Friday, March 8, 2024

Vidura Neeti Part 3




పాండురాజు శాపదగ్ధుడైనా పాండవులైదు గురూ జన్మించారు. ఇంద్రసదృశులైన వారిని చిన్న నాటినుండి మీరే పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పారు. వారు మీ అదేశాలను అంజలిఘటించి అను సరిస్తున్నారు. ఈ నాడు వారి రాజ్యభాగం వారికిచ్చి మీ బిడ్డలతో మీరు నుఖంగా ఉండండి, ఇలా చేసి నట్లయితే దేవతలు సంతోషిస్తారు. ఈ ప్రజానీక౦ మిమ్మల్ని వేలెత్తి చూపదు. అని విదురుడు ముగించాడు.

"Even though Pandu was cursed, the five Pandavas were born after his death. You raised them and made them on par with Indra and Devas in their knowledge and skill. They are following every dictum you have promulgated. So you must give up their share of the kingdom and live happily. This way Devas will be pleased with you. And your subjects won't raise an accusatory finger at you" said Vidura to Dhrutarashtra.

నా మనస్సులోని చింత నాకు నిద్రపట్టనివ్వ డం లేదు. ఇప్పుడు నేను చెయ్యవలసిన పనేమిటో నిర్ణయించి చెప్పు. ధర్మార్థవిదుడవైన నువ్వు బాగా వివేచనం చేసి సత్యపథం నిర్దేశించు. కురుపాండవు లకు ఏది హితమైనదో' దానినే చెప్పు. నా హృదయం అరిష్టాలనే శంకిస్తోంది. కనుక నాకవే గోచరిస్తూ వేదిసున్నాయి. ధర్మరాజు ఏం కోరుతాడో ఆలో చించి చెప్పు - అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించగా విదురుడు మహారాజా ! ఎదుటివాని, పతనాన్ని కోరకుండా చరించే వ్యక్తి అర్థించక పోయినా వానికి కళ్యాణ మార్గమే చెప్పాలి. రానున్న విపత్తులు కూడా సూచించాలి. నేను కళ్యాణప్రదాలూ ధర్మ యక్తాలూ అయిన విషయాలు చెబుతాను వినండి. దుష్టమార్గాన, కపటవ్యవహారాలు సాగించడం కోసం మీరు యత్నించకండి. సన్మార్గాన సదు పాయాలలో కృషిచేసినప్పుడు అది ఫలించక పోయినా ధీమంతుడు విచారించకూడదు.

Dhrutarashtra said "I am sleepless as I am tormented. Please tell me what I need to do. You know dharma and follow it. So you can show me the path of rectitude. Tell me what will be good for the Kuru and Pandava dynasties. My heart is perceiving bad omens. Hence I am troubled and tormented. Tell me what Dharma Raja desires."

Vidura said "King, one who doesn't wish for the downfall of another, should show the morally correct path even when not sought. He should also show the perils that can arise in that path. I will tell you the auspicious things that adhere to dharma. Don't try to lead astray and carry out evil acts. When sticking to morally accepted path, even when an objective is not met, the virtuous man will not be in sorrow."

ఏ ప్రయో జనంతో మనం కర్మ ప్రారంభిస్తున్నామో అది ముందుగా నిశ్చయించుకొని దాని విషయమై పూర్వా పరాలు చింతించి తొందరపడకుండా సావధాన చిత్తంతో దాని పరిణామాలనూ, ఫలితాలనూ పరిశీ లించి ముందడుగు వేయాలి. లాభమూ, హానీ, ధనమూ, దేశకాలస్థితులూ, దండనీతీ ఎరుగని రాజు రాజపదవికి అర్హుడుకాడు. పైవిషయాలన్ని గ్రహించి ధర్మార్థాలయందు సావధానచిత్తుడై చరించేవాడు రాజ్యార్హుడు. రాజపదవి లభించింది కదా అని అనుచితంగా వ్యవహరించకూడదు. వార్ధక్యం సౌందర్యాన్ని హరించేటట్టు, ఉద్దండ వ్యవహారం సంపదలను నశింపచేస్తుంది. గాలము ముల్లుకు గుచ్చబడిన ఆహారాన్ని వాంఛించే మీనం (చేప) దాని పరిణామాన్ని ఆలోచించలేదు.

Whatever good we want to accomplish with our action, we should first decide, think about pros and cons without haste, analyze its consequences and results, and then implement it. A king who doesn't know the benefit and harm of his actions; about the wealth, the space and time, and the penal code is not qualified to rule. One who is knowledgeable about such things and follows dharma and desire, is a capable ruler. One should not behave flippantly on being enthroned. Like old age robs beauty, a long standing dispute dissipates wealth. A fish attracted to a bait is unable to think of the consequence.

పురుషుడు ఈ విషయం గ్రహించి తనకు ఆరోగ్యం కలిగించే వస్తువునే గ్రహించాలి. హితకరమైనదీ, జీర్ణమయ్యేది ఆరగించాలేకాని పచ్చికాయలు కోసి నట్లయితే దానివల్ల రసం సిద్ధించదు. అది వానికి ప్రయోజనకారి కాకపోగా, దాని బీజంకూడా నశిస్తుంది. పక్వఫలాలు స్వీకరించడంవల్ల ఫలరసాలతో పాటు బీజంకూడా నిలబడుతుంది. తుమ్మెద పువ్వులకు ప్రమాదం కలగకుండా మకరందం గ్రోలేటట్టు ప్రభువు ప్రజలకు హాని కలుగకుండా ధనం సంగ్రహించాలి. తోటమాలి చెట్టుకు ప్రమాదం రాకుండా పువ్వులు కోసేటట్లు ప్రభువు ప్రజల నుండి పన్నులు గహించాలి.

One should know this and make a choice that promotes his health. One should eat succulent, digestible foods. Anything that is raw will not have health benefits. It is not only unhealthy to one, its seed will also be destroyed. A ruler should extract money from the subjects like a bee ingesting nectar from flowers without hurting them. Like a gardener collecting flowers from a plant without causing any harm to it, the king should collect taxes from his subjects.

ఒకానొక కార్యం చెయ్యబోయేముందు దాని వల్ల సిద్ధించే ప్రయోజన అప్రయోజనాలను ముందు గనే నిర్ణయించుకోవాలి. అసాధ్యాలకోసం కృషి చెయ్యడం అనవసరం అని తెలిసికూడా కృషి చేస్తే అది వ్యర్థమే కదా, అనవసర౦గా క్రోధం కలిగే వానిని, అకారణంగా సంతోషించే వానిని ప్రజలు రాజుగా గ్రహించరు. నపుంసకుని భర్తగా వరించే స్తీ ఎవరు? స్వల్పకృషితో మహ త్తరఫలాలనిచ్చే కార్యాలవైపే ధీమంతుడు తన బుద్ధిని మరల్చు తాడు. అనురాగహృదయంగల పుభువు ప్రజల ఆదరానికి పాత్రుడౌతాడు. ప్రభువు పుష్పితవృక్షం వలె ప్రసన్నుడై ఉండాలేగాని అధికఫలాల నందివ్య గూడదు. అల్పశక్తియుతుడైన ధీరునివలె గోచ రించాలి, మనోవాక్కాయకర్మలతో పూజలకు సం తోషం కలిగించే ప్రభువు పుఖ్యాతు డౌతాడు. భయంకరుడైన ప్రభువును ప్రజలు పరిత్యజిసారు, ప్రభంజనం కారు మేఘాలను ఛిన్నాభిన్నం చేసి నట్టు దుష్కర్మలు రాజ్యాన్ని పాడుచేస్తాయి. పరం సరాగతంగా సజ్జను లాచరించే మర్గాన నడిచే మహీ పాలునికి సిరిసంపదలతో రాజ్యం వృద్ధినొందుతుంది. ధర్మమార్గం విడిచి అధర్మంగా పోయే ప్రభువు ఏలుబడిలోని రాజ్యం నిప్పుమీదపడ్డ చర్మంలా ముడుచుకుపోతుంది.

When beginning a task one has to weigh its benefits and harm ahead of time. That which is impossible to attain should not be pursued as it is a waste of time. One who goes into fits of rage or feels happy without a reason is unfit to be a king. Which woman will marry an impotent man? An able person focuses his mind to achieve greatest results with tasks that don't need a great deal of effort. A king should be calm as a flowering plant and not give exaggerated rewards. One should be brave even if weak. A king who brings happiness to subjects with his speech and actions will be most famous. A cruel king will be shunned by the subjects. Like a storm that disperses clouds hither and thither evil acts cause peril to the kingdom. When a king follows the path of noble men, he will attain great wealth and be prosperous. When a king rejects dharma and carries out evil actions, his kingdom will shrink like skin on fire.

పరరాజ్యసాధనార్థం చేసే ప్రయత్నాలతో బాటు స్యీయరాజ్య సంరక్షణానికి కూడా కృషి అవసర౦. ధర్మంతోనే రాజ్యాన్ని సంర క్షి౦చాలి. ధర్మబద్ధుడైన రాజును రాజ్యలక్ష్మి విడువదు. అధిక ప్రసంగులనుండీ, ఉన్మత్తులనుండీ, ప్రలాపకులనుండీ, బాలురనుండీ సారవిషయాలు, శిలల నుండి బంగారం గ్రహించునట్లు గహించాలి. శి‌లోంఛ వృత్తితో జీవితం సాగించేవానివలె ధీరులు భావపూర్ణశబ్దాలనూ, సూక్తులనూ, సత్కర్మలనూ గ్రహించాలి. వేదాలవల్ల విప్రులూ, గంధంవల్ల గోవులూ, గూఢచారులవల్ల రాజులూ, నేత్రాలతో ప్రజలూ వాసనలను గ్రహిస్తారు.

The king trying to acquire other kingdoms should first take care of his own kingdom. He should rule with dharma. The goddess of wealth won't abandon such a ruler. From the children, the deluded, and the pompous one should extract the essence like gold from rocks. Like one who collects the grain after harvest, the ruler should grasp from thoughtful words, wise aphorisms and good karma. Those who reap benefits such as brahmins from vedas; cows from odor; kings from spies, subjects with eyes; make inferences as per their memories.

పొడిచే ఆవు క్లేశాలే పొందుతుంది. సాధువుగా నిలబడి పాలిచ్చే ఆవును ప్రజలు బాధించరు. మృదువైన లోహాన్ని అగ్ని తప్తం చెయ్యనక్కరలేదు. వంగేకర్రను వంచ డానికి పయత్సించేవాడుంటాడా? ఇది గ్రహించిన ధీమంతుడు బలిష్టులముందు తనే వంగుతాడు. అందువల వానికి అవనతికాదు. పైగా ఆలొంగు బాటు ఇంద్రునికి నమస్కరించడంవంటిది.

A mad cow experiences strife. People won't hurt a cow that gives milk peacefully. There is no need to melt a piece of soft metal. Will anyone try to bend a supple stick? Knowing this, a virtuous one will bow before the strong and powerful. There is no loss of prestige in doing so. Besides, it is like bowing before the Indra Deva to show one's respect.

పశురక్షకుడు మేఘుడు. ప్రభుసహాయకుడు మంత్రి. స్త్రీకి అప్తుడు భర్త. బ్రాహ్మణులకు వేదాలే బంధువులు. సత్యంచేత ధర్మం రక్షింపబడుతుంది. విద్య యోగరక్షితము. సౌందర్యానికి శుభత రక్షణాధారము. నీచకులజు డైనా సదాచారంవల్ల శ్రేష్ఠు డౌతాడు. పరధనాన్నీ రూపపరాక్రమ సౌభాగ్య సన్మానాలనూ ద్వేషించేవాని రోగం మందులతో కుద రదు. అకార్యాలాచరించడంవల్ల, చేస్తున్నపనిలో ప్రమాదాలు కలుగచెయ్యడంవల్ల, కార్యసిద్ధికి పూర్వమే ఆ రహస్యం ప్రకటించడంవల్ల భయంకర స్టితుగతు లేర్పడతాయి.

Like the god of clouds who protects the cows, a minister assists a king. Husband is the best friend of a woman. Vedas are the good companions of brahmins. Dharma is protected by truth. Enlightenment in yoga protects knowledge. For beauty, good conduct is the guardian. Even if born in the lowest varna, one who has good conduct will be respected. There is no medicine to cure one who is jealous of others' wealth, valor, accomplishments, and accolades. By performing evil acts, causing loss in actions being carried out, revealing the secrets before completing the task, danger awaits a king.

విద్యా ధన కుల మదాలుండకూడదు. ఈ మూ డూ సజ్జనులకు దాంతిని కలిగిస్తాయి. ఉత్తములకు సహాయం చేసేవారు సత్పురుషులు. ఉన్నత వేష భాషలు సభనలరిస్తాయి. గోవు మధురరసాల నిస్తుంది. వాహకుడు మార్గాయాసం పొందడు, ఉత్తమశీల స్వభావాలు కలవాడు సర్వులనూ జయి స్తాడు, వ్యక్తికి ప్రధానమైన శీలం నశిస్తే వాని జీవితం వ్యర్థమే. ధనమదోన్మత్తుని ఆహారంలో మాంసమూ, సామాన్యుని ఆహారంలో క్షీరరసమూ, దరిద్రుని భోజనంలో తైలమూ అధికంగా ఉంటాయి. దరిద్రులకు ఆకలి యెక్కువ. ధనికుడికి జీర్ణశక్తి తక్కువ. దరిద్రుని ఉదరంలో కాష్టమైనా జీర్ణ మవుతుంది. అధముడు జీవితానికి, మధ్యముడు మృత్యువుకూ, ఉత్తముడు అవమానానికి భయపడతారు. ఐశ్వరం కలిగించే మదంకంటే సురాపాన మదం అధిక మైనదేమీకాదు. ఐశ్వర్యమత్తుడు సంపదలు నశిస్టేకాని ఆ మత్తును వదలలేడు. సూర్యాది గ్రహ పరిభృమణవలయంలో ఉండని తారకల వలె అదుపులో లేని ఇంద్రియాలు కష్టభాజకాలే.

One should not be egotistical because of education, wealth or varna. People of good conduct help the noble. The king's court will be adorned by ones who have good personality and behavior. A cow gives tasty dairy products. One riding a palanquin won't be tired. A chaste and virtuous person will win the hearts of all. If a man loses his character he will become a failure in life. In the food of the wealthy and proud abundance of meat; of the commoner excess of milk; of the pauper too much of oil will be found. The pauper has too much hunger and is not easily satiated; and he can digest even a corpse. The lowly person is afraid of life, the person in the middle path is frightened by death and the noble one is wary of insults. There is no difference between the intoxication due to riches and alcohol. The wealthy won't be able to come out of stupor until their wealth is wiped out. Just as the stars that don't fall in the gamut of the sun and the moon, the uncontrolled senses cause grief.

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...