Sunday, February 11, 2024

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 47-49)

upanishad


  


రెండవ ప్రకరణము

47

నిర్విచార వై శారధ్యే ఆధ్యాత్మ ప్రసాదః


నిర్విచార = చింతలేనిస్టితి (ప్రశాంతత)
వైశారధ్యే  = సాధించుటయందు
అధ్యాత్మప్ర = ఆత్మ ప్రసన్నత
సాదః


(మనస్సు నందు) చింతలులేని స్టితి సాధించుట వలన
ప్రసన్నత వాని ఆత్మను అధిష్టించి యుండును.
  
  


ఒక విషయము గురించి ఆలోచిస్తున్నపుడు మనస్సు 
విషయగతమై ఉంటుంది. అ౦టే  అది తన ను౦డి వేరుగా 
యుండినట్టి స్థితి.  మనస్సు ఆలోచించు విషయములుగా 
పరిసరములోనికి చెదిరిపోతుంది. కనుక మనస్సు తనలోని 
భాగముగాక ఇతరముగా ఉంటుంది. అలా గాక ఏదయినా ఒక 
విషయములోనికి, దాని తత్వవిచారణ చెయ్యాలి. అది 
ఎలా౦టిది, ఎక్కడ పుట్టి౦ది, దేని నుండి పుట్టి౦ది ధ్యానము 
చేయాలి. ఒకడు ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. 
ఇల్లు అంటే ఏమిటి? దేనిచే కట్టబడి౦ది? దాని ప్రయోజనమేమిటి?
అని ఆలోచించే వానికి ఇల్లు యున్నవాడు, లేనివాడు, ఇద్దరు
సుఖముగానే జీవిస్తున్నారని తెలిస్తుంది. ఇంటని కట్టిన రాళ్ళు,
సున్నము, మొదలగునవి భూమినుండే, సాధింపబడినవని,  తన
శరీరముగూడ అలాగే  వచ్చినది అని తాను జీవించుయుండే వరకు 
పరిస్థితులు అనుకూలిస్తే  తన యింటిలో తాను నివాసముండవచ్చును 
అని, లేకపోతే  ఇల్లు లేనివారు సైతము సుఖముగానే 
యున్నట్లు తెలుసుకొ౦టాడు. మరియొకనికి తాను ఉద్యోగము
చేస్తున్న ఊరిలోగాక వేరొక ఊరిలో స్వ౦త ఇల్లు వుండెనని
అనుకో. వానికి అదే ఊరిలో ఇల్లు లేకపోయినా  తనకు
యిల్లు వున్నది అను ఊహచే జీవిస్తున్నాడు. ఉద్యోగవిరమణ
చేసిన తర్వాత గూడ తన యిల్లు వున్న ఊరికి పోక తన కుమారులతో 
మరిఒకయూరిలో నివసించుచున్నాడనుకో. అట్టి
వానికి యిల్లు వున్నా లేనట్టే. ఇక్కడ యిల్లు వున్నది, లేదు
మొదలైన ఊహలు ప్రస్తుతము తానున్న యింటిలో సుఖముగా 
జీవించడానికి అడ్డువచ్చేవి కావు. అ౦టే యిచ్చట ఇల్లు అనేది
తన ఊహకు సంబంధించినది.  తాను సుఖపడుతున్నది, కష్ట
పడుతున్నది తన  యిల్లు వలన కాక తన ఊహవలననే. ఇట్టి 
ఊహ తననుండి పుట్టినది కాని ఇతరముకాదు. కనుక తన ఊహ
తనలో భాగముగా తెలియవలయును.  ఇట్టి ధ్యానము చేసేవానికి 
"యిల్లు" అను పేరు,  దాని గుణములు నశించి, ఊహగానిల్చి,
ధ్యానము చేస్తున్నకొద్ది అట్టి ఊహ తనది అని తెలియును. 

ఇట్లు ఏ వస్తువయినను తననుండి పుట్టేదిగాని ఇతరము కాదు.
అట్టివాని భౌతిక అస్తిత్వముగూడ అణువులు మొదలైన వానినుండి
పుట్టునది అగుటచే అది తాత్కాలికము తప్ప నిత్యముకాదు. అనగా
ఇంటికన్నా అణువులు నిత్యమైనా, అణువులకన్నా "నేను"
ప్రజ్ఞ నిత్యము. ఇట్టి పద్దతిలో యోగాభ్యాసము చేయువానికి
ప్రసన్నత సులభముగా చిక్కుతుంది.  క్రమేణా మనస్సు, అందలి
వస్తువులు కరిగిపోయి వానిని అధిష్టించియున్న "తాను" సత్యమగును. 
ఇదియే ఆధ్యాత్మము.

48

బుతంభరా తతో ప్రజ్డా



బుతంభరా = సత్యముచే నిండినది
తత్ర = అచ్చట
ప్రజ్ఞా = మెలుకువ

  అట్టి  సితిలో మెలుకువయే సత్యమగుచున్నది.
  



"సత్యము" అ౦టే  సత్యమే. "సత్‌ " అను పదమునకు
ఉండుట లేక ఉనికి అని అర్హము. సత్యమనగా ఈ  సమస్త 
ప్రపంచములో  ఏది నిత్యమై, శాశ్వతమై యండునో అదే.
అనగా రెండు లేని స్థితి. ఇట్టి స్థితినే  శ్రీ శంకరాచార్యులవారు 
"అద్వైత"మని చెప్పేరు.  అద్వైత మ౦టే రెండవది లేని స్థితి. తాను 
తప్ప ఇతరమేదియు లేదని తెలియు మెలుకవే ఇది. ఇక్కడ 
మెలుకువ అనగా తనకు "మెలుకువ" కాదు.  నిద్రించుచున్నప్పుడు,
మేలుకొనిన తర్వాత, మనము "ఉన్నాము" కదా!  అంటే  నిద్రలో
ఎట్లున్నామో, మెలుకువ వచ్చిన తర్వాత కూడా అలాగేయున్నాము. 
ఇక్కడ మెలుకువ అనునది మిగిలినవారికి, పరిసరములకు, మనస్సుకు, 
శరీరమునకు, ఇంద్రియములకు, వర్తింపవచ్చునుగాని తనకు 
వర్తింపవు. ఇట్లే తన మనస్సు శరీరము, ఇంద్రియములు, తనలో
నుండి పుట్టినవనియూ, తనయందు భాగములుగానే అవి పని
చేయుచున్నవి అనియూ అట్లే పరిసరములు, వస్తువులు సైతము
తననుండి పుట్టినవనియూ తెలియువానికి, "తానే" సత్యమై
మిగిలినదంతయు అసత్యమగును. ఇట్టి స్థితినే "అద్వైతస్థితి" లేక,
"ఎకాంతస్టితి" లేక "కైవల్యము" అను పేర్లతో పిలువబడుతుంది. భగవద్గీతలో 
(శీకృష్ణుడు ఇట్టి స్థితిని "అనన్యము" అని చెప్పెను,
ఇదే యోగులచే జ్యోతిర్మయమైనట్టి స్థితిగా దర్శింపబడినది. 

49

శ్రుతానుమానప్రజ్ఞాభ్యాం అన్యవిషయా విశేషార్థత్వాత్ !

శ్రుతా = వినినట్టిది.
అనుమాన = గ్రహింపబడిన విషయము
ప్రజ్ఞాభ్యాం = ప్రజ్ఞ లచేత
అన్య విషయా  = ఇతర విషయముల చేత 
విశేషార్థ = విషయము నశించి నట్టి అర్థము 
త్వాత్ = లేక సారాంశము కలిగినది 

  శ్రవణ, అనుమానముల వలన కలిగే మెలుకువల యందు,
ఇతరమయిన విషయములుండవు గనుక అట్టి ప్రజ్ఞ విశేష అర్థమును 
కలిగియుండును. 

  



విషయములు సూటిగా గ్రహించడం వలన ఇంద్రియములు
తమకన్న భిన్నమైనవిగా గుర్తి౦చుచున్నవి. నిజానికి  విషయములుగా 
ఇంద్రియములు చూచేవి తమయందలి ప్రతిస్పందనే 
తప్ప నిజముగా బాహ్యవిషయములను గ్రహించుటలేదు. కన్నుచూసేది
బయటనున్న వస్తువుయొక్క ప్రతిబింబము కంటి "రెటీనా"
పై కలిగిన నాడుల స్పందనము మాత్రమే గాని, ప్రతిబింబము
గ్రహింపబడడంలేదు. అలాగే రుచిచూసే వస్తువు వలన నాడులలో 
కలిగే  ప్రతిస్పందనమే  రుచిగా అర్హము చేసికొనబడుతున్నాది.
అక్కడ  అర్థము చేసుకొనబడుచున్నది  తనయందలి వాసన
మొదలైన లక్షణములు గాని వస్తువులుగావు. వస్తువులలో 
రుచి వాసన అనే  లక్షణములు౦టే ఆహారమును  శవము
నోటిలో ఉంచితే  శవమునకు రుచి తెలయాలి  కదా?
కనుక ఇక్కడ రుచి, వినికిడి చూపు మొదలైనవి ఇంద్రియ
లక్షణములు గాని బాహ్య విషయములు కావు. అట్టి ఇంద్రియ
లక్షణములు ఇంద్రియముల వలన పుడుతున్నాయి. ఇంద్రియములు
మనస్సునందు పుట్టును. ఇట్లు పై సూత్రమునందు చెప్పబడినట్లు
ఇవన్నియు సత్యమునుండి పుట్టేవి. సత్యమనగా తానున్నానని
తనకు తెలియుట. ఇట్టి స్టితి వలన విషయములు, ఇంద్రియములు 
వేరుగా నుండక అంతయు తానుగా యుండును.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...