శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ॥ 47
చక్కగా అనుష్ఠించబడిన పరుల ధర్మంకంటే గుణహీనమైనది అయినప్పటికీ స్వధర్మం మేలైనది. స్వభావం చేత నిర్ణయించడిన కర్మ ఆచరిస్తున్నవాడు ఎవడూ పాపం పొందడు.
కొంచెం లోపాలున్నప్పటికీ స్వధర్మం చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం కంటె శ్రేయస్కరము. 'స్వభావజమ్' అని వెనుక చెప్పిందే ఇక్కడ స్వభావనియతమంటున్నాడు. స్వభావాన్ని బట్టి నిర్ణయించబడిన కర్మ చేసేవాడు పాపం పొందడు. ఎట్లాగంటే, విషంలో పుట్టిన క్రిమిని విషమేమీ చేయలేనట్లు.
Despite the flaws, it is better to follow one's own dharma rather than another. One who has followed his natural ways will not accrue sin like a microbe within poison can't be affected.
విషంలో పుట్టిన పురుగును విషమేమీ చేయలేనట్లే స్వభావాన్ని బట్టి నిర్ణయించబడిన కర్మను ఆచరించిన వాడు పాపం పొందదు అని చెప్పబడింది. పరధర్మం భయావహమని కూడా. అనాత్మజ్ఞుడు ఎవ్వడూ క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదు అని కూడా చెప్పబడింది. లేని నాడ
Like a microbe borne in poison is unaffected by it, following one's natural ways will keep him out of sin. One who doesn't have knowledge about atma, will never cease to act.
సహజం కర్మ కొత్తేయ సదోషమపి న త్యజేత్ | సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ॥48
అర్జునా! జన్మతో కలిగిన కర్మను, దానిలో దోషమున్నప్పటికి, వదలరాదు. సర్వకర్మలు పొగచేత నిప్పువలె కప్పబడి ఉన్నాయి.
సహజమంటే తోబుట్టినది. మనకు జన్మతో కలిగిన కర్మ సహజకర్మ. అది త్రిగుణమయం కనుక అందులో దోషముంటుంది. (అది త్రిగుణమయం కావడమే దాని దోషం.) దానిలో దోషమున్నప్పటికీ దానిని విడువరాదు. ఆరంభించబడేవి ఆరంభాలు. సర్వారంభాలు అంటే సమస్తకర్మలు అని ఈ సందర్భంలో అర్థం చెప్పుకోవాలి. ఈ కర్మలన్నీ, స్వధర్మం కాని పరధర్మం కాని, త్రిగుణాత్మకమైనవి. త్రిగుణాత్మకమైనవి కనుక అవి పొగచేత నిప్పువలె దోషంచేత కప్పబడి ఉన్నాయి.
Natural means that it is coborn at the time of birth. Because it is made of the three gunas: sattva, rajas, tamas it will be flawed. Despite the flaws, one should not give up what is one's own nature. Regardless if one follows his nature or something else, the karma has the three gunas. Like smoke envelops fire, they are covered by flaws.
(నిప్పును ప్రకాశింపనీయకుండా పొగ ఆవరించినట్లు సమస్తకర్మలను, అవి స్వధర్మరూపమైనవైనా పరధర్మరూపమైనవైనా, గుణదోషం ఆవరించి ఉంటుంది. కనుక దోషంలేని కర్మ ఉండడం ఆసంభవం). స్వధర్మమనే సహజకర్మను (దోషమున్నదని) పరిత్యజించి పరధర్మమనుష్టించినప్పటికీ దోషం వదలదు. పైగా పరధర్మం భయావహం కూడాను. అజ్ఞానికి కర్మను నిశ్శేషంగా త్యజించడం శక్యం కాదు. కనుక త్యజించరాదు అని అర్ధం.
Even if one rejects one's own dharma because of its flaws and follows another's dharma, the flaws will still be there. Besides, someone else's dharma causes fear. An ignorant one can't give up all karma. Hence it is better not to give up one's own dharma.
ఆక్షేపణ: కర్మను నిశ్శేషంగా త్యజించడం అశక్యం కనుక త్యజించరాదా, లేక సహజకర్మను త్యజించడం దోషం కనుక త్యజించరాదా?
Objection: since it is not possible to give up karma entirely, should one not give up karma? Or is it that giving up what is natural to one is a flaw?
సమాధానం - ఎందుకీ ప్రశ్న?
Sankara: why do you ask?
ఆక్షేపణ - సహజకర్మను నిశ్శేషంగా త్యజించడం అశక్యం కనుక దానిని త్యజించరాదు అంటే నిశ్శేషంగా త్యజించడంలో గుణముంది అని అర్థం.
Objection: since it is impossible to give up one's natural karma entirely hence if you say it should not be given up, it means there is merit in giving it up entirely.
సమాధానం - అది నిజమే. కాని, (మీ మీ సిద్ధాంతాల ప్రకారం) కర్మలను నిశ్శేషంగా త్యాగం చేయడమే సాధ్యం కానపుడు (అది గుణమా దోషమా) అన్న చర్చ ఎందుకు?
Sankara: it's true. Since according to your faith, it is impossible to give up karma entirely, why bring into discussion whether it is good(guna) or bad (flawed)?
మీరెవరు? సాంఖ్యులా? గుణాలు క్షణక్షణమూ మారిపోయేవి అని మీ వాదం.
If you follow Sankhya then you argue gunas change every instant.
మీరెవరు? బౌద్ధులా? ప్రతిక్షణము నశించే పంచస్కంధాల (రూపము, వేదన, విజ్ఞానము, సంజ్ఞ, సంస్కారము ఇవి పంచస్కంధాలు. వీటి ఉనికి క్షణికం, వీటి విషయంలో క్షణికాలు కనుక.) వలె క్రియయే కారకమని (క్రియను కారకానికి తేడా లేదు, వేరొకడు లేదు) అని మీ వాదం.
If you are a boudha, the 5 skandhas (rupa, vedana, vignana, sangya, samskara) have an evanescent existence. You argue effect is the the cause or effect is same as cause.
మీ ఇద్దరి సిద్ధాంతాల ప్రకారం కర్మను నిశ్శేషంగా త్యాగం చేయడమన్న ప్రశ్నే లేదు.
Hence in these two faiths, there is no question of giving up karma entirely.
ఆక్షేపణ - (వైశేషికులు, ప్రపంచంలో సిద్ధాంతాలు ఈ రెండేనా?) మూడవది కూడా వినండి.
Objection: There is a third way called Vaiseshika
[In the Vaisheshika school of Hindu philosophy, Samavaya is one of the six or seven padarthas (categories of being) and is considered the relationship that binds substances to their qualities, actions, or parts to the whole. It is an eternal, inseparable, and imperceptible connection, meaning that the entities involved cannot exist separately without ceasing to be what they are. For example, the color of a rose cannot exist independently of the rose itself, and the spokes of a wheel cannot exist apart from the wheel]
వస్తువు పని చేస్తున్నపుడు అది సక్రియం. పనిమానినపుడు అదే వస్తువు నిష్క్రియం.
When one performs karma there is action. Without karma there is inaction.
మరి ఈ విధంగా పనిమానేసి కర్మను నిశ్శేషంగా త్యాగం చెయ్యవచ్చు గదా?
So by giving up action, isn't it possible to give up karma entirely?
ఈ మా వాదంలో మీరు చెప్పిన సాంఖ్య బౌద్ధ వాదాలలో లేని విశేషముంది. అదేమిటంటే ఇక్కడ వస్తువు నిత్యము మారిపోతూ ఉండడం లేదు.
In this third way, things are not changing constantly.
(క్రియయే కారకం కావడం కూడా లేదు. మరేమి ఉందంటారా? ఉన్న వస్తువులో లేని క్రియ ఒకటి పుడుతున్నది, ఉన్న క్రియ నశించిపోతున్నది. శుద్ధ వస్తువు క్రియాశక్తి కలిగి ఉంటున్నది. అదే కారకం (క్రియయే కారకం కావడం కాదు, కారకమే క్రియాశక్తి కలిగి ఉండడం)
That means effect is not becoming cause. So what is happening? In one, an action that previously didn't exist, is born. Then it dies. A real object has the power of action intrinsically within it. That itself is the cause. This is not like effect becoming cause. It is that the cause itself has the power of action.
ఈ వాదంలో దోషమేముంది?
What is the flaw in this reasoning?
సమాధానం - ఇది అభాగవతమతం కావడమే ఇందులో దోషం. (భగవానునికి సమృతం కాదు కనుక ఇది దోషం.)
Sankara: the flaw is it is not sanctioned by scripture.
అక్షేపణ - తమకెట్లా తెలుసు?
Objection: how do you know?
సమాధానం - భగవానుడన్నాడు కదా? 'నాసతో విద్యతే.. భావః (2.16) వంటి వాక్యాలలో, అసత్తు నుండి సత్తు కలగదు అని. మరి మీరు లేని దానినుండి ఉన్నది రావడం, ఉన్నది లేకుండా పోవడం అనే వాదం చేస్తారు.
Sankara: as Lord Krishna stated, an real thing can't be produced from an ureal thing. You are arguing that from unreal, real is born that later dies.
[ a real thing is eternal without birth or death according to Sankara]
ఆక్షేపణ: భగవానుడికి సమ్మతం కాకపోతే మాత్రమేమి? యుక్తియుక్తంగా ఉంది అనుకుంటే ఆ వాదాన్ని ఒప్పుకోవడంలో తప్పేమిటి?
Objection: what if the Lord doesn't approve of? When it is convincing why don't you accept?
సమాధానం - ఏమిటి తప్పా? వినండి ఇది సర్వప్రమాణాలకు విరుద్ధం కనుక.
Sankara: Do you want to know the flaw? It contradicts all means of verification.
అక్షేపణ - ఎట్లా?
Objection: How?
సమాధానం: ద్వృణుకాది ద్రవ్యం ఉత్పత్తికి పూర్వం అత్యంతము అసత్తు ఎంతమాత్రము - లేనిది. అవి ఉత్పన్నమవుతున్నాయి కొంతకాలం ఉంటున్నాయి. మళ్ళీ ఏ మాత్రము లేకుండా పోతున్నాయి.
Molecules that don't have prior existence are manufactured. They persist for a while and then disappear after some time.
ఈ వాదం ప్రకారం అసత్తు సద్భావం పొందుతున్నది. అభావం భావము భావం అభావము అవుతున్నది.
That means unreal is perceived as real. What is real in the mind is becoming unreal, vice-versa.
అంటే పుడుతున్న అభావం ఉత్పత్తికి పూర్వం కుందేలు కొమ్మువలె అత్యంతము అసత్తు అయి వుండి సమవాయి అసమవాయి నిమిత్త కారణాల వలన పుడుతున్నది. అని అన్నట్లు.
Before the thought is born, like a hare with a horn, even though it is unreal it is born for various extraneous reasons like its relationship with eternal things.
కాని ఈ విధంగా అభావం ఉత్పన్నమవుతుందని కాని కారణాన్ని అపేక్షిస్తుందని గాని అనడానికి వీలు లేదు.
But it is not possible to say an unreal perception is born this way or it has a cause.
ఎందుకంటే కుందేటి కొమ్ము విషయంలో ఇవేవీ మనం చూడడం లేదు. (కుందేటికొమ్ము ఆభావం. అది ఉత్పన్నమవడం కాని దాని ఉత్పత్తికి ఒక కారణం ఉండడం గాని మనం చూడడం లేదు).
Because we are not seeing such things in the case of a hare with a horn which is unreal. But we don't see it being generated nor do we see a cause for it.
ఉత్పత్తి చేయబడుతున్న కుండ మొదలైన వస్తువులు భావరూపంలో ఉంటాయని అభివ్యక్తి మాత్రకారణం చేత ఉత్పన్నమవుతాయని ఒప్పుకోవచ్చు.
It is possible to accept that things like a pot exist in thought and are manifested by someone like a potter.
అంతేకాక, అసత్తు సద్భావము సత్తు అసద్భావము పొందుతుంది అని ఒప్పుకుంటే ఇక ఎవడికీ ప్రమాణ ప్రమేయ వ్యవహారంలో విశ్వాసముండదు.
Not only that, if what is convincing is unreal and unconvincing is real, then no one will have confidence in the means of verification.
సత్తు సత్తేనని అసత్తు అసత్తేనని సమ్మకమేమిటి?
Where is the guarantee that what is real is real and not real is unreal?
అంతేకాదు, ఉత్పన్నమవుతున్నది అని ద్వ్యణుకాది ద్రవ్యానికి తన కారణంతో సత్తాతో సంబంధం చెపుతున్నారు.
Not only that by saying molecules are manufactured you are claiming a relationship with their cause that is real.
ఉత్పత్తికి పూర్వం అసత్తు, తరువాత తన కారణ వ్యాపారం చేత తన కారణమైన పరమాణవులుతోను సత్తాతోను సమవాయ లక్షణమైన సంబంధం కలిగి కారణంతో కలిసిపోయి సత్తు అవుతున్నది.
Before manufacturing they are unreal(don't exist). Later because of their cause and fusion of atoms by becoming eternal, you are saying they become real(exist).
అసత్తుకు సత్తు ఎట్లా కారణం కాగలదో, అసత్తుకు దేనితో గాని సంబంధం ఎట్లా సాధ్యమో వారు (వైశేషికులు) చెప్పవలసి ఉంది.
How unreal can be the cause for real, and how can unreal have a relationship with real, you need to explain.
గొడ్రాలి కొడుకుకు సత్తాతో సంబంధం గాని కారణంగాని ఏ ప్రమాణం చేత గాని కల్పించడం సాధ్యం కాదు.
It is impossible to verify a claim such as "the son of a barren woman" with either the cause or relationship with real.
అక్షేపణ: వైశేషికులు అభావానికి సంబంధం కల్పించడం లేదే! ఉన్న ద్వృణుకారి ద్రవ్యాదులకే తన కారణంతో సమవాయ లక్షణసంబంధం చెపుతారు.
Objection: We are only saying only molecules have eternal relationship with their cause.
సమాధానం: కాదు. సమవాయ సంబంధం కలుగక పూర్వం ఏదీ ఉన్నదని వారు ఒప్పుకోరు.
Sankara: No. Without relationships with eternal things, you don't accept their existence.
కుమ్మరి కర్ర చక్రము వాటి పని ప్రారంభించక పూర్వం కుండ మొదలైన వస్తువుల అస్తిత్వం వైశేషికులు ఒప్పుకోరు.
You don't accept the existence of a pot, before a potter and his wheel.
మట్టియే కుండ మొదలైన వస్తువుల ఆకారం పొందుతుంది. అని కూడా వారు ఒప్పుకోరు.
You don't even accept that mud attains the shapes of pots.
అటువంటప్పుడు పారిశేష్య న్యాయంగా అసత్తుకే సంబంధం చెప్పుకోవలసి ఉంది.
Hence by inference a relationship can only be made with unreal.
ఆక్షేపణ - అసత్తుకైనా సమవాయ లక్షణంమైన సంబంధం విరుద్ధం కాదు గదా?
Objection: for unreal to have relationship with eternal things isn't illogical
సమాధానం - విరుద్ధమే. గొడ్రాలి కొడుకు వంటి విషయంలో ఇటువంటి సంబంధమేదీ మనం చూడం,
Sankara: It is illogical. We don't see in the case of a barren woman's son such a relationship.
రెండూ అభావమే అయినప్పటికీ కుండవంటివాటి విషయంలో మాత్రమే ప్రాగభావానికి తన కారణాలతోటి సంబంధం ఉంటుంది గాని గొడ్రాలి కొడుకు వంటి విషయాలలో ఉండదు అంటారా?
Both are illogical. If you say, whereas in the case of a pot that didn't exist before creation but has a definite end has a cause, but not in the case of a barren woman's son, then listen
మరి ఒక అభావంలో లేని విశేషం మరొక అభావంలో ఏమిటో చెప్పవలసి ఉంది.
You have to clarify what is the speciality of one unconvincing thought from another.
ఒకదాని అభావం, రెంటి అభావం, సర్వాభావం, ప్రాగభావం, ప్రధ్వంసాభావం, ఇతరేతరాభావం, అత్యంతాభావం ఈ లక్షణాలను బట్టి అభావంలో ఎటువంటి విశేషము చూపించడం సాధ్యం కాదు.
It is impossible to find anything special in an unreal thing such as: one that has no beginning but has an end; has no end but has a beginning; and so on.
విశేషమేమీ లేనపుడు ఘటం యొక్క ప్రాగభావం మాత్రమే కుమ్మరి మొదలైన వానిద్వారా ఘటభావం పొందుతుంది.
Without any speciality, a pot that has no beginning but an end manifests because of a potter.
కపాలమనే స్వరంతో సంబంధం కలిగి సర్వవ్యవహార యోగ్యమవుతుంది కూడాను, కాని అదే ఘటం యొక్క ప్రధ్వంసాభావం, అదీ అభావమే అయినప్పటికీ,
And it gets utilized in the real world, even though its non-existence in the end makes it unreal
ఇట్లా కాదు - అని ఈ విధంగా ప్రధ్వంసాది అభావాలకు ఎటువంటి వ్యవహార యోగ్యత ఒప్పుకోకుండా ద్వృణుకాది ద్రవ్యమనే ప్రాగభావానికి మాత్రమే ఉత్పత్తి మొదలైన వ్యవహారార్హతను చెప్పడం అసమంజసం. ఎందుకంటే అత్యంతాభావ ప్రధ్వంసాభావాల వంటిదే ప్రాగభావం కూడాను, అందులో విశేషమేమీ లేదు
Even though the beginninglessness and endness of a pot is clear, saying only molecules that are also beginningless but have an end only get manufactured and find utility is invalid.
[It seems Sankara is asking why do you say only molecules are manufactured, when a pot is also being made? Also connecting the dots, one can say Sankara by referring to molecules is also implying mud used while making a pot. Mud, primarily silicon-dioxide, is considered manufactured from silicon and oxygen atoms. This leads to infinite regress as each of silicon or oxygen is composed of subatomic particles]
అక్షేపణ - ప్రాగభావం భావం కావడం మేం చెప్పలేదే?
Objection: we didn't say things that have no prior existence are real.
సమాధానం - మరయితే మీరు భావమే భావం కావడం చెపుతున్నారన్నమాట, ఘటం ఘటమవుతుందని పటం పటమవుతుందని, అభావం భావం కావడం ఎంత ప్రమాణ విరుద్ధమో ఇదీ అంతే.
Sankara: that means you are saying one reality becomes another, like a pot is a pot or a picture is a picture. It is as unverifiable as unreal becoming real.
సాంఖ్యుల పరిణామవాదం కూడా పూర్వం లేని ధర్మం ఉత్పత్తి కావడము వినాశము రెండూ అంగీకరించడం చేత వైశేషిక వాదం కంటే విశేషమేమీ కాదు.
Sankhya theory of transformation whereby a property that has no prior existence emerges and dies is not much different from yours.
అభివ్యక్తి తిరోభావాలను అంగీకరించినప్పటికి కూడా వాటి విద్యమానత అవిద్యమానతల నిరూపణంలో పూర్వం వలెనే ప్రమాణవిరోధం ఏర్పడుతుంది.
Even though total disappearance is agreed upon, its acceptance can make it unverifiable.
దీనితో, ఉత్పత్తి మొదలైనవి కారణం యొక్క స్థితులేనన్న మతాన్ని ఖండించినట్లయింది.
This leads to the condemnation of the faith that manufacturing is a state of the cause.
ఇక మిగిలిందేమిటంటే, ఉన్నది ఒకే వస్తువు, అవిద్య వలన ఉత్పత్తి వినాశము మొదలైన ధర్మాలు దానియందు నటుడు అనేక విధాలుగా కనిపించినట్లు కల్పించబడుతున్నవి అని,
So what is left is, only one real thing is getting manufactured and destroyed by nescience like one actor playing multiple roles.
[here the real thing can be stated as "Brahman" that is made famous by the saying "Brahma satyam; jagat mithya"]
సమాధానం - శరీరము ఇంద్రియాలు మొదలైన గుణాలు వాస్తవమైనవైనా విద్యాకల్పితాలైనా కర్మ వాటి ధర్మం. అప్పుడు అవి ఆత్మయందు అధ్యారోపించబడే ఉంటాయి. కనుక అజ్ఞాని ఎవ్వడూ క్షణం కూడా నిశ్శేషంగా కర్మను త్యజించలేదు అని చెప్పబడింది. కాని జ్ఞాని మాత్రం విద్యచేత అవిద్య తొలగించబడినందున కర్మను నిశ్శేషంగా పరిత్యజించగలదు, అవిద్యచేత అధ్యారోపించబడిన వస్తువేదీ మిగిలిలేదు కనుక. తిమిరరోగమున్నవానికి ఒక చంద్రుడు రెండుగా కనిపిస్తాడు. తిమిరరోగం తొలగిన తరువాత రెండవ చంద్రుడు ఏ కొంచెము మిగిలి ఉండడు. అట్లాగే కనుక, 'సర్వకర్మాణి మనసా సంన్యస్యం (5.13), 'స్వే స్వే కర్మణ్యభిరతః (4.5), 'స్వకర్మణా తమభ్యర్చ్య' (4.6) అన్న వాక్యాలలో చెప్పినది యుక్తమే.
Whether body, senses, etc. are real or unreal, it is their duty to perform karma. So their action is attributed to atma. Hence a person ignorant of atma is said to not spend a moment without action. Whereas a knower of atma can give up karma entirely, because there is nothing imposed on atma by nescience. One suffering from diplopia sees two moons. After his vision is corrected, the second moon entirely disappears.
No comments:
Post a Comment