు

175. Mahāśaktiḥ: One with great resources of strength and skill.

175 ఓం మహాశక్తిః - అతడు మిక్కిలి బలము, కౌశల్యము గలవాడు

176. Mahādyutiḥ: One who is intensely brilliant both within and without.

176 ఓం మహాద్యుతిః - అతడు బాహ్యాంతరాలలో దివ్య తేజస్సు గలవాడు

సమన్వయము: గీతలో (11 వ అధ్యాయంలో) అర్జునుడు "కృష్ణా! నీవు గగనము నంటియున్నావు. ప్రకాశించు అనేక వర్ణములు గలవాడవు... ప్రజ్వలించెడి విశాలమైన నేత్రములు గలవాడవు.. నీ యొక్క ప్రచండమైన కాంతులు సమస్తమైన జగత్తును కాంతులచే నింపి తపింపజేయుచున్నవి " అని ప్రస్తుతించెను. అర్జునునికి దివ్య చక్షువులు ఉండడంవలన అతని తేజస్సును దర్శించుటకు వీలైనది.

177. Anirdeśya-vapuḥ: One who cannot be indicated to another as: He is this', because He cannot be objectively known.

177 ఓం అనిర్దేశ్య వపుః - అతడు అభివ్యక్తము చేయబడలేనివాడు

సమన్వయము: విద్యుత్తు దీపాల్లోనూ, పంకాల్లోనూ, కార్ల లోనూ, అనేక పరికారాల్లో ప్రసరించి వాటిని నడిపిస్తుంది. కానీ మనకు విద్యుత్తు యొక్క రూపం తెలియదు. మనకు తెలిసినదల్లా తీగలో ప్రయాణించే ఎలెక్ట్రాన్ ల సమూహం. నిజానికి అవి కూడా పూర్తిగా చలించటం లేదు. విద్యుచ్ఛక్తి లేనిదే నాగరికత లేదనేవారు అనేకులు. మరి అలాంటిది విష్ణువుని ఎలా వర్ణించగలము! అతడు లోకాన్ని నడిపే ఉత్కృష్టమైన శక్తి.

178. Śrīmān: One endowed with greatness of every kind.

178 ఓం శ్రీమాన్ - అతడు ప్రతి రంగములో గొప్ప వాడు

179. Ameyātmā: The Spirit with intelligence that cannot be measured by any one.

179 ఓం అమేయాత్మా - అతని మేధస్సు పరిమితి లేనిది

180. Mahādridhṛk: One who held up the great mountain 'Mandara' at the time of the churning of the Milk Ocean and also Govardhana in his Krishna incarnation.

180 ఓం మహాద్రిధృత్ - అతడు పాల సముద్ర మధించునపుడు మందరమనే కొండను కూర్మ (తాబేలు) అవతారం దాల్చి మోసినవాడు; అలాగే కృష్ణావతారములో గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నవాడు

maheṣvāsō mahībhartā śrīnivāsaḥ satāṁ gatiḥ,

aniruddhaḥ surānandō gōvindō gōvidāṁ patiḥ. (20)

181. Maheṣvāsaḥ: One equipped with the great bow.

181 ఓం మహేష్వాసః - అతడు గొప్పదైన విల్లును ధరించేవాడు

సమన్వయము: ఇక్కడ విల్లు అంటే ఒక బాణాన్ని ఎక్కుబెట్టి లక్ష్యం వైపు పంపగల సాధనము. బాణం ఒక మిసైల్ (missile) అనుకొంటే విల్లు అనేది మిసైల్ లాంచర్ (missile launcher). అది సాధ్యమా అని అడగవచ్చు. అనేక చరిత్రకారులు మహాభారత యుద్ధంలో అణు శక్తిని వాడేరని చెప్తారు. అదే నిజమైతే దానిని గుప్తంగా ఉంచడానికి అనేక కారణములు గలవు. అలాగే పాశుపతాశ్త్రము, బ్రహ్మాశ్త్రము మొదలైనవి వివిధ రకములైన మిసైల్ పేర్లు.

182. Mahībhartā: One who held up the earth submerged in Pralaya waters.

182 ఓం మహీభర్తా - అతడు ప్రళయ కాలములో భూమిని జలముల నుండి కాపాడేవాడు

సమన్వయము: నేటి గ్రీన్ హౌస్ (green house) వాయువుల వలన పర్యావరణము వేడెక్కి కొండలపై, ధృవాలపై పేరుకొన్న మంచు నెమ్మదిగా కరుగుతోందని చాలా మంది శాస్త్రజ్ఞులు నమ్ముతారు. అదే నిజమైతే భవిష్యత్ లో భూమి అంతా జలమయమయ్యే పరిస్థితి రావచ్చు. అదే ప్రళయమంటే. విష్ణు భక్తులు అటువంటి ప్రళయంలో చిక్కుకొంటే, వారిని కాపాడేది ఆ దేవదేవుడే.

183. Śrīnivāsaḥ: One on whose chest the Goddess Shri, eternal in nature, dwells.

183 ఓం శ్రీనివాసః - అతని వక్షస్థలములో లక్ష్మీ దేవి యుండేది

184. Satāṁgatiḥ: One who bestows the highest destiny attainable, to all holy men.

184 ఓం సతాంగతిః - అతడు భక్తులకు ఉత్కృష్టమైన ఫలముల నిచ్చెడివాడు

185. Aniruddhaḥ: One who has never been obstructed by any one or anything from manifesting in various forms.

185 ఓం అనిరుద్దః - అతడు నిరాటంకముగా అవతారములు ఎత్తేవాడు

186. Surānandaḥ: One who bestows joy on all divinities.

186 ఓం సురానందః - అతడు దేవతలకు ఆహ్లాదాన్ని కలిగించేవాడు

187. Govindaḥ: Gau means words. Thou pervadest all words, giving them power. Therefore sages call the Govinda.

187 ఓం గోవిందః - అతడు ఋషులచే గోవిందా అని స్మరింపబడేవాడు

188. Govidāṁ patiḥ: Gau means words. One who knows them is Govid. He who is the master of words is indicated by this name.

188 ఓం గోవిదాం పతిః - అతడు మిక్కిలి చతురుడు

marīcirdamanō haṁsaḥ suparṇō bhujagōttamaḥ,

hiraṇyanābhaḥ sutapāḥ padmanābhaḥ prajāpati (21)

189. Marīciḥ: The supreme power and impressiveness seen in persons endowed with such qualities.

189 ఓం మరీచిః - అతడు మిక్కిలి శక్తిమంతుడు, పూజింపదగినవాడు

190. Damanaḥ: One who in the form of Yama inflicts punishments on those who tread the path of unrighteousness.

190 ఓం దమనః - అతడు యముని రూపములో పాపులను శిక్షించువాడు

సమన్వయము: యముడంటే మనమందరమూ భయపడే నియంత, మృత్యు దేవత. కఠ ఉపనిషత్తులో నచికేతుడు యముని దర్శించి అనేక ప్రశ్న లడుగుతాడు. ముఖ్యంగా జీవి మరణం తరువాత ఎక్కడికి వెళ్తాడు? దానికి యముడు సమాధానం చెప్ప నిరాకరిస్తాడు. ఎందుకంటే అతడు విష్ణువు ఆధీనంలో పనిచేసేవాడు. విష్ణు భటులు, యమ భటులను తిప్పి కొట్టగలరని భాగవతంలో చెప్పబడింది. ముక్తులు వైకుంఠం చేరేవారు. వారితో యమభటుల కేమి పని?

191. Haṁsaḥ: One who removes the fear of Samsara from those who practise the sense of identity with Him.

191 ఓం హంసః - అతడు తన భక్తులలో సంసార భీతిని తొలగించువాడు

సమన్వయము: సంసార మంటే ఒకని పుత్రపౌత్రులే కాదు. చుట్టు ప్రక్కల ఉండేవారు, పని చేయించుకునే యజమాని, పాలకులు, మొదలైనవారు. వారందరూ మన నుంచి ఏదో ఒకటి ఆశించేవారే. పాలకులు పన్ను కట్టమంటే, యజమాని తక్కువ జీతం ఇస్తానంటే, వీటి వల్ల కుటుంబాన్ని ఎలా పోషించాలనే దుఃఖం సర్వ సాధారణం. అటువంటి క్లిష్ట పరిస్థితిలో విష్ణుడే శరణ్యం. మనం చేసినంత చేసి -- అంటే గాలిలో దీపం పెట్టి అది ఆరిపోకూడదని ప్రార్థించకుండా -- తక్కినది విష్ణువుకే అప్పగించాలి. "నారు పోసినవాడు, నీరు పొయ్యడా" అనే నానుడి ఇక్కడ వర్తిస్తుంది.

192. Suparṇaḥ: One who has two wings in the shape of Dharma and Adharma.

192 ఓం సుపర్ణః - అతడు ధర్మాధర్మములు రెండు రెక్కలుగా నున్నవాడు

193. Bhujagottamaḥ: One who is the greatest among those who move on Bhujas or arms, that is, serpents. The great serpents like Ananta and Vasuki are the powers of Vishnu, so he has come to have this name.

193 ఓం భుజగోత్తమః - అతడు అవయవములతో చరించు సర్పములలో అనంత, వాసుకి మొదలైన వాటిలో ఉత్తముడు

194. Hiraṇyanābhaḥ: From whose golden navel arose the lord of creation Brahmā.

194 ఓం హిరణ్యగర్భః - అతని స్వర్ణ నాభి నుండి సృష్టిని చేయుటకై బ్రహ్మ దేవుడు ఉద్భవించెను

195. Sutapāḥ: One who performs rigorous austerities at Badarikashrama as Nara and Narayana.

195 ఓం సుతపాః - అతడు బదరికాశ్రమములో నర నారాయుణిగా నిష్ఠతో యుండేవాడు

సమన్వయము: బదరికాశ్రమము హిమాలయాలలో ఒకటైన పుణ్యక్షేత్రము మహానుభావులు, నర, నారాయణులు ఈనాటికీ బదరికాశ్రమములో తపస్సు చేస్తున్నారని చెబుతారు. ఈ మహర్షులు మానవాళి శ్రేయస్సు కోసం కృష్ణుడు, అర్జునుడిగా మానవజన్మ పొందారని అంటారు. మహాభారతంలో కృష్ణుడు బదరీకాశ్రమంలో అర్జునుడిని దర్శించాడని, వారి వనవాస సమయంలో అతనితో గణనీయమైన కాలం నివసించాడని పేర్కొంది. అక్కడే వ్యాసమహర్షి నాల్గు వేదాలను సంకలనం చేసేడని అంటారు. వశిష్టుడు, కణ్వ మహర్షి వంటి మహనీయులు అక్కడ ధ్యానం చేసేవారని చారిత్రుకులు చెప్తారు.

196. Padmanābhaḥ: One whose navel is beautifully shaped like lotus.

196 ఓం పద్మనాభః - అతని నాభి పద్మాకారంలో సుందరముగా యుండెడిది

197. Prajāpatiḥ: The father of all beings, who are His children.

197 ఓం ప్రజా పతిః - అతడు సర్వ జీవులకు తండ్రి వంటివాడు

సమన్వయము: ప్రజాపతి అనేది సందర్భాన్ని బట్టి, మూలాన్ని బట్టి వేర్వేరు అర్థాలు కలిగిన పదం. కొన్ని వైదిక గ్రంథాల ప్రకారం, ప్రజాపతి ప్రాణ సృష్టి మరియు సంరక్షణకు బాధ్యత వహించే సర్వోన్నత సృష్టికర్త. అతను హిందూ త్రిమూర్తులలో బ్రహ్మతో కూడా గుర్తించబడ్డాడు. ఇతర ఆధారాల ప్రకారం, ప్రజాపతి ఒక దేవత కాదు, విశ్వ సృష్టిలో పాల్గొన్న వివిధ దేవతలకు సామూహిక నామం. ఈ దేవుళ్ళలో కొందరు దివ్య శిల్పి అయిన విశ్వకర్మ; అగ్ని; ఇంద్రుడు; మరియు దక్షుడు (సతీ దేవి యొక్క తండ్రి) ఉన్నారు. ప్రజాపతి అనేది ఒక క్రొత్త లేదా అసలైనదాన్ని సృష్టించే ఏదైనా దైవిక, అర్ధ-దైవిక లేదా మానవ ఋషులను సూచించే పదం. ఉదాహరణకు, మను స్వయంభువుడు ఒక ప్రజాపతిగా పరిగణించబడతాడు ఎందుకంటే అతను మొదటి మానవుడు మరియు మానవాళికి మూలపురుషుడు.

amṛtyuḥ sarvadṛk siṁhaḥ sandhātā sandhimān sthiraḥ,

ajō durmarṣaṇaḥ śāstā viśrutātmā surārihā. (22)

198. Amṛtyuḥ: One who is without death or its cause.

198 ఓం అమృత్యుః - అతడు మృత్యువు లేనివాడు

199. Sarvadṛk: One who sees the Karmas of all Jivas through His inherent wisdom.

199 ఓం సర్వధృక్ - అతడు జీవుల కర్మలను తన జ్ఞానముతో తెలిసికొనువాడు

200. Simhaḥ: One who does Himsa or destruction.

200 ఓం సింహః - అతడు వినాశము చేయ శక్తి గలవాడు

201. Sandhātā: One who unites the Jivas with the fruits of their actions.

201 ఓం సంధాతః - అతడు జీవులకు కర్మ ఫలాలను అందించేవాడు

202. Sandhimān: One who is Himself the enjoyer of the fruits of actions.

202 ఓం సంధిమాన్ - అతడు కర్మ ఫలాలను అనుభవించేవాడు

203. Sthiraḥ: One who is always of the same nature.

203 ఓం స్థిరః - అతడు ఎల్లప్పుడూ ఒకే లాగ ఉండేవాడు

204. Ajaḥ: The root 'Aj' has got as meanings both 'go' and 'throw'. So the name means One who goes into the hearts of devotees or One who throws the evil Asuras to a distance, i.e. destroys them.

204 ఓం అజః - అతడు భక్తుల హృదయాలలో నెలకొనేవాడు; అసురులను తరిమి తోలేవాడు

205. Durmarṣaṇaḥ: One whose might the Asuras cannot bear.

205 ఓం దుర్మర్షణః - అతని శక్తిని అసురులు అధిగమించలేరు

206. Śasta: One who instructs and directs all through the scriptures.

206 ఓం శస్త - అతడు శాస్త్రాలను అనుసరించి యుండేవాడు; ఇతరులను అనుసరింప జేసేవాడు

సమన్వయము: గీతలో శ్రీ కృష్ణుడు సాంఖ్య యోగము గురించి రెండవ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. కర్మయోగమునే పాటించమని అర్జునునికి బోధ చేస్తాడు. రామావతారంలో విష్ణువు వసిష్ఠాది మునులవద్ద అభ్యాసం చేస్తాడు. ఈ విధంగా విష్ణువు శాస్త్రాలను ప్రమాణముగా చేసి వాటితో ధర్మాచరణము చేయమని మనలను ప్రోద్భలం చేసేడు

207. Vishrutatma: One who is specially known through signifying terms like Truth, Knowledge, etc.

207 ఓం విశృతాత్మ - అతడు సత్యము, జ్ఞానము, అనంతము

208. Surārihā: One who destroys the enemies of Suras or Devas.

208 ఓం సూరారిహా - సురుల శత్రువులను సంహరించేవాడు

gururgurutamō dhāmaḥ satyaḥ satyaparākramaḥ,

nimiṣō nimiṣaḥ sragvī vācaspatirudāradhīḥ. (23)

209. Guruḥ: The greatest teacher.

209 ఓం గురుః - అతడు గొప్ప గురువు

సమన్వయము: గు అంటే చీకటి; రు అంటే చీకటిని పారద్రోలే శక్తి గలవాడు. చీకటి అనెడి అజ్ఞానాన్ని పారద్రోలేవాడే గురువు. అతడు నిర్దిష్ట జ్ఞానం లేదా క్షేత్రం యొక్క మార్గదర్శకుడు, మార్గదర్శి, నిపుణుడు. సంప్రదాయాలలో, గురువు ఒక ఉపాధ్యాయుడి కంటే ఎక్కువ: సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి ఒక గౌరవనీయమైన వ్యక్తి. అతడు విలువలను రూపొందించడంలో సహాయపడే సలహాదారునిగా, సాహిత్య జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటాడు. అతడు జీవితంలో ఒక ఆదర్శం, స్ఫూర్తిదాయక మూలం మరియు విద్యార్థి యొక్క ఆధ్యాత్మిక పరిణామానికి సహాయపడే వ్యక్తి. గీత అంతా గురువైన శ్రీకృష్ణుడు శిష్యుడైన అర్జునినికి చేసిన బోధ.

210. Gurutamaḥ: One who is the teacher of all forms of knowledge.

210 ఓం గురుతమః - అతడు జ్ఞానమంతటికీ గురువు

211. Dhāma: The Supreme Light.

211 ఓం ధామ - అతడు ఉత్కృష్టమైన కాంతి స్వరూపము

212. Satyaḥ: One who is embodied as virtue of truth specially.

212 ఓం సత్యః - అతడు సత్

213. Satyaparākramaḥ: One of unfailing valour.

213 ఓం సత్య పరాక్రమః - అతడు ఎదురులేని పరాక్రమము గలవాడు

214. Nimiṣaḥ: One whose eye-lids are closed in Yoga-nidra.

214 ఓం నిమిషః - అతడు యోగ నిద్రలో కనురెప్పలు వాల్చి యుండెడువాడు

సమన్వయము: యోగ నిద్ర ధ్యానం లాంటిది, కానీ ధ్యానం కన్నా మిన్న. యోగ నిద్ర అంటే స్పృహతో కూడిన నిద్ర యొక్క లోతైన స్థితి. ఇది అవగాహనతో లోతైన విశ్రాంతి స్థితి. ఈ స్థితిలో మేల్కొని ఉన్నప్పుడు స్పృహ నుండి కలలు కనడానికి మరియు మేల్కొని ఉన్నప్పుడు కలలు కనకుండా ఉండటానికి - అపస్మారక స్థితిని దాటి స్పృహలోకి వెళ్ళడం ఉంటుంది. యోగ నిద్రలో ఇంద్రియాలు, బుద్ధి మరియు మనస్సు పూర్తిగా వదిలివేయబడతాయి. ఈ కలలేని నిద్రలో, దేశకాలాలు మరియు హేతుబద్ధత అనే భావనల ఉండవు.

215. Animiṣaḥ: One who is ever awake.

215 ఓం అనిమిషః - అతడు ఎల్లప్పుడూ జాగృదవస్థలో ఉండేవాడు

216. Sragvī: One who has on Him the necklace called Vaijayanti, which is strung with the subtle aspects of the five elements.

216 ఓం స్రగ్వీ - అతడు తన్మాత్రాలచే చెయ్యబడిన వైజయంతి అనే దండను ధరించేవాడు

సమన్వయము: వైజయంత మాల ఎప్పటికీ వాడిపోని కమలములతో చేయబడినది. స్కంద పురాణంలో వరుణుడు వైజయంతి మాలని లక్ష్మీ దేవికి బహుమతిగా ఇస్తాడు. విష్ణు పురాణం ప్రకారం, ఈ దండ ప్రముఖంగా ఐదు విలువైన రత్నాలతో (నీలమణి, ముత్యం, వజ్రం మొదలైన వాటితో) చేయబడింది. ఇవి భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అని పిలువబడే పంచ భూతాలకు అనుగుణంగా ఉంటాయి. శివ పురాణంలో విష్ణువు తన అల్లుడు కార్తికేయుడికి అసుర తారకుడితో యుద్ధానికి ముందు తన దండను ఇస్తాడు. గరుడ పురాణంలో విష్ణు పంజరం అని పిలువబడే ఒక ప్రార్థన ఉంది, ఇందులో "నీ మెడ యొక్క ఆభరణమైన వైజయంతి మరియు శ్రీవత్సను తీసుకొని వాయవ్యంలో నన్ను రక్షించు, ఓ హయగ్రీవా! నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను" అనే శ్లోకం ఉంది.

217. Vācaspatir-udāradhīḥ: Being the master of Vak or word i.e. knowledge, He is called so. As his intellect perceives everything, He is Udaradhih. Both these epithets together constitute one name.

217 ఓం వాచస్పతిర్ రుదారధీః - అతడు వాక్కులో చతురుడు; మిక్కిలి జ్ఞానము కలవాడు

agraṇīrgrāmaṇīḥ śrīmān nyāyō netā samīraṇaḥ,

sahasramūrdhā viśvātmā sahasrākṣaḥ sahasrapāt. (24)

218. Agraṇīḥ: One who leads all liberation-seekers to the highest status.

218 ఓం అగ్రణీః - అతడు ముక్తిని కోరువారికి ఉన్నత స్థితి ప్రసాదించేవాడు

219. Grāmaṇīḥ: One who has the command over Bhutagrama or the collectivity of all beings.

219 ఓం గ్రామణీః - అతడు అన్నీ జీవ సమూహములను శాసించేవాడు

సమన్వయము: గ్రామణీ అంటే గ్రామాధిపతి, ముఖ్యుడు అని నిఘంటువులోని అర్థం. విష్ణువు అన్ని జీవరాశ్యులకూ అధిపతి అని చెప్పబడినది.

220. Śrīmān: One more resplendent than everything.

220 ఓం శ్రీ మాన్ - అతడు అన్నిటికన్నా ఎక్కువ ప్రకాశము గలవాడు

221. Nyāyaḥ: The consistency which runs through all ways of knowing and which leads one to the truth of Non-duality.

221 ఓం న్యాయః - అతడు వేరు వేరు మార్గాలను అనుసరించినవారిని చివరక అద్వైతానికి తీసుకువెళ్ళేవాడు

222. Netā: One who moves this world of becoming.

222 ఓం నేతా - అతడు సృష్టిని వృద్ధి చేయువాడు

223. Sahasramūrdhā: One with a thousand, i.e. innumerable, heads.

223 ఓం సహస్ర మూర్ధా - అతడు అసంఖ్యకమైన శిరస్సులు గలవాడు

224. Samīraṇaḥ: One who in the form of breath keeps all living beings functioning.

224 ఓం సమీరణః - అతని శ్వాస జీవులను నడిపిస్తుంది

225. Viśvātmā: The soul of the universe.

225 ఓం విశ్వాత్మా - అతడు విశ్వానికి ఆత్మ

226. Sahasrākṣaḥ: One with a thousand or innumerable eyes.

226 ఓం సహస్రాక్షః - అతనికి లెక్కపెట్టలేని కన్నులు గలవు

227. Sahasrapāt: One with a thousand, i.e. innumerable legs.

227 ఓం సహస్రపాత్ - అతనికి గణింపలేని కాళ్ళు గలవు

vartanō nivṛttātmā saṁvṛtaḥ saṁpramardanaḥ,

ahaḥ saṁvartakō vahniranilō dharaṇīdharaḥ. (25)

228. Āvrtanaḥ: One who whirls round and round the Samsara-chakra, the wheel of Samsara or worldy existence.

228 ఓం ఆవర్తనః - అతడు సంసార చక్రములో తిరుగుచుండెడివాడు

229. Nivṛttātmā: One whose being is free or untouched by the bondage of Samsara.

229 ఓం నివృతాత్మా - అతడు సంసార బంధము లేనివాడు

230. Saṁvṛtaḥ: One who is covered by all-covering Avidya or ignorance.

230 ఓం సంవృతః - అతడు అవిద్యని, అజ్ఞానాన్ని కప్పేవాడు

సమన్వయము: సంవృత మంటే చుట్టుకొనబడినది లేదా ఆవృతమైనది. విష్ణువు జ్ఞాన స్వరూపుడు. కాబట్టి అతడు అజ్ఞానాన్ని, అవిద్యని కప్పి ఉంటాడు.

భాగవత తృతీయ స్కంధములో ధృవ చరిత్ర చెప్పబడినది. ధ్రువుడు బాలుడిగా విష్ణువు కొరకై తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమైతే బాలుడు కాబట్టి అజ్ఞానంతో ఎలా స్తుతించాలో తెలియక అవాక్కయి ఉంటాడు. అప్పుడు విష్ణువు వానిపై కరుణించి నక్షత్ర మండలానికి అధిపతిగా నియమిస్తాడు. కాబట్టి విష్ణువు తన భక్తుల అవిద్యని దూరం చేసేవాడు.

231. Sampramardanaḥ: One who delivers destructive blows on all beings through His Vibhutis (power manifestation like Rudra, Yama etc.).

231 ఓం సంప్రమర్దనః - అతని విభూతిలతో అన్ని జీవుల అహంకారాన్ని అణగ ద్రొక్కేవాడు

సమన్వయము: ప్రమర్ధనమంటే నాశనము చేయుట, అణగ ద్రొక్కుట. విష్ణువు జీవుల అహంకారాన్ని అణగ ద్రొక్కేవాడు. [భాగవతం అష్టమ స్కంధం] గజేంద్ర మోక్షంలో, గజేంద్రుడు తన సామర్థ్యాన్ని అనేక విధములుగా అహంకారంతో వివరిస్తే విష్ణువు వానిని రక్షించలేదు. అప్పుడు గజేంద్రుడు:

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

అని శరణాగతి చేస్తే విష్ణువు పరుగులిడుతూ వచ్చి వానిని రక్షించెను.

232. Ahaḥ-saṁvartakaḥ: The Lord who, as the sun, regulates the succession of day and night.

232 అహః సంవర్తకః - అతడు సూర్యుని రూపములో రేయింబగళ్లు కలిగించేవాడు

సమన్వయము: సంవర్తకమంటే ప్రళయము; ప్రళయకాల మేఘము; బలరాముని నాగలి పేరు అని నిఘంటువు చెప్తుంది. ఇవి అన్నీ విష్ణువుకు వర్తించేవే. అతడే ప్రళయం సృష్టించేవాడు, జీవులను రక్షించేవాడు, తిరిగి సృష్టి చేసేవాడు.

233. Vahniḥ: One who as fire carries the offerings made to the Devas in sacrifices.

233 ఓం వహ్నిః - అతడు దేవతలకు యజ్ఞము యొక్క హవిస్సును అందించేవాడు

234. Anilaḥ: One who has no fixed residence.

234 ఓం అనిలః - అతడు స్థిరమైన గృహము లేనివాడు

సమన్వయము: అనిల అనగా నలుబదితొమ్మిది వాయువులలో నొకడు , ఎనిమిది వసువులలో నొకడు అనేవి నిఘంటువు అర్థములు. వసువులు అంటే గణాధిపతులు. వివిధ గ్రంథాలలో వారిని అనేక పేర్లతో పిలిచేవారు. ఇక్కడ చెప్పే అష్ట వసువులు: 1. వరుణుడు, 2. వృషభుడు, 3. నహుషుడు, 4. ప్రత్యూషుడు, 5. జయుడు, 6. అనిలుడు, 7. విష్ణువు, 8. విభావసుడు

235. Dharaṇī-dharaḥ: One who supports the worlds, Adisesha,elephants of the quarters, etc.

235 ఓం ధరణీ ధరః - అతడు విశ్వానికి ఆధారమై యున్నవాడు

suprasādaḥ prasannātmā viśvadhṛgviśvabhugvibhuḥ,

satkartā satkṛtaḥ sādhurjahnurnārāyaṇō naraḥ. (26)

236. Suprasādaḥ: One whose Prasada or mercy is uniquely wonderful, because He gives salvation to Sisupala and others who try to harm Him.

236 ఓం సుప్రసాదః - అతడు వొసగే కారుణ్యము విలక్షణమైనది

237. Prasannātmā: One whose mind is never contaminated by Rajas or Tamas.

237 ఓం ప్రసన్నాత్మా - అతని మనస్సు రజస్, తమో గుణములలో ఎన్నటికీ లేనిది

238. Viśvadhṛg: One who holds the universe by his power.

238 ఓం విశ్వ ధృగ్ - అతడు విశ్వాన్ని తన శక్తితో నడిపేవాడు

239. Viśvabhug: One who eats up or enjoys or protects the worlds.

239 ఓం విశ్వ భుగ్ - అతడు సృష్టిని భక్షించేవాడు, ఆనందంగా రక్షించేవాడు

240. Vibhuḥ: One who takes various forms

240 ఓం విభుః - అతడు అనేక రూపములను ధరించేవాడు

241. Satkartā: One who offers benefits.

241 ఓం సత్కర్తా - అతడు భక్తులకు అనేక ప్రయోజనములు కలిగించేవాడు

242. Satkṛtaḥ: One who is adored even by those who deserve adoration.

242 ఓం సత్కృతః - అతడు పూజింప దగినవారలచే పూజింపబడువాడు

243. Sādhuḥ: One who acts according to justice.

243 ఓం సాధుః - అతడు న్యాయాన్ని అనుసరించి ఉండేవాడు

సమన్వయము: సాధు జనులు సాత్త్విక స్వభావులు. వారు ధర్మము ననుసరించి, న్యాయంగా బ్రతికేవారు. నేడు చట్టాలను చేసే నాయకులూ, న్యాయ వాదులూ, న్యాయ మూర్తులు ఉన్నారు. వీరిలో చాలామంది న్యాయంగా బ్రతికి ఇతరులకు న్యాయం చేకూర్చేవారు. కానీ వారు చేసే ప్రతి నిర్ణయము వెనుక దైవ శక్తి పని చేస్తూ ఉంటుంది. అప్పుడే వారు ధర్మానికి కట్టుబడి ఉంటారు.

244. Jahnuḥ: One who dissolves all beings in oneself at the time of dissolution.

244 ఓం జహ్నుః - అతడు ప్రళయ కాలమున సర్వ జీవులకు ఆశ్రయము

245. Nārāyaṇaḥ: Nara means Atman. Narayana, that is, one having His residence in all beings.

245 ఓం నారాయణః - అతడు అన్ని ప్రాణులలోనూ నివసించేవాడు

246. Naraḥ: He directs everything, the eternal Paramatma is called Nara.

246 ఓం నరః - అతడు అన్నిటినీ శాసించేవాడు

asaṅkhyeyō’prameyātmā viśiṣṭaḥ śiṣṭakṛcchuciḥ,

siddhārthaḥ siddhasaṅkalpaḥ siddhidaḥ siddhisādhanaḥ. (27)

247. Asaṅkhyeyaḥ: One who has no Sankhya or differences of name and form.

247 ఓం అసంఖ్యేయః - అతని నామము, ఆకృతి మధ్య బేధము లేదు

248. Aprameyātmā: One whose nature cannot be grasped by any of the means of knowledge.

248 ఓం అప్రమేయాత్మా - అతని తత్త్వము జ్ఞానముతో తెలుసుకొనబడలేనిది

సమన్వయము: అప్రమేయము అంటే కొలుచుటకు, తెలుసుకొనుటకు వీలు కానిది. అట్టి వాడే విష్ణువు. అతను ఇంత ఒడ్డూపొడుగు వాడని చెప్పలేము. వామనావతారంలో మరుగుజ్జుగా, రామావతారంలో ఆజానుబాహుడుగా అతడు భూమి మీద ఆవిర్భవించేడు. కాబట్టి అతడు ఒక అనిర్వచనీయమైన శక్తిమంతుడు.

249. Viśiṣṭaḥ: One who excels everything.

249 ఓం విశిష్ఠః - అతడు అన్ని రంగాల లోనూ అతిశయించి ఉండేవాడు

250. Śiṣṭakṛt: One who commands everything. Or one who protects shishtas or good men.

250 ఓం శిష్ట కృత్ - అతడు అన్నిటినీ శాసించి, సజ్జనులను రక్షించేవాడు

251. Suciḥ: Pure

251 ఓం శుచిః - అతడు శుద్ధమైనవాడు

252. Siddhārthaḥ: One whose object is always fulfilled.

252 ఓం సిద్ధార్థః - అతని సంకల్పము సదా నేగ్గేది

253. Siddhasaṅkalpaḥ: One whose resolutions are always fulfilled.

253 ఓం సిద్ధ సంకల్పః - అతని సంకల్పాలు సదా నెరవేర్చబడేవి

254. Siddhidaḥ: One who bestows Siddhi or fulfillment on all who practise disciplines, in accordance with their eligibility.

254 ఓం సిద్ధిదాః - అతడు కర్మానుసారము సిద్ధిని ప్రసాదించేవాడు

సమన్వయము: ఇచ్చట సిద్ధి అంటే విజయము, తలచిన కార్యము నెరవేరుట మొదలైన శుభ సూచకాలు. విష్ణువు జీవుల కర్మానుసారము సిద్ధిని ప్రసాదించువాడు.

255. Siddhisādhanaḥ: One who brings fulfillment to works that deserve the same.

255 ఓం సిద్ధి సాధనః - అతడు కర్మాను సారము జీవులకు సిద్ధినొసగేవాడు

vṛṣāhī vṛṣabhō viṣṇurvṛṣaparvā vṛṣōdaraḥ,

vardhanō vardhamānaśca viviktaḥ śrutisāgaraḥ. (28)

256. Vṛṣāhī: Vrusha means dharma or merit.

256 ఓం వృషాహిః - అతడు ధర్మ స్వరూపము

257. Vṛṣābhaḥ: One who showers on the devotees all that they pray for.

257 ఓం వృషభః - అతడు భక్తులకు కోరిన వరములిచ్చేవాడు

సమన్వయము: వృష యొక్క సామాన్య ఉద్దేశ్యము వృషభము లేదా ఎద్దు. నిఘంటువు వృష శబ్దానికి ధర్మము అని కూడా అర్థం చెప్తుంది. వృషభము మిక్కిలి శక్తివంతమైనది కాబట్టి విష్ణువు ధర్మము కలిగించుటలో మిక్కిలి శ్రేష్ఠుడు.

258. Viṣṇuḥ: One who pervades everything.

258 ఓం విష్ణుః - అతడు సర్వ వ్యాపకుడు

259. Vṛṣaparva: One who has given as steps (Parvas), observances of the nature of Dharma, to those who want to attain the supreme state.

259 ఓం వృష పర్వ - అతడు ముక్తిని పొందుటకు ధర్మముతో నాచరించవలసిన పర్వాలను ఇచ్చినవాడు

సమన్వయము: నిఘంటువు వృషపర్వుడు అంటే శివుని నామము అని చెప్తుంది. శివకేశవుల మధ్య పెద్ద భేదము లేని కారణాన ఈ నామము విష్ణువుకు కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ వృష అను మూలము ధర్మమును సూచించేది

260. Vṛṣodaraḥ: One whose abdomen showers offspring.

260 ఓం వృషోదరః - అతని కుక్షి లోనుంచి జీవులు ఉద్భవిస్తాయి

సమన్వయము: పోతన భాగవతంలో ఈ పద్యంలో శ్రీకృష్ణుని కుక్షిలో సర్వ జగత్తు ఉందని భీష్ముడు వర్ణిస్తాడు. "

గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి; 
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు;
విడువు మర్జున!" యనుచు మద్విశిఖ వృష్టిఁ 
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు"

అనగా: ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగరగా కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకడంతో తుళ్ళే బొజ్జలోని ముజ్జగాలనే పిండాండం వడికి బ్రహ్మాండం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకివస్తున్నాడు. అట్టి గోపాల దేవుడే నాకు రక్ష".

261. Vardhanaḥ: One who increases the ecstasy of His devotees

261 ఓం వర్ధనః - అతడు భక్తుల ఆనందమును బహుళీకృతము జేసేవాడు

262. Vardhamānaḥ: One who multiplies in the form of the universe.

262 ఓం వర్ధమానః - అతడు విశ్వమును బహుళీకృతము జేసేవాడు

263. Viviktaḥ: One who is untouched and unaffected.

263 ఓం వివిక్తః - అతడు దేనివలన మార్పు లేనివాడు

264. Śrutisāgaraḥ: One to whom all the shruti or Vedic words and sentences flow.

264 ఓం శృతి సాగరః - అతని నుండి శృతి లేదా వేదాలు ఆవిర్భవిస్తాయి

subhujō durdharō vāgmī mahendrō vasudō vasuḥ,

naikarūpō bṛhadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ. (29)

265. Subhujaḥ: One possessing excellent arms that protect the worlds.

265 ఓం సుభుజః - అతని బలమైన కరములు సృష్టిని కాపాడుతాయి

266. Durdharaḥ: One who holds up the universe – a work which none else can do.

266 ఓం దుర్ధరః - అతడు ఇతరులకు సాధ్యము కానివి చేసి సృష్టిని రక్షించే వాడు

267. Vāgmi: One from whom the words constituting the Veda come out.

267 ఓం వాగ్మి - అతడి నుండి వేద మంత్రాలు ఆవిర్భవిస్తాయి

268. Mahendraḥ: The great Lord, that is, the Supreme Being, who is the God of all gods.

268 ఓం మహేంద్రః - అతడు దేవతులకు దేవత

269. Vasudaḥ: One who bestows riches.

269 ఓం వసుదః - అతడు సిరులను ప్రసాదించేవాడు

270. Vasuḥ: One who is himself the Vasu.

270 ఓం వసుః - అతడు తానే సంపద స్వరూపము

271. Naikarūpaḥ: One who is without an exclusive form.

271 ఓం నైకరూపః - అతనికి స్థిరమైన రూపము లేదు

సమన్వయము: నైకరూపుడు శివకేశవులకు వర్తించే నామము.

272. Bṛhadrūpaḥ: One who has adopted mysterious forms like that of a Boar.

272 ఓం బృహద్రూపః - అతడు అడవి పంది వంటి వింతైన రూపాలు ధరించినవాడు

సమన్వయము: ఇక్కడ సంధి బృహత్ + రూపః అనుకొంటే ఈ నామానికి అర్థం గొప్పవైన రూపాలు ధరించినవాడు అని తెలుస్తుంది. ఉదాహరణకి వరాహ అవతారము, కూర్మావతారము, మత్స్యావతారములలో విష్ణువు భూమిని దానవుల చెరనుండి విడిపించుట, సముద్ర జలాలనుంచి సజ్జనులను రక్షించుట మొదలైన గొప్ప కార్యాలు చేసెను.

భాగవత తృతీయ స్కంధములో వరాహమూర్తి అవతారము వివరింపబడినది. ఒకప్పుడు మనువుని బ్రహ్మ దేవుడు సంతానమును భూమిపై వృద్ధి చేయుమని ఆదేశిస్తాడు. కానీ భూమి అప్పుడు ప్రళయ జలమున మునిగి యున్నది. బ్రహ్మ దేవుడు ఎలా భూమిని వెలికి తియ్యాలని ఆలోచించుచుండగా ఆయన నాశికా రంధ్రము నుండి వరాహ రూపములో బిడ్డడుదయించెను. అతడు చూచుచుండగనే ఏనుగంత వరాహ ఆకృతిలో పెరిగెను. పిదప జలములో ప్రవేశించి భూమిని తన కోరలపై ధరించి పైకి తెచ్చెను. ఆ సమయంలో హిరణ్యాక్షుడను దైత్యుడు ఆయనమీదకి దండెత్తి వచ్చెను. వరాహమూర్తి వానిని సంహరించెను. ఇట్లు విష్ణువు వరాహమూర్తి అవతారము లోకాకళ్యాణనమునకై ధరించెను.

273. Śipiviṣṭaḥ: Shipi means cow. One who resides in cows as Yajna.

273 ఓం శిపివిష్టః - అతడు యజ్ఞ రూపములో గోవులలో నివసించేవాడు

సమన్వయము: శిపి అంటే గోవు అని చెప్పుకోవచ్చు, గోమాత విసర్జించే ప్రతీదీ పవిత్రమే. గోమూత్రము, పేడ కూడా పవిత్రమే. విష్ణువు గోవులలో స్థితమై ఆ పనులు చేయిస్తున్నాడని అర్థం.

274. Prakāśanaḥ: One who illumines everthing.

274 ఓం ప్రకాశనః - అతడు అన్నిటినీ ప్రకాశింప చేస్తాడు

jastejōdyutidharaḥ prakāśātmā pratāpanaḥ,

ddhaḥ spaṣṭākṣarō mantraścandrāṁśurbhāskaradyutiḥ. (30)

275. Ōjas-tejō-dyuti-dharaḥ: One who is endowed with strength, vigour and brilliance.

275 ఓం ఓజస్ తేజో ద్యుతి ధరః - అతడు శక్తి, బలము, మేధస్సుతో నుండేవాడు

సమన్వయము: ఓజస్ అంటే బలము, తేజో అంటే తేజస్సు, ద్యుతి అంటే కాంతి. ఈ విధంగా ఈ నామం మూడు నామాలుగా చెప్పుకోవచ్చు.

276. Prakāśātmā: One whose form is radiant.

276 ఓం ప్రకాశాత్మా - అతని ఆకృతి దివ్యమైనది

277. Pratāpanaḥ: One who warms the world through the power manifestations like the Sun.

277 ఓం ప్రతాపనః - అతడు జగములకు వేడిమి చేకూరిస్తాడు

సమన్వయము: ప్రతాపము అంటే వేడిమి. అతడు సూర్యుడు ద్వారా భూమికి వేడి కలిగిస్తాడు. సూర్యుడు భూమికి అతి దగ్గరైన నక్షత్రము. సృష్టిలో అసంఖ్యాక సూర్యులున్నారు. అన్నిటిలోనూ వేడిమి ఉంది. సృష్టి ఘనీభవించకుండా ఉండడానికి, జీవుల వృద్ధికి వేడిమి ఎంతో అవసరం.

278. Ṛddhaḥ: One who is rich in excellences like Dharma, Gyana (knowledge), Vairagya (renunciation) etc.

278 ఓం ఋద్ధః - అతడు ధర్మము, జ్ఞానము, వైరాగ్యములలో ఆరితేరినవాడు

సమన్వయము: ఋద్ధ అనే పదానికి నిఘంటువు చెప్పేది: సంపన్నుడు; పండిన ధాన్యము; కుబేరుని భార్య. కాబట్టి ఈ నామము మిక్కిలి సంపన్నుడు, సంపద ఇచ్చేవాడు అని చెప్పుకోవచ్చు

279. Spaṣṭākṣaraḥ: He is so called because Omkara, the manifesting sound of the Lord, is Spashta or high pitched.

279 ఓం స్పష్టాక్షరః - అతని ఓంకారము స్పష్టమైనది

సమన్వయము: స్పష్ట అంటే వ్యక్తమైనది; అక్షర అంటే క్షయము కానిది. అతడు ఎప్పటికీ స్పష్టంగా వ్యక్తమయ్యేవాడు

280. Mantraḥ: One who manifests as the Mantras of the Rk, Sama, Yajus etc., or one who is known through Mantras.

280 ఓం మంత్రః - అతడు వేద మంత్ర స్వరూపుడు

281. Candrāṁśuḥ: He is called 'Chandramshu' or moonlight because just as the moon-light gives relief to men burnt in the heat of the sun, He gives relief and shelter to those who are subjected to the heat of Samsara.

281 ఓం చంద్రాంశుః - అతడు సంసార చక్రములో యున్నవారికి చంద్రునివలె చల్లని ఉపసమును ఇచ్చును

282. Bhāskara-dyutiḥ: He who has the effulgence of the sun.

282 ఓం భాస్కర ద్యుతిః - అతడు సూర్యునివలె ప్రకాశించేవాడు

amṛtāṁśūdbhavō bhānuḥ śaśabinduḥ sureśvaraḥ,

auṣadhaṁ jagataḥ setuḥ satyadharmaparākramaḥ. (31)

283. Amṛtāṁśūdbhavaḥ: The Paramatman from whom Amrutamshu or the Moon originated at the time of the churning of the Milky ocean.

283 ఓం అమృతాంశు భవః - పాల సముద్ర మదనములో అతని నుండి చంద్రుడు ఆవిర్భవించెను

సమన్వయము: ఇక్కడ అమృతాంశు అంటే అమృతము నుంచి పుట్టిన చంద్రుడు. దేవదానవులు అమృతమునకై పాల సముద్రాన్ని చిలికితే అందులోనుంచి అనేక వస్తువులు బయటకు వచ్చేయి. వాటిలో ఒకటి చంద్రుడు.

284. Bhānuḥ: One who shines.

284 ఓం భానుః - అతడు నిత్య ప్రకాశకుడు

285. Śaśabinduḥ: The word means one who has the mark of the hare, that is the Moon.

285 ఓం శశి బిందుః - అతడు చంద్రుని వంటి చుక్క గలవాడు

సమన్వయము: శశి అంటే చంద్రుని రూపము కుందేలుని తలపిస్తుందనే కవుల వర్ణన. బిందు అంటే చుక్క. వాటి అర్థము అతడు చంద్రుని వంటి చుక్క గలవాడు.

286. Sureśvaraḥ: One who is the Lord of all Devas and those who do good.

286 ఓం సురేశ్వరః - అతడు సురులకు అధిపతి

287. Auṣadham: One who is the Aushadha or medicine for the great disease of Samsara.

287 ఓం ఔషధం - అతడు సంసారమనే వ్యాధికి ఔషధము వంటివాడు

288. Jagataḥ setuḥ: One who is the aid to go across the ocean of Samsara.

288 ఓం జగతః సేతుః - అతడు సంసార సాగరమును దాటుటకు సహాయకుడు

289. Satya-dharma-parākramaḥ: One whose excellences like righteousness, omniscience, puissance, etc. are all true.

289 ఓం సత్య ధర్మ పరాక్రమః - అతడు సత్యము, ధర్మము వంటి లక్షణములు గల పరాక్రమవంతుడు

bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ,

kāmahā kāmakṛtkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ. (32)

290. Bhūta-bhavya-bhavan-nāthaḥ: One who is the master for all the beings of the past, future and present.

290 ఓం భూత భవ్య భవన్నాథః - అతడు అన్ని కాలాలలోనూ అన్ని జీవులకు అధిపతి

సమన్వయము: భూత భవ్య భవన్ అంటే గడచిన కాలము (భూత), రాబోయే కాలము (భవ్య), వర్తమానము (భవన్). అంటే అన్ని కాలాలు. నాథ అంటే జీవులకు అధిపతి అని చెప్పుకోవచ్చు.

291. Pavanaḥ: One who causes movement.

291 ఓం పవనః - అతడు గాలి వలె చలనము కలిపించేవాడు

292. Pāvanaḥ: One who is the purifier.

292 ఓం పావనః - అతడు శుద్ధ పరిచేవాడు

293. Analaḥ: The Jivatma is called Anala because it recognizes Ana or Prana as Himself.

293 ఓం అనలః - అతడు జీవులలోని ఆత్మ స్వరూపమై ప్రాణమును నిలుపువాడు

సమన్వయము: అనల అంటే జఠరాగ్ని. ఇది చైతన్య జీవులలో ఉండేది. ఆకలి, దప్పికలు, గుండె కొట్టుకొనుట, ఊపిరి పీల్చుట దానివలననే సాధ్యము.

294. Kāmahā: One who destroys the desire-nature in seekers after liberation.

294 ఓం కామః - అతడు ముక్తిని కోరువారి మోహమును నాశము జేసేవాడు

295. Kāmakṛt: One who fulfils the wants of pure minded devotees.

295 ఓం కామకృత్ - అతడు శుద్ధమైన భక్తుల కోర్కెలను తీర్చువాడు

296. Kantaḥ: One who is extremely beautiful.

296 ఓం కాంతః - అతడు మిక్కిలి సౌందర్యవంతుడు

297. Kāmaḥ: One who is sought after by those who desire to attain the four supreme values of life.

297 ఓం కామః - ధర్మార్థకామమోక్షములను పొందదలిచేవారు అతనిని ఆశ్రయింతురు

298. Kāmapradaḥ: One who liberally fulfils the desires of devotees.

298 ఓం కామప్రదః - అతడు భక్తుల కోర్కెలను ఉదారముగా తీర్చువాడు

299. Prabhuḥ: One who surpasses all.

299 ఓం ప్రభుః - అతడు అందరినీ అతిశయించిన వాడు

yugādikṛdyugāvartō naikamāyō mahāśanaḥ,

adṛśyō vyaktarūpaśca sahasrajidanantajit. (33)

300. Yugādikṛd: One who is the cause of periods of time like Yuga.

300 ఓం యుగాదికృద్ - అతడు యుగములు మొదలైన కాలములకు కారకుడు

సమన్వయము: నాల్గు యుగములు -- కృత, త్రేత, ద్వాపర, కలి--ఒక చతుర్యుగము; 71 చతుర్యుగములు ఒక మన్వంతరము; అనేక మన్వంతరాలు ఒక కల్పము. బ్రహ్మకు ఒక కల్పము 12 గంటలు; మానవులకి అది 432 కోట్ల సంవత్సరాలు. ఈ విధంగా హిందూ కాలమానం స్థూల మైన విశ్వం యొక్క కాలాన్ని నిర్ణయిస్తుంది. కాలము సృష్టితో బాటు మొదలవుతుంది. విష్ణువే కాలాన్ని పుట్టించినవాడు. కావున అతడి లోనే ప్రళయంలో కాలం కలిసిపోతుంది.

301. Yugāvartaḥ: One who as time causes the repetition of the four Yugas beginning with Satya Yuga.

301 ఓం యుగావర్తః - అతడు సత్య యుగము మొదలుకొని నాలుగు యుగముల మరల మరల వచ్చుటకు కారణము

302. Naikamāyaḥ: One who can assume numerous forms of Maya, not one only.

302 ఓం నైకమాయః - అతడు తన మాయచే అనేక రూపములను ధరించేవాడు

303. Mahāśanaḥ: One who consumes everything at the end of a Kalpa.

303 ఓం మహాశనః - అతడు కల్పాంతరములో అన్నిటినీ తనలోకి తీసుకొనేవాడు

304. Adṛśyaḥ: One who cannot be grasped by any of the five organs of knowledge.

304 ఓం అదృశ్యః - అతడు ఇంద్రియములచే గ్రహింపబడలేడు

305. Vyaktarūpaḥ: He is so called because His gross form as universe can be clearly perceived.

305 ఓం వ్యక్తరూపః - అతని స్థూల రూపం జగత్తుగా నుండునదని సర్వులకు విదితము

306. Sahasrajit: One who is victorious over innumerable enemies of the Devas in battle.

306 ఓం సహస్రజిత్ - అతడు అనేక దేవాసుర సంగ్రాముమలలో విజయము సాధించినవాడు

307. Anantajit: One who, being endowed with all powers, is victorious at all times over everything.

307 ఓం అనంతజిత్ - అతడు అనేక శక్తులు కూడి, ఎల్లప్పుడూ విజయమును సాధించెడివాడు

iṣṭō’viśiṣṭaḥ śiṣṭeṣṭaḥ śikhaṇḍī nahuṣō vṛṣaḥ,

krōdhahā krōdhakṛtkartā viśvabāhurmahīdharaḥ. (34)

308. Iṣṭaḥ: One who is dear to all because He is of the nature of supreme Bliss.

308 ఓం ఇష్టః - అతడు అందరికీ ప్రియమైన వాడు; అతడు ఉత్కృష్టమైన ఆనందాన్ని ఒసగేవాడు

309. Aviśiṣṭaḥ: One who resides within all.

309 ఓం అవిశిష్టః - అతడు జీవులన్నిటిలోనూ ఉన్నవాడు

సమన్వయము: శిష్ట అంటే శాసించుట; అవిశిష్ట అంటే అన్నిటినీ శాసించేవాడు

310. Śiṣṭeṣṭaḥ: One who is dear to shishta or Knowing Ones.

310 ఓం శిస్టేష్టః - అతడు జ్ఞానులకు ప్రియమైనవాడు

311. Śikhaṇḍī: Sikhanda means feather of a peacock. One who used it as a decoration for His crown when he adopted the form of a cowherd (Gopa).

311 ఓం శిఖండీ - అతడు కృష్ణావతారంలో నెమలి పింఛమును ధరించినవాడు

సమన్వయము: శిఖండి అంటే నెమలి. శ్రీకృష్ణుడు కిరీటముపై సదా నెమలి పింఛమును ధరించేవాడని ప్రతీతి.

312. Nahuṣaḥ: One who binds all beings by Maya the root 'nah' means bondage.

312 ఓం నహుషః - అతడు మాయచే అన్ని జీవులనూ బంధములో నుంచెడివాడు

నహుష అంటే రాజు అని అర్థం. విష్ణువు రాజాధి రాజు

313. Vṛṣaḥ: One who is of the form of Dharma.

313 ఓం వృషః - అతడు ధర్మ స్వరూపము

314. Krōdhahā: One who eradicates anger in virtuous people.

314 ఓం క్రోధహా - అతడు సజ్జనులలో క్రోధమును తొలగించెడివాడు

315. Krōdhakṛt-kartā: One who generates Krodha or anger in evil people.

315 ఓం క్రోధకృత్ కర్తా - అతడు పాపులపై క్రోధము కలిగినవాడు

316. Viśvabāhuḥ: One who is the support of all or one who has got all beings as His arms.

316 ఓం విశ్వ బాహుః - అతడు అందరికి ఆధారము

317. Mahīdharaḥ: Mahi means both earth and worship. So the name means one who supports the earth or receives all forms of worship.

317 ఓం మహీ ధరః - అతడు భూమిని రక్షించేవాడు; అందరి పూజలను గ్రహించేవాడు

acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇadō vāsavānujaḥ,

apāṁnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ. (35)

318. Acyutaḥ: One who is without the six transformations beginning with birth.

318 ఓం అచ్యుతః - అతడు బాల్యము, యౌవనము, వృద్ధాప్యము మొదలగు వికారములు చెందనివాడు; స్థిరమైనవాడు

319. Prathitaḥ: One who is famous because of His works like creation of the worlds etc.

319 ఓం ప్రథితః - అతడు సృష్టి కర్తగా పేరొందినవాడు

320. Prāṇaḥ: One who as Hiranyagarbha endows all beings with Prana.

320 ఓం ప్రాణః - అతడు జీవులకు ప్రాణము నొసగెడివాడు

321. Prāṇadaḥ: One who bestows Prana, that is, strength, on Devas and Asuras and also destroys them by withdrawing it.

321 ఓం ప్రాణదః - అతడు దేవతలకు, ఆసురులకు ప్రాణము నిచ్చేవాడు

322. Vāsavānujaḥ: One who was born as younger brother of Indra (Vasava) in His incarnation as Vamana.

322 ఓం వాసవానుజః - వామనావతారంలో అతడు ఇంద్రుని తమ్ముడుగా జన్మించెను

సమన్వయము: వాసవ అంటే ఇంద్రుడు; అనుజ అంటే సహోదరుడు. వామనావతారంలో విష్ణువు కశ్యపుడు, అదితికి వామనుడిగా జన్మించెను; అంతకు పూర్వము అదితి తపస్సు చేసి ఇంద్రుని కన్నది; ఈ విధంగా విష్ణువు ఇంద్రుని సహోదరుడయ్యెను.

323. Apāṁ nidhiḥ: The word means collectivity of water or the ocean.

323 ఓం అపాం నిధిః - అతడు సర్వ జలముల స్వరూపము

324. Adhiṣṭhānam: The seat or support for everything.

324 ఓం అధిష్ఠానం - అతడు అన్నిటికీ మూలాధారం

325. Apramattaḥ: One who is always vigilant in awarding the fruits of actions to those who are entiled to them.

325 ఓం అప్రమత్తః - అతడు సదా అప్రమత్తతతో నుండెడివాడు

326. Pratiṣṭhitaḥ: One who is supported and established in His own greatness.

326 ఓం ప్రతిష్ఠితః - అతడు తన స్వశక్తియందే ఉండేవాడు

సమన్వయము: ప్రతిష్ఠిత అంటే స్థిరమైనది. విష్ణువు తన స్వశక్తితో ఉండే స్థిరమైనవాడు.

skandaḥ skandadharō dhuryō varadō vāyuvāhanaḥ,

vāsudevō bṛhadbhānurādidevaḥ purandaraḥ. (36)

327. Skandaḥ: One who drives everything as air.

327 ఓం స్కందః - అతడు గాలి వలె అన్నిటినీ చలింపజేసెడివాడు

సమన్వయము: నిఘంటువు స్కంద అంటే కుమారస్వామి అని చెప్తుంది. అతడు అసురులతో చేసే యుద్ధాలలో దేవతల సేనాధిపతి.

328. Skanda-dharaḥ: One who supports Skanda or the righteous path.

328 ఓం స్కంధ ధరః - అతడు సన్మార్గమును అభిలషించేవాడు; దానికి ఆధారముగా నుండేవాడు

సమన్వయము: ధర అంటే భూమి లేదా ధరించువాడు

329. Dhuryaḥ: One who bears the weight of the burden of all beings in the form of birth etc.

329 ఓం ధుర్యః - అతడు జీవుల జననము, స్థితి మొదలగువానిని భరించేవాడు

సమన్వయము: ధుర్య అంటే భారము మోసేవాడు; కావున అతడు జీవుల సంసార భారమును మోసేవాడు.

330. Varadaḥ: One who gives boons.

330 ఓం వరదః - అతడు భక్తులకు వరాలిచ్చేవాడు

331. Vāyuvāhanaḥ: One who vibrates the seven Vayus or atmospheres beginning with Avaha.

331 ఓం వాయువాహనః - అతడు సప్త వాయువులను స్పందింపజేసేవాడు

332. Vāsudevaḥ: One who is both Vasu and Deva.

332 ఓం వాసుదేవః - అతడు భూమి, దేవుడు

333. Bṛhadbhānuḥ: The great brilliance.

333 ఓం బృహద్భానుః - అతడు గొప్ప ప్రకాశము

సమన్వయము: బృహద్ అంటే గొప్పదైనది; భాను అంటే సూర్యుడు; కాబట్టి అతడు సూర్యునివలె గొప్ప తేజస్సు గలవాడు అని చెప్పబడినది.

334. Ādidevaḥ: The Divinity who is the source of all Devas.

334 ఓం ఆది దేవః - అతడు దేవతలను ఆవిర్భవింప జేసేడు (ప్రప్రథముడు)

335. Purandaraḥ: One who destroys the cities of the enemies of Devas.

335 ఓం పురందరః - అతడు దేవతల శత్రువుల నగరములను నాశనము చేసేవాడు

aśōkastāraṇastāraḥ śūraḥ śaurirjaneśvaraḥ,

anukūlaḥ śatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ. (37)

336. Aśokaḥ: One without the six defects – sorrow, infatuation, hunger, thirst, birth and death.

336 ఓం అశోకః - అతడు దుఃఖము, మోహము, ఆకలి, దప్పిక, జననము, మరణము అను 6 శోకములు లేనివాడు

337. Tāraṇaḥ: One who uplifts beings from the ocean of samsara.

337 ఓం తారణః - అతడు సంసార సాగరం నుండి జీవులను రక్షించేవాడు

338. Tāraḥ: One who liberates beings from the fear of residence in the womb, birth, old age, death etc.

338 ఓం తారః - అతడు గర్భము, జననము, వృద్ధాప్యము, మరణము మొదలగు వాటియందు జీవులకు గల భయమును తొలగించి మోక్షము ఇచ్చువాడు

339. Śūraḥ: One of great prowess, that is, who fulfils the four supreme satisfactions of life – Dharma, Artha, Kama and Moksha.

339 ఓం శూరః - అతడు జీవులకు ధర్మార్థకామమోక్షాలు ప్రసాదించే గొప్ప శక్తి గలవాడు

340. Śauriḥ: One who as Krishna as the son of Sura, that is Vasudeva.

340 ఓం సౌరిః - అతడు కృష్ణావతారంలో సురుడైన వసుదేవుని కుమారుడు

341. Janeśvaraḥ: The Lord of all beings.

341 ఓం జనేశ్వరః - అతడు అన్ని జీవులను పాలించేవాడు

సమన్వయము: ఇక్కడ జన + ఈశ్వర అనే సంధి ప్రకారం జన అంటే జీవులు; ఈశ్వర అంటే అధిపతి. కనుక అతడు జీవులను పరిపాలించేవాడు.

342. Anukūlaḥ: One who, being the Atman of all beings, is favorable to all, for no one will act against oneself.

342 ఓం అనుకూలః - అతడు అందరియందు అనుకూలముగా నుండేవాడు

343. Śatāvartaḥ: One who has had several Avataras or incarnations.

343 ఓం శతావర్తః - అతడు అనేక అవతారములు దాల్చినవాడు

సమన్వయము: ఇక్కడ శత అంటే అనేక, ఆవర్త అంటే తిరిగి తిరిగి అదేస్థితికి సమవ్యవధులలో వచ్చునట్టిది. కాబట్టి విష్ణువు అనేక మార్లు మర్త్య లోకంలో అవతారాలెత్తుతాడు.

344. Padmī: One having Padma or lotus in his hands.

344 ఓం పద్మీ - అతడు చేతిలో పద్మము గలవాడు

345. Padma-nibhekṣaṇaḥ: One with eyes resembling lotus.

345 ఓం పద్మ నిభేక్షణః -అతడు పద్మమును బోలు కన్నులు గలవాడు

సమన్వయము: పద్మ + నిభ + ఈక్షణ ; నిభ అంటే సమానమైన; ఈక్షణ అంటే చూపు (కన్నులు)

padmanābhōravindākṣaḥ padmagarbhaḥ śarīrabhṛt,

maharddhir ṛddhō vṛddhātmā mahākṣō garuḍadhvajaḥ. (38)

346. Padma-nābhaḥ: One who resides in the Nabhi or the central part of the heart-lotus.

346 ఓం పద్మ నాభః - అతడు పద్మము మధ్యన స్థితమైనవాడు; జీవుల హృదయ పద్మములో వసించేవాడు

సమన్వయము: నాభి అంటే బొడ్డు; కాబట్టి వేరే అర్థం: పద్మము నాభియందున్నవాడు; సృష్ట్యారంభంలో అతని నాభి నుండి పద్మము ఆవిర్భవించెను. దానిపై బ్రహ్మ దేవుడు కూర్చొని యుండెను.

347. Aravindākṣaḥ: One whose eyes resemble Aravinda or the Lotus.

347 ఓం అరవిందాక్షః - అతని కన్నులు పద్మమును బోలి యుండేవి

348. Padma-garbhaḥ: One who is fit to be worshipped in the middle of the heart-lotus.

348 ఓం పద్మ గర్భః - అతడు హృదయ కమలములో పూజింప బడేవాడు

349. Śarīra-bhṛt: One who supports the bodies of beings, strengthening them in the form of Anna (Food) and Prana.

349 ఓం శరీర భ్రుత్ - అతడు జీవుల శరీరములు అన్నముతో, ప్రాణముతో పోషించెడివాడు

350. Mahardhi: One who has enormous Ruddhi or prosperity.

350ఓం మహర్ధిః - అతనికి మిక్కిలి సిరిసంపదలు గలవు

351. Ṛddhaḥ: One who is wealthy

351 ఓం ఋద్ధః - అతడు మిక్కిలి సంపన్నుడు

సమన్వయము: ఋద్ధ యొక్క అర్థాలు: సంపన్నుడు; పండిన ధాన్యము; కుబేరుని భార్య.

352. Vṛddhātmā: One whose Atma or body is Vruddha or ancient.

352 ఓం వృద్ధాత్మా - అతని ఆత్మ, దేహము బహు పురాతన మైనవి

353. Mahākṣaḥ: One who has got two or many glorious eyes.

353 ఓం మహాక్షః - అతడు అనేక కన్నులు గలవాడు

354. Garuḍa-dhvajaḥ: One who has got Garuda as his flag.

354 ఓం గరుడ ధ్వజః - అతడు ఝండాపై గరుడ చిహ్నము గలవాడు

atulaḥ śarabhō bhīmaḥ samayajñō havirhariḥ,

sarvalakṣaṇalakṣaṇyō lakṣmīvān samitiñjayaḥ. (39)

355. Atulaḥ: One who cannot be compared to anything else.

355 ఓం అతులః - అతడు దేనితోనూ పోల్చ బడలేనివాడు

356. Śarabhaḥ: The body is called 'Sara' as it is perishable.

356 ఓం శరభః - శరీరమును అనిత్యము గనుక దానిని "శర" అనెదరు

సమన్వయము: శరభ అంటే బాధించునది. శరము అంటే బాణము. అతడు బాణములతో అసురులను బాధించేవాడు అని సమన్వయము చేసుకోవాలి.

357. Bhīmaḥ: One of whom everyone is afraid.

357 ఓం భీమః - అతడు పాపులకు భీతి కలిగించెడివాడు

358. Samayajñaḥ: One who knows the time for creation, sustentation and dissolution.

358 ఓం సమయజ్ఞః - అతడు సృష్టి స్థితి లయములు ఎప్పుడు చెయ్యవలెనో ఎరిగినవాడు

359. Havir-hariḥ: One who takes the portion of offerings (Havis) in Yajnas.

359 ఓం హవిర్ హరిః - అతడు యజ్ఞములో ఇచ్చే హవిస్సును స్వీకరించేవాడు

360. Sarva-lakṣaṇa-lakṣaṇyaḥ: The supreme knowledge obtained through all criteria of knowledge i.e. Paramatma.

360 ఓం సర్వ లక్షణ లక్షణ్యః - అతడు మిక్కిలి గొప్ప లక్షణములు గలవాడు; కనుక పరమాత్మ

361. Lakṣmīvān: One on whose chest the Goddess Lakshmi is always residing.

361 ఓం లక్ష్మీ వాన్ - అతని వక్ష స్థలములో లక్ష్మీ దేవి సదా నివసించేది

362. Samitiñjayaḥ: One who is vicotorious in Samiti or war.

362 ఓం సమితింజయః - అతడు యుద్ధములో సదా విజయుడు

సమన్వయము: సమితి + జయ; ఇక్కడ సమితి అంటే యుద్ధం. కాబట్టి అతడు యుద్ధాలలో సదా విజయమును పొందేవాడు.

vikṣarō rōhitō mārgō heturdamodarassahaḥ,

mahīdharō mahābhāgō vegavānamitāśanaḥ. (40)

363. Vikṣaraḥ: One who is without Kshara or desruction.

363 ఓం విక్షరః - అతడు నాశము లేనివాడు

సమన్వయము: అక్షర అంటే క్షీణించనది. అతడు సదా శక్తిమంతుడు

364. Rōhitaḥ: One who assumed the form of a kind of fish called Rohita.

364 ఓం రోహితః - అతడు రోహిత అనబడే చేప ఆకృతిని దాల్చినవాడు

సమన్వయము: రోహిత అంటే ఎర్రనిది. కావున అతడు ఎర్రని ఛాయ గలవాడని కూడా అర్థం చెప్పుకోవచ్చు.

365. Mārgaḥ: One who is sought after by persons seeking Moksha or Liberation.

365 ఓం మార్గః - అతడు మోక్షము గోరే వారలచే పూజింపబడువాడు

366. Hetuḥ: One who is both the instrumental and the material cause of the universe.

366 ఓం హేతుః - అతడు విశ్వమునకు నిమిత్త, ఉపాదాన కారణములు

367. Damodaraḥ: One who has very benevolent mind because of disciplines like self-control.

367 ఓం దామోదరః - అతడు సమ, దమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానాల వలన నిగ్రహము కలిగి ఉన్నతమైన మనస్సు గలవాడు

సమన్వయము: ఉదరము అంటే కుక్షి; అతని ఉదరములో అన్నీ ఉన్నవని వేరొక అర్థము

368. Sahaḥ: One who subordinates everything.

368 ఓం సహః - అతడు అన్నిటికీ సహాయ పడువాడు

369. Mahīdharaḥ: One who props up the earth in the form of mountain.

369 ఓం మహీ ధరః - అతడు భూమిని పర్వతమువలె మోసినవాడు

370. Mahābhāgaḥ: He who, taking a body by His own will, enjoys supreme felicities.

370 ఓం మహాభాగః - అతడు తన ఇచ్చాను సారము దేహమును దాల్చి మిక్కిలి ఆనందమును పొందువాడు

సమన్వయము: భాగ అంటే విభజింపబడునది. అవతారము దాల్చినప్పుడు విష్ణువు తన నుండి తానే విభజింపబడతాడు. అలాగే సృష్టి అంతా అతని భాగాలే.

371. Vegavān: One of tremendous speed.

371 ఓం వేగవాన్ - అతడు అతి వేగవంతుడు

372. Amitāśanaḥ: He who consumes all the worlds at the time of Dissolution.

372 ఓం అమితాశనః - అతడు సృష్టి లయములో సకల విశ్వములను తన యందు తీసుకొనువాడు

సమన్వయము: ఆశన అంటే పిడిగు; అతడు ప్రళయ కాలములో పిడుగు వంటివాడు.

udbhavaḥ, kṣōbhaṇō devaḥ śrīgarbhaḥ parameśvaraḥ,

karaṇaṁ kāraṇaṁ kartā vikartā gahanō guhaḥ. (41)

373. Udbhavaḥ: One who is the material cause of creation.

373 ఓం ఉద్భవః - అతడు సృష్టికి ఉపాదాన కారణము

374. Kṣōbhaṇaḥ: One who at the time of creation entered into the Purusha and Prakriti and caused agitation.

374 ఓం క్షోభణః - అతడు సృష్టి ఆదియందు పురుషుడు, ప్రకృతిలో ప్రవేశించి వాటిని ప్రకోపించెను

375. Devaḥ: 'Divyati' means sports oneself through creation and other cosmic activities.

375 ఓం దేవాః - అతడు సృష్టి మొదలగు వాటియందు క్రీడించువాడు

376. Śrīgarbhaḥ: One in whose abdomen (Garbha) Shri or His unique manifestation as Samsara has its existence.

376 ఓం శ్రీగర్భః - అతని కుక్షిలో శ్రీ మరియు లోకములున్నవి

377. Parameśvaraḥ: 'Parama' means the supreme. 'Ishvarah' means one who hold sway over all beings.

377 ఓం పరమేశ్వరః - అతడు సకల జీవులను పాలించే గొప్ప శక్తి

378. Karaṇam: He who is the most important factor in the generation of this universe.

378 ఓం కరణం - అతడు సృష్టి ఆవిర్భావములో నిమిత్త, ఉపాదాన కారణము

379. Kāraṇam: The Cause – He who causes others to act.

379 ఓం కారణం - అతడు కర్మలకు కారకుడు

380. Kartā: One who is free and is therefore one's own master.

380 ఓం కర్తా - అతడు స్వతంత్రుడు; అన్నిటికీ కర్త

381. Vikartā: One who makes this unique universe.

381 ఓం వికర్తా - అతడు విశ్వాన్ని విలక్షణంగా చేసినవాడు

సమన్వయము: వికర్త అంటే విశ్వకర్మతో విశేషంగా చెక్కబడినది. కాబట్టి విశ్వం విలక్షణమైనది

382. Gahanaḥ: One whose nature, greatness and actions cannot be known by anybody.

382 ఓం గహనః - అతని తత్త్వము, కర్మలు, గొప్పతనము ఇతరులకు తెలియదు

సమన్వయము: గహన అంటే దీనిలోనికి ప్రవేశించుట దుర్గమము. దట్టమైనది. అడవి. కావున అతడు అతి కష్టముతో తెలియబడేవాడు.

383. Guhaḥ: One who hides one's own nature with the help of His power of Maya.

383 ఓం గుహః - అతని తత్త్వము మాయచే కప్పబడి యున్నది

vyavasāyō vyavasthānaḥ saṁsthānaḥ sthānadō dhruvaḥ,

pararddhiḥ paramaspaṣṭastuṣṭaḥ puṣṭaḥ śubhekṣaṇaḥ. (42)

384. Vyavasāyaḥ: One who is wholly of the nature of knowledge.

384 ఓం వ్యవసాయః - అతడు సంపూర్ణ జ్ఞానము

385. Vyavasthānaḥ: He in whom the orderly regulation of the universe rests.

385 ఓం వ్యవస్థానః - అతనిలో సృష్టి క్రమము యుండెడిది

సమన్వయము: వ్యవసాయ అంటే ప్రయత్నము, కృషి, విశిష్టమైన కార్యము. అతడే సృష్టి, స్థితి, లయ కారుడు కాబట్టి అతడు వ్యవస్థాన అనబడేవాడు

386. Sāṁsthānaḥ: One in whom all beings dwell in the states of dissolution.

386 ఓం సంస్థానః - ప్రళయ కాలమున అతని యందు జీవులు వసించెదరు

సమన్వయము: సంస్థాన అంటే మృత్యువు అనే అర్థం ఇక్కడ వర్తిస్తుంది. అతడు సృష్టి లయమందు అన్ని జీవులను సంహరించేవాడు. భాగవత అష్టమ స్కంధంలో మత్స్యావతారము వివరింపబడినది. ఒకమారు బ్రహ్మ దేవుడు నిద్రించుచుండగా వేదములు ఆయన నోటినుండి జారి పడిపోయెను. వాటిని హయగ్రీవుడను రాక్షసుడు అపహరించెను. అప్పుడు విష్ణువు శఫరి యను మత్స్య రూపమును ధరించి హయగ్రీవుని నుండి వేదములను గ్రహించి బ్రహ్మ దేవునికి ఇచ్చెను. పిదప సత్యవ్రతుడను రాజర్షిని ఒక పెద్ద నావను నిర్మించి అందులో ఓషధులను, జీవులను ప్రవేశపెట్టమని ఆజ్ఞ ఇచ్చెను. ఏడు రోజుల తరువాత ప్రళయము వచ్చి సముద్రములు పొంగెను. అప్పుడు విష్ణువు చేప రూపమును ధరించి నావను వాసుకి అనే సర్పముతో తన శృంగమునకు కట్టి రక్షించెను. (ఇది Ark of Noah కధవలె ఉండును) ఇక్కడ ఏడు సంఖ్య యొక్క విశిష్ఠత ఏమిటంటే యోగ స్థితిలో యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులలో ధ్యానము ఏడవ సోపానమై యున్నది. అంటే ప్రళయము సంభవించినపుడు ధ్యానమే శరణ్యము.

ధ్యాన స్థితి నిశ్చలముగా ఉండాలి. అందువలన నిర్మల సమాధి కలుగుతుంది. ధ్యానము చెదిరిపోవచ్చు. కాబట్టి సద్విషయము లనేది ఓషధులను వెంట పెట్టుకుని, మహర్షులనెడి సత్సంగముచే ప్రేరితుడై, ధ్యానమనెడి నావపై ఆశీనుడై ఆనంద యాత్ర చెయ్యవలెను. వాయు వేగమునకు నావ కదిలినట్లు, పూర్వ వాసనల వలన ధ్యానము వక్రించ వచ్చు. సూక్ష్మ రూపములోనున్న అహంకారమే దానికి కారణము. అప్పుడు భగవత్ కృపయనెడి శృంగమును అహంకారమనెడి వాసుకి ద్వారా ధ్యానజీవన మనెడి నావకు తగిలించవలెను. ఇక ఆ క్షణము నుండి దైవకృపయే మన బ్రతుకును నడిపిస్తుంది.

387. Sthānadaḥ: One who gives their particular status to persons like Dhruva according to their Karma.

387 ఓం స్థానదః - అతడు కర్మానుసారము జీవుల స్థితిగతులను నిర్ణయించువాడు

సమన్వయము: స్థాన అంటే ఉనికి. జీవులకు ఉనికిని ప్రసాదించేవాడు అతడే

388. Dhruvaḥ: One who is indestructible.

388 ఓం ధృవః - అతడు నాశము లేనివాడు

389. Pararddhiḥ: One who possesses lordliness of this most exalted type.

389 ఓం పరర్ధిః - అతడు ఉత్కృష్టమైన శక్తి

సమన్వయము: అర్థి అంటే అడిగేవాడు లేదా కోరిక. అతడు అర్థించిన వారి కోరికలను తీర్చేవాడు.

390. Paramaspaṣṭaḥ: One in whom 'Para' or supremely glorious 'Ma'or Lakshmi dwells. Or one who is the greatest of all beings without any other's help.

390 ఓం పరమస్పష్టః - అతడు ఎవ్వరి సహాయము లేకనే గొప్ప శక్తిమంతుడు; అతనిలో లక్ష్మీ దేవి నివసించేది

సమన్వయము: స్పష్ట అంటే వెల్లడి అయినది లేదా వ్యక్త మైనది.

391. Tuṣṭaḥ: One who is of the nature of supreme.

391 ఓం తుష్టః - అతడు గొప్పదైన స్వరూపము గలవాడు

సమన్వయము: తుష్ట అంటే సంతోషము పొందినవాడు. అతడు అందరినీ సంతోష పరిచేవాడు

392. Puṣṭaḥ: One who in fills everything.

392 ఓం పుష్టః - అతడు జీవులను పోషించేవాడు

సమన్వయము: పుష్ట అంటే పోషింప బడినది

393. Śubhekṣaṇaḥ: One whose Ikshanam or vision bestows good on all beings that is, gives liberation to those who want Moksha and enjoyments to those who are after it, and also cuts asunder the knots of the heart by eliminating all doubts.

393 ఓం శుభేక్షణః - అతని కన్నుల కటాక్షమముతో సద్గుణములు, మోక్షము ప్రసాదించగలడు; బంధములు త్రెంచగలడు

rāmō virāmō virajō mārgō neyō nayōnayaḥ,

vīraḥ śaktimatāṁ śreṣṭhō dharmō dharmaviduttamaḥ. (43)

394. Ramaḥ: The eternally blissful one in whom the Yogis find delight.

394 ఓం రామః - అతడు నిత్యము మోదముతో నుండి యోగులను సంతోష పరిచేవాడు

395. Virāmaḥ: One in whom the Virama or end of all beings takes place.

395 ఓం విరామః - అతనిలో జీవులన్నీ విశ్రాంతి పొందేవి

396. Virajaḥ: One in whom the desire for enjoyments has ceased

396 ఓం విరజః - అతనిలో ఆనందమునకై వాంఛలు లేవు

సమన్వయము: విరజ అంటే వైకుంఠమును చేరుటకు దాటవలసిన ఒక నది

397. Mārgaḥ: The path.

397 ఓం మార్గః - అతడు జీవులకు సుపథము

398. Neyaḥ: One who directs or leads the Jiva to the Supreme Being through spiritual realization.

398 ఓం నేయః - అతడు జీవులకు ఆధ్యాత్మిక జ్ఞానము నొసగి బ్రహ్మన్ వైపు నడిపించును

399. Nayaḥ: One who leads, that is, who is the leader in the form of spiritual illumination.

399 ఓం నయః - అతడు ఆధ్యాత్మిక జ్ఞాన మొసగే గొప్ప నేత

400. Anayaḥ: One for whom there is no leader.

400 ఓం అనయః - అతనిని మించి నాయకులు లేరు

401. Vīraḥ: One who is valorous.

401 ఓం వీరః - అతడు గొప్ప వీరుడు

402. Śaktimatāṁ śreṣṭhaḥ: One who is the most powerful among all powerful beings like Brahma.

402 ఓం శక్తిమతాం శ్రేష్ఠః - అతడు శక్తిమంతులను అతిశయించి యున్నవాడు

403. Dharmaḥ: One who supports all beings.

403 ఓం ధర్మః - అతడు అన్ని జీవులకు ఆధారము

404. Dharma-viduttamaḥ: The greatest of knower of Dharma. He is called so because all the scriptures consisting of Shrutis and Smrutis form His commandments.

404 ఓం ధర్మ విదుత్తమః - అతడు గొప్ప ధార్మికుడు; శృతి, పురాణములలో ధర్మములు అతని చెప్పినవే

సమన్వయము: ధర్మ + విద్ + ఉత్తమ అని విశ్లేషిస్తే విద్ అంటే జ్ఞానము. అంటే అతడు ధర్మము గూర్చి సంపూర్ణ జ్ఞానము కలవాడు.

vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pṛthuḥ,

hiraṇyagarbhaḥ śatrughnō vyāptō vāyuradhōkṣajaḥ. (44)

405. Vaikuṇṭhaḥ: The bringing together of the diversified categories is Vikuntha. He who is the agent of it is Vaikunthah.

405 ఓం వైకుంఠః - అతడు వేర్వేరు తత్త్వములను ఒకే త్రాటిపై నడిపించేవాడు

406. Puruṣaḥ: One who existed before everything.

406 ఓం పురుషః - అతడు సృష్టి ఆది యందు ఉన్నవాడు

407. Prāṇaḥ: One who lives as Kshetrajana (knower in the body) or one who functions in the form of vital force called Prana.

407 ఓం ప్రాణః - అతడు ప్రాణమును నడిపించువాడు

408. Prāṇadaḥ: One who is the giver of life.

408 ఓం ప్రాణదః - అతడు ప్రాణమును ప్రసాదించేవాడు

409. Praṇavaḥ: One who is praised or to whom prostration is made with Om.

409 ఓం ప్రణవః - అతడు పొగడబడేవాడు; ఓంకారముతో కొలవబడేవాడు

410. Pṛthuḥ: One who has expanded himself as the world.

410 ఓం పృథుః - అతడు తనను విశ్వమంతా వ్యాప్తి చేసుకొన్నవాడు

సమన్వయము: పృథు అంటే పేరు మోసినవాడు, రాజు, గొప్పదైనది అని నిఘంటువు చెప్తుంది. అతడు గొప్పవారికన్నా గొప్పవాడు.

411. Hiraṇyagarbhaḥ: He who was the cause of the golden-coloured egg out of which Brahma was born.

411 ఓం హిరణ్యగర్భః - అతడు బ్రహ్మ ఉద్భవించిన స్వర్ణ వర్ణములోనుండే అండమునకు కారకుడు

సమన్వయము: ఇక్కడ హిరణ్య అంటే బంగారము. గర్భ అంటే బిడ్డను ధరించినది. కాబట్టి ఇక్కడ అన్వయము చేసుకొనేది బంగారు రంగు గల గ్రుడ్డు నుంచి బ్రహ్మను పుట్టించినవాడు.

412. Śatrughnaḥ: One who destroys the enemies of the Devas.

412 ఓం శత్రుజ్ఞః - అతడు దేవతల శత్రువులను సంహరించువాడు

413. Vyāptaḥ: One who as the cause pervades all effects.

413 ఓం వ్యాప్తః - అతడు కార్య-కారణాలలో వ్యాపించి ఉన్నవాడు

414. Vāyuḥ: One who moves towards His devotees.

414 ఓం వాయుః - అతడు తన భక్తులవైపు వెళ్ళే వాడు

415. Adhokṣajaḥ: He is Adhokshaja because he undergoes no degeneration from His original nature.

415 ఓం అధోక్షజః - అతడు తన మూల తత్త్వము నుండి ఎటువంటి క్షయము నొందనివాడు

సమన్వయము: అధోక్షజ అంటే ఇంద్రియములకు(తో)(ద్వారా) స్వరూపము తెలియనివాడు. మనకు ఇంద్రియముల ద్వారా వచ్చేది ప్రత్యక్ష జ్ఞానం. విష్ణువు అలా తెలియబడేవాడు కాడు.

tuḥ sudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ,

ugraḥ saṁvatsarō dakṣō viśrāmō viśvadakṣiṇaḥ. (45)

416. Ṛtuḥ: One who is of the nature of Kala (time) which is indicated by the word Ritu or season.

416 ఓం ఋతుః - అతడు కాల స్వరూపము

417. Sudarśanaḥ: One whose Darshana or vision that is knowledge, bestows the most auspicious fruit Moksha.

417 ఓం సుదర్శనః - అతని దర్శనము మిక్కిలి ఉత్కృష్టమైన మోక్షమును ప్రసాదించేది

సమన్వయము: సు + దర్శన అని సంధి చేస్తే: సు అంటే శుభకరమైనది. దర్శనము అంటే కనిపించేది

418. Kālaḥ: One who measures and sets a limit to everything.

418 ఓం కాలః - అతడు ప్రతిదానికి కాల పరిమితిని నిర్ణయించేవాడు

419. Parameṣṭhī: One who dwells in his supreme greatness in the sky of the heart.

419 ఓం పరమేష్ఠీ - అతడు జీవుల దహరాకాశంలో నివసించేవాడు

సమన్వయము: నిఘంటువు పరమేష్ఠీ అంటే బ్రహ్మ అని చెప్తుంది. విష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మ జీవులను సృష్టిస్తాడు. బ్రహ్మ మానస పుత్రులు మొదలుకొని అనేక జీవులను సృష్టించేడు. కానీ ఆ జీవులలో ఆత్మ వలెనుండి వాటిని నడిపించేది విష్ణుడే.

420. Parigrahaḥ: One who, being everywhere, is grasped on all sides by those who seek refuge in Him. Or one who grasps or receives the offerings made by devotees.

420 ఓం పరిగ్రహః - అతని ఆశ్రయము పొందుటకు జీవులచే పరిగ్రహింపబడేవాడు; భక్తులొసగే పదార్థాలను పరిగ్రహించేవాడు

సమన్వయము: పరిగ్రహము అంటే ప్రేమతో పుచ్చుకొనుట. విష్ణువు భక్తిప్రపత్తులతో తనకిచ్చే పుష్పం, తోయం, దీపం, హారతి మొదలైన వాటిని ప్రేమతో స్వీకరిస్తాడు.

421. Ugraḥ: One who is the cause of fear even to beings like Sun.

421 ఓం ఉగ్రః - అతడు జీవులలో పాపభీతిని కలిగించువాడు

422. Saṁvatsaraḥ: One in whom all beings reside.

422 ఓం సంవత్సరః - అతనిలో అన్ని జీవులు ఉండేవి

సమన్వయము: ఇక్కడ సం + వత్సర అని విడదీస్తే, వత్సర అంటే నక్షత్ర దేవగణములు ఇందులో నివసించేది.

423. Dakṣaḥ: One who augments in the form of the world.

423 ఓం దక్షః - అతడు విశ్వరూపుడై ఉన్నవాడు

సమన్వయము: దక్ష అంటే సమర్థుడు, నిపుణుడు. విష్ణువు దక్షులలో ప్రప్రధముడు.

424. Viśrāmaḥ: One who bestows Vishrama or liberation to aspirants who seek relief from the ocean of Samsara with its waves of various tribulations in the from of Hunger, Thirst etc., and difficulties like Avidya, pride, infatuation etc.

424 ఓం విశ్రామః - అతడు సంసార చక్రములో ఆకలి, దప్పిక మొదలగు వాటితో బాధింపబడే జీవులకు ఉపసమనమొసగెడి వాడు

425. Viśvadakṣiṇaḥ: One who is more skilled (Daksha) than every one. Or One who is proficient in everything.

425 ఓం విశ్వదక్షిణః - అతడు ప్రతి విషయమునందు కౌశల్యము గలవాడు

సమన్వయము: విశ్వ + దక్షిణ . దక్షిణ యొక్క సామాన్య అర్థం పరకార్యములందు ఉత్సాహము చూపువాడు; సరళస్వభావుడు. కానీ దక్ష అంటే సమర్థుడు. ఈ విధంగా విష్ణువు ఉత్సాహము, కౌశల్యము గలవాడు

vistāraḥ sthāvaraḥsthāṇuḥ pramāṇaṁ bījamavyayam,

arthōnarthō mahākōśō mahābhōgō mahādhanaḥ. (46)

426. Vistāraḥ: One in whom all the worlds have attained manifestation.

426 ఓం విస్తారః - అతని యందు అన్ని విశ్వాలు వ్యక్తమయ్యేవి

సమన్వయము: విస్తారః అంటే విఱివిగా ఉండేది.

427. Sthāvaraḥ-sthāṇuḥ: One who is firmly established is Sthavara, and in whom long lasting entities like earth are established in Sthanu. The Lord is both these.

427 ఓం స్థావరః స్థాణుః - అతడు అన్ని ఆత్మ అనాత్మలయందు ప్రతిష్ఠితమైనవాడు

సమన్వయము: స్థావరజంగములు అంటే కదలనివి, కదిలేవి. ఉదాహరణకి ఒక కొండ కదలనిది; జంతువు కదిలేది. కావున స్థావరమంటే విష్ణువు అన్నిటిలోనూ ప్రతిష్ఠితమైనవాడు. స్థాణు అంటే కూడా స్థిరమైనది.

428. Pramāṇaṁ: One who is of the nature of pure consciousness.

428 ఓం ప్రమాణం - అతడు శుద్ధ చైతన్యము

సమన్వయము: ప్రమాణములు అనేకము: ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ధి, సంభవము, ఐతిహ్యము మొదలగునవి. వీటన్నిటికీ మూలము విష్ణువే అని ఈ నామము యొక్క అర్థము

429. Bījamavyayam: One who is the seed or cause of Samsara without Himself undergoing any change.

429 ఓం బీజమవ్యయం - అతడు మార్పు లేకుండానే సంసారమునకు బీజము వంటివాడు

సమన్వయము: బీజమంటే విత్తనము, దేని నుంచి సమస్తము ఉత్పన్నమవుతున్నదో. అవ్యయము అంటే వ్యయము కానిది, అనగా మార్పు లేనిది. కావున విష్ణువుకి ఈ నామము సరి యైనది.

430. Arthaḥ: One who is sought (Arthita) by all, as He is of the nature of bliss.

430 ఓం అర్థః - అతడు అందరిచే అడుగబడేవాడు; అతడు ఆనంద స్వరూపుడు

సమన్వయము: అర్థ అంటే అర్ధించడం లేదా ఒకటి కోరుకోవడం. అతనిని అందరూ ఏదో ఒక కోరిక కోరాలనుకుంటారు.

431. Anarthaḥ: One who, being self-fulfilled, has no other Artha or end to seek.

431 ఓం అనర్థః - అతడు సంతృప్తుడై ఏదీ కోరని వాడు

సమన్వయము: అనర్థ అంటే నిఘంటువు చెప్పేది: అర్థము లేనిది; నిష్ప్రయోజనము; నిరర్థకము. కానీ ఇక్కడ తీసికోవలసినది అన + అర్థ. అంటే ఏ కోరికా లేనివాడు.

432. Mahākōśaḥ: One who has got as His covering the great Koshas like Annamaya, Pranamaya etc.

432 ఓం మహాకోశః - అతడు పంచ కోశములచే (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ) కప్పబడినవాడు

433. Mahābhōgaḥ: One who has Bliss as the great source of enjoyment.

433 ఓం మహాభోగః - అతడు గొప్ప భోగి

434. Mahādhanaḥ: One who has got the whole universe as the wealth (Dhana) for His enjoyment.

434 ఓం మహా ధనః - అతడు సర్వ సృష్ఠి ధనముగా గలవాడు

anirviṇṇaḥ sthaviṣṭhōbhūrdharmayūpō mahāmakhaḥ.

nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmaḥ samīhanaḥ. (47)

435. Anirviṇṇaḥ: One who is never heedless, because He is ever self fulfilled.

435 ఓం అనిర్విణ్ణః - అతడు సదా ఆత్మ సంతృప్తితో నుండేవాడు

సమన్వయము: అనిర్విణ్ణ అంటే దుఃఖము లేనివాడు; విశ్రాంతి లేనివాడు.

436. Sthaviṣṭhaḥ: One of huge proportions, because He is in the form of cosmic person.

436 ఓం స్థవిష్ఠః - అతడు విశ్వవ్యాప్తుడై పెద్ద ఆకారము గలవాడు

సమన్వయము: స్తవిష్ఠమంటే మిక్కిలి స్థూలమైనది, గొప్పది. విశ్వమంతా విష్ణువు యొక్క ఆకారము కనుక దీనిలో అతిశయము లేదు.

437. Abhūḥ: One without birth. Or one has no existence.

437 ఓం అభూః - అతనికి పుట్టుక లేదు

438. Dharma-yūpaḥ: The sacrificial post for Dharmas, that is, one to whom all the forms of Dharma, which are His own form of worship, are attached, just as a sacrificial animal is attached to a Yupa or a sacrificial post.

438 ఓం ధర్మ యూపః - అతడు ధర్మానికి కట్టుబడినవాడు

సమన్వయము: యూప మంటే యజ్ఞములో బలి పశువును కట్టి యుంచే ఒక స్థంబము. ఎలాగైతే పశువు కట్టబడియున్నదో, విష్ణువు ధర్మానికి కట్టుబడినవాడు.

439. Mahāmakhaḥ: One by offering sacrifices to whom, those sacrifices deserve to be called great, because they well give the fruit of Nirvana.

439 ఓం మహామఖః - అతడు త్యాగమునకు బదులుగా ముక్తినిచ్చేవాడు

సమన్వయము: ఇక్కడ మఖ అంటే యజ్ఞము. దేవతలు యజ్ఞము చేసి హవిస్సు ఇస్తే ముక్తి నిస్తారు. అలాంటి దేవతలలో విష్ణువు శ్రేష్ఠుడు.

440. Nakṣatra-nemiḥ: The heart of all nakshatras.

440 ఓం నక్షత్ర నేమిః - అతడు నక్షత్రములకు మూలాధారము

సమన్వయము: నేమి అంటే నిఘంటువు చెప్పేవి: చక్రమును తీసుకెళ్లునది. బండి ఆకు; అర్ధభాగము, సగము. కాబట్టి విష్ణువు నక్షత్రాలను ఒక చక్రం బండిని ఎలా నడిపిస్తుందో ఆ విధంగా నడిపించేవాడు.

441. Nakṣatrī: He is in the form of the nakshatra, Moon.

441 ఓం నక్షత్రీ - అతడు నక్షత్ర స్వరూపము గలవాడు

442. Kṣamaḥ: One who is clever in everything.

442 ఓం క్షమః - అతడు దివ్యమైన మేధస్సు గలవాడు

సమన్వయము: క్షమ అంటే ఓర్పు, సహనం. అతనికి ఎంతో క్షమ ఉండబట్టే పాపాలు చేసినవారికి కూడా తనని చేరుకొనే మార్గాన్ని ప్రసాదిస్తాడు.

443. Kṣāmaḥ: One who remains in the state of pure self after all the modifications of the mind have dwindled.

443 ఓం క్షామః - అతడు మనస్సులోని వికారములు తొలగి ఆత్మను అవలోకనము చేసెడివాడు

సమన్వయము: క్షామ అంటే క్షీణించినవాడు. దుర్బలుడు. అతడు భక్తులను కష్టాల నుంచి తప్పించగల సమర్థత యున్నవాడు.

444. Samīhanaḥ: One who exerts will for creation, etc.

444 ఓం సమీహనః - అతడు సృష్టిని కాంక్షించిన వాడు

సమన్వయము: సమీహనము అంటే ఆశ గలది. కావున విష్ణువు సృష్టి, స్థితి, లయ కార్యములలో మిక్కిలి ఉత్సాహము గలవాడు.

yajña ijyō mahejyaśca kratuḥ satraṁ satāṁ gatiḥ,

sarvadarśī vimuktātmā sarvajñō jñānamuttamam. (48)

445. Yajñaḥ: One who is all-knowing.

445 ఓం యజ్ఞః - అతడు సర్వజ్ఞుడు

446. Ijayaḥ: One who is fit to be worshipped in sacrifices.

446 ఓం ఇజ్యోః - అతడు యజ్ఞములలో పూజింప దగినవాడు

సమన్వయము: ఇజ్య అంటే పూజింపదగినవాడు

447. Mahejyaḥ: He who, of all deities worshipped, is alone capable of giving the blessing of liberation.

447 ఓం మహేజ్యః - అతడు తక్కిన దేవతలు ఇవ్వలేని మోక్ష ప్రదాత

448. Kratuḥ: A Yajna in which there is a sacrificial post is Kratu.

448 ఓం క్రతుః - అతడు యజ్ఞములో క్రతువు

సమన్వయము: క్రతువు అంటే యూపస్తంభంతో కూడిన యజ్ఞ కలాపం. విష్ణువు అట్టి యజ్ఞ స్వరూపము (యూప స్థంబానికి బలిపశువు కట్టబడుతుంది).

449. Satraṁ: One who is of the nature of ordained Dharma.

449 ఓం సత్రం - అతడు ధర్మాన్ని అనుసరించేవాడు

సమన్వయము: సత్రం అంటే సాధారణ అర్థం యాత్రికులుండే ధర్మ శాల. కానీ ఇక్కడ విశేష అర్థం: మంచివారిని కాపాడునది. అంటే ధర్మ, కర్మాదులతో విష్ణువు ముడిపడియున్నాడు.

450. Satāṁ-gatiḥ: One who is the sole support for holy men who are seekers of Moksha.

450 ఓం సతాం గతిః - అతడు మోక్షమును కోరే యోగ పుంగవులకు ఏకైక ఆధారము

సమన్వయము:

451. Sarva-darśī: One who by His inborn insight is able to see all good and evil actions of living beings.

451 ఓం సర్వ దర్శీః - అతడు జీవుల పాపపుణ్యములను పర్యవేక్షించేవాడు

452. Vimuktātmā: One who is naturally free.

452 ఓం విముక్తాత్మా - అతడు సర్వ స్వతంత్రుడు

453. Sarvagñaḥ: One who is all and also the knower of all.

453 ఓం సర్వజ్ఞః - అతడు అన్నిటి గురించి తెలిసినవాడు

454. Jñānam-uttamam: That consciousness which is superior to all, birthless, unlimited by time and space and the cause of all achievements.

454 ఓం జ్ఞానం ఉత్తమం - అతడు సర్వ సృష్టి గావించిన ఉత్తమమైన జ్ఞాన స్వరూపుడు

suvrataḥ sumukhaḥ sūkṣmaḥ sughōṣaḥ sukhadaḥ suhṛt,

manōharō jitakrōdhō vīrabāhurvidāraṇaḥ. (49)

455. Suvrataḥ: One who has take the magnanimous vow to save all refuge-seekers.

455 ఓం సువ్రతః - అతడు తన ఆశ్రయము కాంక్షించే భక్తులకు మేలు చేయుటకై కంకణము కట్టుకొన్నవాడు

సమన్వయము: వ్రతము అంటే నోము, పుణ్య కర్మము చెయ్యాలనే ధృఢ నిశ్చయము.

456. Sumukhaḥ: One with a pleasant face.

456 ఓం సుముఖః - అతడు ఆహ్లాదకరమైన ముఖము గలవాడు

457. Sūkṣmaḥ: One who is subtle because He is without any gross causes like sound etc.

457 ఓం సూక్ష్మః - అతడు సూక్ష్మ రూపము ధరించగలడు

458. Sughōṣaḥ: One whose auspicious sound is the Veda. Or one who has got a deep and sonorous sound like the clouds.

458 ఓం సుఘోషః - అతని నుండి వేదము వినబడునది; ఉరుములవలె శబ్దము చేయువాడు

సమన్వయము: ఘోష అంటే మేఘ గర్జనము. అతని నుండి వేదాలు పుడుతుంటే ఉఱుముల వలె శబ్దము వచ్చును.

459. Sukhadaḥ: One who gives happiness to good people.

459 ఓం సుఖదః - అతడు భక్తులకు ఆనంద మిచ్చేవాడు

460. Suhṛt: One who helps without looking for any return.

460 ఓం సుహృత్ - అతడు ప్రత్యుపకారము కోరక ఉపకారము చేసేవాడు

సమన్వయము: సుహృత్ అంటే మంచి హృదయము గలవాడు, స్నేహితుడు

461. Manōharaḥ: One who attracts the mind by His incomparable blissful nature.

461 ఓం మనోహరః - తన ఉత్కృష్టమైన తత్త్వముతో అతడు ఇతరుల మనస్సులను ఆకట్టుకొనేవాడు

462. Jitakrōdhaḥ: One who has overcome anger.

462 ఓం జిత క్రోధః - అతడు క్రోధమును జయించినవాడు

సమన్వయము: జిత అంటే జయించడం; క్రోధ అంటే తీవ్రమైన కోపము. అతడు క్రోధాన్ని జయించినవాడు

463. Vīrabāhuḥ: One whose arms are capable of heroic deeds as demonstrated in his destruction of Asuras for establishing Vedic Dharma.

463 ఓం వీరబాహుః - అతడు మిక్కిలి శక్తివంతమైన బాహువులు గలవాడు

464. Vidāraṇaḥ: One who destroys those who live contrary to Dharma.

464 ఓం విదారణః - అతడు అధర్మముతో మెలగేవారిని సంహరించేవాడు

సమన్వయము: విదారణ అంటే చీల్చుట; చంపుట; యుద్ధము. అతడు పాపులను చీల్చి చెండాడేవాడు

svāpanaḥ svavaśo vyāpī naikātmā naikakarmakṛt,

vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ. (50)

465. Svāpanaḥ: One who enfolds the Jivas in the sleep of Ajnana.

465 ఓం స్వాపనః - అతడు అజ్ఞానులను ఆవరిస్తాడు

సమన్వయము: స్వాపన అంటే నిద్ర, కల. అది తామసము లేదా అజ్ఞానమును సూచిస్తుంది. అతడు అజ్ఞానులను లేవనెత్తేవాడు

466. Svavaśaḥ: One who is dominated by oneself and not anything else, as He is the cause of the whole cosmic process.

466 ఓం స్వావశః - అతడు వేరొకరిచే శాసించబడనివాడు; తనను వశములో ఉంచుకొనువాడు; అతడు సృష్టికి మూల కారణము

సమన్వయము: వశ అంటే అధీనంలో వున్నవాడు. విష్ణువు తన అధీనంలో వున్నవాడేగాని ఇతరుల ఆధీనంలో కాదు

467. Vyāpī: One who interpenetrates everything like Akasha.

467 ఓం వ్యాపీ - అతడు సర్వము వ్యాపించిన వాడు

468. Naikātmā: One who manifests in different forms as the subsidiary agencies causing the various cosmic processes.

468 ఓం నైకాత్మా - అతడు సృష్టికి తోడ్పడే వివిద సంస్థలుగా స్వరూపము దాల్చేవాడు

సమన్వయము: నైక అంటే అనేకమని అర్థము. అతడు అనేక ఆత్మలుగా వ్యక్తమయ్యేవాడు

469. Naikakarmakṛt: One who engages in innumerable activities in the process of creation, sustentation, etc.

469 ఓం నైక కర్మ కృత్ - అతడు విశ్వ సృష్టిస్థితులకై అనేక కర్మలు చేసేవాడు

సమన్వయము: నైక + కర్మ + కృత్ అని సంధి చెప్తే అతడు అనేక (నైక) కర్మలను చేసేవాడు (కృత్)

470. Vatsaraḥ: One in whom everything dwells.

470 ఓం వత్సరః - అతనిలో సృష్టి అంతా స్థితమై ఉంది

సమన్వయము: వత్సర అంటే నివాస యోగ్యమైన స్థలము. విష్ణువు కుక్షిలో సమస్త విశ్వాలూ ఉన్నాయి.

471. Vatsalaḥ: One who has love for His devotees.

471 ఓం వత్సలః - అతడు తన భక్తులయందు ప్రీతితో నుండెడివాడు

సమన్వయము: వత్సల అంటే వాత్సల్యము గలవాడు. కావున విష్ణువు భక్త వత్సలుడు.

472. Vatsī: One who protects those who are dear to Him.

472 ఓం వత్సీ - అతడు తన అనుంగులను రక్షించేవాడు

473. Ratnagarbhaḥ: The Ocean is so called because gems are found in its depths. As the Lord has taken the form of the ocean, He is called by this name.

473 ఓం రత్నగర్భాః - అతడు రత్నాలు లభ్యమయ్యే సముద్రము వంటివాడు

474. Dhaneśvaraḥ: One who is the Lord of all wealth.

474 ఓం ధనేశ్వరః - అతడు సర్వ సంపదలకు అధిపతి

dharmagubdharmakṛddharmī sadasatkṣaramakṣaram,

avijñātā sahasrāṁśurvidhātā kṛtalakṣaṇaḥ. (51)

475. Dharmagub: One who protects Dharma.

475 ఓం ధర్మగుబ్ - అతడు ధర్మాన్ని కాపాడేవాడు

476. Dharmakṛd: Though above. Dharma and Adharma, He performs Dharma in order to keep up the traditions in respect of it.

476 ఓం ధర్మకృద్ - అతడు సనాతన ఆచారాలను పాటించుటకు ధర్మమును అనుష్ఠించేవాడు

477. Dharmī: One who upholds Dharma.

477 ఓం ధర్మీ - అతడు ధర్మాన్ని పాటించేవాడు

478. Sat: The Parabrahman who is of the nature of truth.

478 ఓం సత్ - అతడు సత్య స్వరూపుడు

479. Asat: As the Aparabrahma has manifested as the world He is called Asat (not having reality).

479 ఓం అసత్ - అతడు మిథ్య ప్రపంచముగా వ్యక్తమైన కారణము వలన సత్ ఉనికి లేనివాడు

480. Kṣaram: All beings subjected to change.

480 ఓం క్షరం - అన్ని జీవులలో మార్పు జరిగేవి

సమన్వయము: క్షరమంటే కాల క్రమేణా క్షీణించేది.

481. Akṣaram: The changeless one.

481 ఓం అక్షరం - అతడు మార్పు లేనివాడు

482. Aviñātā: One who is without the attributes of a Jiva or vigyata like sense of agency, etc.

482 ఓం అవిజ్ఞాతా - అతడు జీవులకుండే లక్షణములు లేనివాడు

సమన్వయము: అవిజ్ఞాత అంటే తెలివి లేనివాడు. అది స్థావర జంగములకు వర్తిస్తుంది. కానీ విష్ణువు సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు.

483. Sahasrāṁśuḥ: One with numerous rays, that is the Sun.

483 ఓం సహస్రాంశుః - అతడు సూర్యునివలె అమిత తేజస్సు గలవాడు

సమన్వయము: అంశు అంటే కిరణము. సహస్రాంశు అంటే విష్ణువు అసంఖ్యాకమైన కిరణములతో గొప్ప కాంతితో భాసించేవాడు.

484. Vidhātā: One who is the unique support of all agencies like Ananta who bear the whole universe.

484 ఓం విధాత - అతడు సృష్టి భారమును తనపై నుంచుకొనువాడు

సమన్వయము: ధాత అంటే రక్షించువాడు.

485. Kṛtalakṣaṇaḥ: One who is of the nature of consciousness.

485 ఓం కృతలక్షణః - అతడు చైతన్య స్వరూపము

సమన్వయము: కృత అంటే చేయబడ్డది. పాప-పుణ్యాలు; కర్మఫలము; ఒక యుగము. లక్షణ అంటే వస్తు స్వరూపము తెలుపునది. విష్ణువు కర్మ ఫలమును ఇచ్చేవాడు అని సమన్వయము చేసుకోవచ్చు

gabhastinemiḥ sattvasthaḥ siṁhō bhūtamaheśvaraḥ,

didevō mahādevō deveśō devabhṛdguruḥ. (52)

486. Gabhastinemiḥ: He who dwells in the middle of Gabhasti or rays as the Sun.

486 ఓం గభస్తినేమిః - అతడు గభస్తిలో (కిరణాలలో) ఉండేవాడు

సమన్వయము: గభస్తి అంటే తేజోవంతమైన కిరణాలతో ఉండేవాడు.

487. Sattvasthaḥ: One who dwells specially in sattvaguna, which is luminous by nature.

487 ఓం సత్త్వస్థః - అతడు సత్త్వ గుణములో భాసిల్లువాడు

488. Simhaḥ: One who ahs irresistible power like a lion.

488 ఓం సింహః - అతడు సింహమువలె మిక్కిలి శక్తిమంతుడు

489. Bhūtamaheśvaraḥ: The supreme Lord of all beings.

489 ఓం భూతమహేశ్వరః - అతడు జీవులకు పరమావధి

490. Ādidevaḥ: He who is the first of all beings.

490 ఓం ఆదిదేవాః - అతడు అందరికన్నా ముందు ఉన్నవాడు

491. Mahādevaḥ: One whose greatness consists in His supreme self knowledge.

491 ఓం మహాదేవః - అతడు తన ఆత్మ స్వరూపం తెలిసికోవడం వల్ల గొప్పవాడు

492. Deveśaḥ: One who is the lord of all Devas, being the most important among them.

492 ఓం దేవేశః - అతడు దేవతలను పాలించేవాడు

సమన్వయము:దేవ + ఈశః అంటే దేవతలకు అధిపతి

493. Devabhṛd-guruḥ: Indra who governs the Devas is Devabhrut. The Lord is even that Indra's controller (Guru).

493 ఓం దేవభ్రుద్ గురుః - అతడు ఇంద్రుని కూడా శాసించేవాడు

uttarō gōpatirgōptā jñānagamyaḥ purātanaḥ,

arīrabhūtabhṛdbhōktā kapīndrō bhūridakṣiṇaḥ. (53)

494. Uttaraḥ: One who is Uttirna or liberated from Samsara.

494 ఓం ఉత్తరః - అతడు సంసార విముక్తుడు

సమన్వయము: నిఘంటువు చెప్పేది ఉత్తర అంటే ఉన్నతమైనది; శ్రేష్ఠమైనది. కావున విష్ణువుని మించి శ్రేష్ఠమైనది ఏదీ లేదు

495. Gōpatiḥ: Krishna who tends the cattle in the form of a Gopa. One who is the master of the earth.

495 ఓం గోపతిః - కృష్ణావతారంలో అతడు గోపాలుడుగా నుండెడివాడు; అతడు విశ్వమునకే గోపాలుడు

496. Gōptā: One who is the protector of all beings.

496 ఓం గోప్తా - అతడు అన్ని జీవులను రక్షించేవాడు

497. Jñānagamyaḥ: The Lord cannot be known through Karma or a combination of Karma and Jyana.

497 ఓం జ్ఞానమయః - అతడు కర్మజ్ఞానాలవలన తెలుసుకొనబడలేడు

498. Purātanaḥ: One who is not limited by time and who existed before anything else.

498 ఓం పురాతనః - అతడు కాల పరిధి లేనివాడు; అన్నిటికన్నా ప్రప్రథముడు

499. Śarīrabhūtabhṛd: One who is the master of the five Bhutas (elements) of which the body is made.

499 ఓం శరీర భూత భ్రుద్ - అతడు పంచభూతాత్మకమైన శరీరమునకు అధిపతి

500. Bhōktā: One who protects. Or one who is the enjoyer of infinite bliss.

500 ఓం భోక్తా - అతడు జీవులను రక్షించేవాడు; అపరిమితమైన ఆనందమును అనుభవించేవాడు

501. Kapīndraḥ: Kapi means Varah (boar). The word means, the Lord who is Indra and also one who manifested as Varaha or the Boar in one of the incarnations. Or it signifies His Rama incarnation in which He played the role of the master of the monkeys.

501 ఓం కపీంద్రః - అతడు అనేక అవతారములలో అడవి పంది రూపములో ఆవిర్భవించి, కోతులతో సహవాసము చేసినవాడు

502. Bhūridakṣiṇaḥ: One to whom numerous Dakshinas or votive offerings are made in Yajnas.

502 ఓం భూరి దక్షిణః - అతనికి యజ్ఞ యాగాదులలో అనేక దక్షిణలు ఇవ్వబడతాయి

సమన్వయము: భూరి అంటే బంగారం. కాబట్టి అతనికి ఎంతో విలువైనవి యజ్ఞాలలో దక్షిణగా ఇవ్వబడేవి

somapo’mṛtapaḥ sōmaḥ purujit purusattamaḥ,

vinayō jayaḥ satyasandhō dāśārhassātvatāṁ patiḥ. (54)

503. Sōmapaḥ: One who drinks the Soma in all Yajnas in the form of the Devata.

503 ఓం సోమపః - అతడు యజ్ఞములలో సోమ రసమును స్వీకరించేవాడు

సమన్వయము: సోమప యజ్ఞంలో సోమరసమును త్రాగువాడు అనేది నిఘంటువు చెప్పిన అర్థం.

504. Amṛtapaḥ: One who drinks the drink of immortal Bliss which is of one's own nature.

504 ఓం అమృతపః - అతడు అమృతమును ఆస్వాదించేవాడు

505. Sōmaḥ: One who as the moon invigorates the plants.

505 ఓం సోమః - అతడు చంద్రుని స్వరూపములో వృక్ష సంపత్తిని వృద్ధి చేసేవాడు

సమన్వయము: సోముడు అంటే చంద్రుడు.

506. Purujit: One who gains victory over numerous people.

506 ఓం పురుజిత్ - అతడు అనేకమందితో పోరాడి విజయము పొందినవాడు

సమన్వయము: పురు + జిత్ ; పురు అంటే అనేకమంది. జిత్ అంటే జయించినవాడు

507. Purushottamaḥ: As His form is of cosmic dimension He is Puru or great, and as He is the most important of all, He is Sattama.

507 ఓం పురుషోత్తమః - అతడు అందరిలోకి ప్రప్రథముడు

సమన్వయము: పురు అంటే అధికమైన; ఉత్తమ అంటే గొప్పదైన. ఇక్కడ పురుషుడు అన్నది మగ ఆడవాళ్ళకి వర్తిస్తుంది.

508. Vinayaḥ: One who inflicts Vinaya or punishment on evil ones.

508 ఓం వినయః - అతడు పాపులను శిక్షించు వాడు

సమన్వయము: తెలుగులో వినయ అంటే నమ్రత ను సూచిస్తుంది. కాని సంస్కృతంలో వినయ అంటే 1. నమ్రత్వమ్‌ -2. శిక్షా -3. ధర్మః -4. ఆచారః -5. ప్రశాంతిః కాబట్టి ఇక్కడపాపులను శిక్షించుట అనిఅర్థం చెప్పవచ్చు. అలాగే ధర్మాన్ని, ఆచారాలను కాపాడేవాడు అని కూడా చెప్పవచ్చు.

509. Jayaḥ: One who is victorious over all beings.

509 ఓం జయః - అతడు సర్వులపై విజయము సాధించ గలవాడు

510. Satyasandhaḥ: One whose 'Sandha' or resolve becomes always true.

510 ఓం సత్యసంధాః - అతని సంకల్పము సదా నెరవేరేది

సమన్వయము: సంధా అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి: బాగా వుంచబడునది. సాహచర్యము; స్థితి; ప్రతిజ్ఞ; స్థైర్యము; సంధ్య. అంటే అతను ఏదయితే ప్రతిజ్ఞ పూనేడో అది తప్పక నెరవేరుతుంది

511. Dāśārhaḥ: Dasha means charitable offering. Therefore, He to whom charitable offerings deserve to be made.

511 ఓం దాశార్హః - అతడు ఉదారముగా వస్తువులు దానము చేయువాడు; దానము చేయుటకు అర్హుడు

సమన్వయము: దాశార్హ అంటే దానమునకు యోగ్యుడు.

512. Sātvatāṁ-patiḥ: 'Satvatam' is the name of a Tantra. So the one who gave it out or commented upon it.

512 ఓం సాత్వతాం పతిః - అతడు తంత్రములకు అధిపతి

సమన్వయము: ఇక్కడ సాత్వత అంటే సత్త్వ గుణం కలవాడు. సాత్వత్ అంటే పరమేశ్వరుని ఉపాసకుడు. కాబట్టి అతడు వాటికి అధిపతి.

jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,

ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ. (55)

513. Jīvaḥ: One who as the Kshetragya or knower of the field or the body, is associated with the Pranas.

513 ఓం జీవాః - అతడు దేహము గూర్చి తెలిసినవాడు; ప్రాణమయుడు

514. Vinayitā-sākṣī: One who witnesses the Vinayita or worshipful attitude of all devotees.

514 ఓం వినయితా సాక్షిః - అతడు భక్తులలో వినయము చూసెడివాడు

515. Mukundaḥ: One who bestows Mukti or Liberation.

515 ఓం ముకుందః - అతడు ముక్తి ప్రదాయకుడు

516. Amitavikramaḥ: One whose three strides were limitless.

516 ఓం అమిత విక్రమః - అతడు మిక్కిలి పరాక్రమ వంతుడు

517. Ambhōnidhiḥ: One in whom the Ambas or all beings from Devas down dwell.

517 ఓం అంబోనిధిః - అతనిలో అన్ని జీవులు, దేవతలు వసించేవారు

సమన్వయము: ఆంబోహ్ అంటే సమూహము, గుంపు, సమ్మర్దము, బాహుళ్యము, పుష్కళము; కాబట్టి అతడు జీవ సమూహములకు నిలయము

518. Anantātmā: One who cannot be determined by space, time and causation.

518 ఓం ఆనంతాత్మా - అతడు దేశకాలాలకు, కారణ-కార్యాలకు అతీతుడు

519. Mahōdadhi-śayaḥ: One who lies in the water of Cosmic Dissolution into which all entities in the universe have been dissolved.

519 ఓం మహోదధి శయాః - అతడు లయములో సముద్ర జలములలో వసించేవాడు

సమన్వయము: మహోదధి అంటే గొప్ప సముద్రము. శయ అంటే పడుకొన్నవాడు

520. Antakaḥ: One who brings about the end of all beings.

520 ఓం అంతకః - అతడు జీవుల నంతము గావించువాడు

ajō mahārhaḥ svābhāvyō jitāmitraḥ pramōdanaḥ,

nandō nandanō nandaḥ satyadharmā trivikramaḥ. (56)

521. Ajaḥ: 'A' means Mahavishnu. So the word means one who is born of Vishnu i.e. Kama Deva.

521 ఓం అజః - అతని పుత్రుడు కామ దేవుడు

522. Mahārhaḥ: One who is fit for worship.

522 ఓం మహార్హః - అతడు పూజింప దగినవాడు

523. Svābhāvyaḥ: Being eternally perfect He is naturally without a beginning.

523 ఓం స్వాభావ్యః - అతడు ఆది లేనివాడు

524. Jitāmitraḥ: One who has conquered the inner enemies like attachment, anger, etc. as also external enemies like Ravana, Kumbhakarna etc.

524 ఓం జితామిత్రః - అతడు కామక్రోధాదులను జయించినవాడు

525. Pramōdanaḥ: One who is always joyous as He is absorbed in immortal Bliss.

525 ఓం ప్రమోదనః - అతడు ఎల్లప్పుడూ శాంత స్వరూపుడు

సమన్వయము: ప్రమోద అంటే సంతోషము; ఆనందము; కావున అతడు ఎల్లప్పుడూ తనలో తాను రమిస్తూ ఉండేవాడు

526. Ānandaḥ: One whose form is Ananda or Bliss.

526 ఓం ఆనందః - అతడు ఆనంద స్వరూపము

527. Nandanaḥ: One who gives delight.

527 ఓం నందనః - అతడు ఆహ్లాదము కలిగించేవాడు

సమన్వయము: నందన అంటే సంతోష పెట్టేవాడు. విష్ణువు భక్తులను సదా సంతోషపెట్టేవాడు

528. Nandaḥ: One endowed with all perfections.

528 ఓం నందః - అతడు సంపూర్ణుడు

సమన్వయము: నంద అంటే సంతోషించువాడు

529. Satyadharmā: One whose knowledge and other attributes are true.

529 ఓం సత్యధర్మా - అతని జ్ఞానము, లక్షణములు సత్యవంతమైనవి

530. Trivikramaḥ: One whose three strides covered the whole world.

530 ఓం త్రివిక్రమః - అతడు మూడు అడుగులతో సర్వ సృష్టిని ఆక్రమించిన వాడు

సమన్వయము: అతడు వామన అవతారంలో బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమి దానమడిగిన వాడు

maharṣiḥ kapilācāryaḥ kṛtajñō medinīpatiḥ,

tripadastridaśādhyakṣō mahāśṛṅgaḥ kṛtāntakṛt. (57)

531. Maharṣiḥ Kapilācāryaḥ: Kapila is called Maharshi because he was master of all the Vedas.

531 ఓం మహర్షిః కపిలాచార్యః - కపిలుడు సర్వ వేద పారంగుతుడు కావున మహర్షి అనబడెను

532. Kṛtajñaḥ: Kruta means the world because it is of the nature of an effect.

532 ఓం కృతజ్ఞః - అతడు సృష్టి కార్యమును చేసినవాడు

సమన్వయము: కృత అంటే చేయబడ్డది. సృష్టి కార్యానికి అతడే కారణము

533. Medinīpatiḥ: One who is the Lord of the earth.

533 ఓం మేదినీ పతిః - అతడు భూమికి అధిపతి

సమన్వయము: మేదినీ అంటే భూమి. అతడు భూలోకానికి అధిపతి

534. Tripadaḥ: One having three strides.

534 ఓం త్రిపదః - అతడు మూడు అడుగులు గలవాడు

సమన్వయము: అతడు వామన అవతారంలో బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమి దానమడిగిన వాడు

535. Tridaśādhyakṣaḥ: One who is the witness of the three states of waking, dream and sleep, which spring from the influence of the Gunas.

535 ఓం త్రిదశాధ్యక్షః - అతి త్రిగుణాత్మకములతో గూడిన మూడు అవస్థలకు (వేకువ, స్వప్న, సుషుప్తి) సాక్షి

536. Mahāśṛṅgaḥ: One with a great antenna.

536 ఓం మహాశృంగః - అతడు పెద్ద కొమ్ములతో నున్న వరాహ అవతారము ఎత్తినవాడు

సమన్వయము: శృంగము అంటే కొమ్ము

537. Kṛtānta-kṛt: One who brings about the destruction of the Kruta or the manifested condition of the universe.

537 ఓం కృతాన్త కృత్ - అతడు వ్యక్త ప్రపంచమును విలయము జేసెడివాడు

సమన్వయము: కృత్ + అంత + కృత అంటే కృత యుగమును అంతము చేసినవాడు; అదేవిధంగా అన్ని యుగాలను అంతము జేసేవాడు

mahāvarāhō gōvindaḥ suṣeṇaḥ kanakāṅgadī,

guhyō gabhīrō gahanō guptaścakragadādharaḥ. (58)

538. Mahā-varāhaḥ: The great Cosmic Boar.

538 ఓం మహా వరాహః - అతడు గొప్ప వరాహ మూర్తి

539. Gōvindaḥ: 'Go' means Words, that is the Vedic sentences. He who is known by them is Gōvindaḥ.

539 ఓం గోవిందః - అతడు గోవింద నామధేయుడు

540. Suṣeṇaḥ: One who has got about Him an armed guard in the shape of His eternal associates.

540 ఓం సుషేణః - అతని అంగరక్షకుడు సదా ఉండేవాడు

సమన్వయము: సుషేణుడు అనగా చక్కగా సేనను నడిపించువాడు; మంచి సేన కలవాడు

541. Kanakāṅgadī: One who has Angadas (armlets) made of gold.

541 ఓం కనకాంగది - అతని భుజకీర్తులు స్వర్ణముతో చేయబడినవి

సమన్వయము: కనక + అంగద అంటే చేతిపై ధరించే బంగారు ఆభరణాలు కలవాడు

542. Guhyaḥ: One who is to be known by the Guhya or the esoteric knowledge conveyed by the Upanishads. Or one who is hidden in the Guha or heart.

542 ఓం గుహ్యః - అతడు గుహ్యముగా తెలుసుకొనబడేవాడు; జీవుల హృదయంలో నివసించేవాడు

సమన్వయము: గుహ్యము అంటే రహస్యము

543. Gabhīraḥ: One who is of profound majesty because of attributes like omniscience, lordliness, strength, prowess, etc.

543 ఓం గభీరః - అతడు సులక్షణములతో నుండి రహస్యముగా తెలిసికొనబడేవాడు

సమన్వయము: గభీర అంటే అగమ్యమైనది లేదా లోతైనది. అతడు మిక్కిలి లోతైన మనస్సు గలవాడు

544. Gahanaḥ: One who could be entered into only with great difficulty. One who is the witness of the three states of waking, dreams and sleep as also their absence.

544 ఓం గహనః - అతడు అతి క్లిష్టముగా తెలిసికొనబడేవాడు; మూడు అవస్థలకు సాక్షి

545. Guptaḥ: One who is not an object of words, thought, etc.

545 ఓం గుప్తాః - అతడు పదములకు, ఆలోచనలకు అతీతుడు

546. Chakra-gadā-dharaḥ: One who has discus and Gada in hand.

546 ఓం చక్ర గదా ధరః - అతడు చక్రమును, గధను ధరించెడివాడు

vedhāḥ svāṅgo’jitaḥ kṛṣṇo dṛḍhaḥ saṅkarṣaṇo’cyutaḥ,

varuṇo vāruṇo vṛukṣaḥ puṣkarākṣo mahāmanāḥ. (59)

547. Vedhāḥ: One who does Vidhana or regulation.

547 ఓం వేధః - అతడు నియంత్రించేవాడు

సమన్వయము: వేధ అంటే బాధించేవాడు; అతడు పాపులను వేధించేవాడు.

548. Svāṅgaḥ: One who is oneself the participant in accomplishing works.

548 ఓం స్వాంగః - అతడు ఇతరుల సహాయము తీసికోక తనొక్కడే క్రియలు చేసేవాడు

సమన్వయము: ఇక్కడ స్వ + అంగ అనే సంధి తీసుకుంటే తన స్వీయ అంగములతో కర్మ చేసేవాడనే అర్థము వస్తుంది. అంటే ఏ పనైనా ఇతరుల సహాయం లేకుండా చేసేవాడు

549. Ajitaḥ: One who has not been conquered by anyone in His various incarnations.

549 ఓం అజితాః - అతని అవతారములలో ఏ ఒక్కరిచేతా అపజయము పొందనివాడు

సమన్వయము: జితా అంటే ఓడినవాడు; కావున అజితా అంటే విష్ణువు సదా ఓడనివాడు లేదా గెలిచేవాడు

550. Kṛṣṇaḥ: One who is known as Krishna-dvaipayana.

550 ఓం కృష్ణః - అతడు కృష్ణ ద్వైపాయనునిగా తెలియబడేవాడు

551. Dṛḍhaḥ: One whose nature and capacity know no decay.

551 ఓం దృఢః - అతడు క్షయము లేనివాడు

552. Saṅkarṣaṇo-acyutaḥ: Sankarshana is one who attracts to oneself all beings at the time of cosmic Dissolution and Acyuta is one who knows no fall from His real nature. They form one word with the first as the qualification – Acyuta who is Sankarshana.

552 ఓం సంకర్షణో అచ్యుతః - అతడు లయములో అందరినీ ఆకర్షించువాడు; తన సహజ తత్త్వమును వీడనివాడు

సమన్వయము: సంకర్షణ అంటే దున్నుట; దాని మూలము కర్ష అనగా దున్నేవాడు లేదా రైతు; అది బలరాముడుకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే అతడు నాగలిని ఆయుధముగా ధరించేవాడు; నాగలి అనగా భూమిని దున్నే పరికరము. అచ్యుత అంటే స్థిరమైనవాడు. అంటే అతడు బలరామునివలె స్థిరమైన భూమిని పాలించేవాడు అని కూడా సమన్వయము చేసుకోవచ్చు

553. Varuṇaḥ: The evening sun is called Varuna, because he withdraws his rays into himself.

553 ఓం వరుణః - అతడు సంధ్యా సమయములోని సూర్యుని వంటి వాడు

554. Vāruṇaḥ: Vasishta or Agastya, the sons of Varuna.

554 ఓం వారుణః - వరుణుని పుత్రులు వశిష్ఠ, అగస్త్య

555. Vṛukṣaḥ: One who is unshakable like a tree.

555 ఓం వృక్షః - ఒక మహా వృక్షమువలె పెకలింపబడనివాడు

556. Puṣkarākṣaḥ: One who shines as the light of consciousness when meditated upon in the lotus of the heart. Or one who has eyes resembling the lotus.

556 ఓం పుష్కరాక్షా - అతడు హృదయంలో జ్ఞాన కాంతి ప్రసాదించేవాడు; అతని కన్నులు కమలమును బోలి ఉన్నాయి

సమన్వయము: పుష్క అంటే పోషించునది; పుష్కర అంటే 12 సంవత్సరాల కాలము; వరుణుని కుమారుడు; అక్ష అంటే కన్నులు

557. Mahāmanāḥ: One who fulfils the three functions of creation, sustentation and dissolution of the universe by the mind alone.

557 ఓం మహా మనాః - అతడు మనస్సుతోనే సృష్టి స్థితి లయములను చేసెడివాడు

bhagavān bhagahānandī vanamālī halāyudhaḥ,

dityō jyōtirādityaḥ sahiṣṇurgatisattamaḥ. (60)

558. Bhagavān: The origin, dissolution, the bondage and salvation of creatures, knowledge, ignorance – one who knows all these is Bhagavan.

558 ఓం భగవాన్ - అతడు అన్నీ తెలిసినవాడు

559. Bhagahā: One who withdraws the Bhagas, beginning with lordliness, into Himself at the time of dissolution.

559 ఓం భగహా - అతడు లయ సమయంలో భాగాలను తనలోకి వెనక్కి తీసుకొనేవాడు

సమన్వయము: భగ అంటే సేవించబడునది. ఐశ్వర్యము; అణిమాది అష్టసిద్ధులు; యశస్సు; ద్వాదశాదిత్యులు; జ్ఞానము; వైరాగ్యము; అదృష్టము; చంద్రుడు; శివుడు; కీర్తి; లావణ్యము; ఉత్కర్ష; స్నేహము; స్త్రీ యోని.

560. Ānandī: One whose nature is Ananda (bliss).

560 ఓం ఆనందీ - అతడు ఆనంద స్వరూపము

561. Vanamālī: One who wears the floral wreath (Vanamala) called Vaijayanti, which consists of the categories of five elements.

561 ఓం వనమాలీ - అతడు పంచభూతములను సూచించే మణులతో చేసిన వైజయంతి అనబడే మాలను ధరించేవాడు

562. Halāyudhaḥ: One who in His incarnation as Balabhadra had Hala or ploughshare as His weapon.

562 ఓం హలాయుధః - అతడు బలరాముని అవతారములో నాగలిని ఆయుధముగా ధరించేవాడు

563. Ādityaḥ: One who was born of Aditi in His incarnation as Vamana.

563 ఓం ఆదిత్యః - అతడు అదితి గర్భాన వామనునిగా జన్మించినవాడు

సమన్వయము: బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనువడు, విరోచనుని పుత్రుడు. అతడు ముల్లోకాలను జయించి దేవతలకు కంటకుడుగా మారేడు. అప్పుడు దేవతలు విష్ణువుని ప్రార్థించగా అతడు అదితి గర్భాన జన్మించి వామనుడిగా అవతరించేడు. బలి చక్రవర్తి రాక్షస వంశీయుడైనా పరమ దాతృత్వము గలవాడు. వామనుడు బలి వద్దకు వెళ్ళి, మూడు అడుగుల భూమిని దానమివ్వమని అడిగేడు. దానికి విస్తుపోయిన బలికి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వచ్చినవాడు సామాన్యుడు కాడు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువని, కాబట్టి దాన మివ్వద్దని బలిని నివారించ ప్రయత్నించేడు. కాని బలి ఇచ్చిన మాట తప్పనని వామనునికి దానము ఇచ్చేడు. అప్పుడ వామనుడు తన శరీరాన్ని పెంచి లోకాలను రెండు అడుగులతో ఆక్రమించేడు. ఇదే పోతన ఇలా వర్ణించెను [ భాగవతం అష్టమ స్కంధం]:

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

చివరికి మూడవ అడుగు బలి శిరస్సుపై పెట్టి అతనిని చంపక రసాతలానికి పంపేడు.

564. Jyōtir-ādityaḥ: One who dwells in the brilliance of the sun's orb.

564 ఓం జ్యోతిర్ ఆదిత్యః - అతడు సూర్యుని ప్రకాశములో ఉండేవాడు

565. Sahiṣṇuḥ: One who puts up with the contraries like heat and cold.

565 ఓం సహిష్ణుః - అతడు శీతోష్ణము వంటి ద్వంద్వములను సహించువాడు

సమన్వయము: సహిష్ణు అంటే ఓర్పు, సహనము గలవాడు

566. Gatisattamaḥ: One who is the ultimate resort and support of all, and the greatest of all beings.

566 ఓం గతిసత్తమః - అతడు అందరికీ ఆధారము; ఉత్కృష్టుడు

సమన్వయము: గతికి ఉన్న అనేక అర్థాలలో త్రోవ అనుట ఇక్కడ వర్తిస్తుంది. సత్తమ అంటే మంచివాడు. కాబట్టి అతడు మంచివాళ్ళకు గతి. లేదా అందరికన్నా ఉత్తముడైన విష్ణువు జీవుల గతి.

sudhanvā khaṇḍaparaśurdāruṇō draviṇapradaḥ,

divaspṛk sarvadṛgvyāsō vācaspatirayōnijaḥ. (61)

567. Sudhanvā: One who has got as His weapon the bow named Saranga of great excellence.

567 ఓం సుధన్వా - అతడు సారంగ మనే ధనుస్సును ధరించి గొప్పగా నుండేవాడు

సమన్వయము: సుధన్వన్ అంటే ప్రశస్తమైన ధనుస్సు గలవాడు.

568. Khaṇda-paraśuḥ: The battle-axe that destroys enemies.

568 ఓం ఖండ పరశుః - అతడు శత్రువులను సంహరించే గొడ్డలి వంటివాడు

సమన్వయము: పరశురామావతారంలో విష్ణువు గండ్ర గొడ్డలిని ధరించి శత్రువులను ఖండించేడు. పరశురాముడు జమదగ్నికి, రేణుక (క్షత్రియ) కీ పుట్టినవాడు. వారికి శురభి అనే గోవు ఉండేది. అది కామధేనువునకు పుట్టినది. కాబట్టి అది వారి అవసరాలను తీర్చేది. ఒకనాడు పరశురాముడు ఇంట్లో లేని సమయంలో కార్తవీర్య అర్జున అనబడే రాజు వారి ఇంటికి వచ్చి శురభిని బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అడ్డుగా వచ్చిన జమదగ్ని అతని చేతిలో మరణిస్తాడు. పరశురాముడు ఇంటికి వచ్చి ఆ విషయం తెలుసుకొని క్షత్రియుల మీద కృద్ధుడవుతాడు. క్షత్రియులు వానిని యుద్ధానికై సవాలు చేస్తారు. అతడు వారిని తన గొడ్డలి ఆయుధముతో సంహరిస్తాడు. ఒక్క మను, ఇక్ష్వాకు వంశములను తప్ప తక్కిన క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. అటు పిమ్మట అతడు అశ్వమేధ యాగము చేసి సప్త ద్వీపాలను బ్రాహ్మణులకు దానం చేస్తాడు.

569. Dāruṇaḥ: One who is harsh and merciless to those who are on the evil path.

569 ఓం దారుణః - అతడు పాపులను శిక్షించేవాడు

570. Draviṇapradaḥ: One who bestows the desired wealth on devotees.

570 ఓం ద్రవిణ ప్రదః - అతడు భక్తులకు కోరిన సంపద నొసగేవాడు

సమన్వయము: ద్రవిణ అంటే బంగారము; ద్రవ్యము అనునది దాని వ్యుత్పత్తి

571. Divah-spṛk: One who touches the heavens.

571 ఓం దివః స్పృక్ - అతడు స్వర్గమును తాకేవాడు

సమన్వయము:

ఇక్కడ దివ అంటే స్వర్గము

572. Sarvadṛg-vyāsaḥ: One whose comprehension includes everything in its ambit.

572 ఓం సర్వ ద్రుగ్ వ్యాసః - అతడు సర్వము తెలిసికొన్నవాడు

573. Vācaspatirayōnijaḥ: The Lord is Vachaspati because He is the master of all learning. He is Ayonija because He was not born of a mother. This forms a noun in combination with the attribute.

573 ఓం వాచస్పతి రయోనిజః - అతడు అన్ని జ్ఞానములకు అధిపతి; ఒక స్త్రీ గర్భాన పుట్టనివాడు

సమన్వయము: వాచస్పతి అంటే వాక్కుకి అధిపతి. రయోనిజ = ర్ + యోని + జ అని విడదీస్తే అతడు స్త్రీ యొక్క యోనినుండి పుట్టనివాడు.

trisāmā sāmagaḥ sāma nirvāṇaṁ bheṣajaṁ bhiṣak,

saṁnyāsakṛcchamaśyāntō niṣṭhā śāntiḥ parāyaṇam. (62)

574. Trisāmā: One who is praised by the chanters of Sama-gana through the three Samas known as Devavratam.

574 ఓం త్రిసామా - అతడు సామ-గానము చేయువారిచే ప్రశంసింప బడువాడు

575. Sāmagaḥ: One who chants the Sama-gana.

575 ఓం సామగః - సామ గానము చేయువాడు

576. Sāma: Among the Vedas, I am Sama Veda.

576 ఓం సామ - అతడు వేదములలో సామ వేదము

577. Nirvāṇaṁ: That in which all miseries cease and which is of the nature of supreme bliss.

577 ఓం నిర్వాణం - అతనిలో దుఃఖములు అంతరించి సంపూర్ణ సుఖము అనుభవించబడేవి

578. Bheṣajaṁ: The medicine for the disease of Samsara.

578 ఓం భేషజం - సంసారమనే వ్యాధికి అతడు ఔషధము

579. Bhiṣak: The Lord is called Bhishak or physician.

579 ఓం భిషక్ - అతడు వైద్యుడు

580. Saṁnyāsakṛt: One who instituted the fourth Ashrama of Sanyasa for the attainment of Moksha.

580 ఓం సన్యాస కృత్ - అతడు మోక్షము పొందుటకు సన్యాస ఆశ్రమమును నెలకొల్పెను

581. Samaḥ: One who has ordained the pacification of the mind as the most important discipline for Sannyasins (ascetics).

581 ఓం సమః - అతడు సన్యాస ఆశ్రమములో ఉన్నవారికి శాంతముగా ఉండుట విధించెను

582. Sāntaḥ: The peaceful, being without interest in pleasures of the world.

582 ఓం శాంతః - అతడు ప్రపంచ సుఖములను కోరక శాంతముగా నుండేవాడు

583. Niṣṭhā: One in whom all beings remain in abeyance at the time of Pralaya.

583 ఓం నిష్ఠా - ప్రళయ కాలమున అన్ని జీవులు అతనిని పొందెడివి

సమన్వయము: నిష్టా అంటే వంశోద్ధారకుడు, వినాశము మొదలైనవి.

584. Śāntiḥ: One in whom there is complete erasing of Avidya or ignorance. That is Brahman.

584 ఓం శాంతిః - అతనిలో అవిద్య లేక అజ్ఞానము లేదు; అతడే బ్రహ్మన్

585. Parāyaṇam: The state, which is the highest and from which there is no return to lower states.

585 ఓం పరాయణం - అతడు ఉన్నతమైన స్థితినందు ఉండేవాడు

ubhāṅgaḥ śāntidaḥ sraṣṭā kumudaḥ kuvaleśayaḥ,

gōhitō gōpatirgōptā vṛṣabhākṣō vṛṣapriyaḥ. (63)

586. Śubhāṅgaḥ: One with a handsome form.

586 ఓం శుభాంగః - అతడు సుందరమైన రూపము గలవాడు

587. Śāntidaḥ: One who bestows shanti, that is, a state of freedom from attachment, antagonism, etc.

587 ఓం శాంతిదః - అతడు శాంతిని ఒసగేవాడు

588. Sraṣṭā: One who brought forth everything at the start of the creative cycle.

588 ఓం స్రష్టా - అతడు సృష్టి ఆదిలో అన్నిటినీ ఉద్భవింపజేసెడివాడు

589. Kumudaḥ: 'Ku' means the earth. One who delights in it.

589 ఓం కుముదః - భూమిలో రమించెడివాడు

590. Kuvaleśayaḥ: 'Ku' means earth. That which surrounds it is water, so 'Kuvala' means water. One who lies in water is Kuvalesaya. Kuvala' also means the underside of serpents. One who lies on a serpent, known as Adisesha, is Kuvalesaya.

590 ఓం కువలేశయః - అతడు జలముల మధ్యన ఉండేవాడు; అతడు ఆదిశేషు అనే సర్పము మీద పరుండేవాడు

సమన్వయము: కు + వల + శయ అనగా కు అంటే భూమి, వల అంటే చుట్టూరా, శయ అంటే నిద్రించుట. కాబట్టి అతడు చుట్టూ జలములుండి మధ్యలో పరుండేవాడు. కువల అనగా పద్మము. కాబట్టి పద్మములో పరుండేవాడని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శయ అంటే పాము అని కూడా అర్థం ఉంది. అతడు ఆది శేషుడనే సర్పము మీద పరుండేవాడని సమన్వయము చేసుకోవాలి.

591. Gōhitaḥ: One who protected the cows by uplifting the mount Govardhana in His incarnation as Krishna.

591 ఓం గోహితః - అతడు కృష్ణావతారంలో గోవర్ధన పర్వతము నెత్తి గోవులను రక్షించెను

సమన్వయము: [భాగవత, దశమ స్కంధం] తనను కాక గోవర్ధననాధుని వ్రజపురవాసులు పూజించారని తెలిసి, ఇంద్రునికి కృష్ణునిపై ఈర్ష్య, వ్రజపురవాసులపై క్రోధము జనించెను. అతడు వ్రజపురవాసులను హింసించాలని మేఘములను ఆదేశించాడు. వ్రజపురం మీద దట్టమైన మేఘాలు కమ్ముకొని కుండపోతగా ఉఱుములు, మెరుపులతో వర్షం కురవ నారంభించెను. గోపాలులు దిక్కు తోచక కృష్ణుని కాపాడమని ప్రార్థించేరు. అప్పుడు శ్రీకృష్ణుడు జరిగినది గ్రహించి ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగులా నిలబెట్టేడు. గోవులతో సహా గోపాలునందరిని గోవర్ధన పర్వతము క్రింద ఉంచాడు. వర్షం 7 రోజులు కుంభవృష్టిగా కురిసెను. శ్రీ కృష్ణుని ప్రభావముగాంచి విస్మితుడైన ఇంద్రుడు, మేఘములను వెనుకకు రప్పించి, శ్రీకృష్ణుని పాదాలపై బడి క్షమా భిక్ష కోరేడు.

మనలోని ఇంద్రియములకు ప్రభువే ఇంద్రుడు. భగవంతుని పొందుటకై మన సాధనకు ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. గోపాలుల ఉత్సవాన్ని భంగంచేయడానికై ఇంద్రుడు ప్రయత్నించేడు. అలాగే మన సాధనను భంగం చేయడానికి ఇంద్రియాలు ప్రయత్నిస్తాయి. అరిషడ్ వర్గాలు (కామ, క్రోధ, మద, మత్సర, లోభ, మోహములు) వలన కలిగెడి ఆవేశమే ఉఱుములు, మెరుపులతో కూడిన గాలి వాన. అలాంటప్పుడు మనల్ని రక్షించేది భగవంతుడే.

592. Gōpatiḥ: The Lord of the earth is Vishnu.

592 ఓం గోపతిః - అతడు భూమికి అధిపతి

593. Gōptā: One who is the protector of the earth. Or one who hides Himself by His Maya.

593 ఓం గోప్తా - అతడు భూమిని రక్షించేవాడు; తన మాయతో అంతర్ధానమయ్యేవాడు

594. Vṛṣapriyaḥ: One whose eyes can rain all desirable objects on devotees. Vrushabha means Dharma and so one whose look is Dharma.

594 ఓం వృష ప్రియః - అతని కన్నుల నుండి భక్తులు కోరినవి ప్రసాదించేవాడు; అతని వీక్షణ ధర్మమును సూచించును

595. Vrushapriyaḥ: One to whom Vrusha or Dharma is dear.

595 ఓం వృష ప్రియః - అతనికి ధర్మము విశిష్టమైనది; మిక్కిలి ప్రియమైనది

సమన్వయము: వృష అంటే ధర్మము

anivartī nivṛttātmā saṁkṣeptā kṣemakṛcchivaḥ,

rīvatsavakṣāḥ śrīvāsaḥ śrīpatiḥ śrīmatāṁ varaḥ. (64)

596. Anivartī: One who never retreats in the battle with Asuras. Or one who, being devoted to Dharma, never abandons it.

596 ఓం అనివర్తీ - అతడు ఆసురులతో చేసే యుద్ధములలో వెనుదిరగడు; ధర్మమును విడిచిపెట్టడు

సమన్వయము: అని అంటే యుద్ధము. నివర్తము అంటే ఉపసంహరించు. కాబట్టి విష్ణువు యుద్ధములనుండి నిష్క్రమించడు

597. Nivṛttātmā: One whose mind is naturally withdrawn from the objects of senses.

597 ఓం నివృత్తాత్మా - అతని మనస్సు ఇంద్రియములనుండి నివృత్తి చెందినది

సమన్వయము: నివృత్తి అంటే తిరిగి వచ్చుట, విరమించుట. అతని మనస్సు ఇంద్రియములనుండి నివృత్తి మార్గములో ఉండేది.

598. Saṁkṣeptā: One who at the time of cosmic dissolution contracts the expansive universe into a subtle state.

598 ఓం సంక్షేప్తా - అతడు ప్రళయములో సృష్టిని సూక్ష్మముగా జేసెడివాడు

సమన్వయము: దీనికీ సంక్షిప్తము అనే వాడుకలోనున్న పదమునకు ఒకటే మూలము. అతడు సృష్టిని ప్రళయ కాలమున సంక్షిప్తముగా చేస్తాడు.

599. Kṣemakṛt: One who gives Kshema or protection to those that go to him.

599క్షేమ కృత్ - అతడు తనను ఆశ్రయించిన వారలకు రక్షణ నొసగెడివాడు

600. Śivaḥ: One who purifies everyone by the very utterance of His name.

600 ఓం శివః - అతని నామము ఉచ్ఛరించిన మాత్రమున పరిశుద్ధులను జేసెడివాడు

601. Śrīvatsavakṣāḥ: One on whose chest there is a mark called Shrivasta.

601 ఓం శ్రీ వత్స వక్షః - అతని చ్చాతీపై శ్రీ వత్సమనే మచ్చ గలదు

సమన్వయము: శ్రీ + వత్స + వక్ష లో శ్రీ అంటే లక్ష్మీ దేవి, వత్స అంటే ఱొమ్ము అనే అర్ధం దూడ, శిశువు మొదలైన వాటితో సహా ఉంది. వక్షము అంటే చ్చాతీ. కాబట్టి లక్ష్మీ దేవి అతని చ్ఛాతీపై నుండేది.

602. Śrīvāsaḥ: One on whose chest Shridevi always dwells.

602 ఓం శ్రీవాసః - అతని వక్ష స్థలముపై శ్రీదేవి సదా నివసించేది

603. Śrīpatiḥ: One whom at the time of the churning of the Milk ocean Shridevi chose as her consort, rejecting all other Devas and Asuras. Or Shri mean supreme Cosmic Power. The Lord is the master of that Power.

603 ఓం శ్రీపతిః - అతడు శక్తివంతమైన శ్రీ యొక్క భర్త

604. Śrīmatāṁ-varaḥ: One who is supreme over all deities like Brahma who are endowed with power and wealth of the Vedas.

604 ఓం శ్రీ మతాం వరః - అతడు బ్రహ్మాది దేవతల శక్తిని అతిశయించినవాడు

rīdaḥ śrīśaḥ śrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,

rīdharaḥ śrīkaraḥ śreyaḥ śrīmān lōkatrayāśrayaḥ. (65)

605. Śrīdaḥ: One who bestows prosperity on devotees.

605 ఓం శ్రీదః - అతడు భక్తులకు సంపద ప్రసాదించెడివాడు

606. Śrīśaḥ: One who is Lord of the Goddess Shri.

606 ఓం శ్రీశః - అతడు సిరిసంపదలను ప్రసాదించే శ్రీ లక్ష్మి భర్త

607. Śrīnivāsaḥ: Shri here denotes men with Shri, that is, virtue and power. He who dwells in such men is Shrinivasa.

607 ఓం శ్రీనివాసః - అతడు శ్రీ (ధర్మము, శక్తి) తో కూడిఉన్నవారలలో స్థితమై ఉన్నాడు

608. Śrīnidhiḥ: One who is the seat of all Shri, that is, virtues and powers.

608 ఓం శ్రీనిధిః - అతడు సద్గుణములు, శక్తులు గల శ్రీ యొక్క ఆలంబనము

609. Śrīvibhāvanaḥ: One who grants every form of prosperity and virtue according to their Karma.

609 ఓం శ్రీ భావనః - అతడు కర్మానుసారము జీవులకు సంపద, ధర్మాచరణము నిచ్చువాడు

సమన్వయము: భావన అంటే తలపు. ఈ నామం యొక్క మరో అర్థం: లక్ష్మీదేవి అతని తలపులలో సదా ఉండేది

610. Śrīdharaḥ: One who bears on His chest Shri who is the mother of all.

610 ఓం శ్రీధరః -అతడు వక్షస్థలము పై అందరికీ మాత అయిన శ్రీ దేవిని కలవాడు

611. Śrīkaraḥ: One who makes devotees – those who praise, think about Him and worship Him – into virtuous and powerful beings.

611 ఓం శ్రీ కరః - అతడు తనను ఆరాధించే, స్మరణం చేసే, పూజించే భక్తులకు ధర్మాచరణము, శక్తులు ప్రసాదిస్తాడు

612. Śreyaḥ: 'Shreyas' means the attainment of what is un-decaying good and happiness. Such a state is the nature of the Lord.

612 ఓం శ్రేయః - అతడు క్షయము లేనివాడు, శుభము చేకూర్చేవాడు, ఆనందముతో ఉండేవాడు

613. Śrīmān: One in whom there are all forms of Shri that is power, virtue, beauty etc.

613 ఓం శ్రీమాన్ - అతనిలో లక్ష్మీ దేవి యొక్క అన్ని సులక్షణములు (శక్తి, ధర్మాచారణ, సౌందర్యము) నుండేవి

614. Lōkatrayāśrayaḥ: One who is the support of all the three worlds.

614 ఓం లోక త్రయా శ్రయః - అతడు ముల్లోకాలకి ఆధారము

సమన్వయము: లోక + త్రయ + ఆశ్రయ

svakṣaḥ svaṅgaḥ śatānaṅdō naṅdirjyōtirgaṇeśvaraḥ,

vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṁśayaḥ. (66)

615. Svakṣaḥ: One who's Akshas (eyes) are handsome like lotus flowers.

615 ఓం స్వక్షః - అతని కన్నులు పద్మముల వలె మిక్కిలి శోభాయమానమైనవి

సమన్వయము: స్వ + అక్ష - అతని కన్నులు

616. Svaṅgaḥ: One whose limbs are beautiful.

616 ఓం స్వంగః - అతని అంగములు మిక్కిలి రమణీయమైనవి

సమన్వయము: స్వ + అంగ - అతని అంగములు

617. Śatānandaḥ: One who is non-dual and is of the nature of supreme bliss.

617 ఓం శతానందః - అతడు ద్వంద్వములు లేనివాడు; సదా ఉత్కృష్టమైన ఆనందముతో నుండేవాడు

సమన్వయము: శత + ఆనంద అంటే సర్వులకు సంతోషము నిచ్చువాడు

618. Nandiḥ: One who is of the nature of supreme Bliss.

618 ఓం నందిః - సదా ఆహ్లాదముతో నుండేవాడు

సమన్వయము: నంది అంటే సతతము ఆనందాన్ని ఇచ్చేది

619. Jyōtir-gaṇeśvaraḥ: One who is the Lord of the stars, that is, Jyotirgana.

619 ఓం జ్యోతిర్ గణేశ్వరః - అతడు నక్షత్రాలకు అధిపతి

సమన్వయము: జ్యోతి + గణ + ఈశ్వర అనగా నక్షత్రాలలో ఉండే గణాలకు అధిపతి

620. Vijitātmā: One who has conquered the Atma that is the mind.

620 ఓం విజితాత్మా - అతడు ఆత్మను జయించినవాడు

సమన్వయము: విజిత + ఆత్మ ;విజిత అంటే జయింపబడ్డవాడు; కావున విష్ణువు ఆత్మను జయించినవాడు

621. Vidheyātmā: One whose form or nature cannot be determined as only this'.

621 ఓం విధేయాత్మా - అతని ఆకృతి, తత్త్వము ఇది అని చెప్పబడనివి

సమన్వయము: విధేయ + ఆత్మ -- విధేయ అంటే అధీనంలో ఉన్నవాడు.

622. Satkīrtiḥ: One whose fame is of the nature of truth.

622 ఓం సత్కీర్తిః - అతని పేరు ప్రఖ్యాతులు సత్

సమన్వయము: సత్ + కీర్తి

623. Chinna-saṁśayaḥ: One who has no doubts, as everything is clear to him like a fruit in the palm.

623 ఓం చిన్న సంశయః - అతనికి అనుమానములు లేవు; ప్రతీదీ తాటి చెట్టు పండు వలె విదితము

సమన్వయము: చిన్న అనగా అల్పము, కనిష్ఠము. అతనికి చిన్న సంశయాలు అనగా అనుమానాలు లేవు

udīrṇaḥ sarvataścakṣuranīśaḥ śāśvatasthiraḥ,

bhūśayō bhūṣaṇō bhūtirviśōkaḥ śōkanāśanaḥ. (67)

624. Udīrṇaḥ: He who is superior to all beings.

624 ఓం ఊదీర్ణః - అతడు అందరికన్నా ఉత్తముడు

సమన్వయము: ఉదీర్ణ అంటే ఎప్పుడూ పెరిగేది, వృద్ధి నొందేది

625. Sarvataḥ-cakṣuḥ: One who, being of the nature of pure consciousness, can see everthing in all directions.

625 ఓం సర్వతః చక్షుః - అతడు శుద్ధ చైతన్యము కావున అన్ని దిక్కుల చూడగలడు

సమన్వయము: సర్వతః - అన్ని దిక్కులా ; చక్షు - కన్నులు గలవాడు

626. Anīśaḥ: One who cannot have anyone to lord over him.

626 ఓం అనీశః - అతనిని ఆదేశించువారు వేరొకరు లేరు

సమన్వయము: అనీశ అంటే నియంత లేనివాడు. స్వతంత్రుడు; నియంత్రణ చేయువాడు

627. Śāśvata-sthiraḥ: One, who though eternal is also unchanging.

627 ఓం శాశ్వత స్థిరః - అతడు వికారములేని శాశ్వతుడు

628. Bhūśayaḥ: One who, while seeking the means to cross over to Lanka, had to sleep on the ground of the sea-beach.

628 ఓం భూశయః - అతడు రామావతారంలో లంకను చేరుటకై సముద్రపు ఒడ్డున నిద్రించిన వాడు

సమన్వయము: భూ + శయ ; భూ అంటే భూమి; శయ అంటే నిద్రించుట

629. Bhūṣaṇaḥ: One who adorned the earth by manifesting as various incarnations.

629 ఓం భూషణః - అతడు భూమి మీద అనేక అవతారములెత్తి పూజింపబడినవాడు

సమన్వయము: భూషణ అనగా అనేక విధములుగా అలంకరించు కొన్నవాడు; ఎట్లన వామనావతారంలో ఒక వటుడిగా, రామావతారంలో ఒక క్షత్రియుడిగా వేషం వేసుకొన్నవాడు.

630. Bhūtiḥ: One who is the abode or the essence of everthing, or is the source of all glorious manifestations.

630 ఓం భూతిః

అతడు అన్నిటి సారము; అతడు గొప్ప సృష్టికి యోని

సమన్వయము: భూతి అనగా ఐశ్వర్యము, విభూతి మొదలగునవి

631. Viśōkaḥ: One who, being of the nature of bliss, is free from all sorrow.

631 ఓం విశోకః - అతడు దుఃఖము లేనివాడు

సమన్వయము: వి + శోక; శోకమనగా దుఃఖము

632. Śōkanāśanaḥ: One who effaces the sorrows of devotees even by mere remembrance.

632 ఓం శోకనాశనః - అతడు భక్తుల శోకమును తలచినంత మాత్రాన నశింపజేయువాడు

సమన్వయము: శోక + నాశన

arciṣmānarcitaḥ kuṁbhō viśuddhātmā viśōdhanaḥ,

aniruddhōpratirathaḥ pradyumnōmitavikramaḥ. (68)

633. Arciṣmān: He by whose rays of light (Archish), the sun, the moon and other bodies are endowed with rays of light.

633 ఓం అర్చిష్మాన్ - అతడు తన ప్రకాశముతో సూర్యుని, చంద్రుని, నక్షత్రములు మొదలైన వాటిని ప్రకాశింప జేసేవాడు

సమన్వయము: అర్చిష్మంతుడు అంటే సూర్యుడు, అగ్ని మొదలగు తేజోవంతమైనవి

634. Arcitaḥ: One who is worshipped by Brahma and other Devas who are themselves the objects of worship in all the worlds.

634 ఓం అర్చితః - అతడు అర్చించబడు దేవతలచే పూజింపబడే వాడు

635. Kumbhaḥ: He who contains in Himself every thing as in a pot.

635 ఓం కుంభః - అతడు కుండలో ఎట్లు అన్నీ ఇమిడి ఉండునో అట్లే తనంతట తాను ఉండును

సమన్వయము: కుంభము అంటే కుండ

636. Viśuddhātmā: Being above the three Gunas, Satva, Rajas and Tamas, the Lord is pure spirit and is also free from all impurities.

636 ఓం విశుద్ధాత్మా - అతడు త్రిగుణాతీతుడై పరిశుద్ధమైన వాడు

సమన్వయము: విశుద్ధ + ఆత్మ ; విశుద్ధ అంటే స్వఛ్ఛమైనది

637. Viśōdhanaḥ: One who destroys all sins by mere remembrance.

637 ఓం విశోధనః - అతడు స్మరించిన మాత్రముననే అన్ని పాపాలను తీసివేయును

సమన్వయము: విశోధన అంటే స్వచ్ఛము చేయుట; ప్రాయశ్చిత్తము చేయుట

638. Aniruddhaḥ: The last one of the four Vyuhas – Vasudeva, Samkarshana, Pradyumna and Aniruddhaḥ. Or one who, cannot be obstructed by enemies.

638 ఓం అనిరుద్ధః - అతడు శత్రువులచే బంధింపబడలేడు

సమన్వయము: అనిరుద్ధ అంటే యుద్ధంలో ఎవరిచేత కూడ నిరోధింపబడనివాడు

639. Aprati-rathaḥ: One who has no Pratiratha or an equal antagonist to confront.

639 ఓం అప్రతి రథః - అతనిని ఎదిరించు రథికుడు లేడు

సమన్వయము: అప్రతి అంటే సాటిలేనిది, ఎదురులేనిది; రథ అంటే రథికుడు లేదా రథమునందున్న వాడు

640. Pradyumnaḥ: One whose Dyumna or wealth is of a superior and sacred order. Or one of the four Vyuhas.

640 ఓం ప్రద్యుమ్నః - అతని సంపద ఉత్కృష్టమైనది

సమన్వయము: ద్యుమ్న అంటే ధనము లేదా బలము; కావున ప్రద్యుమ్న అంటే మిక్కిలి ధనవంతుడు లేదా బలము కలవాడు

641. Amitavikramaḥ: One of unlimited prowess. Or one whose prowess cannot be obstructed by any one.

641 ఓం అమిత విక్రమః - అతడు ఎనలేని శక్తి గలవాడు

kālaneminihā vīraḥ śauriḥ śūrajaneśvaraḥ,

trilōkātmā trilōkeśaḥ keśavaḥ keśihā hariḥ. (69)

642. Kālanemi-nihā: One who destroyed the Asura named Kalanemi.

642 ఓం కాలనేమి నిహా - అతడు కాలనేమి అనబడే అసురుని సంహరించెను

సమన్వయము: కాలనేమి రావణాసురుని మేనమామ. అతడు తారక యుద్ధంలో విష్ణువుచే చంపబడినాడు.

643. Viraḥ: One who is courageous.

643 ఓం వీరః - అతడు మిక్కిలి శౌర్యము గలవాడు

644. Śauriḥ: One who was born in the clan of Sura as Krishna.

644 ఓం శౌరిః - అతడు కృష్ణావతారంలో సురుల వంశము నందు జన్మించెను

645. Śūrajaneśvaraḥ: One who by his overwhelming prowess controls even great powers like Indra and others.

645 ఓం శూరజనేశ్వరః - అతడు మిక్కిలి శక్తిమంతులను కూడా నియంత్రించేవాడు

సమన్వయము: శూర + జన + ఈశ్వర - అతడు శూరులకు అధిపతి; శూరులలో శూరుడు

646. Trilōkātmā: One who in his capacity as the inner pervade is the soul for the three worlds.

646 ఓం త్రిలోకాత్మా - అతడు ముల్లోకములకూ ఆత్మ

సమన్వయము: త్రిలోక + ఆత్మ

647. Trilōkeśaḥ: One under whose guidance and command everything in the three words is functioning.

647 ఓం త్రిలోకేశః - అతని మార్గ దర్శకత్వముతో, ఆజ్ఞతో ముల్లోకములూ ప్రవర్తించుచున్నవి

సమన్వయము: త్రిలోక + ఈశ

648. Keśavaḥ: By Kesha is meant the rays of light spreading within the orbit of the sun.

648 ఓం కేశవః -అతడు సూర్యుని తేజస్సు

649. Keśihā: One who destroyed the Asura named Keshi.

649 ఓం కేశిహా - అతడు కేశి అనబడే అసురుని వధించినవాడు

650. Hariḥ: One who destroys Samsara, that is, entanglement in the cycle of birth and death along with ignorance, its cause.

650 ఓం హరిః - అతడు జనన మరణ చక్రములో ప్రవర్తించే సంసార చక్రమునుండి విడిపింప గలవాడు

kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kṛtāgamaḥ,

anirdeśyavapurviṣṇurvīrōnantō dhanañjayaḥ. (70)

651. Kāmadevaḥ: One who is desired by persons in quest of the four values of life – Dharma, Artha, Kama and Moksha.

651 ఓం కామదేవః - అతడు ధర్మార్థకామమోక్షములకై సాధన చేయబడేవాడు

652. Kāmapālaḥ: One who protects or assures the desired ends of people endowed with desires.

652 ఓం కామఫలః - అతడు భక్తుల కోర్కెలను తీర్చువాడు

సమన్వయము: కామ అంటే కోరిక; ఫల అంటే ఫలించుట

653. Kāmī: One who by nature has all his desires satisfied.

653 ఓం కామీ - అతని కోర్కెలన్నీ తీర్చబడినవి

654. Kāntaḥ: One whose form is endowed with great beauty. Or one who effects the 'Anta' or dissolution of 'Ka' or Brahma at the end of a Dviparardha (the period of Brahma's lifetime extending over a hundred divine years).

654 ఓం కాంతః - అతడు మిక్కిలి సౌందర్యము గలవాడు; బ్రహ్మను అంతమొందించేవాడు

సమన్వయము: కాంత అంటే కోరబడునది. మనోహరమైనది; క + అంత అని సంధి బట్టి క అంటే బ్రహ్మ, అంత అంటె అంతముజేయుట; కావున సృష్టి చివరన జీవులతో పాటు బ్రహ్మాది దేవతలను కూడా అంతమొందించేవాడు.

655. Kṛtāgamaḥ: He who produced scriptures like Shruti, Smruti and Agama.

655 ఓం కృతాగమః - అతడు శృతి, స్మృతి మొదలగు ఆగమములకు కారకుడు

సమన్వయము: కృత + ఆగమ ; ఇక్కడ ఆగమ అంటే ధర్మమును తెలుపు శాస్త్రములు, వేదాది శాస్త్రములు;

656. Anirdeśya-vapuḥ: He is called so, because, being above the Gunas, His form cannot be determined.

656 ఓం అనిర్దేశ్య వపుః - అతడు నిర్గుణుడైన కారణాన అతని స్వస్వరూపమును తెల్పలేము

సమన్వయము: అ + నిర్దేశ్య + వపు ; అనిర్దేశ్య అంటే నిర్దేశింపబడనిది. వపుః అంటే శరీరము

657. Viṣṇuḥ: One whose brilliance has spread over the sky and over the earth.

657 ఓం విష్ణుః - అతని కీర్తి, యశస్సు సర్వ వ్యాపకము

658. Vīraḥ: One who has the power of Gati or movement.

658 ఓం వీరః - అతనికి తలచిన ప్రదేశానికి వెళ్లగలిగే శక్తి ఉన్నది

659. Anantaḥ: One who pervades everything, who is eternal, who is the soul of all, and who cannot be limited by space, time, location, etc.

659 ఓం అనంతః - అతడు సర్వ వ్యాపకుడు, అందరి ఆత్మలలో ఉండేవాడు, దేశకాలాలచే పరిమితి లేనివాడు

660. Dhananjayaḥ: Arjuna is called so because by his conquest of the kingdoms in the four quarters he acquired great wealth. Arjuna is a Vibhuti, a glorious manifestation of the Lord.

660 ఓం ధనంజయః - అర్జునుడు రూపములో ఉన్నదతడే

సమన్వయము: ధనంజయ అంటే ధనమును జయించినవాడు లేదా అర్జునుడు

brahmaṇyō brahmakṛdbrahmā brahma brahmavivardhanaḥ,

brahmavidbrāhmaṇō brahmī brahmajñō brāhmaṇapriyaḥ. (71)

661. Brahmaṇyaḥ: The Vedas, Brahmanas and knowledge are indicated by the word Brahma. As the Lord promotes these, He is called Brahmanya.

661 ఓం బ్రహ్మణ్యః -అతడు వేదములు, జ్ఞానము గల బ్రాహ్మణులను పెంపొందించేవాడు

సమన్వయము: బ్రహ్మణ్య అంటే వేదమును తెలిసినవాడు, అధ్యయనము చేసినవాడు.

662. Brahmakṛt: One who performs Brahma or Tapas (austerity).

662 ఓం బ్రహ్మ కృత్ -అతడు తపస్సు చేసేవాడు

663. Brahmā: One who creates everything as the creator Brahma.

663 ఓం బ్రహ్మా - బ్రహ్మ వలె సృష్టిని చెయ్యగలవాడు

664. Brahma: Being big expanding, the Lord who is known from indications like Satya (Truth), is called Brahma. Or Brahma is Truth, Knowledge and Infinity!

664 ఓం బ్రహ్మ - అతడు సత్, సర్వజ్ఞుడు, అనంతము

665. Brahma-vivardhanaḥ: One who promotes Tapas (austerity), etc.

665 ఓం బ్రహ్మ వివర్ధనః - అతడు తపస్సును పెంపొందించే వాడు

సమన్వయము: వివర్ధన అంటే విస్తారింప జేసేవాడు

666. Brahmavid: One who knows the Vedas and their real meaning.

666 ఓం బ్రహ్మ విద్ - అతడు వేదముల సారమును ఎరిగినవాడు

సమన్వయము: విద్ అంటే తెలిసి యుండుట

667. Brāhmaṇaḥ: One who, in the form of Brahmana, instructs the whole world, saying, 'It is commanded so and so in the Veda'.

667 ఓం బ్రాహ్మణః - బ్రహ్మన్ రూపములో నుండి వేదములో ప్రతిపాదించినవి తెలిపేవాడు

668. Brahmī: One in whom is established such entities as Tapas, Veda, mind, Prana etc. which are parts of Brahma and which are also called Brahma.

668 ఓం బ్రహ్మీ - అతడు బ్రహ్మ యొక్క లక్షణములు (తపస్సు, వేదములు, మనస్సు, ప్రాణము) గలవాడు

సమన్వయము: ఇక్కడ బ్రహ్మీ అంటే బ్రహ్మకు సంబంధించినది

669. Brahmajñaḥ: One who knows the nature of Brahman.

669 ఓం బ్రహ్మజ్ఞా - అతడు బ్రహ్మన్ యొక్క తత్త్వమెరిగినవాడు

670. Brāhmaṇapriyaḥ: One to whom holy men are devoted.

670 ఓం బ్రాహ్మణ ప్రియః - అతడు యోగులను ప్రేమించేవాడు

mahākramō mahākarmā mahātejā mahōragaḥ,

mahākraturmahāyajvā mahāyajñō mahāhaviḥ. (72)

671. Mahākramaḥ: One with enormous strides. May Vishnu with enormous strides bestow on us happiness.

671 ఓం మహా క్రమః - అతడు మిక్కిలి వేగముగా చలించేవాడు

సమన్వయము: క్రమ అంటే ఇక్కడ అడుగిడుట అని అర్థము

672. Mahākarmā: One who is performing great works like the creation of the world.

672 ఓం మహాకర్మః - అతడు సృష్టి కార్యము వంటి గొప్ప పనులు చేసేవాడు

673. Mahātejāḥ: He from whose brilliance, sun and other luminaries derive their brilliance. Or one who is endowed with the brilliance of various excellences.

673 ఓం మహాతేజః - అతడు గొప్ప తేజస్సు గలవాడు

674. Mahoragaḥ: He is also the great serpent.

674 ఓం మహోరగః - అతడు గొప్ప పాము రూపమున యుండేవాడు

సమన్వయము: మహా + ఉరగ ; ఉరగ అంటే పాము

675. Mahākratuḥ: He is the great Kratu or sacrifice.

675 ఓం మహా క్రతుః - అతడే గొప్ప క్రతువు, త్యాగమొనర్చేవాడు

సమన్వయము: క్రతువంటే యజ్ఞము

676. Mahāyajvā: One who is great and performs sacrifices for the good of the world.

676 ఓం మహా యజ్వా - అతడు గొప్ప త్యాగము విశ్వమునకై ఒనర్చినవాడు

సమన్వయము: యజ్వా అంటే త్యాగముతో కూడిన యజ్ఞము చేసేవాడు

677. Mahāyajñaḥ: He who is the great sacrifice.

677 ఓం మహా యజ్ఞః - అతడు గొప్ప త్యాగి

678. Mahāhaviḥ: The whole universe conceived as Brahman and offered as sacrificial offering (Havis) into the fire of the Self, which is Brahman.

678 ఓం మహాహవిః - అతడు సృష్టికై హవిస్సుగా మారినవాడు

stavyaḥ stavapriyaḥ stōtraṁ stutiḥ stōtā raṇapriyaḥ,

pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ. (73)

679. Stavyaḥ: One who is the object of laudations of everyone but who never praises any other being.

679 ఓం స్తవ్యః - అతడు అందరిచే పొగడ్తలందుకునేవాడు; కానీ ఎవరినీ పొగడడు

680. Stava-priyaḥ: One who is pleased with hymns.

680 ఓం స్తవ ప్రియః - అతడు కీర్తనలచే ఆనందింపబడువాడు

681. Stotraṁ: A Stotra means a hymn proclaiming the glory, attributes and names of the Lord.

681 ఓం స్తోత్రం - అతడు స్తోత్రములచే ఆనందింపబడువాడు

682. Stutiḥ: A praise.

682 ఓం స్తుతిః - అతను స్తుతింపబడువాడు

683. Stōtā: One who, being all -formed, is also the person who sings a hymn of praise.

683 ఓం స్తోతా - అతడు స్తోత్రములచే పొగడబడేవాడు

684. Raṇapriyaḥ: One who is fond of fight for the protection of the world, and for the purpose always sports in His hands the five weapons, the discus Sudarshana, the mace Kaumodaki, the bow Saranga, and the sword Nandaka besides the conch Panchajanya.

684 ఓం రణప్రియః - అతడు శిష్ట రక్షణకై యుద్ధము చేయువాడు

685. Pūrṇaḥ: One who is self-fulfilled, being the source of all powers and excellences.

685 ఓం పూర్ణః - అతడు అన్ని సద్గుణములు, శక్తులు గలవాడు కనుక సంపూర్ణుడు

686. Pūrayitā: One who is not only self-fulfilled but gives all fulfillments to others.

686 ఓం పూరయితా - అతడు సంతృప్తితో నుండి, ఇతరులను సంతృప్తి పరచువాడు

687. Puṇyaḥ: One by only hearing about whom all sins are erased.

687 ఓం పుణ్యః - అతనిని స్మరించిన మాత్రాన పాపములు తొలగును

688. Puṇyakīrtiḥ: One of holy fame. His excellences are capable of conferring great merit on others.

688 ఓం పుణ్య కీర్తిః - అతడు ఇతరులకు గొప్ప యోగ్యత నొసగేవాడు

689. Anāmayaḥ: One who is not afflicted by any disease that is born of cause, internal or external.

689 ఓం అనామయః - అతడు ఎట్టి వ్యాధిచే పీడింపబడనివాడు

సమన్వయము: అనామయ అంటే వ్యాధి లేనివాడు

manōjavastīrthakarō vasuretā vasupradaḥ,

vasupradō vāsudevō vasurvasumanā haviḥ. (74)

690. Manōjavaḥ: One who, being all pervading, is said to be endowed with speed likes that of the mind.

690 ఓం మనోజవః - అతడు మనస్సు అంత వేగము గలవాడు

సమన్వయము: ఇక్కడ జవ కున్న అనేకమైన అర్థములలో వడిగలది అన్న పద సముదాయము వర్తిస్తుంది

691. Tīrthakaraḥ: Tirtha means Vidya, a particular branch of knowledge or skill.

691 ఓం తీర్థ కరః - అతడు అమితమైన విద్య గలవాడు

సమన్వయము: తీర్థకర అంటే శాస్త్రమును ఉపదేశించువాడు. పుణ్య క్షేత్రములను నిర్మించువాడు.

692. Vasu-retāḥ: He whose Retas (Semen) is gold (Vasu).

692 ఓం వసు రేతః - అతను వీర్యము బంగారు వర్ణములో నుండేది

693. Vasupradaḥ: One who gladly bestows wealth in abundance. He is really the master of all wealth, and others who seem to be so are in those positions only because of His grace.

693 ఓం వసుప్రదః - అతడు సిరిసంపదల నొసగేవాడు

694. Vasupradaḥ: One who bestows on devotees the highest of all wealth, namely Moksha.

694 ఓం వసుప్రదః - అతడు భక్తులకు మోక్ష మొసగ గలడు

695. Vāsudevaḥ: The son of Vasudeva.

695 ఓం వాసుదేవః - అతడు వసుదేవుని పుత్రుడుగా జన్మించినవాడు

696. Vasuḥ: He in whom all creation dwells.

696 ఓం వసుః - అతనిలో సృష్టి అంతా ఇమిడి యున్నది

697. Vasumanaḥ: One whose mind dwells equally in all things.

697 ఓం వసుమనః - అతని దృష్టి అన్నిటి మీద సమానముగా నుండేది

698. Haviḥ: Havis or sacrificial offerings.

698 ఓం హవిః - అతడు యజ్ఞములో హవిస్సు

sadgatiḥ satkṛtiḥ sattā sadbhūtiḥ satparāyaṇaḥ,

rasenō yaduśreṣṭhaḥ sannivāsaḥ suyāmunaḥ. (75)

699. Sadgatiḥ: One who is attained by such persons. Or who is endowed with intelligence of great excellence.

699 ఓం సద్గతిః - అతనిని పొందేవారి స్థితి; అతడు దివ్యమైన మేధస్సు గలవాడు

700. Satkṛtiḥ: One whose achievements are for the protection of the world.

700 ఓం సత్కృతిః - అతడు సృష్టిని సంరక్షించుటకై అనేక ప్రయత్నములు చేసెను

సమన్వయము: సత్కృతి అంటే శుభకార్యము చేసేవాడు

701. Sattā: Experience that is without any difference of an external nature from similar objects or dissimilar objects as also internal differences is called Satta.

701 ఓం సత్తా - అతడు ఇంటాబయటా బేధము లేనివాడు

702. Sad-bhūtiḥ: The Paramatman who is pure existence and conscousness, who is unsublatable and who manifests Himself in many ways.

702 ఓం సద్భూతిః - అతడు శుద్ధ చైతన్యము, అనేక విధములుగా వ్యక్త మయ్యే వాడు

703. Satparāyaṇaḥ: He who is the highest Status attainable by holy men who have realized the Truth.

703 ఓం సత్పరాయణః - అతడు సత్యమునెరిగిన యోగులు పొందే ఉత్కృష్టమైన వాడు

704. Śūrasenaḥ: One having an army of heroic wariours like Hanuman.

704 ఓం సురసేనః - అతడు మిక్కిలి శక్తివంతమైన సురులతో గూడిన సైన్యము గలవాడు

705. Yaduśreṣṭhaḥ: One who is the greatest among the Yadus.

705 ఓం యదు శ్రేష్ఠః - అతడు యదులలో ఉత్తముడు

సమన్వయము: శ్రీ కృష్ణ అవతారంలో అతడు యదువంశమునకు చెందినవాడు

706. Sannivāsaḥ: One who is the resort of holy knowing ones.

706 ఓం సన్నివాసః - అతడు యోగుల గమ్య స్థానము

సమన్వయము: సత్ + నివాస

707. Suyāmunaḥ: One who is surrounded by may illustrious persons associated with the river Yamuna like Devaki, Vasudeva, Nandagopa, Yasoda, Balabhadra, Subhadra, etc.

707 ఓం సుయామునః - అతడు యమునా నదిచే పావనమైన వారితో నుండెడివాడు

సమన్వయము: సు + యమున ; సుయామున అంటే యమునానది ప్రియమైనవాడు

bhūtāvāsō vāsudevaḥ sarvāsunilayōnalaḥ,

darpahā darpadō dṛptō durdharōthāparājitaḥ. (76)

708. Bhūtāvāsaḥ: He in whom all the beings dwell.

708 ఓం భూతవాసః - అతనిలో అన్ని జీవులు ఉండేవి

సమన్వయము: భూత అంటే జీవులు; వాస అంటే నివసించుట

709. Vāsudevaḥ: The Divinity who covers the whole universe by Maya.

709 ఓం వాసుదేవః - అతడు సృష్టి నంతటినీ తన మాయచే కప్పి ఉంచెడివాడు

సమన్వయము: కృష్ణావతారంలో వసుదేవుని కుమారుడు లేదా అంతట ఆత్మరూపంలో వుండువాడు

710. Sarvāsunilayaḥ: He in whose form as the Jiva all the vital energy or Prana of all living beings dissolves.

710 ఓం సర్వాసు నిలయః - అతనిలో జీవుల ముఖ్య శక్తి, ప్రాణ శక్తులు లయమవుతాయి

సమన్వయము: సర్వ + అసు + నిలయ; అసు అంటే ప్రాణ వాయువుని బయటకు పంపించునది లేదా అపానము.

711. Analaḥ: One whose wealth or power has no limits.

711 ఓం అనలః - అతని శక్తికి, సంపదకి అవధులు లేవు

సమన్వయము: నల అంటే రాజు అని అర్థము

712. Darpahā: One who puts down the pride of persons who walk along the unrighteous path.

712 ఓం దర్పహా - అతడు అధర్మ మార్గములో నడచువారి గర్వమునణచువాడు

713. Darpadaḥ: One who endows those who walk the path of righteousness with a sense of self-respect regarding their way of life.

713 ఓం దర్పదః - అతడు ధర్మ మార్గములో నడచువారికి ఆత్మ గౌరవమును ప్రసాదించేవాడు

సమన్వయము: దర్ప అంటే గర్వము, అహంకారము

714. Dṛptaḥ: One who is ever satisfied by the enjoyment of His own inherent bliss.

714 ఓం దృప్తః - అతడు తన ఆహ్లాదముతో సంతృప్తి పడేవాడు

సమన్వయము: దృప్త అంటే గర్వించునది

715. Durdharaḥ: One who is very difficult to be borne or contained in the heart in meditation.

715 ఓం దుర్ధరః - అతడు ధ్యానము చేయునప్పుడు అతి కష్టముతో ప్రత్యక్షమయ్యే వాడు

సమన్వయము: దుర్ధర అంటే కష్టంగా ధరింపదగినవాడు

716. Aparājitaḥ: One who is never conquered by internal enemies like attachment and by external enemies like Asuras.

716 ఓం అపరాజితః - అతడు అంతర్గత శత్రువుల చేత, అసురుల చేత పరాజయింప బడనివాడు

సమన్వయము: పరాజిత అంటే పరాజయము లేదా వోటమి పొందినవాడు; విష్ణువుకి పరాజయము లేదు

viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,

anekamūrtiravyaktaḥ śatamūrtiḥ śatānanaḥ. (77)

717. Viśvamūrtiḥ: One who, being the soul of all, has the whole universe as His body.

717 ఓం విశ్వమూర్తిః - అతడు విశ్వానికి ఆత్మ; విశ్వము దేహముగా గలవాడు

718. Mahāmūrtiḥ: One with an enormous form stretched on a bedstead constituted of the serpent Adisesha.

718 ఓం మహామూర్తిః - అతడు స్థూలమైన దేహము కలిగి ఆదిశేష తల్పముపై పరుండేవాడు

719. Dīptamūrtiḥ: One with a luminous form of knowledge.

719 ఓం దీప్త మూర్తిః - అతడు ఉజ్జ్వలమైన జ్ఞాన స్వరూపము

720. Amūrtimān: He who is without a body born of Karma.

720 ఓం అమూర్తిమాన్ - అతడు కర్మచే జన్మించిన దేహము లేనివాడు

సమన్వయము: మూర్తి అంటే శరీరము లేదా దేహము ; అమూర్తి అంటే కర్మచే జన్మించిన దేహము లేనివాడు

721. Anekamūrtiḥ: One who assumes several bodies in His incarnations as it pleases Him in or to help the world.

721 ఓం అనేకమూర్తిః - అతడు విశ్వమును కాపాడుటకై అనేక రూపములను పొందినవాడు

722. Avyaktaḥ: One who cannot be clearly described as 'This' even though He has many forms.

722 ఓం అవ్యక్తః - అతడు ఇది అని చెప్పబడే రూపము లేనివాడు

723. Śatamūrtiḥ: One who, though He is of the nature of Pure Consciousness, assumes different forms for temporary purposes.

723 ఓం శతమూర్తిః - అతడు శుద్ధ చైతన్యము; అనేక అవతారములకై వివిధ దేహములను ధరించువాడు

సమన్వయము: ఇక్కడ శత అంటే అనేక; మూర్తి అంటే దేహము

724. Śatānanaḥ: He is called one with a hundred faces to indicate that He has several forms.

724 ఓం శతాననః - అతడు అనేక ముఖములు గలవాడు

సమన్వయము: శత + ఆనన ; ఆనన అంటే ముఖము;

ekō naikaḥ savaḥ kaḥ kiṁ yattatpadamanuttamam,

lōkabandhurlōkanāthō mādhavō bhaktavatsalaḥ. (78)

725. Ekaḥ: One without any kind of differences that are internal or that relate to similar objects external or to dissimilar objects.

725 ఓం ఏకః - అతనికి అంతర్గత, బాహ్య బేధములేదు

726. Naikaḥ: One who has numerous bodies born of Maya.

726 ఓం నైకః - అతడు మాయ వలన అనేక రూపములు దాల్చినవాడు

సమన్వయము: నైక అంటే అనేక

727. Savaḥ: That Yajna in which Soma is made.

727 ఓం సవః - సోమ రసము చేయబడే యజ్ఞము

సమన్వయము: సంస్కృతంలో సవః అంటే సోమ రసము, తెలుగులో సవ అంటే యజ్ఞము; కాబట్టి సమన్వయము చేస్తే సోమరసముతో చేసే యజ్ఞమని చెప్పవచ్చు

728. Kaḥ: The syllable 'Ka' indicatesjoy or happiness. So it means one who is hymned as constituted of joy.

728 ఓం కః - అతడు సదా శాంత చిత్తముతో నుండువాడు

729. Kim: One who is fit to be contemplated upon, because He is the summation of all values.

729 ఓం కిం - అతడు స్మరింప దగినవాడు; ధర్మ స్వరూపుడు

730. Yat: One who is by nature existent. The word 'Yat' indicates a self-subsisting entity.

730 ఓం యత్ - అతడు తనకు తానే ఆధారము

731. Tat: Brahma is so called because He 'expands'.

731 ఓం తత్ - అతడు సర్వ వ్యాపకుడు

732. Padamanuttamam: Braman is 'Pada' or Status, because He is the goal of all Moksha-seekers. It is Anuttama, because It is that beyond which there is nothing else to be attained.

732 ఓం పదమ నుత్తమం - అతడు మోక్షము పొందదలిచేవారల ఉత్తమమైన గమ్యము

సమన్వయము: పదమ అంటే స్థానము; ఉత్తమం అంటే శ్రేష్ఠము; సమన్వయము అతడు ఉత్తమమైన గమ్యము

733. Lokabandhuḥ: One who is friend of the world.

733 ఓం లోక బంధుః - అతడు లోకానికి మేలు చేసే మిత్రుడు

734. Lokanāthah: One to whom all the worlds pray.

734 ఓం లోకనాథః - అన్ని లోకాలు అతనిని పూజించేవి

735. Mādhavaḥ: One who was born in the clan of Madhu.

735 ఓం మాధవః - అతడు మధు వంశములో శ్రీ కృష్ణునిగా జన్మించెను

736. Bhaktavatsalaḥ: One who has got love for devotees.

736 ఓం భక్త వత్సలః - అతడు తన భక్తులను అమితముగా ప్రేమించేవాడు

సమన్వయము: వత్సల అంటే స్నేహ శీలి; వాత్సల్యము గలవాడు

suvarṇavarṇō hemāṅgō varāṅgaścandanāṅgadī,

vīrahā viṣamaḥ śūnyō ghṛtāśīracalaścalaḥ. (79)

737. Suvarṇavarṇaḥ: One who has got the colour of gold.

737 ఓం సువర్ణ వర్ణః - అతడు బంగారు ఛాయ గలవాడు

738. Hemāṅgaḥ: One whose form is like that of gold.

738 ఓం హేమాంగః - అతడు బంగారు రూపము గలవాడు

సమన్వయము: హేమ + అంగః -హేమ అంటే బంగారము; అంగ అంటే అంగములు.

739. Varāṅgaḥ: He the parts of whose form are brilliant.

739 ఓం వరాంగః - అతని దేహ విభాగాలు అత్యంత ప్రకాశవంత మైనవి

సమన్వయము: వరాంగ అంటే శ్రేష్ఠమైన అంగములు గలవాడు

740. Candanāṅgadī: One who is adorned with armlets that generatejoy.

740 ఓం చందనాంగదీ - అతని చేతి కంకణాలు మిక్కిలి ఆనందము కలిగించేవి

సమన్వయము: చందనము అంటే సంతోష పరచునది, గంధము;

741. Vīrahā: One who destroyed heroes (Viras) like Kiranyakashipu for protecting Dharma.

741 ఓం వీరః - అతడు ధర్మ సంరక్షణకై అనేక శక్తిమంతులను సంహరించెను

742. Viṣamaḥ: One to whom there is no equal because nothing is comparable to Him by any characteristic.

742 ఓం విషమః - అతడు తనకు తానే సాటి

743. Śūnyaḥ: One who, being without any attributes, appears as Sunya (emptiness).

743 ఓం శూన్యః - అతడు నిర్గుణరూపము శూన్యము వలె నుండేది

744. Ghṛtāśīḥ: One whose blessings are unfailing.

744 ఓం ఘృతాశిః - అతని అభయము ఎన్నటికీ ఉండేది

సమన్వయము:

745. Acalaḥ: One who cannot be deprived of His real nature as Truth, Intelligence and Infinity.

745 ఓం అచలః - అతడు సత్, మేధస్సు, అనంతములో స్థిరమై ఉన్నవాడు

746. Calaḥ: One who moves in the form of air.

746 ఓం చలః - అతడు గాలి వలె చరించువాడు

amānī mānadō mānyō lōkasvāmī trilōkadhṛt,

sumedhā medhajō dhanyaḥ satyamedhā dharādharaḥ. (80)

747. Amānī: He who, being of the nature of Pure Consciousness, has no sense of identification with anything that is not Atman.

747 ఓం అమానీ - అతడు శుద్ధ చైతన్యము కావున అనాత్మని విడిచిపెట్టేవాడు

సమన్వయము: అమనీ అంటే స్వంతముగా చేయించిన పని, స్వాధీనము, రక్షణము.

748. Mānadaḥ: One who by His power of Maya induces the sense of self in non-self. Or one who has regard and beneficence towards devotees. Or one who destroys in the knowing ones the sense of identification with the non-self.

సమన్వయము: మాన అంటే గర్వము; అంటే అతడు గర్వమును అణచేవాడు

748 ఓం మానదః - అతని మాయ వలన అనాత్మలో ఆత్మ ఉన్నట్లు అనిపిస్తుంది; అతడు భక్తులను బ్రోచేవాడు; అతడు అనాత్మను ఆశ్రయించేవారిని నిర్మూలించేవాడు

749. Mānyaḥ: One who is to be adored by all, because He is the God of all.

749 ఓం మాన్యః - అతడు అందరిచేత ఆదరింపబడేవాడు

750. Lokasvāmī: One who is the Lord of all the fourteen spheres.

750 ఓం లోక స్వామీ - అతడు అన్ని లోకాలకూ అధిపతి

751. Trilokadhṛt: One who supports all the three worlds.

751 ఓం త్రిలోక ధృత్ - అతడు మూడు లోకాలకి ఆధారము

752. Sumedhāḥ: One with great and beneficent intelligence.

752 ఓం సుమేధః - అతడు మిక్కిలి ఉత్కృష్టమైన మేధస్సు గలవాడు

సమన్వయము: సు + మేధ ; మేధ అంటే తెలివితేటలు

753. Medhajaḥ: One who arose from Yaga (a kind of sacrifice).

753 ఓం మేధజః - అతడు యాగము వలన ఉద్భవించేవాడు

సమన్వయము: మేధః అంటే యజ్ఞము; జః అంటే జన్మించినవాడు

754. Dhanyaḥ: One who has attained all His ends and therefore is self satisfied.

754 ఓం ధన్యః - అతడు అన్ని లక్ష్యాలను సాధించి సంతృప్తితో నుండేవాడు

755. Satyamedhāḥ: One whose intelligence is fruitful.

755 ఓం సత్య మేధః - అతని మేధస్సు ఫలములందించేది

756. Dharādharaḥ: One who supports the worlds by His fractiosn like Adisesha.

756 ఓం ధరా ధరః - అతడు లోకాలను పోషించేవాడు

సమన్వయము: ధర అంటే భూమి

tejōvṛṣō dyutidharaḥ sarvaśastrabhṛtāṁ varaḥ,

pragrahō nigrahō vyagrō naikaśṛṅgō gadāgrajaḥ. (81)

757. Tejōvṛṣaḥ: One who in the form of the sun causes rainfall at all times.

757 ఓం తేజో వృషః - అతడు సూర్యుని ఆకృతిలో లోకాలలో తగినంత వర్షము కురిపించువాడు

సమన్వయము: వృష అంటే కోరికలను కురిపించునది; అది వర్షమైనా కావచ్చు

758. Dyutidharaḥ: One whose form is always brilliant.

758 ఓం ద్యుతిధరః - అతని రూపము గొప్ప కాంతివంతమైనది

సమన్వయము: ద్యుతి అంటే గొప్ప కాంతి.

759. Sarva-śastra-bhṛtāṁ varaḥ: One who is superior to all bearing arms.

759 ఓం సర్వ శస్త్ర భృతాం వరః - అతడు ఆయుధములు నున్నవారందరిలో శ్రేష్ఠుడు

సమన్వయము: సర్వ + శస్త్ర + భృతాం + వర ; శస్త్ర అంటే ఆయుధము; భృతము అంటే నింపబడిన; వరః అంటే శ్రేష్ఠుడు ; అంటే అతడు శస్త్రములతో కూడిన వారలలో శ్రేష్ఠుడు

760. Pragrahaḥ: One who accepts the offerings of devotees with great delight.

760 ఓం ప్రగ్రహః - అతడు భక్తులిచ్చే ద్రవ్యములను ప్రీతితో తీసుకొనేవాడు

761. Nigrahaḥ: One who controls and destroys everything.

761 ఓం నిగ్రహః - అతడు సర్వమును నియంత్రించి, నాశము జేసేవాడు

762. Vyagraḥ: One who has no Agra or end. Or one who is very attentive (Vyagra) in granting the prayers of devotees.

762 ఓం వ్యగ్రః - అతనికి అంతము లేదు; భక్తుల కోర్కెలను తీర్చుటకు జాగృతిలో నుండేవాడు

763. Naikaśṛṅgaḥ: One with four horns.

763 ఓం నైక శృంగః - అతనికి నాలుగు కొమ్ములు గలవి

సమన్వయము: నైక అంటే అనేక; శృంగ మంటే కొమ్ము; వరాహ అవతారంలో అతడు కొమ్ములతో యున్నవాడు

764. Gadāgrajaḥ: One who is revealed first by Mantra (Nigada). Or one who is the elder brother of Gada.

764 ఓం గదాగ్రజః - అతడు మంత్రముచే వ్యక్త మయ్యేవాడు; గద యొక్క అన్న

caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,

caturātmā caturbhāvaścaturvedavidekapāt. (82)

765. Caturmūrtiḥ: One with four aspects as Virat, Sutratma, Avyakruta, and Turiya. Or one with four horns with colours white, red, yellow and black.

765 ఓం చతుర్మూర్తిః - అతడు నాల్గు విధములుగా ఒప్పెడివాడు (విరాట్, సుత్రాత్మా, అవ్యాకృతా, తురీయ); నాల్గు కొమ్ములు గలవాడు (తెలుపు, ఎరుపు, పచ్చ, నలుపు)

766. Caturbāhuḥ: One with four arms, as Vasudeva is always described.

766 ఓం చతుర్బాహుః - అతడు నాల్గు కరములు గలవాడు

767. Caturvyūhaḥ: One having four manifestations.

767 ఓం చతుర్వ్యూహః - అతడు నాలుగు వర్ణములు (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర), ఆశ్రమములుగా (బ్రహ్మచర్య, గృహస్తు, వానప్రస్థ, సన్యాస) వ్యక్తమయ్యేవాడు

768. Caturgatiḥ: One who is sought as the end by the four Orders of life and four Varnas ordained by the scriptures.

768 ఓం చతుర్గతిః - అతడు నాలుగు ఆశ్రమములు, వర్ణాలు సూచించేవాడు

769. Caturātmā: One whose self is specially endowed with puissance, because it is without any attachment, antagonism, etc.

769 ఓం చతురాత్మా - అతడు మిక్కిలి శక్తిమంతుడు కావున ఎవరితోనూ బంధము కల్పించుకోడు, ఎవరిపైనా ఆగ్రహించడు

770. Caturbhāvaḥ: One from whom has originated the four human values – Dharma, Artha, Kama, and Moksha.

770 ఓం చతుర్భావః - అతని నుండి ధర్మార్థకామమోక్షాలు ఉద్భవించినవి

771. Catur-vedavid: One who understands the true meaning of the four Vedas.

771 ఓం చతుర్ వేదవిద్ - అతడు నాల్గు వేదాల సార మెరిగినవాడు

772. Ekapāt: One with a single Pada, part or leg. Or one with a single foot or manifestation.

772 ఓం ఏకపాత్ - అతడు వంటి పాదముతో చలించేవాడు

samāvartō nivṛttātmā durjayō duratikramaḥ,

durlabhō durgamō durgō durāvāsō durārihā. (83)

773. Samāvartaḥ: One who effectively whirls the wheel of Samsara.

773 ఓం సమవర్తః - అతడు సంసార చక్రమును నేర్పుతో తిప్పేవాడు

774. Anivrutātmā: One who is not Nivruta (separated from) anything or anywhere, because He is all-pervading.

774 ఓం అని వృతాత్మా - అతడు దేని నుండి విడదీయబడేవాడు కాడు; సర్వాంతర్యామి

సమన్వయము: వృత అంటే విభాగము చేయబడనిది. [భాగవత సప్తమ స్కంధము] ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకసిపునికి విష్ణువు సర్వాంతర్యామి అని ఈ విధంగా చెప్పెను:

ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."

775. Durjayaḥ: One who cannot be conquered.

775 ఓం దుర్జయః - అతనిని జయించలేరు

సమన్వయము: దుర్ + అజయః అంటే జయింపబడనివాడు

776. Duratikramaḥ: One out of fear of whom, even heavenly objects like sun do not dare to oppose His command.

776 ఓం దురతి క్రమః - అతని యందు భయము వలన అంతరిక్షములోనివి చలించు చున్నవి; సూర్యుడు ఒకే కక్ష్యలో ఉండేవాడు

సమన్వయము: దురతిక్రమము అంటే అతిక్రమింపరానది

777. Durlabhaḥ: One who can be attained by Bhakti, which is difficult for a person to be endowed with.

777 ఓం దుర్లభః - అతడు భక్తి ద్వారానే పొందబడేవాడు; అది అందరికీ సాధ్యము కాదు

సమన్వయము: దుర్ + లభః -- కష్టముతో లభించెడి వాడు

778. Durgamaḥ: One whom it is difficult to attain.

778 ఓం దుర్గమః - అతడు మిక్కిలి కష్టముతో పొందబడేవాడు

779. Durgaḥ: One the attainment of whom is rendered difficult by various obstructions.

779 ఓం దుర్గః - అతనిని పొందే సాధనలో అనేక విఘ్నములను దాటవలెను

780. Durāvāsaḥ: He whom the Yogis with very great difficulty bring to reside in their hearts in Samadhi.

780 ఓం దురావాసః -యోగులు అత్యంత కష్టమైన సాధనతో సమాధి స్థితిలో తమ చిత్తమునందు అతనిని ప్రతిష్ఠింతురు

781. Durārihā: One who destroys beings like Asuras.

781 ఓం దురారిహా - అతడు అసురులను సంహరించేవాడు

సమన్వయము: రిహ అంటే సంహరించుట

ubhāṅgō lōkasāraṅgaḥ sutantustantuvardhanaḥ,

indrakarmā mahākarmā kṛtakarmā kṛtāgamaḥ. (84)

782. Śubhāṅgaḥ: One whose form is very auspicious to meditate upon.

782 ఓం శుభాంగః - అతని మంగళ రూపముపై ధ్యానించుటకు వీలైనవాడు

783. Lōkasāraṅgaḥ: One who like the Saranga (honey-beetle) grasps the essence of the world.

783 ఓం లోక సారంగః - అతడు సారంగము (తుమ్మెద) వలె లోక సారమును గ్రహించేవాడు

784. Sutantuḥ: As this universe of infinite extension belongs to Him, the Lord is called Sutantu.

784 ఓం సుతంతుః - అనంతమైన విశ్వమునకు అతడు అధిపతి

785. Tantu-vardhanaḥ: One who can augment or contract the web of this world.

785 ఓం తంతు వర్ధనః - అతడు విశ్వమును వ్యాప్తి చేయగలడు, కుదింపగలడు

సమన్వయము: వర్ధన అంటే పెంపొందించుట

786. Indra-karmā: One whose actions are like that of Indra, that is, are of a highly commendable nature.

786 ఓం ఇంద్ర కర్మా - అతని కర్మలు ఇంద్రుని కర్మల వలె మిక్కిలి ప్రశస్తమైనవి

787. Mahākarmā: One of whom the great elements like Akasha are effects.

787 ఓం మహా కర్మా - అతడు ఉత్కృష్టమైన కర్మలు జేయువాడు

788. Kṛtakarmā: One who has fulfilled everything and has nothing more to accomplish.

788 ఓం కృత కర్మా - అతడు అన్నీ చేసినవాడు; ఇక చేయుటకు ఏమీ లేనివాడు

789. Kṛtāgamaḥ: One who has given out the Agama in the shape of the Veda.

789 ఓం కృతాగమః - అతడు ఆగమములను వేద రూపములో నిచ్చినవాడు

సమన్వయము: కృత + ఆగమః ; ఆగమములు అంటే శృతి, స్మృతి, పురాణములు, మొదలైనవి

udbhavaḥ sundaraḥ sundō ratnanābhaḥ sulōcanaḥ,

arkō vājasanaḥ śṛṅgī jayantaḥ sarvavijjayī . (85)

790. Udbhavaḥ: One who assumes great and noble embodiments out of His own will.

790 ఓం ఉద్భవః - అతడు తలచినంత మాత్రాన ఉన్నతమైన అవతారములు దాల్చును

సమన్వయము: ఉధ్భవ అంటే పుట్టుట లేదా జన్మించుట

791. Sundaraḥ: One who has a graceful attractiveness that surprises everyone.

791 ఓం సుందరః - అతడు మిక్కిలి సౌందర్యవంతుడు

792. Sundaḥ: One who is noted for extreme tenderness (Undanam).

792 ఓం సుందః - అతడు మిక్కిలి కోమలమైనవాడు

793. Ratna-nābhaḥ: Ratna indicates beauty; so one whose navel is very beautiful.

793 ఓం రత్న నాభః - అతని నాభి మిక్కిలి అందమైనది

సమన్వయము: ఇక్కడ రత్న మంటే శ్రేష్ఠమైనది

794. Sulōcanaḥ: One who has brilliant eyes, that is, knowledge of everything.

794 ఓం సులోచనః -అతడు మెరిసే కన్నులు గలవాడు; అవి అతని సర్వజ్ఞతను తెలిపేవి

సమన్వయము: లోచన మంటే కన్నులు

795. Arkaḥ: One who is being worshipped even by beings like Brahma who are themselves objects of worship.

795 ఓం అర్కాః - అతడు పూజింప బడే వారిచే, పూజింపబడేవాడు

796. Vājasanaḥ: One who gives Vajam (food) to those who entreat Him.

796 ఓం వాజసనః - అతడు జీవులను పోషించేవాడు

సమన్వయము: సంస్కృతంలో వాజః అంటే భోజనము లేదా నీరు.

797. Śṛṅgī: One who at the time of Pralaya (cosmic dissolution) assumed the form of a fish having prominent antenna.

797 ఓం శృంగీ - అతడు ప్రళయ కాలమున చేప ఆకారమును పొందెను

సమన్వయము: శృంగీ అంటే పాపమీను; మీను అంటే చేప

798. Jayantaḥ: One who conquers enemies easily.

798 ఓం జయంతః - అతడు శత్రువులను తేలికగా ఓడించేవాడు

సమన్వయము: జయంత అంటే జయించువాడు

799. Sarvavijjayī: The Lord is 'Sarvavit' as He has knowledge of everything. He is 'Jayi' because He is the conqueror of all the inner forces like attachment, anger etc., as also of external foes like Hiranyaksha.

799 ఓం సర్వ విజ్జయీ - అతడు సర్వజ్ఞుడు, అంతర్గత, బాహ్య శత్రువులను జయించేవాడు

suvarṇabindurakṣōbhyaḥ sarvavāgīśvareśvaraḥ,

mahāhradō mahāgartō mahābhūtō mahānidhiḥ. (86)

800. Suvarṇabinduḥ: One whose 'Bindus' that is, limbs, are equal to gold in brilliance.

800 ఓం సువర్ణ బిందుః - అతని చరణములు బంగారు వర్ణముతో మెరిసేవి

సమన్వయము: బిందు అంటే భ్రూమధ్యము; కావున అతని ముఖము బంగారు వర్ణముతో మెరిసేది అని సమన్వయము చేసికోవచ్చు

801. Akṣobhyaḥ: One who is never perturbed by passions like attachment and aversion, by objects of the senses like sound, taste, etc., and by Asuras the antagonists of the Devas.

801 ఓం అక్షోభ్యః - అతడు ఇంద్రియములచే, రాగ ద్వేషములచే, అసురులచే చలించని వాడు

సమన్వయము: అక్షోభ్య అంటే కలత చెందనిది. స్థిరమైనది.

802. Sarva-vāgīśvareśvaraḥ: One who is the master of all masters of learning, including Brahma.

802 ఓం సర్వ వాగీశ్వరేశ్వరః - అతడు జ్ఞానము తక్కిన వారికన్నా శీఘ్రముగా పొందేవాడు

సమన్వయము: సర్వ + వాగీశ్వర + ఈశ్వర ; వాగీశ్వర అంటే వాక్కులకు అధిపతి; అట్టి వారికన్నా విష్ణువు ఉన్నతమైనవాడు

803. Mahāhradaḥ: He is called a great Hrada (lake), because being the paramatman who is of the nature of Bliss, the Yogis who contemplate upon Him dip themselves in that lake of Bliss and attain to great joy.

803 ఓం మహా హ్రదః - అతడు ఒక పెద్ద సరోవరము వలె నుండి యోగులు అందులో మునిగ గొప్ప ఆనందము పొంది నట్లుండును

సమన్వయము: హ్రద అంటే సరోవరము లేదా కొలను

804. Mahāgartaḥ: One whose Maya is difficult to cross like a big pit.

804 ఓం మహా గర్తః - అతని మాయ ఆగాథము వలె దాటుటకు మిక్కిలి కష్టము

సమన్వయము: గర్త అంటే పెద్ద గుంట లేదా అగాథము

805. Mahābhūtaḥ: One who is not divided by the three periods of time past, present and future.

805 ఓం మహా భూతః - అతనికి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ వర్తించవు

806. Mahānidhiḥ: One in whom all the great elements have their support. He is Mahan or a great one and 'Nidhi', the most precious one.

806 ఓం మహా నిధిః - అతడు గొప్ప నిధి వంటి వాడు

kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,

amṛtāśōmṛtavapuḥ sarvajñaḥ sarvatōmukhaḥ. (87)

807. Kumudaḥ: 'Ku' means earth; one who gives joy (muda) to the earth by freeing it of its burdens is Kumuda.

807 ఓం కుముదః - అతడు భూమికి (భూలోక వాసులకు) మిక్కిలి ఆనంద మిచ్చేవాడు

సమన్వయము: కుముద అంటే భూమి యందు సంతోషపడునది లేదా వికసించునది

808. Kundaraḥ: One who offers blessings as pure as Kunda or jasmine.

808 ఓం కుందరః - అతడు మల్లెపువ్వు వలె స్వచ్ఛమైనవి భక్తుల కిచ్చును

సమన్వయము: కుందము అంటే మల్లె పువ్వు

809. Kundaḥ: One who has limbs as beautiful as Kunda or Jasmine.

809 ఓం కుందః - అతని కాళ్ళూ, చేతులూ మల్లె పువ్వు వలె బహు సుందరమైనవి

810. Parjanyaḥ: The word means cloud. One who resembles the cloud in extinguishing the three Tapas (heats, that is, miseries) arising from psychological, material and spiritual causes. Or one who rains all desires like a cloud.

810 ఓం పర్జన్యః - అతడు వర్షించు మేఘమువలె అన్ని కోర్కెలు తీర్చువాడు

సమన్వయము: పర్జన్యము అంటే ఉఱుములూ మెరుపులతో కూడిన మేఘము

811. Pāvanaḥ: One by merely remembering whom a devotee attains purity.

811 ఓం పావనః - అతనిని తలచినంత మాత్రముననే భక్తుడు పరిశుద్ధమగును

సమన్వయము: పావన అంటే పవిత్రమైనది, పవిత్రము చేయునది

812. Anilaḥ: 'Ilanam' means inducement. One who is without any inducement is Anila. Ilana also means sleep. So one who sleeps not or is ever awake is Anila.

812 ఓం అనిలః - అతడు ప్రేరేపించబడు వాడు కాదు

సమన్వయము: అనిల అంటే దేనితో అయితే జీవింతురో. ఉదాహరణకి ప్రాణ వాయువు

813. Amṛtāśaḥ: One who consumes Amruta or immortal bliss, which is His own nature.

813 ఓం అమృతాంశః - అతడు అమృతమును గ్రోలేవాడు

సమన్వయము: అమృతాంశుడు అంటే నిఘంటువు చెప్పే అర్థము చంద్రుడు. పాల సముద్ర మధనములో చంద్రుడు ఆవిర్భవించేడు.

814. Amṛtavapuḥ: One whose form is deathless, that is, undecaying.

814 ఓం అమృత వపుః - అతనికి క్షయము గాని, మరణము గాని లేవు

సమన్వయము: వపు అంటే మారణ కర్మము; విష్ణువుకి మరణము లేదని అన్వయించకోవాలి

815. Sarvajñaḥ: One who is all-knowing.

815 ఓం సర్వజ్ఞః - అతనికి సర్వము విదితము

816. Sarvatōmukhaḥ: One who has faces everywhere.

816 ఓం సర్వతోముఖః - అతని ముఖములు అన్ని దిక్కులా ఉన్నవి

సమన్వయము: సర్వత + ముఖ ; అన్ని దిక్కులా ముఖమున్నవాడు లేదా చూసేవాడు

sulabhaḥ suvrataḥ siddhaḥ śatrujicchatrutāpanaḥ,

nyagrodho’dumbaro’śvatthaścāṇūrāndhraniṣūdanaḥ. (88)

817. Sulabhaḥ: One who is attained easily by offering trifles like leaf, flower, and fruits etc., with devotion.

817 ఓం సులభః - అతడు భక్తులిచ్చే ఫలం, పుష్పం, తోయం తో సంతృప్తి పడేవాడు

818. Suvrataḥ: 'Vratati' means enjoys. So, one who enjoys pure offerings. It can also mean one who is a non-enjoyer, that is, a mere witness.

818 ఓం సువ్రతః - అతడు భక్తులిచ్చే శుద్ధమైనవి స్వీకరించేవాడు; అతడు అంతటికీ సాక్షి

సమన్వయము: సు + వ్రత ; వ్రత అనగా శుభాశుభఫలమును కప్పి వుంచునది. వ్రతము; ప్రతిజ్ఞా పాలనము;

సమన్వయము:

819. Siddhaḥ: One whose objects are always attained, that is, omnipotent and unobstructed by any other will.

819 ఓం సిద్ధః - అతడు తలచినది సాధించేవాడు

820. Śatrujit: Conqueror of all forces of evil.

820 ఓం శత్రుజిత్ - అతడు దుష్ట శక్తులను నిర్మూలించేవాడు

821. Śatrutāpanaḥ: One who destroys the enemies of the Devas.

సమన్వయము: జిత్ అంటే జయించువాడు

821 ఓం శత్రుతాపనః - అతడు దేవతల శత్రువులను సంహరించేవాడు

822. Nyagrodhaḥ: That which remains above all and grows downward. That is, He is the source of everything that is manifest.

822 ఓం న్యగ్రోధః - అతడు వ్యక్తమై యున్న వాటంతిటికీ యోని

సమన్వయము: న్యగ్రోధ అంటే క్రిందికి పెరుగునది. వట వృక్షము, మఱ్రిచెట్టు

823. Udumbaraḥ: One who as the Supreme cause is 'above the sky', that is, superior to all.

823 ఓం ఉదుంబరః - అతడు ఆకాశమునకు బాహ్యముగా ఉన్నాడు; అందరికన్నా ఉత్కృష్టమైనవాడు

సమన్వయము: ఉత్ + అంబరం; ఉత్ అంటే మిన్న; అంబరము అంటే ఆకాశము

824. Aśvatthaḥ: That which does not last even for the next day.

824 ఓం అశ్వత్థః - ఏదైతే రేపు ఉండదో; ఏదీ శాశ్వతము కాదని చెప్పే అశ్వత్థ వృక్షము

825. Cāṇūrāndhra-niṣūdanaḥ: One who destroyed a valiant fighter Chanura belonging to the race of Andhra.

825 ఓం చాణూరాంధ్ర నిషూదనః - అతడు ఆంధ్ర కి చెందిన చాణూర అనే యోధుని అంతముచేసెను

సమన్వయము: నిషూదన అంటే చంపుట

sahasrārciḥ saptajihvaḥ saptaidhāḥ saptavāhanaḥ,

amūrtiranaghōcintyō bhayakṛdbhayanāśanaḥ. (89)

826. Sahasrārciḥ: One with innumerable Archis or rays.

826ఓం సహస్రార్చిః - అతడు అనేక కిరణములతో భాసిల్లువాడు

సమన్వయము: అర్చి అంటే కిరణము

827. Sapta-jihvaḥ: The Lord in his manifestation as Fire is conceived as having seven tongues of flame.

827 ఓం సప్త జిహ్వః - అతడు ఏడు నాలుకలు ఉండే అగ్నితో పోల్చబడేవాడు

సమన్వయము: సప్త అంటే 7; జిహ్వ అంటే నాలుక. అగ్నిని సప్త జిహ్వ అంటారు. ఎందుకంటే అగ్నికి ఈ ఏడు నాలుకలు గలవని అంటారు: విశ్వమూర్తి, కరాళాస్యా, కాళీ, మనోజవా, ధూమ్రవర్ణా, స్ఫులింగినీ, లోహితాస్యా

828. Saptaidhāḥ: The Lord who is of the nature of fire has seven Edhas or forms of brilliance.

828 ఓం సప్తైధః - అతడు అగ్ని రూపాముతో ఏడు రకములైన ప్రకాశము గలవాడు

829. Saptavāhanaḥ: The Lord in the form of Surya or sun has seven horses as his vehicles or mounts.

829 ఓం సప్త వాహనః - అతడు ఏడు అశ్వములతో ఉండే రథముతో పయనించే సూర్యునితో పోల్చబడినాడు

830. Amūrtiḥ: One who is without sins or without sorrow.

830 ఓం అమూర్తిః - అతడు పాపము చెయ్యడు; అతనికి దుఃఖము కలుగదు

831. Achintyo: One who is not determinable by any criteria of knowledge, being Himself the witnessing Self- certifying all knowledge.

831 ఓం అచింత్యో - అతడు జ్ఞానముచే నిర్ధారింపబడేవాడు కాదు

సమన్వయము: చింత అంటే తలపు; అచింత్యో అంటే అతడు ఆలోచన మాత్రాన పట్టుబడడు

832. Anaghaḥ: One who is without sins or without sorrow.

832 ఓం అనఘః - అతనికి పాపములు గాని దుఃఖము గాని లేవు

సమన్వయము: అనఘ అంటే పాపము, దుఃఖము, చెడ్డ అలవాటు, కలుషితము లేనివాడు.

833. Bhayakṛud: One who generates fear in those who go along the evil path. Or one who cuts at the root of all fear.

833 ఓం భయకృద్ - అతడు చెడు మార్గములో నడిచేవారికి భీతిని కలిగించేవాడు;సజ్జనుల భీతిని తొలగించేవాడు

834. Bhaya-nāśanaḥ: One who destroys the fears of the virtuous.

834 ఓం భయ నాశనః - అతడు ధర్మపరుల భయమును పారద్రోలేవాడు

aṇurbṛhatkṛśaḥ sthūlō guṇabhṛnnirguṇō mahān,|

adhṛtassvadhṛtasvāsyaḥ prāgvaṁśō vaṁśavardhanaḥ. (90)

835. Aṇuḥ: One who is extremely subtle.

835 ఓం అనుః - అతడు చతురుడు

836. Bṛhat: The huge and mighty.

836 ఓం బృహత్ - అతడు స్థూలమైన, శక్తివంతమైన వాడు

837. Kṛśaḥ: One who is non-material.

837 ఓం కృశః - అతడు అభౌతికము

సమన్వయము: కృశ అంటే చిన్నది; అల్పమైనది, సూక్ష్మమైనది. కాబట్టి విష్ణువు సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు

838. Sthūlaḥ: Being the inner pervader of all, He is figuratively described as Stula or huge.

838 ఓం స్థూలః - అతడు స్థూలమైన వాడు

839. Guṇa-bhṛt: The support of the Gunas. He is so called because in the creative cycle of creation, sustentation, and dissolution, He is the support of the Gunas – Satva, Rajas and Tamas – with which these functions are performed.

839 ఓం గుణ భృత్ - అతడు త్రిగుణాలకు ఆధారము

840. Nirguṇaḥ: One who is without the Gunas of Prakruti.

840 ఓం నిర్గుణః - అతడు ప్రకృతి వలన కలిగే గుణములు లేనివాడు

సమన్వయము: నిర్ + గుణః అంటే గుణములు లేనివాడు

841. Mahān: The great.

841 ఓం మహాన్ - ఉత్కృష్టమైనది

842. Adhṛutaḥ: One who, being the support of all supporting agencies, like Pruthvi (Earth), is not supported by anything external to Him.

842 ఓం అదృతః - అతడు భారము వహించేవాటిని మోసేవాడు; అతనికి బాహ్యము నుండి ఎట్టి సహాయము లేదు

సమన్వయము: ధృత అంటే స్థిరంగా ఉన్నది

843. Svadhṛtaḥ: One supported by oneself.

843 ఓం స్వధృతః - అతడు తనకు తానే ఆధారము

844. Svāsyaḥ: One whose face is beautiful and slightly red like the inside of a lotus flower.

844 ఓం స్వాస్యః - అతడు కలువ పూవువలె ఎర్రని ముఖము గలవాడు

845. Prāgvaṁśaḥ: The family lines of others are preceded by the lines of still others, but the Lord's descendent, namely, the world system, is not preceded by anything else.

845 ఓం ప్రాగ్వంశః - అతనికి వంశము లేదు; పితృదేవతలు లేరు

సమన్వయము: ప్రాగ్వంశ అంటే తూర్పు దిక్కునున్న గృహము

846. Vaṁśavardhanaḥ: One who augments or destroys the world system, which is His off-spring.

846 ఓం వంశవర్ధనః - అతడు తన సంతతి అయిన సృష్టిని పెంపొందించ గలడు, నాశము చేయగలడు

సమన్వయము: వర్ధన అంటే పెరిగేది

bhārabhṛt kathitō yōgī yōgīśaḥ sarvakāmadaḥ,

ramaḥ śramaṇaḥ, kṣāmaḥ suparṇō vāyuvāhanaḥ. (91)

847. Bhārabhṛt: One who bears the weight of the earth assuming the form of Ananta.

847 ఓం భారభృత్ - అతడు అనంత అనబడే రూపంతో భూమి భారాన్ని మోసేవాడు

848. Kathitaḥ: One who is spoken of as the highest by the Veda or one of whom all Vedas speak.

848 ఓం కథితః - అతడు వేదాలలో అత్యోత్తముడు అని కీర్తించబడెను

సమన్వయము:

849. Yogī: Yoga here means knowledge. So He who is attained by that is Yogi. Or Yoga means Samadhi. He who is ever established in His own Self, that is, the Paramatma. He is therefore Yogi.

849 ఓం యోగీ - అతడు యోగివలె సమాధిలో నుండి, తనలోనే రమించు వాడు

850. Yogīśaḥ: He who is never shaken from Yoga or knowledge and establishment in His own Self, unlike ordinary Yogis who slip away from Yoga on account of obstacles.

850 ఓం యోగీశః - అతడు యోగములో స్థిరమైనవాడు

సమన్వయము: యోగ + ఈశః అంటే యోగులకు అధిపతి

851. Sarva-kāmadaḥ: One who bestows all desired fruits.

851 ఓం సర్వ కామదః - అతడు భక్తులకు కాంక్షించినవన్నీ వొసగేవాడు

సమన్వయము: కామద అంటే కోరిక

852. Āśramaḥ: One who is the bestower of rest on all who are wandering in the forest of Samsara.

852 ఓం ఆశ్రమః - అతడు సంసారమనే అరణ్యములో చిక్కుకున్నవారికి ఆశ్రయుడు

853. Śramaṇaḥ: One who brings tribulations to those who live without using their discriminative power.

853 ఓం శ్రమణః - అతడు తమ శక్తిని సద్వినియోగము చేయలేనివారికి కష్టాలు కలిగించేవాడు

సమన్వయము: శ్రమణ అంటే శ్రమించువాడు; తపస్సు చేయువాడు;

854. Kṣāmaḥ: He who brings about the decline of all beings.

854 ఓం క్షమః - అతడు అన్ని జీవులను క్షయిం జేసేవాడు

855. Suparṇaḥ: The lord who has manifested Himself as the tree of Samsara has excellent leaves (Parna) in the form of Vedic passages (Chandas).

855 ఓం సుపర్ణః - అతడు సంసార వృక్షము వలె నవతరించినవాడు; దాని ఆకులు వేద మంత్రములు

సమన్వయము: సుపర్ణ అంటే మంచి రెక్కలు కలవాడు. గరుత్మంతుడు అని కూడా అర్థాలున్నాయి

856. Vāyuvāhanaḥ: He for fear of whom Vayu (Air) carries all beings.

856 ఓం వాయు వాహనః - అతనికి భయపడి వాయుదేవుడు అందరిని మోయువాడు

dhanurdharō dhanurvedō daṅḍō damayitā damaḥ,

aparājitassarvasahō niyantā niyamō yamaḥ. (92)

857. Dhanurdharaḥ: He who as Rama wielded the great bow.

857 ఓం ధనుర్ధరః - అతడు రామావతారంలో గొప్ప ధనుస్సును ధరించినవాడు

858. Dhanurvedaḥ: He who as the same Rama, the son of Dasharatha, was the master of the science of archery.

858 ఓం ధనుర్వేదః - అతడు రామావతారంలో ధనుర్విద్యలో ఆరితేరినవాడు

859. Daṅḍaḥ: He who is discipline among the disciplinarians.

859 ఓం దండః - అతడు క్రమశిక్షణకి ప్రతిరూపము

సమన్వయము: దండించుట అంటే శిక్షించుట

860. Damayitā: He who inflicts punishments on people as Yama and as king.

860 ఓం దమయిత - అతడు పాపులను యముడివలె శిక్షించువాడు

సమన్వయము: దమ అంటే దండించుట

861. Damaḥ: He who is in the form of self-descipline in men as a result of enforcement.

861 ఓం దమః - అతని నియంత్రణ వలన జనులు క్రమశిక్షణ కలిగి ఉంటారు

862. Aparājitaḥ: One who is never defeated by enemies.

862 ఓం అపరాజితః - అతనిని ఎటువంటి శత్రువు జయించలేడు

863. Sarvasahaḥ: One who is expert in all Karmas (works).

863 ఓం సర్వ సహః - అతడు అన్ని క్రియలలో కౌశల్యము గలవాడు

సమన్వయము: సర్వ అంటే అన్నిటిలోనూ ; సహ అంటే బలిమి

864. Niyantā: One who appoints every person to his respective duties.

864 ఓం నియంతా - అతడు జీవులకు విధులు నిర్ణయించే వాడు

865. Aniyamaḥ: One on whom there is no enforcement of any law, or above whom there can be no overlord to enforce anything, as He is the controller of everything.

865 ఓం అనియమః - అతనిని నియంత్రించునది ఏదీ లేదు; అతడే సర్వమును నియంత్రించే వాడు

సమన్వయము: అ + నియమ; నియమ అంటే నియంత్రించునది

866. Ayamaḥ: One on whom Yama has no control, that is one who has no death.

866 ఓం అయమః - అతని మీద యమునికి ఎట్టి నియంత్రణ లేదు; అతనికి మరణము లేదు

సమన్వయము: అ+ యమ

sattvavān sāttvikaḥ satyaḥ satyadharmaparāyaṇaḥ,

abhiprāyaḥ priyārho’rhaḥ priyakṛt pritivardhanaḥ. (93)

867. Satvavān: One who has got the strengthening qualities like heroism, prowess, etc.

867 ఓం సత్వవాన్ - అతడు గొప్ప వీరుడు, శక్తిమంతుడు

868. Sāttvikaḥ: One who is established essentially in the Satva Guna.

868 ఓం సాత్త్వికః - అతడు సత్త్వ గుణములో స్థితమైనవాడు

869. Satyaḥ: One who is truly established in good people.

869 ఓం సత్యః - అతడు సజ్జనులలో ఉండేవాడు

870. Satya-dharma-parāyaṇaḥ: One who is present in truthfulness and righteousness in its many aspects.

870 ఓం సత్య ధర్మ పరాయణః - అతడు సత్యము, ధర్మము మొదలగువానిలో ఉండేవాడు

871. Abhiprāyaḥ: The One who is sought after by those who seek the ultimate values of life (Purushartha).

871 ఓం అభిప్రాయః - అతనిని పురుషార్థములు కాంక్షించు వారు అర్థించెదరు

సమన్వయము: అభిప్రాయ అంటే ఆశయము, కోరిక

872. Priyārhaḥ: The being to whom the objects that are dear to oneself, are fit to be offered.

872 ఓం ప్రియార్హః - అతడు భక్తులచే తమకు ప్రియమైన వస్తువులను ఇవ్వబడేవాడు

873. Arhaḥ: One who deserves to be worshipped with all the ingredients and rites of worship like offerings, praise, prostration, etc.

873 ఓం అర్హః - అతడు అర్చించుటకు గొప్ప అర్హత గలవాడు

874. Priyakṛt: One who is not only to be loved but who does what is good and dear to those who worship Him.

874 ఓం ప్రియకృత్ - అతడు ప్రేమించబడేవాడు; తనను పూజించు వారికి శుభము కలుగజేయువాడు

875. Pritivardhanaḥ: One who enhances the joys of devotees.

875 ఓం ప్రీతి వర్ధనః - అతడు భక్తుల ఆనందమును బహుళీకృతము చేసేవాడు

సమన్వయము: వర్ధన అంటే వృద్ధి చేయుట

vihāyasagatirjyōtiḥ surucirhutabhugvibhuḥ,

ravirvirōcanaḥ sūryaḥ savitā ravilōcanaḥ. (94)

876. Vihāyasa-gatiḥ: One who is the support of Vishnupada.

876 ఓం విహాయస గతిః - అతడు పరమపదమును పొందుటకు సహకరించేవాడు

సమన్వయము: విహాయ అంటే ఆకాశము; గతి అంటే త్రోవ

877. Jyotiḥ: One who is the light of self-luminous consciousness that reveals oneself as well as other things.

877 ఓం జ్యోతిః - అతడు చైతన్యముతో ప్రకాశించే దివ్య కాంతి స్వరూపము

878. Suruciḥ: The Lord whose Ruchi i.e. brilliance or will, is of an attractive nature.

878 ఓం సురుచిః - అతని రుచి (ప్రకాశము) బహు ఆకర్షణ గలది

సమన్వయము: రుచి అంటే ప్రకాశము, సూర్య కిరణము

879. Hutabhuk: One who eats, that is, receives, whatever is offered to whatever deities (Devas) in all sacrifices.

879 ఓం హుతభుక్ - అతడు దేవతలకు అందించే హవిస్సును స్వీకరిస్తాడు

880. Vibhuḥ: One who dwells everywhere. Or one who is the master of all the three worlds.

880 ఓం విభుః - అతడు సర్వాంతర్యామి

881. Raviḥ: One who absorbs all Rasas (fluids) in the form of the Sun.

881 ఓం రవిః - అతడు సూర్యుని రూపములో నుండెడివాడు

882. Virōcanaḥ: One who shines in many ways.

882 ఓం విరోచనః - అతడు అనేక విధములుగా మెరిసేవాడు (రాక్షసులను పాలించే విరోచనుడు)

883. Sūryaḥ: One who generates Shri or brilliance in Surya. Or Agni (Fire) is what is called Surya.

883 ఓం సూర్యః - అతడు సూర్యునిలో అగ్నిని (వేడిని) రగిల్చేవాడు

884. Savitā: One who brings forth (Prasava) all the worlds.

884 ఓం సవితా - అతడు అన్ని లోకముల ఆవిర్భావమునకు కారకుడు

సమన్వయము: ఇక్కడ సవితా అంటే తండ్రి; అతడు అన్ని లోకాలకు తండ్రి వంటివాడు

885. Ravi-lōcanaḥ: One having the sun as the eye.

885 ఓం రవి లోచనః - అతడు సూర్యుని నేత్రముగా గలవాడు

సమన్వయము: లోచన అంటే కన్నులు

anantō hutabhugbhōktā sukhadō naikajōgrajaḥ,

anirviṇṇaḥ sadāmarṣī lōkādhiṣṭhānamadbhutaḥ. (95)

886. Anantaḥ: One who is eternal, all-pervading and indeterminable by space and time.

886 ఓం అనంతః - అతడు సర్వ వ్యాపకుడు

887. Hutabhuk: One who consumes what is offered in fire sacrifices.

887 ఓం హుతభుక్ - అతడు యజ్ఞములో సమర్పించినవి స్వీకరించేవాడు

888. Bhoktā: One to whom the unconscious Prakruti is the object for enjoyment.

888 ఓం భోక్తా - అతనికి జడమైన ప్రకృతి ఆహ్లాదకరమైనది

889. Sukhadaḥ: One who bestows liberation (M౦ksha) on devotees.

889 ఓం సుఖదః - అతడు భక్తులకు మోక్షము నిచ్చేవాడు

890. Naikajaḥ: One who takes on birth again and again for the preservation of Dharma.

890 ఓం నైకజః - అతడు ధర్మ రక్షణకై అనేక జన్మలు పొందేవాడు

సమన్వయము: నైక అనేక ; జః అంటే జన్మ ; అంటే ధర్మ సంరక్షణకై అనేక అవతారములు ఎత్తేవాడు

891. Agrajaḥ: One who was born before everything else, that is, Hiranyagarbha.

891 ఓం అగ్రజః - అతడు అందరికన్న పూర్వీకుడు

892. Anirviṇṇaḥ: One who is free from all sorrow, because he has secured all his desires and has no obstruction in the way of such achievement.

892 ఓం అనిర్విణ్ణః - అతనికి దుఃఖము లేదు; అతడు అన్నిటిని కలిగినవాడు

సమన్వయము: అనిర్విణ్ణ అంటే దుఃఖము లేనివాడు

సమన్వయము:

893. Sadāmarṣī: One who is always patient towards good men.

893 ఓం సదామర్షీ - అతడు సజ్జనులయందు సహనము గలవాడు

సమన్వయము: మర్ష అంటే సహనము, ఓర్పు

894. Lōkādhiṣṭhānam: Brahman who, though without any other support for Himself, supports all the three worlds.

894 ఓం లోకాధిష్ఠానం - అతడు బ్రహ్మన్ కాబట్టి ఎట్టి ఆధారము లేక లోకములకు ఆధారమై ఉన్నవాడు

సమన్వయము: లోక + అధిష్ఠానం ; అధిష్ఠానము అంటే ఆధారము

895. Adbhutaḥ: The wonderful being.

895 ఓం అద్భుతః - అతడు అద్భుతమైనవాడు

sanātsanātanatamaḥ kapilaḥ kapiravyayaḥ,

svastidaḥ svastikṛtsvasti svastibhuksvastidakṣiṇaḥ. (96)

896. Sanāt: The word Sanat indicates a great length of time. Time also is the manifestation of the Supreme Being.

896 ఓం సనాత్ - అతడు సనాతనమైన వాడు; కాలమును సృష్టించినవాడు

897. Sanātanatamaḥ: Being the cause of all, He is more ancient than Brahma and other beings, who are generally considered eternal.

897సనాతన తమః - అతడు సనాతనుడై అన్నిటికీ కారణమైనవాడు

898. Kapilaḥ: A subterranean fire in the ocean is Kapila, light red in colour.

898 ఓం కపిలః - సముద్రములోని అగ్ని; అతడు ఎర్రని ఛాయ గలవాడు

899. Kapiḥ: 'Ka' means water. One who drinks or absorbs all water by his Kapi, that is, the sun.

899 ఓం కపిః - అతడు సూర్యునిచే జలమంతటిని ఆవిరి చేసేవాడు

సమన్వయము: క అంటే నీరు

900. Avyayaḥ: One in whom all the worlds get dissolved in Pralaya.

900 ఓం అవ్యయః - ప్రళయ కాలములో లోకాలు అతనిలో లీనమయ్యేవి

సమన్వయము: అవ్యయ అంటే శాశ్వతమైనది

901. Svastidaḥ: One who gives what is auspicious to devotees.

901 ఓం స్వస్తిదః - అతడు భక్తులకు శుభము కలిగించేవాడు

902. Svastikṛt: One who works bestowing what is good.

902 ఓం స్వస్తికృత్ - అతడు సదా శుభములు ప్రసాదించేవాడు

903. Svasti: One whose auspicious form is characterized by supreme Bliss.

903 ఓం స్వస్తి - అతని శుభకరమైన రూపము మిక్కిలి సంతోష దాయకము

904. Svastibhuk: One who enjoys the Svasti mentioned above or who preserves the Svasti of devotees.

904 ఓం స్వస్తిభుక్ - శుభములను ఆశ్వాదించేవాడు; భక్తులకు సద్గతులు ఇచ్చేవాడు

905. Svastidakṣiṇaḥ: One who augments as Svasti (auspiciousness).

905 ఓం స్వస్తి దక్షిణః - అతడు భక్తులకు శుభకరమైనవి ఇచ్చువాడు

araudraḥ kunḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,

abdātigaḥ śabdasahaḥ śiśiraḥ śarvarīkaraḥ. (97)

906. Araudraḥ: Action, attachment and anger these three are Raudra. The Lord is one whose desires are all accomplished, so He has no attachment or aversion. So He is free from the Raudras mentioned above.

906 ఓం అరౌద్రః - అతడు రౌద్రము లేనివాడు

907. Kunḍalī: One who has taken the form of Adisesha.

907 ఓం కుండలీ - అతడు ఆదిశేషుని రూపములో నుండెడివాడు

సమన్వయము: ఇక్కడ కుండలీ అంటే సర్పము

908. Cakrī: One who sports in his hand the discus named Sudarshana, which is the category known as Manas, for the protection of all the worlds.

908 ఓం చక్రీ - అతడు సుదర్శన చక్రమును లోక సంరక్షణకై ధరించెడివాడు

909. Vikramī: Vikrama means taking a stride, as also courage.

909 ఓం విక్రమీ - అతడు మిక్కిలి పరాక్రమవంతుడు

910. Ūrjita-śāsanaḥ: One whose dictates in the form of shrutis and smrutis are of an extremely sublime nature.

910 ఓం ఊర్జిత శాసనః - అతడు శృతి, స్మృతుల రూపములో శాసించేవాడు

సమన్వయము: ఊర్జిత అంటే ధృఢము, బలము

911. Śabdātigaḥ: One who cannot be denoted by any sound because He has none of the characteristics, which could be grasped by sound.

911 ఓం శబ్దాతిగః - అతనిని శబ్దముతో పోల్చ లేము

912. Śabdasahaḥ: One who is the purport of all Vedas.

912 ఓం శబ్దసహః - అతడు అన్ని వేదాల సారము

913. Śiśiraḥ: One who is the shelter to those who are burning in the three types of wordly fires – sufferings arising from material causes, psychological causes and spiritual causes.

913 ఓం శిశిరః - అతడు భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక బాధితులకు ఆశ్రయము

సమన్వయము: శిశిర అంటే చల్లనిది

914. Śarvarīkaraḥ: For those in bondage, the Atman is like Sarvari (night) and for an enlightened one the state of samsara is like night (Sarvari). So the Lord is called the one who generates Sarvari or night for both the enlightened and the bound ones.

914 ఓం శర్వరీకరః - అతడు జ్ఞానులకు, సంసారములో ఇరుక్కొన్నవారికై రాత్రిని (విశ్రాంతిని) పుట్టించేడు

సమన్వయము: శర్వరీ అంటే రాత్రి

akrūraḥ peśalō dakṣō dakṣiṇaḥ, kṣamiṇāṁ varaḥ,

vidvattamō vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ. (98)

915. Akrūraḥ: One who is without cruelty.

915 ఓం అక్రూరః - అతడు క్రౌర్యము లేనివాడు

916. Peśalaḥ: One who is handsome in regard to His actions, mind, word and body.

916 ఓం పేశలః - అతని కర్మలు, మనస్సు, అభయము, దేహముల వలన మిక్కిలి సౌందర్యవంతుడు

సమన్వయము: పేశల అంటే సౌందర్యము కలది

917. Dakṣaḥ: One who is fullgrown, strong and does every thing quickly, such a person is Daksha.

917 ఓం దక్షః - అతడు దక్షత, సామర్థ్యము గలవాడు

918. Dakṣiṇaḥ: This word is also means the same as the above Nama.

918 ఓం దక్షిణః - అతడు దక్షత, సామర్థ్యము గలవాడు

సమన్వయము: దక్షిణః అంటే అనేక అర్థములు గలవు : పరకార్యములందు ఉత్సాహము చూపువాడు; సరళస్వభావుడు; కుడి చేయివలె సమర్థవంతముగా చేయువాడు.

919. Kṣamiṇāṁ varaḥ: The greatest among the patient ones, because He is more patient than all Yogis noted for patience.

919 ఓం క్షమిణాం వరః - అతడు అందరికన్నా మిన్నయైన సహనము గలవాడు

సమన్వయము: క్షమిణ అంటే ఓర్పు, క్షమా గుణము కలవాడు ;

920. Vidvattamaḥ: He who has got the unsurpassable and all-inclusive knowledge of everything.

920 ఓం విద్వత్తమః - అతడు సంపూర్ణమైన జ్ఞానము గలవాడు

921. Vītabhayaḥ: One who, being eternally free and the Lord of all, is free from the fear of trnsmigratory life.

921 ఓం వీతభయః - అతడు పునర్జన్మ యందు భీతి లేనివాడు

సమన్వయము: వీతభయ అంటే భయము లేనివాడు

922. Puṇya-śravaṇa-kīrtanaḥ: One to hear about whom and to sing of whom is meritorious.

922 ఓం పుణ్య శ్రవణ కీర్తనః - అతని గురించి ఆలకించినా, కీర్తనలు పాడినా పుణ్యము చేకూరును

సమన్వయము: శ్రవణ అంటే ఆలకించడం

uttāraṇō duṣkṛtihā puṇyō duḥsvapnanāśanaḥ,

vīrahā rakṣaṇassantō jīvanaḥ paryavasthitaḥ. (99)

923. Uttāraṇaḥ: One who takes beings over to the other shore of the ocean of Samsara.

923 ఓం ఉత్తారణః - అతడు సంసార సాగరమును దాటించేవాడు

సమన్వయము: ఉత్తారణము అంటే దాటించుట, రక్షించుట

924. Duṣkṛtihā: One who effaces the evil effects of evil actions. Or one who destroys those who perform evil.

924 ఓం దుష్కృతిహ - అతడు చెడు కర్మల దుష్ఫలితమును తొలగించువాడు; దుష్టులను సంహరించేవాడు

925. Puṇyaḥ: One who bestows holiness on those who remember and adore Him.

925 ఓం పుణ్యః - అతనిని స్మరించువారలను, ప్రేమించువారలను పవిత్రము గావించేవాడు

926. Duḥsvapna-nāśanaḥ: When adored and meditated upon, He saves one from dreams foreboding danger. Hence He is called so.

926దుస్వప్న నాశనః - అతడు భీతిని కలిగించే స్వప్నములనుండి రక్షించువాడు

సమన్వయము: దుః + స్వప్న + నాశనః

927. Vīrahā: One who frees Jivas from bondage and thus saves them from the various transmigratory paths by bestowing liberation on them.

927 ఓం వీరః - అతడు జీవులకు మోక్షము నొసగగలవాడు

928. Rakṣaṇaḥ: One who, assuming the Satvaguna, protects all the three worlds.

928 ఓం రక్షణః - అతడు సత్త్వ గుణము కలిగి మూడు లోకాలను రక్షించేవాడు

929. Santaḥ: Those who adopt the virtuous path are called good men (Santah).

929 ఓం శాంతః - ధర్మ మార్గము అనుసరించే సజ్జనులు

930. Jīvanaḥ: One who supports the lives of all beings as Prana.

930 ఓం జీవనః - అందరిలో ప్రాణ రూపములో చరించేవాడు

931. Paryavasthitaḥ: One who remains pervading everywhere in this universe.

931పర్య వస్థితః - అతడు సర్వము నందు ఉండేవాడు

anantarūpōnantaśrīrjitamanyurbhayāpahaḥ,

caturaśrō gabhīrātmā vidiśō vyādiśō diśaḥ. (100)

932. Ananta-rūpaḥ: One who has innumerable forms, as He dwells in this all-comprehending universe.

932 ఓం అనంత రూపః - అతనికి అనేక రూపములు గలవు

933. Anantaśrīḥ: One whose Shri (glory) is infinite.

933 ఓం అనంత శ్రీః - అతనికి అనంతమైన శ్రీ కలదు

934. Jita-manyuḥ: One who has overcome anger.

934 ఓం జిత మన్యుః - అతడు క్రోధమును అధిగమించినవాడు

సమన్వయము: ఇక్కడ మన్యు అంటే శోకము, క్రోధము మొదలైనవి

935. Bhayāpahaḥ: One who destroys the fears of beings from Samsara.

935 ఓం భయాపహః - అతడు జీవుల సంసార భీతి తొలగించువాడు

936. Caturaśraḥ: One who is just, because He bestows on Jivas the fruits of their Karma.

936 ఓం చతురశ్రః - అతడు న్యాయమును పాటించువాడు; కర్మ ఫలమును ఇచ్చేవాడు

సమన్వయము: చతురశ్రము అంటే నిఘంటువు చెప్పేది నాల్గు కోణములు గలది

937. Gabhirātmā: One whose nature is unfathomable.

937 ఓం గభీరాత్మ - అతని తత్త్వమును తెలిసికోలేము

సమన్వయము: గభీర అంటే లోతైనది, అగమ్యము

938. Vidiśaḥ: One who distributes various furits of actions to persons differing in their forms according to competency.

938 ఓం విదిశః - అతడు కర్మ ఫలమును ప్రతిభకు తగ్గట్టు ఇచ్చేవాడు

సమన్వయము: విదిశ అంటే దిక్కులు తెలియనివాడు, దిక్కు తోచనివాడు; ఇక్కడ అట్టివారికి విష్ణువు ఆధారము

939. Vyādiśaḥ: One who gives to Indra and other deities directions according to their varied functions.

939 ఓం వ్యాదిశః - అతడు దేవతలను ఆజ్ఞాపించేవాడు

సమన్వయము: వ్యాదిశ అంటే ప్రాణులను, జగత్తును తమ తమ కర్మల యందు నియోగించువాడు.

940. Diśaḥ: One who in the form of the Vedas bestows the fruits of their ritualistic actions on different beings.

940 ఓం దిశః - అతడు వేద స్వరూపుడు గాన వేద కర్మములకు ఫలములను ఇచ్చేవాడు

సమన్వయము: దిశ అంటే చూపుట; ఆజ్ఞాపించుట; చెప్పుట; ఇచ్చుట. ఇక్కడ ఇచ్చుట అని అర్థము తీసికోవాలి.

anādirbhūrbhuvō lakṣmīssuvīrō rucirāṅgadaḥ,

jananō janajanmādirbhīmō bhīmaparākramaḥ. (101)

941. Anādiḥ: One who has no beginning because He is the ultimate cause of all.

941 ఓం అనాదిః - అతనికి పుట్టుక లేదు

సమన్వయము: ఆది అంటే పుట్టుక లేక జననము

942. Bhūrbhuvaḥ: 'Bhu' means support. One who is the support (Bhu) of even the earth, which is known to support all things.

942 ఓం భూర్భువః - అతడు భూమికి ఆధారము

సమన్వయము: భువ అంటే ఆకాశము; భూ అంటే భూమి; కాబట్టి అతడు అన్నిటికీ ఆధారము

943. Lakṣmiḥ: He who is the bestower of all that is auspicious to the earth besides being its supporter.

943 ఓం లక్ష్మీః - అతడు భూమికి ఆధారమై శుభము చేకూర్చువాడు

944. Suvīraḥ: One who has many brilliant ways of manifestation.

944 ఓం సువీరః - అతడు అనేక విధములుగా వ్యక్తమయ్యేవాడు

945. Ruchirāṅgadaḥ: One who has very attractive armlets.

945 ఓం రుచిరాంగదః - అతని చేతి కంకణములు విలక్షణమైనవి

946. Jananaḥ: One who gives birth to living beings.

946 ఓం జననః - అతడు జీవులకు తండ్రివంటివాడు

947. Jana-janmādiḥ: One who is the root cause of the origin of Jivasthat come to have embodiment.

947 ఓం జన జన్మాదిః - అతడు జీవుల ఉద్భవమునకు మూల కారకుడు

948. Bhimaḥ: One who is the cause of fear.

948 ఓం భీమాః - అతడు భీతికి కారణము

949. Bhima-parākramaḥ: One whose power and courage in His incarnations were a cause of fear for the Asuras.

949 ఓం భీమ పరాక్రమః - అతని శక్తి, ధైర్యము అనేక అవతారములలో అసురులను భయపెట్టేది

dhāranilayōdhātā puṣpahāsaḥ prajāgaraḥ,

rdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ. (102)

950. Ādhāra-nilayaḥ: One who is the support of even all the basic supporting factors like the five elements – Ether, Air, Fire, Water and Earth.

950 ఓం ఆధార నిలయః - అతడు పంచ తన్మాత్రలకు ఆధారము

951. Adhātā: One who is one's own support and therefore does not require another support.

951 ఓం అధాతా - అతడు స్వతంత్రుడు; ఎవరి ఊత అక్కర లేనివాడు

952. Puṣpahāsaḥ: One whose manifestation as the universe resembles the Hasa or blooming of buds into flowers.

952 ఓం పుష్పహాసః - అతని సృష్టి యొక్క వ్యక్త రూపము వికసించు పుష్పము వలె నుండెడిది

సమన్వయము: హాస్యము అంటే చిరునవ్వు అని అర్థము కూడా కలదు; అంటే అతని చిరునవ్వు పుష్పము వికసించు నట్లుండేది

953. Prajāgaraḥ: One who is particularly awake, because He is eternal Awareness.

953 ఓం ప్రజాగరః - అతడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండేవాడు

954. Ūrdhvagaḥ: One who is above everything.

954 ఓం ఊర్ధ్వగః - అతడు అన్నిటి మీద నుండేవాడు

955. Satpathācāraḥ: One who follows the conduct of the good.

955 ఓం సత్పథాచారః - అతడు ఉత్తమ ప్రవర్తన కలిగినవాడు

సమన్వయము: సత్ + పథ + ఆచారః; పథ అంటే మార్గము. ఆచారః అంటే ఆచరించువాడు.

956. Prāṇadaḥ: One who givesback life to dead ones as in the case of Parikshit.

956 ఓం ప్రాణదః - అతడు ప్రాణమును దానము చేసి, మరణించిన జీవులను బ్రతికించగలడు

సమన్వయము: పరీక్షిత్తు భారతంలో ఉత్తరకి, అభిమన్యునికి పుట్టినవాడిగా చెప్పబడినిది. అతడు ఒక్కడే మిగిలిన పాండవ వంశాంకురం. కౌరవుల గురువైన ద్రోణుడు కొడుకు అశ్వథ్థామ కౌరవుల పతనం చూసి, పాండవ వంశాన్ని బ్రహ్మాస్త్రంతో సమూలంగా నాశనం చేయుటకు ప్రతిజ్ఞ బూనేడు. అది తెలిసి ఉత్తర మిక్కిలి కలత చెందెను. అప్పుడు సుభద్ర తన కోడలిని, పుట్ట బోయే బిడ్డని రక్షించమని తన తమ్ముడైన శ్రీకృష్ణుని ప్రార్ధించెను. శ్రీకృష్ణుడు తన మాయా శక్తితో పరీక్షిత్తుని గర్భంలో కాపాడి అతనికి పునర్జన్మ నిచ్చెను.

957. Praṇavaḥ: Pranava (Om) the manifesting sound symbol of Brahman. As He is inseparably related with Pranava, He is called Pranava.

957 ఓం ప్రణవః - అతడు ఓం కార స్వరూపము

958. Paṇaḥ: It comes from the root 'Prana' meaning transaction. So one who bestows the fruits of Karma on all according to their Karma.

958 ఓం పణః - అతడు కర్మ ఫలమును జీవులకు ప్రసాదించేవాడు

pramāṇaṁ prāṇanilayaḥ prāṇabhṛt prāṇajīvanaḥ,

tattvaṁ tattvavidekātmā janmamṛtyujarātigaḥ. (103)

959. Pramāṇaṁ: One who is self-certifying, as He is Pure Consciousness.

959 ఓం ప్రమాణం - అతడు శుద్ధ చైతన్యము; తనకు తానే ప్రమాణము

960. Prāṇanilayaḥ: The home or dissolving ground of the Pranas.

960 ఓం ప్రాణ నిలయః - అతడు ప్రాణానికి నిలయము

961. Prāṇa-bhṛt: One who strengthens the Pranas as food (Anna).

961 ఓం ప్రాణ భృత్ - అతడు ప్రాణులకు అన్నమునిచ్చి శక్తిమంతము చేసేవాడు

962. Prāṇa-jīvanaḥ: He who keeps alive human beings with Vayus (airs) known as Prana, Apana etc.

962 ఓం ప్రాణ జీవనః - అతడు పాన, అపాన, వ్యాన, సమాన, ఉదాన మనే వాయువులతో జీవులను ప్రాణముతో నుంచేవాడు

963. Tattvaṁ: Means Brahman, just as words like Amruta, Satya, Paramartha, etc.

963 ఓం తత్త్వం - అతడు బ్రహ్మన్

964. Tatvavid: One who knowns His own true nature.

964 ఓం తత్త్వవిద్ - అతడు స్వస్వరూపము తెలిసినవాడు

965. Ekātmā: One who is the sole being and the spirit (Atma) in all.

965 ఓం ఏకాత్మా - అతడు అందరిలోని ఆత్మ స్వరూపము

966. Janma-mṛtyu-jarātigaḥ: One who subsists without being subject to the six kinds of transformations – being born, existing, temporarily, growing, transforming, decaying and dying.

966 ఓం జన్మ మృత్యు జరాతిగః - అతడు పుట్టుక, స్థితి, వృద్ధాప్యము మొదలగు వాటితో కూడనివాడు

bhūrbhuvaḥsvastarustāraḥ savitā prapitāmahaḥ,

yajñō yajñapatiryajvā yajñāṅgō yajñavāhanaḥ. (104)

967. Bhūr-bhuvaḥ-svastaruḥ: The three Vyahrutis Bhuh, Bhuvah, Svah are said to be the essence of the Veda.

967 ఓం భూర్ భువః స్వస్తరుః - అతడే వేదములో చెప్పబడిన వ్యాహృతులు

968. Tāraḥ: One who helps Jivas to go across the ocean of Samsara.

968 ఓం తారః - అతడు జీవులు సంసార సాగరమును దాటుటకు ఊత నిచ్చేవాడు

సమన్వయము: తార అంటే భవసాగరము నుండి దాటించునది

969. Savitā: He who generates all the worlds.

969 ఓం సవితా - అతడు సమస్త లోకాలను సృష్టించేవాడు

సమన్వయము: సవితా అంటే సూర్యుడు అని నిఘంటువు చెప్పే అర్థం

970. Prapitāmahaḥ: One who is the father of Brahma and therefore the grandfather of all.

970 ఓం ప్రపితామహః - అతడు అందరికీ తాత వంటివాడు

971. Yajñaḥ: One who is of the form of Yajna.

971 ఓం యజ్ఞా - అతడు యజ్ఞ రూపములో నుండేవాడు

972. Yajñapatiḥ: One who is the protector and the master of the Yajnas.

972 ఓం యజ్ఞ పతిః - అతడు యజ్ఞమును సంరక్షించేవాడు; దానికి యజమాని

973. Yajvā: One who manifests as the performer of a Yajna.

973 ఓం యజ్వా - అతడు యజ్ఞము చేసేవానిగా వ్యక్తమయ్యేవాడు

974. Yajñāngaḥ: All the parts of His body as the incarnate Cosmic Boar are identified with the parts of a yajna.

974 ఓం యజ్ఞా౦గః - అతని అవయవములు యజ్ఞముల భాగములైనవి

975. Yajña-vāhanaḥ: One who supports the Yajna which yield various fruits.

975 ఓం యజ్ఞ వాహనః - అతడు బహుళమైన ఫలితములునిచ్చే యజ్ఞమునకు ఆధారము

yajñabhṛdyajñakṛdyajñī yajñabhugyajñasādhanaḥ,

yajñāntakṛdyajñaguhyamannamannāda eva ca. (105)

976. Yajñabhṛd: He is so called, because He is the protector and supporter of all Yajna.

976 ఓం యజ్ఞభృత్ - అతడు యజ్ఞాలను కాపాడేవాడు

977. Yajñakṛd: One who performs Yajna at the beginnig and end of the world.

977 ఓం యజ్ఞకృత్ - అతడు సృష్టి ఆదియందు, అంతమందు యజ్ఞము చేసేవాడు

978. Yajñi: One who is the Principal.

978 ఓం యజ్ఞి - అతడు ప్రప్రథముడు

979. Yajñabhug: One who is the enjoyer of Yajna or Protector of Yajna.

979 ఓం యజ్ఞభుక్ - అతడు యజ్ఞముతో సంతోషపడేవాడు

980. Yajña-sādhanaḥ: One to whom the Yagya is the approach.

980 ఓం యజ్ఞ సాధనః - అతనికి యజ్ఞమే సాధన

సమన్వయము: అతడు యజ్ఞముతోనే తెలిసికోబడినవాడు

981. Yajñāntakṛd: One who is the end or the fruits of Yajna.

981 ఓం యజ్ఞా౦తకృత్ - అతడే యజ్ఞ ఫల మిచ్చేది; యజ్ఞము యొక్క లక్ష్యము

సమన్వయము: యజ్ఞ + అంత + కృత్ ; కాబట్టి అతడు యజ్ఞ ఫలము ఇచ్చేవాడు.

982. Yayajñaguhyam: The Gyana Yajna or the sacrifice of knowledge, which is the esoteric (Guhyam) of all the Yajnams.

982 ఓం యజ్ఞగుహ్యం - అన్ని యజ్ఞముల కన్నా గుహ్యమైనది జ్ఞాన యజ్ఞం

సమన్వయము: గుహ్యము అంటే రహస్యము

983. Annam: That which is eaten by living beings. Or He who eats all beings.

983 ఓం అన్నం - జీవులు భుజించేది

984. Annādaḥ: One who is the eater of the whole world as food. The word Eva is added to show that He is also Anna, the food eaten.

984 ఓం అన్నాదః - అతడు సర్వ సృష్టిని తినేవాడు

tmayōniḥ svayaṁjātō vaikhānaḥ sāmagāyanaḥ,

devakīnandanaḥ sraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ. (106)

985. Ātmayōniḥ: One who is the source of all; that is, there is no material cause other than Himself for the universe.

985 ఓం ఆత్మ యోనిః - అతడే అన్నిటికీ యోని; అతడే నిమిత్త, ఉపాదాన కారణములు

986. Svayaṁ-jātaḥ: He is also the instrumental cause.

986 ఓం స్వయం జాతః - అతడే నిమిత్త, ఉపాదాన కారణములు

987. Vaikhānaḥ: One who excavated the earth, taking a unique form.

987 ఓం వైఖానః - అతడు అవతారము నెత్తి భూమిని పెకలించెను

988. Sāmagāyanaḥ: One who recites the Sama chants.

988 ఓం సామగాయనః - అతడు సామ వేదమును స్మరించేవాడు

989. Devakī-nandanaḥ: The Son of Devaki in the incarnation as Krishna.

989 ఓం దేవకీ నందనః - అతడు కృష్ణ అవతారంలో దేవకికి జన్మించెను

990. Sraṣṭā: The creator of all the worlds.

990 ఓం స్రష్టా - అతడు అన్ని లోకములను సృష్టించేడు

991. Kṣitīśaḥ: A master of the world. Here it denotes Rama.

991 ఓం క్షితీశః - అతడు జగత్తుకు అధిపతి

992. Pāpanāśanaḥ: He who destroys the sins of those who adore Him, meditate upon Him, remember and sing hymns of praise on Him.

992 ఓం పాపనాశనః - అతడు భక్తుల పాపాలను ప్రక్షాళనం చేసేవాడు

aṅkhabhṛnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,

rathāṅgapāṇirakṣōbhyaḥ sarvapraharaṇāyudhaḥ. (107)

sarvapraharaṇāyudha oṃ nama iti.

993. Śaṅkhabhṛt: One who sports the conch known as Panchajanya, which stands for Tamasahamkara, of which the five elements are born.

993 ఓం శంఖభృత్ - అతడు పాంచజన్యమనే శంఖమును ధరించేవాడు; దాని నుండి పంచభూతములు ఆవిర్భవించినవి

994. Nandakī: One who has in His hand the sword known as Nandaka, which stands for Vidya (spiritual illumination).

994 ఓం నందకీ - అతని చేతిలో నందక అనబడే ఖడ్గమున్నది; అది ఆధ్యాత్మిక విద్యకు ప్రతీక

995. Cakri: One who sports the discus known as Sudarshana, which stands for the Rajasahamkara, out of which the Indriyas have come.

995 ఓం చక్రీ - అతడు సుదర్శనమనే చక్రమును ధరించేవాడు; దాని నుండి ఇంద్రియములు ఉద్భవించినవి

సమన్వయము: సృష్టిలో క్రమంగా మానవులలో కొందరు దేవతలగా కొలవబడ్డారు. ఆ దేవతలు కొన్ని వేల సంవత్సరల క్రింద సాధన చేసి మాయా శక్తిని పొందినవారు. వారి మాయా శక్తి నేటి సాంకేతికత వంటిది. మానవుని ఊహక౦దేది. శ్రీ మహా విష్ణువు యొక్క సుదర్శన చక్రం తయారు చేయగలిగే సాంకేతిక జ్ఞానము ప్రస్తుతం మానవులకి ఉంది.

996. Śārṅga-dhanvā: One who aims His Sarnga bow.

996 ఓం సారంగ ధన్వా - అతని సారంగ మనే విల్లును ధరించేవాడు

997. Gadādharaḥ: One who has the mace known as the Kaumodaki, which stands for the category of Buddhi.

997 ఓం గదాధరః - అతడు కౌమోదికమను గధను ధరించేవాడు; అది బుద్ధికి ప్రతీక

998. Rathāṅga-pāṇiḥ: One in whose hand is a wheel (Chakra).

998 ఓం రథాంగ పాణిః - అతని చేతిలో చక్రమున్నది

999. Akṣobhyaḥ: One who cannot be upset by anything, because He controls all the above-mentioned weapons.

999 ఓం అక్షోభ్యః - అతడు ఎన్నో రకములైన ఆయుధములు ధరించి చీకూ చింతా లేకుండా ఉండేవాడు

1000. Sarva-praharaṇā-yudhaḥ: There is no rule that the Lord has got only the above- mentioned weapons. All things, which can be used for contacting or striking, are His weapons.

1000 ఓం సర్వ ప్రహరణా యుధః -అతడు పైన చెప్పిన ఆయుధములకే పరిమితుడు కాదు.

vanamālī gadī śārṅgī śaṅkhī cakrī ca nandakī,

rīmān nārāyaṇō viṣṇurvāsudevōbhirakṣatu. (108)

rī vāsudevo’bhirakṣatu oṃ nama iti.

Protect us Oh Lord Narayana

భగవంతుడా మమ్మల్ని రక్షించు

Who wears the forest garland,

అతడు పూలమాల ధరించేవాడు

Who has the mace, conch, sword and the wheel.

అతడు గధ, శంఖము, ఖడ్గము, చక్రము ధరించినవాడు

And who is called Vishnu and the Vasudeva.

అతడే విష్ణువు వాసుదేవుడు

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...