Thursday, October 24, 2024

Viveka Sloka 18 Tel Eng





సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః ।
యేషు సత్స్వేవ సన్నిష్ఠా యదభావే న సిధ్యతి ॥ 18॥

అత్ర = ఈ విషయమున, చత్వారి - నాలుగు, సాధనాని - సాధనములు, మనీషిభి—పండితులచేత, కథితాని - చెప్పబడినవి, యేషు - ఏవి, సత్స్యేవ=ఉన్నప్పుడుమాత్రమే, సన్నిష్ఠా-సత్తగు బ్రహ్మయందు స్థైర్యము, సిద్ధ్యతి=సిద్ధించునో, యద్భవే - ఏది లేకున్నచో, న=సిద్ధింపదో

లోకమునందు ఘటము (కుండ), పటము (వస్త్రము) మొదలగునవి కార్యములు - మట్టి, దారము మొదలగునవి కారణములు. కార్యము ఉన్న చోట ఏది ఉండదో అది ఆ కార్యమునకు కారణము కాజాలదు, ఉదాహరణమునకు పటము ఉన్న చోట మట్టి లేదు. అందుచే పటమునకు మట్టి కారణము కాదు. ఘటము ఉన్న చోట దారములు లేవు. అందుచే ఘటమునకు దారములు కారణముకావు.

కాని మట్టి ఉన్నప్పుడే ఘటము ఉండును; మట్టిలేనిచో ఘటము ఉండదు. ఈ విధముగ అది ఉన్నపుడే ఇది ఉండును; అది లేనిచో ఇది ఉండదు అను అన్వయ- వ్యతిరేకములచే మట్టి ఘటమను కార్యమునకు కారణమని నిర్ణయింపబడుచున్నది.

ఇట్లే సత్స్వరూపముగు బ్రహ్మయందు పూర్తిగఉండుటకు కారణభూతమగు బ్రహ్మజిజ్ఞాస కూడ వివేకాదిచతుష్టయ మున్నప్పుడే సంభావ్యము. అవి లేనిచో సంభావ్యము కాదు. కావున ఈ అన్వయవ్యతిరేకములను బట్టి, వివేకాదులు “సన్నిష్ఠ" అను నామాన్తరముగల ఫలపర్యంత బ్రహ్మ జిజ్ఞాసకు కారణభూతములని తెలియుచున్నది.

వివేకాదులున్నపుడే బ్రహ్మజిజ్ఞాన కలుగుచున్నది; ఇది అన్వయము. వివేకాదులు లేనిచో బ్రహ్మజిజ్ఞాస కలుగుట లేదు; ఇది వ్యతిరేకము. ఈ అన్వయవ్యతి రేకములచే బ్రహ్మజిజ్ఞాసకు వివేకాదులు కారణమని నిర్ణయింప బడుచున్నది.

'మనీషిభిః కథితాని' :- మనీషులనగా శ్రుతి తాత్పర్య మేదియో తెలిసినవారు. శ్రుతి సాహాయ్యము లేనిచో, అధికారికి ఇట్టి విశేషణము (లక్షణము) లుండవలెను అని తెలియ శక్యముకాదు గదా?

బాద రాయణాదులు అట్టి మనీషులు, "అథాతో బ్రహ్మజిజ్ఞాసా " అను సూత్రమునందలి 'అథ' శబ్దముచే 'సాధనచతుష్టయము సంపన్న మైనపిమ్మట' అను నర్థమును సూచించుచు,

బాదరాయణుడు, ఇట్టి వారికే (సాధనచతుష్టయసంపన్నులకే) బ్రహ్మవిద్యయందు అధికారమని బోధించెనని శారీరకమీమాంసా ప్రథమాధికరణ తృతీయ వర్ణకమునందలి భాష్యమువలన తెలియుచున్నది. ఇట్టి విశేషణమును సూచించు శ్రుతులు కూడ ఉన్నవి.

'తద్యదేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమే వాముత్ర పుణ్యచితో లోకః క్రియతే'- ఈ లోకమున సేవాదికర్మచే సంపాదించిన భోగాదికము ఏ విధముగ క్షీణించి పోవుచున్నదో, అట్లే యజ్ఞాది సంపాదితమగు పరలోక సుఖముగూడ క్షీణించును.

"యో వై భూమా తదమృతమ్" ఏ బ్రహ్మ స్వరూపము గలదో అది అనశ్వరము; దానికంటె భిన్నమైన దంతయు నశ్వరము

"న జాయతే మ్రియతే విపశ్చిత్ " అపరిలుప్త చైతన్యరూపమగు ఈ ఆత్మ జనింపదు, మరణించదు. ఇత్యాది శ్రుతివాక్యములు,

"యత్కృ తకం తదనిత్యమ్ " - ఏది నిర్మింపబడినదో అది అనిత్యము, అను న్యాయముచే గూడ ఉపోద్బలితములై ఆత్మకు నిత్యత్వమును, అనాత్మకు అనిత్యత్వమును బోధించుచు వివేకజ్ఞాన సంపాదకములుగ ఉన్నవి.

"పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్, నాస్త్యకృతః కృతేన" కర్మలచే సంపాదించిన స్వర్గాదిలోకములను పరీక్షించి బ్రాహ్మణుడు వైరాగ్యమును పొందవలెను. కర్మచే నిత్యమగు, మోక్షరూపముగు ఫలము లభింపదు అను శ్రుతియు,

“న వా అరే పత్యుః కామాయ" మొదలు "ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి" అనునంతవరకును గల శ్రుతియు పతి యొక్క కామము కొరకై పతి ప్రియుడుకాడు........ లోకములో సర్వమును తనకొరకే ప్రియమగును ఆత్మభిన్నములగు అన్నివస్తువుల విషయమునను; వైరాగ్యమును ప్రతిపాదించుచున్నవి.

శాన్తో దాన్త ఉపరతస్తితిక్షుః సమాహితః శ్రద్ధావిత్తో భూత్వాత్మన్యే వాత్మానం పశ్యేత్

అను శ్రుతి శమాదిషట్కమును బోధించుచున్నది. “న స పునరా వర్తతే"అతడు మోక్షమును పొందినవాడు; మరల తిరిగి రాడు అను శ్రుతి మోక్షము నిత్యమని చెప్పుచు దానిపై ఇచ్ఛను కలిగించు చున్నది.

కర్మమీమాంసకులు ఉపనిషత్తులు అర్థవాదము అని చెప్పు దురు. వారిమతము ప్రకారము 'వీటికి స్వార్థమునందు తాత్పర్యము లేదు ' - అనగా వీటి యర్థమును ప్రమాణముగ తీసికొనబని లేదు అను జ్ఞానము మాత్రమే కలుగును.

అట్లైనచో 'బ్రహ్మజిజ్ఞాస చేయవలెను. దానికి ఇట్టి విశేషణములు కలవాడు అధికారి' అను జ్ఞానము దుర్లభము.

అందుచే 'మనీషిభిః’ = పండితులచే, 'కథితాని' = చెప్పబడినవి అని చెప్పినాడు. అనగా ప్రమాణాంతరముచే తెలియ నిదియు కాలత్రయాబాధితమును, పరమపురుషార్థ స్వరూపమును అగు బ్రహ్మను ప్రతిపాదించు ఉపనిషత్తులు ఆ విషయమునందే యథార్థ ప్రమాణము అని చెప్పుటకు అవకాశమున్నది గాన, ఆ యా వాక్యములచే వివేకాదులు గలవానికే 'సో అ న్వేష్టవ్యః స విజిజ్ఞాసి తవ్యః' - ఆత్మనే అన్వేషింపవలెను, దాని జిజ్ఞాసయే చేయవలెను, ఇత్యాది వాక్యములచే విహితమగు జిజ్ఞాసకు యోగ్యత ఉండును అని చెప్పినచో అంతయు సరిపోవును.

అవ. 'వివేకినో విరక్తస్య' ఇత్యాది శ్లోకమున చెప్పిన వివేకాదులను క్రమముగ విశదీకరించుచున్నాడు.

sādhanānyatra chatvāri kathitāni manīṣibhiḥ ।
yēṣu satsvēva sanniṣṭhā yadabhāvē na sidhyati ॥ 18॥

There are 6 C's one needs to succeed in life: capability, competence, credibility, creativity, concentration, and consistency. When one has these characteristics, success ensues. Similarly Sankara, in the previous slokas, established the four qualities of a sadhaka seeking liberation such as viveka, vairagya, shatsampatti (sama-dama-uparati-titeeksha-sradha-samadhana) and mumukshatva . These are in addition to the four antahkaranas which are sense organs, mind, intellect and ego.

The most important characteristic of a sadhaka is established as brahma jignasa which means the deep longing for brahman. It should not be confused with bhakti or devotion. Bhakti is projected outward on the beloved where a devotee worships a deity with an expectation of merging with the deity. With brahma jignasa a sadhaka's ardent desire is to attain moksha or be free from birth-death cycle.

Take for example, a pot that is made of clay. Without clay there is no pot. But the converse is not true. So we conclude that: "where there is clay (cause) there is a possibility for a pot (effect); where these is no clay, there will be no pot". Similarly where there are viveka and such there is brahma jignasa. Where they are absent, there is no brahma jignasa. This kind of reasoning is called anvaya vyatireka by the pundits.

Sometimes a sadhaka faces obstacles in sadhana. It is common to blame external factors for the hindrances when in reality his viveka has not matured. So he has to keep trying and not fall off the bandwagon. Therefore, the role of an eminent guru can't be over-emphasized. Just as a doctor diagnoses a patient's condition with keen observation, a guru will know when a sadhaka has reached a mental block. He, out of kindness, intervenes and sets the sadhaka in a proper course.

Why should one care to escape from rebirth? After all, one has no memory of previous births and it will be no different in a future birth. In Bhagavata Skandha 3, Kapila Geeta this is how the Lord Kapila describes rebirth:

The womb will have microbes. They will be feeding on the smooth skin of the fetus. When the pain is severe the fetus will be falling unconscious. The salt, sour, and spices that the mother eats will subject the fetus to great pain. When the mother consumes cold food, the fetus shrinks. When hot food is ingested by the mother, the fetus suffers in pain. With the head turned downwards, the fetus lies in the mother's womb.

The fetus unable to move will be like a caged bird. In the seventh month the fetus has memory. It recalls the lives of the past and regrets over them. Remembering the sins of the past it will feel sorrow.

The fetus thinks: "How miserable my stay in the womb has become! How sorrowful it is! I am immersed in an ocean of grief. I committed sins for the sake of others. And now I am reaping them all by myself. I have been born several times, eating several kinds of food. I have suckled on so many women. Where is that I was not born? Where is the land that I can call my own other than in the cemetery."

The fetus thinks: "Surrounded by excreta I am lying still in this womb. I am being burnt by the fire in her stomach. I am counting days to get out of this smelling pit. I was born several times and died several times. But I wasn't able to understand the truth. If I come out of this womb, I will stay detached from relations. I will pray to paramatma at all times. I will refrain from sin".

"O Lord, you are merciful. Please release me from this great sorrow. Once I come out of the womb, I will put an end to all karma and spend the time on meditation of the paramatma. Being an atheist I performed several sins" thinks the fetus.

However, not everyone is convinced. It is because they are not interested in finding the root cause. They are satisfied with simple explanations like 'desire is the root cause'. A sadhaka is cognisant of it. Additionally, he would like to know the answers to the mysteries of life and the universe.

This leads to the open question: are scientific inventions inspired by the scripture? Scienctific laws can be revised based on experimentation. Whereas scripture never undergoes mutation. For example leelo paakhyaanam in yoga vaashishtam was conceived long ago by our rishis which scientists may call an exposition of multi-verse or parallel universes. When prasnopanishad says there is an eye behind the eye, one can interpret the inner eye as the visual cortex in the brain. Hence, scientific advances follow the scripture and are motivated by it. There is a widespread sentiment that science goes on dividing what we know like, for instance, the smashing of atoms into subatomic particles. Scripture, on the other hand, is holistic, all encompassing and worth pursuing.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...