11.5
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా
{11.12}
యది భా స్సదృశీసా స్యా ద్భాసస్తస్య మహాత్మనః
ఆకాశమునందు వేలకొలది సూర్యుల యొక్క కాంతి ఏకకాలమున బయలు దేరిన ఎంత కాంతి యుండునో అది ఆ మహాత్ముని యొక్క కాంతిని బోలియున్నది ఀ
మనం ఏ ఆచ్ఛాదనా లేకుండా సూర్యుని కళ్ళతో చూస్తే గ్రుడ్డి వార మవుతాం. సూర్యుని శక్తిలో ఒక చిన్న కాంతి పుంజం రమారమి 10 కోట్ల మైళ్ళు ప్రయాణి౦చి మన భూమిని వాతావరణం ద్వారా చేరి జీవులను ప్రభావితం చేస్తోంది. అర్జునినికి శ్రీ కృష్ణుడు చూపినది ఒకేమారు వేలకొలది సూర్యులు. అతని దేహామంతా సూర్య కాంతితో నిండి యున్నది. ఆతని మేధ దానిని గ్రహింపలేక అచేతనమైంది. సెయింట్ తెరెసా "ఆత్మ ఎప్పుడు సూర్యుని చూచునో ఆ కాంతి దాన్ని మిరుమిట్లు గొలుపుతుంది. చాలా సార్లు అది కాంతిని చూడలేక, గ్రహించలేక, ఆశ్చర్యంతో ఆ వింతలను చూస్తుంది" అని అన్నారు.
కానీ ఇది తక్కువగా అంచనా వేసే ఒక పద్యము. ఆ మిరుమిట్లు గొలిపే కాంతికి భగవంతుడే మూలము. ప్రతి ప్రకాశవంతమైన నక్షత్రము ఆయన మెడలో యున్న హారంలో ఒక పూస మాత్రమే. క్వాసార్స్ అనబడే నక్షత్రాలు మన సూర్యునికన్నా కోట్ల రెట్లు ప్రకాశవంతమైనవి. విశ్వమంతా కాంతితో నిండి ఉంది. అది దేవుని శక్తితో స్పందిస్తున్నది.
ఈ విధంగా బాహ్యంలో ఉన్న శోభ మన అంతర్గతంలో కూడా ఉంది. మన ఆధ్యాత్మిక చింతన కొనసాగుతూ ఉంటే; వేర్పాటు, అహంకారం తగ్గితే మన చేతన మనస్సులో ప్రకాశము అన్నివైపులా ప్రసరిస్తుంది. అది మన ఇంద్రియములకు అందని గొప్ప ప్రక్రియ. జీసస్ "దేహామంతా కాంతితో నిండి ఉంటుంది" అని ఒక చక్కని వివరణ ఇస్తారు.