|
|
|
|
ఆప్తోక్తిం ఖననం తథోపరిశిలాద్యుత్కర్షణం స్వీకృతిం (పాఠభేదః - పరిశిలాపాకర్షణం) నిక్షేపః సమపేక్షతే న హి బహిఃశబ్దైస్తు నిర్గచ్ఛతి । తద్వద్బ్రహ్మవిదోపదేశమననధ్యానాదిభిర్లభ్యతే మాయాకార్యతిరోహితం స్వమమలం తత్త్వం న దుర్యుక్తిభిః ॥ 67॥
నిక్షేపః=భూమిలో దాచి ఉంచిన ధనము, ఆప్తోక్తిం - ఆప్తులమాటను, ఖననం = త్రవ్వుటను, శిలాపాకర్షణం - రాళ్లను తొలగించుటను, స్వీకృ తిం = స్వీకరించుటను, సమపేక్షతే - అపేక్షించును, తు - కాని, శబ్దైః = మాటలమాత్రముచే, బహిః- బైటకు, న నిర్గచ్ఛతి = రాదుకదా? తద్వత్ - అట్లే, మాయాకార్యతిరోహితం = మాయచేతను, దాని కార్యములగు దేహాదుల చేతను కప్పివేయబడిన, అమలం - నిర్మలమైన, స్వం= స్వకీయమైన, తత్త్వం=తత్త్వము, బ్రహ్మవిదా= బ్రహ్మవేత్త చేత చేయబడిన, ఉపదేశ మనన ధ్యానాదిభిః = ఉపదేశము, మననము, ధ్యానము మొదలగువాటిచే, లభ్యతే=పొందబడును, దుర్యుక్తిభిః - చెడ్డ యుక్తులచేత, న = పొందబడదు.
లోకమున భూమిలోపల దాచియుంచిన బంగారము మొదలగు నిధిని పొందవలెనన్నచో, దానిని చూచినవారి యొక్క మాటలు గాని, లేదా అంజనవిశేషాదుల సహాయముతో దానిని తెలిసికొని సత్యమును చెప్పెడు ఆప్తుల యొక్క మాటలుగాని విని, భూమిని త్రవ్వి, ఆ నిధిపై కప్పిన రాయి తీసివేసి, దానిని పొందవలెను.
అంతియే కాని ' నిక్షేపము’, ‘నిక్షేపము’ అనుమాటలచే అది బయటకురాదు.
ఈ విషయము ఏ విధముగ లోక ప్రసిద్ధమో, తద్వత్ = శిలచేతను, భూమిచేతను కప్పబడిన నిధివలె, స్వం= స్వకీయమైన, అమలం= స్వతః పరిశుద్ధమైన, తత్త్వం - తత్త్వము, అనగా బ్రహ్మ, మాయా కార్యతిరోహితం = అజ్ఞానముచేతను, దాని కార్యములగు అహంకారాది దేహాంతకోశముల చేతను అడ్డుకొనబడిన స్ఫుటప్రకాశము కలదై, బ్రహ్మవిదోపదేశ మనన ధ్యానాదిభిః అ=అంతట, ఉపదేశః = ఉపదేశము, ఓపదేశము. బ్రహ్మవిదుని ఓపదేశము బ్రహ్మవిదోపదేశము. లేదా 'బ్రహ్మవిదా' అనునది తృతీయాంతమగు వ్యస్తపదము కావున “ఆ బ్రహ్మవిదా" ఉపదేశమున కర్తయను నర్థము లభించును. బ్రహ్మవేత్త చేసిన ఉపదేశము, శ్రవణము, మననం = యుక్తులచే చింతనము చేయుట, ధ్యానం-నిదిధ్యాసనము. 'ఆది' పదముచే నిర్వికల్పకసమాధి గ్రహింపబడును.
వాటిచే, లభ్యతే - సాక్షాత్క రింపబడును, బ్రహ్మ తనకంటె భిన్నము కాదు కావున మరియొక విధమగు లాభము ఇచట చెప్పుటకు వీలు లేదు.
అందుచే బ్రహ్మ లాభమనగా బ్రహ్మసాక్షాత్కారము. కంఠస్థచామీకరాది లాభము మొదలగు స్థలములలో గూడ నిట్లే చెప్పవలెను కదా ?
"నైషా తర్కేణ మతిరాపనేయా" ఈ జ్ఞానము తర్కముచే లభించునది కాదు అను శ్రుతి ననుసరించి, ఇది దుర్యుక్తులచే లభించునది కాదు.
శ్రుతి విరుద్ధములు కాని యుక్తులు మాత్రము అంగీకార్యములే.
"పండితో మేధావీ గాంధా రానేవో పసంపద్యతే - దొంగలుపట్టుకొని నట్టడవిలో విడిచి పెట్టగా తెలివిగలవాడు ಬುద్ధిచే ఊహించుకొని, ఏ విధముగా తన స్వస్థానమగు గాంధారదేశము చేరునో, అ యుక్తులచేత గూడ ఆత్మ తత్త్వమును తెలిసికొనవలెను అను శ్రుతియే సత్కర్మమును అంగీకరించుచున్నది.
మహామత్స్యాది దృష్టాంతముచే ఆత్మ అసంగమను విషయమును, సుషుప్తియందు (జీవుడు) ప్రపంచము నుండి పూర్తిగ దూరమై సదాత్మతో కలిసిపోవుటచే, నాతడు నిష్ప్రపంచన ఆత్మ స్వరూపుడను విషయమును, కార్యకారణములకు భేదము లేదను న్యాయముచేతను, మట్టి ముద్ద మొదలగు దృష్టాంతముల చేతను, ఒక వస్తువును తెలిసికొనినచో అన్నియు తెలియును, ప్రపంచము బ్రహ్మకంటె వేరుకాదు అను విషయమును, సాలెపురుగు మొదలగు దృష్టాంతములచే బ్రహ్మ జగత్తుకు ఉపాదాన కారణము, నిమిత్త కారణము గూడ అను విషయమును, తస్కర దృష్టాంతముచే సత్యాభి సంధి కలవాడు ముక్తి పొందును.
మిథ్యాభి సంధి కలవాడు బంధము పొందును అను విషయమును, ఈ విధముగ అనేక యుక్తుల సాహాయ్యముచే శ్రుతియే అనేక విషయములను బోధించుచున్నది గాన, మంచి యుక్తులు అంగీకార్యములే. దుర్యుక్తులు మాత్రమే అంగీకార్యములు కావు అని చెప్పుటకై 'దుర్యుక్తిభిః' అని చెప్పబడినది.
āptōktiṃ khananaṃ tathōpariśilādyutkarṣaṇaṃ svīkṛtiṃ (pāṭhabhēdaḥ - pariśilāpākarṣaṇaṃ) nikṣēpaḥ samapēkṣatē na hi bahiḥśabdaistu nirgachChati । tadvadbrahmavidōpadēśamananadhyānādibhirlabhyatē māyākāryatirōhitaṃ svamamalaṃ tattvaṃ na duryuktibhiḥ ॥ 67॥
For many treasure hunting is alluring so much so that there is a wiki page devoted to it. There we find the mention of treasure hunters using metal detectors and armed with conventional tools like pickaxe and spade in search of valuable objects. The modern day treasure hunters use submarines to seek out valuables from ship-wrecks.
When Sankara makes a reference to treasure hunting, he is talking about buried treasure that has to be brought to light by peeling layers of sand and stones arduously. Half the struggle is finding the spot to dig. But once the treasure is found, the hunter is amply rewarded for the rest of his life.
The discovery of self, similarly, requires that one remove the avidya (nescience), for example, by reasoning about the pancha kosas (annamaya, pranamaya, manomaya, vignanamaya and anandamaya). The sthoola sareera (gross body) being the annamaya kosa, the innermost kosa is anandamaya or bliss which is experienced as one finds the self.
Vedantis had conventionally sought treasures of wisdom from srutis. The mahavakyas were derived when rishis contemplated over veda mantras. This has led some like Maharshi Dayananda Saraswati, many centuries after Sankara who gave us panchayatana pooja using idols of Sun, Ganesha, etc., to give a clarion call for sanatana dharma meaning not worshiping idols and conducting rituals that don't have a basis in vedas.
It is believed by the strict followers of sanatana dharma that only fire rituals like yagnas, agni hotras, homas etc. have vedic sanction, thereby, everything else is just a concoction by vested interests. Typically in a yagna, one recites veda mantras to invite vedic gods like Indra, Varuna, Saraswati, et al. and offers oblations, called havis, that are carried by Agni deva to them.
When one is faced with an impending natural calamity, like a cyclone or a hurricane, what one to do other than pray or perform agni hotra to pacify the devatas who have the ultimate power to mitigate the impact? Some vedantis would like to perform fire rituals even in peaceful times with the anticipation that the smoke rising from the ghee and herbs offered in the fire linger in the atmosphere for long enough to lessen the impact of pollution.
Hindus are not alone in conducting fire rituals. Fire is held by Zoroastrians to be particularly sacred, serving as a focal point of many ceremonies and rituals, and serving as the basis for Zoroastrian places of worship, which are known as fire temples.
In the world-wide web, viewed as a treasure of knowledge, one finds many valuables that find resonance with Vishnu Sahasranama "sarvagno gnanamuttamam". It goes without saying that Sankara, himself, is a treasure trove of advaita that predates his arrival and for that he is believed to be an avatar. As we dig more into his upcoming slokas, we will be further enlightened and enlivened.