Saturday, February 1, 2025

Viveka Sloka 28 Tel Eng





అహంకారాదిదేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్ ।
స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్ఛా ముముక్షుతా ॥ 28 ॥

అహంకారాదిదేహాన్తాన్- అంతఃకరణము మొదలు దేహమువరకును ఉన్న, అజ్ఞాన కల్పితాన్ - అజ్ఞానముచే కల్పితములగు, బంధాన్ - బంధములను, స్వస్వరూపావ బోధేన - స్వస్వరూపజ్ఞానముచే, మోక్తుo = విడచుటకు, ఇచ్ఛా = కోరిక, ముముక్షుతా-ముముక్షుత్వము,

అన్తఃకరణమేతేషు చక్షు రాదిషు  వర్ష్మణి, 

అహమిత్యభిమానేన తిష్ఠత్యాభాసతేజసా.

అహంకారః స విజ్ఞేయః—

ఈ చక్షురాదీంద్రియములందును, శరీరమునందును, 'అహం' (నేను) అను అభిమానముతో, అంతఃకరణము ఆభాస తేజస్సుతో ప్రవర్తించును. అదియే అహంకారముగ తెలియదగినది అని చెప్పిన విధముగ, చిత్ప్రతిబింబముతో గూడిన అహంకారము లేదా ఆనందమయకోశము అనుపేరు గల భోక్తయగు జీవుడు అహంకారము.

సుప్తగతైః సుఖలే శైరభిమనుతే సుఖీభవామితి,

అనందకోశనామా సో హంకారః కథం భవేదాత్మా.

అనందమయ కోశమను పేరుగల ఏ అహంకారము సుప్తియందు కలుగు సుఖలేశములచే "నేను సుఖము కలవాడను" అని భావించు చుండునో అది ఆత్మ ఎట్లగును ?

అను శ్లోకమున, ఆత్మనిరూపణము నందు ఆనందమయ కోశమే అహంకారమని చెప్పబడినది. అది కూడ అజ్ఞానకల్పితమనియు, మనోరూపమగు ఉపాధినిబట్టి గౌణమగు వికారమనియు చెప్పవచ్చును.

కావున, ఆత్మసాక్షాత్కారమునకు పూర్వము ఆత్మగా భావింపబడుచున్నవియు, ఆనందమయ కోశము మొదలు విజ్ఞానమయ - మనోమయ - ప్రాణమయ - అన్నమయ కోశమువరకును ఉన్నవి యునగు బంధములను, స్వస్వరూపజ్ఞానముచే విడచుటకు, వాటియందు మరల ఎన్నడును అహంబుద్ధి కలుగ కుండు విధమున బాధించుటకు అని యర్థము.

స్వస్వరూపజ్ఞానము కలుగగనే "యత్ర శ్వస్య సర్వమాత్మైవాభూత్తత్కేన కం పశ్యేత్” అను శ్రుతిచే స్వభిన్నమగు ఏ వస్తువు భాసింపదు గాన కోశపంచ కాత్మకమగు బంధము పూర్తిగ నివర్తించును అని భావము.

అవ: మంద, మధ్య, ప్రవృద్ధ అని ఈ ముముక్ష (మోక్షేచ్ఛ) మూడువిధములు. మోక్షము నిత్యసుఖరూపమే యైనను సాంసారిక వాసనచే వాసితమగు అంతః కరణము కలవారికి మోక్షేచ్ఛ కలుగుటయే కష్టము. అధ్యాత్మశాస్త్రమును వినెడు సమయమున అది పేరునకు కలిగినను నిలువదు.

ఇది తాత్కాలికమగు మందముముక్ష శ్రవణముచేసిన తరువాత కలిగిన వివేకబుద్ధిచే, పురుషుడు సాంసారికములగు విషయములలో దోషములను చూచి, వాటి విషయమున వైరాగ్యమును పొంది, యథాశాస్త్రముగ సర్వకర్మ సంన్యాసము చేసి, విచారార్థమై గురూపసదనాదులను (గురువువద్దకు వెళ్ళుట) చేయుటకై ప్రవర్తించినప్పుడు ఆ మందముముక్షత మధ్యముముక్షతగా మారును.

వైరాగ్యము తీవ్రమైనకొలది మనస్సు శాంతమై సమాధానమును పొందుచుండును. “ఈతడు శీఘ్రముగ సంసార సముద్రమును దాటుగాక” అని గురువుకూడ అనుగ్రహించును. అపుడు ఆ పురుషుడు నిత్యసుఖరూపమగు మోక్షము తప్ప మరేదియు వాంఛింపడు. అందు ఆలస్యమునుకూడ సహింపడు. ఈ విధముగ ముముక్ష ప్రవృద్ధముకాగా, ముఖ్యాధికారియై ఫలమును శీఘ్రముగ పొందును అని చెప్పుచున్నాడు.

ahaṅkārādidēhāntān bandhānajñānakalpitān ।
svasvarūpāvabōdhēna mōktumichChā mumukṣutā ॥ 27॥

Sankara is reminding us that antahkarana (manas, ahankara, chitta, buddhi) and the body made of pancha kosas (annamaya, praanamaya, manomaya, vignaanamaya, aanandamaya) create bondage out of ignorance. The antahkarana gives rise to ahankara by association with the gnana and karma indriyas. The anandamaya kosa influenced by ahankara makes one believe that he is the bhokta or enjoyer. Therefore, anandamaya kosa can't be the soul. One believing otherwise is ignorant of atma.

A mumukshu is of three kinds: manda, madhya, pravruddha. It is rare for a householder busy in discharging his duties to think about liberation. Someone in vanaprastha or retirememnt will think about liberation but not intensely. A sannyasi or one who renounced everything has intense desire to attain moksha.

When a gruhasthu or householder after hearing about moksha, evinces interest in the scripture, he discerns the limitations of his freedom, and comes to the conclusion that household duties cause bondage. After renouncing all activities as per the scripture, he approaches a guru to receive knowledge about atma, i.e. "I am not the body", "I am not the mind", "I am not the intellect", etc. He then is said to have transformed from manda mumukshu to madhya mumukshu.

As the longing for liberation intensifies his mind will be less agitated and he understands the limitations only apply to his body but not atma which is all pervading, eternal, infinite and absolute. The guru noticing the change blesses him with transcendental knowledge to tide over samsara. This leads to the attainment of vairagya. The mumukshu then sheds all desires and relationships focusing his mind only on moksha. Thus, he transforms into a pravruddha mumukshu.

Many sadhakas are of the view that moksha means esoteric pleasure, something beyond anandamaya kosa, that which never experienced by men, bliss that can't be imagined. The sages tell us that one shouldn't think of moksha as anything far greater than the sensual pleasures of the earth-bound life. The only difference is there are no consequences for enjoying with the senses in the spiritual world. For instance, one might very much like to eat mangoes. Overindulgence in the mangoes causes diseases like diabetes. So there is a limitation to the sensual pleasures on material plane. From the teachings of the sages one can infer that in the spiritual world there are no such limitations. One can satisfy the insatiable senses fully and completely in the spiritual world without consequences.

Viveka Sloka 28 Tel Eng

Telugu English All అహంకారాదిదేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్ । స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్ఛా ముముక్షుతా ॥ 28 ॥ అహంకారాదిదే...