Friday, May 19, 2023

Purusha Sooktam







Introduction:


The Purusha Sukta holds that the world is created by and out of a Yajna or exchange of the Purusha. All forms of existence are held to be grounded in this primordial yajna. In the seventeenth verse, the concept of Yajna itself is held to have arisen out of this original sacrifice. In the final verses, yajna is extolled as the primordial energy ground for all existence. Purusha suktam is hymn 10.90 of the Rigveda, dedicated to the Purusha, the "Cosmic Being". It is also found in the Shukla Yajurveda Samhita 31.1-16 and Atharva Veda Samhita 19.6.

The Purusha is described as a being who pervades everything conscious and unconscious universally. He is poetically depicted as a being with thousand heads, eyes and legs, enveloping not just the earth, but the entire universe from all sides and transcending it by ten fingers length - or transcending in all 10 dimensions. All manifestations, in past, present and future, is held to be the Purusha alone.

Verses 5-15 hold the creation of the Rig Veda. Creation is described to have started with the origination of Virat, or the astral body from the Purusha. In Virat, omnipresent intelligence manifests itself which causes the appearance of diversity. In the verses following, it is held that Purusha through a sacrifice of himself, brings forth the avian, forest-dwelling, and domestic animals, the three Vedas, the meters (of the mantras). Then follows a verse that states that from his mouth, arms, thighs, and feet the four varnas (categories) are born. This four varna-related verse is controversial and is believed by many scholars to be a corruption and a medieval or modern era insertion into the text.

After the verse, the Sukta states that the moon takes birth from the Purusha's mind and the sun from his eyes. Indra and Agni descend from his mouth and from his vital breath, air is born. The firmament comes from his navel, the heavens from his head, the earth from his feet and quarters of space from his ears.Through this creation, underlying unity of human, cosmic and divine realities is espoused, for all are seen arising out of same original reality, the Purusha.


Purusha Suktam


Thachamyo ravrunimahe.gathum yagnaya.
Gathum Yagna pathaye.Daivee swasthi –rasthu na.
Swasthir Manushebhya. Urdhwa Jigathu beshajam.
Sam no asthu dwipadhe.Sam chatush pade
Om Shanthi, shanthi, Shanthi.

ఓం తచ్ఛ॒o యోరావృణీమహే | గా॒తుం య॒జ్ఞాయ॑ |
గా॒తుం య॒జ్ఞప॑తయే | దైవీ: స్వ॒స్తిర॑స్తు నః |
స్వ॒స్తిర్మాను॑షేభ్యః | ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జమ్ |
శన్నో॑ అస్తు ద్వి॒పదే | శం చతు॑ష్పదే ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||


Request we from you with all enthusiasm,
For the good deeds that are medicine,
For the sadness of the past and future,
Request we for the growth of fire sacrifices,
Request that only good should occur,
To the one who presides over such sacrifices,
Request we for the mercy of gods to man,
Request we for good to the community of men,
Request we that the herbs and plants,
Should grow taller towards the skies.
Request we for good for all two legged beings,
Request we for good to all four legged beings,
Request we for peace, peace and peace.


ఔషధము వంటి మంచి సత్ కర్మలకై
ఔత్సాహికులమై నిన్నుకోరుకుంటున్నాము:

గడిచిన కాలములో కలిగిన, రాబోయే
కాలములో కలిగే విచారమును తొలగించుకొనుటకు యజ్ఞ
యాగాదులు కాంక్షి౦చెదము

సర్వము శుభకరమై నుండుగాక!

ఆ యజ్ఞయాగాదులకు అధ్యక్షత
వహించువానిని ఇవి కోరుచున్నాము:


  • మానవులయందు దయ
  • మానవులకు ఆహారము
  • మానవులకు ఔషధములు, పంటలు
  • ఆకాశం వైపు ఎత్తుగా ఎదిగిన వృద్ధి
  • అన్ని ద్విపాదులకు మేలు కలుగు గాక!
  • అన్ని చతుష్పాదులకు మేలు కలుగు గాక!

శాంతిః శాంతిః శాంతిః


Sahsra seerhaa purusha; Sahasraksha saharpath.
Sa bhoomir viswatho vruthwa.Athyathishta ddhasangulam. 1-1

ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః | స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా | అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |

The Purusha has thousand heads,
He has thousand eyes,
He has thousand feet,
He is spread all over the universe,
And is beyond the count with ten fingers.


  • పురుషునికి అనేకమైన
    నేత్రములు, అసంఖ్యాకమైన పాదములు కలవు;
  • అతడు ప్రపంచమంతా వ్యాపించి యున్నాడు.
  • పది వేళ్ళతో లెక్కపెట్టలేని వ్యాప్తి కలవాడు.



Purusha eeveda sarvam.Yad bhootam yad bhavyam.
Utha amruthathwasya eesana. Yad annena adhirohathi. 1-2

పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్ | యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః | య॒దన్నే॑నాతి॒రోహ॑తి |

This Purusha is all the past,
All the future and the present,
He is the lord of deathlessness,
And he rises from hiding,
From this universe of food.


  • గడిచిన కాలమంతా పురుషుడే;
    రాబోయే కాలమంతా పురుషుడే;
    [కాలమును సృష్టించినవాడు, కాలమునకు అతీతుడు]
  • అతడు అమర్త్యమునకు అధిపతి;
  • అతడు అజ్ఞాతము నుండి
  • ఆహారముగల ప్రపంచంలో లేచేడు


Ethaa vaanasya mahimaa.Atho jyaaya scha purusha.
Padhosya viswa bhoothanee.Tripaadasyamrutham divi. 1-3

ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః ||
పాదోఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ | త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |


This Purusha is much greater,
Than all his greatness in what all we see,
And all that we see in this universe is but his quarter,
And the rest three quarters which is beyond destruction,
Is safely in the worlds beyond.


  • మన౦ చూసే సృష్టి వైభవముక౦టే ఈ పురుషుడు

    గొప్పవాడు;
  • మనం చూసే ప్రపంచం వానిలో నాల్గవ వంతు;
  • తక్కిన మూడు వంతులు వినాశనానికి అతీతంగా ఉండేది;
  • అది కనిపించే సృష్టి ఆవలనున్న ప్రపంచములలో
    క్షేమంగా యున్నది.


Tri paddurdhwa udaith prurusha. Padhosye habha vaath puna.
Thatho vishvangvyakramath.Sasanana sane abhi. 1-4


త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదోఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |


Above this world is three quarters of Purusha,
But the quarter, which is in this world,
Appears again and again,
And from that is born the beings that take food,
And those inanimate ones that don’t take food.
And all these appeared for every one of us to see.


  • ఈ ప్రపంచము మీద పురుషుని మూడు
    వంతుల వ్యాపించి యున్నది;
  • కానీ ఈ నాల్గవ వంతులో సృష్టి మరల
    మరలా జరుగుతూ ఉంటుంది;
  • దానిలో నుండి ఆహారము భుజించని
    జడ పథార్తములు, ఆహారము భుజించే
    జీవులు ఉత్పన్నమయ్యేయి;
  • ఇది మనందరికీ విదితమయ్యేలాగ
    కనబడుతూ ఉంటుంది.


Tasmath virad jayatha. Virajo agni purusha.
Sa jatho athya richyatha. Paschad bhoomi madho pura. 1-5

తస్మాద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః | స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః ||


From that Purusha was born,
The scintillating, ever shining universe,
And from that was born the Purusha called Brahma,
And he spread himself everywhere,
And created the earth and then,
The bodies of all beings.


  • పురుషుని నుండి తళతళ మెరిసే,
    ప్రకాశవంతమైన ప్రపంచము ఉత్పన్నమైనది.
  • దానిలో బ్రహ్మ అనబడే పురుషుడు జన్మించెను
  • పిదప బ్రహ్మ సర్వమును వ్యాపించి, భూమిని,
    పదార్థాలను, జీవులను సృష్టించెను.


Yat purushena havishaa. Devaa yagna mathanvath.
Vasantho asyaasee dhajyam. Greeshma idhma saraddhavi. 1-6

యత్పురు॑షేణ హ॒విషా | దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్ | గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |


The spring was the ghee,
The summer was the holy wooden sticks,
And the winter the sacrificial offering,
Used or the sacrifice conducted by Devas through thought,
In which they also sacrificed the ever-shining Purusha.


  • తొలకరి నెయ్య అయినది;
  • వేసవి పవిత్రమైన కొయ్యలుగా
    [అగ్నిని వెలిగించే కట్టెలు] అయినది
  • శీతాకాలం హవిస్సయినది ;
  • యజ్ఞము దేవతల మనస్సుతో చేయబడినది
  • ఈ విధంగా నిత్యప్రకాశుడైన
    పురుషుడు బలి చేయబడినాడు.


Sapthaasyasan paridhaya. Thri saptha samidha Krutha.
Devaa yad yagnam thanvaana. Abhadhnan purusham pasum. 1-7

స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: | త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |


Seven meters were its boundaries,
Twenty one principles were holy wooden sticks,
And Devas carried out the sacrifice,
And Brahma was made as the sacrificial cow.

ఆ యజ్ఞమునకు:


  • ఏడు ఛందస్సులు సరిహద్దులు;
  • ఇరవై ఒక్క సిద్ధాంతాలు పవిత్రమైన కొయ్యలు;
  • దేవతలు బలి చేసినవారు;
  • ఆవురూపంలో నున్న బ్రహ్మ బలి పశువు.


Tham yagnam barhisi prokshan. Purusham Jaatham agradha.
Thena deva ayajantha. Saadhya rushayasch ye. 1-8

తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః ||


Sprinkled they the Purusha,
Who was born first,
On that sacrificial fire.
And the sacrifice was conducted further,
By the Devas called Sadyas,
And the sages who were there.

కుశ అనబడే గడ్డితో జలాన్ని యాగభూమిపై వెదజల్లి
ప్రప్రధ౦గా దేవతలు సృష్టింపబడ్డారు.
వారు సాద్యా అనబడే దేవతలు, దైవిక ఋషులు


Tasmad yagnath sarva hutha. Sam brutham prushad ajyam.
Pasus tha aschakre vayavyaan. Aaranyaan graamyascha ye. 1-9

తస్మాద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: | సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ | ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |


From this sacrifice called “All embracing”.
Curd and Ghee came out,
Animals meant for fire sacrifice were born,
Birds that travel in air were born,
Beasts of the forest were born,
And also born were those that live in villages

యజ్ఞ కుండం నుంచి ఇవి ఉద్భవించేయి:


  • అందరూ మన్నించే పెరుగు, నెయ్య;
  • యజ్ఞాలలో బలి చేసే జంతువులు;
  • గాలిలో ఎగిరే పక్షులు;
  • అరణ్యంలో నివసించే జంతుజాలము;
  • గ్రామాలలో మనుషులతో మెలిగే
    మచ్చికయైన జంతుజాలములు


Tasmad yagnath sarva hutha.Rucha saamanee jagniree.
Chanadaa si jagnire tasmath.Yajus tasmad jaayatha. 1-10

తస్మాద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: | ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మాత్ | యజు॒స్తస్మా॑దజాయత ||


From this sacrifice called “All embracing”’
The chants of Rig Veda were born,
The chants of Sama Veda were born,
And from that the well-known meters were born,
And from that Yajur Veda was born.

అందరూ మన్నించే యజ్ఞం నుండి
ఋగ్వేద, సామవేద, మంత్రాలు
ఆవిర్భవించినవి. వాటి నుండి
ఛందస్సు పుట్టెను. దానినుండి
యజుర్వేద మంత్రాలు ఆవిర్భవించేయి.


Tasmad aswaa ajaayantha. Ye ke chobhaya tha tha.
Gavooha janjire tasmath. Tasmad gnatha ajavaya. 1-11

తస్మా॒దశ్వా॑ అజాయన్త | యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మాత్ | తస్మాజ్జా॒తా అ॑జా॒వయ॑: |


From that the horses came out,
From that came out animals with one row of teeth,
From that came out cows with two rows of teeth,
And from that that came out sheep and goats.

ఇంకా ఇవి జన్మించేయి:


  • ఆశ్వాలు;
  • ఒక పళ్ల వరస ఉన్న జంతువులు;
  • రెండు పళ్ల వరసలు౦డే ఆవులు;
  • మేకలు, గొర్రెలు


Yad purusha vyadhadhu.Kathidhaa vyakalpayan.
Mukham kimsya koo bahu. Kaavuruu pada a uchyathe. 1-12

యత్పురు॑ష॒o వ్య॑దధుః | క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ | కావూ॒రూ పాదా॑వుచ్యేతే |


When the Purusha was made
By their thought process by the Devas,
How did they make his limbs?
How was his face made?
Who were made as His hands?
Who were made as his thighs and feet?

పురుషుని ఆలోచన మాత్రముననే
తయారు చేసిన దేవతలు:


  • వాని కర్మే౦ద్రియాలను ఎలాచేసేరు?
  • వాని ముఖమునెలా చేసేరు?
  • వాని చేతులతో ఎవరిని చేసేరు?
  • వాని తొడలు, పాదాలతో ఎవరిని చేసేరు?


Brahmanasya Mukham aseed.Bahu rajanya krutha.
Ooru tadasys yad vaisya.Padbhyo sudro aajayatha. 1-13

బ్రా॒హ్మ॒ణోఽస్య॒ ముఖ॑మాసీత్ | బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః ||
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: | ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |


His face became Brahmins,
His hands were made as Kshatriyas,
His thighs became Vaisyas,
And from his feet were born the Shudras.


  • పురుషుని ముఖమునుండి బ్రాహ్మణులు;
  • పురుషుని చేతులనుండి క్షత్రియులు;
  • పురుషుని తొడలనుండి వైశ్యులు;
  • పురుషుని పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించిరి.


Chandrama manaso Jatha.Chaksho surya Ajayatha.
Mukhad Indras cha Agnis cha.Pranad Vayua aajayatha. 1-14

చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః | చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ | ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |



From his mind was born the moon,
From his eyes was born the sun,
From his face was born Indra and Agni,
And from his soul was born the air.

పురుషుని నుండి ఇవి ఆవిర్భవించేయి:


  • మనస్సు నుండి చంద్రుడు;
  • నేత్రములనుండి సూర్యుడు;
  • ముఖము నుండి ఇంద్రుడు, అగ్ని;
  • ఆత్మ నుండి గాలి


Nabhya aseed anthareeksham.seershno dhou samavarthatha.
Padbyam Bhoomi,disaa srothrath.Tadha lokaa akampayan. 1-15

నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ | శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రాత్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ ||


From his belly button was born the sky,
From his head was born the heavens,
From his feet was born the earth,
From his ears was born the directions,
And thus was made all the worlds,
Just by his holy wish.

ఇంకా పురుషుని నుండి ఇవి ఉద్భవించేయి:


  • నాభినుండి ఆకాశము;
  • తలనుండి స్వర్గము;
  • పాదములనుండి భూమి;
  • చెవుల నుండి దిక్కులు

ఈ విధంగా పవిత్రంగా కోరినంత
మాత్రముననే సృష్టిలోని ప్రపంచములన్నీ
ఆవిర్భవించేయి


Vedahametham purusham mahantham.Adhitya varna thamasathu
pare,
Sarvani roopani vichinthya dheera. Namaani kruthwa abhivadan
yadasthe. 1-16

వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే |


I know that heroic Purusha, who is famous,
Who shines like a sun,
And who is beyond darkness,
Who created all forms,
Who named all of them,
And who rules over them.


  • నాకు మిక్కిలి శౌర్యప్రతాపములు, ఖ్యాతి,
    సూర్యునివలె ప్రకాశించే;
  • చీకటిని అతిక్రమించే;
  • సర్వ రూపాలకు నామధేయము చేసిన;
  • వాటినన్నిటినీ పరిపాలించే

పురుషుడు తెలుసును.


Dhaatha purasthad yamudhajahara.sacra pravidhaan pradhisascha
thathra.
Thamevam vidwaan anu mrutha iha bavathi. Naanya pandha
ayanaaya vidhyathe. 1-17

ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |


The learned one who knows that Purusha
Whom the creator, considered as one before Him,
And whom the Indra understood in all directions,
Would attain salvation even in this birth,
And there is no need for him to search for any other path.


  • సృష్టికర్త అయిన బ్రహ్మన్
    ఒక్కడే ఈ పురుషుని పూర్వీకుడై యున్నాడు;
  • ఇంద్రునికి పురుషుడు
    అన్ని దిక్కులలోనూ ప్రతిష్ఠితమై ఉన్నాడని తెలుసు;
  • ఈ జ్ఞానమును పొందినవారు, వేరే ఆధ్యాత్మిక మార్గములో
    చరించవలసిన అవసరము లేక, ఈ జన్మలోనే ముక్తిని పొందెదరు.


Yagnena yagnam aya jantha devaa. Thaani dharmani
pradhamanyasan.
Theha naakam mahimaana sachanthe.yatra poorvo saadhyaa santhi
devaa. 1-18

య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ |
తే హ॒ నాక॑o మహి॒మాన॑: సచన్తే |
యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాః సన్తి॑ దే॒వాః ||


Thus the devas worshipped the Purusha,
Through this spiritual yagna,
And that yagna became first among dharmas.
Those who observe this Yagna,
Would for sure attain,
The heavens occupied by Saadya devas.


  • ఈ విధముగా ఆధ్యాత్మిక యజ్ఞ
    మాచరించి దేవతలు పురుషుని పూజించేరు.
  • ఆ యజ్ఞము ధర్మములలో ప్రప్రథమమైనది.
  • ఈ యజ్ఞమునాచరించు వారు సాద్య
    దేవతలు వసించే స్వర్గలోకం తప్పక పొందుతారు.


Second Anuvaaka


Adhbhyaa sambhootha pruthvyai rasascha.Viswakarmanas
samavarthadhi.
Tasyas twashtaa vidhadh drupamethi.tad purushasya viswa
maajanam agre. 2-1

అ॒ద్భ్యః సంభూ॑తః పృథి॒వ్యై రసాచ్చ |
వి॒శ్వక॑ర్మణ॒: సమ॑వర్త॒తాధి॑ |
తస్య॒ త్వష్టా॑ వి॒దధ॑ద్రూ॒పమే॑తి |
తత్పురు॑షస్య॒ విశ్వ॒మాజా॑న॒మగ్రే |


From water and essence of earth was born,
The all pervading universe.
From the great God who is the creator,
Then appeared that Purusha
And the great God, who made this world,
Is spread as that Purusha, in all fourteen worlds.
And also the great form of Purusha,
Came into being before the start of creation.


  • జలము నుండి సృష్ట౦తా
    వ్యాపించిన భూమి సూక్ష్మ భూతముగా అవతరించింది;
  • సర్వ సృష్టికి కర్త అయిన బ్రహ్మన్
    ద్వారా పురుషుడుసృష్టింపబడినాడు.
  • పురుషుడు ఏ విధముగా పదునాల్గు లోకాలలో
    వ్యాపించి యున్నాడో, బ్రహ్మన్
    కూడా అలాగే వ్యాపించి యున్నాడు.
  • అలాగే పురుషుని యొక్క శరీరము
    సృష్ఠికి పూర్వమే యున్నది.


Vedaham etham purusham mahantham.Aadithyavarna thamasa
parasthath.
Thamevam vidwan amrutha iha bhavathi.nanya pandhaa vidhyathe
ayanaaya. 2-2

వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్|
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒: పర॑స్తాత్ |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॑ విద్య॒తేయ॑ఽనాయ |


I know that great Purusha,
Who shines like the sun,
And is beyond darkness,
And the one who knows him thus,
Attains salvation even in this birth,
And there is no other method of salvation.


  • నాకు సూర్యునివలె ప్రకాశించే
  • చీకటిని అతిక్రమించే; పురుషుడు తెలుసు.
  • ఎవరైతే వానిని తెలిసికుంటారో వారికి
    విదేహముక్తి కలుగుతుంది.
  • ముక్తి పొందుటకు వేరే మార్గము లేదు.



Prajapathis charathi garbhe antha. Aajayamano bahudha vijaayathe.
Tasya dheera parijananthi yonim. Mareechinaam padamicchanthi
vedhasa. 2-3

ప్ర॒జాప॑తిశ్చరతి॒ గర్భే॑ అ॒న్తః |
అ॒జాయ॑మానో బహు॒ధా విజా॑యతే ||

తస్య॒ ధీరా॒: పరి॑జానన్తి॒ యోనిమ్” |
మరీ॑చీనాం ప॒దమి॑చ్ఛన్తి వే॒ధస॑: |


The Lord of the universe,
Lives inside the universe,
And without being born,
Appears in many forms,
And only the wise realize his real form,
And those who know the Vedas,
Like to do the job of,
Savants like Mareechi.


  • బ్రహ్మన్ తన సృష్టిలోనే వశిస్తాడు;
  • పుట్టుకలేనివాడు
  • బహురూపధారి;
  • జ్ఞానులకు వాని స్వస్వరూపము గురించి తెలుసు;
  • అట్లే వేదాధ్యయనము
    చేయు వారలకు కూడా. వారు ప్రప్రథమమైన
    మరీచి వంటి వారలను అనుకరిస్తారు.



Yo devebhya aathapathi. Yo devaanaam purohitha.
Poorvo yo devebhyo jatha.Namo ruchaaya brahmaye. 2-4

యో దే॒వేభ్య॒ ఆత॑పతి |
యో దే॒వానాo పు॒రోహి॑తః |
పూర్వో॒ యో దే॒వేభ్యో॑ జా॒తః |
నమో॑ రు॒చాయ॒ బ్రాహ్మ॑యే |


Salutations to ever shining brahmam,
Who gave divine power to devas,
Who is a religious teacher of devas,
And who was born before devas.


  • దేవతలకు మహిమలు ప్రసాదించిన;
  • వారికి ఆధ్యాత్మిక గురువు;
  • వారికి పూర్వీకుడైన, నిత్యప్రకాశకుడైన బ్రహ్మన్ కు
    వందనములు.


Rucha brahmam janayantha.Devaa agne tadha bruvan.
Yasthaiva barahmano vidhyat. Tasya deva asaan vase. 2-5

రుచ॑o బ్రా॒హ్మం జ॒నయ॑న్తః |
దే॒వా అగ్రే॒ తద॑బ్రువన్ |
యస్త్వై॒వం బ్రాహ్మ॒ణో వి॒ద్యాత్ |
తస్య॑ దే॒వా అస॒న్ వశే||


The devas who teach the taste in Brahmam,
Told in ancient times,
That. He who has interest in Brahmam,
Would have the devas under his control.

బ్రహ్మన్ యొక్క మహిమను
బోధించే దేవతలు పూర్వము
ఇలా చెప్పియుండిరి: ఎవరికైతే
బ్రహ్మన్ యందు భక్తి కలదో,
వారు దేవతలను నియంత్రించగలరు.


Hreescha the lakshmischa patnyou.Ahorathre paarswe.
Nakshatrani roopam.Aswinou vyatham. 2-6

హ్రీశ్చ॑ తే ల॒క్ష్మీశ్చ॒ పత్న్యౌ|
అ॒హో॒రా॒త్రే పా॒ర్శ్వే | నక్ష॑త్రాణి రూ॒పమ్ |
అ॒శ్వినౌ॒ వ్యాత్తమ్|


Hree and Lakshmi are your wives,
Day and night are your right and left,
The constellation of stars your body,
And Aswini devas your open mouth..



  • [బ్రహ్మన్] హ్రీ మరియు లక్ష్మి నీ పత్నులు;
  • రాత్రింబవళ్ళు నీ కుడిఎడమలు;
  • నక్షత్ర పుంతలు నీ శరీరము;
  • అశ్వినీ దేవతులు నీ తెరిచిన నోరు.


Ishtam manishaana.Amum manishana.Sarve manishana. 2-7

ఇ॒ష్టం మ॑నిషాణ |
అ॒ముం మ॑నిషాణ | సర్వ॑o మనిషాణ ||


Give us the knowledge that we want,
Give us the pleasures of this world,
And give us everything of this and other worlds.


  • [బ్రహ్మన్] మేము కోరే
    జ్ఞానమును ప్రసాదించు;
  • ప్రపంచ సుఖములను కలుగజేయి;
  • ఇహపరలోకాలలో కావలసినవన్నీ సమకూర్చు.


Thachamyo ravrunimahe.gathum yagnaya.
Gathum Yagna pathaye.Daivee swasthi –rasthu na.
Swasthir Manushebhya. Urdhwa Jigathu beshajam.
Sam no asthu dwipadhe.Sam chatush pade
Om Shanthi, shanthi, Shanthi.

ఓం తచ్ఛ॒o యోరావృ॑ణీమహే | గా॒తుం య॒జ్ఞాయ॑ |
గా॒తుం య॒జ్ఞప॑తయే | దైవీ: స్వ॒స్తిర॑స్తు నః |
స్వ॒స్తిర్మాను॑షేభ్యః | ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జమ్ |
శన్నో॑ అస్తు ద్వి॒పదే” | శం చతు॑ష్పదే ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||


Request we from you with all enthusiasm,
For the good deeds that are medicine,
For the sadness of the past and future,
Request we for the growth of fire sacrifices,
Request that only good should occur,
To the one who presides over such sacrifices,
Request we for the mercy of gods to man,
Request we for good to the community of men,
Request we that the herbs and plants,
Should grow taller towards the skies.
Request we for good for all two legged beings,
Request we for good to all four legged beings,
Request we for peace, peace and peace.


ఔషధము వంటి మంచి సత్ కర్మలకై
ఔత్సాహికులమై నిన్ను కోరుకుంటున్నాము:

గడిచిన కాలములో కలిగిన, రాబోయే
కాలములో కలిగే
విచారమును తొలగించుకొనుటకు యజ్ఞ
యాగాదులు కాంక్షి౦చెదము

సర్వము శుభకరమై నుండుగాక!

ఆ యజ్ఞయాగాదులకు అధ్యక్షత
వహించువానిని ఇవి కోరుచున్నాము:


  • మానవులయందు దయ
  • మానవులకు ఆహారము
  • మానవులకు ఔషధములు, పంటలు
  • ఆకాశం వైపు ఎత్తుగా ఎదిగిన వృద్ధి
  • అన్ని ద్విపాదులకు మేలు కలుగు గాక!
  • అన్ని చతుష్పాదులకు మేలు కలుగు గాక!

శాంతిః శాంతిః శాంతిః




Friday, May 12, 2023

On True Love

In the Shrek animated Hollywood movie the heroine in search of true love -- so
that she wouldn't change personality between day and night- finds it in the
hero Shrek, whom many consider as ugly, and marries him in the climax. So what
is true love? Is ordinary love, such as we have for our parents, spouses,
children not true, fake, concocted? Then why have true love? Let us see what
attributes are important in love. The first thing is timelessness. Love
transcends time and space. When we love a person, animal or tree, we love it
every instant. There is no scope for true love to diminish, dissipate, decay
over time. We hold on to the loved ones in thick and thin as though we are
immortals, have no disease or untimely death. We love regardless of geography,
where we are living; the national and state boundaries, fences don't matter.
Love is impersonal. We can love a mountain, a tree, a dog, etc. the same way we
love a person. There is no discrimination among the loved ones. The third
aspect of love is unconditionality. There are no pre-nupts, contracts, or
conditions for love. A mother loves her child unconditionally, without
compromise, nor any hesitation. She always sides with her child even when
disaster strikes. This also means non-transactional. There are no checks,
money, property changing hands in true love. The so-called pre-nupts are
contrary to true love. One can say, there is love of business but not true love
for the person they are engaged with. Similarly dowry, divorce, abandonment,
abuse whether physical or psychological, etc. are not part of true love. Most
of the older married people know what this means. While Lord Rama is credited
with the true love of Sita, there are many, perhaps millions, who are married
to one person, such as my parents, and never looked at another woman as a
companion in life's journey. Love is beyond thoughts. Rational thinking has
been promoted since the time of the Greeks. To be scientists, engineers,
physicians, they say, we need to apply rational thinking. Based on one's
profession one becomes mechanical or logical, so carries that into
relationships. You cannot rationalize emotions expressed by your loved ones and
take them to a logical conclusion. You can say my spouse is sad and investigate
the cause and find that she is concerned about your body weight. Beyond that
you cannot rationalize and state your objections to her concern or hide behind
the excuse of freedom as a necessity of life. You are free to eat what you want
and not care about your spouse. But if true love has to be there you don't
entertain such thoughts. True love also transcends age, gender, etc. After all,
single older people and widows need love too. I know people who visit old-age
homes and provide emotional support to the older people without expecting
anything in return. They are doing it out of their love for the seniors. We all
have to age and during old age be able to receive love. True love means
sacrifice. I am not referring to animal sacrifice but giving up things that we
cherish and cling on to, good or bad, for the sake of love. One can give up bad
habits like smoking and drinking when love demands it. There are parents who
love their children but want them to serve in the police force and military to
protect the nation. One can say their love of nation exceeds the love for the
children. In reality, they are making a sacrifice. There are parents who send
their children abroad for education, jobs, etc. by giving them money and
encouragement. There is no trace of selfishness in that. Because during a
calamity the son or daughter living abroad may not be there to help them. They
are sacrificing their personal comfort and financial security to see to it that
their loved ones succeed in life. True love is not about beauty, wealth,
opportunity, or just plain escape from reality. Finally we come to the love of
God. Every religion, hindu, muslim, christianity, buddhism, etc. professes love
for God. Some priests say if you don't love God, there is no salvation.
Devotees like Mira Bhai, Tyagaraja, et al. loved their favorite gods Krishna,
Rama or some other at all times even in duress. Tyagaraja was not known to
abuse Lord Rama because he could not get anything to eat or fell sick one day.
In the extreme, some people say true love exists only in the relationship with
a personal God. Every other kind of love is just a matter of infatuation,
selfishness, reciprocation and convenience. Do we have a biological urge to
give and receive love or is it a mere superficial feature? We know one species
of animals taking care of newborns in another species. Some childless couples
adopt children born to a different couple. There are still others who say love
is chemistry. When we run out of words we make aphorisms and metaphors to save
us the time and energy necessary to describe such an extraordinary thing as
love.

Thursday, April 27, 2023

Syamala Dandakam









Dhyanam:

Manikhya veenaam upalalayanthim,
Madalasam manjula vaag vilasam,
Mahendra Neela dhyuthi komalangim,
Mathanga kanyam manasa smarami.,

ధ్యానం

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి

I meditate on the daughter of Matanga,
* Who plays the veena made of precious gems,
* Who has become lazy due to her exuberance,
* Who is blessed with very sweet words,
* Who has a pretty mien which shines like the blue gem.

మణులతో చేయబడిన వీణను మ్రోగిస్తూ, నిండుగా యుండు కారణాన
తామసముతో గూడి, కోమలమైన వాక్కుతో కూడి, నీల మణివలె మెరయచూ
ఉన్న మాతంగ పుత్రిక మీద ధ్యానం చేస్తాను

ViniyOga:

Chathurbhuje Chandra kala vathamse, Kuchonnathe kumkuma raga sone,
Pundrekshu pasangusa pushpa bana,
Hasthe namasthe jagadaika matha.,

వినియోగము

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః

My salutations to that mother of universe,
* Who has four hands,
* Who wears the crescent as an ornament,
* Who has very high breasts,
* Who is of the colour of saffron,
And who holds flower, sugar cane, rope, arrow,
The goad and pundareeka in her hands.

నాలుగు భుజములతో; నెలవంక అలంకారంగా
కలిగి, ఉన్నతమైన కుచుములతో గూడి, కుంకుమ
పువ్వు ఛాయ కలిగి; పుష్పాన్ని, చెఱకు గడని, పాశాన్ని,
బాణమును , అంకుశమును, కమలమును ధరించి యున్న విశ్వ మాతకు
ప్రణామములు

Matha marakatha shyama, Mathangi madha shalini,
Kuryath kadaksham kalyani kadambha vana vasini.,

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ

Please bless me with a side long glance,
Oh daughter of sage Mathanga,
* Who is my mother,
* Who is as green as an emerald,
* Who is exuberant,
* Who blesses with all that is good,
And who lives in the forest of Kadambha

పచ్చని మరకతము వలెనున్న మేనుతో,
అతిశయమై, శుభప్రదమైన దీవెనెలు ఇచ్చే, కదంబ
వనములో నివసించే ఓ మాతా! మాతంగ మహర్షి
పుత్రికా! నన్ను క్రీగంట చూపుతో కరుణించు

Stutih:

Jaya Mathanga thanaye, Jaya Neelolpala dhyuthe,
Jaya Sangeetha rasike, Jaya Leela shuka priye.,

స్తుతి-

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే

Victory to the daughter of Mathanga,
Victory to her who resembles Neelothphala flowers,
Victory to her who enjoys music,
Victory to her who likes the playful parrot.

మాతంగ మహర్షి పుత్రికకు జయము!
నీలోత్పల పుష్పము వలెనున్న మాతకి జయము!
సంగీత ప్రియురాలైన మాతకి జయము!
చిలుకతో క్రీడించే మాతకి జయము!
Dandakam:

Jaya janani,
sudha samudranthar udhuyanmani dheepa samrooda vilwadavi Madhya Kalpadhruma kalpa kadambha vasa priye,krithivasa priye,
sarva loka priye.
దండకము

జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ
బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవా
సప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,

* Who is interested always in living in the forest of Kadamba trees which are similar to
the wish giving
Kalapaka trees and which is in the forest of Vilwa trees and which is situated in the gem
island in the sea of nectar,
* Who is the consort of Lord Shiva,
* Who is the darling of all the world,Victory to the mother.

మకరందము వంటి సముద్రములో మణి ద్వీపము
యందు సదా కోరికలను ప్రసాదించే కల్ప
వృక్షమువలె, బిల్వ వృక్ష వనములో నుండే, కాదంబ వృక్షముల
వనములో సంచరించే శివుని ప్రియ సతికి,
సర్వులూ అభిమానించే తల్లికి జయము!

Sadararabdha sangeetha sambhavana a sambhrama lola neepasraga badha chooli sanadathrike, Sanumath puthrike,

సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబ
ద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే,

* Who has her posterior decorated by her dancing hair which has been freed by the raising
crescendo of the soulful music,
* Who is the daughter of the mountain,

ఆ పర్వత రాజు కుమార్తె
వెన్ను, ఉత్తేజమైన ఆత్మను
పరవశింపజేసే సంగీతముతో
నాట్యం చేస్తున్నట్టుగా నుండే కేశములతో కప్పబడి ఉంది

Shekhari bhootha sheethamsu leka mayookhavalibadha susnigdha neelaalaka sreni sringarithe, Loka Sambhavithe,


శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధ
నీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే

* Who is extremely pretty with her bluish black hair curls which shine due to the light
emanating from the cold crescent
which she wears on her head,Who is respected by all the world,

నీల మేఘ రంగుతో, చుట్టు ముంగురలతో కూడిన
ఆమె కేశములు, ఆమె తలపై ధరించిన
అర్థ చంద్రని చల్లని వెలుగులో మెరయుచున్నవై
యు౦డగా, ఆ దేవిని సర్వ జగత్తు పొగడుచున్నది

Kama leela dhanusannibha brullatha pushpa sandoha sandeha krullochane,Vak sudha sechane

కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహ
కృల్లోచనే వాక్సుధాసేచనే

* Who has eye lashes which resemble the flower arrows coming from the playful bow of the
God of love,
* Who cools down the universe with nectar like words,

ఆమె కనుబొమలు మన్మథుని పూల బాణములు పోలి
యుండగా, ఆమె తీయని పలుకులు జగత్తును సమ్మోహ పరచేవి

Charu gorchana panga keli lalabhirame, surame, rame,

చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే,

* Who is very pretty with her Tilak made of musk,
* Who makes all the world happy,
* Who is Rama, the goddess Lakshmi,

కస్తూరి తిలకం ధరించుటచే అతిశయమైన
సౌందర్యముతో జగత్తును రంజింప జేసే ఆమె సాక్షాత్తూ
లక్ష్మీదేవి

Prollasad valika moukthika srenika chandrika mandalothbhasi lavanya gandasthalanyatha kasthurika pathra rekha
samudbhootha sourabhya sambhrantha brungangana geetha santhree bhavan mantra thanthreesware,Susware, Bhasware,


ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికా
మండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత
సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్ర
తంత్రీస్వరే సుస్వరే భాస్వరే,


* Who is with the charming sound of Veena mixed with appropriate beats, strengthened by
the several bees,which rush
towards the incenses of the marks of musk made on her pretty necks and the light
emanating from the ornaments she wears
in her ears made of very precious gems which put to shame the light of the universe of
the moon,
* Who has very pleasing musical voice,
* Who shines with her very pretty features,

ఆమె వీణా వాయిద్యము ఉత్కృష్టమైనది; అనేక
మధుపంబులు ఆమె కోమలమైన మెడపై యున్న
కస్తూరికై తరలి వచ్చేవి; ఆమె చెవులకు ధరించిన రత్నపు
ఆభరణాల ప్రకాశం వలన చంద్ర లోక౦ వెలవెల బోయినది;
చక్కటి గాత్రము గలదై; తన సౌందర్యముతో ప్రకాశించేది

Vallaki vadana prakriya lola thali dhala badha thadanga bhoosha viseshanwithe,
Sidha sammanithe,


వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషా
విశేషాన్వితే సిద్ధసమ్మానితే,

* Who wears the ear ornaments made of palm leaves when she plays the musical instrument called Vallaki,
* Who is recognized by great sages,

జ్ఞానులు, ఋషులుచే సేవింప బడే ఆమె
వల్లకి సంగీత వాయిద్యము చేయుచు
తాటి ఆకులతో చేయబడిన ఆభరణములు
చెవులకు ధరించెడిది

Divya halamadho dwelahelala sachakshurandholana sri samakshiptha karanaika neelothphale,
poorithasesha lokapi vanchapale, sreephale

దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలన
శ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే
పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే,

* Who wears ear studs made of neelothphala flowers, whose shine is more than the light of
her divine glances that emanate
from her very pretty eyes which are red colored because of the divine alcoholic spirits
drunk by her,
* Who grants all wishes for all people of the world,
* Who grants wealth and happiness

ఆమె చెవులకు ధరించిన నీలోత్పల పుష్పముల
ప్రకాశము, సోమ పానము చేయుటవలన ఎరుపు రంగులో
యున్న ఆమె అందమైన కన్నుల దివ్యమైన ప్రకాశమును,
అతిశయించి యున్నది. ఆమె సర్వ జనుల
అభీష్టములు తీర్చగలిగినది; కోరినవారికి
ఐశ్వర్యమును, ఆనందమును ఇవ్వగలిగినది.

Sweda bindulla sathphala lavanya nishyandha sandhoha sandeha krunnasika moukthike,
Sarva viswathmike, Kalike,

స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య
నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే
సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే
కాలికే

* Who has nose rings, which makes one wonder whether it is made by the perspiration on
her pretty forehead which has flown down from there and crystallized on her nose,
* Who is the soul of all the world,
* Who also assumes the form of Kali,

ఆమె సున్నితమైన నుదుటపైనుండి స్వేద
బిందువులు జారి, ఆ బిందువులు ఘనీభవించి ఆమె ధరించిన
ముక్కు పుడకలగా మారెనా అన్నట్టు యున్నవి. ఆమే
విశ్వానికి ఆత్మ; కాళికా అవతారము దాల్చినది.

Mugdha mandasmithodhara vyaktha sphural pooga thamboola karpoora gandolkare,
Jnana mudhrakare,
Sarvasampathkare,
Padmabaswathkare,
Sreekare,

ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్
పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే
సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే,

* Who has a pretty face which easily showers smiles and which is made by prettier by the areca nut, Thamboola and camphor in her mouth,
* Who shows the symbol of jnana(wisdom)
* Who has all types of wealth,
* Who holds the lotus flower in her hand,
* Who grants good blessings,

ఆమె సౌ౦దర్యము మందహాసముతో వ్యక్తమైయుండగా,
నోటిలో తాంబూలము, వక్క, కర్పూరములతో
కూడి యున్నది. ఆమే సర్వ జ్ఞాన స్వరూపిణి; సర్వ సంపద ప్రదాత; కలువ పూవులు
ధరించి భక్తులను బ్రోచునది.

Kunda pushpa dhyuthi snigdha dantha vali nirmala lola kallola,
Sammelanasmera sona dhare,
Charu veena dhare,
Pakwa bimbha dhare,

కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలక
ల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే
పక్వబింబాధరే,

* Who is having the soft sweet reddish smile which comes in waves from the very pretty
set of teeth with its white shine
similar to the garland made of white jasmine buds,
* Who holds in her hand the pretty Veena,
* Who is having reddish lips like the Bimba fruits,

ఆమె ఎర్రని పెదవుల మీది చిరునవ్వు, మల్లె
మొగ్గల హారం వలె ప్రకాశ౦ గల పలువరస మీదుగా,
తరంగాల వలె వచ్చుచుండగా, ఆమె వీణను
మీటుచూ, దొండపండు వంటి ఎర్రని పెదవులతో
భాసిల్లుతున్నది

Sulalithayouanarambha chandrayodhvela lavanya dughdarnawavir bhava th kambhu bibhoka bruth kandhare,
Sathkala mandhire, Mandhare,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవా
విర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే

* Who is having the bright white conch like neck which has arisen from the ocean of milk
at the time of high tide that
too at the moonrise of the very pretty new youth,
* Who is the personification of all arts,
* Who is voluptuous,

ఆమె మెడ పడుచు పిల్లది వలె నుండి, చంద్రుని
ఆకర్షణ వలన పోటెత్తిన పాల కడలినుండి పైకి
వచ్చే తెల్లని శంఖమును బోలినది. ఆమె కళలకు
నిధి; కామము జనియింపజేసేది.

Divya rathna prabha banduhrachaanna haaradhi bhoosha samudhyotha mananavadhyanga shobhe, Shubhe,


దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్
యోతమానానవద్యాంగశోభే శుభే,

* Who is having the total blemish less luster created by her shining parts of the body
which are decorated by several
garlands and ornaments made by holy gems,
* Who is the personification of all that is good,

ఆమె మచ్చలేని వర్చస్సుతో, అనేకమైన పూల
మాలలతో, మణి హారములతో కూడి, సర్వ శుభాలను
కలిగించేదిగా యున్నది

Rathna keyura rasmi chada pallava prollasath dhorlatha rajithe,
Yogibhi poojithe,


రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతా
రాజితే యోగిభిః పూజితే

* Who is pretty because of her two arms which shine like young tendrils decorated by the shining armlets made of umpteen rathnas(gems),
* Who is being worshipped by sages,

ఆమె సౌందర్యానికి కారణభూతమైన
రెండు చేతులూ, అనేకమైన మణులతో
చేయబడిన దండ కడియములతో అలంకరింప
బడి, లతికల బోలి యున్నవి. ఆమె
రూపం జ్ఞానులు పూజించేదిగా యున్నది

Viswa ding mandala vyapi manikhya theja spurath kankanalangruthe,Vibhramalankruthe, Sadhubhi poojithe,


విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫుర
త్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే

* Who wears bangles, the light of whose gems spread all over the world,
* Who is also very pretty because of all that she wears,
* Who is worshiped by holy people,

ఆమె ధగధగమనే గాజులయందలి రత్నములు
సర్వ జగత్తుని ప్రకాశింప జేసినవై; ఆమె
ధరించిన ప్రతీదీ ఆమె సౌందర్యాన్ని బహుళీకృతము
చేయుచున్నవి. అటువంటి ఆమెను సాధువులు
పూజించెదరు.

Vasararambha vela samjrumbhamana aravinda prathi dwandwi panidwaye, Santhothdhyaddhaye,Adwaye,

వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే
సంతతోద్యద్దయే అద్వయే

* Who has two hands which challenge in their beauty the luster of newly opened lotusr
flowers at the rise of the sun,
* Who always rains the shower of mercy,
* Who is the one in whom there is no two,

ఆమె హస్తములు భానుని ఉదయ కిరణాలచే
విచ్చుకొనిన పద్మములను బోలి; ఆమె అద్వితీయమైన
కారుణ్యము భక్తులయందు సదా వర్షిస్తోంది.

Divyarathnormika dheethithi sthoma sandhyaya mananguli pala vodhyanna khendu prabha mandale, Sannadha ghandale, Chith
prabha mandale, Prollasath khundale,

దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ
సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామం
డలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే
ప్రోల్లసత్కుండలే,

* Who has very pretty fingers which has the luster emanating from her nails and which are
decorated by several rings studded with very precious jewels which is similar to
the luster of the moon,
* Who is worshiped lord by Indra, the king being of devas,
* Who is surrounded the holy light of God emanating from the cit,
* Who wears ear studs which have great luster,

ఆమె దివ్యమైన ఆభరణములతో అలంకరింపబడిన
కోమలమైన వేళ్ళు గలిగి, వాటినుండి, వాటి
నఖముల నుండి వెలువడే దివ్య కాంతులు
చంద్రుని కాంతి బోలి యున్నది; ఆమెను ఇంద్రాది
దేవతలు పూజించగా, ఆమె చిత్తమునుండి ప్రకాశము
నలుదిశలా వ్యాపించి ఆమె కుండలాల ప్రకాశముతో
దేదీప్యమానమైయున్నది

Tharaka jala neekasa haraa valee smera charu sthana bhoga bharanamanmadhya vallee valee schedha veechi samudhyath
samullasa sandarsithakara soundarya rathna kare,
Vallevibruthkare, Kimkara sreekare,

తారకారాజినీకాశహారావలిస్మేర
చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద
వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యర
త్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే,

* Who is an ocean of beauty due to the three wave like lines which are formed in her
middle due to a slight bent caused by her very attractive and heavy breasts which are
happily pretty due to the luster of several chains that she wears
which resemble a bevy of stars,
* Who plays the sacred veena,
* Who blesses her devotees with wealth,

ఆమె నక్షత్రాల శరము వలె మెఱయు హారములను
ధరించి; ఉత్తమమైన స్తన్యముల వలన వంగి యుండి;
కడలివ౦టి సౌ౦దర్యముతో కూడి ;వీణావాద్యము
చేయుచూ భక్తులకు సంపద ప్రసాదించి దీవించుచున్నది

Hemakumbhopamothunga vakshoja parava namre,
Trilokavanamre,

హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే
త్రిలోకావనమ్రే

* Who has a look of humility due to the slight bent caused by her very heavy golden breasts,
* Who is being worshipped by all the people of all the three worlds,

ఆమె వెన్ను బంగారు వర్ణ పాలిండ్ల భారముచే
వంగి యున్నదై, ఆమె ముల్లోక వాసులచే
కీర్తింపబడుచున్నది

Lasadvrutha gambheera nabhee sarastheera saivala sangakara syama romavalee bhooshane, Manju sambhashane,

లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే
మంజుసంభాషణే,

* Who shines due to pretty greenish black hair which appears like the thin row of water plants surrounding her lake like deep,round and attractive belly button,
* Who has a very attractive speech,

ఆ మంజు భాషిణి పచ్చని కేశములు, ఆమె
నాభివంటి కొలను చుట్టూ యున్న పొదలను బోలి
యున్నవి .

Charu sinchath kati soothra nirbarsthinanga leela dhanu sinchineedambare,Divya rathnambare,

చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్
శించినీడంబరే దివ్యరత్నాంబరే,

* Who defeats the lovely sugarcane bow of the God of love in arousing passionate love by just using the slight shake of her golden belt,
* Who wears silk studded with gems,

ఆమె బంగారు వడ్డాణము కదలిక మాత్రాన
మన్మధుని చెఱకు విల్లుని మరిపించే
కామోద్రేకమును కలిగించే శక్తి గలది; ఆమె ఆచ్ఛాదనము రత్నాలు పొదిగిన
పట్టు వస్త్రము.

Padmaraghollasanmekhala moukthi sreni shobajitha swarna bhoo bruthale.Chandrika seethale,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్త
లే చంద్రికాశీతలే

* Who by the shine of the diamond studded bells which are tied to her golden belt and which lessen the beauty of the greenish valley of the Mount Meru,
* Who is as cool as the moon light,

వజ్రముల పొదిగిన గంటలు గల్గిన వడ్డాణము
ధరించిన ఆమె శోభ పచ్చని చెట్లతో విరాజిల్లే
మేరు పర్వతమును అతిశయించి
యున్నది. ఆమె చంద్రుని కాంతి వలె శీతలముగా
నున్నది.

Vikasitha navakimsuka thara divyamsuka channa charooru shobha para bhootha sindhoora sonaya manendra matanga
hasthargale,Vaibhavan argale,Syamale,

వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న
చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ
హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే


* Who has very pretty thighs hidden by the holy cloth which is as red as the fully open flowers of palas tree and which
defeats the prettiness of the trunk of Iravatha which has the pasting of a saffron coat,
* Who has the ever flowing grace
without hindrance emanating from her,Who is a dark beauty,

ఆమె ఉరువులు విలక్షణమై, ఎర్రని పలస చెట్టు పూల
వర్ణము కలిగిన శుభ్ర వస్త్రముతో కప్పబడి, కుంకుమతో కప్పబడిన
ఐరావత తొండమును మరిపించుచున్నవి. ఆమె కటాక్షము
నిరంతరము ప్రవహించేది; ఆమె శ్యామల వర్ణముతో
శోభించుచున్నది.

Komala snighdha neelothpalothpaditha ananga thunnera sangakare dara jangalathe,Charu leela gathe,

కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార
జంఘాలతే చారులీలాగతే

* Who has very beautiful knee caps resembling the quiver of the God of love, which is shiningly pretty and made of dark flowers,
* Who has very pretty feminine gait,

ఆమె జాను ఫలకము అపూర్వమైన పూల
శోభతో కూడిన మన్మథుని అంబులపొదిని
బోలియున్నది; ఆమె మంద గమనము
వర్ణనాతీతము.

Namradik pala seemanthini kunthalasnighdha neela prabha punja samjatha durvangurasangi saranga samyoga ringanna
khendujjwale,Projjwale,Nirmale,

నమ్రదిక్పాలసీమంతినీ
కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురా
శంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే
ప్రోజ్జ్వలే నిర్మలే


* Who has lustrous and the crescent like nails, which are bent and saluted by the wives of the eight lord of directions
* Whose flowing hair is attracted by deer who think is as the luscious grass,
* Who has a wholly lustrous mien,
* Who is holy and pure,

ఆమె శోభమానమైన, నెలవంకను బోలు నఖములను
అష్ట దిక్పాలకుల సతులు ఆరాధింపగా, ఆమె
కేశములు హరిణులకు పచ్చికయేమో అనిపించేవిగా
నుండగా, ఆమె వైఖరి పవిత్రమై, శుద్ధమై యున్నది

Prahwa devesa lakshmeesa bhoothesa thoyesa vaneesa keenasa daithyesa yakshesa vayvagni koteera manikhya sangushta bala
thapodhama lakshara sarunya tharunya Lakshmi graheethangri padme,Supadme,Ume,

ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ
కీనాశ దైత్యేశ యక్షేశ
వాయ్వగ్నికోటీరమాణిక్య
సంహృష్టబాలాతపోద్దామ
లాక్షారసారుణ్యతారుణ్య
లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

* Who has lotus like feet which shine in the light emanating from the crowns of the bent
head of Indra, Vishnu, Shiva, Varuna, Brahma, Yama Niryathi, Vaisravana(God of wealth),
Vayu, and Agni, which because they are painted red by the
plant extracts shines like the reddish rising sun and which are the treasure house of
youthful beauty,
* Who holds lotus flower in her hands,
* Who has the form of Parvathy,

ఆమె పద్మము వంటి పాదములు పారాయణతో గూడి,
ఇ౦ద్రుని, విష్ణువుని, శివుని, వరుణుని; బ్రహ్మ,
యమ నిర్యతి, వైస్రావణుడు, వాయువు,
అగ్నుల యొక్క కిరీటముల కాంతి పుంజములచే
ప్రకాశవంతమై యున్నవి; ఆమె పార్వతి రూపంలో
కలువపూవులు ధరించి యున్నది

Suruchira navarathna peeta sthithe,
Susthithe,
Rathna padmasane,
Rathna simhasane,
Sankapadmadvayopasrithe,
Vishruthe,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే
రత్నపద్మాసనే రత్నసింహాసనే
శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే

* Who sits in the seat made of the nine precious gems,
* Who sits prettily,
* Who sits on the jeweled lotus flower,
* Who sits on the jeweled throne,
* Who is being sought by the Conch and the lotus flower,
* Who is very famous,

ఆమె నవరత్నాలు పొదిగిన ఆశనముపై,
ఆభరణములతో అలంకరింపబడిన
పద్మమును అధిరోహించి,
అత్యంత రమాణీయముగా నుండి,
శంఖము, పద్మములను ధరించి
విశ్వ విఖ్యాతితో పాలించుచున్నది

Thathra vignesa durga vatu ksethra palairyuthe,
Matha mathanga kanya samoohanvithe,
Bhairavair ashtabhir veshtithe,

తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే
మత్తమాతంగ కన్యాసమూహాన్వితే
భైరవైరష్టభిర్వేష్టితే


* Who is surrounded by Ganesa, Durga, Bhairava and Kshethra pala,
* Who due to her ebbing youthful vigour shines among the girls in the house of mathanga,
* Who is surrounded by the eight Bhairavas,

ఆమె గణపతి, దుర్గా దేవి, భైరవుడు,
క్షేత్రపాలుడు, అష్ట భైరవులుచే సేవింపబడి మాతంగ ఆశ్రమములోని
పడుచుల సౌ౦దర్యమును అతిశయించి యున్నది

Manjula menakadhyanga namanithe,
Devi vamadhibhi shakthihi sevithe,
Mathurka mandalair mandithe,
Yaksha gandharwa sidhangana mandalair archithe,
Pancha banathmike,
Pancha banenarathya cha sambhavithe,
Preethibhajaa vasanthena chaanandithe,

మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః
శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే
మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా
మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే
పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన
చానందితే


* Who is being revered by the divine beauties like Manjula and Menaka,
* Who is being served by Goddess Durga and Vama deva,
* Who is with the eight divine mothers ,
* Who is being worshipped by the yakshas, gandarwas and sidhas,
* Who is the soul of the arrows of the God of love,
* Who is being worshipped by Manmatha(God of love) and his wife Rathi devi,
* Who is being worshipped in spring along with love,

ఆమె మిక్కిలి అందమైన మంజుల, మేనకలచే
పూజింపబడి; దుర్గాదేవి, వామ దేవులు పరిచర్యలు
చేయుచుండగా; అష్ట మాతలతో కూడి; యక్ష, గంధర్వ, సిద్ధులచే
పూజింపడి; మన్మథ బాణాల శక్తికి మూలమై;
మన్మథుడు వాని పత్ని రతీ దేవిచే ఆరాధింపబడి; తొలకరిలో
ప్రేమతో అర్చించబడి యున్నది

Bhakthi baajam param sreyase,
kalpase yoginaam manase dhyothase,
Geetha vidhya vinodhati trushnena krishnena sampoojyase,
Bhakthimaschedasa vedhasa sthooyase,
Viswa hrudhyena vadhyena vidhyadharair gheeyase,

భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే
ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా
వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే
భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన
వాద్యేన విద్యాధరైర్గీయసే,

* Who grants great fame to her devotees,
* Who from the beginning of the world is being meditated upon by sages,
* Who is being worshipped by Lord Krishna a great expert in music,
* Who becomes pleased by the power of Vedic chants,
* Who is being worshipped by Lord Brahma with devotion,
* Who is being worshipped by Vidhyadharas by soulful music made of pretty words,

ఆమె భక్తులకు ఘనకీర్తిని ప్రసాదించగల
సామర్థ్యము గలదియై; సృష్ట్యారంభమునుండి
మునులచే ఆరాధింపబడినదై; సంగీత ప్రావిణ్యముతో
శ్రీ కృష్ణునిచే పూజింపబడినదై; వేద మంత్రాలు వల్లెతో
సంతుష్టమైనదై; బ్రహ్మాది దేవతలచే భక్తితో అర్చించబడినదై;
శ్రేష్ఠమైన పదములతో విద్యాధరులు గానము చేయుచుండగా భాసిల్లు
చున్నది

Sravana harana dakshinakwanaya veenaya kinnarair gheeyase,
Yaksha gandarwa sidhangana mandalair archyase,
Sarva soubhagya vanchavahirvadhudhir suranam samaradhyase,

శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా
కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా
మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్
వధూభిస్సురాణాం సమారాధ్యసే

* Who is being praised by Kinaaras accompanied by soulful music of the Veena,
* Who is being worshipped by the women of Yaksha, Gandharwa and Sidha clan,
* Who is also being worshipped by all devas with a deep wish to grant them all their desires,

ఆమె వీణా వాద్యముతో కిన్నెరలచే
స్తుతింపబడినదై; యక్ష, గంధర్వ, సిద్ధ యువతులు ప్రస్తుతింపగా;
తమ కోర్కెలు తీర్చుకొనుటకై దేవతలందరిచే
పూజింపబడుచున్నది

Sarva Vidhya viseshathmakam, chadu gatha samuchaaranam,
Kanda mulolla sadwarna raji thrayam,
Komala syamalo dhara paksha dwayam,
Thunda shobhathi dhoori bhavath kisukam tham shukam,
Lalayanthi parikreedase,

సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా
సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం
కోమలశ్యామలోదారపక్షద్వయం
తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ
పరిక్రీడసే,

* Who pets and plays with that parrot which is the personification of all knowledge,
which keeps on singing pretty songs,
which has the shining three lines on its neck in three different colours, which shines
with two wings of green colour,
which has shining beaks which are more pretty than the Kimsuka flowers,

మెడపై వివిధ రంగులతో కూడియున్న
చారలు గల; పచ్చని రెక్కలతో,
మోదుగు పువ్వులకన్న అందమైన ముక్కుతో
ప్రకాశి౦చే; జ్ఞానమునకు ప్రతీకయైన
ఆమె చిలుక మధురమైన గానము చేయగా
ఆమె దానితో క్రీడించుచున్నది

Pani padmadwaye nakshamalamapi sphatikeem jnanasarathmakam pustakangusam pasa bibrathiyena sanchinthyse,tasya
vakthrantharal gadya padyathmika bharathi nissareth,
Yena vaa yavaka bhakruitheer bavyase tasya vasya bhavanthi sthriya purusha yena vaa sathakumbhadyuthir bhavyase sopi
Lakshmi sahasarair parikreedathe,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం
జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ
తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్
గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన
వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా
భవంతిస్తియః పూరుషాః యేన వా
శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః
పరిక్రీడతే,

* Who when meditated upon as the one who holds the crystal chain in one hand, the
knowledge filled book in another, and
the goad and rope in other hands, makes knowledge flow from the devotee’s mouth in the
form of prose and poems,
* Who when meditated upon as the one who has he reddish colour of dawn similar to the
juice of red cotton, makes the
devotee attractive to all males and females,
* Who when meditated upon as the one who has a golden coloured body grants the devotee
all sort of wealth and makes him live happily,

మణిహారములు ఒక చేతితో, పుస్తకమును రెండవ
చేతితో, అంకుశము, పాశము తక్కిన చేతులలో
ధరించి; భక్తులకు గద్యపద్యాదులు ధారావాహకంగా
వచ్చేటట్లు చేయు శక్తిగలదై; పత్తి రసము
వర్ణము గల సూర్యోదయము యొక్క ఎర్రని తేజస్సుతో
ప్రకాశించుచూ;తన భక్తులు సర్వుల ప్రీతికి పాత్రులయేటట్లు
కరుణించుచూ; బంగారు వన్నెతో
భక్తులకు సంపద, ఆనందము కలిగించుచూ
ఆమె భాసించుచున్నది.

Kinna sidhyedwapu shyamalam komalam Chandra choodanwitham thavakam dhyatha thasya kelivanam nandanam thasya bhadrasanam
bhoothalam, thasya gheer devatha kimkari thasya chajnakari sree swayam,

కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం
చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా
సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం
భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ
శ్రీ స్వయం,

* Who when meditated upon as prettily greenish lustrous form wearing a crescent on her
head, would grant all occult powers to the devotee and make him feel that the ocean is
his pool for playing, great gardens are his kitchen gardens,
the entire earth appears as his seat, Goddess Saraswathi appears as his servant and
Goddess Lakshmi as the one obeys all his orders,

ఈ విధంగా ధ్యానించిన, పచ్చని వర్ణముతో
నెలవంకను శిరముపై ధరించి యున్న ఆమె; భక్తులకు
నిఘూడమైన శక్తినొసగి; సముద్రము
వారి క్రీడా స్థలముగా; ఓషదులతో
కూడిన వనములు తమవిగా; సమస్త భూమండలము వారి
ఆసనముగా; సరస్వతీ దేవి,
లక్ష్మీ దేవి వారి ఆనతానుసారము
ప్రవర్తించునట్లుగా చేయగల
సామర్థ్యము గలది.

Sarva Theerthathmike,
Sarva mantrathmike,
Srava yantrathmike,
Sarva shakthyathmike,
Sarva peedathmike,
Sarva thathwathmike,
Sarva vidhyathmike,
Sarva yogathmike,
Sarva nadathmike,
Sarva shabdathmike,
Sarva viswathmike,
Sarva vargathmike,
Sarva sarvathmike,
Sarvage, Sarva roope, Jagan mathruke,
Pahi maam, Pahi Maam, Pahi maam,
Devi thubhyam nama, Devi Thubhyam nama. Devi thubhyam nama.

సర్వతీర్థాత్మికే,
సర్వ మంత్రాత్మికే,
సర్వ యంత్రాత్మికే,
సర్వ తంత్రాత్మికే,
సర్వ చక్రాత్మికే
సర్వ శక్త్యాత్మికే,
సర్వ పీఠాత్మికే
సర్వ వేదాత్మికే, సర్వ
సర్వ విద్యాత్మికే
సర్వ యోగాత్మికే,
సర్వ వర్ణాత్మికే,
సర్వగీతాత్మికే,
సర్వ నాదాత్మికే ,
సర్వ శబ్దాత్మికే,
సర్వ విశ్వాత్మికే,
సర్వ వర్గాత్మికే,
సర్వ సర్వాత్మికే,
సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే
పాహి మాం పాహి మాం పాహి మాం దేవి
తుభ్యం నమో దేవి
తుభ్యం నమో దేవి
తుభ్యం నమో దేవి
తుభ్యం నమః

Sree Suktam






ఓం హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జాం ।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥ 1 ॥


hiraṇyavarṇāṃ hariṇīṃ suvarṇarajatasrajām .
candrāṃ hiraṇmayīṃ lakṣmīṃ jātavedo ma āvaha
..1..

This mantra (and much of Sri Suktam) is addressed to Jataveda, i.e., Agni, the
god of fire. Agni is the messenger through whom one conveys prayers and
offerings to the gods. Jataveda literally means he for whom the vedas were
born. 'Harini' means doe, but could also be interpreted as feminine of Harina,
i.e., Vishnu.


ఈ మంత్రంలో, తక్కిన మంత్రాలలో,
జాతవేదను (అగ్నిని) ఉద్దేశించి
చెప్పబడతాయి. అగ్ని
ప్రార్థనలను, యజ్ఞంలో
హవిస్సును, దేవతలకు
తీసికువెళ్ళేవాడు. జాతవేద
యొక్క పద అర్థము వేదాలు
ఎవరికోసమయితో ఉద్భవించినవో.
ఇక్కడ హరిణి అంటే జింక; అలాగే
హరిణ, అంటే విష్ణువు యొక్క
భార్య.


O Jatavedo, invoke for me that Lakshmi who is of golden complexion, beautiful
and adorned with gold and silver garlands. (Gold represents sun or the fire of
tapas; silver represents moon or the bliss and beauty of pure sattva.) who is
like the moon with a golden aura, who is Lakshmi, the embodiment of Sri;


అగ్నిదేవా! బంగారు వర్ణములో
యుండి, మిక్కిలి సౌందర్యవతి,
బంగారు మరియు వెండి హారములు
ధరించిన లక్ష్మీ దేవికి
వందనములు (బంగారము సూర్యుడు
లేదా తపో అగ్నికి సంకేతము;
వెండి చంద్రుడు లేదా సత్త్వ
గుణము యొక్క ఆనందము,
సౌందర్యము తెలుపును
). ఆమె
బంగారు వర్ణముగల చంద్రునివలె
యుండి, సమస్త ఐశ్వర్యాలను
ప్రసాదించే దేవత.


తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚ ।
యస్యాం॒ హిర॑ణ్యం విం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హం ॥ 2 ॥


tāṃ ma āvaha jātavedo lakṣmīmanapagāminīm .
yasyāṃ hiraṇyaṃ vindeyaṃ gāmaśvaṃ puruṣānaham
..2..

O Jatavedo, invoke for me that Lakshmi, who does not go away, (Sri is
non-moving, all-pervasive and the underlying essence of all beauty. Devi
Lakshmi as the embodiment of Sri is thus non-moving in her essential nature.)
By whose golden touch, I will obtain cattle, horses, progeny and servants.
Golden touch represents the fire of tapas which manifests in us as the energy
of effort by the grace of the Devi. Cattle, horses etc are external
manifestations of Sri following the effort.


ఓ అగ్నిదేవా! స్థిరమైన,
సర్వవ్యాపకమైన, సౌందర్యానికి
మూలమైన లక్ష్మీ దేవికి, నా
వందములు తెలుపుము. ఆమె
కరుణిస్తేనే గోవులు , ఆశ్వాలు,
సంతతి, సేవకులను పొందెదము. ఆమె
బంగారు హస్త వాశి ( తపో
అగ్ని వలన మనలో లక్ష్మీ దేవి
శక్తిని కలిగిస్తుంది
) వలన,
ఆమె కృప వలన మేము కర్మలు
చేయగలం. దాని వలన గోవులు,
ఆశ్వాలు మొదలగువాటి వలన మాకు
బాహ్యముగా ఐశ్వర్యము
కలుగుతుంది.


అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా᳚ద-ప్ర॒బోధి॑నీం ।
శ్రియం॑ దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా దే॒వీర్జు॑షతాం ॥ 3 ॥



aśvapūrvāṃ rathamadhyāṃ hastinādaprabodhinīm .
śriyaṃ devīmupahvaye śrīrmā devī juṣatām
..3..

O Jatavedo, invoke for me that Lakshmi who is abiding in the chariot of Sri
which is driven by horses in front and whose appearance is heralded by the
trumpet of elephants, (chariot represents the abode of Sri and horses
represents the energy of effort. The trumpet of elephants represents the
awakening of wisdom). Invoke the devi who is the embodiment of Sri nearer so
that the devi of prosperity becomes pleased with me. Prosperity is the external
manifestation of Sri and is therefore pleased when Sri is invoked.


ఓ అగ్నిదేవా! లక్ష్మీ దేవి
ఆశ్వాలు పూనిన , ఏనుగుల
ఘీంకారములతో గుర్తించబడే
రథంలో పయనిస్తుంది. (రథమంటే
లక్ష్మీ దేవి నిలయ౦; ఆశ్వాలు
అంటే కర్మ చెయ్యడం; ఏనుగులంటే
జ్ఞానము ఉదయించడం
). శ్రీ యొక్క
అవతారమైన లక్ష్మీ దేవికి మా
వందనములు తెలిపితే, ఆమె అక్కువ
చేర్చుకొని, మాకు
ఐశ్వర్యాన్ని
ప్రసాదిస్తుంది.



కాం॒ సో᳚స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వలం॑తీం తృ॒ప్తాం త॒ర్పయం॑తీం ।
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥ 4 ॥


kāṃ sosmitāṃ hiraṇyaprākārāmārdrāṃ jvalantīṃ tṛptāṃ
tarpayantīm .
padme sthitāṃ padmavarṇāṃ tāmihopahvaye śriyam
..4..

O Jatavedo, invoke for me that Lakshmi who is having a beautiful smile and who
is enclosed by a soft golden glow; who is eternally satisfied and satisfies all
those to whom she reveals herself, (beautiful smile represents the
trancendental beauty of Sri who is enclosed by the golden glow of the fire of
tapas). Who abides in the lotus and has the colour of the lotus; Lotus
represents the lotus of kundalini.


ఓ అగ్నిదేవా! సౌ౦దర్యమైన
చిద్విలాసము గలిగిన, బంగారు
వర్ణంలో విరాజిల్లే, సదా
సంతృప్తితో నుండి, భక్తులను
సదా సంతృప్తి పరిచే, లక్ష్మీ
దేవికి మా వందనములు తెలుపుము.
ఆమె పద్మంలో స్థితమై, పద్మము
యొక్క వర్ణము కలదై, మిక్కిలి
శోభాయమానంగా ఉండేది.


చం॒ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వలం॑తీం॒ శ్రియం॑ లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రాం ।
తాం ప॒ద్మినీ॑మీం॒ శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతాం॒ త్వాం వృ॑ణే ॥ 5 ॥


candrāṃ prabhāsāṃ yaśasā jvalantīṃ śriyaṃ loke
devajuṣṭāmudārām .
tāṃ padminīmīṃ śaraṇamahaṃ prapadye’lakṣmīrme naśyatāṃ
tvāṃ vṛṇe
..5..

O Jatavedo, invoke for me that Lakshmi who is the embodiment of Sri and whose
glory shines like the splendour of the moon in all the worlds; who is noble and
who is worshipped by the devas. I take refuge at her feet, who abides in the
lotus; by her grace, let the alakshmi (in the form of evil, distress and
poverty) within and without be destroyed. Lotus represents the lotus of
kundalini.


ఓ అగ్నిదేవా! శ్రీ యొక్క
అవతారమైన, చంద్రునివలె సమస్త
లోకాలలో విరాజిల్లే, ఘనమైన,
దేవతలు పూజించే లక్ష్మీ
దేవికి మా వందనములు తెలుపుము.
పద్మంలో వసించే ఆమె పాదాలను
ఆశ్రయి౦చి, అలక్ష్మిని
(పేదరికము, దౌష్ట్యము,
దౌర్భాగ్యము) నాశనము చేసెదము.



ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః ।
తస్య॒ ఫలా॑ని॒ తప॒సాను॑దంతు మా॒యాంత॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ॥ 6 ॥



ādityavarṇe tapaso’dhijāto vanaspatistava vṛkṣo’tha bilvaḥ .
tasya phalāni tapasānudantu māyāntarāyāśca bāhyā alakṣmīḥ
..6..

O Jatavedo, invoke for me that Lakshmi who is of the colour of the sun and born
of tapas; the tapas which is like a huge sacred bilva tree. The golden colour
of the sun represents the fire of tapas. Let the fruit of that tree of tapas
drive away the delusion and ignorance within and the alakshmi (in the form of
evil, distress and poverty) outside.


ఓ అగ్నిదేవా! సూర్యుని వర్ణము
గల్గిన, తపస్సు ( గొప్ప
బిల్వ వృక్షముతో లక్ష్మీ దేవి
తపస్సు చేసినదని పురాణాల్లో
చెప్పబడినది
) వలన
ఉద్భవించిన లక్ష్మీ దేవికి మా
వందనములు తెలుపుము. తపస్సు
అనబడే వృక్షము యొక్క ఫలములు మా
భ్రాంతిని, అజ్ఞానాన్ని,
అలక్ష్మిని వెళ్లగొట్టు గాక!



ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ ।
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ॥ 7 ॥


upaitu māṃ devasakhaḥ kīrtiśca maṇinā saha .
prādurbhūto’smi rāṣṭre’smin kīrtimṛddhiṃ dadātu me
..7..

O Jatavedo, invoke for me that Lakshmi by whose presence will come near me the
companions of the devas along with glory (inner prosperity) and various jewels
(outer prosperity), and I will be reborn in the realm of Sri (signifying inner
transformation towards purity) which will grant me inner glory and outer
prosperity.


ఓ అగ్నిదేవా! ఏ దేవత కటాక్షము
వలన, దేవతల సహచరులు (దేవశాఖ
లేదా కుబేరుడు , కీర్తి,
మణిభద్ర అనే వారు
) యశస్సు,
ఆభరణాలతో వస్తారో , మాకు శ్రీ
లోకంలో పునర్జన్మ కలుగుతుందో
అట్టి లక్ష్మీ దేవికి మా
వందనము తెలుపుము. దాని వలన
మాలో యశస్సు, బాహ్య ఐశ్వర్యము
కలుగుతుంది.



క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్షీం నా॑శయా॒మ్యహం ।
అభూ॑తి॒మస॑మృద్ధిం॒ చ సర్వాం॒ నిర్ణు॑ద మే॒ గృహాత్ ॥ 8 ॥



kṣutpipāsāmalāṃ jyeṣṭhāmalakṣmīṃ nāśayāmyaham .
abhūtimasamṛddhiṃ ca sarvāṃ nirṇuda me gṛhāt
..8..

O Jatavedo, invoke for me that Lakshmi whose presence will destroy hunger,
thirst and impurity associated with her elder sister alakshmi, and drive away
the wretchedness and ill-fortune from my house.


ఓ అగ్నిదేవా! ఏ దేవత కటాక్షము
వలన, ఆకలి దప్పికలు ఉండవో,
అలక్ష్మి యొక్క ప్రభావము
కలుగదో, ధౌర్భాగ్యము,
దురదృష్టము నాశనమవునో అట్టి
లక్ష్మీ దేవికి మా వందనములు
తెలుపుము.


గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీం᳚ ।
ఈ॒శ్వరీగ్ం॑ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥ 9 ॥


gandhadvārāṃ durādharṣāṃ nityapuṣṭāṃ karīṣiṇīm .
īśvarīṅg sarvabhūtānāṃ tāmihopahvaye śriyam
..9..

O Jatavedo, invoke for me that Lakshmi who is the source of all fragrances, who
is difficult to approach, who is always filled with abundance and leaves a
residue of abundance wherever she reveals herself. Who is the ruling power in
all beings; Please invoke her here, who is the embodiment of Sri.


ఓ అగ్నిదేవా! శ్రీ అవతారమైన,
సువాసనాలకు మూలమైన, మిక్కిలి
కష్టముతో కటాక్షము పొందగలిగే,
ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండే,
ఎక్కడ ఉన్నా సంపదతో కూడి ఉండే,
అన్ని జీవులను పరిపాలించే
లక్ష్మీ దేవికి మా వందనములు
తెలుపుము.



శ్రీ᳚ర్మే భ॒జతు । అల॒క్షీ᳚ర్మే న॒శ్యతు ।

మన॑సః॒ కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి ।
ప॒శూ॒నాం రూ॒పమన్య॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతాం॒ యశః॑ ॥ 10 ॥


manasaḥ kāmamākūtiṃ vācaḥ satyamaśīmahi .
paśūnāṃ rūpamannasya mayi śrīḥ śrayatāṃ yaśaḥ
..10..


O Jatavedo, invoke for me that Lakshmi for whom my heart truly yearns and to
whom my speech truly tries to reach, by whose presence will come cattle, beauty
and food in my life as (external) prosperity and who will reside (i.e. reveal)
in me as (inner) glory of Sri.


ఓ అగ్నిదేవా! ఎవరిని సహృదయ౦తో
మేము కాంక్షిస్తామో;
ప్రార్థిస్తామో; గోవులు,
సౌందర్యము, సమృద్ధిగా ఆహారము
కలిగించమని అర్ధిస్తామో;
బాహ్యంగా ఐశ్వర్యము, మనస్సులో
యశస్సుతో స్థితమై ఉండమని
కోరుకుంటామో, అట్టి లక్ష్మీ
దేవికి మా వందనములు తెలుపుము.





క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ ।
శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే మా॒తరం॑ పద్మ॒మాలి॑నీం ॥ 11 ॥


kardamena prajābhūtā mayi sambhava kardama .
śriyaṃ vāsaya me kule mātaraṃ padmamālinīm
..11..


O Kardama, invoke for me your mother. As Kardama (referring to earth
represented by mud) acts as the substratum for the existence of mankind.
Similarly O Kardama (now referring to sage Kardama, the son of devi Lakshmi you
stay with me,
and be the cause to bring your mother to dwell in my family; your mother who is
the embodiment of Sri and encircled by lotuses.


ఓ లక్ష్మీ దేవి పుత్రుడవైన
కర్దమా! (కర్దముడు ఒక ఋషి
మరియు ప్రజాపతి; వివిధ
పురాణాల్లో కర్దముడు లక్ష్మీ
దేవి మానస పుత్రునిగా
చెప్పబడినది
) నువ్వు మాలో
స్థితమై; నీ తల్లిని నా
కుటుంబంలో స్థాపించి; శ్రీ
అవతారమైన, పద్మముల కొలను
మధ్యనుండే లక్ష్మీ దేవికి మా
వందనములు తెలుపుము.



ఆపః॑ సృ॒జంతు॑ స్ని॒గ్దా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే ।
ని చ॑ దే॒వీం మా॒తరం॒ శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే ॥ 12 ॥


āpaḥ sṛjantu snigdhāni ciklīta vasa me gṛhe .
ni ca devīṃ mātaraṃ śriyaṃ vāsaya me kule
..12..


O Chiklita, invoke for me your mother. As Chiklita (referring to moisture
represented by water) creates loveliness in all things by its presence.
Similarly O Chiklita (now referring to Chiklita, the son of devi Lakshmi you
stay with me, and by your presence bring your mother, the devi who is the
embodiment of Sri (and essence of all loveliness) to dwell in my family.


ఓ లక్ష్మీ పుత్రుడైన చిక్లీతా!
(చిక్లీతుడు ఒక ఋషి,
లక్ష్మీ దేవి యొక్క మానస
పుత్రుడు; నీరు సృష్టికి,
దానిలోని జీవులకు ఎంతో అవసరము;
కాబట్టి సంపదకి, ఐశ్వర్యానికి
నీరు లేదా చిక్లీతుడు ఎంతో
అవసరము
) నాకు సన్నిహితంగా
నుండి, నీ తల్లిని ఆహ్వానించి,
శ్రీ అవతారమైన లక్ష్మీ దేవిని
నా కుటుంబంలో స్థాపించు.



ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం॒ పిం॒గ॒లాం ప॑ద్మమా॒లినీం ।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥ 13 ॥


ārdrāṃ puṣkariṇīṃ puṣṭiṃ piṅgalāṃ padmamālinīm .
candrāṃ hiraṇmayīṃ lakṣmīṃ jātavedo ma āvaha
..13..


O Jatavedo, invoke for me that Lakshmi who is like the moisture of a lotus pond
which nourishes a soul (with her soothing loveliness); and who is encircled by
light yellow lotuses, who is like a moon with a golden aura; O Jatavedo, please
invoke that Lakshmi for me. Devi Lakshmi in the form of a moon represents the
transcendental bliss and beauty of Sri. This soothing loveliness is compared
with the moisture of a lotus pond which nourishes a soul.


ఓ అగ్నిదేవా! పద్మ సరోవరంలో
తేమ వలె నుండి ఆత్మను
రంజింపజేసే; పసుపు పచ్చని
పద్మాల మధ్యనుండే; బంగారు
వర్ణముగల చంద్రుడిని బోలు
లక్ష్మీ దేవికి మా వందనములు
తెలపుము.



ఆ॒ర్ద్రాం యః॒ కరి॑ణీం య॒ష్టిం॒ సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీం ।
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం॒ జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥ 14 ॥


ārdrāṃ yaḥ kariṇīṃ yaṣṭiṃ suvarṇāṃ hemamālinīm .
sūryāṃ hiraṇmayīṃ lakṣmīṃ jātavedo ma āvaha
..14..


O Jatavedo, invoke for me that Lakshmi who is like the moisture (figuratively
representing energy) which supports the performance of activities; and who is
encircled by gold (glow of the fire of tapas), who is like a sun with a golden
aura; O Jatavedo, please invoke that Lakshmi for me. Devi Lakshmi in the form
of a sun represents the fire of tapas. This fire is compared with the moisture
within activities, the moisture figuratively signifying energy. The fire of
tapas manifests as the energy of activities.


ఓ అగ్నిదేవా! కర్మలు చేయడానికి
సహకరించే తేమ (శక్తి) వలెనున్న,
సువర్ణము చుట్టూ ఉండే, (
తపో శక్తి వలన
) బంగారు
వర్ణముతో నున్న సూర్యుని బోలు
( అనగా తపశ్శక్తితో
ఉండే
) లక్ష్మీ దేవికి మా
వందనములు తెలుపుము.


తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్షీమన॑పగా॒మినీం᳚ ।
యస్యాం॒ హిర॑ణ్యం॒ ప్రభూ॑తం॒ గావో॑ దా॒స్యోఽశ్వా᳚న్, విం॒దేయం॒ పురు॑షాన॒హం ॥ 15 ॥


tāṃ ma āvaha jātavedo lakṣmīmanapagāminīm .
yasyāṃ hiraṇyaṃ vindeyaṃ gāmaśvaṃ puruṣānaham
..15..


O Jatavedo, invoke for me that Lakshmi, who does not go away, (Sri is
non-moving, all-pervasive and the underlying essence of all beauty. Devi
Lakshmi as the embodiment of Sri is thus non-moving in her essential nature.)
By whose golden touch, I will obtain cattle, horses, progeny and servants.
Golden touch represents the fire of tapas which manifests in us as the energy
of effort by the grace of the Devi. Cattle, horses etc are external
manifestations of Sri following the effort.


ఓ అగ్నిదేవా! స్థిరమైన,
సర్వవ్యాపకమైన, సౌందర్యానికి
మూలమైన లక్ష్మీ దేవికి, నా
వందములు తెలుపుము. ఆమె
కరుణిస్తేనే గోవులు , ఆశ్వాలు,
సంతతి, సేవకులు పొందెదము. ఆమె
( తపోశక్తి వలన ఉండే )
బంగారు హస్త వాశి వలన, ఆమె కృప
వలన మేము కర్మలు చేయగలం. దాని
వలన గోవులు, ఆశ్వాలు మొదలగువాని
రూపేణా మాకు బాహ్యముగా ఐశ్వర్యము
కలుగుతుంది.


యశ్శుచిః॑ ప్రయతో భూ॒త్వా॒ జు॒హుయా॑-దాజ్య॒-మన్వ॑హమ్ ।
శ్రియః॑ పం॒చద॑శర్చం చ శ్రీ॒కామ॑స్సత॒తం॒ జ॑పేత్ ॥ 16 ॥


yaḥ śuciḥ prayato bhūtvā juhuyādājyamanvaham .
sūktaṃ pañcadaśarcaṃ ca śrīkāmaḥ satataṃ japet
..16..


Those who after becoming bodily clean and devotionally disposed perform
sacrificial offering with butter day after day, by constantly reciting the
fifteen verses of Sri suktam will have their longing for Sri fulfilled by the
grace of devi Lakshmi.


ఎవరైతే దేహ శుద్ధి చేసికొని, పై
శ్లోకాలు చదువుతూ నెయ్యను
అగ్నిలో ఆహుతి చేస్తారో, వారు
లక్ష్మీ దేవి దయతో శ్రీ ని
పొందుతారు.


ఆనందః కర్ద॑మశ్చై॒వ చిక్లీ॒త ఇ॑తి వి॒శ్రుతాః ।
ఋష॑య॒స్తే త్ర॑యః పుత్రాః స్వ॒యం॒ శ్రీరే॑వ దే॒వతా ॥

పద్మాననే ప॑ద్మ ఊ॒రూ॒ ప॒ద్మాక్షీ ప॑ద్మసం॒భవే ।
త్వం మాం᳚ భ॒జస్వ॑ పద్మా॒క్షీ యే॒న సౌఖ్యం॑-లఀభా॒మ్యహమ్ ॥ 17 ॥/>


padmānane padma ūru padmākṣī padmāsambhave .
tvaṃ māṃ bhajasva padmākṣī yena saukhyaṃ labhāmyaham
..17..


Salutations to mother Lakshmi whose face is of lotus, who is supported
(indicated by thigh) by lotus, whose eyes are of lotus and who is born of
lotus. Lotus indicates kundalini. Face indicates the nature of a person, thighs
indicate support and eyes indicate the spiritual vision. This verse describes
the transcendental nature of mother Lakshmi. she is born of yoga, united with
yoga and revealed to a devotee in his spiritual vision. O mother, you manifest
in me in the spiritual vision (indicated by lotus eyes ) born of intense
devotion by which I am filled with (i.e. obtain) divine bliss.


పద్మము వంటి ముఖము కల్గిన,
పద్మము మీద ఆశీనమైన, పద్మముల
వంటి నేత్రములు గల, పద్మము
నుండి ఉద్భవించిన లక్ష్మీ
దేవికి వందనములు!


అ॒శ్వదా॑యీ చ గోదా॒యీ॒ ధ॒నదా॑యీ మ॒హాధ॑నే ।
ధనం॑ మే॒ జుష॑తాం దే॒వీం స॒ర్వకా॑మార్థ॒ సిద్ధ॑యే ॥ 18 ॥


aśvadāyi godāyi dhanadāyi mahādhane .
dhanaṃ me juṣatāṃ devi sarvakāmāṃśca dehi me
..18..


Salutations to mother Lakshmi who is the giver of horses, cows and wealth to
all; and who is the source of the great abundance in this world. O devi, please
be gracious to grant wealth (both inner and outer) to me and fulfil all my
aspirations.


అశ్వాలను, గోవులను,
ఐశ్వర్యమును అందరికీ
ప్రసాదించే, ప్రపంచంలో
ఐశ్వర్యానికి మూలాధారమైన, ఓ
లక్ష్మీ దేవీ! నీకు వందనములు.
నాకు కృపతో ఐశ్వర్యాన్ని
ప్రసాదించి, నా కోరికలను
సఫలీకృతము చేయుము.


పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగో రథమ్ ।
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్ ॥ 19 ॥


putrapautra dhanaṃ dhānyaṃ hastyaśvādigave ratham .
prajānāṃ bhavasi mātā āyuṣmantaṃ karotu mām
..19..


Salutations to mother Lakshmi. O mother, bestow us with children and
grandchildren to continue our lineage; and wealth, grains, elephants, horses,
cows and carriages for our daily use. We are your children, O mother; please
make our lives long and full of vigour.


ఓ లక్ష్మీ దేవీ! నీకు వందనములు.
మాకు పుత్రపౌత్రాదులు,
ఐశ్వర్యము, ( ప్రతి దినమూ
అవసరమైన
)ఏనుగులు, ఆశ్వాలు,
గోవులు, రథాలను ప్రసాదించు.
మేము నీ పిల్లలము. మాకు
దీర్ఘాయిష్యు, శక్తివంతమైన
జీవితమును ప్రసాదింపుము.


చంద్రాభాం-లఀక్ష్మీమీశానాం సూర్యాభాం᳚ శ్రియమీశ్వరీమ్ ।
చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ-ముపాస్మహే ॥

ధన-మగ్ని-ర్ధనం-వాఀయు-ర్ధనం సూర్యో॑ ధనం-వఀసుః ।
ధనమింద్రో బృహస్పతి-ర్వరు॑ణం ధనమ॑శ్నుతే ॥ 20 ॥


dhanamagnirdhanaṃ vāyurdhanaṃ sūryo dhanaṃ vasuḥ .
dhanamindro bṛhaspatirvaruṇaṃ dhanamaśnute
..20..


Salutations to mother Lakshmi. O mother, you (indicated by dhanam) are the
power behind agni (the god of fire), you are the power behind vayu (the god of
wind), you are the power behind surya (the god of sun), you are the power
behind the vasus (celestial beings). You are the power behind indra, vrhaspati
and varuna (the god of water); you are the all-pervading essence behind
everything.


ఓ లక్ష్మీ దేవీ! వందనములు. ఓ
తల్లీ! అగ్నికి, వాయువునకు,
సూర్యునికి, వసువులకు,
ఇంద్రునికి, బృహస్పతికి,
వరుణునికి శక్తిని
ప్రసాదించేది నువ్వే. సర్వంలో
అంతర్లీనమై ఉన్నది నువ్వే.


వైనతేయ సోమం పిబ సోమం॑ పిబతు వృత్రహా ।
సోమం॒ ధనస్య సోమినో॒ మహ్యం॑ దదాతు సోమినీ॑ ॥ 21 ॥


vainateya somaṃ piba somaṃ pibatu vṛtrahā .
somaṃ dhanasya somino mahyaṃ dadātu sominaḥ
..21..


Salutations to mother Lakshmi those who carry Sri Vishnu in their heart (like
Garuda, the son of Vinata carries him on his back) always drink soma (the
divine bliss within); let all drink that soma by destroying their inner enemies
of desires (thus gaining nearness to Sri Vishnu). That soma originates from Sri
who is the embodiment of soma (the divine bliss); O mother, please give that
soma to me too, you who are the possessor of that soma.


ఓ లక్ష్మీ దేవీ! నీకు వందనములు.
శ్రీ మహా విష్ణువుని హృదయంలో
మోసేవారు (గరుడుడు
భౌతికంగా మోసేవాడు
),
అంతరంగంలోని కోర్కెలను
నియంత్రించి సదా సోమరసాన్ని
సేవిస్తారు. సోమ రసం శ్రీ
నుంచి ఉద్భవిస్తుంది. మాకు
కూడా సోమాన్ని ప్రసాదించు.


న క్రోధో న చ మాత్స॒ర్యం న లోభో॑ నాశుభా మతిః ।
భవంతి కృత పుణ్యానాం భ॒క్తానాం శ్రీ సూ᳚క్తం జపేత్సదా ॥ 22 ॥


na krodho na ca mātsarya na lobho nāśubhā matiḥ .
bhavanti kṛtapuṇyānāṃ bhaktānāṃ śrīsūktaṃ japetsadā
..22..


Salutations to mother Lakshmi neither anger nor jealousy, neither greed nor
evil intentions can exist in the devotees who have acquired merit by always
reciting with devotion the great Sri Suktam.


ఓ లక్ష్మీదేవీ! నీకు వందనములు.
క్రోధము, మాత్సర్యము, లోభము,
దౌష్ట్యము ఎల్లప్పుడూ
భక్తితో శ్రీ సూక్తాన్ని
పఠించే నీ భక్తులలో కానరావు.


వర్​షం᳚తు॒ తే వి॑భావ॒రి॒ ది॒వో అభ్రస్య విద్యు॑తః ।
రోహం᳚తు సర్వ॑బీజాన్యవ బ్రహ్మ ద్వి॒షో᳚ జ॑హి ॥ 23 ॥


varṣantu te vibhāvari divo abhrasya vidyutaḥ .
rohantu sarvabījānyava brahma dviṣo jahi
..23..


Salutations to mother Lakshmi. O mother, please shower your light of grace like
lightning in a sky filled with thunder-cloud and ascend all the seeds of
differentiation to a higher spiritual plane; O mother, you are of the nature of
brahman and destroyer of all hatred.


ఓ లక్ష్మీ దేవి నీకు వందనములు!
వర్షాకాలంలో మెరుపులతో కూడి
ఉండే మేఘంలాగ నీ
కరుణాకటాక్షమును మా యందు
ప్రసరించు. నీవు బ్రహ్మన్
స్వభావము కలదానివై విరోధమును
తొలగించగలదానివి.


పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ-దళాయతాక్షీ ।
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ॥ 24 ॥


padmapriye padmini padmahaste padmālaye padmadalāyatākṣi .
viśvapriye viṣṇu mano’nukūle tvatpādapadmaṃ mayi sannidhatsva
..24..


Salutations to mother Lakshmi who is fond of lotuses, who is the possessor of
lotuses, who holds lotuses in her hands, who dwells in the abode of lotuses and
whose eyes are like lotus petals, who is fond of the worldly manifestations
which are directed towards (i.e. agreeable to) Sri Vishnu (i.e. follows the
path of dharma); O mother, bless me so that I gain nearness to your lotus feet
within me. Lotus indicates kundalini.


పద్మాలయందు ప్రీతి కల్గిన,
పద్మాలను కలిగి, చేతులలో
పద్మాలను ధరించి, పద్మాల
కొలనులో స్థితమై, పద్మ రేకుల
వంటి నేత్రములు గల, శ్రీ మహా
విష్ణువు యొక్క అంగీకారము తో
లోకాలను కరుణించే లక్ష్మీ
దేవికి వందనములు. తల్లీ, నీ
పాదపద్మాలలో నాకు ఆశ్రయమును
ఇవ్వు.


యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ ।
గంభీరా వర్తనాభిః స్తనభరనమితా శుభ్ర వస్తోత్తరీయా ॥ 25 ॥


yā sā padmāsanasthā vipulakaṭitaṭī padmapatrāyatākṣī .
gambhīrā vartanābhiḥ stanabhara namitā śubhra vastrottarīyā
..25..


Salutations to mother Lakshmi who stands on lotus with her beautiful form, with
wide hip and eyes like the lotus leaf. Her deep navel (indicating depth of
character) is bent inwards, and with her full bosom (indicating abundance and
compassion) she is slightly bent down (towards the devotees); and she is
dressed in pure white garments.


సౌ౦దర్యముతో పద్మంలో
నిలుచొనియున్న, విశాలమైన నడుము
గల, పద్మముల వంటి నేత్రములు గల,
లోతైన నాభి గల, ఉత్తమమైన
వక్షోజాల వలన వంగి ఉన్న,
తెల్లని దివ్య వస్త్రములు ధరించిన
లక్ష్మీ దేవికి వందనములు.


లక్ష్మీ-ర్దివ్యై-ర్గజేంద్రై-ర్మణిగణ ఖచితై-స్స్నాపితా హేమకుంభైః ।
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా ॥ 26 ॥


lakṣmīrdivyairgajendrairmaṇigaṇakhacitaissnāpitā hemakumbhaiḥ .
nityaṃ sā padmahastā mama vasatu gṛhe sarvamāṅgalyayuktā
..26..


Salutations to mother Lakshmi who is bathed with water from golden pitcher by
the best of celestial elephants who are studded with various gems, who is
eternal with lotus in her hands; who is united with all the auspicious
attributes; O mother, please reside in my house and make it auspicious by your
presence.



ఉత్తమమైన నవరత్నాలతో
అలంకరింపబడిన భద్ర ఏనగులచే
బంగారు గిన్నెలయందున్న
జలముతో తడుపబడిన; నిత్యము
పద్మములను చేతులలో ధరించి,
సర్వ శుభలక్షణములు కలిగిన
లక్ష్మీ దేవికి వందనములు.
తల్లీ! నా గృహములో వశించి
శుభమును కలిగించు.


లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ।
దాసీభూత సమస్త దేవ వనితాం-లోఀకైక దీపాంకురామ్ ॥ 27 ॥


lakṣmīṃ kṣīrasamudra rājatanayāṃ śrīraṅgadhāmeśvarīm .
dāsībhūtasamasta deva vanitāṃ lokaika dīpāṅkurām
..27..


Salutations to mother Lakshmi who is the daughter of the king of ocean; who is
the great goddess residing in kseera samudra (literally milky ocean), the abode
of Sri Vishnu. Who is served by the devas along with their servants, and who is
the one light in all the worlds which sprouts behind every manifestation.


సముద్రరాజు పుత్రిక యైన; క్షీర
సముద్రంలో వసించే; విష్ణు
లోకంలో ఉండి, దేవతలు, సేవకులచే
ఉపచారములు పొంది; అన్ని
లోకాలను వెలిగించే ప్రకాశము
గల లక్ష్మీ దేవికి వందనములు.


శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం-వంఀదే ముకుందప్రియామ్ ॥ 28 ॥


śrīmanmandakaṭākṣalabdha vibhava brahmendragaṅgādharām .
tvāṃ trailokya kuṭumbinīṃ sarasijāṃ vande mukundapriyām
..28..


Salutations to mother Lakshmi by obtaining whose grace through her beautiful
soft glance, lord Brahma, Indra and Gangadhara (Shiva) become great. O mother,
you blossom in the three worlds like a lotus as the mother of the vast family;
you are praised by all and you are the beloved of Mukunda.


క్రీగంట చూపులతో
బ్రహ్మదేవుని, ఇంద్రుని,
శివుని కీర్తిని పెంపొందించే
లక్ష్మీ దేవికి వందనములు. ఓ
తల్లీ! నువ్వు పద్మము
విచ్చుకొన్నట్లు ముల్లోకాలలో
అతి పెద్ద కుటుంబానికి మాతయై
భాసిల్లుతావు. ముకుందినికి
(శ్రీ మహావిష్ణువునకు )
ప్రియమైన నిన్ను అందరూ
స్తుతిస్తారు.


సిద్ధలక్ష్మీ-ర్మోక్షలక్ష్మీ-ర్జయలక్ష్మీ-స్సరస్వతీ ।
శ్రీలక్ష్మీ-ర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥ 29 ॥


siddhalakṣmīrmokṣalakṣmīrjayalakṣmīssarasvatī .
śrīlakṣmīrvaralakṣmīśca prasannā mama sarvadā
..29..


Salutations to mother Lakshmi. O mother, may your different forms – Siddha
Lakshmi, Moksha Lakshmi, Jaya Lakshmi, Saraswati, Sri Lakshmi and Vara Lakshmi
always be gracious to me.


మాతా లక్ష్మీ! నీకు వందనములు.
సిద్ధ లక్ష్మి, మోక్ష లక్ష్మి,
జయ లక్ష్మి, సరస్వతి, శ్రీ
లక్ష్మి, వర లక్ష్మి రూపాలలో
భాసించే నువ్వు నన్ను
బ్రోవుము.


వరాంకుశౌ పాశమభీతి ముద్రామ్ ।
కరైర్వహంతీం కమలాసనస్థామ్ ।
బాలర్కకోటి ప్రతిభాం త్రినేత్రామ్ ।
భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్ ॥ 30 ॥


varāṅkuśau pāśamabhītimudrāṃ karairvahantīṃ kamalāsanasthām
.
bālārka koṭi pratibhāṃ triṇetrāṃ bhajehamādyāṃ jagadīsvarīṃ
tvām
..30..


Salutations to mother Lakshmi from your four hands – first in vara mudra
(gesture of boon-giving), second holding angkusha (hook), third holding a pasha
(noose) and fourth in abhiti mudra (gesture of fearlessness) – flows boons,
assurance of help during obstacles, assurance of breaking our bondages and
fearlessness; as you stand on the lotus (to shower grace on the devotees). I
worship you, O primordial goddess of the universe, from whose three eyes appear
millions of newly risen suns (i.e. different worlds).


ఓ మాతా లక్ష్మీ! నీ నాలుగు
హస్తాలు ( వరాలను
ప్రసాదించే
) వర ముద్ర,
అంకుశము, పాశము,
(అభయమునిచ్చే )అభీతి ముద్ర
ధరించి, వరాలు
ప్రసాదించి, విఘ్నములు
కలిగినప్పుడు రక్షించి,
పద్మములో వశించియుండి
భాసిల్లుతావు
( భక్తులను కరుణిస్తావు ).
సృష్టికి మూలాధారమైన,
మున్నేత్రాలతో, అసంఖ్యాక సూర్యులు
ఉదయిస్తే కలిగే ప్రకాశముతో
కూడియున్న నిన్ను
పూజిస్తున్నాను.


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే ॥ 31 ॥


sarvamaṅgalamāṅgalye śive sarvārtha sādhike .
śaraṇye tryambake devi nārāyaṇi namo’stu te ..
nārāyaṇi namo’stu te .. nārāyaṇi namo’stu te
..31..


Salutations to mother Lakshmi who is the auspiciousness in all the auspicious,
auspiciousness herself, complete with all the auspicious attributes, and who
fulfills all the objectives of the devotees (purusharthas – dharma, artha,
kama and moksha). I salute you O Narayani, the devi who is the giver of refuge
and with three eyes. I salute you O Narayani; I salute you O Narayani.


సర్వ శుభాల్లో శుభకరమైన, సర్వ
శుభలక్షణాలు కలిగిని, భక్తుల
ధర్మార్థకామమోక్ష
పురుషార్థములు ప్రసాదించగల
లక్ష్మీ దేవికి వందనములు.
నేత్రాల ఈక్షణతో ఆశ్రయ మిచ్చే
ఓ నారాయణీ, నీకు వందనములు.


సరసిజ నయనే సరోజ హస్తే
ధవలతరాంశుక గంధ మాల్య శోభే
భగవతి హరి వల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద
మహామ్ ॥ 32 ॥


sarasijanilaye sarojahaste dhavalatarāṃśuka gandhamālyaśobhe .
bhagavati harivallabhe manojñe tribhuvanabhūtikari prasīda mahyam
..32..


Salutations to mother Lakshmi who abides in lotus and holds lotus in her hands;
dressed in dazzling white garments and decorated with the most fragrant
garlands, she radiates a divine aura. O goddess, you are dearer than the
dearest of Hari and the most captivating; you are the source of wellbeing and
prosperity of all the three worlds; O mother, please be gracious to me.


పద్మంలో వశించి, చేతిలో
పద్మాన్ని ధరించి, దివ్యమైన
తెల్లని వస్త్రములు ధరించి,
సుగంధ భరితమైన మాలలు ధరించి,
తేజస్సుతో భాసిల్లే లక్ష్మీ
దేవికి వందనములు. ఓ తల్లీ! నీవు
శ్రీ హరికి అత్యంత ప్రియమైన
దానివి, ఆకర్షణ గల దానివి;
ముల్లోకముల క్షేమము,
ఐశ్వర్యానికి కారణానివి.
నన్ను కృపతో చూడుము.


విష్ణుపత్నీ౦ క్షమాం దేవీం
మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీ దేవీం
నమామ్యచ్చుత వల్లభా౦॥ 33॥


viṣṇupatnīṃ kṣamāṃ devīṃ mādhavīṃ mādhavapriyām .
viṣṇoḥ priyasakhīṃ devīṃ namāmyacyutavallabhām
..33..


Salutations to mother Lakshmi. O devi, you are the consort of Sri Vishnu and
the embodiment of forbearance; you are one with Madhava (in essence) and
extremely dear to him. I salute you O devi who is the dear companion of Sri
Vishnu and extremely beloved of Acyuta (another name of Sri Vishnu literally
meaning infallible).


ఓ లక్ష్మీ దేవీ! నీకు వందనములు.
నీవు విష్ణుపత్నివి, ఎంతో ( color=orange> భూమి వలె ) భరింపగల
శక్తి గలదానివి. నీవు
మాధవునికి అత్యంత
ప్రియురాలివి. శ్రీ
మహావిష్ణువునికి అత్యంత
ప్రీతిమంతురాలవైన నీకు నా
వందనములు ॥ 34 ॥


మహాలక్ష్మీ చ విద్మహే
విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్


mahālakṣmī ca vidmahe viṣṇupatnī ca dhīmahi .
tanno lakṣmīḥ pracodayāt
..34..


Salutations to mother Lakshmi may we know the divine essence of Mahalakshmi by
meditating on her, who is the consort of Sri Vishnu, let that divine essence of
Lakshmi awaken our spiritual consciousness.


లక్ష్మీ దేవికి వందనములు! మనము
విష్ణుపత్నియైన మహాలక్ష్మిని
ఉపాసించి ఆమె తత్వాన్ని
తెలిసికొనెదము గాక. ఆమె దైవిక
సారము మన ఆధ్యాత్మిక చింతనను
వృద్ధి చేయును గాక.


శ్రీ-ర్వర్చ॑స్వ॒-మాయు॑ష్య॒-మారో᳚గ్య॒-మావీ॑ధా॒త్ పవ॑మానం మహీ॒యతే᳚ ।
ధా॒న్యం ధ॒నం ప॒శుం బ॒హుపు॑త్రలా॒భం శ॒తసం᳚​వఀత్స॒రం దీ॒ర్ఘమాయుః॑ ॥ 35 ॥


śrīvarcasyamāyuṣyamārogyamāvidhāt pavamānaṃ mahiyate .
dhanaṃ dhānyaṃ paśuṃ bahuputralābhaṃ śatasaṃvatsaraṃ
dīrghamāyuḥ
..35..


Salutations to mother Lakshmi. O mother, let your auspiciousness flow in our
lives as the vital power, making our lives long and healthy, and filled with
joy. And let your auspiciousness manifest around as wealth, grains, cattle and
many offsprings who live happily for hundred years; who live happily throughout
their long lives.


లక్షీ దేవికి వందనములు. ఓ
తల్లీ! నీ కరుణాకటాక్షము మా
యందు ముఖ్య శక్తిగా ప్రసరించి,
మాకు దీర్ఘాయిష్యు, ఆనందము
కలిగించు గాక! నీ శుభకరమగు
వీక్షణముతో మాకు ఐశ్వర్యము,
ధాన్యము, గోవులు, సంతతితో అనేక
సంవత్సరాలు ఆనందంతో గడిపే
అదృష్టాన్ని కలిగించు.


ఋణ రోగాది దారిద్ర్య పాప క్షుదప మృత్యవః
భయ శోక మనస్తాపా నశ్య౦తు మమ సర్వదా ॥ 36 ॥


ṛṇarogādidāridryapāpakṣudapamṛtyavaḥ .
bhayaśokamanastāpā naśyantu mama sarvadā
..36..


Salutations to mother Lakshmi. O mother, (please remove my) debts, illness,
poverty, sins, hunger and the possibility of accidental death and also remove
my fear, sorrow and mental anguish; O mother, please remove them always.


లక్ష్మీ దేవికి నా వందనములు. ఓ
తల్లీ! నా ఋణములను,
అనారోగ్యాన్ని, పేదరికాన్ని,
పాపాలని, ఆకలిని, అకారణ
మృత్యువుని, భీతిని, దుఃఖమును,
మనోక్లేశమును తొలగించు.


య ఏవం వేద
ఓం మహా దేవ్యై చ విద్మహే
విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 37 ॥


ya evaṃ veda .
oṃ mahādevyai ca vidmahe viṣṇupatnī ca dhīmahi .
tanno lakṣmīḥ pracodayāt
oṃ śāntiḥ śāntiḥ śāntiḥ
..37..


This (the essence of mahaLakshmi indeed is veda (the ultimate knowledge). May
we know the divine essence of the great devi by meditating on her, who is the
consort of Sri Vishnu, let that divine essence of Lakshmi awaken our spiritual
consciousness. Om peace peace peace.


ఇది మహా లక్ష్మి యొక్క సారము.
మనము విష్ణుపత్ని అయిన దేవిని
ఉపాసించి ఆమె తత్వమును
తెలిసికొనెదము. ఆమె మనలోని
ఆధ్యాత్మిక చింతనను
పెంపొందించు గాక!

ఓం శాంతిః శాంతిః శాంతిః

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...