Saturday, March 23, 2024

Vidura Neeti Part 6




మానవుడు తాను ఎవరిని సేవిస్తాడో ఎవరినరాలలో మెలుగుతూంటాడో ఎటువంటి పరిణామం వాంఛిస్తాడో అది పొందుతాడు. ఏవిషయాలు మనస్సు నుండి తొలగించాలనుకుంటాడో వాటినుండి విముక్తి పొందుతాడు. ఇందువల్ల వానికి దుఃఖం లేదు. ఒకరిని జయించాలని కాని బాధించాలని

A man gets what he desires depending on whom he serves and what he expects. He will be free from unwanted desires if he exercises free will. One who doesn't wish to conquer others, won't try to blame or praise others will be free from sorrow and happiness. One who wishes the best for others, never wants others to suffer, always speaks the truth, conquers his senses, always is soft-spoken is the best among the men.

కాని ఎవడు భావించడో, ఒకరిని నిందించడానికి ప్రశంసించడానికి ఎవడు ప్రయత్నించడో వాడు విచారసంతోషాలకు దూరంగా ఉంటాడు. అందరి సౌఖ్యాన్నీ కోరేవాడూ, ఎవరికీ అనిష్టం జరగాలని తలంచనివాడూ, సర్వకాలాలయందు సత్యమే పలికే వాడూ, జితేంద్రియుడూ, కోమలస్వభావుడూ,

One who keeps his word, shows empathy without impure thoughts, knows the faults of others is the next best among the men.

ఉత్తమ పురుషుడు. వాగ్దానంచేసి తదనుసారం ప్రవర్తించేవాడూ, నిష్కల్మషంగా సానుభూతిని ప్రదర్శించేవాడూ, ఇతరులదోషాల నెరిగినవాడూ మధ్యముడు. కఠోరశాసనాలతో క్రోధవశుడై సర్వజనులకూ అపకారం తలపెడుతూ, మిత్ర రహితుడై కళంకజీవితం గడిపేవాడు అథముడు.

One who promulgates draconian laws with cruelty, causes harm to others, lives without friends and leads a terrible life is lowest among the men.

తనను తనే శంకించుకుంటూ ఇతరుల వల్ల ఏ ప్రయోజనము జరగదని నిశ్చయి౦చుకొని స్నేహితులకు దూరంగా ఉండేవాడు అధమాధముడు.

One who doubts himself, thinks nothing good will come out of befriending others is the lowest of the lowest among men.

మన ఐశ్వర్యం వృద్ధిపొందాలంటే ఉత్తమ పురుషులతో సాంగత్యంకావాలి. అవసరానుసార౦ అధమజన సంసేవనంకూడా అవసరమే, కాని ఈ అధమపురుషులతో అధికకాలం ఉండరాదు.

To multiply our wealth we have to befriend the best among the men. Depending on the circumstance befriending other kinds of men is alright. But such friendship should not last forever.

మానవుడు దుర్జనసాంగత్య బల౦ వల నిరంతర ప్రయత్నంవల్ల పురుషార్థ ప్రయోగంతో ధనార్జన చెయ్యవచ్చు. కాని తన్మూలంగా వాడు ఉత్తమ పురుషులవల్ల సన్మానం పొందలేడు.

One by befriending the wicked and evil men may become wealthy. But he can't earn the praise of noble men.

ధృతరాష్ట్రుడు:- ధర్మార్థాలను అనుష్ఠించే దేవతలుకూడా ఉత్తమకులంలో జన్మించిన పురుషులనే సమ్మానిస్తారు, ఈ మహాకులీనులనగా ఎవరు?"

Dhrutarashtra asked "The Devas who pursue dharma and wealth will felicitate the best among the men. Who are the men in good lineage?"

విదురుడు:- ప్రభూ! జితేంద్రియుడై యజ్ఞము తపస్సు అన్నదానము సదాచారంతో సాగిస్తూ, మనస్పును వశంలో ఉంచుకొని, వివాహబంధాన్ని పవిత్రంగా నడిపేవాడు, ఉత్తమకులీనుడు, భ్రష్ట్రం కాని సదాచారాలతో తల్లిదండ్రులకు ఏమాత్ర౦ నష్టం కలగకుండా ప్రసన్న చిత్తంతో ధర్మాచార పరాయణుడై, అనృతమాడకుండా వంశాభ్యుదయాన్ని కోరేవాడు మహాకులీనుడు.

Vidra replied "King, one who conquers senses; performs yagnas, penance and alms; controls his mind; discharges household duties with pure heart is a person of good lineage. One who serves his parents with dedication, follows dharma, never lies, strives for the enrichment of his family is a person of the best lineage.

యజ్ఞకర్మ నిర్వర్తించకపోయినా దోషభూయిష్ట వంశంనుండి కన్యను పరిగ్రహించినా, వేదాన్ని త్యజించినా ధర్మాన్ని ఉల్ల౦ఘించినా అధమకులమే ప్రాప్తిస్తుంది. దేవ బ్రాహ్మణ మాన్యాలు హరించినా, విప్ర మర్యాదలు ఉల్లంఘించినా, సుకులీనుడు అధముడౌతాడు.

One who doesn't perform yagna, marries a woman from a family with infamy, rejects vedas, confiscates the land belonging to brahmins and Devas, fails to honor brahmins, even if he is of good lineage will turn into the lowest among the men.

విప్రులను అనాదరించినా, అందరినీ నిందించినా, దాచబెట్టిన వస్తువులను దొంగిలించినా పై స్థితియే మానవునకు కలుగుతుంది. గో, ధన, జన, సంపత్తులున్నా సదాచారం లేకపోతే వాడు మహి కులీనుడు కాడు. ఆచారసంఫత్తి సక్రమంగా సాగితే కులీనత సిద్ధిస్తుంది. అందుచేతనే సదాచారాలను ప్రయత్న పూర్వకంగా రక్షించుకోవాలి.

One who insults brahmins, blames everyone, steals will become the lowest among the men. Despite having cows, wealth, servants, if one doesn't have good conduct he can't be the best in the varna. After performing good acts regularly he may reverse the course. Hence we have to strive to perform good acts.

ఈ సంపదలున్నవే యివి వస్తూ పోతూ ఉంటాయి, కాని సదాచారం అటువంటిదికాదు. సంపద క్షీణించినంతలో సదాచారం క్షీణించదు. ఆచార భ్రష్టుడు మృతకల్పుడు. అచారహీనుడు సర్వైశ్వరాలతో ఉన్నా ఔన్నత్యం పాందలేడు. పరధనాపహరణకు ప్రయత్నించేవాడూ, స్వకులంలో ముసలం పెట్టే వాడూ, మిత్రద్రోహి, కపటస్వభావుడూ, అసత్యవాది, ఉత్తములు కారు. అదేరీతిగా మాతాపితరులకు, దేవతలకు ఆహారమివ్వకు౦డా ఆరగించేవాడూ, బ్రహ్మహంతకుడూ, బ్రహ్మద్వేషి, పితృతర్పణ రహితుడూ, మన నభలోకిరాకూడదు.

Wealth comes and goes. But good conduct is not like that. Even when wealth shrinks, good conduct won't disappear. One who violates customs and doesn't have good conduct is dead for all practical purposes. Without good conduct, even if one is rich, he can't gain fame. One who tries to steal others' wealth, creates conflict in his varna, betrays his friends, wicked, a liar is not the best among men. One who ingests food without first offering to Devas and parents, abuses Brahma, doesn't propitiate ancestors, should not be entertained in King's court.

మధురమైన వాక్కూ , ఆస్వాదయోగ్యమైన జలమూ, అవసరమైన స్థలమూ, దర్భాసనమూ ఈ నాల్గింటికి సజ్జన గృహాలలో లోటురాదు. ఈ నాలుగూ ధర్మపురుష గృహాలలో శ్రద్దతో చూపబడుతుంటాయి.

There is no dearth of soft spokenness, drinkable water, needed land, a seat made of dry grass in the houses of men with good conduct. These four will be available in the homes of men of good conduct.

రథం చిన్నదైనా ఎంతో బరువు మొయ్య గలుగుతుంది. కాని ఎంత పెద్దదైనా కర్రకు బరువు మోసే శక్తి లేదు. అదేరీతిగా ఉత్తమకులంలో ఉన్న వారు ఎంతటి భారమైనా భరించగలరు.

A chariot can carry many times its weight. The same can't be done by a stick no matter how big it is. Similarly men born in higher varnas can carry any burden easily.

ఎదుటి వారి కోపానికి భయపడి వారివల్ల ప్రమాదాన్ని శంకించి చరించేవాడు మిత్రుడుకాడు. పితృతుల్యంగా విశ్వసించ తగినవాడే మిత్రుడు. మిగిలిన వారు సహచరులు మాత్రమే. ఇతఃపూర్వము ఏ సంబంధమూ లేకపోయినా మైత్రిని ప్రకటిస్తూ సహాయకుడై, అశ్రయుడై, అచంచల చిత్తుడై, వృద్దసంసేవకుడై ఉండేవాడే మిత్రుడు.

One who fears others' anger and behaves expecting danger from others is not a friend. One who can be trusted like a father is the real friend. The rest are only acquaintances. Without prior relationship, one who declares friendship, offers help unconditionally, seeks refuge, behaves with a steady mind, serves old people is the real friend.

ఎండిన కొలనుచుట్టూ హంనలు తిరగవచ్చు. కాని అందులోప్రవేశించవు. అదేరీతిగా చంచలుడూ, అజ్ఞానీ, ఇంద్రియలోలుడూ అయినవానిని, లక్ష్మి వరించదు. మెరుపువలె అతి చంచలమైనది దుష్టస్వభావము. వారికి అకస్మాత్తుగా ఆగ్రహమూ అనుగ్రహమూ కూడా కలుగుతాయి. కృతఘ్నుల మాంసము జంతువులు కూడా ముట్టవు.

Swans might go around dried lakes, but they won't enter them. Similarly wealth won't stay with a fickle minded, ignorant, and one subservient to his senses. The conduct of evil men is unstable like lightning. They feel rage and benevolence suddenly. The betrayer's flesh won't be touched even by animals.

సిరిసంపదలున్నా పోయినా, మిత్ర సత్కారం జరుగుతూనే ఉండాలి. మిత్రుల శక్తియుక్తులను పరీక్షిస్తూ కూర్చోకూడదు. సంతాపం వల్ల బలమూ, రూపమూ, జ్ఞానమూ నశిస్తాయి. అంతేకాని అభీష్ట వస్తువులు సిద్ధించవు.

Regardless of wealth, one has to honor his friends. One should not keep on testing his friends' strength and wisdom. With sorrow, strength, beauty and knowledge will shrivel and one won't be able to fulfill desires.

మహారాజా! అందుచేత మీరు సంతాపం విడిచి పెట్టి ప్రసన్నచిత్తంతో ఉండండి. జనన మరణాలు జీవికి ఎన్నోసార్లు కలుగుతూంటాయి. సుఖదుఃఖాలు, లాభనష్టాలు ప్రతిప్రాణికి నహజమే. అందుచేతనే ధీరుడు వీటివిషయంలో హర్షశోకాలు పెంచుకోడు. ఈ ఇంద్రియాలున్నవే అవి మిక్కిలి చంచలమైనవి. ఏ ఇంద్రియం విషయాసక్తమౌతుందో అటువైవు బుద్ది క్షీణీస్తూంటుంది. కుండకు ఏవైపున రంధ్రమేర్చడితే అటునుండే కదా నీరు పోతుంది!

King, hence give up sorrow and remain calm. A jiva will experience birth and death several times. Happiness-sorrow, profit-loss are natural to every jiva. Hence one who is strong minded won't be dejected or elated. The senses are the most fickle. Like water leaking in whichever location a pot has a hole, the intellect will drain depending on which sense organ is in bondage with worldly matters.

ధృతరాష్ట్రుడు: . సూక్ష్మధర్మబంధితుడూ శిఖాసంశోభితుడూ అయిన ధర్మరాజుతో నేను కపట వ్యవహారం సాగించాను. పర్యవసానంగా వారు యుద్ధం చేసి నాకుమారులను సంహరిస్తారు. ఇది నా హృదయాన్ని వేధిస్తోంది, దీనిని వదులు కొనే శాంతిమార్ధం చెప్పు,

Dhrutarashtra said "I behaved wickedly with Dharma Raja who is an embodiment of good qualities and dharma. So he and Pandavas will kill my sons in the battle field. This has been tormenting me. Please advise me how to overcome it."

తపస్సూ ఇంద్రియ నిగ్రహమూ, విద్య తప్ప శాంతిసాధనా లేమి లేవు, లోభరహిత బుద్దితో చరించిన వానికి ఏ హానీ ఉండదు. మన బుద్ధితో మన భయాలను దూరం చేసుకుని తపస్సుతో ఉత్తమ పదం పొందగలం. గురుశుశ్రూషతో జ్ఞానం సిద్ధి స్తుంది. యోగంవల్ల శాంతి కలుగుతుంది. మోక్ష వాంఛ కలవాడు వేద దాన సంజనితమైన పుణ్యాన్ని ఆశించక నిష్కామదృష్టితో చరిస్తూంటాడు. సక్రమ విధానంగా చేసిన వేదాధ్యయన ఫలమూ, న్యాయంగా చేసిన యుద్ధఫలమూ, పుణ్యకర్మల ఫలమూ, తపః ఫలమూ అంతమందే సౌఖ్యమిస్తాయి.

Penance, control of senses, knowledge acquisition are the only ways to attain peace. One who doesn't covet will not meet with harm. With a good mind, one can overcome fears. With penance one can attain a better after life. By serving a guru, knowledge is acquired. By the practice of yoga peace will be attained. One who is interested in salvation, will not desire the fruit of karma and acts dispassionately. The fruit of reciting vedas, battles fought for just reasons, good karma and penance will give pleasure in the end.

విద్వేషం కలవారు హంసతూలికా తల్పంమాద శయనించినా సుఖంగా నిదురపోలేరు. పరిసరాలలో వంది మాగధ నారీజనులు సంకీర్తనలు చేస్తున్నా సంతోషించలేరు. ధర్మమార్గాన చరించలేరు. గౌరవ సుఖాలను అనుభవించలేరు. శాంతిమార్గమూ, హితవాక్యమూ వారికి నచ్చవు. వారికి క్షేమం కలుగదు. వినాశనమే గత్యంతరం.

Those harboring hatred can't sleep well even on a bed made of feathers of swans. Even when great devotees praise the god, they can't remain happy. They can't follow dharma. They can't enjoy honor and comfort. They don't appreciate peace and wise advice. They can't get an auspicious outcome. Their only recourse is self destruction.

బ్రాహ్మణుని తపస్సూ, యువతులయందు చపలత్వమూ, ఆవు దగ్గరపాలవలె ఉంటాయి. అదే రీతిగా స్వజాతి వైరం విసర్గమైన యంవల్ల ఏర్పడడంలో అసంభవం లేదు. అనుదినము నీటితో తడుపబడి పెరిగే లతలు గాలితరంగాలను సహి౦చగలుగుతాయి. అదే రీతిగా సజ్జనులు సా౦గత్యబలంవల్ల క్లేశాలను సహించగలము. కట్టెలు విడివిడిగా పడి ఉంటే పొగలు మాత్రమే వస్తాయి. కలిసినప్పుడు మండుతాయి, అదేరీతిగా బంధుకోటి భేదభావంతో చరిస్తే దుఃఖమే వస్తుంది.

The penance of a brahmin, the infatuation with young women are like cow's milk. Similarly fighting with people of one's own varna will invite trouble from the god of death, Yama. Like lotuses that are tossed by water currents can tolerate wind, the friendship with people of good conduct will overcome obstacles. When firewood is not tied together it will cause smoke but not fire. Similarly one who differs from relationships experiences sorrow.

గో, నారీ, విప్ర స్వజాతిజనులమీద తమ శౌర్యం ప్రకటించేవారు మిగుల ముగ్గిన పండువలె నేలకూలుతారు. చెట్టు తానొక్కటీ పెరిగినట్టయితే బలంగానూ, గట్టి వేళ్ళతోనూ ఉండవచ్చు, కానీ గాలివాన ఒక్క కణంలో దాన్ని ఊడ్చివేస్తుంది. కాని వృక్షసమూహం పరస్పర సహకారంతో ప్రచండానిలాలను సహించగలవు. అదే రీతిగా సద్గుణ సంపన్నుడు ఏకాకిగా ఉంటే శత్రువులు వానిని చెప్పినట్లు ఆ వృక్షంలానే చూస్తారు. కాని కలయికవల్త సరోవరంలోని కమలాలవలె ప్రజలు వర్థిల్లుతారు.

One who shows valor on cows, women, brahmins, men of the same varna will fall like a ripe fruit. A tree may grow tall but by a storm it can be uprooted. Whereas a group of trees, abetting each other, can withstand a cyclone. Similarly a man of good attributes when alone, enemies will overcome him. But when he is not alone and in the company of others, like lotuses in the pond his subjects will prosper.

గోవులు, విప్రులు, కుటుంబ జనులు, స్త్రీలు, బాలురు, శరణాగతులు, అన్నదాతలు, అవధ్యులని విదులు ఘోషిస్తున్నారు. మనుష్యునిలో ఆరోగ్యమూ సంపదా రెండూ తప్ప మరే గుణమూ లేదు. రోగి శవకల్పుడు. రోగరహితంగా పుట్టి శిరోవేదనతో వేధిస్తూ పాపకర్మలకు సహకరించే క్రోధాన్ని దిగమింగి మీరు శాంతి పొందాలి.

Vedas forbid killing cows, brahmins, family members, women, children, those surrendered, those serving food. There is no higher attribute than health and wealth. A diseased is almost dead. You, having been born without an illness, have to attain peace by giving up hatred and not abetting evil acts.

రోగి నోటికి మధురపదార్థాలు రుచించవు. ఏ విష యమూ సుఖాన్నివ్వదు. దుఃఖమే వారిని వేధిస్తు౦టూంది. భోగాలు సుఖాలు దూరంగానే ఉంటాయి. మహారాజా ! ద్యూతసమయంలో వీరు ద్రౌపతినికుడా జయించినప్పుడు ఈ ప్రయత్నం నుండి వీరిని విరమింపజెయ్యమని మీతో చెప్పాను, విద్వాంసులు దీనిని మెచ్చడంలేదని చెప్పాను. కానీ నామాట మీకు చెవిని బెట్టలేదు.

A diseased person can't enjoy food. Nothing gives him pleasure. He feels only sorrow. When Droupadi was being ill treated, I advised you to stop the Kauravas. I told you scholars didn't appreciate it. Despite my warnings, you ignored me.

పైకి మృదువుగా కన్పిన్తూ విరోధభావంతో చరించడం ఎవరికీ మంచిది కాదు. ధర్మసూక్ష్మాలను గ్రహించి, ఆచరించాలి. క్రౌర్యంతో సాధించిన పంపదలు నశిస్తాయి. మృదువ్యవహారమే సంపదలకు శాశ్వతత్వం చేకూరుస్తుంది. కురుపాండవులుభయులూ వైరభావం విడిచిపెట్టి సఖ్యంతో సాగాలి. ఉభయులూ సర్వ సమృద్దితో జీవించాలి.

It is not good for anyone, when one outwardly is friendly but in heart has enmity. One has to understand and follow dharma. Wealth garnered by cruelty will be destroyed. Only good karma engenders permanent happiness and wealth. Both Kauravas and Pandavas should give up enmity and live like friends. Both should enjoy prosperity.

ఈ కురువంశం మీ ఆధీన౦లో ఉంది. కాంతేయులు యింకా బాలురు. వారు ఎన్నో వనవాసక్షేశాలు అనుభవించి వచ్చారు. వారిని రక్షించి మీ కీర్తిని దిగంతవ్యాప్తం చేసుకోండి. అప్పుడు మీ శత్రువులు మీకు భయపడతారు. సత్యప్రియులైన పాండవులతో సంగ్రామం సాగించడం ఉచితం కాదని చెప్పి దుర్యోధనుని వారించండి.

The Kuru dynasty is in your control. The Pandavas are still young. They suffered by staying in the forest. By protecting them, you will attain name and fame in all lokas. Then your enemies will fear you. Advise Duryodhana that it is not proper to battle with Pandavas who follow dharma and truth.

మహారాజా ! స్వాయంభువమనువు మనుష్యులను కొన్ని తరగతులుగా విభజించాడు. వారి వివరాలు వినండి. ఆకాశాన్ని తమ గుప్పిడితో వేధించ పృయత్నించేవారూ, ఇంద్రధనస్సును వంచడానికి యత్నించేవారూ, సూర్యకిరణాలను పట్టుకోవడానికి (పయత్నించేవారూ ఉన్నారు. వీరినందరినీ యమ దూతలు నరకానికి తీసుకొని వెడతారు. శత్రువును

King, Swaayambhu Manu classified men into various categories. Those who try to capture sky in their fists, bend the rainbows, catch the rays of sun, will be taken to hell by the soldiers of Yama. Those who serve enemies, treat scholars as servants, rescue a woman who doesn't deserve help, beg the unqualified men, perform despicable acts even when born in a superior varna, develop enmity with stronger people, advise one who has no stable mind, desire for things that should not be desired, seek company of daughters-in-law, lust for women, forget the favors done by others, give alms and advertise before others, assert lies as truth will meet with self destruction.

సేవించేవారు, యోగ్యులను శాసించేవారు, అనర్హ స్త్రీని రక్షించేవారు, అమె ద్వారా అత్మకళ్యాణ౦ కోరేవారు, అయోగ్యులను యాచించేవాడు కులీనుడై జన్మించి నీచకర్మలు చేసేవాడు, దుర్బలుడై బలిష్టు లతో వైరం పెంచుకొనేవాడు, శ్రద్ద లేనివానికి ఉపదేశమిచ్చేవాడు, కోరరాని వస్తువులను కోరేవాడు, కోడలితో పరిహాసాలాడేవాడు, ఏకాంత౦లోఆమెతో చరించి ప్రతిష్ఠను నిలబెట్టుకో ప్రయత్నించేవాడు, పరస్త్రీ సంగమం చేసేవాడు, మహిళామణులను నిందించేవాడు, యితరులనుండి గ్రహించినదానిని విస్మరించేవాడు, దానంచేసి ఆవిషయాన్ని పదిమంది ముందు ప్రకటించుకొనేవాడు, అసత్వాన్ని సత్యంగా ప్రతిపాదించేవాడు, అని మనువు మానవుల పతన తరగతులను విభజించాడు,

మహారాజా ! ఎదుటిప్రాణి తనతో ఎలా వ్యవహరిసే తానుకూడా వారితో ఆలానే వర్తించాలి. కపట వ్యవహారానికి కపటపువృత్తియే ఉచితవ్యాపారం. సక్రమ వ్యవహారానకి సన్మార్గమే ఆధారము. వార్ధక్యం రూపాన్నీ, ఆశ ధైర్యాన్నీ, మృత్యువు (పాణాన్నీ, దోషదృష్టి ధర్మాన్నీ, కామం సిగ్గునూ, నీచపురుషసంసేవనం సదాచారాన్నీ, క్రోధం సంపదలనూ, అభిమానం సర్వస్వాన్నీ నశింపజేస్తాయి అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన సందేహాలను నివారించుకొనేందుకు తిరిగి ప్రశ్నిస్తున్నాడు.

King, we should do to others what we want others to do unto us. Evil conduct has to be countered with evil. A good act is based on good conduct. Old age destroys youth, greed overrides courage, death robs life, wicked acts violate dharma, lust overcomes shame, service to low lives destroys good conduct, hatred removes wealth and ego destroys everything.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...