Thursday, July 4, 2024

Viveka Sloka 1 to 2 Tel Eng




శ్రీ వివేకచూడామణి ఆంధ్రవ్యాఖ్యాసమేతము

మంగళాచరణము

sarvavēdāntasiddhāntagōcharaṃ tamagōcharam ।
gōvindaṃ paramānandaṃ sadguruṃ praṇatō'smyaham ॥ 1॥
jantūnāṃ narajanma durlabhamataḥ puṃstvaṃ tatō vipratā
tasmādvaidikadharmamārgaparatā vidvattvamasmātparam ।
ātmānātmavivēchanaṃ svanubhavō brahmātmanā saṃsthitiḥ
muktirnō śatajanmakōṭisukṛtaiḥ puṇyairvinā labhyatē ॥ 2॥ (pāṭhabhēdaḥ - śatakōṭijanmasu kṛtaiḥ)

Sankara begins by describing the ideal recipients of the gnana in this text. He says it is hard to obtain a human birth. It is harder to be born as a purusha (man). It is even more rare for such a person to be a dwija (twice born). A dwija interested in vaidika (veda based) dharma is the rarest.

సర్వవేదాన్తసిద్ధాన్తగోచరం తమగోచరమ్. 
గోవిన్దం పరమానన్ద సద్గురుం ప్రణమామ్యహమ్.

సర్వవేదాన్త సిద్ధాన్త గోచరం - సమస్తములైన ఉపనిషత్తుల సిద్ధాంతములకు గోచరుడై నట్టియు, ఆగోచరం - బుద్ధీంద్రియాదులకు గోచరింప నట్టియు, పరమానన్దం - పరమానంద స్వరూపుడైనట్టియు, సద్గురుం = సద్గురువైన, కం గోవిన్దం = ఆ గోవిన్ద స్వరూపులగు గోవించ భగవత్పాదాచార్యుని, అహం = నేను ప్రణమామి = నమస్కరించు చున్నాను.

బ్రహ్మనిష్టామహ త్త్వము

జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రతా
తస్మాద్వైదికధర్మమార్గపరతా విద్వత్త్వమస్మాత్పరమ్ ।
ఆత్మానాత్మవివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః
ముక్తిర్నో శతజన్మకోటిసుకృతైః పుణ్యైర్వినా లభ్యతే ॥ 2॥ (పాఠభేదః - శతకోటిజన్మసు కృతైః)

జన్తూనాం = ప్రాణులకు, నరజన్మ - మనుష్య జన్మ, దుర్లభం = కష్టముచే లభ్యమైనది, అతః - దానికంటే, పుంస్త్వం- పురుషత్వము, అతః =.దానికం టె, విప్రతా = బ్రాహ్మణత్వము. తస్మాత్ = దానికంటే, వై దికధర్మమార్గ పరతా = వైదిక ధర్మమార్గమునందు ఆసక్తి, తస్మాత్ = దానికం టె, పరం=అధికముగా, విద్వత్త్వం = పండితత్వము(దుర్లభము). అత్మానాత్మవివేచనం = ఇది ఆత్మ, ఇది ఆత్మభిన్నము అను వివేకము, స్వనుభవః = బాగుగా అనుభవము, బ్రహ్మాత్మానా = బ్రహ్మరూపముతో, సంస్థితిః = ఉనికి యను రూపముగల, ముక్తిః = ముక్తియు, శతకోటి జన్మను = వందకోట్ల జన్మలయందు, కృతైః - చేయబడిన, పుణ్యైర్వినా = పుణ్యములు లేకుండగా, నో లభ్యతే - పొంద బడదు.

Here it is implied the same soul is repeatedly born as a plant, an animal, a human and so on. Otherwise there is no continuity between births. To understand this text, the reader has to be both a theist as well as a believer in atma.

Sankara calls an ideal recipient a purusha. Nowadays men and women are considered equals. Both are eligible to receive Sankara's knowledge. However, a male is more likely to carry out the arduous sadhanas like meditation, reading scripture, reflection in mind and intellect. Despite technological progress with gender equality, women are generally associated with love of children, caring, tenderness and homely duties. Not to say, there are no men who do these. Conversely, women perform traditional masculine duties such as single mothers.

A dwija can be a brahmin, a kshatriya or a vysya who is eligible for thread marriage or upanayana. Sankara seems to say a brahmin is more suitable to be a sadhaka. What it actually means is, anyone situated in sattva guna (tranquility) is eligible. A kshatriya, associated with rajo-guna (activity) or a vysya immersed in business transactions has no suitable mental calibre and intellectual commitment to receive the gnana Sankara is espousing. Even among brahmins, by mere accident of the birth, the sannyasis (renouncers) are most suitable. A sannyasi has no passion for worldly matters and revels in the deep contemplation about brahman.

It is not unreasonable to spell out the qualifications of a sadhaka by the jagat guru. Anyone seeking a job knows about job requirements like an academic degree, height, weight and so on. A soldier is expected to be of a certain physique. Whereas a doctor is expected to have medical knowledge and skill even if lacking a robust physique. Thus, Sankara is implicitly saying, if you are not a theist and a believer in atma you are not qualified. If you qualify, you can be called a sadhaka. Furthermore, a sadhaka should be willing to study the scripture, not just idle browsing, but with mental reflection and intellectual acumen. These are better done under the tutelage of a guru who accepts a disciple only if qualified and not anyone who is merely interested to peek into the scripture out of perfunctory curiosity.

Even with a guru, the sadhaka should be able to concentrate and show commitment to be a mumukshu (one interested in moksha). The ultimate reward for a mumukshu is the mukti (salvation). So he has to pine for and ardently wish for an egress from the unreal world under the cover of maya. He must be able to discriminate between atma and not-atma, real and unreal. A mumukshu has to raise above emotions, feelings and opinions of others to understand that the substratum for the world is one single Truth. A stone, a plant, an animal can be viewed as possessing atma with different degrees of awareness. While a stone has no awareness, a plant responds to external stimuli indicating a modicum of awareness. An animal might have feelings and emotional pangs. A human, on the other hand, has full awareness with rationality to realize atma, reality and Truth.

వ్యాఖ్యానువాదము :

శ్రీ చంద్రశేఖర భారతీస్వాములు అనుగ్రహించిన వ్యాఖ్యకు అనువాదము.

అంతవిహీనభీకరభవాంబుధి మగ్న జనాళిఁ బ్రోవ న 

త్యంత కృపావశంవదత నాత్త నృసింహయతీంద్రరూపుఁడై, 

ధ్వాంత సదృక్ష ఘోరజడతా వినికృంతనదక్షు దక్షిణా

 శాంతముఖున్ కృపాజలధి నాదృతితో ననిశంబు గొల్చెదన్. 

భగవత్పాదార్చితపద

యుగ,  యోవాగ్దేవి, కరుణ యొప్పార మదిన్

దగనిల్చి వ్యాఖ్య వ్రాయుమి

సుగమంబుగ నీ వివేకచూడామణికిన్.

సుప్రసన్న మయ్యు సూక్ష్మగంభీరంబు

దేశికేశు వాక్య దివ్య సరణి,

దీని భావ మెల్ల దీప్తమై నా మది

చేరఁ దీయుమమ్మ శారదాంబ ! 

ఓ రత్నగర్భ గణపతి!

 కారుణనిధాన ! విఘ్న ఘనరూపోద్య

ద్ఘోరాంధకార భాస్కర!

పూరింపుము వ్యాఖ్య సుగుణపూరితరీతిన్.

 బ్రహ్మవిద్యాశ్రయా! దేవ! భద్రమూర్తి 

చంద్రమౌళీశ! కర లసద్ జ్ఞానముద్ర 

 స్వానుభూతి నొసంగు నా భావమందు వ్యాఖ్య

 వ్రాసెద నాచార్య వాక్యములకు. 

ఆశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే 

 గతాసూనగతాసూంశ్చ నాను శోచన్తి  పండితాః. 1

"నీవు మహాబుద్ధిమంతునివలె మాటలు చెప్పుచున్నావు. కాని దుఃఖింపదగని వారినిగూర్చి దుఃఖించుచున్నావు. పండితులగువారు మరణించిన వారినిగూర్చియు, జీవించియున్న వారినిగూర్చియు దుఃఖింపరు." ఇవి శ్రీకృష్ణుడు అర్జునునితో పల్కిన మాటలు (భ.గీ. 2.11). ఈ శ్లోకము గీతాశాస్త్రార్థమునంతయు సంగ్రహముగ బోధించుచున్నది.

ఇట్లే "జన్తూనాం నరజన్మ” అను ఈ శ్లోకము వివేకచూడామణి నామకమగు ఈ ప్రకరణ గ్రంథమందు ప్రతిపాద్యమగు విషయమునంతయు సంగ్రహముగ సూచించుచున్నది. ఆస్తికునకు మాత్రమే ఈ శాస్త్రమునందు అధికారము. అందుచే “జన్తూనాం నరజన్మ దుర్ల భమ్ " అను మాటలలో నరజన్మ ప్రాశస్త్యమును చెప్పుచు తద్వారా శరీరవ్యతిరేక మగు ఆత్మ యనునది ఒకటి ఉన్నదను విషయమును ధ్వనింపజేయుచున్నాడు. కావుననే శారీరక భాష్యమునందు బుద్ధిపూర్వకముగ ప్రవర్తించువానికి, ఆత్మకు పర లోకసంబంధ మున్నదను విషయము తెలియకున్నచో శాస్త్రీయములగు కర్మల నాచరించుట మొదలగు వ్యవహారమునందు అధికారము లేకున్నను... " అని చెప్పబడియున్నది.

జన్తూనాం=జన్మించు స్వభావముగల ప్రాణులకు, నరజన్మ = మనుష్యత్వము, దుర్లభం=దుర్లభమైనది అని దీని యర్ధము. ఒక్కడే అనేక జన్మములుపొందుటకు అవకాశమున్నపుడు మాత్రమే " నరజన్మము దుర్లభము" అని చెప్పుట పొసగును. జన్మము అనగా శరీరసంబంధమే కదా? ఈ విధముగ ఒకనికి అనేక శరీరసంబంధ ములుండునని చెప్పుటచే ఆత్మ శరీరముకంటె భిన్నమైనదను విషయము సూచితము. అనేకములగు పుష్పములు గ్రుచ్చిన దారము ఆ పుష్పములకంటె భిన్నమైనది; అనేక వస్త్రములను ఒక్కమారుగా గాని, వేరువేరు సమయములందు గాని ధరించు శరీరము వాటికంటె భిన్నమైనది అను విషయము సర్వ విదితమే!

కావున సుఖహేతువగు శరీరము లభింపవలె నన్నచో, దుఃఖ హేతువగు శరీరము లభింపకుండవలె నన్నచో పుణ్యము చేయవలెను; పాపాచరణమునుండి మరలవలెను. ఈ విధముగ విధి నిషేధాత్మకమగు శాస్త్రమునందు ఆస్తికునకు మాత్రమే అనగా వేదప్రామాణ్యమును, శరీరభిన్నమగు ఆత్మ యున్నదను విషయమును నమ్మువానికి మాత్రమే అధికారము. జ్ఞానముద్వారా సకల కర్మలను తొలగించుకొనుటకై మోక్ష శాస్త్రమునందు గూడ ఆస్తికునకే అధికారము.

It is also implied that to lead a happy life one should have had performed karma that engenders punya. Sinful karma can only cause unhappiness. Therefore, one has to perform the karma ordained by the vedas besides believing in atma, to receive the full impetus of Sankara's teaching.

శరీరమే ఆత్మయైనచో అది ప్రత్యక్షసిద్ధమే కావున దాని దర్శనమునకై సాధనములను విధించుచు చెప్పిన “ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యం” (ఆత్మను చూడవలెను... సాక్షాత్కరింప జేసికొనవలెను, వినవలెను, మననముచేయవలెను, ధ్యానింపవలెను) మొదలగు వాక్యములు అనుపపన్నములగును.

If the physical body is perceived as atma, which it can't be, then the statements made in the scripture such as "see atma", "deify atma", "hear about atma", "meditate on atma" are ambiguous.

ఒకేవ్యక్తి, శుభాశుభమిశ్రములగు కర్మల నాచరించుటచే విజాతీయమగు (విశిష్టమగు) శరీరము లభించునని " శుభై రాప్నోతి దేవత్వం నిషిద్ధైర్నారకిo తనుమ్, ఉభాభ్యాం పుణ్య పాపా భ్యాం మానుష్యం లభతే అ వశః” (జీవుడు) శుభకర్మలచే దేవత్వ మును, నిషిద్ధ కర్మలచే నరకయోగ్యమగు శరీరమును, పుణ్యపాప ములు రెండును ఆచరించుటచే మనుష్య శరీరమును పొందును, దీనిని తప్పించుకొనజాలడు - ఇత్యాది వాక్యములు చెప్పుచున్నవి.

కానిచో లోకమునందు కానవచ్చుచున్న సుఖదుఃఖాది వైచిత్ర్యము ఎట్లు కుదురును ? వారి వారి కర్మలనుబట్టి కాక.. ఈశ్వరుడే కొందరు ప్రాణులను సుఖవంతులుగను, కొందరిని దుఃఖ వంతులుగసు చేయును అని యన్నచో ఈశ్వరునకు పక్షపాతము, దయారాహిత్యము ఉన్నవని చెప్పినట్లగును. అట్లైనచో అతని ఈశ్వరత్వమునకే భంగము వాటిల్లును. ఈ విషయమునే (బాదరాయణుడు) "వైషమ్యనైర్ఘృణ్యే న సాపేక్షత్వాత్" (ఈశ్వరునకు పక్షపాతము, నిర్దయత్వము ఆపాదించేవా? అపాదించవు. ఆయన కర్మలనుబట్టి ఇట్టి భిన్నరూపులకు జీవులను సృష్టించుచున్నాడు.)

ఈ విషయమునే శ్రుతీ ప్రతిపాదించుచున్నది. "న కర్మావిభాగాదితి చేత్తో నానాదిత్వాత్ " (కర్మవిభాగము కుదరదు కాన ఈశ్వరునకు కర్మా పేక్షత్వము చెప్పుట యుక్తముకాదు అని యనరాదు; ఏలయన కర్మ సంసారాదికము, అనాది). ఉపపద్యతే చాప్యుపలభ్యతే చ (కర్మ సంసారాదుల యనాదిత్వము యుక్తి సంగతము : శాస్త్రోక్తము) ఇత్యాది సూత్రములచే ఈశ్వరుడు కర్మసాపేక్షుడనియు, సంసారము అనాది యనియు చెప్పియున్నాడు. (జీవుని) ధర్మమగు సంసారము అనాదియైనచో దానికి (సంసారమునకు) ఆశ్రయభూతుడగు సంసారి (జీవుడు) అనాదియని వేరుగ చెప్పవలెనా?

The Law of Karma is universal. Because of the law of karma, some are happy and lucky and some are sad and unfortunate. Even Eswara can't change it for his devotee lest he should be considered as unfair to others and biased against non-believers. Because the law of karma has no birth, and is fully intertwined with the universe, paramatma (the supreme) and jivatma (jiva's atma) are also beginningless--without birth.

కావున ఆత్మ శరీరభిన్న మనియు, శరీరముకంటె భిన్నమగు ఆత్మ యున్నదని చెప్పువాడే ఆస్తికుడనియు సిద్ధించుచున్నది. ఆస్తిక్యమనునది శాస్త్ర వ్యవహారముపై ఆధారపడియున్నది అను విషయమును "జస్తూనాం నరజన్మ దుర్లభమ్ ” అనునది సూచించుచున్నది. "తతః పుంస్త్వమ్ -స్త్రీకి వేదాధ్యయనాధికారము లేదు గాన, ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలియదగిన ఆత్మను వారు తెలిసి కొనజాలరని అభిప్రాయము.

పై మూడు వర్గముల వారికిని వేదాధికారమున్నది. ఐనను క్షత్రియ వైశ్యులకు రాజ్యపాలనము కృషి మొదలగు చిత్తవిక్షేప హేతువులగు బాహ్య వ్యాపారము లెన్నియో ఉండుటచే శ్రద్ధా తాత్పర్యములతో ఆత్మవిచారము చేయుట వారికి అంతగ శక్యము కాదు. శ్రద్ధాతాత్పర్యములతో, ఇతర వ్యావృత్తి యేదియు లేకుండ బ్రహ్మ విచారము చేయుటకు ప్రధాన సాధనము సన్న్యాసము. "ముఖజానామయం ధర్మశ్రీ వైష్ణవం లిఙ్గధారణమ్, బాహు జాతోరు ఖాతానాం నాయం ధర్మో విధీయతే (వైష్ణవమగు ఈ లింగధారణము, సన్న్యాసము బ్రాహ్మణులకే ధర్మము. ఇది క్షత్రియ వైశ్యు లకు విహితము కాదు)

ఇత్యాది స్మృత్యనుసారముగ వారికి సన్న్యాస గ్రహణావకాశము లేదుగాన ఒకే జన్మలో వారికి బ్రహ్మ సాక్షాత్కా రము దుర్లభమని సూచించుటకై "ద్విజత్వం తతః” అనికాశ "తతో విప్రతా" అని చెప్పబడినది. (ద్విజత్వం అన్నచో బ్రాహణ క్షత్రియ వైశ్యులలో ఎవ్వరైన అగుట యని యర్థము వచ్చును.) "బ్రాహ్మణస్య తు దేహోజయం నోపభోగాయ కల్పతే, క్లేశాయ మహతే ప్రీత్యానన్త సుఖాయ చ" (ఈ బ్రాహ్మణ దేహము భోగములను అనుభవించుటకు కాదు; ఈ లోకములో ఎన్నియో కష్టములనుభవించి మరణానంతరము అనంత సుఖానుభవము కొరకు) అను వసిష్ఠ స్మృత్యనుసారము వేద విహితములగు ప్రవృత్తి (కర్మ) నివృత్తి (జ్ఞాన) ధర్మముల ననుష్ఠించుటచే బ్రాహ్మణుడు ఒక్క జన్మయందే బ్రహ్మసాక్షాత్కారమును పొంద సమర్థు డగునని భావము. అందుచేతనే "తస్మా ద్వైదికధర్మ మార్గపరతా" అని చెప్పబడినది.

ఆ పొంద వలసిన దానిని (ఆత్మ సాక్షాత్కారమును). పొందుటకు కేవలము బ్రాహ్మణుడైనంత మాత్రమున చాలదు. బ్రాహ్మణజన్మమెత్తి విహిత ధర్మాచరణము చేతనే అది లభించునని భావము, "ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా" (ఈ ప్రపంచము అంతయు విలుచుటకు ధర్మమే కారణము). "ధర్మేణ పాప మనసుదతి” (ధర్మముచే పాపమును తొలగించుకొనుచున్నాడు) అను శ్రుతి వాక్య ములు, ధర్మమే సుఖ సాధనమనియు, దుఃఖమునకు హేతువగు పాపమును తొలగింప గలిగినది గూడ ధర్మమే యనియు, పాపమును తొలగించి దుఃఖము లేకుండ చేయునది ధర్మమే యనియు చెప్పుచున్నవి.

It is not enough if the sadhaka is a dwija. He has to follow dharma as prescribed in vedas. According to the scripture, dharma is the invisible force that binds us all. It is the main conveyance to wash away our sins and make us happy.

నాకు సుఖము కలుగవలెను, దుఃఖము కలుగకూడదు అని ప్రతిఒక్కడును కోరుకొనుచుండును. ఈ సుఖము అనగా దుఃఖాభావము అనెడు పురుషార్థమునకు సాధనమైనది ధర్మమే అనియు. "ధరతీతి ధర్మః" (ధరించునది గాన ధర్మము), 'ద్రియతే అనే నేతి ధర్మః' (దీనిచే జగత్తు ధరింపబడును గాన ధర్మము), అను వ్యుత్పత్తి ననుసరించి ధర్మమే జగత్ప్రతిష్ఠకు హేతువనియు శ్రుతిబోధితమగు విషయమును సూచించుటకై "వైదిక కర్మమార్గ పరతా" అని కాక "ధర్మమార్గ" అని చెప్పియున్నారు. వైదిక కర్మకూడ ధర్మమే యైనను 'కర్మ' శబ్దమును ప్రయోగించినచో ఇంత అర్ధము లభింపదు. దుఃఖము తొలగించుకొని సుఖమును సంపాదించుకొనుటకు ధర్మ భిన్నడుగు సాధనము వేరేదైన ఉన్నచో, ఎల్లరును ఆ సాధనమునే సంపాదించుకొని ఎల్లప్పుడును సుఖవంతులుగను, దుఃఖరహితులు గను ఉండెడివారు.

Everyone aspires to be happy and not look forward to sadness. Dharma is the necessary force to keep us cohesive and function as a single unit. If there is any other way, which we would know by now, then everyone could follow that path.

ధర్మమన్నచో ఇంద్రియములకు గోచరింపనిది; శాస్త్రముద్వారా మాత్రమే తెలియ దగినది. కావున జనులకు శాస్త్ర జ్ఞానము లేకున్నచో ధర్మజ్ఞానము కలుగదు. అందుచే సాధనము లభింపకపోవుటచే ఫలము కూడ లభ్యముకాదు అని చెప్పవచ్చును. ఈ విషయమునే ' వైదిక ' అను పదము సూచించుచున్నది.

Dharma can't be perceived with the five senses (eye, ear, skin, tongue, nose). It is known only through the study of scripture. Hence without knowing the scripture it is not possible for lay persons to follow dharma and receive its fruit. This is what the word"vaidika" implies.

"భోదన లక్షణో ఆర్థో ధర్మః" అను సూత్రముచే జైమిని మహర్షి "వేదవిహితమైనదే ధర్మము" అని ధర్మలక్షణమును చెప్పియున్నారు. 'వైదిక’ అను విశేషణము ఆ విషయమునే సూచించుచున్నది. వేదము తప్ప మరి యేప్రమాణముచేతను ధర్మస్వరూపమును తెలియ శక్యముకాదు. ధర్మము ఇంద్రియగోచరము గాదు; అందుచే ప్రత్యక్ష ప్రమాణమునకు ఇచట తావులేదు. అనుమాన ప్రమాణము ప్రత్యక్షముపై ఆధారపడి యున్నది.

అందుచే అదిగూడ ప్రవర్తింప జాలదు. ప్రత్యక్షాది ప్రమాణములచే తెలిసిన విషయములనే లౌకిక శబ్దము బోధించును. కావున వేదభిన్నమగు శబ్దప్రమాణముకూడ ఇచ్చట ప్రసరింపదు. స్మృతులు స్వతఃప్రమాణములు (తమంతట తాముగ ప్రమాణములు) కావు. అవి పురుషనిర్మితములు. పురుషులకు భ్రమము, ప్రమాదము మొదలగు దోషము లుండుటకు అవకాశ మున్నది. అందుచే వారు రచించిన గ్రంథములు కూడ నిర్దుష్టములని చెప్పుటకు వీలులేదు గాన అప్రమాణములే యను శంక కలుగుచునే యుండును.

దానిని వారించుటకై అపౌరుషేయములు (పురుష రచితములు కానివి) అగుటచే దోషలేశముకూడ ఉండుటకు వీలులేని శ్రుతులను అనుసరించి రచించిన వగుటచేతనే స్మృతులు ప్రమాణములు అని చెప్పవలసియున్నది. కావున వేదవ్యతిరిక్తమగు శబ్దము ధర్మము విషయమున స్వతః ప్రమాణము కాదు అని తేలినది.

Vedas are not authored by any human (apourisheya). Hence they are called "sruti". The other kinds of scripture derived from vedas and written by persons is called "smriti". One can wonder how did the authors of smritis know about dharma? If it is obtained by yogic practices, then how did they get that ability? Where did they hear or learn about dharma? Hiranyagarbha, the first person born, learnt about dharma from the vedas given to him by parameswara. So we look up to sruti to know about dharma.

Hence Sankara's usage of"vaidika" or derived from vedas is apt. Dharma can only be learnt from vedas.

ఈ స్మృతిక ర్త లైనను అతీంద్రియమగు ధర్మమును గూర్చి ఎట్లు తెలిసికొనగల్గిరి? యోగజన్యమగు సామర్థ్యముచే అన్నచో, ఆ సామర్థ్యముమాత్రము వారి కెట్లు లభించినది? ధర్మానుష్ఠానముచే లభించిన దన్నచో, ధర్మమెట్లు తెలిసినది? మొట్టమొదట సృష్టింపబడిన హిరణ్యగర్భునికి కూడ ఈశ్వరుడు ఇచ్చిన వేదమునుబట్టియే ధర్మజ్ఞానము కలిగినది అని. "యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై" — ఏ పరమాత్మ మొదట బ్రహ్మను సృజించి, అతనికి వేదములను అందజేసెనో...." ఇత్యాదిగ శ్రుతులు చెప్పు చున్నవి. ఆ హిరణ్యగర్భుని విషయమే ఇట్లున్నచో ఇతరుల మాట ఏమిచెప్పవలె? కావున 'వైదిక' అని చెప్పుట యుక్తమే. (ఈ 'వైదిక' పదము) ‘అబ్బక్షాః' 'వాయుభక్షాః' ('జలమును భక్షించువారు', 'వాయువును భక్షించువారు" అనునపుడు జలమునుమాత్రమే, వాయువును మాత్రమే అను నర్థము వచ్చినట్లు) ఇత్యాదు లందువలె " ధర్మము వేదముద్వారా మాత్రమే తెలియును' అని బోధించుచున్నది.

ఇచట 'ధర్మ' శబ్దము ప్రవృత్తి ధర్మమును (కర్మను), నివృత్తి ధర్మమును (కర్మసన్న్యాసమును) కూడ బోధించును. కావుననే గీతాభాష్యము నందు "వేదో క్త ధర్మము ప్రవృత్తిరూపము, నివృత్తిరూపము అని రెండువిధములు' అని చెప్పబడియున్నది.

Dharma is of two kinds: "pravrutti" or done with karma and "nivrutti" or renunciation of karma. To obtain perennial happiness or bliss dharma is the only means. The nivrutti dharma followed by ascetics facilitates the merger with brahman after gaining deep knowledge about upanishads. The pravrutti dharma, by engendering karma, helps one attain dispassion and cleanses the mind and intellect (antah karana that are four in number viz. manas, budhi, ahamkaara and chitta. Manas and budhi stand for mind and intellect. Ahamkara is the ego. And chitta is memory) that are necessary for an ascetic.

నిత్యమగు సుఖమును సంపాదింపవలె నన్నచో ధర్మ మొక్కటియే సాధనము; ఇక దీనిని అపేక్షింపబనిలేదు అని కర్మమీమాంసకులు చెప్పుదురు. 'మార్గ' అని చెప్పుచు వారి యభిప్రాయము నిర్దుష్టము కాదని సూచించుచున్నారు. సన్న్యాసరూపమగు నివృత్తి ధర్మము, పరమపురుషార్థ సాధనమగు బ్రహ్మసాక్షాత్కారమునకు సాధనమగు ఉపనిషద్విచారమునకు హేతువు. నిష్కామకర్మానుష్ఠాన రూపమగు ప్రవృత్తి ధర్మము సన్న్యాసమునకు సాధనమగు వైరాగ్య మునకు హేతువైన చిత్తశుద్ధిని కల్గించును.

ఈ రెండువిధములగు ధర్మములును ఈ విధముగ అవశ్యకములు. అంతియే కాని నిరతిశయసుఖమును ఈ రెండు ధర్మములుగూడ ప్రత్యక్షముగ ఈయ జాలవని సూచింపబడినది. భగవంతుడగు బాదరాయణుడు ఈ విషయమునే ఈ క్రింది శ్లోకములో చెప్పియున్నాడు

"ధ్యాని మావథ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః, 
ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తిశ్చ ప్రకీర్తిత"

(ప్రవృత్తిధర్మము, నివృత్తిధర్మము అనునవి ఈ రెండును రెండుమార్గములు: వీనియందే వేదముల తాత్పర్యము).

కావున ఉపనయనానన్తరము బ్రాహ్మణుడు —

"వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠియతాం తేనేశస్య విధీయతా మపచితిః కామ్యే మతిస్త్యజ్యతామ్, పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషో అ సునన్దయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్య తామ్. సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం, శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాకు నన్త్యజ్యతామ్,"

Sankara advises in Sopana Panchaka to a bachelor during thread marriage or upanayana: "Study vedas every day, perform karma prescribed by vedas, give up desires and karma done to satisfy desires, avoid sin, understand the defects of samsara or bondage, develop keenness to realize atma, leave your home, mix with devotees, develop strong devotion, enhance sattva guna".

నిత్యమును వేదాధ్యయనము చేయుడు. దానియందు విధింపబడిన కర్మలు ఆచరింపుడు. దానిచే ఈశ్వరునకు ప్రీతి కలిగింపుడు, కామ్య కర్మయందు ఆసక్తిని విడువుడు. పాపసముదాయము తొలగించు కొనుడు. సంసార సుఖమునందలి దోషమును గుర్తింపుడు. ఆత్మ విషయమున ఇచ్ఛను పెంపొందించుకొనుడు. వెంటనే స్వగృహ మును విడచిపొండు. సత్పురుషుల సంగముచేయుడు. భగవంతునిపై దృఢమగు భక్తి సంపాదింపుడు. శాన్త్యాదికము వృద్ధి పొందించు కొనుడు. దృఢతరమైన కర్మను శీఘ్రముగా విడువుడు అని సోపాన పంచకమున (శంకరభగవత్పాద విరచితము) చెప్పబడిన విధమున ఈశ్వరార్పణ బుద్ధితో కర్మచేయుచు, చిత్తమును నిర్మలము కావించు కొని, విషయములనుండి వైరాగ్యమును బొంది కర్మలనుండి విర మింపవలెను అని బోధింపబడినది.

మోక్షధర్మమునందు గూడ- "తాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తం యథైకతా సమతా సత్యతా చ శీలం స్థితిరణ నిధాన మార్జవం తతస్త తశ్చో పరతిః క్రియాభ్యం.”

ఏకాకిత్వము, సమత్వము, సత్యము, శీలము, స్థితి, అహింస, ఋజుత్వము, క్రమముగ కర్మలనుండి నివర్తించుట అను వీటితో సమానమైన ధనము బ్రాహ్మణునకు లేదు అని చెప్పబడినది.

Aloofness, equanimity, truth, character, non-violence, straightforwardness, renouncing karma (nivrutti) are the assets par none for a mumukshu.

"విద్వత్త్వమస్మాత్ఫరమ్" - ప్రవృత్తిధర్మము విషయమున దీనిఅర్థమును ఈ విధముగ చెప్పవలెను. “యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి" అను ఛాందోగ్య శ్రుతి ననుసరించి చేసెడి కర్మను దాని కంగములగు మంత్రములు అర్థ జ్ఞానముతో చేసినచో అధికఫలము లభించును అని చెప్పినట్లైనది. కావుననే ఆ ఘట్టమునందలి భాష్యములో "ఒక వర్తకునకు ఒక ఆటవికుడు పద్మరాగ మాణిక్యమును అమ్మినపుడు, వర్తకునకు జ్ఞానము అధికముగ నుండుటవలన అధిక ఫలము లభించుట లోకమున కానవచ్చుచునే యున్నదికదా" అని చెప్పబడినది.

The pravutti or worldly dharma, according to Chandogya upanishad, is best achieved by knowing the meaning of mantras. To illustrate it was said that the value of a precious stone is better known by a goldsmith than a miner who finds it.

నివృత్తి ధర్మవిషయమున దీని యర్థమిట్లు:- 'సన్న్యస్య శ్రవణం కుర్యాత్ ' సన్న్యసించి శ్రవణము చేయవలెను అని విధించుటవలన, సన్న్యసించిన పిమ్మట వేదాన్త వాక్యములు శ్రవణము చేయుటచే జనించిన పరోక్షజ్ఞానము కలిగి యుండుటయే విద్వత్త్వము.

Sankara used the word"vidwat" which means, after turning into an ascetic, the ability to gain indirect knowledge about brahman by listening to the upanishads.

ఆస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనమ్:_

ఈ విషయము మున్ముందు గ్రంథమునందు స్పష్టమగును. దీనిచే, వినిన విషయమును యుక్తులచే దృఢము చేసికొనుటకై చింతనము చేయుట యను మననమును చెప్పినట్లైనది. ఈ మననము సంశయమును తొలగించును. దాని తరువాత నిదిధ్యాసనము చేయగా కల్గిన బ్రహ్మ సాక్షాత్కారరూపమగు 'స్వనుభవము' చెప్పబడినది.

శ్రవణ మననముల వలన కలిగిన అనుభవము విపరీత జ్ఞానమును తొలగించెడు నిది ధ్యాసనము లేకున్నచో స్థిరముగ నిలువజాలదు గాన అది 'స్వను భవము' అని చెప్పబడినది.

The phrase"swanubhava" means reflecting in mind and intellect on the knowledge gained by listening to the upanishads, meditating over them and clearing doubts about them. The experience gained by listening to scripture gets reinforced when it is reminisced.

దీనిచే శుభేచ్ఛ (శాస్త్రసజ్జనసంపద్యాభిలాష) విచారణ (సదాచార ప్రవృత్తి), తనుమానస(విషయాభిలాష క్షీణించుట) సత్త్వాపత్తి (సత్త్వగుణాభివృద్ధి) అను నాల్గు జ్ఞానభూమికలను సూచించడమైనది.

“బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తి" అనునపుడు వాసనాక్షయ మనోనాశనములతో గూడిన స్వనుభవమును బోధించు “సంస్థితి' శబ్దముచే అసంసక్తి (సంగ రాహిత్యము), పదార్థాభావనా (ఆత్మైక దృష్టి ఏర్పడుటచే బాహ్యాన్తర పదార్థములను గుర్తింపక పోవుట), తుర్యగా (అద్వైతాత్మ స్థితి) అను భూమికలు కూడ సూచింపబడినవి. ఈ భూమికాసప్తకము సర్వవేదాన్త సిద్ధాన్త సారసంగ్రహములో 989-948 శ్లోకములలో విపులముగ వర్ణింపబడినది.

దీనిచే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యము లనునవి ముఖ్యమైన ముక్తులు గావను విషయము గూడ సూచితమైనది. ఈ నాల్గును సగుణ విషయకములేగాన మిథ్యాభూతములే. సగుణ రూపమునకు పరిచ్ఛేదత్రయశూన్యత్వరూపమగు బ్రహ్మత్వమును జెప్పుట కుదరదు -కదా!

సాలోక్యాదులకు దేవుని లోకము నందుండుట, సమీపము నందుండుట, సమానరూపముతో నుండుట, దేవునితో కలియుట అని అర్థము. ఈ కాలము నందున్నది అని చెప్పుట కాలతః పరిచ్ఛేదము. ఈ ప్రదేశము నందున్నది అని చెప్పుట దేశతః పరిచ్ఛేదము. ఇది దానికంటె భిన్నము అని చెప్పుట వస్తుతః పరిచ్ఛేదము. బ్రహ్మకు ఈ మూడు పరిచ్ఛేదములు లేవు. అనగా అది సర్వదా ఉన్నది. అంతట ఉన్నది. తద్భిన్నమగునది ఏదియు లేదు.

కల్పితములగు సకలవిధోపాధుల సంబంధములేని నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము ప్రత్యగాత్మభిన్నము అగు పరిపూర్ణ స్వరూపమున ఉండుటయే 'బ్రహ్మాత్మనా సంస్థితి'. అట్టి కైవల్యమే ముక్తి. అది శతకోటి జన్మకృతములగు పుణ్యములు లేకున్నచో లభింపదు అని అన్వయము.

No comments:

Post a Comment

Viveka Sloka 16 Tel Eng

Telugu English All మేధావీ పురుషో విద్వానూహాపోహవిచక్షణః । అధికార్యాత్మవిద్యాయాముక్తలక్షణలక్షితః ॥ 16॥ మేధావీ = మేధావంతుడ...