Saturday, March 16, 2024

Vidura Neeti Part 4




జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలె వృద్ధిపొందుతాడు. ఇంద్రియాలనూ మనస్సునూ జయించ కుండా, మంత్రులను స్వాధీనంలో ఉంచుకోగోరేవాడూ, మంత్రులను వశపరుచుకోకుండా శత్రువులను జయించగోరేవాడూ, ప్రజాభిమానం పొందలేరు. మనశత్రువును ముందు జయించాలి. మనస్సును జయించి అపరాధులను శిక్షిస్తూ కార్యాలను పరిశీలిస్తూ ఉండేవారిని లక్ష్మి వరిస్తుంది.

One who conquered senses would grow like a waxing moon. One trying to keep his ministers in one's control, without conquering senses and mind; one trying to win over the enemies without controlling his ministers can't attain popularity among the subjects. A king should conquer his enemies. Goddess Lakshmi will favor those conquering their senses, punishing criminals and monitoring the subordinates.

ఈ మానవశరీరమొక రథం. దానికి బుద్ధి సారధి. ఇంద్రియాలు అశ్వాలు. వీనిని వశంలో ఉంచుకొనేవాడు మహారధికుని వలె సంసార సంగ్రామంలో జయం పొందుతాడు. అశిక్షితాలై పట్టు తప్పిన గుఱ్ఱాలు మధ్య మార్గ౦లో సారధిని పడగొట్టేటట్టు వశంలోని ఇంద్రియాలు పురుషుని అర్థానర్దజ్ఞానాన్ని నశింపజేసి దుఃఖభాగుని జేస్తాయి. ధర్మార్థాలను విడిచి విషయలోలుడై చరించేవాడు అచిరకాలంలో ఐశ్వర్య ప్రాణ స్త్రీ ధనాలను పోగొట్టు గుంటాడు, ఆత్మజ్ఞాని గ్రహించడానికి నిరంతరం కృషి చెయ్యాలి. ఆత్మకు మి౦చిన మిత్రుడూ శత్రువూ లేరు. దాన్ని జయించినవారికి అదే మిత్రము. లేకపోతే అదే పరమశత్రువు. సూక్ష్మరంధ్రాలు కల వలలోపడ్డ రెండు పెద్దచేపలు దానిని కొరికి వేసేటట్టు కామక్రోధాలనే మీనాలు వివేకాన్ని నశింవ చేస్తాయి.

A man's body is the chariot. Intellect is the charioteer. Senses are the horses. Like the able charioteer holding the reins, one will win in the battle of life by controlling the body, intellect and senses. Just as untamed wild horses will displace the rider midway, uncontrolled senses will bring infamy and sorrow. One who flouts dharma will lose wealth, wife, riches, even life. A self-realized must exert everyday. There is no bigger friend or enemy than the self. To those conquering the self, it is the best friend; otherwise it is the worst enemy. Like the fish that can gnaw away the net, lust and hatred destroy the intellect.

ధర్మార్థాలను పరిశీలించుకొని విజయం కోసం కృషిచేసేవాడు సులభంగా వానిని సాధిస్తాడు. చిత్తవికారానికి హేతుభూతాలైన పంచే౦ద్రియాలను శత్రువులుగా భావించి వానిని జయిస్తేనే శత్రు విజయం సాధ్యమవుతుంది. సాధువులు సత్కర్మల వల్ల, రాజు రాజ్య భోగాలవల్ల సుఖులవుతారు. పాపాత్ములతో సాంగత్యంగల సజ్జనులు కూడా దండనార్హులే అవుతారు, ఎండిన కట్టెతో కలిసే పచ్చికర్రకు కూడా అగ్నిబాధ తప్పదుకదా!

The one trying for victory by analyzing his dharma and wealth will attain them easily. One who considers the five senses as responsible for the different mental states, and tries to conquer them will eventually win over his enemies. Ascetics by good karma, kings with palatial luxuries will enjoy life. The chaste ones making friendship with the wicked also become eligible for punishment, like wet wood burning with tinder.

అందుచేతనే దుర్జనసాంగత్యం ఉచితం కాదు. ఇంద్రియలోలుని ఆ ఇంద్రియాలే ఆరగిస్తాయి. గుణగ్రహణమూ, సరళ స్వభావమూ, పవిత్రహృదయమూ, సంతోషభావమూ, మృదువచనమూ, సత్య వ్రతమూ, ఇంద్రియ సంయమనమూ దుష్టుల దరిజేరవు. అత్మజ్ఞానమూ, క్రోధరాహిత్యమూ, సహన శీలమూ, వాగ్దానరక్షణా, దానశీలమూ, ధర్మపరాయణతా అధములకు పట్టవు. విద్వాంసులను నిందిస్తూ మూర్ఖులు సంతోషిస్తారు. ఎదుటవానిని నిందించడమే స్వభావంగా కలవాడు మహాపాపి. నిందలను సహిస్తూ వారిని క్షమించేవాడు పుణ్యాత్ముడు. హింస దుష్టులకు బలం. దండనీతి రాజులకు బలం. సేవ స్రీలకు బల౦. క్షమ గుణశీలికి బలం.

Hence befriending the wicked is not recommended. One who is submissive to senses will be destroyed by them. Good attributes, pleasing personality, soft spokenness, pure heart, optimistic outlook, pursuit of truth, moderation with senses will not be endearing to the wicked. Self realization, free from rage, patience, keeping one's word, giving alms, implementation of dharma will not appeal to the low lives. Fools rejoice by insulting scholars. A sinner blames other people. A noble person forgives one who is blaming him. Violence and cruelty are the strengths of the wicked. Penal code is the strength for the king. Service is the forte of women. Forgiveness is the power of the noble.

వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడంకంటె కష్టమైనది లేదు. చమత్కారయుక్తులతో విశేషార్థాలను ప్రతిపాదించగల వాణి మితంగానే ఉంటుంది. మధు శబ్ధయుతమైన విషయం కళ్యాణప్రదమే అవుతుంది. అదే విషయం కటూక్తలతో నిండితే అనర్ధదాయక మవుతుంది. గొడ్డలి దెబ్బలు తిన్న అరణ్యం చిగిరంచవచ్చు. కాని కటువచనాలతో దెబ్బతిన్న హృదయం కోలుకోదు. శరీరంలో నాటిన తీవ్ర శరాలను పెరిక పారవేయవచ్చు. కాని పరుష భాషనాలుమాత్ర౦ గు౦డెలోనుండి పైకి తియ్య లేము. అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషి౦చరు. దేవతలు ఎవని పరాజయం కోరుతారో వాని బుద్ధినే ముందుగా హరిస్తారు. ఆంతతో వాడు దుష్కర్మరతుడవుతాడు. వినాశకాలం సమీపించినపుడే బుద్ది నశిస్తుంది. అన్యాయం ప్రవేశిస్తుంది.

Nothing is as difficult as controlling the speech. The speech interspersed with skilful phrases and humor is limited. Sonorous speech with sweet sounding words is auspicious. The speech composed of harsh sounding words causes evil. A forest of trees felled by an axe can be replenished but not the heart hurt by harsh words. It is possible to remove arrows struck on the body, but not the harsh words striking the heart. That's why pundits don't speak harshly. When a person's downfall is desired, his intellect should be dulled thereby making him a wicked person. Before the downfall intellect will retreat and injustice will enter.

మహారాజా! నీ కొడుకులు పాండవులను విరోధ దృష్షితో చూస్తున్నారని మరచిపోకు. సర్వసద్గుణ సంపన్నుడైన ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. థర్మార్థవిదుడూ తేజస్సంపన్నుడూ థీమంతుడూ భాగ్యశాలి అయిన ధర్మజుడు మీయందు గల గౌరవ భావంచేత ఎన్ని కష్టాలైనా సహించాడు. అది మరువకండి అన్నాడు విదురుడు.

Vidura said "King, don't forget that your sons are considering Pandavas as their enemies. The embodiment of good attributes, Dharma Raja, could become the ruler of the world. Being a follower of dharma, having great scholarship; possessing great aura and fortune Dharma Raja tolerated many setbacks out of his enormous respect for you. Please don't forget that".

ధీవిశాలుడైన విదురుడు ప్రసంగిస్తూంటే ధృతరాష్ట్రుని మనస్సు కొంతకొంత కలకదేరుతూంది. మరికొంత సేపు విదురుని ముఖాన నీతిశాస్త్రం వినా లని కుతూహలపడి దృతరాష్టుడర్ధించాడు. ధీశాలి విదురుడు ప్రసంగిస్తున్నాడు.

As the intellectual Vidra was discoursing, Dhrutarashtra's heart lightened. He wanted more of the discourse.

ప్రభూ! సర్వతీర్థస్నానమూ, భూతదయా సమానమైనవి. ఒక్కొక్కప్పుడు తీర్థస్నానంకంటె మృదువ్యవహారమే ఘనమై నది. అందుచేత మీరు మీ బిడ్డలైన దుర్యోధనాదులయందూ, ధర్మ రాజాదుల యందూ సమభావంతో సౌమ్యంగా వ్యవహరిస్తే మీ ‌ కీర్తిప్రతిష్టలు యినుమడిస్తాయి. మానవుని కీర్తి యీభూమండలంలో ఎంతవరకూ గానం చెయ్యబడుతూంటుందో అంతవరకూ స్వర్గంలో స్థిరనివాసం లభిస్తుంది. ఈవిషయమై సుధన్వ విరోచనులమధ్య జరిగిన సంవాదమొకటి వినిపిస్తాను.

"King, bathing at all the holy rivers is the same as being kind to all life forms. At times, soft spokenness is superior to a dip in a holy river. If you are equanimous with your sons and Pandavas, then your fame will spread all over the world. Accordingly your sojourn in heaven will last for ever. In this regard I will tell you about a conversation between Sudhanva and Virochana"

పూర్వకాలంలో కేశిని అనే పేరుగలసౌందర్య రాశి ఉండేది. ఆమె సర్వోత్తముడైన వ్యక్తిని భర్తగా వరించాలని స్వయంవరం ప్రకటించింది. ఆ స్వయం వరానికి కుతూహలంతో విరోచనుడు వచ్చాడు. అప్పుడామె వానితో “విప్రా! దైత్యులలో శ్రేష్ఠు డెవడు? విప్రుడే శ్రేష్ఠుడైతే భూసురుడైన సుధన్వుడు నా శయ్యను అలంకరించడానికి అర్హుడు కాడా”. అని ప్రశ్నించింది. విరోచనుడు సమాధాన మిస్తూ కేశినీ! ప్రజాపతి సంతానంలో మేము శ్రేష్ఠులము. మా ఎదుట దేవతలే అల్పులై నప్పుడు భూదేవతల విషయం చర్చకేరాదు అన్నాడు.

Once upon a time there was a beautiful woman called Kesini. She sought public choosing of a husband who would be an embodiment of great attributes. Virochana, the son of Prahlada and the king of asuras, arrived for the occasion. She said "Who is the best among the asuras? If a brahmin king is the best among all, isn't Sudhanva eligible to marry me?". Virochana said "Kesini, among prajapati's progeny we are the best. When suras are weak before us, is there anything to be said about the brahmin kings on the earth"

విరోచనా! అయితే మనమిక్కడ యిలానే ఉండి సుధన్వుడు వచ్చేవరకూ నిరీక్షిద్దాం. వాని ఆగమనానంతరం నిర్ణయించుకుందా౦- అంది కేశిని. రాత్రిగడిచింది. తెల్లవారింది.

Kesini said "Virochana, then we will wait here until Sudhanva arrives. We will decide after that".

కేశిని విరోచనులున్నచోటకు సుధన్వుడు వచ్చాడు. కేశిని లేచి నిలబడి అర్ఘ్య పాద్యాదులిచ్చి ఆసనం చూపింది. అప్పుడు సుధన్వుడు విరోచనుని వైపు తిరిగి ప్రహ్లాదనందనా! నేను యీ సుందర స్వర్ణ సింహాసనాన్ని మర్యాదగా స్పృశిస్తున్నాను; అంతే నేను దీనిపై కూర్చోను. ఈ ఆసనాన్ని నేను అలంకరించినట్లయితే నీతో సమానుడనే అవుతాను.

The next day Sudhanva came. Kesini got up and offered him a seat after due worship. Then Sudhanva turned to Virochana and said "The son of Prahlada, I am sitting on this ornate throne out of respect. But not as your equal"

అనగా విరోచనుడు.. ఓ బ్రాహ్మణుడా ! దర్భాసనమూ, దారుపీఠమూ యోగ్యమైనవికాని స్వర్ణ సింహాసనాలు నీ కర్హమెనవికావు- అన్నాడు.

Virochana retorted "Brahmin, you are suited to sit on dry grass and wooden seats but not the golden throne"

విరోచనా! తండ్రీకొడుకులు ఒకే ఆసనంమీద ఆసీనులు కావచ్చు. ఇద్దరు విపృలూ, ఇద్దరు క్షత్రి యులూ, ఇద్దరు వైశ్యులూ, శూద్రులూ, ఇద్దరు వృద్ధలూ, ఏకాసనాసీనులుకావచ్చు. అంతే. నీతండ్రియైన ప్రహ్లాదుడుకూడా నాకు ఉన్నతాసనమిచ్చి గౌరవంగా చూసాడు. నువ్వు పసివాడవు. సుకుమారంగా పెరుగుతున్న నీకు లౌకికజ్ఞానం పట్టలేదు. అని సుధన్వుడనగా విరోచనుడు- సుధన్వా! మా దైత్యనగరంలో ఉ౦డే ధనకాంచనాలనూ, గోవులనూ, ఆశ్వాలనూ పణంగా పెడుతున్నాను. మన యిద్దరిలో ఎవడు శ్రేష్ఠుడో నిర్ణయించుకుందాం - అనగా సుధన్వుడు - ప్రహ్లాదనందనా ! అవన్నీ ఆలానే వుంచు, మనము మన ప్రాణాలను ఒడ్డి ఈ విషయం నిర్ణయించుకుందాం. ఈ నిర్ణయం ఒక జ్ఞానివల్ల జరగాలి అన్నాడు, విరోచనుడందుకంగీకరిన్తూ బ్రాహ్మణా ! నేను దేవతలదగ్గరకు రాను. ఈ విషయమై మానవుల నిర్ణయం నాకు పొసగదు. అనగా సుధన్వుడు- ఓ దైత్యా! మనము నీతండ్రియైన ప్రహ్లాదుని దగ్గరకు పోయి ఈ విషయయమై నిర్ణయం చెయ్యమందాము. ప్రహ్లాదుడు ఏస్టితిలోనూ అబద్దమాడడని నా నమ్మకము- అన్నాడు.

"Virochana, a father and his son can sit together. Two brahmins, a couple of warriors, two traders, sudras, couple of old people can cohabit the same seat. Your father Prahlada offered me a superior throne and showed his respect. You are an adolescent. Growing in a cloistered environment you are unable to grasp the transactional world" said Sudhanva.

"Sudhanva, I am betting all the wealth, cows and horses in our asura country to decide who is the better suitor" said Virochana.

"Son of Prahlada, keep the trivialities aside. Let us bet our lives. The winner should be decided by a scholar" said Sudhanva.

Virochana acquiesced saying "Brahmin, I won't come to suras. Nor humans"

Sudhanva said, "Asura, let us ask your father Prahlaada. I believe he will never lie"

వారుభయులూ బయలుదేరి ప్రహ్లాదుని సమీపించారు. ఎన్నడూ కలియని విరోచన సుధన్వులు కుపితభుజంగాలవలె రావడం చూసి ప్రహ్లాదుడు నాయనా! సుధన్వునికీ నీకూ సఖ్యంకలిగిందా ? ఇదివరలో ఎన్నడూ కలిసి మెలసి తిరుగని మీరు ఈనాడు ఇలా రావడం ఆశ్చర్యంగా ఉంది అనగా విరోచనుడు సమాధాన మిస్తున్నాడు. మహారాజా! మా ఉభయులమధ్యా మైత్రి లేదు. ఒక విషయమై పోటీపడి ప్రాణాలుఒడ్డి నీదగ్గరకు వచ్చాము. ఇప్పుడు యదార్థంచెప్పండి అన్నాడు. ప్రహ్లాదుడు సేవకులను పిలిచి సుధన్వునుకి అర్ఘ్యపాద్యాలూ మధుపర్కాలూ తెప్పించి- అర్చించి బ్రాహ్మణోత్తమా! నీవు అతిథివి, నాకు పూజనీయుడవు. నీకు దానమివ్వడానికి తెల్లని ఆవులను సిద్ధంగా ఉంచాను. అనగా సుధన్వుడు ప్రహ్లాదా! నా కివన్నీ దారిలోనే లభించాయి, ఇప్పడు నువ్వు నా ప్రశ్నకు సమాధానమివ్వాలి. విపృ, దైత్యులలో శ్రేష్ఠుడెవడు ?- అని ప్రశ్నించాడు.

They both went to Prahlada. When he saw the mutually hating Virochana-Sudhanva together approach him like angry snakes, Prahalada said "Did you and Sudhanva patch up? I have never seen you together. I am surprised by your visit".

Virochana said "King, there is no friendship between us. We are competing for a prize and bet our lives. Please tell us the truth."

Prahlada said to Sudhanva "Brahmin, you are my guest worthy of worship. I have holy cows as alms to you"

Sudhanva said "Prahlada, I could get them on the way. Now you should answer my question: between brahmins and asuras, who is superior?"

భూసురోత్తమా! నాకు విరోచనుడొక్క డే కొడుకు, నువ్వు స్వయంగా ఇక్కడకు వచ్చి ఈ వివాదం నా ముందుంచితే నేనెలా నిర్ణయించగలను అని పుహ్లాదుడు ప్రశ్నించగా_ మహారాజా! నీ ధన ధాన్యసంపదలన్నీ నీ కుమారునకే ఇయ్యి, కాని ఈ వివాదంలోమాత్రం సత్య నిర్ణయం చెయ్యి- అని అడుగగా ప్రహ్లాదుడు- సుధన్వా! సత్యం భాషించకుండా అసత్యాన్ని పలికే వక్తికి కలిగే స్ధితి ఏమిటో నాకు చెప్పు_ అన్నాడు.

"Brahmin, Virochana is my only son. If you ask me about the best man, how can I answer it?" said Prahlada.

"King, you can give all of your wealth to your son. But you must decided on the best man" said Sudhanva.

సవతులుగల స్రీకి, ద్యూతంలో ఓడిన జూదరికీ, భారవాహకుడికీ రాత్రివేళల ఏస్థితి కలుగుతుందో అన్యాయ నిర్ణయాలు చేసేవారికి అదేస్థితి కలుగు తుంది. అసత్యనిర్ణయం చేసే రాజు బంధితుడై క్షుద్భాధ ననుభవిస్తూ శత్రువుల సంతోషం చూడవలసిన స ్థితిలో పడతాడు. గోవుకొరకు, పశువు కొరకు, అశ్వముకొరకు, మనుష్యునికొరకు అనృత మాడేవాడు (అబద్ధం చెప్పేవాడు) క్రమంగా ఐదు, పది, నూరు, వేయి తరాలవరకూ నరకంలో ఉంటాడు. స్వర్ణంకోస౦ అసత్యం పలికేవాడు భూతభవిష్యత్ఫలాలను కోల్పోతాడు. భూమికోనం స్త్రీ కోసం అనృతమాడే వాడు సర్వనాశనం చేసుకుంటాడు. అని సుధన్వుడు చెప్పగా ప్రహ్లాదుడు తన కుమారుని వైవు తిరిగి. నాయనా! సుధన్వుని తండ్రియైన అంగిరసుడు నాకంటె శ్రేష్ఠుడు. వీనితల్లి నీతల్లికంటె శ్రేష్ఠురాలు. అందుచేత నువ్వ సుధన్వునికంటె గొప్పవాడవు కాదు. ఇప్పుడు నువ్వు సుధన్వుని చేతులలో ఉన్నావు_ అని పలికి సుధన్వునివైవు తరిగి - బ్రాహ్మణ దేవతా! నువ్వనుగ్రహిస్తే నా కుమారుడు నాకు దక్కుతాడు- అన్నాడు.

"A man making an unjust decision will attain the same state at night as that of a woman sharing her husband with many women; a gambler losing his bet; a man carrying heavy loads all day. A lying king will be captured by the enemy and subjected to hunger by watching his enemy rejoice. A man lying for the sake of a cow, ox, horse and another man, will have the progeny suffer in hell for a long time. A man lying for gold will lose the fruits of past and future karma. One lying for land and a woman will be totally annihilated" said Sudhanva.

Prahlada turned to Virochana and said "Sudhanva's father Angirasa is better than me. His mother is superior to yours. Hence you are not more eminent than him. Now you are in the hands of Sudhanva".

Then Prahlada turned to Sudhanva and said "Brahmin, if you are considerate I will get my son back".

ప్రహ్లాదా! నువ్వు ధర్మాన్నిస్వీకరించి సత్యం భాషించావు. కనక నీకుమారుని నీ కిస్తున్నాను. కాని వీడు కేశిని సమక్షంలో నా కాళ్ళు కడగాలి అన్నాడు

"Prahlada, you accepted dharma and spoke the truth. So I am giving your son back. But he should wash my feet before Kesini" said Sudhanva.

అని విదురుడు ఆ గాధను ముగించి. మహారాజా! ఈ ఉపాఖ్యానం విన్నారుకదా ! అందుచేత మీరు మీ కుమారులకోసం స్వార్ధవశీభూతహృదయ౦తో అసత్యమాడకండి. అసత్యమాడి సర్వనాశనానికి దారి తియ్యకండి.

Thus ending the story Vidura said "King, like in the story narrated, you should not lie for the sake of your sons out of selfishness and for gaining an upper hand. Don't lie and cause total destruction"

Friday, March 8, 2024

Vidura Neeti Part 3




పాండురాజు శాపదగ్ధుడైనా పాండవులైదు గురూ జన్మించారు. ఇంద్రసదృశులైన వారిని చిన్న నాటినుండి మీరే పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పారు. వారు మీ అదేశాలను అంజలిఘటించి అను సరిస్తున్నారు. ఈ నాడు వారి రాజ్యభాగం వారికిచ్చి మీ బిడ్డలతో మీరు నుఖంగా ఉండండి, ఇలా చేసి నట్లయితే దేవతలు సంతోషిస్తారు. ఈ ప్రజానీక౦ మిమ్మల్ని వేలెత్తి చూపదు. అని విదురుడు ముగించాడు.

"Even though Pandu was cursed, the five Pandavas were born after his death. You raised them and made them on par with Indra and Devas in their knowledge and skill. They are following every dictum you have promulgated. So you must give up their share of the kingdom and live happily. This way Devas will be pleased with you. And your subjects won't raise an accusatory finger at you" said Vidura to Dhrutarashtra.

నా మనస్సులోని చింత నాకు నిద్రపట్టనివ్వ డం లేదు. ఇప్పుడు నేను చెయ్యవలసిన పనేమిటో నిర్ణయించి చెప్పు. ధర్మార్థవిదుడవైన నువ్వు బాగా వివేచనం చేసి సత్యపథం నిర్దేశించు. కురుపాండవు లకు ఏది హితమైనదో' దానినే చెప్పు. నా హృదయం అరిష్టాలనే శంకిస్తోంది. కనుక నాకవే గోచరిస్తూ వేదిసున్నాయి. ధర్మరాజు ఏం కోరుతాడో ఆలో చించి చెప్పు - అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించగా విదురుడు మహారాజా ! ఎదుటివాని, పతనాన్ని కోరకుండా చరించే వ్యక్తి అర్థించక పోయినా వానికి కళ్యాణ మార్గమే చెప్పాలి. రానున్న విపత్తులు కూడా సూచించాలి. నేను కళ్యాణప్రదాలూ ధర్మ యక్తాలూ అయిన విషయాలు చెబుతాను వినండి. దుష్టమార్గాన, కపటవ్యవహారాలు సాగించడం కోసం మీరు యత్నించకండి. సన్మార్గాన సదు పాయాలలో కృషిచేసినప్పుడు అది ఫలించక పోయినా ధీమంతుడు విచారించకూడదు.

Dhrutarashtra said "I am sleepless as I am tormented. Please tell me what I need to do. You know dharma and follow it. So you can show me the path of rectitude. Tell me what will be good for the Kuru and Pandava dynasties. My heart is perceiving bad omens. Hence I am troubled and tormented. Tell me what Dharma Raja desires."

Vidura said "King, one who doesn't wish for the downfall of another, should show the morally correct path even when not sought. He should also show the perils that can arise in that path. I will tell you the auspicious things that adhere to dharma. Don't try to lead astray and carry out evil acts. When sticking to morally accepted path, even when an objective is not met, the virtuous man will not be in sorrow."

ఏ ప్రయో జనంతో మనం కర్మ ప్రారంభిస్తున్నామో అది ముందుగా నిశ్చయించుకొని దాని విషయమై పూర్వా పరాలు చింతించి తొందరపడకుండా సావధాన చిత్తంతో దాని పరిణామాలనూ, ఫలితాలనూ పరిశీ లించి ముందడుగు వేయాలి. లాభమూ, హానీ, ధనమూ, దేశకాలస్థితులూ, దండనీతీ ఎరుగని రాజు రాజపదవికి అర్హుడుకాడు. పైవిషయాలన్ని గ్రహించి ధర్మార్థాలయందు సావధానచిత్తుడై చరించేవాడు రాజ్యార్హుడు. రాజపదవి లభించింది కదా అని అనుచితంగా వ్యవహరించకూడదు. వార్ధక్యం సౌందర్యాన్ని హరించేటట్టు, ఉద్దండ వ్యవహారం సంపదలను నశింపచేస్తుంది. గాలము ముల్లుకు గుచ్చబడిన ఆహారాన్ని వాంఛించే మీనం (చేప) దాని పరిణామాన్ని ఆలోచించలేదు.

Whatever good we want to accomplish with our action, we should first decide, think about pros and cons without haste, analyze its consequences and results, and then implement it. A king who doesn't know the benefit and harm of his actions; about the wealth, the space and time, and the penal code is not qualified to rule. One who is knowledgeable about such things and follows dharma and desire, is a capable ruler. One should not behave flippantly on being enthroned. Like old age robs beauty, a long standing dispute dissipates wealth. A fish attracted to a bait is unable to think of the consequence.

పురుషుడు ఈ విషయం గ్రహించి తనకు ఆరోగ్యం కలిగించే వస్తువునే గ్రహించాలి. హితకరమైనదీ, జీర్ణమయ్యేది ఆరగించాలేకాని పచ్చికాయలు కోసి నట్లయితే దానివల్ల రసం సిద్ధించదు. అది వానికి ప్రయోజనకారి కాకపోగా, దాని బీజంకూడా నశిస్తుంది. పక్వఫలాలు స్వీకరించడంవల్ల ఫలరసాలతో పాటు బీజంకూడా నిలబడుతుంది. తుమ్మెద పువ్వులకు ప్రమాదం కలగకుండా మకరందం గ్రోలేటట్టు ప్రభువు ప్రజలకు హాని కలుగకుండా ధనం సంగ్రహించాలి. తోటమాలి చెట్టుకు ప్రమాదం రాకుండా పువ్వులు కోసేటట్లు ప్రభువు ప్రజల నుండి పన్నులు గహించాలి.

One should know this and make a choice that promotes his health. One should eat succulent, digestible foods. Anything that is raw will not have health benefits. It is not only unhealthy to one, its seed will also be destroyed. A ruler should extract money from the subjects like a bee ingesting nectar from flowers without hurting them. Like a gardener collecting flowers from a plant without causing any harm to it, the king should collect taxes from his subjects.

ఒకానొక కార్యం చెయ్యబోయేముందు దాని వల్ల సిద్ధించే ప్రయోజన అప్రయోజనాలను ముందు గనే నిర్ణయించుకోవాలి. అసాధ్యాలకోసం కృషి చెయ్యడం అనవసరం అని తెలిసికూడా కృషి చేస్తే అది వ్యర్థమే కదా, అనవసర౦గా క్రోధం కలిగే వానిని, అకారణంగా సంతోషించే వానిని ప్రజలు రాజుగా గ్రహించరు. నపుంసకుని భర్తగా వరించే స్తీ ఎవరు? స్వల్పకృషితో మహ త్తరఫలాలనిచ్చే కార్యాలవైపే ధీమంతుడు తన బుద్ధిని మరల్చు తాడు. అనురాగహృదయంగల పుభువు ప్రజల ఆదరానికి పాత్రుడౌతాడు. ప్రభువు పుష్పితవృక్షం వలె ప్రసన్నుడై ఉండాలేగాని అధికఫలాల నందివ్య గూడదు. అల్పశక్తియుతుడైన ధీరునివలె గోచ రించాలి, మనోవాక్కాయకర్మలతో పూజలకు సం తోషం కలిగించే ప్రభువు పుఖ్యాతు డౌతాడు. భయంకరుడైన ప్రభువును ప్రజలు పరిత్యజిసారు, ప్రభంజనం కారు మేఘాలను ఛిన్నాభిన్నం చేసి నట్టు దుష్కర్మలు రాజ్యాన్ని పాడుచేస్తాయి. పరం సరాగతంగా సజ్జను లాచరించే మర్గాన నడిచే మహీ పాలునికి సిరిసంపదలతో రాజ్యం వృద్ధినొందుతుంది. ధర్మమార్గం విడిచి అధర్మంగా పోయే ప్రభువు ఏలుబడిలోని రాజ్యం నిప్పుమీదపడ్డ చర్మంలా ముడుచుకుపోతుంది.

When beginning a task one has to weigh its benefits and harm ahead of time. That which is impossible to attain should not be pursued as it is a waste of time. One who goes into fits of rage or feels happy without a reason is unfit to be a king. Which woman will marry an impotent man? An able person focuses his mind to achieve greatest results with tasks that don't need a great deal of effort. A king should be calm as a flowering plant and not give exaggerated rewards. One should be brave even if weak. A king who brings happiness to subjects with his speech and actions will be most famous. A cruel king will be shunned by the subjects. Like a storm that disperses clouds hither and thither evil acts cause peril to the kingdom. When a king follows the path of noble men, he will attain great wealth and be prosperous. When a king rejects dharma and carries out evil actions, his kingdom will shrink like skin on fire.

పరరాజ్యసాధనార్థం చేసే ప్రయత్నాలతో బాటు స్యీయరాజ్య సంరక్షణానికి కూడా కృషి అవసర౦. ధర్మంతోనే రాజ్యాన్ని సంర క్షి౦చాలి. ధర్మబద్ధుడైన రాజును రాజ్యలక్ష్మి విడువదు. అధిక ప్రసంగులనుండీ, ఉన్మత్తులనుండీ, ప్రలాపకులనుండీ, బాలురనుండీ సారవిషయాలు, శిలల నుండి బంగారం గ్రహించునట్లు గహించాలి. శి‌లోంఛ వృత్తితో జీవితం సాగించేవానివలె ధీరులు భావపూర్ణశబ్దాలనూ, సూక్తులనూ, సత్కర్మలనూ గ్రహించాలి. వేదాలవల్ల విప్రులూ, గంధంవల్ల గోవులూ, గూఢచారులవల్ల రాజులూ, నేత్రాలతో ప్రజలూ వాసనలను గ్రహిస్తారు.

The king trying to acquire other kingdoms should first take care of his own kingdom. He should rule with dharma. The goddess of wealth won't abandon such a ruler. From the children, the deluded, and the pompous one should extract the essence like gold from rocks. Like one who collects the grain after harvest, the ruler should grasp from thoughtful words, wise aphorisms and good karma. Those who reap benefits such as brahmins from vedas; cows from odor; kings from spies, subjects with eyes; make inferences as per their memories.

పొడిచే ఆవు క్లేశాలే పొందుతుంది. సాధువుగా నిలబడి పాలిచ్చే ఆవును ప్రజలు బాధించరు. మృదువైన లోహాన్ని అగ్ని తప్తం చెయ్యనక్కరలేదు. వంగేకర్రను వంచ డానికి పయత్సించేవాడుంటాడా? ఇది గ్రహించిన ధీమంతుడు బలిష్టులముందు తనే వంగుతాడు. అందువల వానికి అవనతికాదు. పైగా ఆలొంగు బాటు ఇంద్రునికి నమస్కరించడంవంటిది.

A mad cow experiences strife. People won't hurt a cow that gives milk peacefully. There is no need to melt a piece of soft metal. Will anyone try to bend a supple stick? Knowing this, a virtuous one will bow before the strong and powerful. There is no loss of prestige in doing so. Besides, it is like bowing before the Indra Deva to show one's respect.

పశురక్షకుడు మేఘుడు. ప్రభుసహాయకుడు మంత్రి. స్త్రీకి అప్తుడు భర్త. బ్రాహ్మణులకు వేదాలే బంధువులు. సత్యంచేత ధర్మం రక్షింపబడుతుంది. విద్య యోగరక్షితము. సౌందర్యానికి శుభత రక్షణాధారము. నీచకులజు డైనా సదాచారంవల్ల శ్రేష్ఠు డౌతాడు. పరధనాన్నీ రూపపరాక్రమ సౌభాగ్య సన్మానాలనూ ద్వేషించేవాని రోగం మందులతో కుద రదు. అకార్యాలాచరించడంవల్ల, చేస్తున్నపనిలో ప్రమాదాలు కలుగచెయ్యడంవల్ల, కార్యసిద్ధికి పూర్వమే ఆ రహస్యం ప్రకటించడంవల్ల భయంకర స్టితుగతు లేర్పడతాయి.

Like the god of clouds who protects the cows, a minister assists a king. Husband is the best friend of a woman. Vedas are the good companions of brahmins. Dharma is protected by truth. Enlightenment in yoga protects knowledge. For beauty, good conduct is the guardian. Even if born in the lowest varna, one who has good conduct will be respected. There is no medicine to cure one who is jealous of others' wealth, valor, accomplishments, and accolades. By performing evil acts, causing loss in actions being carried out, revealing the secrets before completing the task, danger awaits a king.

విద్యా ధన కుల మదాలుండకూడదు. ఈ మూ డూ సజ్జనులకు దాంతిని కలిగిస్తాయి. ఉత్తములకు సహాయం చేసేవారు సత్పురుషులు. ఉన్నత వేష భాషలు సభనలరిస్తాయి. గోవు మధురరసాల నిస్తుంది. వాహకుడు మార్గాయాసం పొందడు, ఉత్తమశీల స్వభావాలు కలవాడు సర్వులనూ జయి స్తాడు, వ్యక్తికి ప్రధానమైన శీలం నశిస్తే వాని జీవితం వ్యర్థమే. ధనమదోన్మత్తుని ఆహారంలో మాంసమూ, సామాన్యుని ఆహారంలో క్షీరరసమూ, దరిద్రుని భోజనంలో తైలమూ అధికంగా ఉంటాయి. దరిద్రులకు ఆకలి యెక్కువ. ధనికుడికి జీర్ణశక్తి తక్కువ. దరిద్రుని ఉదరంలో కాష్టమైనా జీర్ణ మవుతుంది. అధముడు జీవితానికి, మధ్యముడు మృత్యువుకూ, ఉత్తముడు అవమానానికి భయపడతారు. ఐశ్వరం కలిగించే మదంకంటే సురాపాన మదం అధిక మైనదేమీకాదు. ఐశ్వర్యమత్తుడు సంపదలు నశిస్టేకాని ఆ మత్తును వదలలేడు. సూర్యాది గ్రహ పరిభృమణవలయంలో ఉండని తారకల వలె అదుపులో లేని ఇంద్రియాలు కష్టభాజకాలే.

One should not be egotistical because of education, wealth or varna. People of good conduct help the noble. The king's court will be adorned by ones who have good personality and behavior. A cow gives tasty dairy products. One riding a palanquin won't be tired. A chaste and virtuous person will win the hearts of all. If a man loses his character he will become a failure in life. In the food of the wealthy and proud abundance of meat; of the commoner excess of milk; of the pauper too much of oil will be found. The pauper has too much hunger and is not easily satiated; and he can digest even a corpse. The lowly person is afraid of life, the person in the middle path is frightened by death and the noble one is wary of insults. There is no difference between the intoxication due to riches and alcohol. The wealthy won't be able to come out of stupor until their wealth is wiped out. Just as the stars that don't fall in the gamut of the sun and the moon, the uncontrolled senses cause grief.

Saturday, March 2, 2024

Vidura Neeti Part 2




(ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి జేర్చి, మూటి నాల్గింట కడువశ్యములుగ జేసి, ఏడింటిని గెల్చి యారింట నెఱిగి ఏడు, విడిచివర్తించువాడు వివేక ధనుడు. )

He who takes one, controls two, makes three and four still, conquers seven, and renounces seven is wise.

One is self; two stands for intellect, mind; three symbolizes wakeful, dream sleep, deep sleep states; four are disciplines of seekers of salvation; six are lust, anger, ego, jealousy, hatred, convetousness, desires. Seven stands for addictions.

[ఒకటి ఆత్మ; రెండు బుద్ధి, మనస్సు; మూడు అవస్థలు; నాలుగు సాధన చతుష్టయము; ఆరు అరషడ్వర్గాలు; ఏడు సప్త వ్యాసనాలు]

తాగినవానినే విషం చంపుతుంది. బాణం గుచ్చుకొన్నవానినే యమసదనం చేరుస్తుంది. ప్రజ లతో రాజును నశింపచెయ్య వచ్చు, . ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజించకూడదు. తనకుతానై విషమసమస్యలలో నిశ్చయాలు చేసికో కూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు, అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండ కూడదు, ఇది విద్వాంసుల మార్గము.

Poison kills the one who imbibes it. Arrow sends the one it struck to the loka of lord of death Yama. By revolting subjects, a ruler can be destroyed. So one should not eat food alone; take important decisions without consulting others; travel all alone; be awake when others are sleeping. This is the way of pundits.

సాగరతరణా నికి నౌక ఏకైకసాధన మైనట్లు స్వర్గం చేరడానికి సత్యమే ఏకైకనాధనం. ఈ విషయాన్ని మీరు గుర్తిం చడంలేదు. క్షమాశీలుడు ఒకే ఒక దోషంతో ఉంటా డని ప్రజలు భావిస్తారు. వారిదృష్టిలో ఆదోషం అసమర్ధత. క్ష్షమను అసామర్థ్యంగా భావించకూ డదు. క్షమకంటె బలమైనది లేదు. అసమర్థునికి క్షమ గుణమైతే సమర్థునికి అదే భూషణం, ఈ జగత్తులో క్షమను మించిన _వశీకరణశక్తి లేదు.

Like a boat is the only means to cross a body of water, truth is the only way to attain heaven. You, Dhrutarashtra, are not grasping this. A forgiver has only one fault. That is incompetence. One should not think the quality of forgiveness is a weakness. There is no greater power than forgiveness. To the incompetent it is guna and for the competent it is an ornament. There is no greater way to conquer all than by forgiveness.

శాంతి అనే ఖడ్గం ధరించిన వానిని యేదుష్టుడూ యేమి చెయ్య లేడు. తృణాకాష్ఠాలు లేనిదే అగ్నివెలువడదు. క్షమా హీనుడు తనతోపాటు ఇతరులనుకూడా బాధకు గురి చేస్తాడు. ధర్మమే కళ్యాణపథము. ఓరిమియే శాంతి మార్గం. విద్యయే ఆనందహేతువు.

One who is armed with a sword of peace can't be hurt by anyone. Without dry wood fire can't be lit. The one without the quality of forgiveness, will not only hurt himself but also others. Dharma is the only auspicious path. Patience is a peaceful path. Education and knowledge are the precursors of happiness.

ఈ భూమండ లంలో ఇద్దరే అధములు: కర్మను విడిచి పెట్టిన గృహస్థూ, కర్మబద్దుడైన సన్యాసీ. శతృవులను అలక్ష్యం చేసే ప్రభువునూ, పరదేశాలు తిరగని విపృని యీ పృథివిన కబళిస్తుంది. కటూక్షులు పలుక కుండా, దుష్టులను ఆదరించకుండా చరించడంక౦టె విశేషమైనపని ఏమా లేదు. ఇతరులచేత కోరబడిన పురుషుని కామించే స్త్రీకి, పరుల ఆశ్రయంలో ప్రవర్తించే పురుషుని ఆదరించే వ్యక్తికి భేదంలేదు. దరిద్రుడై అమూల్యవస్తువులను అభిలషి౦చేవాడూ, అసమర్దుడై క్రోధంతో ఉండేవాడూ తమకుతామే శత్రువులు.

There are two low lives in this world: a householder who renounces karma and an ascetic caught in a karmic cycle. The king who ignores his enemies and a pundit who never left his home will be destroyed. There is no greater good than not talking harshly and not honoring the evil people. There is no difference between a woman who goes after a polygamous man, and one who invites a man belonging to the opposite camp. A pauper who wishes for expensive things and an incompetent person who exhibits anger always, are enemies to themselves.

శక్తికలిగి క్షమతో ఉండేవాడూ, నిర్ధనుడైనా, ఉన్నంతలో దానం చేసేవాడూ స్వర్గంలో ఉన్నత స్థానం పొందుతారు. న్యాయోపార్టిత ధనం రెండు విధాల దురుపయోగ మవుతుంది: సత్పాత్రునకు దానం ఇయ్యక పోవడం; అపాత్రునకు దానం ఇవ్వడం.

One who shows forbearance even though he is capable of attacking and one who is indigent, yet gives alms to the poor will attain high positions in heaven. By not giving alms to a qualified person and giving alms to an unqualified person, money earned by moral means is wasted.

ధనికుడై దానం చెయ్యనివాడూ దరిద్రుడై కష్టాలు సహించలేని వాడూ ఉంటే వారిమెడ కొక బండరాయి కట్టి మడుగులో పడేయాలి. సక్రమంగా సన్యాసం సాగించినవారూ, సంగ్రామరంగంలో శత్రుహస్తా లలో మరణించినవారూ సూర్యమండలాన్ని భేదించు కుని ఉత్తమలోకాలకు పోతారు.

A rich man who never gives alms, and a pauper who can't withstand difficult times, should be tied with stones and sunk in a lake. Those who renounce the world in a proper way, or are killed in the battle field by the enemy attain heaven.

ప్రభూ! కార్యసాధనకు ఉత్తమ మధ్యమ అధ మరీతులు మూడున్నాయి. ఈ మూడుదారులూ శ్రుతి ప్రోక్తములే. వీటిని యధాప్రకారంగా ఆదరించే వారు సంపదల కధికారులవుతారు. దారా, పుత్ర దాసులకు సంపదలపై అధికారంలేదు. ఈ ముగ్గురూ ఎవరి అధీనంలో ఉంటే వారి సంపదలు కూడా వారి అధీనంలో ఉంటాయి.

There are three ways to get things done. Those three are accepted by the scripture. Those who follow them acquire great wealth. Wife, children and servants have no right on one's wealth. Whoever controls them, will own the wealth.

పరధనాపహరణా, పరనారీ సాంగత్యమూ సుహృజ్జనపరిత్యాగమూ అనే మూడుదోషాలూ మానవుని ధర్మాయుర్షాయ కీర్తులను క్షీణింప జేస్తాయి. కామ, క్రోధ, లోభాలు నరకానికి తెరచిన మూడు ద్వారాలు.

Stealing, consorting with a woman who is not one's wife, not caring for the advice of morally upright friends, will take away longevity and fame. Desire, hatred, covetousness are three gates to hell.

వరప్రసాదమూ, రాజ్యప్రాప్తీ, పుత్రోద యమూ అనే మూడూ ఏకకాలంలో ప్రాప్తించడం కంటె శత్రువులు పెట్టే బాధలనుండి విముక్తిని పొందడం ఘనమైనది. నేను నీవాడననీ సేవకుడననీ నీకు భక్తుననీ అర్ధించిన వారిని ఎటువంటి విప త్తులలోనూ విడిచి పెట్టకూడదు. అల్పబుద్ధినీ, దీర్ఘ నూత్రునీ, త్వరపడేవానినీ, స్తోత్రపాఠకునీ రహస్య సమాలోచనలకు పిలువకూడదు. వీరిని విద్యజ్జనులు గుర్తుపట్టగలరు. కుటుంబ వృద్ధజనులనూ, విపత్తులలో పడిన ఉన్నతకుటుంబీకులనూ, దరిద్రు లైన మిత్రులనూ, సంతాన విహీనయైన పోదరినీ ఆశ్రయమిచ్చి పోషించాలి,

Obtaining kingdom, begetting a son, acquiring a boon at the same time is worse than attaining liberation from enemies' prison. One who submits to you, says he is your servant and devotee, should not be abandoned in grave times. A fool, one in haste, a chanter of scripture should not be invited to secret meetings. They can be found out by the learned. Old people in the family, a morally upright family when in trouble, friends in dire straits, a sister without children, should be rescued.

ప్రభూ! ఇంద్రుని అభ్యర్హనం మీద బ్బహస్పతి చెప్పిన విషయాలు కొన్నిచెబుతాను విను. దైవ సంకల్పమూ, ధీమంతులశక్తి, విద్వాంసులయెడ వినయమూ, పాపవినాశనకర కార్యాచరణమూ అనే నాలుగూ మానవుని భయాన్ని దూరం చేస్తాయి. సక్రమంగా సాగించకపోతే అవే భయహేతువులు. అగ్ని కార్యమూ, మౌనవ్రతమూ, శ్రద్ధాయుతమైన స్వాద్యాయమూ, ఆదరదృష్టితో యజ్ఞానుష్ఠానమూ నడపాలి. తల్రితండ్రులనూ, అగ్నినీ, గురువునూ, అత్మనూ పంచాగ్నులుగా భావింపి సేవించాలి.

O King, let me state the wise words spoken by Bruhaspati upon Indra's request. A man will overcome fear by god's will, strength of the valorous, humbleness before pundits, karma without sin. One should pray to agni, mute oneself for a period of time, self-study with discipline, conduct yagna to help others. Parents, agni, guru and self need to be prayed.

దేవ, పితృ, సన్యాస, అతిధిమానవులను పూజించేవాడు కీర్తిశాలి అవుతాడు. మానవుడెక్కడకు పోయినా, మిత్రులూ, శత్రువులూ, ఉదాసీనులూ, ఆశ్రయ౦ పొందినవారూ, ఆశ్రయమిచ్చేవారూ వెంటఉంటారు. ఈ జ్ఞానే౦ద్రియ పంచకంలో యే ఇంద్రియం దోష యుక్తమెనా వానినుండ బుద్ది క్షీణుస్తూ నే ఉంటుంది. సుఖ సంపదలు కోరేవాడు, నిద్రా భయ క్రోధ అలవ (లేదా) దీర్ఘ సూత్ర తంత్రాది దుర్గు ణాలను విడచి పెట్టాలి. అధ్యాపనం చెయ్యని గురువూ, మంత్రోచ్చారణలేని హోతా, రక్షణకు అసమర్థుడైన రాజూ, కటువుగా భాషి౦చే భార్యా, గ్రామంలో వశించగోరే గొల్ల వాడూ, వనవాసం వాంఛించే మంగలీ పరిత్యాజ్యులు.

One who prays to God, parents, ascetics and guests will be famous. Wherever a man goes, there will be friends, foes, disapprovers, ones who have refuge, and those who offer refuge. Any one of the five senses, if defective, will make the intellect weaker. One who aspires for riches, should give up sleep, fear, anger and occult practices. A guru without tutelage, a priest without purity of voice, a king who can't protect, a wife who talks harshly, a goat herder who wants to live among the cultured, a barber who pines for forest life, should not be befriended.

సత్య, దాన, క్షమ, అనసూయ, కర్మపరతంత్రుతాది సద్గుణాలను సావధానంతో అలవరుచు కోవాలి. ధనప్రాప్తీ, ఆరోగ్యదేహమూ, అనుకూలవతి, ప్రియభాషిణీ అయిన అర్థాంగి, చెప్పుచేతలలో ఉండే కుమారుడూ, ధనార్జన కుపయుక్తమై న విద్యా యీలోక౦లో పరమసుఖదాయకాలు.

One should acquire with patience, truth, kindness, forgiveness, without jealousy and such good qualities. Acquisition of wealth, a healthy body, an amicable and soft spoken wife, a son who is disciplined, gains employment with a skill acquired from education offer great happiness.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాది అరిషడ్వర్గాలను జయించి జితేంద్రియుడై చరించాలి. దొంగలు (పమత్తులవల్ల, వైద్యులు రో గివల్ల, కామినీజనము కాముకులవల్ల, పురోహితులు యజమానునివల్ల, స్పర్థను వాంఛించే విద్వాంసుడు మూర్ఖునివల్ల జీవితం గడుపుతారు. సంరక్షణ లేకపోతే గోవూ, వ్యవసాయమూ, స్త్రీ, విద్యా నశిస్తాయి. అప్రమత్తతో చరించకపోతే శూద్రసఖ్యమూ, సేవావినాశనానికి దారితీస్తాయి.

One should conquer desire, anger, ego, covetousness, hatred, jealousy. Because of drunkards thieves prosper; doctors thrive because of the diseased, prostitutes survive because of debauched men; priests are prosperous because of devotees; a pundit itching for argumentation thrives because of fools. Without nurturing cows, agriculture, women, education wither away. If not alert one has to befriend sudras, and lose the help of servants.

విద్యపరివూర్తి అయిన అనంతరం శిష్యుడు గురువునూ, వివాహానంతరం తల్లిని కుమారుడూ, భోగఫలానంతర౦ పురుషుడు స్త్రీనీ, పని జరిగినమీదట సహకరించిన వారినీ. నదిని తరించాక నావనూ, రోగవిముక్తాన్యంతరం వైద్యునీ, విస్మరించడం సహజం,

After graduating from studies, disciples ignore gurus; after marriage a son forgets about his mother; after intercourse man ignores woman; after getting a task done a man ignores those who helped him; after crossing the river a man forgets about the boat; after getting cured, a patient forgets the doctor. These are all quite natural.

ఋణగ్రస్థుడు కాకపోవడం, ప్రవాసం ప్రాప్తిం చకపోవడం, సత్పురుష సాంగత్యం, కులవృత్తితో జీవికా నిర్వహణం అనేవే యీ లోకంలో సుఖాన్నిచ్చేవి.

One who is not indebted, who never has to leave one's country, who is befriended by morally upright people, who following the family tradition earns livelihood enjoys unlimited bliss.

ఈర్ష్యాద్వేషాలతో, అసంతోష క్రోధాలతో అనుక్షణ శ౦కతో పరభాగ్యజీవికతో ఉండేవారు దుఃఖబాగులే. కామినీజనసాంగత్యాన్నీ, వేటనూ, మద్యపానాన్నీ, జూదాన్నీ, పరుషప్రసంగాలనూ, ధనదుర్వినియోగాన్ని, కఠోరదండనీతినీ ప్రభువు పరిత్యజించాలి.

Those who have hatred and jealousy, are haunted by unhappiness and anger, constantly doubt others experience sorrow.

బ్రహ్మద్వేషమూ, బ్రాహ్మణ ధనాపహారణా, విప్రదండనా, వారిని నిదించడంలో సంతొషమూ, వారిప్రస్తుతిని ఆకర్షించలేక పోవ డమూ, యజ్ఞయాగాదులలో వారిని విస్మరించ డము, అర్థించినప్పుడు విప్రకోటిపై దోషారోపణ చేయడమూ అనే దోషాలను ధీమంతులు దరిచేర నివ్వకూడదు.

Hatred of God, punishing brahmins, enjoying blaming them, without ever praising them; ignoring them during yagna, when seeking help blaming the brahmins, should not be entertained by the morally upright people.

మిత్రసమాగమమూ, ధనప్రాప్తీ, పుత్రాలింగనమూ, దారాసంగమమూ, కాలానుసారం ప్రియవచనాలాపమూ, నిజప్రజల ఔన్నిత్యమూ, అభీష్టవస్తుసిద్ధీ, సంఘప్రతిష్ఠా అనేవి సంతోషకరాలు. లౌకిక సుఖాలకు యివి సాధనాలు. కులీ నత, ఇంద్రియ నిగ్రహము, పరాక్రమము, శాస్త్ర, జ్ఞానము, ధీశక్తి, మితభాషత్వము, యథాశక్తి దానము, కృతజ్ఞత అనేవి కీర్తికి హేతువులు. నవద్వారా లతో త్రిస్తంభాలతో, పంచసాక్షులతో, అత్మకు అవాస స్థానమైన యీ దేహగృహంయొక్క తత్వం గ్రహించడంకంటె వేరే జ్ఞానం లేదు.

Meeting friends, acquiring wealth, hugging sons, good will of subjects, achieving the desired object, fame in the society engender happiness. They are the means for worldly pleasures. Noble birth, control of senses, valour, scriptural knowledge, competence, limited speech, giving alms within means, gratefulness engender fame. There is no greater knowledge than realizing self in the body that is resplendent with nine exits, three pillars, five witnesses.

సావధానరహితుడూ, ఉన్మత్తుడూ, మద్య పాయి, అలసినవాడు, క్రోధి, క్షుధార్తుడు (ఆకలి గలవాడు), తొందర పడేవాడు, లోభి, భయభీతుడు, కాముకుడూ, ధర్మ తత్వం గృహించలేరు. ఈ విషయమై ప్రహ్లాద సుధన్వులగాధ ఒకటి ఉన్నది. కామక్రోధాలను విడిచి పాత్రులకు దానం చేస్తూ, శా స్త్రజ్ఞానం తెలు సుకుంటూ కర్తవ్యాన్ని నిర్వహించే రాజుకు (పజలు వ౦గి నమస్కరిస్తారు.

An inattentive one, one who is deluded, a drunkard, one who is tired, one who is in rage, one who is hungry, one who is in haste, a coward, one who is libidinous can't understand the intricacies of dharma. On this topic there is a Prahlada-Sudhanvu story. People bow to the king who gives up desires and rage, gives alms to the qualified and is knowledgeable in scripture, discharges his duties with competence.

ప్రజలలో విశ్వాసం కలగ జేస్తూ అపరాధులను దండిన్తూ చరి౦చే ప్రుభువు సర్వసంపద సంపన్నుడౌతాడు. సావధానుడై, దుర్భలులను, అవమానించకుండా, శత్రువులతో చతుర వ్యవహారం సాగిస్తూ, బలవంతులతో సంగమం సాగించక, అవకాశానుసారం పరాక్రమం ప్రదరిస్తూ ఉండే ధీరుడు యొన్నివిపత్తులు వచ్చి మీద పడ్డా విచారసాగరంలో మునిగిపోకుండా వాటిని సహిన్తూ ప్రయత్నశీలుడై ఉంటే అవలీలగా శత్రువును జయించవచ్చు.

A king who instills loyalty among the subjects, punishes wrongdoers will be enormously rich. One who is attentive, doesn't insult the weak, acts smartly with the enemies, doesn't befriend more powerful, shows valor where necessary, no matter how many dangerous situations arise, will easily achieve victory when fighting with the enemy.

వృధాగా విదేశాలలో తిరిగేవాడూ, పాపులతో మైత్రి చేసేవాడూ, పరస్త్రీ గామీ, పాషాండుడూ, చోరుడూ, కుటిలుడూ, మధు పానంచేసేవాడూ దుఃఖాలలో పడతారు. క్రోధమూ, తొందరపాటూ, పురుషార్ధ రాహిత్యమూ, అనృత వాదిత్వమూ దుఃఖ హేతువులు. మిత్రుల క్షేమంకోసం పోరాడనివాడూ, అదరించినవారిపై క్రోధం చూపే వాడూ, వివేకహీనుడూ, పరదోషైక దృక్కు, దయా రహితుడూ, అధికప్రసంగీ లోకంలో పేరుప్రఖ్యా తులు పొందలేరు.

One who goes abroad without an objective, befriends sinners, lusts for women, unkind, a thief, is cunning, a drunkard will end up in sorrow. Anger, haste, facing loss in acquiring wealth, argumentation cause sorrow. One who doesn't fight to make friends happy, who shows anger toward those helping him, who is unwise, who always finds faults in others, who is unkind, who is talkative can't earn fame.

వేషపటాటోపం లేకుండా, అత్మ ప్రశంస చేసుకోకుండా క్రోధం కలిగినా కటువుగా భాషించకుండా ఉండే మానవుడు సర్వజనాదరణీయు డవుతాడు. గర్వరహితుడూ, హైన్యం ప్రద ర్శించనివాడూ, శాంతించిన వైరాన్ని ప్రకోపింప చెయ్యనివాడూ, ప్రమాదాలు మీదపడ్డా అనుచితాన్ని సహించనివాడూ, యితరుల దుఃఖానికి సంతోషించనివాడూ, దానంచేసి విచారించనివాడూ, సజ్జన శ్రేష్ఠులు, దేశవ్యవహారావసరాలూ, జాతిధర్మాలూ తెలిసినవానికి ఉత్తమాధమవివేకం కలుగుతుంది.

One who doesn't show off, doesn't self-congratulate, won't talk rudely even when angry will be befriended by all. One who is egoless, who has no weaknesses, who doesn't reignite old flames, who acts with alacrity when faced with dangers, who doesn't rejoice in others' grief, who doesn't regret after giving alms, who befriends morally upright people, who knows national affairs and dharma of various varnas, will understand the difference between superior and inferior attributes.

అటువంటి వివేకి జనసంఘంలో తన పుతిష్ఠను సంస్టాపించుకోగలడు, రాజద్రోహియై, మోసదృష్టితో పాపకర్మలు చేసేవాడూ, గర్వీ, మత్సరుడూ మోహా మత్తుడూ, ఉన్మత్తుడూ ఆదిగాగలవారితో వివాదానికి పోరాదు. దాన హోమ పూజా ప్రాయశ్చిత్తాది లౌకిక కర్మలను నిర్వహించేవాడు వృద్ధిలోకి వస్తాడు. సమానశీలురతో వివాహమూ, మైత్రీ, వ్యవహారమూ సాగించాలి.

Such a person will establish himself in a society with fame. One who rebels against the king, who performs sinful acts to cheat others, who is egoistic, who is jealous, who is craving with lust, who is deluded should not be engaged in a debate. One who gives alms, performs yagna and pooja, atones his sins, partakes in worldly matters responsibly, will prosper. One should engage with equals during marriage, friendship and transactions.

గుణనంపన్నులను ముందుంచుకొని నడిచేవాడు, నీతివిదుడు, అర్థులకు తృప్తిగా పెట్టి మితంగా భుజించాలి. అధికకాలం కృషిచేసి తక్కువగా నిదురిసూ అర్థులకు దానంచేస్తూ ఉండేవాడు అనర్ధ దూరుడౌతాడు. స్వేచ్చానుసారం చరిస్తూ పరేచ్చను పరిగృహించకుండా తన ఆలోచనలను గుప్తంగా ఉంచుకుంటూ స్వీయకార్యాలను సక్రమ౦గా నిర్వహించుకోవాలి. సత్యవాది, కోమల స్వభావడూ, ఉన్నతాభిప్రాయుడూ, ఆదర్శీలీ, భూతశా౦తికరుడూ అయినవాడు శ్రేష్ట రత్నంలా జాతివారిలో ప్రసిద్ధుడౌతాడు. లజ్ఞాశీలిని సర్వప్రజలూ గౌరవిస్తారు. ఏకాగ్రచిత్తంతో, శుద్ధహృదయ౦తో, అనంతతేజస్సుతో, ఆ పురుషుడు సూర్వునివలె భాసిస్తాడు.

One who follows good natured men, who is wise, who feeds the hungry and eats moderately, who works hard and sleeps less, who gives alms to the poor will not face difficulties. One should according to free will, not violate others' freedom, keep the thoughts private and perform his acts well. One who speaks truth, is soft spoken, is enabled with good thoughts, is a role model to others, brings peace to all and shines like a diamond in the jati or varna. A self-effacing person will be appreciated by all. He will shine like the sun with a concentrated mind, pure heart, extraordinary aura.

Friday, February 23, 2024

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 50-51)

upanishad


  


రెండవ ప్రకరణము

50

తజ్ణః సంస్కారో అన్య సంస్కారప్రతిబన్ధీ

తత్‌ + జః = దాని నుండి  పుట్టినట్టు
సంస్కారః  = సంస్కారము 
అన్యసంస్కారః =ఇతర విషయ వాసనలను 
ప్రతిబన్ధీ = తొలగించును 

  దీని వలన కలుగు సంస్కారము యితర విషయ 
వాసనలను తొలగించును 

  

అట్లు చేయు సాధనవలన ఉత్తమ సంస్కారములు మేల్కొని,
మిగిలిన విషయ వాసనలు తొలగిస్తాయి. అనగా "తాను" సత్యమందుండడం 
నభ్యసంచినవారికి, ఇంద్రియములు క్రమేణా అంతర్ముఖమవుతాయి. 
దీని వలన విషయములయొక్క అస్తిత్వము క్రమేణా 
నశిస్తుంది. విషయములను కూడ తనలోని  భాగములుగా 
చూచును. ఇచ్చట విషయముల యొక్క అస్తిత్వము నశించుట 
అ౦టే  విషయములు విస్మరించుటకాదు. నది సముద్రమున కలియుచున్నప్పుడు
నది యొక్క అస్తిత్వము నశిస్తుంది, కాని నది 
నశింపదు. నది  సముద్రములో భాగముగా ఉంటుంది. నదులన్ని
వేరువేరు ప్రవాహములుగా సముద్రమును చేరుతాయి. ఇక్కడ 
ఒక్కొక్కనది నీటి యొక్క రంగు, రుచి మారవచ్చు. కాని 
సముద్రములో కలిసిని వెనుక వాటి యొక్క ప్రత్యేకత నశించి,
రంగు, రుచి,  విషయములన్నీ సత్యమునందుచేరిన వెనుక
సత్యమై ఉంటాయి గాని విషయములుండవు.

51

తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః

తస్య + అపి  = దానివలన కల్గు 
నిరోధే = నిరోధము చేత 
సర్వనిరోధాత్  = సమస్తము నిరోధింపబడుట వలన 
నిర్బీజః = బీజము లేనట్టి 
సమాధి =కైవల్యము 

  సత్యము యొక్క అస్తిత్వము సైతము చిట్టచివరకు 
నిరోధింపబడుటచే బీజము నశించిన సమాధి స్థితి లభ్యమగును 

  

మొదట  సత్యము నుపాసించుట వలన గుణములు లేని 
స్థితి అనగా నిర్గుణస్థితి సత్యముగా నిలుస్తుంది. ఇక్కడ నిర్గుణము 
గుణములు లేకుండుటగా నుపాసింపబడుట వలన అదిగూడా గుణముల
నుపాసించుటయే. ఇందు గుణములు బీజస్టితిలో
విత్తనములుగా ఉన్నాయి. కనుక లేకపోలేదు. విత్తనములు మొల
కెత్తితే కర్మలవుతాయి. మొలకెత్తక ముందు వాసనలుగా ఉంటాయి. 
ఇందుకై మొదట సత్యమును, పైన శ్లోకములలో చెప్పినట్లు,
ఉపాసి౦చాలి. అట్లుపాసంచడంవలన నిర్గుణమైన 
స్టితి అభ్యాసమవుతుంది. తాను నిర్గుణముననున్నా అది కూడ ఒక 
స్థితియేగనుక అది కూడ గుణముగా అభ్యసించబడుతుంది. అలా 
కొంతకాలము అభ్యసించిన పదప అది కూడ నశిస్తుంది. ఎండ 
వలన నీరు అవిరియై, మేఘమై మరల వర్షిస్తున్నాది. ఎన్ని
నదులలో నీరు ఆవిరియైనా మేఘముగా అది ఒక్కటే. అలాంటి 
మేఘము మరల సముద్రమునందు వర్షించినపుడు దాని  అస్తిత్వము 
నశిస్తుంది. సముద్రము యొక్కటియే ఉంటుంది. ఇదే 
నిర్బీజమను స్థితి. అన్ని గుణములు తనయందు పర్యవసించగా 
తాను సత్యమై మిగిలినవి తనలో భాగములవుతాయి. అలా  తాను 
అంతర్యామియందు భాగమై అనందమయ స్థితి యందున్నప్పుడు 
తాను, గుణములు అనునవి అన్నీ  నశించి "ఆనందమే"
సత్యముగా నిలుస్తుంది. ఇదే (అనగా తన అనుభవమే) బీజము
లేని స్థితి. ఇదే యోగికి మెలుకువ. ఇదియోగికి నిజ మైన
గమ్యము అని చెప్పబడినది.

Saturday, February 17, 2024

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 44-46)

upanishad


  


రెండవ ప్రకరణము

44

ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మ 
విషయా వ్యాఖ్యాతా 

ఏతయా + ఏవ = ఈ విధముగానే 
సవిచారా = ఆలోచనతో కూడినది 
నిర్విచారాచ = ఆలోచనలేని స్థితి కూడా 
సూక్ష్మవిషయా  = సూక్ష్మ విషయములతో కలసి 
వ్యాఖ్యాతా = వ్యాఖ్యానము చేయబడినది 

  ఇప్పుడు తర్కముతో కూడినది, సూక్ష్మ విషయములతో 
కూడిన తర్కము అక్కరలేనిది, అను రెండు స్థితులు 
వ్యాఖ్యానము చేయబడుచున్నవి 

  





పై  సూత్రములలో చెప్పబడిన రెండు స్థితులు మరల
ఇంకొకసారి ఇక్కడ చెప్పబడుతున్నాయి. మొదటి విధానమున 
యోగి ఉండే  స్టితి 42 వ సూత్రములో వివరింపబడి౦ది. 
అటువంటి  యోగికి పదములు, వాటి అర్థములు, వస్తువులు మొదలైనవి 
అర్థములుగా ఉంటాయిగాని వాటివలన యోగికి వికల్పములేదు.
యోగి ఉదాసీనుడై తాను కేవలము పరిస్టితులయందు తదను
గుణముగా ప్రవర్తిస్తూ, రాగద్వేషములకు అతీతుడై ఉంటాడు.
కాని ఇటువంటి  స్థితిలో విషయములు, వాటి అర్థములు,
వాటియందు తన ప్రవర్తన అట్లే ఉంటుంది. కాని వాటి
వలన తాను రాగద్వేషములు పొందడం జరగదు. 

రెండవ విధానమునందు యోగికి పదములు, అర్థములు
లేవు. అనగా విషయ వాసనలేదు. సర్వము అంతర్యామి యొక్క
రూపము. అనగా ఆ సమస్తము తానేనని, అన్నీ తనలోని
భాగములుగా నుండును అని తెలుస్తుంది. సమస్త రూవములు,
వ్యక్తులు, పరిసరములు, విషయములు తానే, తన ప్రతిరూపమే.
తానే నిప్పుగా దహిస్తున్నాడు. నీరుగా ప్రవహిస్తున్నాడు.
గాలిగా వీస్తున్నాడు. మరల వీచుట, దహించుట అనువానికి తన
కర్తృత్వము లేదు. కనుక ఈ వీచుట, దహించుట మొదలైనవి
తనలో  సూక్ష్మములుగా యుండును. అవి విషయములుగా
కాక సముద్రమునందు అలలు వలె విచిత్రమైన అస్తిత్వము కలిగి
ఉంటాయి. కనుకనే సూక్ష్మ స్టితిగా చెప్పబడినది. బంగారముతో
చేయబడిన ఒక దేవతా విగ్రహమునకు, ఒక కుక్క విగ్రహమునకు, 
కంసాలివానికి భేదము లేనట్లు యోగికి భేదము లేదు.
కంసాలివానికి రెండిటియందును బంగారమే జ్ఞప్తి యుంటుంది. 
యోగికి రెండిటి యందు తానే ఉంటాడు. కంసాలివానికి 
ఆ వస్తువుల విలువలకన్న రూపభేదములు ప్రధానముకానట్లు 
యోగికి రూపభేదములు ప్రధానముకాదు. 

45

సూక్ష్మ నిషయత్వంచాలింగపర్యవసానమ్



సూక్ష్మ విషయత్వం = సూక్ష్మ విషయములకు
			సంబంధించినది
చ = మరియు .
అలింగ పర్యవసానమ్ = లింగ బేధము నశించునట్టి 
				స్టితియే చివరకు 
				మిగులుచున్నట్టిది.

  సూక్ష్మ విషయములు సహితము తమ అస్తిత్యమును పోగొ 
ట్టుకొనునట్టిదియే అసలు సితి. 

  





ప్రతి వస్తువు లేక విషయము తన ద్రవ్యత్వము చేత,
ధర్మము చేత, తన అస్తిత్వము కలిగిస్తుంది. అటువంటి వానివలన 
దానికి ఒక నామము, రూపము ఏర్పడుతున్నాయి. విషయము 
నందలి అస్తిత్వము దాని ధర్మములననుసరించి ఉంటుంది. 
గుణ భేదముచే వస్తువుల తత్వము తెలుస్తుంది. వస్తువు యొక్క తత్వము 
తెలియుటయే వస్తువు తెలియుట. కాని  వస్తువు యొక్క అసలు 
తత్వమునందు లీనమైనప్పుడు వస్తువు యొక్క నామరూపములు, 
గుణములు విస్మృతి చెందుతాయి. దాహమై నీరు త్రాగుచున్న 
వానికి నీటియొక్క నామరూపములుగాక, నీటియొక్క అనుభవము
(దాహము తీర్చుట) అనుదానిలో మనస్సు లయము అవుతుంది. 
నీరు త్రాగువానికి త్రాగుచున్నప్పుడు ఇవన్నీ  తాత్కాలిక౦గా 
నశించి, (తాగిన తర్వాత మరల జ్ఞప్తికి వస్తాయి.  అలాగే ఒక సంగీత
కచేరీకి హాజరైన వానికి కచేరీ ప్రారంభింపకముందు గాయకుడు,
వాద్యకారుల పేర్లు, పాట, రాగము మొదలైనవి జ్ఞప్తికి ఉంటాయి. 
కాని పాట ప్రారంభించిన తర్వాత, క్రమేణా ఈ విషయములు
ఒక్కొక్కటీ నశించి, మనస్సు పాటయందు లయమవుతుంది. కొంత
సేపటికి పాటకూడా మనస్సునందు నశించి గానము యొక్క
మాధుర్యమే తన యందుంటుంది.

46

తా ఏవ సబీజః సమాధిః


తాఏవ = అదియే
సబీజః = బీజముతో కూడినట్టి 
సమాధిః  = సమాథి

అటువంటి స్థితియే  బీజముతో కూడిన సమాధిస్థితి అని
పిలువబడినది.

  

ఒక వస్తువును గురించిన అనుభవముచేత ఆ వస్తువు
యొక్క నామ రూపాదికములు నశించినపుడు అది "సబీజసమాధి"
అని పిలువబడుతుంది. కనుక ఇక్కడ యోగి సమాధిస్థితి 
నందున్నా, విషయవాసనలు సంస్కారములుగా అనగా విత్తనములుగా 
లోపల ఉంటాయి. కాని ఈ విత్తనము ఎప్పటికైనా 
మొలకెత్తే అవకాశము౦ది. అలా మొలకెత్తడమే సంసారమని 
చెప్పబడుతుంది. సంసారమందలి మనస్సును ఈ సంస్కారములు 
బంధిస్తాయి. ఇవే కర్మబంధములు. కర్మబంధము అంటే "పని 
చేయుట బంధము" అని అర్థము కాదు. పని చేస్తున్నాను  
అని అనుకోవడం కర్మబంధము. ఎండాకాలములో ఎండలో 
తిరిగివచ్చినవాడు దాహము వేసి నీరు త్రాగుతున్నప్పుడు మ౦చినీరు 
యొక్క నామరూపాదులు నశించి, దప్పిక తీరడమే మనస్సులో 
ఉంటుంది. కాని త్రాగిన తరువాత నామరూపాదికములన్నీ 
జ్ఞప్తికి వస్తాయి. అలా  రాకుండ ఉండాలంటే  మనస్సు 
నిరంతరము యోగస్టితిలో ఉండాలి. అట్టి యోగికి నీరు 
త్రాగుతున్నా దాని వలన కలుగు అనుభవమే సత్యముగా నుంటుంది 
 గాని వాని పేర్లు, ఆకారములు మొదలైనవి కావు. 
ఏదైనా ఇంతే. ఏ వస్తువు యొక్క తత్వమైనా తుదకు
అనుభవముగా పర్యవసానమయి, మరల అలాంటి అనుభవము వలన
భౌతిక జగత్తున వస్తువు ఏర్పడుతోంది. కాని వస్తువునకు పర్యవసానముగా 
అనుభవము కలుగడంలేదు. అనగా వస్తువుద్వారా
అనుభవము కలుగుతుంది గాని వస్తువునకు  ఫలితేము అనుభవము
కాదు. "నేను" అను ప్రజ్ఞననుసరించి శరీరము ఏర్పడుతోంది 
కాని శరీరము వలన "నేను" అను ప్రజ్ఞ పుట్టడంలేదు. అలాగే 
ప్రవహించుట, దప్పిక తిర్చుట, అను లక్షణములను రసమంటారు.
మరియు రసమునకు అనుభవము అని కూడ అర్థము కలదు. 
కనుక రసము వలన నీరు పుట్టినది. అందుచేతనే ఆ నీటిని త్రాగు 
వానికి రసము అను లక్షణము అనుభవముగా వస్తోంది. 
ఇది తెలిసినవానికి రసము సత్యమై నీటియొక్క అస్తిత్వము,
ప్రత్యేకత నశిస్తుంది. అనగా నీటిని రసమునకు వాహికగా తెలి
యుండును. వానికి రసము ప్రధానము కాదు. నీరు ప్రధానము 
కాదు. ఇట్లు వస్తువుల వలన కలుగు అనుభవము సత్యమై, వస్తువుల 
అస్తిత్వము అసత్యముగా తెలిసిన వానికి వస్తువు యొక్క నామ
రూపాదికములు ప్రత్యేకప్రభావమును కలిగి యుండవు. ఇదే 
బీజరూపసమాధి స్థితి. అనగా ఇక్కడ  సంస్కారమను విత్తనము
శాశ్వతముగా నశించి యోగి నిజమైన యోగస్టితిలో ఉంటాడు.
అట్టివాడు పనులను శరిరము యొక్క, పరిసరములయొక్క 
ఆవశ్యకతననుసరించి చేస్తాడు కాని తనంతట తాను సంకల్పించడు.
అట్టివాడు నీటిని త్రాగుతున్నా, త్రాగనివాడై యుండును.
తినుచున్నా తిననివాడైయుండును. వానికి సంసారము లేక
కర్మబంధములు లేవు.


Sunday, February 11, 2024

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 47-49)

upanishad


  


రెండవ ప్రకరణము

47

నిర్విచార వై శారధ్యే ఆధ్యాత్మ ప్రసాదః


నిర్విచార = చింతలేనిస్టితి (ప్రశాంతత)
వైశారధ్యే  = సాధించుటయందు
అధ్యాత్మప్ర = ఆత్మ ప్రసన్నత
సాదః


(మనస్సు నందు) చింతలులేని స్టితి సాధించుట వలన
ప్రసన్నత వాని ఆత్మను అధిష్టించి యుండును.
  
  


ఒక విషయము గురించి ఆలోచిస్తున్నపుడు మనస్సు 
విషయగతమై ఉంటుంది. అ౦టే  అది తన ను౦డి వేరుగా 
యుండినట్టి స్థితి.  మనస్సు ఆలోచించు విషయములుగా 
పరిసరములోనికి చెదిరిపోతుంది. కనుక మనస్సు తనలోని 
భాగముగాక ఇతరముగా ఉంటుంది. అలా గాక ఏదయినా ఒక 
విషయములోనికి, దాని తత్వవిచారణ చెయ్యాలి. అది 
ఎలా౦టిది, ఎక్కడ పుట్టి౦ది, దేని నుండి పుట్టి౦ది ధ్యానము 
చేయాలి. ఒకడు ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. 
ఇల్లు అంటే ఏమిటి? దేనిచే కట్టబడి౦ది? దాని ప్రయోజనమేమిటి?
అని ఆలోచించే వానికి ఇల్లు యున్నవాడు, లేనివాడు, ఇద్దరు
సుఖముగానే జీవిస్తున్నారని తెలిస్తుంది. ఇంటని కట్టిన రాళ్ళు,
సున్నము, మొదలగునవి భూమినుండే, సాధింపబడినవని,  తన
శరీరముగూడ అలాగే  వచ్చినది అని తాను జీవించుయుండే వరకు 
పరిస్థితులు అనుకూలిస్తే  తన యింటిలో తాను నివాసముండవచ్చును 
అని, లేకపోతే  ఇల్లు లేనివారు సైతము సుఖముగానే 
యున్నట్లు తెలుసుకొ౦టాడు. మరియొకనికి తాను ఉద్యోగము
చేస్తున్న ఊరిలోగాక వేరొక ఊరిలో స్వ౦త ఇల్లు వుండెనని
అనుకో. వానికి అదే ఊరిలో ఇల్లు లేకపోయినా  తనకు
యిల్లు వున్నది అను ఊహచే జీవిస్తున్నాడు. ఉద్యోగవిరమణ
చేసిన తర్వాత గూడ తన యిల్లు వున్న ఊరికి పోక తన కుమారులతో 
మరిఒకయూరిలో నివసించుచున్నాడనుకో. అట్టి
వానికి యిల్లు వున్నా లేనట్టే. ఇక్కడ యిల్లు వున్నది, లేదు
మొదలైన ఊహలు ప్రస్తుతము తానున్న యింటిలో సుఖముగా 
జీవించడానికి అడ్డువచ్చేవి కావు. అ౦టే యిచ్చట ఇల్లు అనేది
తన ఊహకు సంబంధించినది.  తాను సుఖపడుతున్నది, కష్ట
పడుతున్నది తన  యిల్లు వలన కాక తన ఊహవలననే. ఇట్టి 
ఊహ తననుండి పుట్టినది కాని ఇతరముకాదు. కనుక తన ఊహ
తనలో భాగముగా తెలియవలయును.  ఇట్టి ధ్యానము చేసేవానికి 
"యిల్లు" అను పేరు,  దాని గుణములు నశించి, ఊహగానిల్చి,
ధ్యానము చేస్తున్నకొద్ది అట్టి ఊహ తనది అని తెలియును. 

ఇట్లు ఏ వస్తువయినను తననుండి పుట్టేదిగాని ఇతరము కాదు.
అట్టివాని భౌతిక అస్తిత్వముగూడ అణువులు మొదలైన వానినుండి
పుట్టునది అగుటచే అది తాత్కాలికము తప్ప నిత్యముకాదు. అనగా
ఇంటికన్నా అణువులు నిత్యమైనా, అణువులకన్నా "నేను"
ప్రజ్ఞ నిత్యము. ఇట్టి పద్దతిలో యోగాభ్యాసము చేయువానికి
ప్రసన్నత సులభముగా చిక్కుతుంది.  క్రమేణా మనస్సు, అందలి
వస్తువులు కరిగిపోయి వానిని అధిష్టించియున్న "తాను" సత్యమగును. 
ఇదియే ఆధ్యాత్మము.

48

బుతంభరా తతో ప్రజ్డా



బుతంభరా = సత్యముచే నిండినది
తత్ర = అచ్చట
ప్రజ్ఞా = మెలుకువ

  అట్టి  సితిలో మెలుకువయే సత్యమగుచున్నది.
  



"సత్యము" అ౦టే  సత్యమే. "సత్‌ " అను పదమునకు
ఉండుట లేక ఉనికి అని అర్హము. సత్యమనగా ఈ  సమస్త 
ప్రపంచములో  ఏది నిత్యమై, శాశ్వతమై యండునో అదే.
అనగా రెండు లేని స్థితి. ఇట్టి స్థితినే  శ్రీ శంకరాచార్యులవారు 
"అద్వైత"మని చెప్పేరు.  అద్వైత మ౦టే రెండవది లేని స్థితి. తాను 
తప్ప ఇతరమేదియు లేదని తెలియు మెలుకవే ఇది. ఇక్కడ 
మెలుకువ అనగా తనకు "మెలుకువ" కాదు.  నిద్రించుచున్నప్పుడు,
మేలుకొనిన తర్వాత, మనము "ఉన్నాము" కదా!  అంటే  నిద్రలో
ఎట్లున్నామో, మెలుకువ వచ్చిన తర్వాత కూడా అలాగేయున్నాము. 
ఇక్కడ మెలుకువ అనునది మిగిలినవారికి, పరిసరములకు, మనస్సుకు, 
శరీరమునకు, ఇంద్రియములకు, వర్తింపవచ్చునుగాని తనకు 
వర్తింపవు. ఇట్లే తన మనస్సు శరీరము, ఇంద్రియములు, తనలో
నుండి పుట్టినవనియూ, తనయందు భాగములుగానే అవి పని
చేయుచున్నవి అనియూ అట్లే పరిసరములు, వస్తువులు సైతము
తననుండి పుట్టినవనియూ తెలియువానికి, "తానే" సత్యమై
మిగిలినదంతయు అసత్యమగును. ఇట్టి స్థితినే "అద్వైతస్థితి" లేక,
"ఎకాంతస్టితి" లేక "కైవల్యము" అను పేర్లతో పిలువబడుతుంది. భగవద్గీతలో 
(శీకృష్ణుడు ఇట్టి స్థితిని "అనన్యము" అని చెప్పెను,
ఇదే యోగులచే జ్యోతిర్మయమైనట్టి స్థితిగా దర్శింపబడినది. 

49

శ్రుతానుమానప్రజ్ఞాభ్యాం అన్యవిషయా విశేషార్థత్వాత్ !

శ్రుతా = వినినట్టిది.
అనుమాన = గ్రహింపబడిన విషయము
ప్రజ్ఞాభ్యాం = ప్రజ్ఞ లచేత
అన్య విషయా  = ఇతర విషయముల చేత 
విశేషార్థ = విషయము నశించి నట్టి అర్థము 
త్వాత్ = లేక సారాంశము కలిగినది 

  శ్రవణ, అనుమానముల వలన కలిగే మెలుకువల యందు,
ఇతరమయిన విషయములుండవు గనుక అట్టి ప్రజ్ఞ విశేష అర్థమును 
కలిగియుండును. 

  



విషయములు సూటిగా గ్రహించడం వలన ఇంద్రియములు
తమకన్న భిన్నమైనవిగా గుర్తి౦చుచున్నవి. నిజానికి  విషయములుగా 
ఇంద్రియములు చూచేవి తమయందలి ప్రతిస్పందనే 
తప్ప నిజముగా బాహ్యవిషయములను గ్రహించుటలేదు. కన్నుచూసేది
బయటనున్న వస్తువుయొక్క ప్రతిబింబము కంటి "రెటీనా"
పై కలిగిన నాడుల స్పందనము మాత్రమే గాని, ప్రతిబింబము
గ్రహింపబడడంలేదు. అలాగే రుచిచూసే వస్తువు వలన నాడులలో 
కలిగే  ప్రతిస్పందనమే  రుచిగా అర్హము చేసికొనబడుతున్నాది.
అక్కడ  అర్థము చేసుకొనబడుచున్నది  తనయందలి వాసన
మొదలైన లక్షణములు గాని వస్తువులుగావు. వస్తువులలో 
రుచి వాసన అనే  లక్షణములు౦టే ఆహారమును  శవము
నోటిలో ఉంచితే  శవమునకు రుచి తెలయాలి  కదా?
కనుక ఇక్కడ రుచి, వినికిడి చూపు మొదలైనవి ఇంద్రియ
లక్షణములు గాని బాహ్య విషయములు కావు. అట్టి ఇంద్రియ
లక్షణములు ఇంద్రియముల వలన పుడుతున్నాయి. ఇంద్రియములు
మనస్సునందు పుట్టును. ఇట్లు పై సూత్రమునందు చెప్పబడినట్లు
ఇవన్నియు సత్యమునుండి పుట్టేవి. సత్యమనగా తానున్నానని
తనకు తెలియుట. ఇట్టి స్టితి వలన విషయములు, ఇంద్రియములు 
వేరుగా నుండక అంతయు తానుగా యుండును.

Tuesday, February 6, 2024

Vidura Neeti Index

మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుని మంత్రిగా కౌరవ-పాండవ యుద్ధాన్ని నివారించడానికై బోధ చేస్తాడు. ఈ సంభాషణని శ్రీ పురాణపండ రామమూర్తి గారు 1961 లో తెలుగులోకి అనువదించేరు.దీనిలో అనేక నీతి వాక్యాలు పొందు పరిచేరు. వాటిలో చాలామటుకు నేటికీ వర్తిస్తాయి. చదివి తరించండి.
విదుర నీతి Part 1
విదుర నీతి Part 2
విదుర నీతి Part 3
విదుర నీతి Part 4
విదుర నీతి Part 5
విదుర నీతి Part 6
విదుర నీతి Part 7

కొన్ని ముఖ్యమైన విదుర నీతులు

చక్కనివాక్కులు గలవాడు, తర్కమెరిగిన వాడు సమయస్పూర్తిగలవాడు అవసరమెనచోట శాస్త్రమును చెప్పగలవాడు విషయమును త్వరగా నెరుగువాడు, మేలు చేయువాడు, కీడుచేయనివాడు పండితుడనబడును.

శాస్తజ్ఞానము లేక పలవరించువాడు గాలిమేడలు కట్టువాడు అధర్మపనులతో ఆభరణములను కొనువాడు, తన పనిని వదలుకొని లోకవ్యవహారమున మెప్పుకై చరించువాడు, సదా సంశయములు గలవాడు, తొందరపనులను ఆలస్యముగా చేయువాడు, పిలువకనే పోవువాడు, అడుగకపోయినను చెప్పువాడు, తన తప్పును ఇతరులపై మోపువాడు మూఢుడనబడును.

రుచిగల పదార్థములను ఒక్కడే తినరాదు. బాటలో ఒంటిరిగా వెళ్ళరాదు అందరు నిద్రించు నపుడు ఒక్కడు మేల్కొనరాదు. ముఖ్య విషయముల నొక్కడే ఆలోచింపరాదు.

ఈ ప్రపంచమున ఇద్దరే అధములు గలరు. కార్యశూన్యుడైన గృహస్థుడు. సర్వకార్యారతుడైన సన్యాసి, అలాగే ఇరువురు దుఃఖభాగులు గలరు. వారెవరనగా శత్రువులను మిగిల్చిన రాజు. ఇంటి నొదలిపెట్టన పండితుడు.

ఏమరిపాటుగల వానివలన దొంగలు బతుకుచుందురు. రోగులవలన వైద్యులు జీవించుచుందురు. కాముకుల వలన వేశ్యలు మనగలుగుదురు. యజ్ఞము చేయువారి వలన ఋత్విక్కులు వసించుచుందురు. పేచీలున్నచోట న్యాయాధిపతులు రాణించుచుందురు. మూర్ఖులవలన పండితులు తిండారగించుచుందురు. ఆ యారుగురి వలన ఈ యారుగురు బతుకుచున్నారు.

"పదుగురాడు మాట పాడియై ధర జెల్లు" యని మనము వినియున్నాము. "పదుగురాడు మాట పనికిరాదు" అని విదురనీతిలో తెలియును. ఆ పదుగురెవరో వినండి. 1. మత్తుడు, 2. ప్రమత్తుడు, 3.ఉన్మత్తుడు, 4. అలసి పోయినవాడు, 5. కృద్ధుడు 6. ఆకలితో యున్నవాడు 7. తొందరపాటు వాడు, 8. అత్యాశా పరుడు, 9. భయపడువాడు, 10. కాముకుడు

“ఒకదానిచే రెంటిని నిర్ణయించి, మూటిని నాల్గింటితో వశపరచుకొనుము. అయిదింటిని జయించి ఆరింటిని తెలిసికొని ఏడింటిని త్యజించి సుఖింపుము,” అని విదురుడనెను.

ఒకటైన బుద్దిచేత నిత్యానిత్యములను రెండింటిని నిర్ణయించాలి. సాధన చతుష్టయమనెడి నాల్గింటిచేత కామక్రోధ లోభము లనెడి మూడింటిని వశపరచుకొనవలెను. పంచేంద్రియములనే అయిదింటిని జయించి, మోసపుచ్చెడి అరిషడ్వర్గము అనెడి ఆరింటిని కనిపెట్టి, సప్తవ్యసనములనెడి ఏడింటిని విడచి సుఖింపవలెనని భావము,

పాపుల సాంగత్యమువలన పాపము చేయనివారు గూడ శిక్షింపబడుచుందురు. ఎండిన వాటితో చేరుటవలన తడిసినవి గూడ కాలిపోవుచున్నవి. కావున పాపము చేయువారి సంపర్కము మంచిదికాదు.

తినుటకు వీలుగా నుండాలి. తినుటకు యోగ్యముగా యుండాలి. తినిన పిదప చక్కగా జీర్ణము కావాలి. జీర్ణమైన పిదప చక్కగా దేహమున కుపకరించాలి. అట్టి ఆహారమునే భుజించాలి.

చూపుతో, మనసుతో, మాటతో, కర్మతో లోకము నెవడు ఆకర్షించునో వానిని లోకము ప్రసన్నముగా చూచును. ఎన్నటికి ఫలితము నివ్వని కార్యములను మొదలిడరాదు.

పూలు కందకుండా తుమ్మెద తేనెను గ్రహించునట్లు ప్రభువు ప్రజలను నొప్పింపక వారినుండి ధనమును గ్రహింపవలెను అని విదురుడనెను.

దీపముచేత చీకటిలో యున్న వస్తువు తెలియును. నడవడిక చేత ధర్మము తెలియును. వ్యవహారము చేత మంచితనము తెలియును. శూరుడైనవాడు భయము లేర్పడినపుడు తెలియును. ధీరుడు కష్టములలో తెలియును. మిత్రులేవరో, శత్రువులెవరో ఆపదలలో తెలియుదురు.

మంచి పనులు చేయుటవలన సంపద కలుగును. నేర్పువలన సంపద వృద్ధి చెందును. సామర్థ్యము వలన కుదుట పడును. మిడిసి పడనిచో నిలువగలుగును.

రాత్రి సుఖముగా నిద్రించుటకు తగిన స్థితిని పగటి యందే తయారుచేసుకోవాలి. వర్షాకాలమున హాయిగా ‌ జీవించు యత్నమును తక్కిన యెనిమిది మాసములలో చేయవలెను. వృద్ధాప్యమున సుఖించుటకు బాల్యముననే యత్నింపవలెను. మరణానంతరము సుఖించుటకు జీవితమంతయు కృషిచేయవలెను.

ముసలితనము రూపమును చెరచును. ఆశ ధైర్యమును పోగొట్టును. మృత్యువు పరాణములను హరించును. అసూయ ధర్మాచరణమును వక్రింపజేయును. క్రోధము సంపదను నశింపజేయును. నీచులసేవ శీలమును పాడుచేయును. కామము లజ్జను తొలగించును. అభిమానము సమస్తమును ధ్వంసమొనర్చును అని విదురుడనెను.

మానవుడు తనను నిందించువారిని తిరిగి నిందించనిచో ఆ నిందలు నిందించినవానినే దహించి వేయును. అదియును గాక నిందించినవాని పుణ్యము సహించినవానిని చేరును.

రథము చిన్నదైనను పెద్దబరువును మోయగలుగును. పెద్దవియైన వృక్షములు ఆ విధముగా మోయలేవు. (శేష్ఠులైనవారు ఎంతటి బరువునైనను మోయ గలుగుదురు. ఇతరులు ఉన్నతులుగా గోచరించినను భారమును మోయలేరు.

సంతాపము వలన రూపము చెడును. బలము తగ్గను. జ్ఞానము క్షీణించును. రోగము వృద్ది చె౦దును. రాగోరినది రాదు. శరీరము దహింపబడును. శత్రువులు ఆనందింతురు. కనుక శోకించుట తగదు.

“చిత్తము చలించువానిని జ్ఞానము లేనివానిని ఇంద్రియములకు వశమైన వానిని సంపదలు, ఎండిన సరస్సును హంసలు చేరనట్లు, చేరకుండును,” అని విదురుడనెను. .

మనిషి వంద సంవత్సరములు జీవించునని వేదములు పలుకుచున్నవి. మరి మానవుడు అంత కాలము ఎందులకు జీవింపలేకున్నాడు? ఏ కారణములో అతనిని మధ్యలో చంపుతున్నవి, అవి ఏమనగా! 1. గర్వము 2. అతిగా వాగుట, 3. పాపాచరణము, 4. క్రోధము, 5. తనసుఖమునే చూచుకొనుట, 6. నమ్మినవారిని మోసపుచ్చుట ఈ ఆరును పదునైనా కత్తులై ఆయువును ముక్కలు చేయుచున్నవి,

కొందరు దుష్టులు కలిసి చేసిన ఆలోచనను వెంటనే తిరస్కరింపరాదు. నీ పై నాకు నమ్మకము లేదు యని పలుకరాదు. ఏదో కారణము చెప్పి తప్పించుకొనవలెను.

"గొప్ప కీడు చేయు మనుజునితో శతృత్వము పెట్టుకొని, అతడు దూరముగా ఉన్నాడని ధీమాగా ఉండరాదు. " అని విదురుడు పలికెను.

తనయందు దోషములనుంచుకొని, నిర్దోషులైన తనవారిని బాధించు మనుజుడు పామున్న ఇంటిలో ఉండువానివలె నిద్రలేక, శాంతిలేక యుండును.

నమ్మదగనివానిని నమ్మరాదు. నమ్మదగినవానిని గూడ హద్దు మీరీ నమ్మరాదు. నమ్మకము వలన జనించు భయము వ్రేళ్ళను గూడ త్రెంచును.

పెద్దలు అరుదెంచునపుడు యువకుని ప్రాణములు పైకిలేచును. అతని కెదురేగి నమస్కరించుటవలన తిరిగి యువకుడు ప్రాణములను బొందును.

"స్త్రీలు పూజార్హులు. గొప్ప వైభవోపేతులు, పుణ్యవతులు, ఇంటికి దీపము వంటివారు, ఇంటిలోని లక్ష్మీ దేవులు. వారిని శ్రద్ధతో కాపాడవలెను" అని విదురుడనెను.

గొప్ప ప్రజ్ఞావంతులు బోధించు విషయము గూడ ఒక్కొక్కసారి నిష్పలమగుచు౦డును. ఎందులకనగా బోధించు విషయమును శ్రోత గ్రహింపలేకపోవుట, గ్రహించినను ఆచరింపకుండుట.

వినయము చెడ్డపేరును తొలగించును. పరాక్రమము చెడును నిర్మూలించును. సహనము క్రోధమును చంపును. ఆచారము చెడు నడవడిని పోగొట్టును.

ఒక్క మాటలో చెప్పవలె నన్నచో తనకు విరుద్ధమైన దానిని పరులకు చేయకుండుటయే ధర్మము. తోచినట్టు ప్రవర్తించుట అధర్మము.

"వేలకొలది ధనమున్నవారు జీవించుచున్నారు, వందలున్నవారు బ్రతుకుచున్నారు. ధృతరాష్ట్రా! సంపదపై ఆశను వీడుము. ఏ విధముగ నైనను బ్రతుక వచ్చును" అని విదురుడు పలికెను.

కట్టెలతో అగ్ని శాంతించదు. నదులతో సముద్రము నిండదు. జీవులతో యముడు తృప్తిని బొందడు. పురుషులతో కులట సంతృప్తి పడదు.

కాయలు, పండ్లు లేని చెట్లను పక్షులు వదలి వెళ్ళునట్లు, మృతుడైన వాని దేహమును బంధుమిత్రాదులు త్యజింతురు. పోయినవాని సంపద నెవరో అనుభవింతురు. దేహ ధాతువులను పక్షులు, అగ్ని తినివేయును.

జీవుడు ఒక నదిలాంటివాడు. పుణ్యమే అందులోని జలము. సత్యరూపమైన బ్రహ్మమునుండి జీవుడనే జీవనది పుట్టినది. ధీర స్వభావమే దాని తీరము. కరుణయే కెరటము. అందు జలకమాడిన పుణ్యశీలి పవిత్రుడగును.

"సుఖము గోరు వానికి విద్య ఎక్కడిది? విద్యగోరువానికి సుఖము లేదు. సుఖమును కోరినచో విద్యను త్యజింపవలెను. విద్యను గోరినచో సుఖమును విడనాడవలెను" అని విదురుడనెను.

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...