Friday, August 29, 2025

Viveka Sloka 58 Tel Eng





ఆత్మజ్ఞానమహత్త్వము

న యోగేన న సాంఖ్యేన కర్మణా నో న విద్యయా ।
బ్రహ్మాత్మైకత్వబోధేన మోక్షః సిధ్యతి నాన్యథా ॥ 58 ॥

యోగేన - యోగశాస్త్రముచే, న - కాదు, సాంఖ్యేన - సాంఖ్య శాస్త్రముచే, న - కాదు, కర్మణా - యజ్ఞాదికర్మచే, న = కాదు, విద్యయా - సగుణోపాసనా రూపమగు విద్యచే, న - కాదు, మోక్షః = మోక్షము, బ్రహ్మాత్మైకత్వ బోధేన = బ్రహ్మాత్మైకత్వ జ్ఞానముచేతనే, సిధ్యతి - సిద్దించును, అన్యథా = మరియొక విధముగా, న = కాదు,

మోక్షః = బ్రహ్మస్వరూపముతో ఉండుట అను లక్షణము గల మోక్షము, బ్రహ్మాత్మైకత్వబోధేన - బ్రహయొక్కయు ఆత్మయొక్కయు ఏకత్వము, అనగా అభేదము, దానియొక్క, బోధః = సాక్షాత్కా రము, దానిచే, సిధ్యతి= అభివ్యక్తమగును, మరియొక ప్రకారముచే సిద్ధింపదు.

ఆ ఇతరప్రకారములనే విశదీకరించుచున్నాడు. బేధమును బోధించు యోగశాస్త్రమువలన కలిగిన జ్ఞానముచే మోక్షము సిద్ధింపదు. లేదా చిత్త వృత్తి నిరోధరూపమగు యోగముచే మోక్షము రాదు అని యర్థము.

ఇట్లే, సాంఖ్యేన: నానాత్మవిషయకమయి కపిల మహర్షిచే రచితమైన సాంఖ్య శాస్త్రమువలన కలిగిన జ్ఞానముచే గూడ, మోక్షము సిద్ధింపదు. కర్మణా - పూర్వకాండ విహితముగు యజ్ఞాదికర్మచే గూడ, సిద్ధించదు.

విద్యయా - ఉపనిషత్తులలో విహిత మైనదైనను సగుణోపాసనా రూపమగు విద్య చేత గూడ కైవల్యరూప మగు మోక్షము సిద్ధింపదు.

యోగ సాంఖ్య శాస్త్రముల వలన కలుగు జ్ఞానము భేదవిషయకమైనది.

శ్రు. "యదా హ్యేవైష ఏతస్మిన్ను దర మన్తరం కురుతే అథ తస్య భవతి" ఈ ఆత్మస్వరూప విషయమున ఏ మాత్రము భేద బుద్ధి చేసినను అతనికి భయమే కలుగును అని చెప్పిన విధముగ యోగసాంఖ్యాది శాస్త్ర జన్య భేద జ్ఞానము ఏ మాత్రము అభయస్థితి ప్రాపకము కాజాలదు.

శ్రు. నాస్త్యకృతః కృతేన - కృతకమగు కర్మచేత అకృతకమగు మోక్షముకలుగదు.

శ్రు. "అమృత త్వన్య నాశాస్తి విత్తేన - ధనముచే, అనగా ధనసాధ్యమగు కర్మచే, అమృతత్వమును ఆశించుటకు వీలులేదు -- అను శ్రుతులు కర్మ నిత్యమగు మోక్షమును వ్యంజింపజాలదని చెప్పుచున్నవి.

శ్రు. “స స పునరా వర్తతే" అను శ్రుతి మోక్షము నిత్యమని బోధించుచున్నది.

సః - బ్రహ్మ లోకమునకు వెళ్లిన సగుణోపాసకుడగు పురుషుడు, మరల, నావర్త తే= సంసారవంతుడు కాడు; మరల జన్మపొందడు అని అర్థము.

అట్లు, పునరావృత్తి రాహిత్యమునకు కారణము ముక్తత్వమే. బ్రహ్మస్వరూపమున ఉండుటయే ముక్తత్వము.

శ్రు. యో వై భూమా తదమృతమ్ - సర్వవ్యాప్త మగు ఏ ఆత్మకలదో అది నాశరహితము.

"సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మ " - బ్రహ్మ సత్యరూపము, జ్ఞానరూపము, అనంతము,

శ్రు. "నిత్యో నిత్యానామ్" - అనిత్యములగు పదార్థముల నడుమనున్న నిత్యపదార్థము ఆత్మయే

ఇత్యాది శ్రుతిశతములచే బ్రహ్మ నిత్యమని చెప్పబడుటచే తత్స్వరూపమగు మోక్షము కూడ నిత్యము.

శారీరక మీమాంసాశాస్త్రము చివరి అధికరణభాష్యమున

"సమ్యగ్ జ్ఞానముచే నశించిన అజ్ఞానముకలవారును, నిత్యసిద్ధమగు మోక్షమునం దాసక్తి కలవారును అగువారికి అవృత్తి రాహిత్యము సిద్ధమే; అట్టి వారిని ఆశ్రయించుటచే సగుణోపాసకులకు గూడ అనావృత్తి సిద్ధంచును"

అని చెప్పబడినది. అందుచే, బ్రహ్మలోకమునుపొంది, ఆత్మ సాక్షాత్కారమును సంపాదించిన వారికి అచటనే కైవల్యరూపమగు మోక్షము వచ్చును అను విషయము…

శ్రు. తే బ్రహ్మలోకే తు పరాన్త కాలే,

పరామృతాత్పరీముచ్యన్తి సర్వే."

శ్లో|| బ్రహ్మణా సహ సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే

పఠస్యాన్తే కృతాత్మానః ప్రవిశన్తి పరం పదమ్.

"సగుణోపాసనచేసి బ్రహ్మలోకమును చేరినవారు మహా ప్రళయమున మోక్షమును పొందుదురు."

“వారందరును ఆత్మసాక్షాత్కారము పొందినవారై మహాప్రళయము వచ్చినపుడు బ్రహ్మతో కూడి మోక్ష మును పొందుదురు" ఇత్యాది శ్రుతిస్మృతులవలన తెలియుచున్నది.

పరానుృతాత్ = వేదాన్త విచార జనితమగు ఉత్కృష్ట జ్ఞానము వలన, కృతాత్మానః = ఆత్మసాక్షాత్కారము పొందినవారు.

కవచము (చొక్కా) మొదలగువాటి వెనుక మరుగు పడిన బంగారు ఆభరణమును వెదకి వెదకి అలసిపోయినవాడు " ఇదిగో, ఇది నీ కంఠమునందే ఉన్నది, ఎందుకు భ్రాంతిపడెదవు?" అని అప్పుడెవ్వడైన చెప్పగా, పోయినది దొరకినట్లు భావించును.

ఆప్తవాక్యమువలన కలిగిన జ్ఞానము ఉన్న వస్తువునే అభివ్యక్తము చేయుచున్నది. అట్లే గురూపదిష్టములగు 'తత్త్వమసి' ఇత్యాది మహావాక్యముల వలన కలిగిన సాక్షాత్కారము గూడ నిత్యసిద్ధముగనే ఉన్న బ్రహ్మభావరూపమగు మోక్షమును అభివ్యక్తము చేయుచున్నది.

కావున మోక్షము జ్ఞాన జన్యమని శంకింప కర్ణుడు మొదటి నుండియు కుంతీ కుమారుడే. కాని చిన్న తనమునుండియు అతనిని రాధ పెంచుటచే ఆతడు రాధేయుడ నని అనుకొనుచుండెను. తరువాత కుంతి చెప్పగనే కౌంతేయుడనని తెలిసికొనెను.

తావన్మాత్రముచే ఈ కౌంతేయత్వము అతనికి క్రొత్తగ రాలేదు. ఇక నేమనగా పూర్వము తెలియనిది ఇపుడు తెలిసినది. ఇచటగూడ అట్లే తెలిసికొనవలెను.

ఇంకను ఎట్లనగా – "ఆత్మానం మానుషం మన్యే రామం" అని చెప్పినట్లు శ్రీరాముడు తాను మానవుడనియే అనుకొనుచుండెను.

బ్రహ్మదేవుడు "ఏక శృంగో వరాహస్త్వం” ఇత్యాది వాక్యములచే నీవు మహావిష్ణువని చెప్పినపుడాతడు తాను మహావిష్ణువే అని స్వస్వరూపమును తెలిసి కొనెనే కాని అతనికి పూర్వము లేని మహావిష్ణుత్వ మిపుడు క్రొత్తగ రాలేదు.

ఈ వాక్యములు అతని మహావిష్ణుత్వమును అభివ్యక్తము చేసినవి. ఇక్కడ కూడ అట్లే అని తెలియవలెను.

అట్లే కర్మఫలము ఉత్పాద్యముకాని, అప్యముకాని, సంస్కార్యము కాని, వికార్యముకాని కావలెను.

ఉదాహరణమునకు యాగమువలన స్వర్గము ఉత్పన్నమగుచున్నది గాన స్వర్గరూపమగు ఫలము యాగము వలస ఉత్పాద్యము - కొత్తగ పుట్టుచున్నది.

అధ్యయనము చేయుటచే శబ్దరాశి రూపమగు వేదము పొందబడుచున్నది. కావున వేద రూప ఫలము ఆప్యము.

హోమమునకై ఉపయోగించు వ్రీహులపై (ధాన్యముపై) నీళ్లు చల్లుటచే సంస్కారము కలుగుచున్నది. కావున ఇచట ఫలము సంస్కార్యము.

ధాన్యము మొదలగువాటిని దంచుటదే పొల్లు పోవుటవంటి వికారము కలుగుచున్నది. కావున ఇచట ఫలము వికార్యము.

మోక్షము నిత్యము గాన ఉత్పాద్యము కాదు. స్వరూపముగాన, ఆత్మ సర్వదా పొందబడియే యున్నదిగాన, అప్యము కాదు. నిత్యశుద్ధబ్రహ్మ స్వరూపముగాన సంస్కార్యము కాదు, నిర్వికార బ్రహ్మరూపముగాన వికార్యము కాదు.

ఈ విషయమును భగవత్పాదులు సమన్వయ సూత్ర భాష్యమున విస్తృతముగ విశదీకరించిరి. కావున కర్మఫలములుగా చెప్పదగిన ఉత్పాద్యత్వ, ఆప్యత్వ, సంస్కార్యత్వ, వికార్యత్వములలో ఏ ధర్మమును మోక్షవిషయమున కుదురదు గాన మోక్షము కర్మవలన లభించునది కాదు అని అర్థము.

శ్రు. "విద్యాం చా విద్యాం చ',

శ్రు, "విద్యయా తదారోహతి"

ఇత్యాదులలో విద్యా శబ్దము ఉపాసనార్థమున ప్రయోగింపబడినది. కావున ఇచట గూడ 'విద్యా' పదమునకు ఆత్మవిద్యా భిన్నమగు అపరవిద్య అని యర్ధము. ఆ అపరవిద్య వలన బ్రహ్మ స్వరూపముతో ఉండుట అను లక్షణము గల మోక్షము సాక్షాత్తుగ లభింపదు అని యర్థము.

అవ, మోక్షము బ్రహ్మాత్మైక్యజ్ఞానము వలననే కలుగును కాని మరియొక ఉపాయముచే కలుగదు అను విషయమును దృష్టాంతమును చూపి విశదీకరించుచున్నాడు.


na yōgēna na sāṅkhyēna karmaṇā nō na vidyayā ।
brahmātmaikatvabōdhēna mōkṣaḥ sidhyati nānyathā ॥ 58॥

In Ramayana it was said Sri Rama thought he was always a human until reminded by Lord Brahma that he was none other than Lord Vishnu. Karna in Mahabharata considered himself as the son of Radha or Radheya until Kunti confessed to her motherhood and called him Kounteya or the son of Kunti. Both Rama and Karna didn't acquire anything new. Just as an expert sculptor removes what is not in his imagination as the final image is already embedded in the stone, Rama and Karna were revealed what had always been there before.

Similarly realizing one's atma won't change his physical make up. Unlike a yagna done to fulfill a wish, the gnana (knowledge) about atma, also known as Brahma gnana, won't yield ready fruit. The attainment of moksha (liberation), that is always available for everyone, will be the reward.

Like a person searching for an ornament that has always been around his neck, the atma gnana is ever present, here and now.

Sankara, on the other hand, enumerates all the means by which atma gnana can't be attained such as: yoga, sankhya philosophy, vocational knowledge, performance of yagnas and other karma specified in the vedas, and idol worship. By that he means perfection in them won't de facto translate to moksha.

The practice of ashtanga yoga or chitta-vritti-nirodha (control of mind and senses) founded by Sage Patanjali was ruled out as liberation. That means, people practicing yama, niyama, etc., pranayamas and asanas are not automatically promoted to moksha.

At the foundation of vedanta is sankhya philosophy, enunciated by Sage Kapila, that posits creation and the associated activities are the amalgamation of prakriti and purusha where the former is insentient and spurred into action by the latter. Without prakriti the purusha is not dynamic and vice versa. This is essentially dualism which Sankara rules out as moksha, for, the advaitin sees prakriti as an attribute of purusha just as magic is to a magician.

Similarly bhakti (devotion), vedic rituals (upasana), charitable acts, etc. won't matter for the attainment of moksha

In other words, the train to Kasi is not Kasi but a means of transport to reach Kasi. So, to be sure one is not disappointed, the various paths mentioned by Sankara are conducive to enlightenment though by themselves they can't provide it.

No comments:

Post a Comment

Viveka Sloka 60 Tel Eng

Telugu English All వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్ । వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే న తు ముక్తయే ॥ 60 ॥ వాగ్వై...