Friday, July 17, 2026

Wendy Doniger Rig Veda Mystery of Agni




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట

4.5   The Mystery of Agni

4.5   అగ్ని యొక్క రహస్యము

This obscure hymn may be an indirect description of an oral contest about Agni. The poet or poets tantalize us with oblique references to a secret revealed by Agni and revealing Agni;

ఈ ఋక్కు ద్వారా అగ్ని యొక్క రహస్యాలు వెల్లడించబడ్డవి

this secret is alluded to with expressions such as ‘the gift’ (v. 2), ‘the inner meaning’ (v. 3), ‘this thought so high and deep’ (v. 6), ‘the vision that illuminates’ (v. 7), ‘this speech of mine’ (v. 8).

ఆ రహస్యాలు 'వరము', 'అంతర్గత అర్థము', 'లోతైన ఆలోచన', 'చూపు ప్రకాశింపజేస్తుంది', 'నా వాక్కు' మొదలైన పదములతో వెల్లడించడ మైనది.

The opponents of the poet appear in various pejorative forms (‘those who break the commandments’, ‘those without Order or truth’, ‘those whose speech is empty and contrary’, who ‘follow a false path’, etc.).

అలాగే ద్రష్ట తన ప్రత్యర్థులను అనేక పద ప్రయోగములతో కించ పరచెను.

There is also an extended pun upon the word padam, which designates a footprint (v. 3), a ‘deep place’ (hell? -in v.5), perhaps with a double meaning of ‘this riddle’ (i.e. ‘this mysterious verse’), the place of the sun-bird (v. 8), the Order (v. 9) and the cow (v. 10), and a path (v. 12).

ఇచ్చట పాదము యొక్క బహుళ అర్థాలను ద్రష్ట ప్రయోగించెను

These meanings are linked: to know the verse (padam) is to know how to follow the footprint (padam) along the path (padam) to the sacred place (padam) of the sun-bird, who is the symbol of the Order and is in turn symbolized by the cow.

The actual content of the secret concerns the identity of Agni with a bull,

ఇంతకీ ఆ రహస్యము అగ్ని వృషభమువలె

with the substance inside the leather-skin of food (a metaphor for an udder or the clouds or the earth or the human stomach, the latter being the site, in later Hinduism, of the digestive fire ‘Of-all-men’),

తోలు సంచీలో నుండే వస్తువు (గోవు పొదుగు లేదా మేఘములు లేదా భూమి లేదా మానవ జీర్ణకోశము)

with the calf of the dappled cow Prsni (the earth) or

మచ్చలుగల గోవు పృశ్ని యొక్క దూడ (అనగా భూమి)

of the cows of dawn,

ఉషస్సు గోవులు

and with the disc of the sun or the sun-bird,

మరియు సూర్యుని చక్రము లేదా సూర్య పక్షి

the round ‘face of the gods’.

దేవతల వృత్తాకార ముఖములు

Agni’s parents are sky and earth, or the fire-sticks (v. 10);

భూమ్యాకాశాలు అగ్ని యొక్క తలదండ్రులు. లేదా అగ్నిని రగిల్చే కట్టెలు.

in the latter case, he hungers for the offering of butter as a calf hungers for milk,

అతడు పాలకై తపించే దూడవలె నెయ్యకై తపిస్తాడు

the ‘precious substance’ in the udder of Prsni;

పృశ్ని పొదుగులో నుండే విలువైన వస్తువు

as the sun, the calf of the dawn, Agni is followed by her.

సూర్యుడు, ఉషస్సు దూడవలె, అగ్ని ఆమెచే అనుసరింపబడేవాడు

Thus the solar, sacrificial, and bovine images intertwine.

సూర్యుని, యజ్ఞముల, మరియు గోవుల ఉపమానములు అంతర్లీనమైనవి.

The gift that Agni gives the poet is the ‘clarifying vision’ that sees that Agni is always present in all of these forms.

అగ్ని ద్రష్టకు ఇచ్చే వరము సర్వ వస్తువులలో ఉండేది అగ్ని అనే జ్ఞానము

To find the secret is to find the cows, or their milk, or to find the hidden sun – to fond Agni, the sacred fore.

రహస్యమును కనుగొనుట అనగా, గోవులను, లేదా వాటి పాలను, లేదా మరుగు పడిన సూర్యుని కనుగొనుట

1 How shall we with one accord give homage to the benevolent Agni Of-all-men? Great light, by his great and full growth he has propped up the sky as a buttress props a rampart.

1.మనము ఏకమై అగ్నిని ఎటుల పొగడెదము? తేజోవంతుడు, మిక్కిలి శక్తిమంతుడు, ఆకాశమును ఒక కోట గోడను నిలబెట్టనట్లుగా నిలబెట్టును

2 Do not reproach the self-ruled god who gave this gift to me, for I am a simple mortal, while he is the clever immortal, the insightful, most manly and impetuous Agni Of-all- men.

2. స్వీయ పరిపాలకుని, నాకు వరము నిచ్చినవానిని నిందింపకండి; ఏలనగా నేను మానవ మాత్రుడను, కానీ అగ్ని అమరుడు, సర్వజ్ఞుడు, దివ్య పురుషుడు.

3 The strong bull with sharp horns and seed a thousand-fold has a mighty and double tone.1 As one reveals the hidden footprint of a cow, Agni has declared to me the inner meaning.

3.బలిష్టమైన, వాడి అయిన కొమ్ములు గల, పటిష్ఠమైన వీర్యము గల ఎద్దు రెండు ఱంకెలు గలది1. ఎలాగైతే ఒకడు గోవు యొక్క దాగి యున్న అడుగు జాడలు తెలుపుతాడో, అగ్ని అంతరార్థమును నాకు చెప్పెను.

4 Let the generous Agni, sharp-toothed with white-hot flame, devour those who break the dear, firm commandments of Varuna and the watchful Mitra.2

4.ఉదారుడైన, పటిష్ఠమైన దంతములు గల, జ్వాలలతో ప్రజ్వలించే అగ్ని, ఎవరైతే వరుణ మరియు మిత్రుని చట్టాన్ని వ్యతిరేకిస్తారో, వారిని దహించు గాక2.

5 Wilful as women without brothers, wicked as wives who deceive their husbands, those who are evil, without Order or truth, have engendered this deep place.3

5.సహోదరులు లేని విచ్చల విడిగా నుండేస్త్రీలవలె, తమ భర్తలను మోసగించే భార్యల వలె, ధర్మము లేదా సత్య ప్రవర్తనము లేని వారికై పాతాళమున్నది 3

6 O Agni, who makes things clear, who am I, that upon me when I have broken no commandments you have boldly placed like a heavy burden this thought so high and deep, this fresh question with seven meanings for the offering?

6.నా సందేహాలను తొలగించే అగ్నీ, నేనే మాత్రము? నేనే చట్టాలను ఉల్లంఘించక పోయినా, ఈ ఉన్నతమైన, లోతైన ఆలోచన, సప్త అర్థాలు గల ప్రశ్నాభారాన్ని నాపై వేసేవు?

7 Let our vision that clarifies through sacrificial power reach him who is the same everywhere; the precious substance of the dappled cow is in the leather-skin of food, and the disc of the sun has mounted to the head of the earth-cow.

7.యజ్ఞము ద్వారా శక్తివంతమైన దృష్టి సర్వత్ర సమముగా నుండే వాని వరకు వ్యాపించుగాక; గోవు యొక్క విలువైన వస్తువు ఆహారపు తోలు సంచీలో నున్నది; సూర్యుని చక్రము భూమాత అనబడే గోవు ముఖమును అధిరోహించినది.

8 What of this speech of mine should I proclaim? They murmur about the secret hidden in the depths: when they have opened the mystery of the cows of dawn, like a door upon a food, he4 protects the beloved head of the earth-cow, the place of the bird.

8.ఈ నా వాక్కుతో ఏమని శాసించేది? వారు లోతుగా పాతబడిన రహస్యాలతో గుసగుస లాడుతారు. వారు ఉషస్సు గోవుల రహస్యాలను తెలుపుతారు; ఆహారమును కప్పే తలుపు వలె, అతడు భూమాత గోవు ముఖమును రక్షిస్తాడు.4 అదియే పక్షి యొక్క స్థానము.

9 This is that great face of the great gods, that the cow of dawn followed as it went in front. I found it shining in the place of the Order, moving swiftly, swiftly.

9. ఇది ఉషస్సు గోవు ముందున ఉండి వెంబడించే దేవతల యొక్క గొప్ప ముఖము. నేను ధర్మము గల మెరిసే ప్రదేశములో వేగంగా వెళ్ళుట గాంచేను

10 As he blazed beside his parents with his open mouth, he thought of the precious hidden substance of the dappled cow. In the farthest place of the mother, facing the cow, the tongue of the bull, of the flame, stretches forth.

10.అతడు విప్పారిన నోరుతో తన తలిదండ్రుల ప్రక్కన మెరయుచుండగా, మచ్చలు గల గోవులో దాచి పెట్టిన విలువైన వస్తువుల గూర్చి ఆలోచించెను. తల్లికి బహు దూరంగా, గోవుకు ఎదుర్ముఖముగా, ఎద్దు యొక్క నాలుక వలె, జ్వాల కొనసాగెను.

11 When questioned I speak reverently of the Order, if I may, trusting in you who know all creatures. You rule over all this, over all the riches in heaven and all the riches on earth.

11. అన్ని జీవులను తెలిసిన నిన్ను నమ్మి, ప్రశ్నించబడితే నేను ధర్మము గూర్చి భక్తితో చెపుతాను. నువ్వు సర్వమునకు పరిపాలకుడవు. భూలోకములోని, స్వర్గములోని సర్వసంపదకు ప్రభువు.

12 What is ours of this, what riches, what treasure? Tell us, for you understand, you who know all creatures.5 Hidden is the farthest end of our road, where we have gone as those who fail follow a false path.

12.మాకు దక్కే ధనము, నిధి ఏమిటి? సర్వ జీవులను తెలిసిన, అర్థము చేసుకోగల, నీవు చెప్పు5. పథము యొక్క అంతము దాచి పెట్టి బడి యన్నది. మేము అపజయము పొందిన వారి వలె తప్పుడు ద్రోవన పయనించేము.

13 What are the limits? What are the rules? What is the goal? We wish to go there as racehorses speed towards the victory prize. When will the Dawns, goddesses and wives of immortality, spread over us their light with the colour of the sun?

13.అంతములేమిటి? ఏవి పాటించ వలసిన సూత్రాలు? గమ్యమేమిటి? పందెములో పరిగెత్తే గుర్రాల వలె మేము అక్కడికి పోవ గోరెదము. ఎప్పుడు ఉషస్సులు, దేవతలు, అమరులైన వారి భార్యలు, సూర్యుని వర్ణము గల కాంతిని మాపై ప్రసరించెదరు?

14 Those whose speech is empty and contrary, insipid and petty, who leave one unsatisfied, what can they say here, Agni? Unarmed, let them fall defeated.

14.ఎవరి వాక్కు నీచమో, దంభమో, అర్థ రహితమో, తృప్తి నివ్వదో, అగ్నీ, వారింకేమి చెప్పెదరు? నిరాయుధులైన వారు అపజయమును పొందు గాక

15 The face of the bull, of this deity kindled for beauty, shone forth in the house. Clothed in white, beautiful in form and rich in gifts, he glowed like a home full of riches.

15.ఎద్దు యొక్క ముఖము, ఈ అందమైన దేవత వలె, గృహములో ప్రకాశించెను. శ్వేత వస్త్రములు ధరించి, అందమైన రూపముతో, సిరిసంపదలు గలవాడై, అతడు ధనసంపదలతో విరాజిల్లే గృహము వలె ప్రకాశించెను.

NOTES

వివరణ

1. The bellow of the bull is likened to the two tones of the Vedic hymn (the high and middle pitch).

1.ఎద్దు యొక్క ఱంకె ఋక్కు యొక్క ఉన్నత, మధ్యమ స్వరములతో పోల్చబడినది.

2. Varuna and Mitra are the keepers of the moral law. Cf. 5.85.7.

2.వరుణ, మరియు మిత్ర ధర్మాన్ని రక్షించేవారు.

3. A possible reference to Hell (cf. 7.104.3). But here the meaning is more positive (as both ‘deep’ and ‘place’ are positive terms in this and in other hymns of the Rig Veda), and the phrase more likely refers to the world of light under the earth, where the sun moves from West to East at night.

3.బహుశా నరకాన్ని సూచించవచ్చు

4. Agni.

4. అగ్ని

5. Jatavedas. Cf. 10.16.

5.జాతవేదాలు

Friday, July 10, 2026

Wendy Doniger Rig Veda Indra Coaxing Fire




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట

10.124   Indra Lures Agni from Vrtra

10.124   ఇంద్రుడు అగ్నిని ఆహ్వానించుట

Indra speaks on behalf of the gods to lure Agni back when he has fled (cf. 10.51).

ఇంద్రుడు దేవతల తరపున అగ్నిని వెనక్కి రప్పించుకొనుటకు ప్రయత్నించెను.

Agni is hiding inside a father (perhaps Indra’s father; cf. 4.18) who is called an Asura, an enemy of the gods though not yet properly a demon; this Asura is eventually identified with the demon Vrtra.

అగ్ని దేవతల శత్రువైన వృత్ర అనబడే అసురుడు వద్ద దాక్కొన్నాడు.

Thus the hymn combines the myth of finding Agni (10.51) with the myth of killing Vrtra (1.32).

ఈ ఋక్కులో వృత్రుని సంహారము మరియు అగ్నిని వెదకి పట్టుకొనుట వివరించబడినది.

Varuna and Soma are also said to have been with the Asura and to abandon him when Agni is persuaded to do so.

ఆసురునితో వరుణ మరియు సోమ కూడియుండగా, అగ్నితో పాటు వారు కూడా విడుదల చేయబడ్డారు.

Indra invites Agni to return (v. 1), and Agni accepts (v. 2); Varuna and Soma follow (vv. 3-4), and are further encouraged by Indra’s promises (vv. 6-7).

ఇంద్రుని ఆహ్వానమును అగ్ని మన్నించి వరుణ మరియు సోమ లతో కలసి వచ్చెను.

The poet then praises Indra for winning these allies (vv. 8-9).

ద్రష్ట ఇంద్రుడు మిత్రులను వెదకి తెచ్చుటను ప్రశంసించెను.

1 [Indra:] ‘Agni! Come to this sacrifice of ours, that has five roads, three layers, and seven threads.1 Be our oblation-bearer and go before us. For far too long you have lain in darkness.’

1.[ఇంద్రుడు] ఐదు పథములు, మూడు పొరలు, ఏడు దారములు గల మా యజ్ఞమునకు రమ్ము. మా ఆహుతులను అందుకునే పురోహితునిగా మమ్ములను నీ వెనుక నడిపించు. ఎంతో కాలము నీవు చీకటిలో గడిపేవు.

2 [Agni:] ‘Secretly going away from the non-god,2 being a god and seeing ahead I go to immortality. Unkindly I desert him who was kind to me, as I go from my own friends to a foreign tribe.’

2.[అగ్ని]: రహస్యంగా అసురునిని వీడి, దేవతను కనుక ముందు చూపుతో నేను అమరత్వమును పొందెదను. దయ లేకుండా నాయందు దయ చూపిన వానిని వీడి నా మిత్రులతో కలసి వేరొక జాతికి పోయెదను.

3 [Varuna:] ‘When I see the guest of the other branch,3 I measure out the many forms of the Law. I give a friendly warning to the Asura father: I am going from the place where there is no sacrifice to the portion that has the sacrifice.’

3.[వరుణ]: నేను మరో అథితిని చూసినప్పుడు 3 ఆచార విధులను కొలిచేను. నేను అసురుని ఈ విధముగా హెచ్చరించేను: నేను యజ్ఞము చెయ్యని ప్రదేశం నుంచి, యజ్ఞము చేయబడే ప్రదేశమునకు పోవుచున్నాను.

4 [Soma:] ‘I have spent many years within him. Now I choose Indra and desert the father. Agni, Soma, Varuna -they fall away. The power of kingship has turned around; therefore I have come to help.’4

4.[సోమ]: నేను అనేక సంవత్సరాలు వానితో గడిపేను. నేను ఇప్పుడు అసురునిని వీడి ఇంద్రునితో కలిసేను. అగ్ని, సోమ, వరుణ ఇక లేరు. మా మైత్రి ఎదురు తిరిగింది. . కాబట్టి నేను సహాయము చేయుటకై వచ్చేను. 4

5 [Indra:] ‘Varuna, these Asuras have lost their magic powers,5 since you love me. O king who separates false from true, come and rule my kingdom.

5.[ఇంద్రుడు]: వరుణా, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి (చెపుతున్నా) అసురులు తమ శక్తులు పోగొట్టుకున్నారు.5 నిజానిజాలను తెలిసిని రాజా, నా రాజ్యమును ఏలుము.

6 ‘This was the sunlight, this the blessing, this the light and the broad middle realm of space.6 Come out, Soma, and let us two kill Vrtra. With the oblation we sacrifice to you who are the oblation.’7

6. ఇది సూర్య కాంతి. ఇది ఒక ఆశీర్వాదము. ఇది మధ్యలోకాలను ప్రకాశింపజేసే కాంతి6 . సోమ, బయటకు రమ్ము. మనమిద్దరము కలిసి వృత్రుని సంహరించెదము. ఆహుతి స్వరూపానివి ఆయిన నీకు ఆహుతి ఇచ్చెదము . 7

7 The poet through his vision fixed his form in the sky; Varuna let the waters flow out without using force. Like his 8wives, the shining rivers make him comfortable; they swirl his colour9 along their current.

7.ద్రష్ట తన దివ్య దృష్టితో తన దేహాన్ని ఆకాశంలో నిలిపెను. వరుణా, జలములు ప్రసన్నముగా ప్రవహించనీ. వాని భార్యలు8 వలె మెరిసే నదులు వానికి సుఖము నిచ్చును. వాని వర్ణము 9 ప్రవాహములో ప్రకాశించును.

8 They10 follow his supreme Indra-power;11 he dwells in those who rejoice in their own nature. Choosing him as all the people choose a king, they have deserted Vrtra whom they loathe.

8. శక్తిమంతుడైన ఇంద్రుని వారు 10అనుసరించిరి. ఎవరైతే తమ స్వస్వరూపంలో రమిస్తారో, వారిలో అతడు11 నివసించును. ఒక రాజు వలె వానిని ఎన్నుకొని, హీనుడైన వృత్రుని వీడిరి.

9 They say that the yoke-mate of those full of loathing12 is a swan who glides in friendship with the divine waters. The poets through their meditation have seen Indra dancing to the Anustubh.

9. ఎవరైతే నిరశిస్తారో 12వారికి దేవతా సరోవరములో మైత్రితో సాగే హంస సహచరునిగా పొందెదరని చెప్పెదరు. కవులు ధ్యానములో ఇంద్రుడు అనుష్టుబ్ ఛందస్సుతో నాట్యము చేయుట గాంచిరి.

NOTES

వివరణ

1. For the number mysticism of the sacrifice, cf. 1.164.

1. ఆ సంఖ్యల విశిష్టత 1.164 లో చెప్పబడినది

2. That is the Asura, Vrtra. Cf. 10.51.7, where Agni demands immortality.

2. అగ్ని అమరత్వమును ఆశించి, వృత్రుని ఉద్దేశించి చెప్పుట

3. That is, when Varuna sees that Agni is the guest of the Asuras (his ‘own friends’; cf. 2.35.2) rather than the gods (the ‘foreign tribe’), and that therefore the Asuras have the sacrifice, Varuna measures out (i.e. formulates and creates) the ritual laws for the gods.

3. వరుణ, అగ్ని దేవతలకు విరోధులైన అసురుల అతిథిగా పరిగణించెను. అందువలన అసుర యజ్ఞములలో దేవతల ఆచారములను సంయోగము చేసెను.

4. That is, realizing that the gods are getting the upper hand again, Soma the king returns to assist at their sacrifice.

4. రాజైన సోమ దేవతలు అసురుల కన్న పైచేయి గలవారని తలచి, యజ్ఞములో పాల్గొనుటకు సహకరించెను.

5. The power of illusion particularly associated with Asuras such as Vrtra; cf. 1.32.4.

5.అసురుల, ముఖ్యంగా వృత్రుని, మాయాజాలము.

6. Apparently Indra is telling Varuna and Soma that all the powers of light that belong to the gods are once again theirs, now that the dark power of the Asuras has been overcome.

6. ఇప్పుడు అసురుల మాయా జాలము లేనందున, ఇంద్రుడు వరుణ మరియు సోమ లకు కాంతితో గూడిన దేవతా శక్తులు మరల పొందుట సూచితము.

7. Cf. sacrificing the sacrifice to the sacrifice, 10.90.16.

7. యజ్ఞమును యజ్ఞముతో యజ్ఞము చేయుట

8. Indra’s wives, the waters that he frees when he kills Vrtra.

8. వృత్ర సంహారము పిదప విడుదల చేయబడిన జలములు ఇంద్రుని భార్యలు సూచితము

9. Indra, the poet, places his stamp upon his dominion again, both in form and in colour. His colour (varna) is both the sign that typifies his species (gods in contrast with Asuras) and, perhaps, the bright colour of the gods and Aryans in contrast with the darkness of the Asuras and Däsas.

9.ఇంద్రుడు తన ఆధిపత్యమును స్వరూపము మరియు వర్ణము ద్వారా చూపెను. అతని వర్ణము ప్రకాశించే దేవతల వర్ణముకాగా, అసురులు చీకటి వర్ణము గలవారు.

10. The waters.

10. జలములు

11. Indra’s power consists in the forces of his nature (kingship, fertility, sacrifice, etc.) ; he rejoices in these and in people who, in their turn, rejoice in their own particular powers and nature.

11. ఇంద్రుని శక్తులు: రాచరికము, వీర్యము, యజ్ఞము మొదలైనవి. అతడు తమ శక్తులలో సహజముగా రమించే వారలతో కలిసి సంతోషిస్తాడు.

12. That is, those who loathe Vrtra have as their helper (yoke mate) Indra, here visualized by the poet as a swan dancing in the waters. Those who loathe Vrtra are primarily those who desert him (Agni, Soma, Varuna), as well as the waters whom Indra has released and the worshippers who rejoice in Indra’s victory.

12. ద్రష్ట వృత్రుని తిరస్కరించే వారలకు ఇంద్రుడు మిత్రుడు అని, జలములలో విహరించే రాజ హంసతో పోల్చెను. వృత్రుని తిరస్కరించేవారు వానిని వదలి పెట్టే వారు (అగ్ని, సోమ, వరుణ) . అలాగే ఇంద్రునిచే విడువబడిన జలమలు మరియు ఇంద్రుని విజయమునకై సంతోషించేవారు.

Saturday, July 4, 2026

Wendy Doniger Rig Veda Gods Coaxing Fire




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని

10.51   The Gods Coax Agni out of the Waters

10.51   దేవతలు అగ్నిని బ్రతిమాలుట

This hymn is based upon the myth of the finding of the lost Agni.

ఈ ఋక్కు అగ్ని యొక్క అంతర్ధానమును వివరిస్తుంది.

In this particular episode, it appears that Agni’s three brothers have perished in the service of the gods (mediating, serving as priests, carrying the oblation to the gods, as is the task of the sacred fire);

దేవతల సేవలో అగ్ని యొక్క మూడు సోదరులు -- అనగా దేవతలతో రాయభారము, పురోహితులు మరియు యజ్ఞ హవిస్సును దేవతలకు అందజేయుట -- మరణించిరి.

in fear of being destroyed in the same way, Agni fled and hid in the waters, the place of his birth,1 but the gods found him there again.

అగ్ని తాను కూడా మరణిస్తాడని భయపడి తన జన్మ స్థానమైన1 జలములలో దాగుకొనగా, దేవతలు వాని జాడను తెలిసికొనిరి.

The myth is thus both a conversation between the gods, asking him to return to them, and a dialogue on the dangers of being born at all, since life involves old age and death.

ఈ నేపథ్యంలో దేవతలు మధ్య సంభాషణ అగ్నిని వెనక్కు రమ్మని కోరుతూ పుట్టుకలో ఉండే ప్రమాదాలు, ఎందుకంటే జీవితంలో జరామరణాలు ఉంటాయి కనుక, వివరిస్తుంది.

The myth of the finding of the lost Agni is an analogue to the myth of the finding of the stolen Soma,2 and is, in fact, a variant of it, for it is the golden liquid of fire that is the basis of the Indo-European myth of Agni and Soma together.

మాయమైన అగ్ని జాడలు తెలిసికొనే ప్రక్రియ అపహరింపబడిన బంగారు వర్ణము గల సోమమును 2 కనుగొనుటను పోలి నుండును.

1 [A god:] ‘Great was that membrane,3 and firm, which enveloped you when you entered the waters. One god, O Agni, knower of creatures, saw all your various bodies.’

1. [దేవత:] నువ్వు జలములో ప్రవేశించినప్పుడు నీ చుట్టూ యున్న పొర 3ధృడముగా నుండెను. సర్వ జీవులను తెలిసిన అగ్నీ ఒక దేవత నీ వివిధ స్వరూపములను చూచెను.

2 [Agni:] ‘Who saw me? Who among the gods perceived my various bodies?4 O Mitra and Varuna, where are all the fuel-sticks of Agni that lead to the gods?’5

2. [అగ్ని:] నన్ను ఎవరు చూచిరి? నా వివిధ స్వరూపాలను దేవతలలో ఎవరు గాంచిరి? 4 మిత్రా మరియు వరుణా, నా జాడను దేవతలకు తెలిపిన ఇంధన కట్టెలు ఎక్కడ ఉన్నవి?5

3 [Varuna:] ‘We searched for you in various places, O Agni, knower of creatures, when you had entered into the waters and the plants. It was Yama6 who discovered you with your many-coloured light which shines beyond the distance of ten days’ journey.’

3. [వరుణ:] నీవు జలములోను, ఓషధులలోను ప్రవేశించినపుడు, సర్వ జీవుల ఎరుక గల అగ్నీ, నిన్ను అన్ని ప్రదేశాలలోనూ వెదికితిమి. పది దినములు ప్రయాణించ గలిగే దూరము వరకు అగుపడే నీ యొక్క తేజము ద్వారా యముడు 6 నిన్ను గుర్తించెను.

4 [Agni :] ‘ I fled because I feared the role of oblation-giver, so that the gods would not harness me to it, O Varuna. My bodies entered various places; I, Agni, have ceased to consider this task.’7

4.[అగ్ని:] వరుణా, నేను దేవతలతో బంధ కారణమైన ఆహుతలు స్వీకరించే కార్యము జేయుటకు భయపడ్డాను. నా దేహాలు అనేక ప్రదేశములు ప్రవేశించాయి. నేను ఈ కార్యం నుండి వైదొలగుతున్నాను. 7

5 [Varuna:] ‘Come here. Man,8 who loves the gods, wishes to sacrifice. When you have completed the ritual, Agni, you dwell in darkness.9 Make smooth the paths which lead to the gods; carry the offerings with a good heart’

5. [వరుణ:] పురుషుడా 8 ఇక్కడకు రమ్ము. దేవతలను ప్రేమించేవాడు యజ్ఞమును కోరుతాడు నీవు నీ కార్యము చేసి, అంధకారంలో నుంటావు.9 దేవతలను చేరే పథములను సవ్యము చేయుము; హవిస్సులను సహృదయంతో తీసికొని వెళ్ళు.

6 [Agni:] ‘The brothers of Agni long ago ran back and forth on this task like a chariot- horse10 upon a road. Fearing this, Varuna, I went far away. I fled like a buffalo before the bowstring of a hunter.’

6. [అగ్ని: ]నా సోదరులు రథమును లాగే అశ్వముల10వలె చాలా కాలం నుండి ఈ కార్యం చేసేరు. అందుకు భయపడి, వరుణా, నేను బహు దూరం పయనించేను. ఒక వేటగాని ధనుస్సుకు భయపడి పారిపోయే జంతువు వలె నేను పరిగెత్తి పోయేను.

7 [The gods:] ‘We will make your life-span free of old age, O Agni, knower of creatures, so that you will not be harmed when you have been harnessed. Then you will carry the portion of the offering to the gods with a willing heart, O well-born one.’

7.[దేవతలు:] సర్వ ప్రాణులను ఎరుగు అగ్నీ, నీకు వార్ధక్యము లేకుండునట్లు ఆయుష్యు నిచ్చి, నీకు మా వలన ప్రమాదము లేకుండా చేసెదము. ఓ ఉత్తమ జన్మగలవాడా, అప్పుడు నీవు దేవతలకు అందవలసిన హవిస్సు సహృదయంతో అందించెదవు.

8 [Agni:] ‘Give me alone the pre-sacrifices and the post-sacrifices, the nourishing part of the offering; and the clarified butter out of the waters and the Man out of the plants.11 And let the life-span of Agni be long, O gods.’

8.[ అగ్ని:] నాకు మాత్రమే యజ్ఞ పూర్వము, యజ్ఞము తరువాత రుచి కరమైన ఆహుతులను ఇవ్వాలి. అలాగే జలముల నుండి ఉత్పన్నమయ్యే నెయ్య మరియు ఓషధుల అధిపతి11. దేవతలారా, అగ్ని యొక్క ఆయుష్యు దీర్ఘముగా నుండాలి.

9 [The gods:] ‘The pre-sacrifices and the post-sacrifices will be for you alone, the nourishing parts of the offering. This whole sacrifice will be for you, Agni; the four quarters of the sky will bow to you.’

9. [దేవతలు:] యజ్ఞ పూర్వము, యజ్ఞము తరువాత రుచి కరమైన ఆహుతులు నీకు మాత్రమే చెందుతాయి. అగ్నీ, యజ్ఞమంతా నీకోరకే. నలు దిక్కులు నీకు వంగి వందనము చేస్తాయి.

NOTES

వివరణ

1. For Agni as child of the waters, see 2.35.

1. ఎందుకంటే అగ్ని జలము యొక్క పుత్రుడు

2. Cf. notes on 4.26-7.

2. 4.26-7 చూడుడు

3. The word denotes the covering of the embryo in the womb. Agni is the embryo of the waters and so returns to the womb when he hides. The gods point out that even there he was not safe from them.

3.ఇక్కడ గర్భంలో పిండం చుట్టూ నుండే మావి సూచితము. అగ్ని ఒకప్పుడు జలము యొక్క పిండము గనుక, దాగు కొనుటకై జలగర్భం ప్రవేసించెను. దేవతలు అక్కడ కూడా క్షేమ కరము కాదని చెప్పుచున్నారు.

4. Agni has many forms in different places (lightning, sacrificial fire, the human body, etc.). Cf. 10.16, 6.9, and 1.164.1.

4. వివధ ప్రదేశాలలో అగ్నికి వివిధ రూపాలున్నాయి: మెరుపు, యజ్ఞాగ్ని, మానవ దేహము లోని ఉష్ణము మొదలైనవి.

5. Mitra and Varuna lead the gods in the search. Agni argues that he cannot be seen in the water, because there are no fuel-sticks there to kindle him. These are the sticks which bring Agni to the gods through the oblation, and the sticks by which he carries the oblation from man to the gods.

5.మిత్రుడు మరియు వరుణుడు అగ్నిని వెదకుటలో దేవతలకు అధిపతులైరి. అగ్ని వాదన తనను రగిల్చే ఇంధన కట్టెలు జలములో లేనందున ఎవ్వరూ తనను చూడలేరు. ఇంధన కట్టెలు ద్వారా అగ్ని హవిస్సును మరియు మానవులిచ్చే ఆహుతులను దేవతలకు అందించును

6. In one retelling of the myth the gods bribe Agni by allowing him to change places with Yama, sending Yama to the world of the dead and bringing Agni to the world of the gods.

6.దీనిమీద ఆధారంగా మరొక కథ ప్రాచుర్యము పొందెను: దేవతలు అగ్నికి లంచంగా యముని స్థానము నిచ్చి, యముని మరణించిన వారుండే లోకమునకు పంపి, అగ్నిని దేవతలుండే లోకమునకు పంపిరి.

7. That is, he flatly refuses to become their invoker or priest of the oblation (Hot?).

7.అతడు ససేమిరా ఆహుతుల నంద జేసే పురోహితుడుగా నుండుటకు నిరాకరించెను. (ఉష్ణము కారణమా?)

8. Here, as elsewhere, the word (Manu) may designate either mankind in general or Manu the eponymous ancestor of mankind. I think the former is the primary meaning, but since Manu is the brother of Yama who has just been mentioned, there may be resonances with the latter meaning too.

8.ఇక్కడ "మనువు" అను పద ప్రయోగము మానవ జాతిని లేదా ప్రజాపతిని సూచించును. మొదటిది ఇక్కడ ప్రధానమైన అర్థము. మనువు యముని సోదరుడు గాన రెండవది కూడా సూచింపబడి ఉండవచ్చు.

9. That is, you may rest after serving us. Cf. 6.9.1 and 6.9.7, and 10.124.1. 9.మా సేవలు చేసిన పిదప విశ్రమించ వచ్చు.

10. Agni is often called a horse, and the expression ‘harnessing’him to the task of priest (vv. 4 and 7) thus takes on more specific relevance.

10.తరచు అగ్నిని అశ్వముతో పోలుస్తారు. కాబట్టి "పూన్చుట" అనే ప్రయోగము సార్థకము.

11. The clarified butter is the essence of the waters, the most precious of fluids, and also something that is placed in the waters (in ritual and in cosmogonies, the golden seed – another form of Agni himself- in the waters).

11. అన్ని ద్రవ పదార్థములలో ఉన్నతమైన నెయ్య జలముల యొక్క సారము.

The Man of the plants may be the personified god who is the best of the plants (Soma) or the corpse that is given to Agni in the funeral (cf. 10.16) or that is dispersed among the plants (10.16.3).

ఓషథుల పురుషుడు సగుణుడైన దేవత ప్రతిరూపాము. ఓషథులలో ఉత్తమమైన వాడు (సోమ) లేదా దహన సంస్కారంలో అగ్నికి ఆహుతి చేసే మృత దేహము లేదా ఓషథులలో వ్యాపింప జేయునది.

Finally, Man is the ‘best’ of the plants (SB 7.2.4.26) as butter is the best of the fluids.

నెయ్య ద్రవములలో ఉత్తమమైనట్టు పురుషుడు ఓషధులలో ఉత్తముడు.

Wendy Doniger Rig Veda Mystery of Agni

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...