Friday, February 14, 2025

Viveka Sloka 30 Tel Eng




వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే ।
తస్మిన్నేవార్థవంతః స్యుః ఫలవంతః శమాదయః ॥ 30 ॥

యస్య-ఎవనికి, తీవ్రం - తీవ్రమైన, వైరాగ్యం చ - వైరాగ్యము, ముముక్షుత్వం - మోక్షేచ్ఛయు, విద్యతే - ఉండునో, తస్మి న్నేవ = వాని విషయముననే, శమాదయః - శమాదిశబ్దములు, అర్థవన్త ఫలవన్తే = ఫలము కలవిగను, స్యు = అగును.

'శమాదయః' అనుదానికి శమాదిశబ్దములు అని అర్ధము. ఆ పురుషునియందు శమాదులున్నవి అను వ్యవహారము సార్థకమని భావము.

"ఇతడు శాంతుడు", "ఇతడు దాంతుడు" అని యన్నచో అతనికి తీవ్రమైన వైరాగ్యము, తీవ్రమైన మోక్షేచ్ఛ ఉన్నవని యర్థము. శమాదు లున్నందుకు ఫలము తీవ్రమోక్షేచ్ఛయే కదా! ఒకనికి తీవ్రముగా ముముక్ష ఉన్నదన్నచో కార్యమును బట్టి కారణమును ఊహించు కొనవచ్చును గాన ఆతనికి శమాదులు ఉన్నవని సులభముగ చెప్ప వచ్చును.

సాధనము లేనిచో ఫలము లభింపదు కదా! అట్లే శమాదు లకు సాధనమగు తీవ్ర వైరాగ్యము ఒకనికి ఉన్నదన్నచో, సాధన మున్నపుడు ఫలముకూడ తప్పక ఉండవలెను గాన అతనికి శమాదికము ఉన్నదనుట గూడ అనివార్య మగును.

శమాధిసాధనమగు తీవ్ర వైరాగ్యము, తీవ్రవైరాగ్యశమాదులకు ఫలమును తీవ్రముముక్షుత్వము ఉన్నపుడు తమ (శమాదుల) సాధనమునకును (తీవ్ర వైరాగ్యము నకును) ఫలమునకును (తీవ్రముముక్షుత్వమునకును) నడుమ తాను (శమాదికము) ఉన్నదని చెప్పుటలో సందేహమేదియు లేదు, తీవ్ర వైరాగ్యమున్న నీ శమాదిశబ్దములు సార్థకములు : తీవ్రమగు ముముక్షుత్వ మున్నపుడే శమాదులు ఫలవంతములు అని శ్లోకతాత్పర్యము.

ఇతరుల అంతఃకరణములలో శమాదు లున్నవో లేవో తెలియుట కష్టము. కావున శమాదులకు కారణమగు వైరాగ్యమునుబట్టియు కార్యమగు ముముక్షుత్వమునుబట్టియు శమాదుల ఉనికిని ఊహింప వలసియుండునని అభిప్రాయము.

తనకుగూడ శమాదికము లభించినదా లేదా అని తెలిసికొనవలె నన్నచో వాటి పుష్కల కారణమగు తీవ్రవైరాగ్యము, వాటి విశిష్ట ఫలమగు తీవ్రముముక్షుత్వము ఉన్నచో శమాదులు కూడ ఉన్నట్లే. కావున తన విషయమందైనను, ఇతరుల విషయ మందైనను శమాదుల ఉనికిని సూచించునవి కార్య కారణములే.

కాకస్య నిష్ఠావ దసహ్యబుద్ధి ర్భోగేషు సా తీవ్రవిరక్తి రిష్యతే, 

విరక్తి తీవ్రత్వనిదాన మాహు ర్భోగేషు రోపేక్షణమేవ సన్తః. 

కాకిరెట్టయందువలె భోగములయందు జుగుప్సకు తీవ్ర వైరాగ్య మని పేరు. భోగములలో దోషములను చూచుటయే ఇట్టి తీవ్ర వైరాగ్యమునకు మూలకారణమని సత్పురుషులు చెప్పుదురు

అను. సర్వవేదాన్త సిద్ధాన్త సంగ్రహమునందలి శ్లోకములో వైరాగ్యమునకుగల తీవ్రత్వము, తత్సాధనముకూడ చెప్పబడినవి. తీవ్రముముక్షుత్వమనగా వెనుక చెప్పిన ప్రవృద్ధ ముముక్షుత్వము .

vairāgyaṃ cha mumukṣutvaṃ tīvraṃ yasya tu vidyatē ।
tasminnēvārthavantaḥ syuḥ phalavantaḥ śamādayaḥ ॥ 30॥

In this sloka Sankara is providing the necessary condition for the various austerities like sama and dama (shatsampatti) to bear fruits as intense desire for moksha. This means, one can have shatsampatti without the desire for liberation in which case they don't bear any fruit. In other words, even though Lord will be pleased with a sadhaka performing austerities, he won't grant merger with himself unless the sadhaka has intense desire to serve the Lord.

We all have to start sadhana at some level. A recommended approach is to understand dwaitam as enunciated by Madhvacharya. From that understanding we learn that atma is different from paramatma and moksha means atma staying in proximity to paramatma. Our next stop is visishtadvaita as preached by Ramanujacharya which is basically dvaitam with bhakti. Then we progress to advaitam that Sankara taught and understand that there is no difference between atma and paramatma.

Another way to understand our religious philosophies is to prepare various combinations of duality and bhakti. Duality without reference to bhakti is dwaitam. Non-duality without reference to bhakti is advaitam. Non-duality with bhakti is visishtadvaitam. That opens up the fourth possibility: duality with bhakti.

PathDualityDevotionTaught By
DwaitamYesYesMadhvahacharya
AdwaitamNo?Sankaracharya
VisishtadwaitamNoYesRamanujacharya
AtheismNoNoCharvaka

In the modern era, duality with bhakti is taught by gurus like the founder of ISKCON Sri Prabhupada. He teaches that (a) atma is a fragment of paramatma that is qualitatively same as paramatma, (b) paramatma is quantitatively infinitely superior to atma, (c) atma even after attaining moksha maintains its individuality. Thus, duality is posited. To attain moksha one has to attain Krishna consciousness by rendering service with total devotion to Lord Krishna. This servitude continues in the Vaikuntha where the devotee serves Lord Krishna in proximity. And this is moksha.

Therefore, all the paths lead to moksha if and only if the sadhaka performs the various austerities with intense desire to serve the Lord in his abode.

No comments:

Post a Comment

Viveka Sloka 33.1 Tel Eng

Telugu English All ఉక్తసాధనసంపన్నస్తత్త్వజిజ్ఞాసురాత్మనః । ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధవిమోక్షణమ్ ॥ 33 ॥ ఉక్త సాధన...