|
|
|
వస్తుస్వరూపం స్ఫుటబోధచక్షుషా స్వేనైవ వేద్యం న తు పండితేన । చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్యైరవగమ్యతే కిమ్ ॥ 56 ॥
స్ఫుటబోధచక్షుషా – నిర్మలమగు జ్ఞానమనెడు నేత్రముతో, వస్తు స్వరూపం = ఆత్మ స్వరూపము, స్వేనైవ - తనచేతనే, వేద్యం - తెలిసి కొనదగినది, తు = కాని, పండితేన = తనకంటె అన్యుడగు పండితునిచేత, న = కాదు, చంద్రస్వరూపం - చంద్రుని యొక్క స్వరూపము, నిజ చక్షు షైవ = తనయొక్క నేత్రముచేతనే, జ్ఞాతవ్యం = తెలియదగినది, అన్యైః = ఇతరులచేత (నేత్రములు లేనివారిచేత), అవగమ్యతే కిమ్ - తెలియబడునా ఏమి?
స్ఫుట - నిర్మలమైన, సంశయాదులకంటే భిన్నమైన, ఏ, బోధః = శ్రవణ మనన నిదిధ్యాసనముల వలన కలిగిన సాక్షాత్కారము గలదో, దానిచేత, వస్తుస్వరూపం - ఆత్మరూపమగు వస్తువుయొక్క యాథార్థము, అనగా పరమాత్మాభిన్నత్వము, తనచేతనే, వేద్యం = విషయముగ చేసికొనదగినది;
అంతయేకాని తనకంటె భిన్నుడగు ఏ పండితుని చేతను తెలియదగినది కాదు.
శుకవామదేవాదులు పరబ్రహ్మ సాక్షాత్కారమును పొంది ముక్తు లైనారు. దానిచే ఇతరుల కేమి వచ్చినది . అని భావము.
అందులకు తగిన దృష్టాన్తము నిచ్చుచున్నాడు. తాపమును నివారించి ఆహ్లాదమును కల్గించెడు చంద్రుని స్వరూపమును తన నేత్రము తోడనే తెలిసికొనవలెను గాని చక్షుర్విహీనులగు ఇతరులచే గ్రహింపబడునా?
లేదా, నేత్రములు కలవారైనను, తనకంటె భిన్ను లైనవారిచే తెలిసికొనబడినను, చంద్రస్వరూపము ఈతని తాపమును తొలగించునా? ఇతనిని ఆహ్లాదింప చేయునా ? అట్లే అని యర్థము.
ఆవ. లోకప్రసిద్ధముగు పాశాది బంధమును పైవాడెవ్వడైనను విడిపించుటకు సమర్థుడు కావచ్చును. అంతియేకాని అనాది సిద్ధమగు బంధమును కాదు అని చెప్పుచున్నాడు..
vastusvarūpaṃ sphuṭabōdhachakṣuṣā svēnaiva vēdyaṃ na tu paṇḍitēna । chandrasvarūpaṃ nijachakṣuṣaiva jñātavyamanyairavagamyatē kim ॥ 56॥
Here we see the poet in Sankara. After illustrating bondage with strife and disease, he is now mentioning the moon to further reinforce the concept.
Moon has been celebrated by many a poet. One Telugu dictionary by Sri G.N.Reddy provides 364 synonyms for the word "SaSi" which stands for the moon in Sanskrit!
The movie industry likes to give us many songs around moon. Here are some:
1.
చందమామ రావే జాబిల్లి రావే chandamaama raavE jaabilli raavE
Come hither moon!
కొండెక్కి రావే గోగుపూలు తేవే kondekkiraavE gOgupoolu tEvE
Climb over the mountain and bring fragrant flowers
2.
చందమామా చందమామా chandamaama chandamaama
O, moon, O, moon
వింటర్ లో విడిగా ఉంటానంటావేమా winterlO vidigaa untaanantaavEmaa
Why do you want to be apart in the winter season?
హయ్యోరామా జంటై రామ్మా hayyOraamaa jantai raammaa
O Rama, come as a pair
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమా janavarilO chalimantai nE untaalEmaa
I will be as warm as a camp fire in January
3.
జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా.. jaabilitO cheppanaa ...
Shall I tell moon...
జామురాతిరి నిదురలోన jaamuraatiri niduralOna
In the middle of the night
నీవు చేసిన అల్లరి చెప్పనా..రోజా... neevu chEsina allari cheppana... rOjaa
The mischief you have done, O, Roja!
4.
చల్లని వెన్నెలలో challani vennelalO
In the cool presence of moon
చక్కని కన్నె సమీపములో... chakkani kanne sameepamulO
In the viscinity of a beautiful damsel
చల్లని వెన్నెలలో challani vennelalO
In the cool presence of moon
5.
చల్లనిరాజా ఓ చందమామ challaniraajaa O chandamaama
The king of cool radiance, O, moon
నీ కథలన్ని తెలిసాయి nee kathalanni telisaayi
I know all the stories about you
ఓ చందమామ.. నా చందమామ O chandamaama ... naa chandamaama
O, moon, my moon!
And in a sombre tone, a poet alludes the traditional story that lunar eclipse is caused because of a snake called Rahu swallowing the moon.
6.
చందమామా నిజము చెప్పకు chandamaamaa nijamu cheppaku
O, moon don't tell the truth
చెప్పినా సాక్ష్యం ఇవ్వకు cheppinaa saakshyam ivvaku
Even if you do, don't give a witness testimony
పరిగెత్తి వస్తుంది రాహువు parigetti vastOndi raahuvu
The snake called Rahu is coming fast (to swallow you)
అయ్యో తరిగి పోతోంది ఆయువు ayyayyO tarigi pOtunnadi aayuvui
The longevity is lessening
7.
మామా చందమామా, వినరావా నా కథా mAmA chanda mAmA, vinarAvA nA kathA
O, moon, why don't you listen to my story?
వింటే మనసు ఉంటే, కలిసేవూ నా జత vintE manasu untE, kalisEvu naa jata
If you listen and put your heart into it, you will empathize with me
నీ రూపమే ఒక దీపము గతిలేని పేదకు nee roopamE oka deepamu, gatilEni pEdaku
You are the light for the helpless poor
నీ కళలే సాటిలేని పాఠాలూ ప్రేమకు nee kaLaLE saaTilEni paaThaaloo prEmaku
Your phases are peerless lessons to love
నువ్వు లేక నువ్వు రాక విరువవూ కలువలు nuvvu lEka nuvvu raaka, viruvavoo kaluvalu
Without your presence lotuses don't bloom
జాబిల్లీ నీ హాయి పాపలకు జోలలు jaabilli nee haayi, paapalaku jOlalu
Your soothing rays are like lullabies
The reason for enumerating the above songs is, just as those with eyes and other faculties intact can appreciate the moon and no one else can explain it to those with blindness or impaired faculties, the atma (soul) can only be discerned by those with a clear mind no matter how much explanation is offered.
One illustration is when we have multiple pots filled with water each reflecting the moon, we don't perceive a multiplicity of moons in the sky. If paramatma is like the moon, the jeeva atma is its reflection.
No comments:
Post a Comment