Bhagavat Gita
11.4
సంజయ ఉవాచ:
ఏవముక్త్వా తతో రాజన్! మహా యోగేశ్వరో హరిః
{11.9}
దర్శాయామాన పార్థాయ పరమం రూపమైశ్వరమ్
రాజా! ఈ విధముగ పలికి మహా యోగీశ్వరుడైన శ్రీ హరి మహోన్నతమైన, దైవసంబంధమైన విశ్వరూపమును అర్జునునకు చూపెను
అనేకవక్త్రనయన మనేకాద్భుత దర్శనం
{11.10}
అనేకదివ్యాభరణం దివ్యానేకో ద్యతాయుధమ్
దివ్యమాల్యా౦బరధరం దివ్యగంధాలేపనం
సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖమ్
{11.11}
అనేక ముఖములు, నేత్రములు గలదియు, అనేక విచిత్రములు గలదియు, అనేక దివ్యాభరణములు గలదియు, ఎత్తబడిన దివ్యాయుధములు గలదియు, దివ్యములైన పుష్పమాలలను, వస్త్రములను ధరించునదియు, దివ్యమైన గంధలేపనము గలదియు, సర్వాశ్చర్యమైనదియు, అనంతమైనదియు, అంతటను ముఖములు గలదియు, స్వయంప్రకాశమునైన విశ్వరూపమును అర్జునుడు దర్శి౦చెను ఀ
శ్రీకృష్ణుడు తన అనంతమైన విశ్వరూపమును చూపుచున్నాడు. అతడు అసంఖ్యాకమైన ముఖములు గలవాడై ఉన్నాడు. అర్జునుడు ప్రతి ముఖములోనూ, జీవిలోనూ దేవుని చూచెను. మనకు అత్యంత ఆశ్చర్యము కలిగించేది ఏమిటంటే: మన తలిదండ్రులు, జీవిత భాగస్వామి, బిడ్డలు, మిత్రులు మనలను చూసిననప్పుడల్లా అవి దేవుని కళ్ళతో అనే భావన. అందుకే బంధుమిత్రుల మధ్య జీవిస్తూ మనం దేవుడ్ని ప్రేమిస్తాం. బంధు మిత్రుల యందు అహంకారం పోతే మన౦ దేవుడ్ని అందరిలోనూ చూస్తాం.
అర్జునినికి శ్రీకృష్ణుడు అద్భుతాలకు యోని అని గ్రహిస్తాడు. మన జీవితమే ఒక మహాద్భుతం. మన శ్వాస, గుండె చప్పుడు కూడా అద్భుతాలు. అలాగే చెట్లపై వీచే గాలి, ఆకాశంలో వెలిగే సూర్యుడు. మనం అద్భుతాలకై విశ్వమంతా వెతకనక్కరలేదు. అవి మనముందే ప్రతిరోజూ జరుగుతూ ఉంటాయి. మన కళ్ళు తెరుచుకొని చూస్తేనే అది తెలిసికొంటాము. ఈ విధంగా అందరూ చూస్తే, మన ఇళ్లలోని, జాతుల మధ్య, దేశాల మధ్య గల వివాదములు పరిష్కరింపబడతాయి. ప్రపంచంలో దోపిడీ, హింస, అణ్వాయుధాల వలన అభద్రత తొలగిపోయేవరకు మనం శాంతిని పొందలేము. మహాత్మ "ప్రతి వానికీ ఆనందం కలిగే వరకు, మనలో ఏ ఒక్కరికీ ఆనందం కలుగదు" అని చెప్పెను.