Saturday, March 2, 2024

Vidura Neeti Part 2




(ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి జేర్చి, మూటి నాల్గింట కడువశ్యములుగ జేసి, ఏడింటిని గెల్చి యారింట నెఱిగి ఏడు, విడిచివర్తించువాడు వివేక ధనుడు. )

He who takes one, controls two, makes three and four still, conquers seven, and renounces seven is wise.

One is self; two stands for intellect, mind; three symbolizes wakeful, dream sleep, deep sleep states; four are disciplines of seekers of salvation; six are lust, anger, ego, jealousy, hatred, convetousness, desires. Seven stands for addictions.

[ఒకటి ఆత్మ; రెండు బుద్ధి, మనస్సు; మూడు అవస్థలు; నాలుగు సాధన చతుష్టయము; ఆరు అరషడ్వర్గాలు; ఏడు సప్త వ్యాసనాలు]

తాగినవానినే విషం చంపుతుంది. బాణం గుచ్చుకొన్నవానినే యమసదనం చేరుస్తుంది. ప్రజ లతో రాజును నశింపచెయ్య వచ్చు, . ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజించకూడదు. తనకుతానై విషమసమస్యలలో నిశ్చయాలు చేసికో కూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు, అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండ కూడదు, ఇది విద్వాంసుల మార్గము.

Poison kills the one who imbibes it. Arrow sends the one it struck to the loka of lord of death Yama. By revolting subjects, a ruler can be destroyed. So one should not eat food alone; take important decisions without consulting others; travel all alone; be awake when others are sleeping. This is the way of pundits.

సాగరతరణా నికి నౌక ఏకైకసాధన మైనట్లు స్వర్గం చేరడానికి సత్యమే ఏకైకనాధనం. ఈ విషయాన్ని మీరు గుర్తిం చడంలేదు. క్షమాశీలుడు ఒకే ఒక దోషంతో ఉంటా డని ప్రజలు భావిస్తారు. వారిదృష్టిలో ఆదోషం అసమర్ధత. క్ష్షమను అసామర్థ్యంగా భావించకూ డదు. క్షమకంటె బలమైనది లేదు. అసమర్థునికి క్షమ గుణమైతే సమర్థునికి అదే భూషణం, ఈ జగత్తులో క్షమను మించిన _వశీకరణశక్తి లేదు.

Like a boat is the only means to cross a body of water, truth is the only way to attain heaven. You, Dhrutarashtra, are not grasping this. A forgiver has only one fault. That is incompetence. One should not think the quality of forgiveness is a weakness. There is no greater power than forgiveness. To the incompetent it is guna and for the competent it is an ornament. There is no greater way to conquer all than by forgiveness.

శాంతి అనే ఖడ్గం ధరించిన వానిని యేదుష్టుడూ యేమి చెయ్య లేడు. తృణాకాష్ఠాలు లేనిదే అగ్నివెలువడదు. క్షమా హీనుడు తనతోపాటు ఇతరులనుకూడా బాధకు గురి చేస్తాడు. ధర్మమే కళ్యాణపథము. ఓరిమియే శాంతి మార్గం. విద్యయే ఆనందహేతువు.

One who is armed with a sword of peace can't be hurt by anyone. Without dry wood fire can't be lit. The one without the quality of forgiveness, will not only hurt himself but also others. Dharma is the only auspicious path. Patience is a peaceful path. Education and knowledge are the precursors of happiness.

ఈ భూమండ లంలో ఇద్దరే అధములు: కర్మను విడిచి పెట్టిన గృహస్థూ, కర్మబద్దుడైన సన్యాసీ. శతృవులను అలక్ష్యం చేసే ప్రభువునూ, పరదేశాలు తిరగని విపృని యీ పృథివిన కబళిస్తుంది. కటూక్షులు పలుక కుండా, దుష్టులను ఆదరించకుండా చరించడంక౦టె విశేషమైనపని ఏమా లేదు. ఇతరులచేత కోరబడిన పురుషుని కామించే స్త్రీకి, పరుల ఆశ్రయంలో ప్రవర్తించే పురుషుని ఆదరించే వ్యక్తికి భేదంలేదు. దరిద్రుడై అమూల్యవస్తువులను అభిలషి౦చేవాడూ, అసమర్దుడై క్రోధంతో ఉండేవాడూ తమకుతామే శత్రువులు.

There are two low lives in this world: a householder who renounces karma and an ascetic caught in a karmic cycle. The king who ignores his enemies and a pundit who never left his home will be destroyed. There is no greater good than not talking harshly and not honoring the evil people. There is no difference between a woman who goes after a polygamous man, and one who invites a man belonging to the opposite camp. A pauper who wishes for expensive things and an incompetent person who exhibits anger always, are enemies to themselves.

శక్తికలిగి క్షమతో ఉండేవాడూ, నిర్ధనుడైనా, ఉన్నంతలో దానం చేసేవాడూ స్వర్గంలో ఉన్నత స్థానం పొందుతారు. న్యాయోపార్టిత ధనం రెండు విధాల దురుపయోగ మవుతుంది: సత్పాత్రునకు దానం ఇయ్యక పోవడం; అపాత్రునకు దానం ఇవ్వడం.

One who shows forbearance even though he is capable of attacking and one who is indigent, yet gives alms to the poor will attain high positions in heaven. By not giving alms to a qualified person and giving alms to an unqualified person, money earned by moral means is wasted.

ధనికుడై దానం చెయ్యనివాడూ దరిద్రుడై కష్టాలు సహించలేని వాడూ ఉంటే వారిమెడ కొక బండరాయి కట్టి మడుగులో పడేయాలి. సక్రమంగా సన్యాసం సాగించినవారూ, సంగ్రామరంగంలో శత్రుహస్తా లలో మరణించినవారూ సూర్యమండలాన్ని భేదించు కుని ఉత్తమలోకాలకు పోతారు.

A rich man who never gives alms, and a pauper who can't withstand difficult times, should be tied with stones and sunk in a lake. Those who renounce the world in a proper way, or are killed in the battle field by the enemy attain heaven.

ప్రభూ! కార్యసాధనకు ఉత్తమ మధ్యమ అధ మరీతులు మూడున్నాయి. ఈ మూడుదారులూ శ్రుతి ప్రోక్తములే. వీటిని యధాప్రకారంగా ఆదరించే వారు సంపదల కధికారులవుతారు. దారా, పుత్ర దాసులకు సంపదలపై అధికారంలేదు. ఈ ముగ్గురూ ఎవరి అధీనంలో ఉంటే వారి సంపదలు కూడా వారి అధీనంలో ఉంటాయి.

There are three ways to get things done. Those three are accepted by the scripture. Those who follow them acquire great wealth. Wife, children and servants have no right on one's wealth. Whoever controls them, will own the wealth.

పరధనాపహరణా, పరనారీ సాంగత్యమూ సుహృజ్జనపరిత్యాగమూ అనే మూడుదోషాలూ మానవుని ధర్మాయుర్షాయ కీర్తులను క్షీణింప జేస్తాయి. కామ, క్రోధ, లోభాలు నరకానికి తెరచిన మూడు ద్వారాలు.

Stealing, consorting with a woman who is not one's wife, not caring for the advice of morally upright friends, will take away longevity and fame. Desire, hatred, covetousness are three gates to hell.

వరప్రసాదమూ, రాజ్యప్రాప్తీ, పుత్రోద యమూ అనే మూడూ ఏకకాలంలో ప్రాప్తించడం కంటె శత్రువులు పెట్టే బాధలనుండి విముక్తిని పొందడం ఘనమైనది. నేను నీవాడననీ సేవకుడననీ నీకు భక్తుననీ అర్ధించిన వారిని ఎటువంటి విప త్తులలోనూ విడిచి పెట్టకూడదు. అల్పబుద్ధినీ, దీర్ఘ నూత్రునీ, త్వరపడేవానినీ, స్తోత్రపాఠకునీ రహస్య సమాలోచనలకు పిలువకూడదు. వీరిని విద్యజ్జనులు గుర్తుపట్టగలరు. కుటుంబ వృద్ధజనులనూ, విపత్తులలో పడిన ఉన్నతకుటుంబీకులనూ, దరిద్రు లైన మిత్రులనూ, సంతాన విహీనయైన పోదరినీ ఆశ్రయమిచ్చి పోషించాలి,

Obtaining kingdom, begetting a son, acquiring a boon at the same time is worse than attaining liberation from enemies' prison. One who submits to you, says he is your servant and devotee, should not be abandoned in grave times. A fool, one in haste, a chanter of scripture should not be invited to secret meetings. They can be found out by the learned. Old people in the family, a morally upright family when in trouble, friends in dire straits, a sister without children, should be rescued.

ప్రభూ! ఇంద్రుని అభ్యర్హనం మీద బ్బహస్పతి చెప్పిన విషయాలు కొన్నిచెబుతాను విను. దైవ సంకల్పమూ, ధీమంతులశక్తి, విద్వాంసులయెడ వినయమూ, పాపవినాశనకర కార్యాచరణమూ అనే నాలుగూ మానవుని భయాన్ని దూరం చేస్తాయి. సక్రమంగా సాగించకపోతే అవే భయహేతువులు. అగ్ని కార్యమూ, మౌనవ్రతమూ, శ్రద్ధాయుతమైన స్వాద్యాయమూ, ఆదరదృష్టితో యజ్ఞానుష్ఠానమూ నడపాలి. తల్రితండ్రులనూ, అగ్నినీ, గురువునూ, అత్మనూ పంచాగ్నులుగా భావింపి సేవించాలి.

O King, let me state the wise words spoken by Bruhaspati upon Indra's request. A man will overcome fear by god's will, strength of the valorous, humbleness before pundits, karma without sin. One should pray to agni, mute oneself for a period of time, self-study with discipline, conduct yagna to help others. Parents, agni, guru and self need to be prayed.

దేవ, పితృ, సన్యాస, అతిధిమానవులను పూజించేవాడు కీర్తిశాలి అవుతాడు. మానవుడెక్కడకు పోయినా, మిత్రులూ, శత్రువులూ, ఉదాసీనులూ, ఆశ్రయ౦ పొందినవారూ, ఆశ్రయమిచ్చేవారూ వెంటఉంటారు. ఈ జ్ఞానే౦ద్రియ పంచకంలో యే ఇంద్రియం దోష యుక్తమెనా వానినుండ బుద్ది క్షీణుస్తూ నే ఉంటుంది. సుఖ సంపదలు కోరేవాడు, నిద్రా భయ క్రోధ అలవ (లేదా) దీర్ఘ సూత్ర తంత్రాది దుర్గు ణాలను విడచి పెట్టాలి. అధ్యాపనం చెయ్యని గురువూ, మంత్రోచ్చారణలేని హోతా, రక్షణకు అసమర్థుడైన రాజూ, కటువుగా భాషి౦చే భార్యా, గ్రామంలో వశించగోరే గొల్ల వాడూ, వనవాసం వాంఛించే మంగలీ పరిత్యాజ్యులు.

One who prays to God, parents, ascetics and guests will be famous. Wherever a man goes, there will be friends, foes, disapprovers, ones who have refuge, and those who offer refuge. Any one of the five senses, if defective, will make the intellect weaker. One who aspires for riches, should give up sleep, fear, anger and occult practices. A guru without tutelage, a priest without purity of voice, a king who can't protect, a wife who talks harshly, a goat herder who wants to live among the cultured, a barber who pines for forest life, should not be befriended.

సత్య, దాన, క్షమ, అనసూయ, కర్మపరతంత్రుతాది సద్గుణాలను సావధానంతో అలవరుచు కోవాలి. ధనప్రాప్తీ, ఆరోగ్యదేహమూ, అనుకూలవతి, ప్రియభాషిణీ అయిన అర్థాంగి, చెప్పుచేతలలో ఉండే కుమారుడూ, ధనార్జన కుపయుక్తమై న విద్యా యీలోక౦లో పరమసుఖదాయకాలు.

One should acquire with patience, truth, kindness, forgiveness, without jealousy and such good qualities. Acquisition of wealth, a healthy body, an amicable and soft spoken wife, a son who is disciplined, gains employment with a skill acquired from education offer great happiness.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాది అరిషడ్వర్గాలను జయించి జితేంద్రియుడై చరించాలి. దొంగలు (పమత్తులవల్ల, వైద్యులు రో గివల్ల, కామినీజనము కాముకులవల్ల, పురోహితులు యజమానునివల్ల, స్పర్థను వాంఛించే విద్వాంసుడు మూర్ఖునివల్ల జీవితం గడుపుతారు. సంరక్షణ లేకపోతే గోవూ, వ్యవసాయమూ, స్త్రీ, విద్యా నశిస్తాయి. అప్రమత్తతో చరించకపోతే శూద్రసఖ్యమూ, సేవావినాశనానికి దారితీస్తాయి.

One should conquer desire, anger, ego, covetousness, hatred, jealousy. Because of drunkards thieves prosper; doctors thrive because of the diseased, prostitutes survive because of debauched men; priests are prosperous because of devotees; a pundit itching for argumentation thrives because of fools. Without nurturing cows, agriculture, women, education wither away. If not alert one has to befriend sudras, and lose the help of servants.

విద్యపరివూర్తి అయిన అనంతరం శిష్యుడు గురువునూ, వివాహానంతరం తల్లిని కుమారుడూ, భోగఫలానంతర౦ పురుషుడు స్త్రీనీ, పని జరిగినమీదట సహకరించిన వారినీ. నదిని తరించాక నావనూ, రోగవిముక్తాన్యంతరం వైద్యునీ, విస్మరించడం సహజం,

After graduating from studies, disciples ignore gurus; after marriage a son forgets about his mother; after intercourse man ignores woman; after getting a task done a man ignores those who helped him; after crossing the river a man forgets about the boat; after getting cured, a patient forgets the doctor. These are all quite natural.

ఋణగ్రస్థుడు కాకపోవడం, ప్రవాసం ప్రాప్తిం చకపోవడం, సత్పురుష సాంగత్యం, కులవృత్తితో జీవికా నిర్వహణం అనేవే యీ లోకంలో సుఖాన్నిచ్చేవి.

One who is not indebted, who never has to leave one's country, who is befriended by morally upright people, who following the family tradition earns livelihood enjoys unlimited bliss.

ఈర్ష్యాద్వేషాలతో, అసంతోష క్రోధాలతో అనుక్షణ శ౦కతో పరభాగ్యజీవికతో ఉండేవారు దుఃఖబాగులే. కామినీజనసాంగత్యాన్నీ, వేటనూ, మద్యపానాన్నీ, జూదాన్నీ, పరుషప్రసంగాలనూ, ధనదుర్వినియోగాన్ని, కఠోరదండనీతినీ ప్రభువు పరిత్యజించాలి.

Those who have hatred and jealousy, are haunted by unhappiness and anger, constantly doubt others experience sorrow.

బ్రహ్మద్వేషమూ, బ్రాహ్మణ ధనాపహారణా, విప్రదండనా, వారిని నిదించడంలో సంతొషమూ, వారిప్రస్తుతిని ఆకర్షించలేక పోవ డమూ, యజ్ఞయాగాదులలో వారిని విస్మరించ డము, అర్థించినప్పుడు విప్రకోటిపై దోషారోపణ చేయడమూ అనే దోషాలను ధీమంతులు దరిచేర నివ్వకూడదు.

Hatred of God, punishing brahmins, enjoying blaming them, without ever praising them; ignoring them during yagna, when seeking help blaming the brahmins, should not be entertained by the morally upright people.

మిత్రసమాగమమూ, ధనప్రాప్తీ, పుత్రాలింగనమూ, దారాసంగమమూ, కాలానుసారం ప్రియవచనాలాపమూ, నిజప్రజల ఔన్నిత్యమూ, అభీష్టవస్తుసిద్ధీ, సంఘప్రతిష్ఠా అనేవి సంతోషకరాలు. లౌకిక సుఖాలకు యివి సాధనాలు. కులీ నత, ఇంద్రియ నిగ్రహము, పరాక్రమము, శాస్త్ర, జ్ఞానము, ధీశక్తి, మితభాషత్వము, యథాశక్తి దానము, కృతజ్ఞత అనేవి కీర్తికి హేతువులు. నవద్వారా లతో త్రిస్తంభాలతో, పంచసాక్షులతో, అత్మకు అవాస స్థానమైన యీ దేహగృహంయొక్క తత్వం గ్రహించడంకంటె వేరే జ్ఞానం లేదు.

Meeting friends, acquiring wealth, hugging sons, good will of subjects, achieving the desired object, fame in the society engender happiness. They are the means for worldly pleasures. Noble birth, control of senses, valour, scriptural knowledge, competence, limited speech, giving alms within means, gratefulness engender fame. There is no greater knowledge than realizing self in the body that is resplendent with nine exits, three pillars, five witnesses.

సావధానరహితుడూ, ఉన్మత్తుడూ, మద్య పాయి, అలసినవాడు, క్రోధి, క్షుధార్తుడు (ఆకలి గలవాడు), తొందర పడేవాడు, లోభి, భయభీతుడు, కాముకుడూ, ధర్మ తత్వం గృహించలేరు. ఈ విషయమై ప్రహ్లాద సుధన్వులగాధ ఒకటి ఉన్నది. కామక్రోధాలను విడిచి పాత్రులకు దానం చేస్తూ, శా స్త్రజ్ఞానం తెలు సుకుంటూ కర్తవ్యాన్ని నిర్వహించే రాజుకు (పజలు వ౦గి నమస్కరిస్తారు.

An inattentive one, one who is deluded, a drunkard, one who is tired, one who is in rage, one who is hungry, one who is in haste, a coward, one who is libidinous can't understand the intricacies of dharma. On this topic there is a Prahlada-Sudhanvu story. People bow to the king who gives up desires and rage, gives alms to the qualified and is knowledgeable in scripture, discharges his duties with competence.

ప్రజలలో విశ్వాసం కలగ జేస్తూ అపరాధులను దండిన్తూ చరి౦చే ప్రుభువు సర్వసంపద సంపన్నుడౌతాడు. సావధానుడై, దుర్భలులను, అవమానించకుండా, శత్రువులతో చతుర వ్యవహారం సాగిస్తూ, బలవంతులతో సంగమం సాగించక, అవకాశానుసారం పరాక్రమం ప్రదరిస్తూ ఉండే ధీరుడు యొన్నివిపత్తులు వచ్చి మీద పడ్డా విచారసాగరంలో మునిగిపోకుండా వాటిని సహిన్తూ ప్రయత్నశీలుడై ఉంటే అవలీలగా శత్రువును జయించవచ్చు.

A king who instills loyalty among the subjects, punishes wrongdoers will be enormously rich. One who is attentive, doesn't insult the weak, acts smartly with the enemies, doesn't befriend more powerful, shows valor where necessary, no matter how many dangerous situations arise, will easily achieve victory when fighting with the enemy.

వృధాగా విదేశాలలో తిరిగేవాడూ, పాపులతో మైత్రి చేసేవాడూ, పరస్త్రీ గామీ, పాషాండుడూ, చోరుడూ, కుటిలుడూ, మధు పానంచేసేవాడూ దుఃఖాలలో పడతారు. క్రోధమూ, తొందరపాటూ, పురుషార్ధ రాహిత్యమూ, అనృత వాదిత్వమూ దుఃఖ హేతువులు. మిత్రుల క్షేమంకోసం పోరాడనివాడూ, అదరించినవారిపై క్రోధం చూపే వాడూ, వివేకహీనుడూ, పరదోషైక దృక్కు, దయా రహితుడూ, అధికప్రసంగీ లోకంలో పేరుప్రఖ్యా తులు పొందలేరు.

One who goes abroad without an objective, befriends sinners, lusts for women, unkind, a thief, is cunning, a drunkard will end up in sorrow. Anger, haste, facing loss in acquiring wealth, argumentation cause sorrow. One who doesn't fight to make friends happy, who shows anger toward those helping him, who is unwise, who always finds faults in others, who is unkind, who is talkative can't earn fame.

వేషపటాటోపం లేకుండా, అత్మ ప్రశంస చేసుకోకుండా క్రోధం కలిగినా కటువుగా భాషించకుండా ఉండే మానవుడు సర్వజనాదరణీయు డవుతాడు. గర్వరహితుడూ, హైన్యం ప్రద ర్శించనివాడూ, శాంతించిన వైరాన్ని ప్రకోపింప చెయ్యనివాడూ, ప్రమాదాలు మీదపడ్డా అనుచితాన్ని సహించనివాడూ, యితరుల దుఃఖానికి సంతోషించనివాడూ, దానంచేసి విచారించనివాడూ, సజ్జన శ్రేష్ఠులు, దేశవ్యవహారావసరాలూ, జాతిధర్మాలూ తెలిసినవానికి ఉత్తమాధమవివేకం కలుగుతుంది.

One who doesn't show off, doesn't self-congratulate, won't talk rudely even when angry will be befriended by all. One who is egoless, who has no weaknesses, who doesn't reignite old flames, who acts with alacrity when faced with dangers, who doesn't rejoice in others' grief, who doesn't regret after giving alms, who befriends morally upright people, who knows national affairs and dharma of various varnas, will understand the difference between superior and inferior attributes.

అటువంటి వివేకి జనసంఘంలో తన పుతిష్ఠను సంస్టాపించుకోగలడు, రాజద్రోహియై, మోసదృష్టితో పాపకర్మలు చేసేవాడూ, గర్వీ, మత్సరుడూ మోహా మత్తుడూ, ఉన్మత్తుడూ ఆదిగాగలవారితో వివాదానికి పోరాదు. దాన హోమ పూజా ప్రాయశ్చిత్తాది లౌకిక కర్మలను నిర్వహించేవాడు వృద్ధిలోకి వస్తాడు. సమానశీలురతో వివాహమూ, మైత్రీ, వ్యవహారమూ సాగించాలి.

Such a person will establish himself in a society with fame. One who rebels against the king, who performs sinful acts to cheat others, who is egoistic, who is jealous, who is craving with lust, who is deluded should not be engaged in a debate. One who gives alms, performs yagna and pooja, atones his sins, partakes in worldly matters responsibly, will prosper. One should engage with equals during marriage, friendship and transactions.

గుణనంపన్నులను ముందుంచుకొని నడిచేవాడు, నీతివిదుడు, అర్థులకు తృప్తిగా పెట్టి మితంగా భుజించాలి. అధికకాలం కృషిచేసి తక్కువగా నిదురిసూ అర్థులకు దానంచేస్తూ ఉండేవాడు అనర్ధ దూరుడౌతాడు. స్వేచ్చానుసారం చరిస్తూ పరేచ్చను పరిగృహించకుండా తన ఆలోచనలను గుప్తంగా ఉంచుకుంటూ స్వీయకార్యాలను సక్రమ౦గా నిర్వహించుకోవాలి. సత్యవాది, కోమల స్వభావడూ, ఉన్నతాభిప్రాయుడూ, ఆదర్శీలీ, భూతశా౦తికరుడూ అయినవాడు శ్రేష్ట రత్నంలా జాతివారిలో ప్రసిద్ధుడౌతాడు. లజ్ఞాశీలిని సర్వప్రజలూ గౌరవిస్తారు. ఏకాగ్రచిత్తంతో, శుద్ధహృదయ౦తో, అనంతతేజస్సుతో, ఆ పురుషుడు సూర్వునివలె భాసిస్తాడు.

One who follows good natured men, who is wise, who feeds the hungry and eats moderately, who works hard and sleeps less, who gives alms to the poor will not face difficulties. One should according to free will, not violate others' freedom, keep the thoughts private and perform his acts well. One who speaks truth, is soft spoken, is enabled with good thoughts, is a role model to others, brings peace to all and shines like a diamond in the jati or varna. A self-effacing person will be appreciated by all. He will shine like the sun with a concentrated mind, pure heart, extraordinary aura.

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...