|
|
|
ఆదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే । ఇహాముత్రఫలభోగవిరాగస్తదనంతరమ్ । శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటమ్ ॥ 19॥
ఆదౌ = ముందుగా, నిత్యానిత్యవస్తువివేక-నిత్యానిత్యవస్తువుల వివేకము, పరిగణ్యతే-పరిగణింపబడుచున్నది. తదనన్తరం - దాని పిమ్మట, ఇహముత్ర ఫలభోగ విరాగం - ఇహలోకమునందును పర లోకమునందును కలుగు ఫలముల అనుభవమునందు వైరాగ్యము, శమాది షట్క సమ్పత్తి - శమాది షట్కము యొక్క లాభము, ముముక్షుత్వం== మోక్షేచ్ఛ, ఇతి = ఇట్లు, స్పుటం= స్పష్టముగా, (లెక్కింపబడుచున్నది).
వివేకాదులలో వెనుకనున్నది తరువాతనున్నదానికి కారణ మగుటచే ఒక క్రమము ఆశ్రయింపబడినది. ఇది నిత్యము, ఇది అనిత్యము అని తెలిసినకదా అనిత్యమునుండి వైరాగ్యమును పొందుట?
నిత్యానిత్యవస్తువివేకములేకున్నచో వైరాగ్యము దుర్లభముగాన వివేకము వైరాగ్యమునకు హేతువు.
అంతరింద్రియ నిగ్రహరూపముగ శాంతియు, బాహ్యేంద్రియ నిగ్రహరూపమగు దాంతియు వైరాగ్యవంతుడగు పురుషునకే కలుగును.
అందును బాహ్యేంద్రియ నిగ్రహరూపమగు దమము, అంతఃకరణమును నిగ్రహించుకొన్నవానికే కలుగును.
మనస్సుతో సంబంధము తెగి పోయిన పిమ్మట మిగిలిన ఇంద్రియములు ఏమియు చేయజాలవు కదా?
(ప్రశ్న) అట్లైనచో శమ మున్నపుడు దమము తనంతట తానే సిద్ధించునుకదా? మరల దానిని కూడ ఒక సాధనమునుగా పరిగణించుట ఎందులకు?
(సమాధానము) "ఇంద్రియాణి ప్రమాధీని హరన్తి ప్రసభం మనః" క్షోభ కలిగించు స్వభావముగల ఇంద్రియములు మనస్సును బలాత్కారముగ లాగివేయును అని గీతలో చెప్పిన విధమున బాహ్యేంద్రియ నిరోధము లేకున్నచో శమము దృఢము కాజాలదు. ఉపరమ మనగా సంన్యాసము, అది జితేంద్రియునకే కుదురును.
శీతము ఉష్ణము మొదలగు జంటలను సహింపగల్గుటకు తితిక్ష యని పేరు, అది కూడ అతనికే. ఏకాగ్రతతో బ్రహ్మయందు ఉండుటకు సమాధాన మని పేరు. అదీ కూడ బాహ్య విక్షేపము లేవియు లేని సంన్యాసికే కుదురును.
ఇట్టి గుణములు కలవానికే 'బ్రహ్మ ఒకటియే సత్పదార్థము. జగత్తు మిథ్యాభూతము' అని ఉపదేశించు గురువు యొక్క వాక్యములందును, వేదాన్తవాక్యములందును విశ్వాసము కలుగును. ఇదియే శ్రద్ధ.
ఈ విధముగ శమాదిషట్కములు గూడ ఒక క్రమమును పాటించుటకు కారణమును చెప్పవచ్చును. ఇట్టి పురుష శ్రేష్ఠుడు మోక్షభిన్నమగు దానిని దేనిని కోరడు;
దానియందు ఆలస్యమును సహింపజాలడు. అతని మోక్షేచ్ఛ చాల తీవ్రముగ ఉండును.— అను అభిప్రాయముచే 'ఆదౌ నిత్యానిత్య' ఇత్యాదికమును చెప్పినాడు. 'వివేకము తరువాత వైరాగ్యము' అని చెప్పుటచే 'తదు దితః స హి యో యదనన్తర' ఏది దీని తరువాత పుట్టినదో అది దాని కార్యము అని చెప్పినట్లు వైరాగ్యము వివేకకార్యమని చెప్పి నట్లే యైనది.
"తదనన్తరం” అనుపదము ఉత్తరవాక్యముతో కూడ సంబంధించును. కావున వైరాగ్యానంతరము శమాది సంపత్తి, దాని తరువాత ముముక్షత్వము అని యర్థము.
అవ. ఈ సాధనములనే విశదీకరించుచున్నాడు.
ādau nityānityavastuvivēkaḥ parigaṇyatē । ihāmutraphalabhōgavirāgastadanantaram । śamādiṣaṭkasampattirmumukṣutvamiti sphuṭam ॥ 19॥
Sometimes we wonder, despite our ardent devotion and prayers of a deity, why doesn't he or she appear in person? We have to be satisfied with the images of deities either painted or sculpted and displayed in temples and homes. We may know who painted or sculpted the image in front of us, but seldom try to find out who did it for the first time. Take for example the image of Lord Venkateswara which depicts the Lord holding a conch and a chakra, carrying Lakshmi Devi in the bosom, decorated ornately with flowers and gold. Who came up with this "design"? Long time ago, there could have been an extraordinary artist who read the description of the Lord in the scripture, imagined his form in his mind before transforming it into an image. In other words, we believe, the Lord appeared before him in full splendor and graced the artist. Sometimes the artists say the Lord appeared in their dreams and inspired them to create the image. Once the artist creates a prototype of the Lord's image, others come along and refine it. So what we see in temple deities is an altered depiction and the chances that the Lord will appear in person before us are all but certain.
However, an ardent devotee who attains the Lord's abode after death gets the privilege to worship the Lord in person. A mumukshu, on the other hand, doesn't bother himself with deities and considers an experience in heaven short-lived. This is called vairagya. So how can we achieve such a mental state? Sankara answers the question in this sloka.
At first one should be able to ascertain what is real and unreal. Sankara calls it nitya anitya viveka. In vedanta all things born are considered as unreal. In vedas the neti-neti ('not this', 'not this') process of elimination was suggested as a means to arrive at reality. Not everyone is blessed with viveka because of their indulgence in senses. In Chandogya upanishad there is a tale of Virochana, the King of Asuras, who after serving Prajapati for an extended period, came away with the conviction that his body is atma. Such ignorance is prevalent in modern men lacking viveka. There is no need to consider viveka as god given or genetic. For those sufficiently evolved, it is possible to acquire viveka by discriminating between truth and falsity with constant practice.
Next Sankara says viveka leads to vairagya. Some people retreat to isolated places, deny themselves the basic comforts of life, constantly be in a sullen mood or react devoid of emotions thinking it will lead to vairagya. Indeed such people are considered anti-social and don't have an integrated personality. Generally when we see sannyasis and yogis lecturing about spiritual matters, we find them to be ebullient and spontaneous without a trace of despair. It is an indication that the more progress we make in vairagya, the more our mind becomes unfettered. The freedom from the material world or bondage is the objective of vairagya. In fact, one who gives up the desire for the fruit of karma, as Gitacharya advised, also can be said to be in vairagya. What is meant is the fruit of karma is limited and can't be compared to the infinite joy and freedom achieved with vairagya.
The detachment from the fruit of all karma leads to its manifestation unexpectedly in worldly circumstances and mental states. When the mind is trained to react to them with full awareness it leads to direct experience on a daily basis. This is called sadhana. So detachment is a process. Overnight one doesn't detach himself from the bondage of family and friends. It is only possible with sadhana where one severs all bonds and experiences freedom gradually with mind fixated on moksha
After attaining vairagya, Sankara, in this multi-step process, advises mumukshus to develop shatsampatti (sama, dama, uparati, titiksha, sradha, samadhana). Sama and dama mean withdrawing the senses from the external world. Uparati implies sannyasa. Titiksha is the ability to tolerate extremities such as severe cold. Sradha and samadhana are the strong belief and focus on brahman. They gradually impart all the necessary mental equipment to attain liberation.