Saturday, March 16, 2024

Vidura Neeti Part 4




జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలె వృద్ధిపొందుతాడు. ఇంద్రియాలనూ మనస్సునూ జయించ కుండా, మంత్రులను స్వాధీనంలో ఉంచుకోగోరేవాడూ, మంత్రులను వశపరుచుకోకుండా శత్రువులను జయించగోరేవాడూ, ప్రజాభిమానం పొందలేరు. మనశత్రువును ముందు జయించాలి. మనస్సును జయించి అపరాధులను శిక్షిస్తూ కార్యాలను పరిశీలిస్తూ ఉండేవారిని లక్ష్మి వరిస్తుంది.

One who conquered senses would grow like a waxing moon. One trying to keep his ministers in one's control, without conquering senses and mind; one trying to win over the enemies without controlling his ministers can't attain popularity among the subjects. A king should conquer his enemies. Goddess Lakshmi will favor those conquering their senses, punishing criminals and monitoring the subordinates.

ఈ మానవశరీరమొక రథం. దానికి బుద్ధి సారధి. ఇంద్రియాలు అశ్వాలు. వీనిని వశంలో ఉంచుకొనేవాడు మహారధికుని వలె సంసార సంగ్రామంలో జయం పొందుతాడు. అశిక్షితాలై పట్టు తప్పిన గుఱ్ఱాలు మధ్య మార్గ౦లో సారధిని పడగొట్టేటట్టు వశంలోని ఇంద్రియాలు పురుషుని అర్థానర్దజ్ఞానాన్ని నశింపజేసి దుఃఖభాగుని జేస్తాయి. ధర్మార్థాలను విడిచి విషయలోలుడై చరించేవాడు అచిరకాలంలో ఐశ్వర్య ప్రాణ స్త్రీ ధనాలను పోగొట్టు గుంటాడు, ఆత్మజ్ఞాని గ్రహించడానికి నిరంతరం కృషి చెయ్యాలి. ఆత్మకు మి౦చిన మిత్రుడూ శత్రువూ లేరు. దాన్ని జయించినవారికి అదే మిత్రము. లేకపోతే అదే పరమశత్రువు. సూక్ష్మరంధ్రాలు కల వలలోపడ్డ రెండు పెద్దచేపలు దానిని కొరికి వేసేటట్టు కామక్రోధాలనే మీనాలు వివేకాన్ని నశింవ చేస్తాయి.

A man's body is the chariot. Intellect is the charioteer. Senses are the horses. Like the able charioteer holding the reins, one will win in the battle of life by controlling the body, intellect and senses. Just as untamed wild horses will displace the rider midway, uncontrolled senses will bring infamy and sorrow. One who flouts dharma will lose wealth, wife, riches, even life. A self-realized must exert everyday. There is no bigger friend or enemy than the self. To those conquering the self, it is the best friend; otherwise it is the worst enemy. Like the fish that can gnaw away the net, lust and hatred destroy the intellect.

ధర్మార్థాలను పరిశీలించుకొని విజయం కోసం కృషిచేసేవాడు సులభంగా వానిని సాధిస్తాడు. చిత్తవికారానికి హేతుభూతాలైన పంచే౦ద్రియాలను శత్రువులుగా భావించి వానిని జయిస్తేనే శత్రు విజయం సాధ్యమవుతుంది. సాధువులు సత్కర్మల వల్ల, రాజు రాజ్య భోగాలవల్ల సుఖులవుతారు. పాపాత్ములతో సాంగత్యంగల సజ్జనులు కూడా దండనార్హులే అవుతారు, ఎండిన కట్టెతో కలిసే పచ్చికర్రకు కూడా అగ్నిబాధ తప్పదుకదా!

The one trying for victory by analyzing his dharma and wealth will attain them easily. One who considers the five senses as responsible for the different mental states, and tries to conquer them will eventually win over his enemies. Ascetics by good karma, kings with palatial luxuries will enjoy life. The chaste ones making friendship with the wicked also become eligible for punishment, like wet wood burning with tinder.

అందుచేతనే దుర్జనసాంగత్యం ఉచితం కాదు. ఇంద్రియలోలుని ఆ ఇంద్రియాలే ఆరగిస్తాయి. గుణగ్రహణమూ, సరళ స్వభావమూ, పవిత్రహృదయమూ, సంతోషభావమూ, మృదువచనమూ, సత్య వ్రతమూ, ఇంద్రియ సంయమనమూ దుష్టుల దరిజేరవు. అత్మజ్ఞానమూ, క్రోధరాహిత్యమూ, సహన శీలమూ, వాగ్దానరక్షణా, దానశీలమూ, ధర్మపరాయణతా అధములకు పట్టవు. విద్వాంసులను నిందిస్తూ మూర్ఖులు సంతోషిస్తారు. ఎదుటవానిని నిందించడమే స్వభావంగా కలవాడు మహాపాపి. నిందలను సహిస్తూ వారిని క్షమించేవాడు పుణ్యాత్ముడు. హింస దుష్టులకు బలం. దండనీతి రాజులకు బలం. సేవ స్రీలకు బల౦. క్షమ గుణశీలికి బలం.

Hence befriending the wicked is not recommended. One who is submissive to senses will be destroyed by them. Good attributes, pleasing personality, soft spokenness, pure heart, optimistic outlook, pursuit of truth, moderation with senses will not be endearing to the wicked. Self realization, free from rage, patience, keeping one's word, giving alms, implementation of dharma will not appeal to the low lives. Fools rejoice by insulting scholars. A sinner blames other people. A noble person forgives one who is blaming him. Violence and cruelty are the strengths of the wicked. Penal code is the strength for the king. Service is the forte of women. Forgiveness is the power of the noble.

వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడంకంటె కష్టమైనది లేదు. చమత్కారయుక్తులతో విశేషార్థాలను ప్రతిపాదించగల వాణి మితంగానే ఉంటుంది. మధు శబ్ధయుతమైన విషయం కళ్యాణప్రదమే అవుతుంది. అదే విషయం కటూక్తలతో నిండితే అనర్ధదాయక మవుతుంది. గొడ్డలి దెబ్బలు తిన్న అరణ్యం చిగిరంచవచ్చు. కాని కటువచనాలతో దెబ్బతిన్న హృదయం కోలుకోదు. శరీరంలో నాటిన తీవ్ర శరాలను పెరిక పారవేయవచ్చు. కాని పరుష భాషనాలుమాత్ర౦ గు౦డెలోనుండి పైకి తియ్య లేము. అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషి౦చరు. దేవతలు ఎవని పరాజయం కోరుతారో వాని బుద్ధినే ముందుగా హరిస్తారు. ఆంతతో వాడు దుష్కర్మరతుడవుతాడు. వినాశకాలం సమీపించినపుడే బుద్ది నశిస్తుంది. అన్యాయం ప్రవేశిస్తుంది.

Nothing is as difficult as controlling the speech. The speech interspersed with skilful phrases and humor is limited. Sonorous speech with sweet sounding words is auspicious. The speech composed of harsh sounding words causes evil. A forest of trees felled by an axe can be replenished but not the heart hurt by harsh words. It is possible to remove arrows struck on the body, but not the harsh words striking the heart. That's why pundits don't speak harshly. When a person's downfall is desired, his intellect should be dulled thereby making him a wicked person. Before the downfall intellect will retreat and injustice will enter.

మహారాజా! నీ కొడుకులు పాండవులను విరోధ దృష్షితో చూస్తున్నారని మరచిపోకు. సర్వసద్గుణ సంపన్నుడైన ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. థర్మార్థవిదుడూ తేజస్సంపన్నుడూ థీమంతుడూ భాగ్యశాలి అయిన ధర్మజుడు మీయందు గల గౌరవ భావంచేత ఎన్ని కష్టాలైనా సహించాడు. అది మరువకండి అన్నాడు విదురుడు.

Vidura said "King, don't forget that your sons are considering Pandavas as their enemies. The embodiment of good attributes, Dharma Raja, could become the ruler of the world. Being a follower of dharma, having great scholarship; possessing great aura and fortune Dharma Raja tolerated many setbacks out of his enormous respect for you. Please don't forget that".

ధీవిశాలుడైన విదురుడు ప్రసంగిస్తూంటే ధృతరాష్ట్రుని మనస్సు కొంతకొంత కలకదేరుతూంది. మరికొంత సేపు విదురుని ముఖాన నీతిశాస్త్రం వినా లని కుతూహలపడి దృతరాష్టుడర్ధించాడు. ధీశాలి విదురుడు ప్రసంగిస్తున్నాడు.

As the intellectual Vidra was discoursing, Dhrutarashtra's heart lightened. He wanted more of the discourse.

ప్రభూ! సర్వతీర్థస్నానమూ, భూతదయా సమానమైనవి. ఒక్కొక్కప్పుడు తీర్థస్నానంకంటె మృదువ్యవహారమే ఘనమై నది. అందుచేత మీరు మీ బిడ్డలైన దుర్యోధనాదులయందూ, ధర్మ రాజాదుల యందూ సమభావంతో సౌమ్యంగా వ్యవహరిస్తే మీ ‌ కీర్తిప్రతిష్టలు యినుమడిస్తాయి. మానవుని కీర్తి యీభూమండలంలో ఎంతవరకూ గానం చెయ్యబడుతూంటుందో అంతవరకూ స్వర్గంలో స్థిరనివాసం లభిస్తుంది. ఈవిషయమై సుధన్వ విరోచనులమధ్య జరిగిన సంవాదమొకటి వినిపిస్తాను.

"King, bathing at all the holy rivers is the same as being kind to all life forms. At times, soft spokenness is superior to a dip in a holy river. If you are equanimous with your sons and Pandavas, then your fame will spread all over the world. Accordingly your sojourn in heaven will last for ever. In this regard I will tell you about a conversation between Sudhanva and Virochana"

పూర్వకాలంలో కేశిని అనే పేరుగలసౌందర్య రాశి ఉండేది. ఆమె సర్వోత్తముడైన వ్యక్తిని భర్తగా వరించాలని స్వయంవరం ప్రకటించింది. ఆ స్వయం వరానికి కుతూహలంతో విరోచనుడు వచ్చాడు. అప్పుడామె వానితో “విప్రా! దైత్యులలో శ్రేష్ఠు డెవడు? విప్రుడే శ్రేష్ఠుడైతే భూసురుడైన సుధన్వుడు నా శయ్యను అలంకరించడానికి అర్హుడు కాడా”. అని ప్రశ్నించింది. విరోచనుడు సమాధాన మిస్తూ కేశినీ! ప్రజాపతి సంతానంలో మేము శ్రేష్ఠులము. మా ఎదుట దేవతలే అల్పులై నప్పుడు భూదేవతల విషయం చర్చకేరాదు అన్నాడు.

Once upon a time there was a beautiful woman called Kesini. She sought public choosing of a husband who would be an embodiment of great attributes. Virochana, the son of Prahlada and the king of asuras, arrived for the occasion. She said "Who is the best among the asuras? If a brahmin king is the best among all, isn't Sudhanva eligible to marry me?". Virochana said "Kesini, among prajapati's progeny we are the best. When suras are weak before us, is there anything to be said about the brahmin kings on the earth"

విరోచనా! అయితే మనమిక్కడ యిలానే ఉండి సుధన్వుడు వచ్చేవరకూ నిరీక్షిద్దాం. వాని ఆగమనానంతరం నిర్ణయించుకుందా౦- అంది కేశిని. రాత్రిగడిచింది. తెల్లవారింది.

Kesini said "Virochana, then we will wait here until Sudhanva arrives. We will decide after that".

కేశిని విరోచనులున్నచోటకు సుధన్వుడు వచ్చాడు. కేశిని లేచి నిలబడి అర్ఘ్య పాద్యాదులిచ్చి ఆసనం చూపింది. అప్పుడు సుధన్వుడు విరోచనుని వైపు తిరిగి ప్రహ్లాదనందనా! నేను యీ సుందర స్వర్ణ సింహాసనాన్ని మర్యాదగా స్పృశిస్తున్నాను; అంతే నేను దీనిపై కూర్చోను. ఈ ఆసనాన్ని నేను అలంకరించినట్లయితే నీతో సమానుడనే అవుతాను.

The next day Sudhanva came. Kesini got up and offered him a seat after due worship. Then Sudhanva turned to Virochana and said "The son of Prahlada, I am sitting on this ornate throne out of respect. But not as your equal"

అనగా విరోచనుడు.. ఓ బ్రాహ్మణుడా ! దర్భాసనమూ, దారుపీఠమూ యోగ్యమైనవికాని స్వర్ణ సింహాసనాలు నీ కర్హమెనవికావు- అన్నాడు.

Virochana retorted "Brahmin, you are suited to sit on dry grass and wooden seats but not the golden throne"

విరోచనా! తండ్రీకొడుకులు ఒకే ఆసనంమీద ఆసీనులు కావచ్చు. ఇద్దరు విపృలూ, ఇద్దరు క్షత్రి యులూ, ఇద్దరు వైశ్యులూ, శూద్రులూ, ఇద్దరు వృద్ధలూ, ఏకాసనాసీనులుకావచ్చు. అంతే. నీతండ్రియైన ప్రహ్లాదుడుకూడా నాకు ఉన్నతాసనమిచ్చి గౌరవంగా చూసాడు. నువ్వు పసివాడవు. సుకుమారంగా పెరుగుతున్న నీకు లౌకికజ్ఞానం పట్టలేదు. అని సుధన్వుడనగా విరోచనుడు- సుధన్వా! మా దైత్యనగరంలో ఉ౦డే ధనకాంచనాలనూ, గోవులనూ, ఆశ్వాలనూ పణంగా పెడుతున్నాను. మన యిద్దరిలో ఎవడు శ్రేష్ఠుడో నిర్ణయించుకుందాం - అనగా సుధన్వుడు - ప్రహ్లాదనందనా ! అవన్నీ ఆలానే వుంచు, మనము మన ప్రాణాలను ఒడ్డి ఈ విషయం నిర్ణయించుకుందాం. ఈ నిర్ణయం ఒక జ్ఞానివల్ల జరగాలి అన్నాడు, విరోచనుడందుకంగీకరిన్తూ బ్రాహ్మణా ! నేను దేవతలదగ్గరకు రాను. ఈ విషయమై మానవుల నిర్ణయం నాకు పొసగదు. అనగా సుధన్వుడు- ఓ దైత్యా! మనము నీతండ్రియైన ప్రహ్లాదుని దగ్గరకు పోయి ఈ విషయయమై నిర్ణయం చెయ్యమందాము. ప్రహ్లాదుడు ఏస్టితిలోనూ అబద్దమాడడని నా నమ్మకము- అన్నాడు.

"Virochana, a father and his son can sit together. Two brahmins, a couple of warriors, two traders, sudras, couple of old people can cohabit the same seat. Your father Prahlada offered me a superior throne and showed his respect. You are an adolescent. Growing in a cloistered environment you are unable to grasp the transactional world" said Sudhanva.

"Sudhanva, I am betting all the wealth, cows and horses in our asura country to decide who is the better suitor" said Virochana.

"Son of Prahlada, keep the trivialities aside. Let us bet our lives. The winner should be decided by a scholar" said Sudhanva.

Virochana acquiesced saying "Brahmin, I won't come to suras. Nor humans"

Sudhanva said, "Asura, let us ask your father Prahlaada. I believe he will never lie"

వారుభయులూ బయలుదేరి ప్రహ్లాదుని సమీపించారు. ఎన్నడూ కలియని విరోచన సుధన్వులు కుపితభుజంగాలవలె రావడం చూసి ప్రహ్లాదుడు నాయనా! సుధన్వునికీ నీకూ సఖ్యంకలిగిందా ? ఇదివరలో ఎన్నడూ కలిసి మెలసి తిరుగని మీరు ఈనాడు ఇలా రావడం ఆశ్చర్యంగా ఉంది అనగా విరోచనుడు సమాధాన మిస్తున్నాడు. మహారాజా! మా ఉభయులమధ్యా మైత్రి లేదు. ఒక విషయమై పోటీపడి ప్రాణాలుఒడ్డి నీదగ్గరకు వచ్చాము. ఇప్పుడు యదార్థంచెప్పండి అన్నాడు. ప్రహ్లాదుడు సేవకులను పిలిచి సుధన్వునుకి అర్ఘ్యపాద్యాలూ మధుపర్కాలూ తెప్పించి- అర్చించి బ్రాహ్మణోత్తమా! నీవు అతిథివి, నాకు పూజనీయుడవు. నీకు దానమివ్వడానికి తెల్లని ఆవులను సిద్ధంగా ఉంచాను. అనగా సుధన్వుడు ప్రహ్లాదా! నా కివన్నీ దారిలోనే లభించాయి, ఇప్పడు నువ్వు నా ప్రశ్నకు సమాధానమివ్వాలి. విపృ, దైత్యులలో శ్రేష్ఠుడెవడు ?- అని ప్రశ్నించాడు.

They both went to Prahlada. When he saw the mutually hating Virochana-Sudhanva together approach him like angry snakes, Prahalada said "Did you and Sudhanva patch up? I have never seen you together. I am surprised by your visit".

Virochana said "King, there is no friendship between us. We are competing for a prize and bet our lives. Please tell us the truth."

Prahlada said to Sudhanva "Brahmin, you are my guest worthy of worship. I have holy cows as alms to you"

Sudhanva said "Prahlada, I could get them on the way. Now you should answer my question: between brahmins and asuras, who is superior?"

భూసురోత్తమా! నాకు విరోచనుడొక్క డే కొడుకు, నువ్వు స్వయంగా ఇక్కడకు వచ్చి ఈ వివాదం నా ముందుంచితే నేనెలా నిర్ణయించగలను అని పుహ్లాదుడు ప్రశ్నించగా_ మహారాజా! నీ ధన ధాన్యసంపదలన్నీ నీ కుమారునకే ఇయ్యి, కాని ఈ వివాదంలోమాత్రం సత్య నిర్ణయం చెయ్యి- అని అడుగగా ప్రహ్లాదుడు- సుధన్వా! సత్యం భాషించకుండా అసత్యాన్ని పలికే వక్తికి కలిగే స్ధితి ఏమిటో నాకు చెప్పు_ అన్నాడు.

"Brahmin, Virochana is my only son. If you ask me about the best man, how can I answer it?" said Prahlada.

"King, you can give all of your wealth to your son. But you must decided on the best man" said Sudhanva.

సవతులుగల స్రీకి, ద్యూతంలో ఓడిన జూదరికీ, భారవాహకుడికీ రాత్రివేళల ఏస్థితి కలుగుతుందో అన్యాయ నిర్ణయాలు చేసేవారికి అదేస్థితి కలుగు తుంది. అసత్యనిర్ణయం చేసే రాజు బంధితుడై క్షుద్భాధ ననుభవిస్తూ శత్రువుల సంతోషం చూడవలసిన స ్థితిలో పడతాడు. గోవుకొరకు, పశువు కొరకు, అశ్వముకొరకు, మనుష్యునికొరకు అనృత మాడేవాడు (అబద్ధం చెప్పేవాడు) క్రమంగా ఐదు, పది, నూరు, వేయి తరాలవరకూ నరకంలో ఉంటాడు. స్వర్ణంకోస౦ అసత్యం పలికేవాడు భూతభవిష్యత్ఫలాలను కోల్పోతాడు. భూమికోనం స్త్రీ కోసం అనృతమాడే వాడు సర్వనాశనం చేసుకుంటాడు. అని సుధన్వుడు చెప్పగా ప్రహ్లాదుడు తన కుమారుని వైవు తిరిగి. నాయనా! సుధన్వుని తండ్రియైన అంగిరసుడు నాకంటె శ్రేష్ఠుడు. వీనితల్లి నీతల్లికంటె శ్రేష్ఠురాలు. అందుచేత నువ్వ సుధన్వునికంటె గొప్పవాడవు కాదు. ఇప్పుడు నువ్వు సుధన్వుని చేతులలో ఉన్నావు_ అని పలికి సుధన్వునివైవు తరిగి - బ్రాహ్మణ దేవతా! నువ్వనుగ్రహిస్తే నా కుమారుడు నాకు దక్కుతాడు- అన్నాడు.

"A man making an unjust decision will attain the same state at night as that of a woman sharing her husband with many women; a gambler losing his bet; a man carrying heavy loads all day. A lying king will be captured by the enemy and subjected to hunger by watching his enemy rejoice. A man lying for the sake of a cow, ox, horse and another man, will have the progeny suffer in hell for a long time. A man lying for gold will lose the fruits of past and future karma. One lying for land and a woman will be totally annihilated" said Sudhanva.

Prahlada turned to Virochana and said "Sudhanva's father Angirasa is better than me. His mother is superior to yours. Hence you are not more eminent than him. Now you are in the hands of Sudhanva".

Then Prahlada turned to Sudhanva and said "Brahmin, if you are considerate I will get my son back".

ప్రహ్లాదా! నువ్వు ధర్మాన్నిస్వీకరించి సత్యం భాషించావు. కనక నీకుమారుని నీ కిస్తున్నాను. కాని వీడు కేశిని సమక్షంలో నా కాళ్ళు కడగాలి అన్నాడు

"Prahlada, you accepted dharma and spoke the truth. So I am giving your son back. But he should wash my feet before Kesini" said Sudhanva.

అని విదురుడు ఆ గాధను ముగించి. మహారాజా! ఈ ఉపాఖ్యానం విన్నారుకదా ! అందుచేత మీరు మీ కుమారులకోసం స్వార్ధవశీభూతహృదయ౦తో అసత్యమాడకండి. అసత్యమాడి సర్వనాశనానికి దారి తియ్యకండి.

Thus ending the story Vidura said "King, like in the story narrated, you should not lie for the sake of your sons out of selfishness and for gaining an upper hand. Don't lie and cause total destruction"

No comments:

Post a Comment

Viveka Sloka 22 Tel Eng

Telugu English All విరజ్య విషయవ్రాతాద్దోషదృష్ట్యా ముహుర్ముహుః । స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే ॥ 22॥ ముహుర్ముహుః ...