Thursday, September 19, 2024

Viveka Sloka 15 Tel Eng




	
అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః ॥
సమాసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్ ॥ 15॥
atō vichāraḥ kartavyō jijñāsōrātmavastunaḥ ॥
samāsādya dayāsindhuṃ guruṃ brahmaviduttamam ॥ 15॥

అతః -ఈ కారణమువలన, దయాసింధుo-దయాసముద్రుడును, బ్రహ్మ విదుత్తమం - బ్రహ్మవేత్తలలో గొప్పవాడును అగు, గురుo - గురువును, సమాసాద్య = పొంది, జిజ్ఞాసో = బ్రహ్మనుగూర్చి తెలిసి కోదలచిన సాధకునకు (నిచేత), ఆత్మవస్తునః - ఆత్మవస్తువుయొక్క, విచారః - విచారణ, కర్తవ్యం-చేయదగినది.

అతః = సర్వానర్థములను తొలగించు నిర్ణయమునకు హేతువ గుటవలన, జిజ్ఞాసో= ఆత్మను గూర్చి బాగుగ తెలిసికొనవలెనని కోరు పురుషునకు, ఆత్మవస్తువిచారము కర్తవ్యము. ఎట్లు చేయవలెనో (ముందుగ ఏమి చేయవలెనో) చెప్పుచున్నాడు.

దయాసింధుం—తాను (గురువు) కృతార్థుడగుటచే తనకు ప్రయోజనమేమియు లేకున్నను ఇతరుల కూడ దుఃఖమును అనుభవింపకుందురుగాక అనెడు కరుణకు, జలములకు సముద్రమువలె నిలయభూతుడైన, గురుం- గురువును-

 
 గుకారస్త్వన్దకారః స్యాత్ రుశబ్దస్తన్నిరోధకః,

 అన్ధకారనిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే,

'గు' అనగా అంధకారము. 'రు' అనగా దానిని తొలగించువాడు. కావున అజ్ఞానాంధకారమును తొలగించువాడు 'గురువు' అని గురుగీతలో చెప్పిన విధముగ స్వోపదేశములచే హృదయాంతర్గతమగు అజ్ఞానమనెడు అంధకారమును తొలగించువాడని యర్థము.

అంధ కారము ప్రపంచమును ఆవరించి అది మనకు కనబడకుండచేసినట్లు, అజ్ఞానము ఆత్మను ఆవరించి, ఆ ఆత్మ స్పష్టముగ గోచరించకుండునట్లు చేయుచున్నది. కావున అజ్ఞానమే అంధకారము.

అందుచేతనే దానిని “తమో హ్యాసీత్ ; తమసాగూర్హ మగ్రే" ఇత్యాది శ్రుతులు ‘తమస్సు’ అని పేర్కొనినవి.

"బ్రహ్మవిదుత్త మమ్ " అను పదము పూర్వోక్త విశేషణములు రెండింటికిని తగిన వ్యక్తిని బోధించుచున్నది.

"బ్రహ్మ విదన్తీతి బ్రహ్మవిదః" బ్రహ్మను తెలిసికొనినవారు. వారిలో ఉత్తముడు, అనగా స్థితప్రజ్ఞుడు.

ఈ విషయమున శ్రుతులను పూర్వము ఉదాహరించినాము, అతనిని సమీపించుట యనగా "తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వః ప్రశ్రయసేవనైః” అని మున్ముందు చెప్పబోవు రీతిగను, “తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా" తగిన గురువునకు నమస్కరించి, ప్రశ్నించి, ఆయనసేవ చేసి ఆత్మతత్త్వమును గూర్చి తెలిసికొనుము అని భగవద్గీతలో చెప్పిన విధమున గురువును తనకు అభిముఖునిగా చేసికొనుట యని అర్ధము. ఈ విధముగ "అతో విము క్త్యే" ఇత్యాద్యష్టమశ్లోకార్ఠము ఇన్ని (7) శ్లోకములచే విశదీకరింపబడినది.

అవ. "అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః" అను శ్లోకములో పేర్కొనిన అధికారినిగూర్చి విపులముగా చెప్పుచున్నాడు.

The modern education system, like a well-oiled machine, runs on money. Academic centers advertise themselves at every opportunity to seek their "clients". In Sankara's time such an avarice was non-existent among gurus. They radiated their brilliance at anyone who sought it or not. A disinterested guru was still a possibility. So Sankara was advising to seek a kind-hearted (dayasindhum) guru who excelled in brahma vidya.

A sadhaka wanting to be a disciple of a capable guru is not a sign of weakness. These days anyone who can recite a few sanskrit slokas is considered as a guru and the world is infatuated with him. With modern technology, the voice of a preacher is magnified a million fold until everyone claims to "know" him personally. So following his advice is second nature. There are some youth who go about house hunting armed with a compass. When asked they say the on-line vaastu guru told them the front door should face the east.

A common misunderstanding is that a guru has to be older than the disciple. Bhakta Prahlada (Bhagavata, Skandha 7) taught his classmates about Sri Maha Vishnu, as a young lad. Same with Sankara, who didn't live very long and found acceptance as guru by septuagenarians. Everyone accepts that wisdom comes with age but few know that it is the experience that counts. An old sannyasi carrying out diurnal activities at the village outskirts all his life may not have seen an ocean and for such a person explaining an ocean could be a challenge. In the case of Sankara, when Bharati, the wife of a debator, Mandana Mishra, challenged him to explain conjugal relationship, he was at a loss for words. After seeking some time to answer her, Sankara with parakaya pravesa entered the body of a recently dead King Amaruka of Benares and experienced conjugal relationship with the queen in time to answer the debator's question. Such is the rigor and vigor of the jagat guru.

Should one be naturally born as guru? Some children attain maturity and wisdom much before they become adults. Bhakta Prahlada was blessed to listen to Narada maharshi's teachings while still in the mother's womb. Abhimanyu in Vyasa Bharata learnt about military warfare (padmya vyuha) in the womb. Similar cases exist in all religions, such as Tibetan budhism, with children recognized as saints, incarnates of god and so on. The Sankacharya peetha is offered to the most promising youngster in a generation based on the horoscope. Thus, child prodigies are gurus at a young age. It is their sanchita karma that paved way for their ascendance early in their life.

If the question is put differently as whether genes are responsible, then it requires closer examination. The ancient gurus were vegetarians, practiced non-violence, followed dharma, withdrew from civilian duties and pursued knowledge. Their sattvik personalities endeared them to the followers who were disinterested in the shenanigans of their leaders much like science fiction attracts those seeking an escape from mundane and insipid life. They felt the gods that the gurus described far exceeded the capabilities of their leaders who pale in comparison. It was to show the ruling class their proper place in the divine creation when they feel omnipotent. With tranquility and patience in discourse, the gurus were naturally accepted and welcomed by the followers. A true guru still is one sitting on a mountain all by himself, enjoying the scenery and contemplating over brahman, while brimming with knowledge to share with anyone out of his generosity and desire to uplift the suffering humanity.

After examining many factors that separate gurus from the rest, we still find it hard to accept a single guru for all times. In the olden days there were raja gurus whereby a king had his own guru. The devas had Bruhaspati as the guru while the asuras had Sukracharya. The raja guru was a titular position meaning he could be replaced when the king abdicated his throne. The question is Bruhaspati or Sukracharya a title, such as Manu and Indra, for the men of martya loka recognized with appellations for their noble acts? If so, then men occupying Bruhaspati and Sukracharya positions had to vacate their positions in deference to the more recent ones to ascend to their positions. What happens to the ones superannuated? Do they go into oblivion or merge with brahman?

Thursday, September 12, 2024

Viveka Sloka 14 Tel Eng




	
అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ।
ఉపాయా దేశకాలాద్యాః సంత్యస్మిన్సహకారిణః ॥ 14॥ (పాఠభేదః - సంత్యస్యాం)
adhikāriṇamāśāstē phalasiddhirviśēṣataḥ ।
upāyā dēśakālādyāḥ santyasminsahakāriṇaḥ ॥ 14॥ (pāṭhabhēdaḥ - santyasyāṃ)

ఫలసిద్ధి - ఫలముయొక్క సిద్ధి, విశేషతః - ముఖ్యముగ, అధికారిణం – అధికారిని, ఆశాస్తే - అపేక్షించును, అస్యాం - ఈ ఫలసిద్ధి యందు, దేశకాలాద్యాః - దేశము కాలము మొదలైనవియు, ఉపాయా- ఇతరోపాయములును, సహకారిణః- సహకారులుగ, సంతి - ఉన్నవి.

At the outset the success of a sadhaka depends on his particular mental or psychological make up. This is true even with tutelage under an extremely capable and kind-hearted guru who can teach the disciple the truths he learnt from his guru, and guide the disciple. The capability of a guru matters for the success of the disciple but not in its entirety

There is no perfect time to begin sadhana. Some seek sannyasa at a young age. Some attain vairagya at an advanced age or in vanaprastha. There is no set place either. One can be a sannyasi in his own home or withdraw to a secluded place by accepting sannyasa from a guru.

It is common to see parents overly concerned about their children's "milestones". They want their children to begin kindergarten studies at a young age and graduate from college in their 20's. Then they want to perform their marriage and expect their grand children. Such plans are fine but not necessary. Some children blossom late. They may marry when they are in their 30's after completing studies in a university. Or they may remain as bachelors in their spiritual quest. They can choose to adopt children or not have any children at all, and so on.

A sadhaka has none to blame but himself if, after being taught by a capable guru, falls off the apple cart. We see some false prophets who indulge in improper behavior with children and women when left to their own devices. No competent guru can take credit for that.

కర్మల ఫలము మనకు కనుపించునది. అందుచే

'యదాహ వనీయే జుహోతి'

ఆహవనీయమునందు హోమము చేయుటవలన;

'అశ్వస్య పదే జుహోతి'

అశ్వము పాదము పెట్టినచోట హోమము చేయవలెను.

'ప్రాచీనప్రవణే వైశ్వదేవేన యజేత'

ప్రాచీన ప్రవణమున వైశ్వదేవయాగము చేయవలెను;

‘సాయం జుహోతి ప్రాతర్జుహోతి'

సాయంకాలమునందును, ప్రాతఃకాలము నందును హోమము చేయవలెను;

'వసన్తే బ్రాహ్మణో అగ్ని నాదధీత'

బ్రాహ్మణుడు వసంతమునందు అగ్న్యాధానము ఇత్యాది శాస్త్రములు పేర్కొనిన వసన్తప్రాతఃకాలాది కాలములును, అశ్వపదాది దేశములుగూడ (ఫలమునకు) అసాధారణకారణము లని అంగీకరింపవలెను.

(ఆశంక) "యథాదర్శే తథాత్మని యథాస్వప్నే తథా పితృ లోకే, యథాప్సు పరీక్ష దదృశే తథా గంధర్వలోకే ఛాయాతపయోరివబ్రహ్మలోకే".

ఆత్మ నిర్మలమగు బుద్ధియందు అద్దములో కనబడి నట్లు స్పష్టముగ కనబడును. పితృలోకమునందు స్వప్నమునందువలె అస్పష్టముగ కనబడును, గంధర్వలోకమున నీటియందువలె ఇంకను అస్పష్టముగ కనబడును; బ్రహ్మలోకమున ఎండనీడలువలె వివిక్తముగ అతిస్పష్టముగ కనబడును;

"ఇహ చేద వేదీదథ సత్యమస్తి, న చేది హా వేది దథ మహతీ వినష్టః”

ఈ లోకమునందు బ్రహ్మ సాక్షాత్కా రమును పొందగలిగినచో ఈ మనుష్య జన్మకు సార్థకత్వమున్నది: పొందజాలకపోయినచో గొప్పవినాశనము కలుగును- ఇత్యాదిశ్రుతులు మనుష్యలోక బ్రహ్మలోకములే బ్రహ్మజ్ఞానమునకు తగు దేశములని చెప్పుచున్నవి.

ఋణత్రయమపాకృత్య మనో మోక్షే నివేశయేత్,

అనపాకృత్య మోక్షం రు సేవమానో ప్రజత్యధః.

మూడు ఋణములను చెల్లించినపిదప మనస్సును మోక్షమార్గమున నిలుపవలెను; వాటిని చెల్లింపకయే మోక్షమార్గమున ప్రవర్తించువాడు అధోగతిని పొందును.

బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహా ద్వసీ భూత్వా ప్రవ్రజేత్ -

బ్రహ్మచర్యమును పూర్తి చేసికొని గృహస్థుడు కావలెను. తరువాత వానప్రస్థుడై, అటుపిమ్మట సంన్యాసమును స్వీకరించవలెను. ఇత్యాది ప్రమాణముల ననుసరించి బ్రహ్మజ్ఞానమున కంతరంగమగు సంన్యాసమునకు కూడ విహితమగు కాలమున్నది. కావున బ్రహ్మజ్ఞానమునకు గూడ దేశకాలాద్య పేక్ష ఉన్నదిగదా?

(సమాధానము) ఇట్టి వాక్యము లున్నమాట సత్యమే. అయినను, చిత్తశుద్ధిలేని రాక్షసరాజగు విరోచనుడు బ్రహ్మలోకమునకు వెళ్లినను, పరమగురువగు బ్రహ్మనుండి ఉపదేశము పొందినను ఆత్మ జ్ఞానమును పొందజాలక పోయెను. మరియు

It was said that atma would be visible in the budhi (intellect) like a reflection from a mirror; in pitru loka, it would be blurry; in gandharva loka, it would be like the reflection from water with waves; in Brahma loka it would be clear as a shadow. This was illustrated in the Chandogya upanishad as an allegory.

Once the King of Asuras, Virochana, and the King of Devas, Indra, went to the ashram of Prajapati to receive atma gnana or self-discovery. At the end of their studies, after mistaking his body, his reflection in the water, and the agent in the deep sleep (sushupti), when there is no perception of any kind, as atma, Indra attained the correct knowledge. Whereas Virochana with self-aggrandizement declared that his body was atma forcing the Asuras to live in servitude to him. Thus Indra and Virochana came with different conclusions about atma when all else was the same. However, only Indra was triumphant.

This is true in the modern context as well. Some students will pass with higher grades and honors than others despite being taught by the same teacher and in the same curriculum. Indeed it is common to grade the students with alphabet soup. So even if the entire class deserves a high grade, still the teacher awards them variegated grades.

Though high grades from eminent professors open doors to better jobs, ultimately the performance of the graduate in the job matters. One can't rest on his academic laurels forever and must constantly retrain himself to achieve the ultimate success. Similarly sadhana is never ending, despite attaining enlightenment, requiring constant sravana (listening), manana (repetition) and nidhidhyasana (reminiscing) until it becomes second nature.

It is common to blame the teachers and curricula when a student fails to reach his goal. Still one can't dispute the value of education. Similarly to attain moksha, the marthya loka, which is despised because of the karma, is the most suitable launch pad. It is here only that we can receive the fruit of karma and the pathway to moksha is clearly laid out. Tapas (meditation), vairagya (renunciation) and sadhana are considered as possible only here.

A less stressed aspect of vedanta is that a mumukshu must repay the debt (runa) to parents, rishis and devas to attain moksha. It is because of our parents that we are here. So we are indebted to them foremost. The rishis offered us knowledge by passing on scripture through generations. The devas gave us everything else. Hence we are indebted to all of them.

Before accepting sannyasa, Sankara gave word to his mother that he would be on her bed side when the time came for her to die and perform the last rites. As he came to his mother's death bed to fulfill his promise, the neighbors thought as a sannyasi, who was expected to have transcended samsara, he was flouting his order in life by performing last rites for his mother. When he needed fire to light the pyre, no one came forward to offer nor for assistance. Somehow with divine intervention Sankara completed the rites and moved on. So it is clear that until the three runas are paid back, there would be no salvation even for the jagat guru.

'సంసారమేవ నిస్సారందృష్ట్వా సారదిదృక్షయా,

ప్రత్యజన్త్యకృతోద్వాహాః పరం వైరాగ్యమాశ్రితాః,'

సంసారము నిస్సారమని గ్రహించి కొందరు, సారమును (పరతత్వము) చూడవలెనను అభిలాషతో, వివాహము చేసికొనక, పరమవైరాగ్య వంతులై సంన్యసించుచున్నారు.

"యది వేతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా

వనాద్వా; యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ "

లేదా బ్రహ్మచర్యా శ్రమమునుండియే సంన్యసించవచ్చును; గృహస్థాశ్రమమునుండి లేదా వానప్రస్థాశ్రమమునుండి సంన్యసింపవచ్చును; ఏ దినమున వైరాగ్యము కలుగునో ఆ దినమునందే సంన్యసింపవచ్చును- ఇత్యాది ప్రమాణములననుసరించి, మున్ముందు చెప్పనున్న వైరాగ్యాది సాధన చతుష్టయ సంపత్తికలవానికి దేశకాలముల అపేక్ష లేదు అను అభిప్రాయముతో, దేశకాలములు కేవలము సహకారులు ప్రక్కనుండి ఉపకరించునవి మాత్రమే అని చెప్పబడినది.

కావుననే

'విద్వాన్ సంన్యస్త బాహ్యార్ధసుఖస్పృహః సన్'

అనువాక్యము శ్లో. 8 బ్రహ్మస్వరూపమున ఉండుట అనెడు మోక్షమునకు ప్రత్యక్షసాధనమగు సమ్యగ్దర్శన నిష్ఠ కొరకు, మోక్షసాధనమును ఉపదేశించు గురువును ఆశ్రయించి అతడు ఉపదేశించిన విషయముపై మానసమును నిలుపుటకై వివేక వైరాగ్యములు హేతువులని చెప్పినది.

ఇట్టి మనః స్థైర్యము శమ, దమ, ఉపరతి, తితిక్షా, శ్రద్ధలు లేనిచో లభింపదు. మోక్షేచ్ఛలేనిచో మోక్ష ప్రయత్నము సంభవింపదు. కావున “అతో విముక్త్యా" అను 8వ శ్లోకమున, బ్రహ్మజిజ్ఞాసకు సాధారణ హేతువులగు వివేక-వైరాగ్య- శమాది షట్క ముముక్షుత్వములు సూచితము లైనవి.

"తరతి శోక మాత్మవిత్ "

ఆత్మజ్ఞానవంతుడు శోకమును దాటును;

"తద్వి జ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ "

ఇత్యాది శ్రుత్యనుసారముగ 'శోకము' అను నామాంతరముగల బంధమును నశింపచేయగల్గిన సమ్యగ్ జ్ఞానము లభింపవలెనన్నచో సద్గురువు ఉపదేశించిన విషయమును మననము చేయుట తప్ప మరియే సాధనమును లేదను విషయము గూడ ఈ శ్లోకమున సూచితమైనది. 'అస్యాం' అనగా 'సిద్ధియందు' అని యర్థము.

Thursday, September 5, 2024

Viveka Sloka 13 Tel Eng




	
అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః ।
న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా ॥ 13॥
arthasya niśchayō dṛṣṭō vichārēṇa hitōktitaḥ ।
na snānēna na dānēna prāṇāyāmaśatēna vā ॥ 13॥

అర్థస్య = వస్తువుయొక్క, నిశ్చయ - నిర్ణయము, హితోక్తితః - హితులైన వారి యొక్క ఉపదేశమువలన కలుగు, విచారేణ - విమర్శచేత, దృష్టః - చూడబడినది, స్నానేన- స్నానముచేత, న- కాదు, దానేన- దానముచేతగాని, ప్రాణాయామశతేన వా- అనేక ప్రాణాయామములచేత గాని, న-కాదు.

అజ్ఞానదోషముచే భ్రాంతిచెందిన పురుషుడు భయకంపాది అనర్థములకు లోనగును. అట్టిసమయమున ఆప్తోపదేశమనెడు ఆధారము లేకున్నచో, అతడు తనంత తానుగ విషయస్వరూపమును గూర్చి విమర్శింపజాలడు. అందువలన విచారమునకు అష్తోపదేశము హేతువుగ చెప్పబడినది. హితుడనగా యథార్థమును చెప్పువాడు.

భ్రాంతి చెందినవాడు, హితులు ఉపదేశించిన విధమున విచారముచేయక స్నానము, దానము, ప్రాణాయామములు మొదలగు కర్మలుచేసినను భ్రమను తొలగింపగలిగిన అపరోక్షజ్ఞానము కలుగనంతవరకును, అనర్థకారణమగు భ్రమ నివర్తింపదు గాన, అపుడు అతనికి అనర్థనివృత్తి యెట్లు కలుగును? అని భావము.

వస్తువు యొక్క యథార్థ స్వరూపమును నిర్ణయించుటకు అనుకూలమగు మానసమగు వ్యాపారమే విచారము. భ్రాంతికలిగినపుడెల్ల దానిని తొలగించి ఒక వస్తువు యొక్క యథార్థస్వరూపమును తెలుపగలిగినది హితుల ఉపదేశము ననుసరించి చేసిన విచారమే యను విషయము ప్రత్యక్షసిద్ధము.

కావున ప్రకృతమునందుగూడ శ్రుతిచేతను, ఆచార్యోపదేశానుసారముగను ఆత్మ విచారముచేసి, దాని యథార్థస్వరూపమును సాక్షాత్కరింప చేసికొని అనాత్మాధ్యాన (అధ్యారోప) రూపముగు సంసారమునుండి తనను తాను విడిపించుకొనవలెనని ఈ శ్లోకమునందలి ఉపదేశము.

అవ. ఆయా కర్మలను చేయగల సామర్థ్యమున్నవాడే ఆయా కర్మఫలమును అనుభవింపగలడు. అసమర్థుడు అనుభవింపజాలడు. కావున బాహ్యములగు దేశకాలాదులు సహకారులుగ మాత్రమే ఉండును; ఫలము నిచ్చెడిది అంతరమగు సామర్థ్యము ఒక్కటియే యని చెప్పుచున్నాడు.

Sankara is debunking rituals like giving alms to ritviks, bathing in holy rivers, breathing exercises (pranayama) as a means to attain liberation because in his era, people in the pursuit of a comfortable after life, partook in karma prescribed by vedas in a large scale. It is true that even now people perform rituals but to a lesser extent. They are still very much sectarian with an intention to experience perennial happiness, possibly everlasting bliss by worshiping demi gods. Some truly religious, visit the holy sites and seek advice from the knowledgeable people. They believe lamas, yogis, saints hold the key for liberation. They make them their personal gurus and reward them with their service and donations.

A sadhaka has to receive advice from persons (hita) who have a deep understanding of reality without vested interests. And then he has to contemplate over it called vichara. Sankara is immensely qualified as a hita to chide his followers so that they will see the Truth. A sadguru knows the deficiencies of his disciple, who is stuck in a quagmire of ignorance and lost in a forest of religions, and will set his course on a firm path towards Truth with his teaching.

Sankara says you should not take up vedanta as an escape from doing rituals including giving alms, breathing exercises, bathing in holy rivers, visiting temples as it constitutes deceit. The rituals have their place in society. Hence Sankara prescribes a deeper level of understanding gained from well meaning gurus and vichara as prescribed in the scripture. He condemns the attitude that vedanta gives a reprieve from karma and a license to indulge in freewill. The deceitful people have a romantic view of vedanta. They indulge in fancy sophistry that has no basis in reality. They neglect household activities, ignore their duties toward family and friends, withdraw from society, question the validity of religion and mock the devotees.

How to find a hita? This perhaps is the greatest challenge. There are so many false prophets who establish asrams for monetary gain, offer panacea for various illnesses, seek donations by promising moksha, and so on. An extreme example highlights the perversity of some false gurus:

The Maharaj Libel Case was an 1862 trial in the Bombay High Court in the Bombay Presidency, British India. The case was filed by Jadunathjee Brajratanjee Maharaj, against Nanabhai Rustomji Ranina and Karsandas Mulji. The case was filed because of an editorial article which they published accused the Vallabhacharya and Pushtimarg Sect of illicit and immoral activities.

The fact is, the false prophets owe their existence to scripture which is in open domain, hence no one can claim a copyright on them. No doubt some of them deep dive into the scripture, spend time to understand it, and commit to spread it by making sincere efforts. But the monetary gain they expect and receive is manifold greater compared to their own efforts.

The modern gurus who establish asrams claim they need donations to run them. So they say there is nothing wrong in generating revenue by time-honored traditional ways. They buy islands and large tracts of land on which they build huge structures to house their disciples and provide space for the congregation of their followers. Therefore, they are actually owners of non-profit businesses. In the days of yore, when varna system was in vogue, the kshatriyas, the ruling class, took care of rishis who established asrams, trained disciples, conducted yagnas so on. However, they didn't have as many pecuniary interests as the modern gurus.

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...