Sunday, April 10, 2022

Eknath Gita Chapter 11 Section 9

Bhagavat Gita

11.9

కిరీటినం గదినం చక్రిణం చ

తేజోరాశి౦ సర్వతో దీప్తిమంతం {11.17}

పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతా

ద్దీప్తానలార్క ద్యుతి మప్రమేయమ్

కిరీటము, గద, చక్రము గల వానిని గను, అంతటను ప్రకాశించు వానిని గను, తేజోమయుని గను, ప్రజ్వలించెడి అగ్ని సూర్యుల ప్రకాశము గల వానిని గను, అప్రమేయుని గను నిన్ను సకల ప్రదేశములందు గాంచుచున్నాను

తరతరాలుగా సూర్యనమస్కారాలు చేసి మనను క్రియలకై ప్రేరేపించే సూర్యునికి వందనములు సమర్పిస్తున్నాం. ఆయన మరోపేరు దినకరుడు. మనం కాంతిని, ఉష్ణాన్ని, ఆహారాన్ని ఆయనవలననే పొందుతున్నాము. సమస్త జీవులు సూర్యుని మీదే ఆధారపడి ఉన్నాడనడంలో అతిశయోక్తి లేదు.

ఈ మహాద్భుతాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు ఇలా వివరిస్తారు. 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. 65.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఉదజననిని 65.25 కోట్ల హీలియ౦ గా మార్చి శక్తిని విడుదల చేస్తాడు. ఆ రెండు సంఖ్యల మద్ద తేడా ఆ శక్తి ఘనీభవిస్తే ఉండే బరువు.

జీవితంలో ఏదీ అకారణంగా లేదు. ప్రతీదీ పదార్థము లేదా శక్తి అయ్యి సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉన్నది. ముఖ్యంగా మన భూగోళంలో అది సమంగా ఉంది. సూర్యుని కేంద్రంలో ఉండే శక్తి ఉపరితలం మీద కొస్తే మన సౌర కుటుంబంలోని జీవులన్నీ మాడి మసై పోతాయి. సర్ జేమ్స్ జీన్స్ అనే ఆంగ్ల ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పెను: "ఒక గుండు సూది అంత సూర్యుని పదార్థాన్ని మన భూగోళం మీదకి తీసికువస్తే దాని వేడి వలన 100 మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కాలిపోతాడు. " సూర్య కిరణాలు మన దేహాలని తాకే ముందు మన వాతావరణాన్ని చొచ్చుకొని రావాలి. అంతకు ముందు సూర్యుని ఉపరితలంలోని అణువులను చొచ్చుకొని రావాలి. ఈ విధంగా సూర్యుని ప్రతాపము తగ్గి మనకి సరైన ఉష్ణోగ్రతతో అందుతుంది.

ఈ విషయాలు ఖగోళ శాస్త్రజ్ఞులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కానీ ఎక్కడైతే శాస్త్రజ్ఞులు థెర్మోడైనమిక్స్ సిద్ధాంతాలను చూస్తారో , అక్కడ యోగులు దేవుని ప్రేమను, వైభవాన్ని చూస్తారు. విలియం బ్లేక్ అనబడే కవి "నేను నా కళ్ళలోంచి చూస్తాను. అంటే కళ్ళతో కాదు. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే నేను ఒక ప్రకాశవంతమైన వృత్తాకారము చూడను. నేను చూసేది పవిత్రమైన అంతరిక్ష దేవతను"

సూర్యునివంటి అద్భుతమునకు భగవంతుని ప్రేమే కారణము. ఆయన ప్రతి అణువులోనూ ఉన్నాడు. పదార్థమును, శక్తిని కలిపి చెప్పే సిద్ధాంతాలు జీవుల ఐకమత్యానికి సూచిక. ఒక నక్షత్రం మాట్లాడగలిగితే అది ఒక పద్యం చదవక, గురుత్వాకర్షణను పొగుడుతుంది. చిన్న వయస్సు గల నక్షత్రాలు కృష్ణ బిలాలతో ప్రేమ బంధానికై అర్రులుచాస్తాయి. వాటికి జీవైకమత్యం శక్తి వలన సాధ్యం; మనకు అదే ప్రేమ వలన సాధ్యం. వివరించే పదాలు వేరైనా, వాటి భావం ఒక్కటే. 283

Eknath Gita Chapter 11 Section 8

Bhagavat Gita

11.8

అనేక బాహూదరవక్త్ర నేత్రం

పశ్యామిత్వాం సర్వతో అనంతరూపం {11.16}

నాంతం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప !

విశ్వేశ్వరా ! విశ్వరూపా! అన్ని చోట్లను అనేకమైన బాహువులును, ఉదరుములును, ముఖములును, నేత్రములును, కలిగిన అనంతరూపునిగ నిన్ను గాంచుచున్నాను. నీ రూపమునకు మొదలుగాని, మధ్యముగాని, అంతము గాని గోచరించకున్నవి

శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. విష్ణు సహస్ర నామములు ఆయనకీ వర్తిస్తాయి. ఒకమారు భూమాత పాప భారం భరించలేక శ్రీ మహావిష్ణువుని రక్షింపమని వేడుకొంది. అప్పుడు ఆయన శ్రీకృష్ణ అవతారం దాల్చేడు. దేవకీ, వసుదేవులకు జన్మించి, కంసుని దురాగతములను తప్పించుకొనుటకై, యశోద, నందులకు దత్త పుత్రుడైనాడు. ఆ పసికందు నామకరణం చేయడానికి గార్గ ఋషుని కోరేరు. ఆయన పసికందుని చూసి "సహస్ర నామములుండగా నేనే నామాన్ని పెట్టేది?" అని వాపోయేడు.

దేవుడు మనందరిలోనూ ఉన్నాడు. మన పేర్లన్నీ ఆయనకే చెందుతాయి. అంటే ఆయన సహస్ర నామములకే పరిమితం కాదు. కోట్ల ప్రపంచ జనాభా పేర్లన్నీ ఆయనవే. ఎందుకంటే వారి హృదయాల్లో ఆయన నివసిస్తున్నాడు. అర్జునుడు చూస్తున్న అసంఖ్యాకమైన ముఖములు, చేతులు ఊహా జనితం కాదు. రామదాసు ఇలా చెప్పెను:

మనము ఏ జీవిని చూసిన దాని బాహ్య రూపమే కాక అంతరంలో ఉన్న ఆత్మను చూడాలి. ఈ విధంగా చూడడం నిజమైన ప్రక్రియ. దానివలన మన౦ భిన్నత్వాన్ని అతిక్రమించి జీవుల ఐకమత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఋషులు చెప్పేది. అలా ఉండడం పుణ్య క్షేత్రాలకే పరిమితం కాదు. మన దినచర్యలో, బజార్లో, అన్ని చోట్లా, భిన్నత్వాన్ని చూడక సమానతను పాటించాలి. అందరిలోని దైవత్వాన్ని దర్శించాలి. 281

Eknath Gita Chapter 11 Section 7

Bhagavat Gita

11.7

తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః {11.14}

ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి రభాషత

అప్పుడు అర్జునుడు విస్మయమొంది, పులకాంకితుడై, చేతులు జోడించి, దేవదేవునకు శిరము వంచి నమస్కరించుచు ఇట్లనెను

అర్జున ఉవాచ:

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్ {11.15}

బ్రహ్మాణమీశం కమలాసనస్థ౦ ఋషీ౦శ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్

ఓ దేవదేవా! నీ శరీరమందు సమస్తమైన దేవతలు, చరాచర భూతజాలములు, రుద్రుడు, కమలాస్థుడగు బ్రహ్మ దేవుడు, సకల ఋషులను, దివ్యములైన సర్పములను గాంచుచున్నాను ఀ

బృందావనములో బాల కృష్ణుడు పెరుగుతున్నప్పుడు, ఒక గోపిక యశోద వద్దకు వచ్చి కృష్ణుడు మన్ను తింటున్నాడని చెప్పింది. కృష్ణుడు తినటంలేదని చెప్పేడు. అప్పుడు ఆమె కృష్ణుని నోరు తెరిచి చూపమంది. కృష్ణుడు నోటిలో ఆమె జీవులతోనూ, నక్షత్రాలతోనూ మిరిమిట్లుగొలిపే విశ్వాన్ని చూసింది. అలా ఒక్క నిమిషమే జరిగుండవచ్చు. యశోద భయముతోనూ, ఆశ్చర్యంతోనూ చూసి ఉండవచ్చు.

అలాగే అర్జునుడు కూడా మాటల కందని స్థితిని పొందుతున్నాడు. ఎందరో ఆధ్యాత్మిక సాధకులు దేవుని చూచి నిశ్చేష్టులు అయినారు. యూదుల నాయకుడు మోసెస్, సినాయి కొండమీద దేవుని చూచి నిశ్శబ్దంగా కొండ దిగి వచ్చేరు. కానీ ఆయన ముఖం దేదీప్యమానంగా తేజస్సుతో వెలిగి యున్నది. సెయింట్ పాల్ డమాస్కస్ వెళ్ళే దారిలో దేవని కాంతిని చూసి మూడు రోజులు మంచం పట్టేరు. పాస్కల్ అనే గణిత శాస్త్రవేత్త దేవుని నిశ్చయము, మనో భావము, ఆనందము, శాంతి అనే పదాలతో వర్ణించేరు. సెయింట్ థామస్ ఆఫ్ అక్వినాస్ "నేను వ్రాసినదంతా గడ్డిపోచతో సమానము" అని దేవుని దర్శించి చెప్పెను. నేటి భౌతిక శాస్త్రవేత్తలు, శ్లోకంలో చెప్పిన ఋషులు, కవిత్వంతో మాత్రమే చెప్పగలరు.

ఇటువంటి దర్శనాన్ని మాటలతోనూ, చిత్రాలతోనూ చెప్పలేము. కానీ దానిని సూక్ష్మంగా చెప్పవచ్చును. ఆధ్యాత్మిక గురువులు మాటలకన్నా చేతలతో తమ బోధ చెయ్యాలి. వారు సర్వ జీవ సమానత్వము గూర్చి ఎరిగి, అది వారి ప్రతి క్రియలోనూ వ్యక్త మవుతుంది. ఏ శిష్యులైతే దానిని హృదయంతో గ్రహిస్తారో వారు కూడా నిత్య జీవితంలో దాన్ని అనుసరించవచ్చు. నేను ఆధ్యాత్మిక సాధన నా అమ్మమ్మ నుంచి పొందేను. ఆమె నాకేమీ పెద్దగా బోధించలేదు. కానీ నేను యోగ౦ గురించి చదివిన గ్రంధాల కన్నా, ఆమె దగ్గర నేర్చుకొన్నది ఎక్కువ. ఆమె ఆధ్యాత్మికత గురించి అతి తక్కువగా మాట్లాడేది. కానీ ఆమె ఎరుకను సమర్థతతో నాకు పంచి ఇచ్చింది. నాకిది ఎన్నో ఏళ్లు తరువాత ధ్యానం చేయడం మొదలు పెట్టినప్పుడు తెలిసింది. ఆమె ఎన్నటికీ నా ప్రథమ గురువు. చాలా మందికి గురువును వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ నేను గురువుకి వారసుడను. నేను ప్రతి రోజూ ఆమెలా అవుతూ, ఆమె ప్రేమతో నా చిన్నప్పుడు చెప్పిన జీవుల ఐకమత్యము నిత్య జీవితంలో పాటిస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది 279

Eknath Gita Chapter 11 Section 6

11.6

తత్రైకస్థ౦ జగత్కృత్త్స్న౦ ప్రవిభక్త మనేకధా {11.13}

అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా

అప్పుడు అర్జునుడు అనేక విధములుగ విభజింపబడియున్న జగత్తును దేవదేవుడగు శ్రీ కృష్ణపరమాత్ముని దేహమునందు ఒక్కచోటనే ఉన్నదానినిగ దర్శి౦చెను

ఇక్కడ యోగులను, శాస్త్రజ్ఞులను విభ్రాంతులను చేసే సృష్టి రహస్యములు చెప్పబడినవి. నేను ఖగోళ శాస్త్రజ్ఞులు, అణు శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయాలను తెలిసికొని ఆశ్చర్య చకితుడైనాను. అదీ అంతా దేవుని మాయలో ఒక చిన్న అంశం మాత్రమే. శాస్త్రజ్ఞులు కూడా ఆ విషయాలను పూర్తిగా విశ్లేషణ చేయలేక సతమత మవుతున్నారు. మనము సూర్యుని ఆచ్ఛాదన లేని కళ్ళతో చూడలేక ఉన్నాము. అట్టిది క్వాసార్స్ అనే నక్షత్రాలు సూర్యునికన్న కొన్ని వేల రెట్లు ప్రకాశవంతమై ఉన్నాయి. ఇంకా న్యూట్రాన్ నక్షత్రాల సాంద్రత ఎంత అంటే ఒక గరిటెడు కోట్లాను కోట్ల టన్నుల బరువు ఉంటుంది. అంత సాంద్రత ఉన్నప్పుడు, గురుత్వాకర్షణ ఎంతో ఎక్కువగా ఉండి, దానివలన న్యూట్రాన్ నక్షత్రం కొన్నాళ్ళకు విస్పోటిస్తుంది. అటు తరువాత కోట్లాను కోట్ల టన్నుల పదార్థము కృష్ణ బిలాల్లో అంతర్ధాన మవుతుంది. మనం "అది ఎటువంటిది? ఆ పదార్థము ఎక్కడికి పోయింది?" అని అడిగితే శాస్త్రజ్ఞులు నుంచి సమాధానము లేదు.

అర్జునుడు సదా మార్పు చెందే విశ్వం దేవునిలో ఇమిడి ఉందని తెలిసికొన్నాడు. గీత దీన్ని ఒక పద్యంలా చెపుతుంది. శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయాలు అర్జునుని అనుభవంతో ఏకీభవిస్తాయి. జీవులను పరిశోధించే శాస్త్రజ్ఞులు జీవులన్నీటిలో డిఎన్ఎ అనబడే రసాయనము ఉంటుందని నిర్థారించేరు. అది మనకు జంతువులతోనూ, పక్షులతోనూ, చేపలతోనూ సంబంధం ఉందని చెపుతుంది. ఇంకా అది మనని విశ్వమంతటా ఉన్న జీవులతో -- ఎందుకంటే విశ్వం లో అగుబడే రసాయనాలు, భూమి మీద ఉన్న రసాయనాలు ఒక్కటే--మనకు సంబంధం ఉన్నదని తెలుపుతుంది.

దేశకాలాలు, పదార్థ-శక్తులు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. అవి ఒక అణువు యొక్క కేంద్రకం నుంచి దూరంగా ఉన్న నక్షత్రం వరకు సమానంగా ఉన్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పదార్థము, శక్తి ఒకటేనని చెప్పెను. కాబట్టి నా చేతిలోని ఎలక్ట్రాన్ తక్కిన ప్రపంచంతో ప్రభావితమౌతుంది. మనము ఉపపరమాణువులను (subatomic) చూడగలిగితే, నాది అనుకునే వస్తువులు శక్తిలో అంతర్ధానమవుతాయి. విశ్వమంతా కాంతి రూపములోనున్న శక్తితో నిండిపోతుంది. శ్రీరామకృష్ణ పరమహంస కూడా దీనితో ఏకీభవిస్తారు. ఉపపరమాణువులు ఘన పదార్థము కాక, ఒక సెకనులో అతి తక్కువ భాగంలో, కనిపించి మాయ మవుతాయి. ఇది దేవుడు మనతో దోబూచులాడుతున్నాడు అని అనిపిస్తుంది. అతడు కనిపించి, ఎంత వేగంగా అంతర్ధాన మవుతాడంటే, మనమెన్నటికీ ఆయనను పట్టుకోలేమనిపిస్తుంది.

మనము ప్రకృతిని ఎంత లోతుగా శోధిస్తే, సర్వత్రా ఉన్న అంతరిక్షం నుంచి, సూక్ష్మమైన ఉపపరమాణువుల వరకు దేవుని మాయను చూడవచ్చు. నేను దూరదర్శినిలో, సూక్ష్మదర్శినిలో చూసిన పదార్థాలు, అందంగానే కాక, గీతలో చెప్పిన విధంగా భగవంతుని నుంచి ప్రసరణమైనవని నమ్ముతాను. అందువలన నాకు ఆండ్రోమెడా పుంతతో సంబంధం ఉంది. సూక్ష్మరూపాల నుంచి స్థూల రూపాల వరకు దేవునిచే ప్రభావితమౌతాయి. 278

Eknath Gita Chapter 11 Section 5

11.5

దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా {11.12}

యది భా స్సదృశీసా స్యా ద్భాసస్తస్య మహాత్మనః

ఆకాశమునందు వేలకొలది సూర్యుల యొక్క కాంతి ఏకకాలమున బయలు దేరిన ఎంత కాంతి యుండునో అది ఆ మహాత్ముని యొక్క కాంతిని బోలియున్నది ఀ

మనం ఏ ఆచ్ఛాదనా లేకుండా సూర్యుని కళ్ళతో చూస్తే గ్రుడ్డి వార మవుతాం. సూర్యుని శక్తిలో ఒక చిన్న కాంతి పుంజం రమారమి 10 కోట్ల మైళ్ళు ప్రయాణి౦చి మన భూమిని వాతావరణం ద్వారా చేరి జీవులను ప్రభావితం చేస్తోంది. అర్జునినికి శ్రీ కృష్ణుడు చూపినది ఒకేమారు వేలకొలది సూర్యులు. అతని దేహామంతా సూర్య కాంతితో నిండి యున్నది. ఆతని మేధ దానిని గ్రహింపలేక అచేతనమైంది. సెయింట్ తెరెసా "ఆత్మ ఎప్పుడు సూర్యుని చూచునో ఆ కాంతి దాన్ని మిరుమిట్లు గొలుపుతుంది. చాలా సార్లు అది కాంతిని చూడలేక, గ్రహించలేక, ఆశ్చర్యంతో ఆ వింతలను చూస్తుంది" అని అన్నారు.

కానీ ఇది తక్కువగా అంచనా వేసే ఒక పద్యము. ఆ మిరుమిట్లు గొలిపే కాంతికి భగవంతుడే మూలము. ప్రతి ప్రకాశవంతమైన నక్షత్రము ఆయన మెడలో యున్న హారంలో ఒక పూస మాత్రమే. క్వాసార్స్ అనబడే నక్షత్రాలు మన సూర్యునికన్నా కోట్ల రెట్లు ప్రకాశవంతమైనవి. విశ్వమంతా కాంతితో నిండి ఉంది. అది దేవుని శక్తితో స్పందిస్తున్నది.

ఈ విధంగా బాహ్యంలో ఉన్న శోభ మన అంతర్గతంలో కూడా ఉంది. మన ఆధ్యాత్మిక చింతన కొనసాగుతూ ఉంటే; వేర్పాటు, అహంకారం తగ్గితే మన చేతన మనస్సులో ప్రకాశము అన్నివైపులా ప్రసరిస్తుంది. అది మన ఇంద్రియములకు అందని గొప్ప ప్రక్రియ. జీసస్ "దేహామంతా కాంతితో నిండి ఉంటుంది" అని ఒక చక్కని వివరణ ఇస్తారు. 276

Index of Eknath Gita

Dr.Eknath Easwaran lived in the last century. Being an English professor he wrote prolifically about Hindu scripture. His books were translated into many European languages. This is the first time as far as I know someone attempted to translate his Bhagavad Gita Volumes 1,2 & 3 to Telugu. The following is an index of the 3 books arranged by the chapter and slokas. Like Dr.Easwaran, I left India at a young age, but did not have as much exposure to the culture as him. So my Telugu is a bit rusty. You may forgive my grammatical and spelling mistakes. Better yet, drop me email. Getting back to Dr.Easwaran, he founded Blue Mountain Meditation Center in Northern California where he trained hundreds to meditate. You will find that he emphasized on Meditation along with unselfish service and love for all creatures.

For the sanskrit slokas and their translation into Telugu, I have used Swami Sundara Chaitanyaa Nanda's Bhagavat Gita pocket book. It was a life saver. But it is very pithy. That's the reason, I think, the slokas need to be interpreted to the 21st century realities. On the other hand, if you just want to read what Sri Krishna said the small book is a great source.

Book 1 (Chapters 1-6)

Book 2 (Chapters 7-12)

Book 3 (Chapters 13-18)

Eknath Gita Chapter 11 Section 4

Bhagavat Gita

11.4

సంజయ ఉవాచ:

ఏవముక్త్వా తతో రాజన్! మహా యోగేశ్వరో హరిః {11.9}

దర్శాయామాన పార్థాయ పరమం రూపమైశ్వరమ్

రాజా! ఈ విధముగ పలికి మహా యోగీశ్వరుడైన శ్రీ హరి మహోన్నతమైన, దైవసంబంధమైన విశ్వరూపమును అర్జునునకు చూపెను

అనేకవక్త్రనయన మనేకాద్భుత దర్శనం {11.10}

అనేకదివ్యాభరణం దివ్యానేకో ద్యతాయుధమ్

దివ్యమాల్యా౦బరధరం దివ్యగంధాలేపనం

సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖమ్ {11.11}

అనేక ముఖములు, నేత్రములు గలదియు, అనేక విచిత్రములు గలదియు, అనేక దివ్యాభరణములు గలదియు, ఎత్తబడిన దివ్యాయుధములు గలదియు, దివ్యములైన పుష్పమాలలను, వస్త్రములను ధరించునదియు, దివ్యమైన గంధలేపనము గలదియు, సర్వాశ్చర్యమైనదియు, అనంతమైనదియు, అంతటను ముఖములు గలదియు, స్వయంప్రకాశమునైన విశ్వరూపమును అర్జునుడు దర్శి౦చెను ఀ

శ్రీకృష్ణుడు తన అనంతమైన విశ్వరూపమును చూపుచున్నాడు. అతడు అసంఖ్యాకమైన ముఖములు గలవాడై ఉన్నాడు. అర్జునుడు ప్రతి ముఖములోనూ, జీవిలోనూ దేవుని చూచెను. మనకు అత్యంత ఆశ్చర్యము కలిగించేది ఏమిటంటే: మన తలిదండ్రులు, జీవిత భాగస్వామి, బిడ్డలు, మిత్రులు మనలను చూసిననప్పుడల్లా అవి దేవుని కళ్ళతో అనే భావన. అందుకే బంధుమిత్రుల మధ్య జీవిస్తూ మనం దేవుడ్ని ప్రేమిస్తాం. బంధు మిత్రుల యందు అహంకారం పోతే మన౦ దేవుడ్ని అందరిలోనూ చూస్తాం.

అర్జునినికి శ్రీకృష్ణుడు అద్భుతాలకు యోని అని గ్రహిస్తాడు. మన జీవితమే ఒక మహాద్భుతం. మన శ్వాస, గుండె చప్పుడు కూడా అద్భుతాలు. అలాగే చెట్లపై వీచే గాలి, ఆకాశంలో వెలిగే సూర్యుడు. మనం అద్భుతాలకై విశ్వమంతా వెతకనక్కరలేదు. అవి మనముందే ప్రతిరోజూ జరుగుతూ ఉంటాయి. మన కళ్ళు తెరుచుకొని చూస్తేనే అది తెలిసికొంటాము. ఈ విధంగా అందరూ చూస్తే, మన ఇళ్లలోని, జాతుల మధ్య, దేశాల మధ్య గల వివాదములు పరిష్కరింపబడతాయి. ప్రపంచంలో దోపిడీ, హింస, అణ్వాయుధాల వలన అభద్రత తొలగిపోయేవరకు మనం శాంతిని పొందలేము. మహాత్మ "ప్రతి వానికీ ఆనందం కలిగే వరకు, మనలో ఏ ఒక్కరికీ ఆనందం కలుగదు" అని చెప్పెను. 275

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...