Friday, August 22, 2025

Viveka Sloka 57 Tel Eng




అవిద్యాకామకర్మాదిపాశబంధం విమోచితుమ్ ।
కః శక్నుయాద్వినాఽఽత్మానం కల్పకోటిశతైరపి ॥ 57 ॥

అవిద్యాకామకర్మాది పాశబంధం - అవిద్య, కామము, కర్మ మొదలగు పాశములయొక్క బంధమును, విమోచితుమ్ - విడిపించుటకు, ఆత్మానం వినా – తానుతప్ప, కః = ఎవరు, కల్పకోటిశతై రపి - వందల కొలది కోట్ల కల్పముల చేతనైనను, శక్నుయాత్ = సమర్థుడగును?

అవిద్యాదులలో పూర్వపూర్వము ఉత్తరోత్తరమునకు హేతువు. స్వస్వరూపము తెలియకపోవుటచే (అవిద్యచే) బాహ్యవస్తువులపై కామమేర్పడును. దానివలన ప్రవృత్తి ఏర్పడును.

సాక్షాత్కారమును పొందినవారు ఏమియు కోరరుకదా!

శ్రు. “కృతాత్మనస్త్విహైవ సర్వే ప్రవిలీయన్తి కామాః”, 

“రసో అ స్యన్య పరం దృష్ట్వా నివర్తతే"

"ఆత్మజ్ఞానము పొందినవాని కామము లన్నియు ఇక్కడనే అణగి పోవుచున్నవి.” ఆత్మను చూచిన పిమ్మట విషయతృష్ణ కూడ నశించును అని శ్రుతిస్మృత్యాదికము చెప్పుచున్నది. కామము లేనిచో కర్మ ఎక్కడిది?

 "యద్యద్ధి కురుతే జన్తుః  తత్తత్కామన్య చేష్టితమ్”

ప్రాణి ఏ పనిచేసినను, అది అంతయు కామ చేష్టయే అని స్మృతి వాక్యము.

కావున అజ్ఞానము, ఆశ, ధర్మాధర్మములు అనెడు పాశములచే నేర్పడిన బంధమును, అనాత్మా ధ్యానమును, విమోచితుం = ఆత్మ సాక్షాత్కారము లేకుండగనే విడచుటకు, కల్పకోటి శతైరపి - కల్పము యొక్క కోటులు, వాటి యొక్క శతముల చేత కూడ, తాను తప్ప మరెవ్వరు సమర్థులు? అని అర్థము.

56వ శ్లోకములో చెప్పి నట్లు స్వస్వరూపమును తానే సాక్షాత్కరించు కొనవలసి యుండుటచే, ఆ సాక్షాత్కారము లేనంతవరకు అజ్ఞానము నివర్తించదు గాన, కామ కర్మాదులు గూడ నివర్తింపవని భావము. 'కర్మాది' అనునపుడు 'ఆది' పదముచే జన్మ - జరా - మరణ- సుఖ దుఃఖాదులను గ్రహింపవలెను.

అవ శ్రు "తమేవ విదిత్వాతిమృత్యుమేతి, నాన్యః పన్థా విద్యతే అ యనాయ" ఆత్మను తెలిసికొనిన తరువాత మాత్రమే మృత్యువును తరించును; మోక్షమునకు మరియొక మార్గము లేదు.

శ్రు, “జ్ఞానాదేవ తు కైవల్యమ్"- జ్ఞానమువలన మాత్రమే మోక్షము కలుగును, ఇత్యాది శ్రుతులు ననుసరించి, గురుశిష్య సంవాదరూపమగు ఈ గ్రంథమునందు "పఠన్తు శాస్త్రాణి" ఇత్యాది శ్లోకమునందు (6) చెప్పిన విధమున బ్రహ్మాత్మైకత్వ జ్ఞానవ్యతిరిక్త మైన దానికి మోక్ష హేతుత్వమును నిషేధించుచున్నాడు. వ్యతిరిక్తమైనది మోక్ష హేతువు కాజాలదని చెప్పుచున్నాడు…

avidyākāmakarmādipāśabandhaṃ vimōchitum ।
kaḥ śaknuyādvinā''tmānaṃ kalpakōṭiśatairapi ॥ 57॥

Vedanta says the impressions from our earlier lives create vasanas that give rise to desires. This is because of avidya or nescience.

Budhism famously states that desires are the root of all sorrow without mentioning where they come from. That is because Budhists don't subscribe to reincarnation, for they say there is no atma, but believe that only consciousness is reborn.

Vedanta goes one step further and states that vasanas are the root of desires and a soul is reincarnated with them. Here reincarnation is the concept that the non-physical essence of a living being begins a new lifespan in a different form after death.

A man possessed of desires has to perform karma to fulfill them because of rajas. Once he is locked up in the karmic cycle, he is in bondage. Sankara states in this sloka that the avidya-desire-karma cycle can't be overcome without Self-knowledge even if he reincarnates till the end of kalpas.

Hindu cosmology divides time into distinct eras known as Yugas. There are four Yugas:

  1. Satya Yuga: The age of truth and righteousness, lasting 1,728,000 years.
  2. Treta Yuga: The age of virtue, lasting 1,296,000 years.
  3. Dvapara Yuga: The age of duality, lasting 864,000 years.
  4. Kali Yuga: The age of darkness and decline, lasting 432,000 years.

The relationship between Yugas and Kalpas can be understood through the concept of Mahayugas, which consist of one complete cycle of all four Yugas. A Kalpa consists of 1,000 Mahayugas, making it a significant measure of cosmic time. So Kalpa is reckoned as 4.32 billion years, a "day of Brahma" or one thousand Mahayugas.

Each Kalpa is further divided into 14 manvantara periods, each lasting 71 Yuga cycles (306,720,000 years). Preceding the first and following each manvantara period is a juncture (sandhya) the length of a Satya-yuga. Two Kalpas constitute a day and night of Brahma. A "month of Brahma" is supposed to contain thirty such days (including nights), or 259.2 billion years.

According to the Mahabharata, 12 months of Brahma (=360 days) constitute his year, and 100 such years the life cycle of the universe. This is called Paranta Kala. It is generally believed that moksha or liberation will last for this time duration or until the end of the life cycle of the universe.

Fifty years of Brahma are supposed to have elapsed, and we are now in the shvetavaraha kalpa of the fifty-first; at the end of a kalpa the world is annihilated.

So the intent of the slokas is one without Self-knowledge is condemned to reincarnate for eternity performing karma to fulfill desires.

No comments:

Post a Comment

Viveka Sloka 57 Tel Eng

Telugu English All అవిద్యాకామకర్మాదిపాశబంధం విమోచితుమ్ । కః శక్నుయాద్వినాఽఽత్మానం కల్పకోటిశతైరపి ॥ 57 ॥ అవిద్యాకామకర్మాద...