Saturday, March 30, 2024

Vidura Neeti Part 5




గోపాలకులవలె ఆందరినీ దేవతలు అనుక్షణం రక్షిస్తూ ఉండరు, వా రెవరిని రక్షించగోరుతారో వారిని సక్రమమార్ధాన నడుపుతారంతే. మానవుడు తన మనస్సును కళ్యాణమార్గాన నడిపితే వాని అభీష్టాలు సిద్దిస్తాయి. కపటవ్యవహారం, మాయోపాయం పాపహేతువులే అవుతాయి.

Like cow herders protecting cows, Devas won't be protecting one at all times. They will only be guiding in morally upright path. When one makes mind traverse on a path of rectitude all of his wishes will be fulfilled. Wickedness, evil acts engender sin.

రెక్కలు రాగానే పక్షులు గూళ్ళు విడిచేటట్లు అంతిమకాలంలో వేదాలు కూడా మనిషిని విడుస్తాయి. సురాపానమూ, కలహమూ, భార్యాభర్తల మధ్య ద్వేషాలు పెంచడమూ, సాంఘిక వైరమూ, కుటుంబజనులలో విభేదాలు పెంచటమూ, స్త్రీ పురుపులమధ్య వివాదమూ, రాజుతో వైరమూ ఉచితంకాదు.

Just as chicks fly away from the nest, vedas leave a man in the throes of death. Intoxicants, bickering, enmity with society and family members, argument between men and women, dispute with the king are not recommended.

సాముద్రికుడూ, చోరుడై వ్యాపారంచేసేవాడూ, జూదరీ, వైద్యుడూ శత్రువూ, మిత్రుడూ, నటకుడూ సాక్షులుగా పనికి రారు. స్వాధ్యాయమూ, మౌనమూ, అగ్నిహో త్రమూ , యాగానుష్టానమూ భయవిదూరకాలు.

A navigator of seas, one doing business like a thief, a gambler, a physician, an enemy, a friend, an actor should not be used as witnesses. Self study, silence, fire ritual, practice of yoga will remove all fears.

ఇళ్ళకు నిప్పుపెట్టేవాడు, విషం త్రాగించేవాడూ, జారులవల్ల కలిగిన సంతానధనం తినేవాడూ, సోమరసం విక్రయించేవాడూ, శస్త్రాలు నిర్మించే వాడూ, మోసగాడూ, మిత్రద్రోహీ, పరస్త్రీ ల౦ప

An arsonist, one who makes others drink poison, one who enjoys the wealth of children from an adulterer, one who sells the fruit of a yagna, a cheater, a betrayer should not be befriended.

సత్పురుష సాంగత్యంవల్ల యీ గుణనంపదలు లభిస్తాయి. తపో, యజ్ఞ, దానాధ్యయనాదులు సజ్జన సాంగత్యంవల్లనే కలుగుతాయి. సజ్జనులు సత్య వ్రతంతో మృదుస్వభావంతో కోమలహృదయులై ఇందియనిగ్రహంతో చరిస్తారు. దంభాచారి తపో, దాన, యజ్ఞాధ్యయనాలను భేషజానికి సేవిస్తాడు. దయ, క్షమ, నిర్లోభము, సత్యము ఉత్తములనుష్టిస్తారు.

Penance, yagna, giving alms, are possible by befriending men of good character who don't lie, are soft spoken, and are pure in their hearts. A pompous person does penance, conducts yagna, gives alms to enhance his fame. Kindness, forgiveness, free of covetousness, honesty are the attributes of persons with good character.

ప్రభూ! వృద్దులూ గురువులూ లేనిది సభ కాదు. ధర్మం చెప్పలేనివాడు గురువూ, వృద్ధుడూ కాడు. సత్యబద్దంకానిది ధర్మంకాదు. కపటమైనది సత్యంకాదు. సత్య, వినయ, శాస్త్రజ్ఞాన, కులీన శీల, బల, ధన, శూరత్వ, విద్యా మృదుభాషిత్వాలు స్వర్గహేతువులు.

King, a king's court must have elders and gurus. A person who can't teach dharma is unfit to be considered as a guru or an elder. A thing of lie can't be dharma. An evil thing can't be the truth. Truth, humbleness, knowledge about scripture, good character, strength, valor, soft spokenness are means to attain heaven.

నిందితుడెప్పుడూ పాపకర్మలే చేస్తూ తత్ఫలమే పొందుతాడు. పుణ్యాత్ముడు సత్కర్మలే చేస్తూ స్వర్గం చేరుతాడు. పాపకర్మలు బుద్దిని నశింపచేస్తాయి. బుద్ధిశూన్యుడు పాపాచార పరాయణుడే అవుతాడు. అందుచేత థీమంతుడు సత్కర్మలే ఆచరిస్తూ ఏకాగ్రచిత్తుడై పుణ్యకర్మ రతుడౌతాడు, సద్గుణాలను దోషంగా భావించే వాడూ, మర్మస్థానాలను వేధించేవాడూ. దయారహితుడూ, క్రూరుడూ, శఠడూ కష్టభాజనులవుతారు.

One who is censured always performs sins and receives their fruit. A man of good character performs good karma and attains heaven. Sinful behavior destroys intellect. Hence a learned man performing good acts will be an enjoyer of auspiciousness. One who thinks good attributes are a fault, is devoid of kindness, is always sexually inclined, is cruel experiences difficulties.

ధీమంతుడే పండితుడు. ధర్మార్థాలు వానినే పొందు తాయి. పగలంతా పనిచేసినవాడు రాత్రి సుఖంగా నిద్ర పోగలడు, ఎనిమిదిమాసాలూ కష్టపడినవాడు వర్షాకాలం నాలుగునెలలూ సుఖిస్తాడు, వృద్ధాప్యం వచ్చేలోగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పచన మైన అన్నాన్నీ యవ్వనవతియైన స్త్రీని, విజేతయైన శూరునీ, సంసారసాగరం తరించిన తపస్వినీ ధీరులు గ్రహిస్తారు.

A learned man can only be called a pundit. Dharma and wealth accrue to him. One working hard all day can rest well at night. One who works for eight months, will enjoy the rainy season. One has to plan for old age ahead of time. Cooked food, a youthful woman, a victor in a valorous event, an ascetic who discharged his duties as a house holder are beholden by learned men.

అధర్మదోషంవల్ల లభించే సంపదులు నిలబడవు. మరికొన్ని దోషాలుకూడా దాన్ని చేరు తాయి. ఇంద్రియాలను వశపరచుకుని శాసించగల వాడే గురువు. దుష్టులను దండించగలవా డే రాజు. చాటుమాటున పాపాలను చేసినవారిని శిక్షించేవాడే యముడు.

The money earned by not following dharma will not stay for long. A guru is one who controls his senses. One who punishes evil men is a real king. One who performs sinful acts without getting caught will be punished by the lord of death Yama.

బుషుల, నరుల, మహాత్ముల, స్త్రీ దుశ్చరితుల ఉత్పత్తిస్థానాలు మనకు తెలియవు. బ్రాహ్మణ సేవానిరతుడూ, దానశీలుడూ, మృదు స్వబావుడూ, శీలాచారనపంన్నుడూ అయిన ప్రభువు చిరకాలం పృధివిని పాలిస్తాడు. విద్వాంసుడూ శూరుడూ, సేవాధర్మవిదుడూ అయిన వ్యక్తి పృధ్వీ లతనుండి సువర్ణపుష్పం గ్రహించగలడు. ధీశక్తితో చేసే కర్మశ్రేష్ఠమైనది. బాహుబలంతో జరిగేకర్మ మధ్యమమైనది. జఘనకర్మలు అధమాలు. భార వాహకర్మ అధమాధమము.

We don't know about the reproductive organs of rishis, mahatmas, women and immoral people. A king who worships brahmins, gives many alms, is soft spoken, is of good character will rule for a long time A pundit, a valorous person, one interested in servitude will attain golden flowers from the creeper called earth. Karma done with intellect and understanding is the best. Karma done with strength and hard work is second best. Karma done with lust is the worst. Karma done by carrying heavy loads is the worst of the worst.

ప్రభూ! మీరు దుర్యోధన, దుస్సాసన, కర్ణ, శకుని ప్రభృతులపై రాజ్యభార ముంచి ఉన్నతిని శాంతినీ కోరుకున్నారు. గుణసంపన్నులైన పాండవులపై ద్వేషభావం విడిచి పుత్రవాత్సల్యంతో చరించడమే మీకు ఉచితమైన మార్గం అన్నాడు విదురుడు.

King, you are expecting peace and prosperity by giving authority to Duryodhana, Dussasana, Karna, Sakuni and others. Please give up your malice towards Pandavas and treat them like your own children.

మహారాజా! ఈ విషయంలో ప్రాచీనమైన ఐతిహ్యం ఒకటి ఉన్నది. అది దత్తాత్రేయు సాత్య దేవత సంవాదరూపంగా చెబుతారు. అది వినండి.

King, in this regard there is an old teaching based on the conversation between Dattatreya and Saatya Devas.

దత్తాత్రేయమహర్షి ఉత్తమవ్రతంతో పరమ హంసరూపంలో విహరిస్తున్నాడు. అప్పుడు సాత్య దేవతలు వానిని సమీపించి తమను పరిచయం చేసుకుని. మహర్షీ! మేము మిమ్ము శాస్త్రజ్ఞానులుగా ధీమంతులుగా భావిస్తున్నాము. మాకు ఈ సంపూర్ణశక్తియుతమైన సందేశం వినిపించండి-అని అర్థించారు.

Once Dattatreya, a great ascetic, was approached by Saatya Devas and requested him to give them advice.

సాత్యులారా! మనోనిగ్రహమూ, సత్యపరాయణత్వమూ, ధర్మపాలననిరతీ, జీవితాని కవశ్యమైన వని నేను విన్నాను. ధైర్యంతో పురుషుడు హృదయ కవాటం తెరచి ప్రియాప్రియాలను సమదృష్టితో చూడగలగాలి. ఇతరులు నిందించినా తిరిగి నిందించ కూడదు, అందువల్ల ఎదుటివాని క్రోధం వానినే హరిస్తుంది ఆ క్రోధం వారి పుణ్యాన్ని కూడా నశింపచేస్తుంది. పరులను అవమానించరాదు. దురాచారికారాదు, దురభిమానము ఉండకూడదు. మిత్ర ద్రోహము, నీచసంసేవనము ఉచితమైనవికావు.

Dattatreya said "Control of mind, always conducting in truth, ruling with dharma are necessary in life. A bold man should be equanimous about love and hate. One should not reply in kind when blamed. The opponent's hatred will eventually destroy him. It even exhausts his merit. One should not insult others, perform sinful acts, be an egotist. Betraying friends, serving wicked people are to be avoided.

వ్యర్థక్రోధంతో పరుషంగా భాషించకూడదు. కటు వచనాలు మర్మస్టానాలను వేధిస్తాయి. అందుచేత ఎపుడూ పరుషంగా మాట్లాడకూడదు. పరుషంగా భాషిస్తూ పరులను పీడించేవానికంటె దరిద్రుడు లేడు. నిరంతరం దుర్భాషలాడుతూ జీవించేవాని ముఖంలోనే దరిద్రమూ, మృత్యువూ నివశిస్తాయి. మననుగురించి ఎవరైనా పరుషంగా భాషిస్తూంటే, అకారణంగా మననునిందిన్తూంటే వాడు మన పుణ్య ఫలాన్ని పెంపొందిస్తున్నాడని స౦తోషించాలి. వస్త్ర౦ ఏరంగునీటిలో ముంచబడితే అది ఆ రంగునే పొందుతుంది. అదేవిధంగా సజ్జను డైనవానిని దుర్జ నుడు సేవించి సజ్జనుడవుతాడు. మహాతపస్వియై చోరునీ మూర్టుని సేవిస్తే ఆ తపస్వికూడా మూర్థుడూ చోరుడూ అవకతప్పదు. పరిసరాలూ పరిజనులూ తమ ప్రభావాన్ని ప్రసరిస్తూనే ఉంటారు.

One should not talk harshly with rage. Harsh words weaken reproductive organs. There is no one inferior to one who talks harshly. One who speaks harshly, indulges in inauspicious talk is disgusting and is an embodiment of death itself. One who speaks demeaningly about us, blames us without reason, should be considered as increasing our worth and happiness. A cloth receives the color of the liquid it is dipped in. Similarly a bad person serving a man of good character will turn out to be good. An ascetic serving a fool or a thief will become a fool or a thief himself. Surroundings, servants will influence us.

ఇతరుల విషయంలో పరుష ప్రసంగాలు చెయ్యనివాడు, చేయించనివాడు ఇతరులచేత అవ మానితుడైకూడా ప్రతీకారాన్ని తల పెట్టనివాడూ ఏ అవమానమూ పొందకుండా ఇతరులపై ప్రతీకార చర్యలకు పాహసించనివాడూ స్వర్గానికి వస్తూన్నప్పుడు దేవతలు వానికి స్వాగతం పలుకుతారు. మౌనం భాషణంకంటె ఉత్తమమైనది. సత్య వాక్పాలనం మౌనంకంటె లాభప్రదమైనది. ప్రియ భాషణం ద్వితీయస్థానమే ఆక్రమిన్తుంది. సత్యంతో పాటు అది ప్రియంగా ఉంటే, ధర్మసమ్మతం కూడా అయితే ఆ వాక్కు సర్వవిధాలా ఉత్తమ మైనది

Devas welcome to heaven one who doesn't talk harshly; won't seek revenge despite being insulted; won't avenge without being insulted. Silence is better than talk. Honesty is more meritorious than silence. Speaking good is the next best thing. Speech that is honest, meritorious and dharma is the best.

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...