రెండవ ప్రకరణము
44
ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మ విషయా వ్యాఖ్యాతా
ఏతయా + ఏవ = ఈ విధముగానే సవిచారా = ఆలోచనతో కూడినది నిర్విచారాచ = ఆలోచనలేని స్థితి కూడా సూక్ష్మవిషయా = సూక్ష్మ విషయములతో కలసి వ్యాఖ్యాతా = వ్యాఖ్యానము చేయబడినది
ఇప్పుడు తర్కముతో కూడినది, సూక్ష్మ విషయములతో కూడిన తర్కము అక్కరలేనిది, అను రెండు స్థితులు వ్యాఖ్యానము చేయబడుచున్నవి
పై సూత్రములలో చెప్పబడిన రెండు స్థితులు మరల ఇంకొకసారి ఇక్కడ చెప్పబడుతున్నాయి. మొదటి విధానమున యోగి ఉండే స్టితి 42 వ సూత్రములో వివరింపబడి౦ది. అటువంటి యోగికి పదములు, వాటి అర్థములు, వస్తువులు మొదలైనవి అర్థములుగా ఉంటాయిగాని వాటివలన యోగికి వికల్పములేదు. యోగి ఉదాసీనుడై తాను కేవలము పరిస్టితులయందు తదను గుణముగా ప్రవర్తిస్తూ, రాగద్వేషములకు అతీతుడై ఉంటాడు. కాని ఇటువంటి స్థితిలో విషయములు, వాటి అర్థములు, వాటియందు తన ప్రవర్తన అట్లే ఉంటుంది. కాని వాటి వలన తాను రాగద్వేషములు పొందడం జరగదు. రెండవ విధానమునందు యోగికి పదములు, అర్థములు లేవు. అనగా విషయ వాసనలేదు. సర్వము అంతర్యామి యొక్క రూపము. అనగా ఆ సమస్తము తానేనని, అన్నీ తనలోని భాగములుగా నుండును అని తెలుస్తుంది. సమస్త రూవములు, వ్యక్తులు, పరిసరములు, విషయములు తానే, తన ప్రతిరూపమే. తానే నిప్పుగా దహిస్తున్నాడు. నీరుగా ప్రవహిస్తున్నాడు. గాలిగా వీస్తున్నాడు. మరల వీచుట, దహించుట అనువానికి తన కర్తృత్వము లేదు. కనుక ఈ వీచుట, దహించుట మొదలైనవి తనలో సూక్ష్మములుగా యుండును. అవి విషయములుగా కాక సముద్రమునందు అలలు వలె విచిత్రమైన అస్తిత్వము కలిగి ఉంటాయి. కనుకనే సూక్ష్మ స్టితిగా చెప్పబడినది. బంగారముతో చేయబడిన ఒక దేవతా విగ్రహమునకు, ఒక కుక్క విగ్రహమునకు, కంసాలివానికి భేదము లేనట్లు యోగికి భేదము లేదు. కంసాలివానికి రెండిటియందును బంగారమే జ్ఞప్తి యుంటుంది. యోగికి రెండిటి యందు తానే ఉంటాడు. కంసాలివానికి ఆ వస్తువుల విలువలకన్న రూపభేదములు ప్రధానముకానట్లు యోగికి రూపభేదములు ప్రధానముకాదు.
45
సూక్ష్మ నిషయత్వంచాలింగపర్యవసానమ్
సూక్ష్మ విషయత్వం = సూక్ష్మ విషయములకు సంబంధించినది చ = మరియు . అలింగ పర్యవసానమ్ = లింగ బేధము నశించునట్టి స్టితియే చివరకు మిగులుచున్నట్టిది.
సూక్ష్మ విషయములు సహితము తమ అస్తిత్యమును పోగొ ట్టుకొనునట్టిదియే అసలు సితి.
ప్రతి వస్తువు లేక విషయము తన ద్రవ్యత్వము చేత, ధర్మము చేత, తన అస్తిత్వము కలిగిస్తుంది. అటువంటి వానివలన దానికి ఒక నామము, రూపము ఏర్పడుతున్నాయి. విషయము నందలి అస్తిత్వము దాని ధర్మములననుసరించి ఉంటుంది. గుణ భేదముచే వస్తువుల తత్వము తెలుస్తుంది. వస్తువు యొక్క తత్వము తెలియుటయే వస్తువు తెలియుట. కాని వస్తువు యొక్క అసలు తత్వమునందు లీనమైనప్పుడు వస్తువు యొక్క నామరూపములు, గుణములు విస్మృతి చెందుతాయి. దాహమై నీరు త్రాగుచున్న వానికి నీటియొక్క నామరూపములుగాక, నీటియొక్క అనుభవము (దాహము తీర్చుట) అనుదానిలో మనస్సు లయము అవుతుంది. నీరు త్రాగువానికి త్రాగుచున్నప్పుడు ఇవన్నీ తాత్కాలిక౦గా నశించి, (తాగిన తర్వాత మరల జ్ఞప్తికి వస్తాయి. అలాగే ఒక సంగీత కచేరీకి హాజరైన వానికి కచేరీ ప్రారంభింపకముందు గాయకుడు, వాద్యకారుల పేర్లు, పాట, రాగము మొదలైనవి జ్ఞప్తికి ఉంటాయి. కాని పాట ప్రారంభించిన తర్వాత, క్రమేణా ఈ విషయములు ఒక్కొక్కటీ నశించి, మనస్సు పాటయందు లయమవుతుంది. కొంత సేపటికి పాటకూడా మనస్సునందు నశించి గానము యొక్క మాధుర్యమే తన యందుంటుంది.
46
తా ఏవ సబీజః సమాధిః
తాఏవ = అదియే సబీజః = బీజముతో కూడినట్టి సమాధిః = సమాథి
అటువంటి స్థితియే బీజముతో కూడిన సమాధిస్థితి అని పిలువబడినది.
ఒక వస్తువును గురించిన అనుభవముచేత ఆ వస్తువు యొక్క నామ రూపాదికములు నశించినపుడు అది "సబీజసమాధి" అని పిలువబడుతుంది. కనుక ఇక్కడ యోగి సమాధిస్థితి నందున్నా, విషయవాసనలు సంస్కారములుగా అనగా విత్తనములుగా లోపల ఉంటాయి. కాని ఈ విత్తనము ఎప్పటికైనా మొలకెత్తే అవకాశము౦ది. అలా మొలకెత్తడమే సంసారమని చెప్పబడుతుంది. సంసారమందలి మనస్సును ఈ సంస్కారములు బంధిస్తాయి. ఇవే కర్మబంధములు. కర్మబంధము అంటే "పని చేయుట బంధము" అని అర్థము కాదు. పని చేస్తున్నాను అని అనుకోవడం కర్మబంధము. ఎండాకాలములో ఎండలో తిరిగివచ్చినవాడు దాహము వేసి నీరు త్రాగుతున్నప్పుడు మ౦చినీరు యొక్క నామరూపాదులు నశించి, దప్పిక తీరడమే మనస్సులో ఉంటుంది. కాని త్రాగిన తరువాత నామరూపాదికములన్నీ జ్ఞప్తికి వస్తాయి. అలా రాకుండ ఉండాలంటే మనస్సు నిరంతరము యోగస్టితిలో ఉండాలి. అట్టి యోగికి నీరు త్రాగుతున్నా దాని వలన కలుగు అనుభవమే సత్యముగా నుంటుంది గాని వాని పేర్లు, ఆకారములు మొదలైనవి కావు. ఏదైనా ఇంతే. ఏ వస్తువు యొక్క తత్వమైనా తుదకు అనుభవముగా పర్యవసానమయి, మరల అలాంటి అనుభవము వలన భౌతిక జగత్తున వస్తువు ఏర్పడుతోంది. కాని వస్తువునకు పర్యవసానముగా అనుభవము కలుగడంలేదు. అనగా వస్తువుద్వారా అనుభవము కలుగుతుంది గాని వస్తువునకు ఫలితేము అనుభవము కాదు. "నేను" అను ప్రజ్ఞననుసరించి శరీరము ఏర్పడుతోంది కాని శరీరము వలన "నేను" అను ప్రజ్ఞ పుట్టడంలేదు. అలాగే ప్రవహించుట, దప్పిక తిర్చుట, అను లక్షణములను రసమంటారు. మరియు రసమునకు అనుభవము అని కూడ అర్థము కలదు. కనుక రసము వలన నీరు పుట్టినది. అందుచేతనే ఆ నీటిని త్రాగు వానికి రసము అను లక్షణము అనుభవముగా వస్తోంది. ఇది తెలిసినవానికి రసము సత్యమై నీటియొక్క అస్తిత్వము, ప్రత్యేకత నశిస్తుంది. అనగా నీటిని రసమునకు వాహికగా తెలి యుండును. వానికి రసము ప్రధానము కాదు. నీరు ప్రధానము కాదు. ఇట్లు వస్తువుల వలన కలుగు అనుభవము సత్యమై, వస్తువుల అస్తిత్వము అసత్యముగా తెలిసిన వానికి వస్తువు యొక్క నామ రూపాదికములు ప్రత్యేకప్రభావమును కలిగి యుండవు. ఇదే బీజరూపసమాధి స్థితి. అనగా ఇక్కడ సంస్కారమను విత్తనము శాశ్వతముగా నశించి యోగి నిజమైన యోగస్టితిలో ఉంటాడు. అట్టివాడు పనులను శరిరము యొక్క, పరిసరములయొక్క ఆవశ్యకతననుసరించి చేస్తాడు కాని తనంతట తాను సంకల్పించడు. అట్టివాడు నీటిని త్రాగుతున్నా, త్రాగనివాడై యుండును. తినుచున్నా తిననివాడైయుండును. వానికి సంసారము లేక కర్మబంధములు లేవు.