Thursday, August 15, 2024

Viveka Sloka 10 Tel Eng




	
	సన్న్యస్య సర్వకర్మాణి భవబంధవిముక్తయే ।
	యత్యతాం పండితైర్ధీరైరాత్మాభ్యాస ఉపస్థితైః ॥ 10॥
	
	
	
	sannyasya sarvakarmāṇi bhavabandhavimuktayē ।
	yatyatāṃ paṇḍitairdhīrairātmābhyāsa upasthitaiḥ ॥ 10॥
	
	

సర్వకర్మాణి = సమస్త కర్మలను, సన్న్యస్య = సన్యసించి, ధీరై = మనస్సును అదుపులో నుంచుకొన్నవారును, ఆత్మకుసంబంధించిన శ్రవణాదులయందు, ఉపస్థితై -ప్రవర్తించుచున్న పండితులచే, భవబంధవిముక్తయే = సంసారబంధముల ముక్తి కొరకు, యత్యకామ్ = ప్రయత్నము చేయబడుగాక.

సర్వకర్మాణి సన్న్యస్య - కర్మకాండోక్త ములగు కర్మలనన్నింటిని విడచి, భవబంధవిముక్తయే సాంసారిక బంధముల నివృత్తికి కారణ మగు సమ్యగ్ దర్శననిష్ఠకొరకై, పండితైః = ఆత్మను ప్రత్యక్షముగ తెలిసికొనగల్గిన, ధీరై = బుద్ధిని వశములో నుంచుకొన్న వారిచే

	రాంచి ఖాని వ్యతృణత్స్వయంభూ॥

	తస్మాత్ పరాక్  పశ్యతి నాన్త రాత్మన్, 

	కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ 

	అవృత్త చక్షురమృతత్వమిచ్చన్.
	

ఇంద్రియములు బహిర్ముఖములుగ మాత్రమే యుండునట్లు బ్రహ్మ దేవుడు హింసించెను. అందుచే మానవుడు బాహ్యప్రపంచమును మాత్రమే చూడగలడుగాని అంతరాత్మను చూడజాలకున్నాడు. కోరు ఎవ్వడో ఒక్కడు దృష్టిని అంతర్ముఖముగ చేసికొని అంతరాత్మను చూడగల్గుచున్నాడు అని శ్రుతిచెప్పినట్లు ధియం=బుద్ధిని, రాతి = గ్రహించును అనగా వశములో నుంచుకొనును కాబట్టి 'ధీరుడు' దేహేంద్రియాదులలో అతిప్రధానమగు బుద్ధిని స్వాధీనము చేసికొనుచున్నాడన్నచో ఇతరేంద్రియములను గూడ జయించినాడని వేరుగ చెప్ప బనిలేదు. దీనిచే శాంత్యాదులు కల్గియుండవలెనను విషయము సూచితము. ఆత్మాభ్యాసమనగా-

The creator endowed us with senses that can't see within. That's why we can receive stimuli from the external world and process them within being unable to observe atma. One in a billion might be an exception to the rule. It is possible for some whose mind and intellect (budhi) are reined in.

Isn't it enough that we accept atma exists? Why should we be able to realize it? Suppose you never tasted salt. No matter how many words I use to describe the salt and its taste, you won't be able to experience salt. It is only when you eat something with salt, you come to know about it experientially. In a similar vein, for time immemorial, vedas proclaimed the existence of atma. Yet, we don't have any scientific evidence. This is not a shortcoming but a positive experience. It makes us sadhakas and helps us bide time on the earth in a constructive way. We don't see electricity but see its effects in bulbs, fans and other appliances. We can measure its voltage and come to know of its existence in a wire. Similarly we can experience all the manifestations of paramatma in jeevatma and the object world without ever seeing an individual atma. Actually the division between paramatma and jeevatma is made for the convenience of discriminating between the god and jiva. In actuality there is only all pervading, omnipresent paramatma. There is nothing else. If there were to be something else, then we make paramatma finite and he will no longer be omnipresent.

Sankara in this sloka is encouraging renunciation of karma and focusing on atma. It is to be noted that he is asking us to renounce karma prescribed in vedas ( veda vihita). Conducting fire sacrifices (yagna), giving alms so on ought to be done as per vedas. For a sadhaka embarking on the discovery of atma, such karma is nothing but a distraction.

There is a secret behind veda vihita karma. For as long as one thinks he is a jiva, he has to keep on doing karma. The history is replete with examples of stalwarts who attained salvation by renouncing wives, children, loved ones and the rest. Naturally we ask how do we know they attained salvation? Did they send us a postcard with heaven stamped on it? Once again we have to employ our inferential knowledge. A man's worth is known by the legacy he has left behind. Gautam Budha, Adi Sankara and scores of others are remembered eons after they walked on the earth. No matter how many times invaders attacked the Indian subcontinent, the history of Budha or Sankara could not be erased from people's memories. To the contrary, the faith in them has multiplied.

You say "But I need something to worship to get me through the day". That is the lower-mind seeking a crutch. One has to give up the crutch and embrace the god-mind. It automatically follows with karma-sanyasa (renunciation) because god doesn't have any karma. All of our actions are brought forth by pent up thoughts (vasanas) and desires. Some of them are carried from previous life and a fresh list of them is being made every moment. We need to stop making lists to rise above the lower mind.

 
	తచ్చిన్తనం తత్కథన మన్యోన్యం తత్ప్రబోధనమ్, 

	ఏతదేశపరత్వం చబ్రహ్మాభ్యాసం విదుర్భుదాః.
	

దానిని– ఆత్మను -- గూర్చి ఆలోచించుట, దానినిగూర్చి మాటలాడుట, పరస్పరము దానిని గూర్చి బోధించుకొనుట అనునదియే తదేక దృష్టితో చేసెడు బ్రహ్మాభ్యాసమని పండితులు చెప్పుదురు అని ప్రామాణికులు చెప్పిన విధమున వినిన విషయమును మననము చేసికొనుట, దానిని గూర్చి ముచ్చటించుచుండుట, ఒకరికొకరు బోధించుకొనుట అనెడు జ్ఞానకాండోక్తములైన వ్యాపారములందు లగ్నమైయుండుట అట్టి ఆత్మాభ్యాసోద్యుక్తులు, విజాతీయములుగు జ్ఞానములచే విచ్ఛిన్నము కాని సజాతీయజ్ఞాన ప్రవాహమగు నిదిధ్యాసనమును అనుష్ఠించుచు ప్రయత్నింతురు గాక అని యన్వయము. (ఇతర జ్ఞానము లేవియు మధ్య కలుగకుండ ఒకే జ్ఞానము అవిచ్ఛిన్నముగ చాల కాలము తైల ధారవలె కొనసాగుట నిదిధ్యాసనము). ఇట్టి పురుషునకు సర్వసంకల్పములను సంన్యసించుటచే ఉత్తమ వైరాగ్యమను నామాంతరముగల యోగారూఢత్వము హస్తగతమే యని తెలియవలెను.'

అప. (ఆశంక) ' యావజ్జీవ మగ్నిహోత్రం జుహుయాత్ '- జీవించియున్నంతకాలము అగ్నిహోత్రము చేయవలెను; “యావజ్జీవం దర్శపూర్ణ మాసాభ్యాం యజేత" జీవించియున్నంతవరకు దర్శపూర్ణ మాస యాగములు చేయవలెను: "అహరహః సంధ్యాముపాసీత"- ప్రతిదినము సంధ్యోపాసన చేయవలెను; " కుర్వన్నే వేహ కర్మాణి జీజీవి షేచ్ఛతం సమాః”-కర్మలుచేయుచునే నూరునంవత్సరములపాటు జీవనము గడపుటకై అభిలషించవలెను - ఇత్యాది శ్రుతులు జీవించి యున్నంతవరకును కర్మలుచేయుచునే యుండవలెనని బోధించు చున్నవికదా? కర్మసంన్యాసము చేసినచో శ్రుతిని అతిక్రమించినట్లు కాదా?

(సమాధానము). కాదు. ఏలయన ఆ శ్రుతులన్నియు చిత్తశుద్ధి లేని వారినిగూర్చి చెప్పినవి. అందుచేతనే "ఏవం త్వయి నాన్యథేతో అ స్తి న కర్మ లిప్యతే నరే" అను ఈశావాస్య మంత్రము - నరే= నరమాత్రాభిమానముగల, త్వయి- నీయందు, ఇత= కర్మాచరణముకంటె, అన్యథా—మరియొక మార్గము; దేనివలన కర్మలోపము వలనకల్గు పాపముండదో అట్టిమార్గము - నాస్తి = లేదు అని చెప్పబడినది. అనగా 'నేను మానవుడను' అని అనుకొనునంతవరకును కర్మ చేయుచునే యుండవలెను అని భావము: "న కర్మణా స ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః " కర్మచేత కాదు, సంతానము కనుటచేకాదు, ధనముచేకాదు,కర్మత్యాగము చేతనే కొందరు మోక్షమును పొందిరి; "సంన్యాసయోగాద్యతయః శుద్ధ సత్త్వాః" - యతులు సంన్యాసయోగముచే శుద్ధమైన బుద్ధికలవారు;

	ప్లవా హ్యేతే అదృఢా యజ్ఞ రూపాః 

	అష్టాదశోక్త  మవరం యేషు కర్మ,

	ఏతచ్చ్రేయో యే అ భినన్దన్తి మూఢా 

	జరామృత్యుం తే పునరేవాపి యన్తి.
	

యజ్ఞోపాధిభూతులగు ఈ పదునెనమండుగురును - 16 గురు ఋత్వ క్కులు, యజమానుడు, అతని భార్య - దుర్భలమైన తెప్పలు. వారిపై ఆధారపడియున్న యజ్ఞ రూపమగు కర్మగూడ క్రింది తరగతికి చెంది నదే. ఏ మూఢాత్ములు ఈ కర్మనే శ్రేయస్సుగా అభినందింతురో వారు మరల మరల జరామృత్యువుల పాలగుచుందురు,

"కిమర్థా వయ మధ్యేష్యామ హే, కిమర్ట్రా వయం యక్ష్యామహే" - మనమెందులకు ఈ అధ్యయనముచేయుట, ఎందులకీ యజ్ఞము లాచరించుట; ఇత్యాదిశ్రుతులు కర్మ సంన్యాసమును విధించి కర్మను నిందించుచున్నవి.

"తమేతం వేదాను వచనేన బ్రాహ్మణా వివిదిషన్తి యజ్ఞేన దానేన తపసానాశకేన " బ్రాహ్మణులు వేదాధ్యయనము చేతను, యజ్ఞము చేతను, దానముచేతను, అనశ్వరమగు తపస్సుచేతను ఈ ఆత్మను తెలిసికొన నిచ్చగించుచున్నారు.

“యోగినః కర్మ కుర్వన్తి సంగం త్యక్త్వాత్మశుద్ధయే " - యోగీశ్వరులు సంగమును విడిచి, కర్మలను ఆత్మశుద్ధికొరకై ఆచరించుచుందురు ఇత్యాది శ్రుతిస్మృతులను పర్యా లోచించగా ఆ కర్మలు చిత్త శుద్ధిద్వారా వివిదిషకు (జ్ఞానేచ్ఛకు) సాధనములుగ నుండునని మాత్రమే నిర్ణయింపబడుచున్నది కాని వీటిని ఎల్లప్పుడును చేయుచునే యుండవలెనని కాదు.

అట్లైనచో "యద హరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ "- ఏ రోజున వైరాగ్యము కలు గునో ఆరోజునే సంన్యాసమును స్వీకరింపవలెను- అను సంన్యాస విధాయక వాక్యములకు బాధ కలుగును; కర్మనింద కూడ అనుపపన్నమగును.

"అత ఏవ చాగ్నిన్దనాద్యన పేక్షా" "సర్వా పేక్షాచ యజ్ఞాది శ్రుతేరశ్వవత్ " - విద్యయే పరమ పురుషార్థ హేతువగుటచే అగ్నిన్ద నాదులగు యజ్ఞాదులగు గృహస్థాద్యాశ్రమకర్మలు మోక్షవిషయమున అపేక్షితములు కావు;

'తమేతం వేదానువచనేన' ఇత్యాది శ్రుతులచే ఆశ్రమకర్మలన్నియు విద్య లభించుటకుమాత్రము ఉపయోగించును; ఫలమునిచ్చునది మాత్రము విద్యయే, అశ్వాదులను బండిలాగుటకు మాత్రమే ఉపయోగింతురు గాని దుక్కిదున్నుటకు ఉపయోగింపరు.

ఆ విధముగ కొన్ని వస్తువులు కొన్నింటిని సాధించుటకు మాత్రమే ఉపయోగపడును. అట్లే ఈ యజ్ఞాదులు అని బ్రహ్మసూత్రములు గూడ ఈ యర్థమునే బోధించుచున్నవి. కావున కర్మలు పరమ పురు షార్థమగు మోక్షము నీయజాలవు; ఇవి చిత్తశుద్ధి కలిగించుటద్వారా జ్ఞానమునకు బహిరంగములుగానే ఉండును అను విషయమును 'చిత్తస్య ' ఇత్యాది శ్లోకమున చెప్పుచున్నాడు;

Are vedas wrong in prescribing karma? A rich householder could perform a hundred yagnas, donate alms to thousands and feed the poor. This is called, in alternate language, "trickling down". By sharing his wealth with the less fortunate by way of alms, compensating the ritviks (brahmins) at the conclusion of a yagna with gifts, if he is a king rewarding the kshatriyas who protected the yagna or fought with anyone who dared to stop the horse in aswametha yagna, the rich man's wealth trickled down to others. Some feel this is the way economies ought to be run. When the kuberas among us perform glitzy functions, their wealth, that could be parked in mutual funds or stock market earning passive income, is released with a velocity increasing the circulation and giving rise to enhanced GDP. Such karma has its own reward like attaining heaven. But it in no way guarantees liberation. The rich man has to be reborn several times to settle the debts (runam) with all of his beneficiaries, in the process of which more indebtedness is possible. When Jada Bharata (Bhagavata, Skandha 5), after renouncing his kingdom, while in vanaprasta, innocently fell in love with a baby doe, he earned the privilege to be born as a doe. If he were not so enamored to the baby doe, he could have easily attained salvation.

There is no such thing as bad karma. The karma prescribed by the vedas is done to mitigate a negative outcome or give a positive result such as progeny (putra kameshti yaga). It is a means to an end. A farmer uses an ox to plough the land and a horse to move a carriage. He doesn't mix them up. Therefore, veda vihita karma is an antidote to an anticipated loss or a catalyst to provide much sought relief. It is confined to a time and space. Liberation means transcending all by giving up veda vihita karma and doing the least karma to get through the day. And what to do with the freed up time? It is to be used, as Sankara says, for the contemplation (nidhidhyasana) on atma.

This begs the question "Is Sankara writing all this up so that some brainwashed by him, spread his teachings and elevate him to the godhood?" Every avatar of the Lord Vishnu promulgated the good behavior and stood for dharma. In the poorna avatar of Sri Krishna he had declared himself to be the godhead. Sankara did not want to conform to the status quo back then which may be called polytheism. Every nook and corner of Indian subcontinent had its own religion and deity of worship. Devotees argued and fought with one another to settle claims of their god as superior to all others. Sankara made his mission to unite the various religious sects.

You may ask "Then why did Sankara ask everyone to give up karma?" Sankara is not asking everyone to give up everything and follow him. If he had that in mind, he would be a rebel of sorts because giving up karma is like a lockdown of a company when the employees go on a strike. What is the creator going to do if every sadhaka gave up karma by misunderstanding Sankara's advice to give up veda vihita karma? Destroy them? That would not solve the problem as they have to be reborn as per the law of karma. The fact is, it is physically impossible to live without karma. Sankara is advocating the performance of smart karma that doesn't add fuel to the fire of desires and self-aggrandizement. Smart karma is done without wasteful frittering away of mental and physical energies to achieve noble results. Many do the opposite by chasing unrealistic goals and trying to fulfill extraordinary desires resulting in pain and suffering. For most practical purposes good and sincere efforts engender positive outcomes. Thus, Sankara is asking everyone to "tone it down" and stop the pursuit of frivolous things. His message is applicable to modern times to those hell bent on making wealth one way or another, leaving aside the contemplation of the Truth.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...