Sunday, April 10, 2022

Index of Eknath Gita

Dr.Eknath Easwaran lived in the last century. Being an English professor he wrote prolifically about Hindu scripture. His books were translated into many European languages. This is the first time as far as I know someone attempted to translate his Bhagavad Gita Volumes 1,2 & 3 to Telugu. The following is an index of the 3 books arranged by the chapter and slokas. Like Dr.Easwaran, I left India at a young age, but did not have as much exposure to the culture as him. So my Telugu is a bit rusty. You may forgive my grammatical and spelling mistakes. Better yet, drop me email. Getting back to Dr.Easwaran, he founded Blue Mountain Meditation Center in Northern California where he trained hundreds to meditate. You will find that he emphasized on Meditation along with unselfish service and love for all creatures.

For the sanskrit slokas and their translation into Telugu, I have used Swami Sundara Chaitanyaa Nanda's Bhagavat Gita pocket book. It was a life saver. But it is very pithy. That's the reason, I think, the slokas need to be interpreted to the 21st century realities. On the other hand, if you just want to read what Sri Krishna said the small book is a great source.

Book 1 (Chapters 1-6)

Book 2 (Chapters 7-12)

Book 3 (Chapters 13-18)

Eknath Gita Chapter 11 Section 4

Bhagavat Gita

11.4

సంజయ ఉవాచ:

ఏవముక్త్వా తతో రాజన్! మహా యోగేశ్వరో హరిః {11.9}

దర్శాయామాన పార్థాయ పరమం రూపమైశ్వరమ్

రాజా! ఈ విధముగ పలికి మహా యోగీశ్వరుడైన శ్రీ హరి మహోన్నతమైన, దైవసంబంధమైన విశ్వరూపమును అర్జునునకు చూపెను

అనేకవక్త్రనయన మనేకాద్భుత దర్శనం {11.10}

అనేకదివ్యాభరణం దివ్యానేకో ద్యతాయుధమ్

దివ్యమాల్యా౦బరధరం దివ్యగంధాలేపనం

సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖమ్ {11.11}

అనేక ముఖములు, నేత్రములు గలదియు, అనేక విచిత్రములు గలదియు, అనేక దివ్యాభరణములు గలదియు, ఎత్తబడిన దివ్యాయుధములు గలదియు, దివ్యములైన పుష్పమాలలను, వస్త్రములను ధరించునదియు, దివ్యమైన గంధలేపనము గలదియు, సర్వాశ్చర్యమైనదియు, అనంతమైనదియు, అంతటను ముఖములు గలదియు, స్వయంప్రకాశమునైన విశ్వరూపమును అర్జునుడు దర్శి౦చెను ఀ

శ్రీకృష్ణుడు తన అనంతమైన విశ్వరూపమును చూపుచున్నాడు. అతడు అసంఖ్యాకమైన ముఖములు గలవాడై ఉన్నాడు. అర్జునుడు ప్రతి ముఖములోనూ, జీవిలోనూ దేవుని చూచెను. మనకు అత్యంత ఆశ్చర్యము కలిగించేది ఏమిటంటే: మన తలిదండ్రులు, జీవిత భాగస్వామి, బిడ్డలు, మిత్రులు మనలను చూసిననప్పుడల్లా అవి దేవుని కళ్ళతో అనే భావన. అందుకే బంధుమిత్రుల మధ్య జీవిస్తూ మనం దేవుడ్ని ప్రేమిస్తాం. బంధు మిత్రుల యందు అహంకారం పోతే మన౦ దేవుడ్ని అందరిలోనూ చూస్తాం.

అర్జునినికి శ్రీకృష్ణుడు అద్భుతాలకు యోని అని గ్రహిస్తాడు. మన జీవితమే ఒక మహాద్భుతం. మన శ్వాస, గుండె చప్పుడు కూడా అద్భుతాలు. అలాగే చెట్లపై వీచే గాలి, ఆకాశంలో వెలిగే సూర్యుడు. మనం అద్భుతాలకై విశ్వమంతా వెతకనక్కరలేదు. అవి మనముందే ప్రతిరోజూ జరుగుతూ ఉంటాయి. మన కళ్ళు తెరుచుకొని చూస్తేనే అది తెలిసికొంటాము. ఈ విధంగా అందరూ చూస్తే, మన ఇళ్లలోని, జాతుల మధ్య, దేశాల మధ్య గల వివాదములు పరిష్కరింపబడతాయి. ప్రపంచంలో దోపిడీ, హింస, అణ్వాయుధాల వలన అభద్రత తొలగిపోయేవరకు మనం శాంతిని పొందలేము. మహాత్మ "ప్రతి వానికీ ఆనందం కలిగే వరకు, మనలో ఏ ఒక్కరికీ ఆనందం కలుగదు" అని చెప్పెను. 275

Saturday, April 9, 2022

Eknath Gita Chapter 11 Section 3

Bhagavat Gita

11.3

న తు మాం శక్యసే ద్రష్టు మనేనెవ స్వచక్షుషా {11.8}

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్

చర్మ చక్షువులతో నీవు నన్ను చూడలేవు. నా ఐశ్వర్యమును చూచుటకు నీకు దివ్యదృష్టి నొసగుచున్నాను. దర్శి౦పుము

మన కళ్ళు, తక్కిన ఇంద్రియాలలాగే, బాహ్య ప్రపంచంలోని మార్పులను తెలుసుకోడానికి పనికివస్తాయి. అవి మనకు తెల్లారిందని, సూర్యుడు ఉదయిస్తున్నాడని మొదలగునవి తెలపడానికి తప్పిస్తే ఇంక దేనికీ పనికిరావు. అందుకే ధ్యానంలో బాహ్య ప్రపంచం మీద జరిగే ఇంద్రియ ప్రసరణను వెనక్కి తీసుకొంటాం. గాఢ ధ్యానంలో, మన ఏకాగ్రత ఇంద్రియాలను జయించి బయట కార్లు, విమానాలు చేసే శబ్దాలు వినకుండా చేస్తుంది.

మనము ఈ విధంగా దృష్టి కేంద్రీకరిస్తే బాహ్య ప్రపంచానికి, మనస్సు అనుభవించే ప్రపంచానికి మధ్య అడ్డు గోడ లేదని తెలిసికొంటాము. ఒక బ్రిటిష్ తత్త్వవేత్త మనము బయట, లోపల అనే తేడాలు కృత్రిమంగా చేసుకొంటాము అని చెప్పను. ఆ రెండిట్లోనూ మనము నిజంగా గ్రహిస్తుంది మన మనస్సులోని భావాలు. అంటే మనం పదార్థాలని అవి ఉన్నట్టుగా కాక మన భావాలబట్టి చూస్తాం. మనం ఇతరులను వేర్పాటుతో చూసి, వారిని మనకు అనుగుణంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తాం. కానీ మన చేతన మనస్సును ధ్యానం ద్వారా పెంపొందించితే, మనము ప్రపంచాన్ని వేర్వేరు శకలాలుగా కాక, ఒకటే అవిభాజ్యమైనదిగా చూస్తాం.

శ్రీరామకృష్ణ "కొందరు దేవుని చూడలేమని అంటారు. ఎవరు ఎవరిని చూస్తారు? దేవుడు బయట ఉండి మన కళ్ళతో చూడబడతాడా? మనము మన ఆత్మనే చూడగలము." అని చెప్పెను. అర్జునుడు చూడబోయే శ్రీకృష్ణుని దేహం దేశ కాలములు కలదై, అది అతనికి బాహ్యంగా కాక, చేతనపు మనస్సు లోతులలో ఉండి స్వీయానుభవం పొందిస్తుంది. 274

Eknath Gita Chapter 11 Section 2

Bhagavat Gita

11.2

శ్రీ భగవానుడు పలికెను:

పశ్య మే పార్థ! రూపాణి శతశో అథ సహస్రశః {11.5}

నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ

అర్జునా! అనేక విధములైన రంగులు, రూపములు గలవియును, దివ్యములైనవియును, అసంఖ్యాకమైనవియు నగు నా యొక్క రూపములను గాంచుము

పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రా నశ్వినౌ మరుత స్తథా {11.6}

బహూ స్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత

అర్జునా! ఆదిత్యులును, వసువులును, రుద్రులును, అశ్వినులను, మరుత్తులను ఇంకను నీవు చూచి యుండని అనేకములైన అద్భుతములను చూడుము

ఇ హైకస్థ౦ జగత్ కృత్స్న౦ పశ్యాద్య సచరాచర౦ {11.7}

మమ దేహే గుడాకేశ యచ్చాస్యద్దృష్టు మిచ్చసి

గుడాకేశా! నీవు చూడగోరిన సమస్తమైన చరాచర ప్రపంచమును ఇంకను ఏమి చూడదలచితివో వాటిని నా శరీరము నందు ఒకే చోట దర్శించుము ఀ

ఇప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపబోవుచున్నాడు. ఉపనిషత్తులలో మన దేహాన్ని ఒక పట్టణంగా వర్ణించేరు. దాన్ని పాలించేది మన ఆత్మ. మనమొక సూక్ష్మ జీవి దృష్ట్యా దేహాన్ని చూస్తే, అది ఒక మహా నగరంగా -- ముంబాయి లేదా న్యూ యార్క్ లాగా -- కనిపిస్తుంది.

మనమెలాగ మన దేహ పురంలో భూమి మీద బ్రతికినంత కాలం నివాసిస్తామో, విశ్వమంతా ఆ దేవుని దేహమై యున్నది. దేవుడు మనుష్యులలో కలవాలంటే కృష్ణుడు లేదా బుద్ధుడు లేదా జీసస్ రూపేణా వస్తాడు. కానీ అలా కాకపోయిన ఆయన సమస్త సృష్టిని ఒక హారం లాగ తన మెడ చుట్టూ వేసుకొంటాడు.

మన విశ్వం యొక్క విశేషాలు చూద్దాం. గంటకు 186000 మైళ్ళు ప్రయాణించే కాంతి అతి దగ్గరగా ఉన్న నక్షత్ర౦ నుంచి మన వద్దకు రావటానికి 4 ఏళ్లు పడుతుంది. మన పాల పుంత ఒక చివరినుంచి ఉంకోచివరికి కాంతి వెళ్ళాలంటే 100000 సంవత్సరాలు పడుతుంది. ఇటువంటి పాల పుంతలు కోట్లానుకోట్లు ఉన్నాయి. కాంతి విశ్వం ఒక చివరినుంచి ఉంకో చివరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మన ఊహకు అందదు. మనం రాత్రి చూసే నక్షత్రాలలో కొన్ని ఇప్పటికే అంతర్ధానమయి ఉండచ్చు. ఎందుకంటే వాటి కాంతి కొన్ని వేల సంవత్సరాల క్రిందట నాటినుంచి ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటికి మానవాళి ఇంకా భూమిమీద అడుగు పెట్టక పోయి ఉండచ్చు.

ఈ విశ్వంలో సతతము ఉంటాయనుకొన్న నక్షత్రాలు మిణుగురు పురుగుల వలె ఒక వేసవి రాత్రే బ్రతికేవిగా ఉన్నాయి. దేనికైతే జన్మ ఉందో, దానికి అంతం కూడా ఉంటుందనే సిద్ధాంతం ప్రకారం ఆ నక్షత్రాలు కొన్ని వేల ఏళ్లు బ్రతికి నశిస్తాయి. వాటినుంచి మళ్ళీ క్రొత్త నక్షత్రాలు పుడతాయి. ఈ లీల కోట్లాను కోట్ల సంవత్సరాలనుంచి జరుగుతున్నాది. ఒక యోగి ఇలా వ్రాసెను:

హిమాలయాలు మనం వాడే నల్ల సిరాలా అయిపోనీ,

సముద్రము ఒక గిన్నెలా ఉండి దానిని తనలో ఇమిడ్చు కోనీ

విశ్వం ఒక కాగితంలా, కల్పవృక్షం ఒక కలంగా, మారనీ

ఆ కలాన్ని సరస్వతీ దేవి చేతబట్టి ప్రతి నిత్యం వ్రాయనీ

కానీ ఆమె ఆ దేవుని సృష్టి అంతము ఎన్నటికీ చేరదు 273

Eknath Gita Chapter 11 Section 1

Bhagavat Gita

11.1

అర్జున ఉవాచ:

{11.1}
మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితం

యత్త్వయోక్తం వచస్తేన మోహో అయం విగుతోమమ

కృష్ణా! నన్ను అనుగ్రహించుటకై నీవు చేసిన ఉత్తమము, రహస్యము, ఆత్మవిద్యా రూపమైన ఉపదేశము వలన నా మోహము పోయినది

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా {11.2}

తత్త్వః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్

కమల దళ లోచనా! ప్రాణుల యొక్క ఉత్పత్తి నాశములు నీ వలన ఆలకించితిని. అవ్యయమైన నీ మహాత్మ్యమును గూడా వింటిని

ఏవమేత ద్యథా ఆత్థ త్వ మాత్మానాం పరమేశ్వర ! {11.3}

ద్రష్టుమిచ్చామి తే రూప మైశ్వరం పురుషోత్తమ !

పరమేశ్వరా! నిన్ను గురించి నీవు చెప్పిన దంతయు సత్యమే అని నమ్ముచున్నాను. పురుషోత్తమా! నీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును నేనిపుడు చూడదలచుచున్నాను

మన్యసే యది తచ్ఛక్య౦ మయా ద్రష్టు మితి ప్రభో {11.4}

యోగేశ్వర! తతోమే త్వం దర్శయాత్మాన మవ్యయమ్

ప్రభూ! నీ స్వరూపమును దర్శించుట నాకు సాధ్యమగునని నీవు భావింతువేని, యోగేశ్వరా! అవ్యయమైన నీ విశ్వరూపమును నాకు జూపుము

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో ముఖ్యుడైన స్వామీ వివేకానంద "మతం దేవుని గూర్చి తెలిసికొనుటకు; ఇంకేదీ మనలని సంతృప్తి పరచదు" అనేవారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు, అనేక సంశయాలతో కూడి ఉండేవారు. నేటి యువతలాగ, ఆయన జీవితానికి అర్థమేమిటి అని ఆలోచించేవారు. ఆయనకు సాహిత్య, తత్త్వ పుస్తకాలు ఎన్ని చదివినా తృప్తి రాలేదు. అప్పుడు ఆ నాటి ఆధ్యాత్మిక గురువులను కలిసి "మీరు దేవుని చూసారా?" అని అడిగేవారు. ప్రతి ఒక్కరూ లేదనే సమాధానమిచ్చేవారు.

చివరకు ఆయన శ్రీ రామకృష్ణను కలిసి అదే ప్రశ్న వేసేరు. ఆయన నవ్వుతూ "నేను దేవుని నీకన్నా స్పష్టంగా చూస్తాను. నిన్ను నా కళ్ళతోనే చూస్తాను. కాని దేవుని నా ప్రతి అణువుతోనూ చూస్తాను" అని సమాధానమిచ్చేరు.

స్వీయానుభవం లేకపోతే ఎవ్వరూ తాము దేవుని చూసామని చెప్పలేరు. శ్రీ రామకృష్ణ వలె దేవుని దూత వంటివారు చూడడానికి సాధారణంగా కనిపించినా, లోపల వేరే, శకలం వలె బ్రతికే జీవివలె కాక, దేవునివలె ప్రేమి౦చే శక్తి కలిగి ఉంటారు.

కొన్నేళ్ళ సాధనతో దేవుడు ఎంతో కొంత మనకు అగుబడతాడు. అప్పుడు మనం జీవితపు లోతులను చూస్తాం. ఆ అనుభవం కొన్ని క్షణాలు ఉండవచ్చు. కాని అది దేవుని ఉనికి గూర్చి మరపురాని అనుభవం. అప్పటి నుంచి మనం మనుష్యులు ఎటువంటి రంగువారైనా, పొట్టివారైనా, పొడుగువారైనా, వారిలో దేవుని చూస్తాం. మనం అలా ఒకమారు రుచి చూస్తే ఇంకా వేరేదేమీ దాని సాటి రాదు. మన కోర్కెలన్నీ ఆ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనే దిశగా లీనమవుతాయి.

మనకి ఈ విధంగా జ్ఞానోదయం అయితే, దేవుని గేల౦లో చిక్కుకుంటాం. ఎక్ హార్ట్ మనమెంత అల్లాడితే, ఆ గేల౦లో అంత చిక్కుకుంటాం అన్నారు. మనము తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు; చివరికి మనకు గేల౦ వేసినవారు ఎవ్వరో తెలిసికొంటే, మనలను ఆ సాక్షాత్తూ పరమాత్మ పట్టుకున్నాడని గుర్తించి మనమెంతో అదృష్టవంతులమని భావిస్తాము. 271

Eknath Gita Chapter 10 Section 30

Bhagavat Gita

10.30

అథవా బహునై తేన కిం జ్ఞాతేవ తవార్జున {10.42}

విష్టభ్యాహ మిదం కృత్త్స్న౦ ఏకాంశేన స్థితో జగత్

అర్జునా! విశేషమైన నా ఈ విభూతులను తెలియుట చేత నీకు ఏమిలాభము? ఈ సమస్త జగత్తును ఒక అంశము చేతనే నేను వ్యాపించి యున్నాను

అర్జునుని మీద ఉన్న ప్రేమతో శ్రీకృష్ణుడు తాను సృష్టిలో ఎలా వ్యక్తమవుతున్నాడో వివరించేడు. సనాతన ఋషుల, నేటి కుటుంబాల, పౌరాణిక జంతువుల, వ్యాకరణ అలంకారాల, ఉదాహరణాలతో తాను అన్ని జీవులలోనూ, క్రియలలోనూ ఉన్నాడని చెప్పేడు. ఏదైతే సంపూర్ణమో, సౌందర్యవంతమైనదో, ఐకమత్యానికి చిహ్నమో, అది తానే అని వివరించేడు. ఈ విధంగా అర్జునునికి గురువువలె బోధ చేసి, అతనిని అంతములేని పదములలో దారి తప్పవద్దని చెప్పుచున్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయనే కోట్లాను కోట్ల నక్షత్ర వీధులను నియంత్రించి, వాటిలోని జీవులను తన శక్తితో రక్షిస్తున్నాడని మనం తెలిసికొంటే చాలు. 268

Eknath Gita Chapter 10 Section 29

Bhagavat Gita

10.29

నాంతో అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప {10.40}

ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా

పరంతపా! దివ్యములైన నా విభూతులకు అంతము లేదు. అయినను నా విభూతుల యొక్క వివరణము సంక్షేపముగ చెప్పబడినది

యద్యద్విభూతి మత్సత్త్వం శ్రీ మదూర్జితమేవ వా {10.41}

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజో అంశ సంభవమ్

విభూతి యుక్తము, కాంతియుతము, ఉత్సాహవంతము నగు వస్తువు ఏది కలదో అది నా యొక్క అంశము వలన కలిగినదని ఎరుగుము

ఎక్కడైతే నిస్వార్థము, దయ ఉన్నాయో, ఎవరైతే ఇతరులను బాధించక తాము బాధననుభవిస్తారో, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని చూడడానికి ఒక భౌతిక౦గా లేదా మానసిక౦గా వ్యక్తమైన దానిని చూడనక్కరలేదు. సహనం, క్షమించే గుణం, ఒక్క నీతి వాక్యాలను వల్లించడానికే కాదు. అవి మనలోని ఐకమత్యాన్ని పెంపొందించే సులక్షణాలు.

భౌతిక శక్తుల వలె ఆద్యాత్మిక శక్తి విశ్వంలో అన్నిచోట్లా ఉంది. మనమొక్కరమే ఓర్పుకు, దయకు స్పందించేవారలము కాదు. జంతువులు కూడా. గుబ్బఓ అనే వూరులో ఒక తోడేలు జనులను భయాందోళనలకు గురిచేసింది. దానిని వారు పట్టి బంధించి, చంపడానికి నిశ్చయించుకొన్నారు. అప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆ భయంకరమైన తోడేలు దగ్గరకు వచ్చి ఒక చిన్న పిల్లవాడిని మందలించినట్టుగా గట్టిగా మందలించేడు. ఫ్రాన్సిస్ ప్రేమ పూరితుడై యున్న౦దున ఆ తోడేలు ఆయనను చూసి భయపడక, తల దించుకొని ఆయన చెప్పిందంతా వింది. అటు తరువాత ఆ తోడేలు మంచి నడవడికతో ఆ ఊరులోని వారందరి ప్రేమను చూరుగొంది. 268

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...