Saturday, April 6, 2024

Vidura Neeti Part 7




వేదాలు పురుషుని ఆయుఃప్రమాణాన్ని నూరు సంవత్సరాలని నిర్ణయించాయి. అయినా మానవుడు అకాలంలో ఎందుకు మరణిస్తాడు- అన్నాడు ధృత రాష్ట్రుడు.

"Vedas say man lives to be hundred. But some die before. What is the reason" asked Dhrutarashtra.

ప్రభూ! మీకు మేలుకలుగుగాక ! అధికప్రసంగాలూ, క్రోధమూ, అపారమైన అభిమానమూ, త్యాగశూన్యత్వమూ, ఉదరపోషణచింతా, మిత్రద్రోహమూ, అనే ఆరుకరవాలాలు మానవుని ఆయుఃప్రమాణాన్ని తెగనరుకుతూంటాయి. ఇవే వానిని వధిస్తాయి. కావి మృత్యువుకాదు. తనను విశ్వసించినవాని

King, let auspiciousness come to you. Talkativeness, anger, egotism, unable to sacrifice, indulgence in food, betrayal of friends curtail longevity, not death itself.

పత్నితో సంగమించేవాడూ, గురుభార్యతో కామవ్యవహారం సాగించేవాడూ, విప్రుడై శూద్ర స్త్రీని పరిణయ మాడేవాడూ, సురాపానప్రమత్తుడూ, అన్యకులజుడై విప్రులను ఆదేశించేవాడూ, విప్రజీవికను నాశనం చేసేవాడూ, వారిని తన సేవలో నియోగి౦చుకొనే వాడూ, శరణాగతులను హింసించేవాడూ, వీరందరూ బ్రహ్మహత్యాపాతకులు. వీరి సాంగత్యం ప్రాయశ్చిత్తంతో కాని తీరదు. నీతివేత్త, దాత, యజ్ఞ శేషాన్నభోక్త, ఆహింసారతుడు, గురు వృద్ద జనాదేశ పరాయణుడు, అనర్థకార్యదూరుడు, సత్యవాది, కృతజ్ఞుడు, మృదుస్వభావుడు అయిన విద్వాంసుడు స్వర్గం చేరుతాడు.

One who romances with the wife of a friend or his guru; one who is a brahmin marrying a soodra, alcoholic, despite from a different varna commanding brahmins, destroying the lives of brahmins; using brahmins for servitude; torturing those seeking refuge become the sinners on par with the murderer of Brahma Deva. Their sin could not be atoned easily. A wise one, a donor; one who eats after everyone ate during yagna; one who respects guru, elders, subjects; one who doesn't perform meaningless karma; one who always speaks the truth; one who is grateful; one who is soft spoken will attain heaven.

మనకు ప్రియం చెప్పేవారు అనేకులు అయాచితంగా లభిస్తారు. కాని హితవు చెప్పే వక్త దొరకడు. ఆ వక్తకూ శ్రోతలు లభించరు. ధర్మాశయుడై స్వామికి ప్రియాప్రియాలు ఆలోచించి హితవు పలికేవాడు ప్రభు సేవకులలో ఉత్తముడు.

Everyone likes to praise. But few come forward to share wisdom. Such people don't get an audience. One following dharma, thinks of pros and cons while sharing his wisdom with the king, is the best among King's advisers.

కులరక్షణార్ధం వ్యక్తినీ, గ్రామరక్షణార్ధం కులాన్ని, దేశరక్షణకోసం గ్రామాన్నీ, ఆత్మసౌభాగ్యంకోసం పృధివినీ విడిచిపెట్టాలి. ఆపదలనుండి ధనాన్ని రక్షించుకోవాలి. ధనంతో స్త్రీనీ, స్త్రీ ధనాలతో ఆత్మనూ రక్షించుకోవాలి. ద్యూతం (జూదం) కలహహేతువని పూర్వమెందరో ఘోషించారు, కనక ధీమంతుడు కాలక్షేపానికి కూడా ద్యూతప్రసంగాన్ని రానివ్వకూడదు.

To protect varna one can be sacrificed. To protect a village varna may be renounced. To protect the country a village can be sacrificed. To enrich self, one has to renounce the earth. In dangerous times, wealth has to be protected. With wealth one has to protect women. With women and wealth, self has to be protected. It has been said from time immemorial that gambling leads to quarrels. Hence a virtuous one should not dwell on it.

ఈ విషయం ద్యూతారంభవేళ మీకు నేను చెప్పాను. రోగికి పత్యమూ ఔషధమూ రుచించనట్లే నాడు నామాటలు మీకు రుచించలేదు. కాకపక్షాలుగల మీ కుమారులు నెమలిరెక్కలుగల పాండవులను జయించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మృగేంద్రాలను విడిచి సృగాలాలను (నక్కలను)

I told you about this at the beginning of the current crisis. Like one suffering from illness doesn't like the taste of medicine and food, you disregarded my advice. Your sons like crow wings are going after Pandavas like peacock wings. You have taken the side of wolves disregarding lions. Unless death arrives, you won't repent. A king who doesn't show anger at an adviser sharing his wisdom, will be trusted by the subordinates. They won't abandon the king no matter the danger.

రక్షిద్దామనుకుంటున్నారు. కాలమాసన్నమైతేగానీ మీకు పశ్చాత్తాపం రాదు. తన హితాన్ని కోరే సేవకుని యందు క్రోధం చూపని ప్రభువును భృత్యులు విశ్వసిస్తారు. ఎన్ని ఆపదలు వచ్చినా వారు ప్రభువును విడువరు.

సేవకుల జీవితభారాన్ని లక్ష్యం చెయ్యకుండా యితరుల రాజ్యధనాలను అపహరించే ప్రయత్నం చేయకూడదు. భోగవంచితులైన మంత్రులు జీవితం నిర్వహించలేక విద్వేషులతో కలుస్తారు. తమ (పభువును

Kings should not steal the wealth and kingdom of others without taking care of their subordinates first. The ministers deceived by the king and not paid what is due to them, join their hands with enemies of the king. A king has to keep track of income and expenses, must pay appropriate salaries and hire qualified people as subordinates. This way any difficult situation can be overcome. One who understands the mind of the king and completes the tasks in time; one who always tells what is good for the king; a faithful devotee of his king; a man of good character, one who knows the strength and power of the king is equivalent to the king. The king should get rid of one who doesn't finish the tasks assigned by him, one who is arrogant; one who talks in opposition to him.

విడిచిపెడతారు. ఆదాయవ్యయాల ననుసరి౦చి ఉచితరీతిని వేతనాలు యిస్తూ యోగ్యులను సహాయకులుగా గ్రహించాలి. అందువల్ల ఎంతటి క్లిష్టకార్యాలైనా సాధించవచ్చు. ప్రభువుయొక్క అభిమతం గ్రహించి సకాలంలో సర్వకార్యాలు నిర్వర్తించేవాడూ, హితవునే చెప్పేవాడూ, స్వామి భక్తుడూ, సజ్జనుడూ, రాజశక్తిని ఎరిగినవాడూ, ప్రభువుతో సమానుడు. రాజుయొక్క ఆదేశాన్ని పాలించకుండా ఇతర కార్యమగ్నుడై అహంకారంతో ప్రభువును ప్రతికూలిస్తూ ప్రసంగించే సేవకుని ఉత్తరక్షణంలో పరిత్యజించాలి.

అహంకారశూన్యుడూ, శీఘ్రకార్యరహితుడూ, దయాళువూ, పరిశుద్ధ చిత్తుడూ, ఇతరుల ఎరలకులొంగనివాడూ, ఆరోగ్యవంతుడూ, ఉదారవచనుడూ, అయిన వానిని దూతగా గ్రహించాలి. సావధానచిత్తంతో మెలిగే

One humble, not in haste, kind, pure at heart, steadfast without yielding to enticements, healthy, speaks softly should be used as a mediator and a messenger.

వాడు సమయాసమయాలు గుర్తించకూండా కేవల౦ విశ్వాసంతో పరగృహాలకు పోకూడదు. రాత్రివేళల శృ౦గాట కాలలో నిలబడకూడదు. ప్రభువువాంఛించే స్త్రీని అభిలషించకూడదు. దుష్టులైన మంత్రులతో పరివేష్టుతుడై రాజు కొలువులో ఉన్నప్పుడు వానిమాటను ఖండించకూడదు. తన అవిశ్వాసాన్ని ప్రకటించకూడదు. ఆ సభలో ఆసీనుడై ఉండడమే శ్వేయస్కరం కాదు.

One who is alert should not go to others' houses at any time he wishes by believing they can be trusted. One should not bother others at night when they are romancing with their consorts. One should not seek the woman sought by the king. When a king is surrounded by evil ministers, one should not condemn them and reveal his lack of faith. It is better to not even attend such a court. If not, by making an excuse one should leave.

ఏదో యుక్తితో సభనుండి నిష్క్రమించాలి. దయాహృదయుడైన రాజుతో, వ్యభిచరించే స్త్రీతో, పుత్రులతో, సోదరులతో, రాజోద్యోగులతో, పసిపిల్లలు గల విధవతో, సైనికులతో, అధికారం కోల్పోయినవారితో, ఇచ్చిపుచ్చు కొనే వ్యాపారాలు సాగించకూడదు. ఉత్తమకులము, శాస్త్రజ్ఞానమూ, ఇంద్రియనిగ్రహమూ, పరాక్రమమూ, దానశీలమూ, కృతజ్ఞతా స్వభావమూ, మితభాషిత్వమూ గల పురుషులు ప్రపంచంలో కీర్తి పొందుతారు.

One should not do give and take transactions with a kind hearted king, a woman, sons, brothers, servants of the king, a widow with small children, soldiers, ones who lost their power.

నిత్యస్నాతుడి కివన్నీ లభిస్తాయి: బలరూపాలూ, ఉజ్జ్వల దేహకాంతీ, కోమలస్వభావము, మధురకంఠమూ, సుగంధదేహమూ, పవిత్రాచారమూ, సౌకుమార్యమూ, శోభా, సుందర స్త్రీ జన పరిచయమూ, నిత్యస్నాతునికి చేరుతాయి. మితంగా భుజించేవానికి బలంతోపాటు సుఖమూ, ఉత్తమసంతానమూ, ఆరోగ్యమూ, ఆయుర్దాయమూ లభిస్తాయి.

One who follows hygiene and takes a bath every day will have strength, aura, soft spokenness, sweet voice, fragrant body, good conduct, tenderness, resplendence, acquaintance with women. One who eats moderately will not only be strong, but also will have good progeny, health and longevity.

సోమరి, అమితభక్షకుడు, సర్వజనవిరోధి, మాయావిదుడు, క్రూరుడు, దేశకాల జ్ఞానశూన్యుడు, నిందిత వేషాలు ధరి౦చేవాడు వీరిని మన ఇండ్లలో ఉండనివ్వరాదు. దుఃఖంలొ ఉన్నా కృపణుడూ, మూర్ఖుడూ, నిందస్వభావడూ, ధూర్తుడూ, అరణ్యవాసీ, నీచసేవకుడూ, దయారహితుడూ, కృతఘ్నుడూ, వైరీ అయినవారి సహయం కోరకూడదు.

One who is lazy, a glutton, an enemy of all; one who relies on maya, is cruel, doesn't know about time and space, is censured should not be invited to stay in our houses. Even when in sorrow, we should not seek the help of one who is a fool, is covetous; blames without a reason; wicked; is a denizen of a forest; is a low life; has no kindness; is ungrateful.

ప్రమాదపరిస్టితులు కల్పించేవాడూ, క్లేశ కరుడూ, అసత్యవాదీ, స్నేహితుడూ, అస్థిరభక్తుడూ, స్వాభిమానీ అయినవానిని సేవించరాదు.

One who creates dangerous situations and problems, speaks lies, a friend, a fickle minded devotee, indulging in self praise should not be served.

ధనం సంపాదించడానికి సహాయమవసరం. సహాయకుడు ధనాన్ని వాంఛిస్తాడు. ఈ విధంగా వీరిమధ్య ఒక అనుబంధం ఉన్నది.

To earn money one needs a helper who expects money. Thus there is a relationship between them.

పుత్రులను కని వారిని బుణముక్తులను చేసి వారి జీవితానికి ఉచితమైన ఏర్పాట్లు చేయాలి. తన కుమార్తెలకు యోగ్యులైన వరులతో పెండ్లిండ్లు చేసి మునివృత్తిని గ్రహించి జీవించాలి. సర్యప్రాణి హితకరమై ఆత్మసుఖదాయకమై ఉండే పనిని

When one has sons, they should be made debt-free and provide what is necessary to succeed in their lives. As for daughters, the parent has to marry them to a suitable groom. Once all the children are settled in life, he should become a renouncer. The basis for all yogic powers is doing karma that benefits all lives, pleases the self, is done unselfishly, is surrendered to Eswara.

నిష్కామద్రుష్ట్యా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడమే సర్వసిద్ధులకూ మూలము. ఎవని పరాక్రమ ప్రభావ ఉద్యోగ తేజశ్శక్తులు ప్రవృద్ధ మవుతూంటాయో

Those who are valorous, strong and powerful are not afraid of conduct in life. Now you are in a mood to go to war with Pandavas who can't be defeated even by Indra and Devas.

వానికి జీవితనిర్వహణమీద భయం కలగదు. మీరిప్పుడు పాండవులతో యుద్దం చేసే దృష్టితో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, పాండవులతో సంగ్రామం ఇంద్రాదులకు కూడా ప్రమాదమే,

ఉద్వేగపూర్ణమైన జీవితం కీర్తిని నశింపచేస్తుంది. పుత్రసదృశులతో వైరం శత్రుకోటికి బలాన్ని కూరుస్తుంది. ఆకాశంలో వక్రంగా ఉదయించే ధూమకేతువు ఉపద్రవాలకు హేతువు. అదేరీతిగా భీష్మ, ద్రోణ, ధర్మరాజాదుల క్రోధం నాశనానికే వస్తుంది. నీ నూరుగురు బిడ్డలూ, కర్ణుడూ, పంచపాండవులూ కలిసి ఉంటే ఈ సముద్రపర్యంతభూమండలాన్నీ శాసించగలరు.

An agitated mind destroys fame. Enmity with children like people will make the enemies stronger. A comet is a portender of disaster. Similarly the anger of Bheeshma, Drona, Dharma Raja et al. will lead to cataclysm. If your hundred sons, Karna and the five Pandavas are united, they will be undefeated kings of the land.

దుర్యోధనాదులు అరణ్య మైతే పాండవులు వనవ్యాఘ్రాలు. అరణ్యంనుండి శార్ధూలాలను (పులులను) పారదోలి వనాన్ని నశింపచెయ్యకండి. పాపైక చిత్తులూ, పరదోషపరాయణులూ పోయేదారిని పోవద్దు. స్వర్గం నుండి అమృతం చితం కానట్లు ధర్మంనుండి అర్ధం వేరుకాదు. పాపదూరుడై కల్యాణ

If Duryodhana et al. are forest, Pandavas are like lions. Don't drive away tigers from the forest and destroy it. Don't traverse the path of sinners and evil people. Just as one can't think of a heaven without elixir of life, one can't separate wealth from dharma. One who stays away from sin, has a clean conscience, understands the nature of the world, follows a path of rectitude for dharma, wealth and fulfilling desires attains a superior after life. One who is not perturbed by censure or praise, not infatuated despite the dangerous consequences will achieve kingdom.

లగ్నవిత్తుడై చరించేవాడు ప్రపంచ స్వభావాన్ని గ్రహించి ధర్మార్థ కామాలు సేవిస్తూ ఇహపరాలలో ఉత్తమస్థితి పొందుతాడు. హర్ష క్రోధ సంజనితమైన ఆవేశాలను లొంగదీస్తూ ఆపదలు వచ్చిపడ్డా వ్యామోహం పొందనివాడు రాజ్యలక్ష్మిని పొందుతాడు.

మహారాజా! మనుష్యుడు నాలుగు బలాలతో ఉంటాడు. మొదటిది బాహుబలము. అది నికృష్టమైనది. రెండవది మంచి మంత్రి. ధనసంపదలు మూడోబలం. పితృపైతామహ సంపన్నమైన దున్నదే అది సహజాతబలము. ఈ బలాలన్నిటికీ మించినది బుద్దిబలము.

King, a man has four strengths: one is the strength of physical body which is the lowest; second one is an able minister; third is wealth; fourth is the inheritance from forefathers. Transcending all of them is the strength of intellect.

మనకు విపరీతమైన ప్రమాదాలు కలిగించే పురుషునికి దూరంగా ఉండి వానివల్ల మనకు ఏ ప్రమాదమూ లేదని విశ్వసించరాదు. ప్రభువు మీద శత్రువులమీద నారీ, భోగ, సామర్థ్య, సర్ప, ఆయుర్దాయుల మీద, అధ్యయనంమీద కేవల విశ్వాసము౦చేవాడుండడు. బుద్ధిశరము వేధిస్తే వానికి వైద్యుడు ఏపనీ చేయలేడు. హోమమంత్రసూత్ర ప్రయోగా లేమీ పనిచెయ్యవు. అగ్ని, సింహ,

We should expect trouble even when we keep a dangerous man at a distance. One doesn't fully trust the king, enemy, women, riches, comforts, skill, snakes, longevity, acquired knowledge. A doctor can't cure one who is tormented by his intellect. The performance of fire rituals won't help. Danger awaits one who neglects fire, lions, snakes; who insults people of the same varna. There is no object with more resplendence than fire. It resides in firewood. Until one lights it won't burn. Once it starts burning it is capable of burning an entire forest. Similarly your own progeny Pandavas are as bright as the fire, benevolent, devoid of evil. They are dormant like the fire in wood. If they are huge trees, your children are like creepers on them. They are lions and your sons are the forest. The forest without lions and lions outside the forest can't survive.

సర్పాలను అలక్ష్యం చేసినా, స్వకులసంజాతులను అనాదరి౦చినా ప్రమాదమే. అగ్నికంటె తేజస్సు కలది లేదు. ఇది కాష్ఠంలో ఉంటుంది. ఒకరు వచ్చి మధనం చేసేవరకూ ఆది ఆకట్టెను మండించదు. అంటుకు౦టే ఆ అరణ్యంతోపాటు సర్వాన్నీ దగ్ధం చేస్తుంది. ఇదే రీతిగా ఆత్మవంశీయులైన పాండవులు అగ్నిసదృశ తేజో మయులు, క్షమాహృదయులు, వికారశూన్యులు. కాష్ఠంలో వారు అగ్నిలా దాగి ఉన్నారు. అంతే. వారు వృక్షాలు. నీ కొడుకులు లతలు. వారు సింహాలు. నీ కొడుకులొక అరణ్యం. సింహంలేని అడవీ, అడవిలేని సింహమూ నశించక తప్పుదు. అని ఇంకా యిలా కొనసాగిస్తున్నాడు.

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...