Friday, February 2, 2024

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 42-43)

upanishad


  


రెండవ ప్రకరణము

42

తత్రశబ్ధార్థజ్ఞాన వికల్పైః సంకీర్ణా 
సవితర్కా సమాపత్తిః 


తత్ర = అక్కడ 
శబ్ధార్థజ్ఞాన వికల్పైః = శబ్దముల అర్థములు, జ్ఞానములు 		
			  అను రెండింటి వికల్పముచేత 
సంకీర్ణ  = కలసివున్నట్టిది
సవితర్కా = వితర్కములతో కూడినట్టిది
సమాపత్తిః = సామ్యమైనట్టిది

  అచ్చట శబ్దముల అర్హము, వికల్పము అను రెండు స్థితుల
యందు నిలిచియుండును. అది కూడా యోగికి సామ్యస్టితియే.

  

పదములు, వాని అర్థములనేవి  అందరకున్నట్లే యోగికి
కూడా ఉంటాయి. ఆ వస్తువులున్నా, లేకున్నా వాటి అస్తిత్వము, 
పరోక్షత అనేవి  యోగిపై ప్రభావము కలిగింపలేవు.
నూతనముగా వివాహమైన వానికి భార్య దగ్గర లేకున్నా, ఆమె
ప్రసక్తి వచ్చినప్పుడు వానికి సంతోషము, పులకరింత కలుగును. 
ఇచ్చట భార్య అను పదము వట్టి పదమే తప్ప దానికి
అస్తిత్వము లేదు. అనగా దాని అర్హములో సత్యము లేదు.
ఇలాంటి వాటి  యందు యోగి ప్రత్యేక భావములను యూహలను
కలిగియుంటాడు. ఎవరైనా, నీకు ఆశ్రమ  నిర్మాణమునకై
ఒక లక్షరూపాయలు ఇస్తానంటే, యోగికి దానిపై ప్రభావము
లేదు. అనగా అతడిచ్చేవాని దాతృత్వబుద్దిని మెచ్చుకొ౦టాడే
గానీ ఇచ్చుటను గూర్చియూహచేయడు. అవతలవాడివ్వలేక
పోతే, నిరాశచెందడం అన్నది యోగికిలేదు. ఆశ్రమ నిర్మాణము
గురించి కలలుగనుట, పథకములు వేసుకొనుట మొదలైనవి
ఉ౦డవు. పథకము వేసికొన్నా, అది ధనము సద్వినియోగము
చేయుటగూర్చి తన కర్తవ్యముగా తయారు చేయుటే గానీ,
ధనము  వచ్చితీరాలనేయూహచేతగాదు. అ౦టే ఇక్కడ  తన
కర్తవ్యము అంతవరకేయని  తెలిసికొ౦టాడుగాని, ఇవ్వలేనివానిని
నిరసించడం, కోపించడం, విమర్శించడం మొదలైనవి ఉండవు. 
ధనము చేతికిస్తే, సద్వినియోగం చేయడానికి వెనుకాడడు. 
ధనము గురించి భయపడడం గాని, ప్రాకులాడడం గాని లేవు. 
ఇక్కడ ధనము అనే పదము దాని అర్థ వికల్పాదుల 
జ్ఞానము యోగిపై ప్రత్యేక ప్రభావమును కలిగించదు. 
అటువంటి స్థితినే వితర్కముతో కూడిన సమాధి స్థితి 
అంటారు. అటువంటి యోగికి ప్రపంచంలో అన్నీ ఉన్నా,
ఏమీ లేనట్లే. 

43

స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్థమాత్ర 
నిర్భాసా నిర్వితర్కా 


స్మృతి పరిశుద్ధౌ = స్మృతి పరిశుద్ధము చెందుటవలన 
స్వరూపశూన్యఇవా =స్వరూపము నశించునట్లు 
అర్థమాత్రనిర్భాసా = అర్థము మాత్రమే ప్రకాశించునట్లు 
నిర్వితర్క = విమర్శలేని స్థితి 

బుద్ధి స్వచ్ఛమైనప్పుడు అర్థము మాత్రమే యుండి రూపము 
నశించి అట్టి స్థితియందు విమర్శకూడాయుండదు. 

  

యోగి కాని వానికి పదములు, అర్థములు వాని యందు 
ఆ వ్యక్తికితో ఉన్న సాన్నిహిత్యము బట్టి ఉంటుంది. 
ఉదాహరణకు పైన చెప్పబడినట్లు భార్య అనే పదము 
తీసుకొంటే, క్రొత్తగా వివాహమైన వానికి భార్య అనే 
పదం వలన మనస్సులో ఆహ్లాదము మొదలైనవి 
కలుగుతాయి. భార్య మరణించిన వానికి అదే పదము 
దుఃఖము కలిగిస్తుంది. భార్యను ద్వేషించే వాడికి, ఆ 
పదముచే మనస్సులో ద్వేషము పుడుతుంది. యోగి అయిన వానికి
మాత్రము పదములయందు ఎలాంటి వాననలూ లేవు. వానికి భార్య
అను  పదానికి  సామాన్యార్థము తప్ప వేరే యూహ రాదు.
అలాగే  భార్య పరిష్వంగములో ఉంటే వానికి ఈ పదములు, అర్థములు 
మొదలైనవేమీ లేవు. భార్య వద్దనేయున్నపుడు భార్య
గురించి  ఊహ వుండదుగదా! అలాగే  యోగి అయినవానికి అంతర్వామి 
యందుండడమే తప్ప వానిగూర్చిన నామరూపాదులు,
ఊహలు, ఆరాధనావిశేషములు లేవు. కనుకనే భాగవతాది గ్రంధముల 
యందు భగవంతునియందు శృంగార రసాత్మకమైన భక్తిని
అత్యున్నతముగా చెప్పేరు. ఇచ్చట శృంగారమునకు కామమను
అర్థము తీయువారు కలరు. అలాంటి వారికర్థమగునట్టిదికాదిది. స్వచ్ఛ
మైన (పేమగలిగిన అన్నాచెలెళ్ళెకు, తల్లీ కుమారులకు,
తండ్రీ కుమార్తెలకు, కామవాసన లేని భార్యాభర్తలకు తేడా
లేదు. ఇలాంటి  ప్రేమే రాధాకృష్ణుల ప్రేమతత్వముగా, గోపికాకృష్ణుల
రాసలీలలుగా వర్ణింపబడినవి. ఇది ఎవరికి వారికి హృదయములో 
అనుభూతి పూర్వకముగా తెలియవలసినదేకాని, వివరింపగలిగినది
కాదు. అర్థము చేసికొనలేనివారికిది బూతు కథవలె కనిపిస్తుంది.
అంటే అలాంటి  వారియందు (పేమ యింకా  కామముగనే తెలియబడుచున్నది 
గాని కామ వాసనలేని ప్రేమ అనుభూతిలోనికి రాలేదని
తెలిసికొనవలెను. ఇక్కడ పరమాత్మయందుండుట యనగా,
ఎట్టి మానసిక వితర్కములు అనగా, ఊహలు, సంఘర్షణలూ లేక
స్వచ్చమైన యనుభూతిగా నుండుటయేయని యర్థము. ఇచ్చట
అనుభూతి సత్యము, ఊహ అసత్యము. అనుభూతి (పేమకు,
హృదయమునకు సంబంధించినది. ఊహ మనస్సుకు సంబంధించినది. 
సమస్తము పరమాత్మయొక్క అస్తిత్వముగా చూసేవానికి 
అంతా ఒక్కటే అనుభవముగానీ, వేరే యూహ ఉండదు.

అనేకమంది వ్యాఖ్యాతలు ఇక్కడ చెప్పబడిన ఈ రెండవ సమాధే 
ముందు శ్లోకములో చెప్పబడిన సమాధికన్నా ఉత్తమమని 
వాదించేరు. కానీ ఈ సూత్రములో పతంజలి అలా ప్రతిపాదించటం 
లేదు. గ్రంధకర్తకు లేని ఊహలు, ఉద్దేశ్యాలు, వ్యాఖ్యాతలు 
కల్పించడం హాస్యాస్పదం. నిజమైన యోగికి అటువంటి తేడా 
లేదు. ఈ చెప్పబడిన రెండు స్థితులూ, సమాధి స్థితిలో 
రెండు అంతర్భాగాలు. అవి యోగి ఉండే రెండు వివిధ స్థితులను 
తెలియజేస్తాయే గాని, వాటిలో ఎక్కువ తక్కువలు లేవు. అతడు 
ఆవశ్యకతనుబట్టి ఆయా స్థితులలో ఉంటాడు. ఇక్కడ ఆవశ్యకత 
అంటే ఇతరులకు సంబంధించినది కాని యోగికి సంబంధించినది 
కాదు. అతనికి ఆవశ్యకతలూ, ఎక్కువ తక్కువలూ లేవు. ఉన్నది 
అంతర్యామి యొక్క పరివ్యాప్తమే !

Friday, January 26, 2024

Vidura Neeti Part 1




సంజయుడు పాండవ శిబిరం నుండి తిరిగి వచ్చిన అనంతరం ధృతరాష్ట్రుడు వాని ముఖాన పాండవుల అభిమతం (గహించి వికలచిత్తుడైనాడు. ఆ క్షణంలోనే ద్వారపాలకుని పిలిచి తక్షణం వెళ్ళి విద్వాంసుడైన విదురుని తీసుకొనిరమ్మన్నా డు. ద్వార పాలకుడు ఆమాత్యమందిరానికి వెళ్ళి విదురుని వెంట బెట్టుకుని వచ్చాడు. సింహద్వారంలో విదురుడు నిలబడ్డాడు. పరిచారకుడు లోపలకుపోయి ఆవార్త నివేదించాడు, ధృతరాష్ట్రుడు విదురుని లోపలకు ప్రవేశపెట్టమన్నాడు, రాజాజ్ఞానుసారం విదురుడు అ౦తఃపురంలో అడుగుపెట్టి, "ప్రభూ! నేను విదురు డను, మీ ఆజ్ఞానుసారం మీ సమ్ముఖానికి వచ్చాను. ఇప్పుడు నేను చెయ్యవలసిన పనేమిటో ఆజ్ఞా పించగోరుతున్నాను" అని చేతులు దోయిలించాడు.

The Kaurava King Dhrutarashtra was in a forlorn state because of Pandavas. He ordered that his minister Vidura be brought to his presence. Accordingly, Vidura was brought to his abode.

విదురా! ధీమంతుడైన సంజయుడు ఉప ప్రాప్యంనుండి తిరిగి నచ్చి నాకు విశేషాలన్నీ వివ రించాడు. తూర్పు తెల్లవారుతుండగా మన సభా భవనంలో సంజయుడు విషయాలన్నీ వివరిస్తాడు, నా మనస్సు ఎంతగానో వికలమవుతోంది. చింతాగ్నిలో వేగిపోతున్నాను. కంటిమీద రెప్ప వాలడం లేదు ఈ రాజ్యంలో ధర్మార్ధ వివేకం నీకంటె ఎవరికీ ఎక్కువ లేదు. కనుక ఇప్పుడు నాకు శాంతిని కలిగించే మార్గమేదో చెప్పు. సంజయుడు రేపు సభలో వినిపించబోయే వారి సందేశం ఎలా ఉంటుందో తెలియడం లేదు. అదే నన్ను వేధిస్తోంది. అని ధృతరాష్ట్రుడు విచారంతో ప్రశ్నించాడు.

The King said, "Vidura, my charioteer Sanjaya will reveal all the things happening in the battle field at sunrise. My heart is torn asunder. I am boiling with rage. I need you to advise me and pacify me."

ప్రభూ ! బలవంతులతో విరోధం దుర్భలులకు ఉచితం కాదు. అటువంటివారికి రాత్రివేళ నిద్ర పట్టదు. ఇతరులసంపదలను హరించినవారికి, కాము కునికి, చోరునికీ నిద్రరాదు. ఇటువంటి దోషాలు మీలో లేనప్పుడు మీ కెందుకు నిద్రరావటం లేదు? పరధనాన్ని మీరు ఆశించడ౦ లేదుగదా?- అని విదురుడు ప్రశ్నించగా ధృతరాష్టృడు- నేను నీముఖంనుండి ధర్మప్రవచనం కోరుతున్నాను- అన్నాడు.

"O King, it is unwise for the weaklings to fight with the righteous. One who steals others' wealth and lusts after women, will not be able to sleep. You are not coveting others' wealth, are you?" said Vidura. The King replied that he was expecting a discourse on dharma that tells his duties.

పభూ! ఉత్తమలక్షణాన్వితుడైన ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. అటువంటి వాడు మీ అజ్ఞలను సర్వదా శిరసావహించేవాడు. ఈ విషయం విస్మరించి మీరు వారిని అడవులకు పంపారు. మీరు ధర్మాత్ములు, ధర్మజ్ఞు లు అయినా అంధులు కావడంవల్ల వానిని గుర్తించలేక విపరీత మార్గాన ప్రవర్తిస్తూ వారి రాజ్యభాగంకూడా వారి కివ్వలేక పోతున్నారు. ధర్మజుడు సత్యపరాక్రముడు. ధర్మనిష్ఠుడు. మీయందు గురుభావం కలవాడు. ఇన్ని సద్గుణాలు వానిలో ఉన్నాయి కనుకనే ఎటు వంటిక్లేశాలైనా నిర్లిప్తంగా సహిస్తున్నాడు.

"O King, the repository of dharma and righteousness like Dharma Raja is naturally the king of all three worlds. Ignoring this, you drove him out of your kingdom to the forests and now you rescind the offer to share the kingdom that is rightfully his. Dharma Raja is a pacifist and full of divine qualities. More importantly he respects you as an elder. Because of such an unblemished character, he is able to undergo the torture you put him through".

మీరు దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ప్రభృతి అయోగ్యులపై విశ్వాసముంచి రాజ్యభారం వారి కప్పగించి శాంతిని వా౦ఛించడం వివేకం కాదు. సాత్విక స్వభావమూ ఉద్యోగయత్నమూ, దుఃఖసహనమూ, నిశ్చలధర్మస్థితి కల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడు. వానినే విద్వాంసుడని మనీషులంటారు. దుష్కర్మలకు దూరంగా ఉంటూ అస్తికబుద్ధితో, శ్రద్ధాసక్తులతో సత్కర్మలను అను ష్ఠించడమే పండితలక్షణం. క్రోధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత్మస్తుతి ఎవనిని వంచించవో వాడే విద్వాంసుడు. ప్రజలు ఎవని సలహాలను గ్రహిస్తారో వాడే విద్వాంనుడు. ధర్మార్థాలనుసరిస్తూ,

Vidura continued. "You have given Duryodhana, Dussasana, Karna and Sakuni -- all evil people--the royal duties. It is the reason your mind is not resting. One who has satva guna, is duty bound, can tolerate tragedies, has unwavering commitment to dharma will never be defeated. Such a person is called a wise and learned being. Staying away from evil deeds, being curious, performing duties with impeccable character are the hallmarks of the learned. Anger, shame, egotism, lust, praise won't affect the wise. He will be the one sought for counsel.

లోకవ్యవహారం గ్రహిస్తూ, భోగచింత లేక ఫురుషార్థాన్ని సాధిస్తూ, శక్త్యానుసారం కృషిచేస్తూ విషయాలను స్వల్పకాలంలొ గ్రహిస్తూ, ఆప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండా, దుర్లభ వస్తువులను కోరకుండా, పోయినవాటికోసం శోకించకు౦డా, విపత్తులలో ధైర్యం పోగొట్టుకొనకుండా, ఆర౦భించిన కార్యాలను మధ్యలో ఆపకుండా, సోమరియై కూర్చోకుండా, మనస్సును వశపరచుకొని చరించువారు పండితులు. వారె

A scholar is one who is able to partake in wordly transactions; earn a livelihood by working as necessary; learn the context speedily; stay away from pointless chatter; refrain from seeking unattainable objects; avoid depression over losing ephemeral objects; be resilient in danger; always finish the task at hand; avoid laziness; control the mind.

ప్పుడూ మంచిపనులే చేస్తారు. కృతజ్ఞులై చరిస్తారు. ఆదరిస్తే అనందమూ, అనాదరిస్తే ఆగ్రహమూ పొందరు. గంభీరగంగాహృదసదృశహృదయంతో ఉంటారు. పదార్ధాల యదార్థస్వరూపం వారికి తెలు స్తుంది. ఒకానొక కార్యం నిర్వహించడాని ఉత్తమ సాధనాలు వారెరిగిఉంటారు. ఉపాయాలలో అపా యంలేని విధానాలు వారికి తెలుస్తాయి. వారి వాక్కుకు ఆవరోధముండదు, వారిప్రతిభ గ్రంధ విషయాలను అవలీలగా గ్రహిస్తుంది. తార్కికశక్తి వారిసొమ్ము. వారిబుద్ధి విద్యను అనుసరిస్తుంది. వారి

Such scholars always perform good deeds. They are grateful for everything they have and are loyal. They don't walk in pomp after praise or feel dejected upon insult. They are like the personalities of a sacred river and the mighty ocean. They understand the inner mechanism of thought and action. They know the right tools for proper action. They can use their intellect to overcome peril. Their words won't be contradicted. Reading the scripture is not hard for them. They follow the path of constant learning.

విద్య బుద్దియొక్క అదుపులో ఉంటుంది. శిష్టా చారాలను వారు ఉల్లంఘించరు. విద్యావివేక౦ లేనిదే గర్వంతో చరించేవాడూ, దరిద్రుడై తీవ్ర మనోరధాలు కలవాడూ మూర్ణులే. ఏ కృషీ చెయ్య కుండా సంపదలు వాంఛించేవాడూ, స్వీయకార్యాలు విడచి పరాచారాలు పాటించేవాడూ, మిత్రులతో అసంబద్ధంగా చరించేవాడూ, అయోగ్యాలను వా౦ఛి౦చేవాడూ, సఖులను తిరస్కరించేవాడూ, బలవంతులతో వైరం పెంచుకొనేవాడూ శత్రువులతో మైత్రి సాగించి మిత్రకోటితో శాత్రుత్వం నెరపేవాడూ, సందేహచిత్తుడై సర్వకార్యాలనూ సకాలంలో

The knowledge is within the control of intellect. One who disregards vedic rites, is arrogant with knowledge, aspires for great things being a pauper is truly a fool. Those who devoid of any effort seek wealth, perform other acts neglecting duties, seek the company of fools, reject the offers of good friendship, join hands with the enemies of their friends, being doubts ridden cannot perform duties on time, be loners, run away from the parents, speak of scripture without proper training, trust the untrustworthy, perform bad karma, always easy to offend and pick arguments, advise the unqualified, befriend the non-believers of vedas are all fools.

నిర్వ ర్తించనివాడూ, మిత్రశూన్యుడూ, పితృదేవతా కర్మలు నిర్వర్తించనివాడూ అనాహూతుడై ఆగ మి౦చేవాడూ, పృచ్చ లేకుండా భాషించేవాడూ, కృతఘ్నులను విశ్వసించేవాడూ, దోషాచారపరాయ ణుడూ, పరదోషగ్రహణచిత్తుడూ, వ్యర్థక్రోధీ, అనధికారులకు ఉపదేశాలిచ్చేవాడూ, శూన్యాన్ని ఉవాసించేవాడూ, కృపణులను ఆశ్రయించేవాడూ వీరందరూ మూర్ఖులే.

విద్యాధనాలు విరివిగా ఉన్నా గర్వం లేకుండా చరించేవాడు పండితుడు. తనవల్ల పోషింపబడే వారికి భోజనభాజనాదులు సమకూర్చకుండా స్వోదర మాతృపూరణం చేనుకొనేవాడు మహామూర్జుడు. మానవుడు ఒక్కడు చేసిన పాపఫలం ఎందరినో వేధిస్తుంది. పాపఫలానుభవంతో అది వారిని విడిచి పెడుతుంది. కాని కర్త మాత్రం దోషిగానే ఉంటాడు. మహావీరుని హన్తంలోని ధనస్సునుండి వెలువడిన

A scholar is humble despite his vast knowledge. A fool ignores the needs of his dependants and looks after his needs above all. A single individual's sins affect the humanity. The world suffers from the evil deeds of unrighteous people. A great archer's arrow may not affect all the people of the world. But a scholar's curse can turn the fortunes of a country upside down. One has to use discretion and have faith in vedas. He has to use counseling, reward and if necessary force to declaw his enemies. Before that he has to be free from the control of the five senses. Where possible he has to make truce and use the methods described in the scripture. He has to refrain from exploiting women and hunting animals for pleasure; be a teetotaller; and stay away from all deplorable qualities of the degenerate.

బాణం ప్రతిపక్షవీరులలోని ఎవరినీ వేధింపక పోవ చ్చును, కాని విద్వాంసుని వాక్కు సర్వప్రజా సమూ హంతో రాష్ట్రాన్నికూడా నశింపచెయ్యగలదు. ఆత్మ బుద్ధితో కర్తవ్యాకర్తవ్యాలను నిశ్చయించుకొని శత్రు మిత్ర ఉదాసీనులను సామ దాన భేదదండోపాయా . లతో వశపరచుకొని పంచే౦ద్రియాలను జయించి సంధి విగ్రహ, యాన, ఆసీన, ద్వైధీభావ సమా శ్రయగుణాలను గృహించి, స్త్రీ, ద్యూత, మృగయా వినోద, మద్యపాన, కటువచన, కఠినదండ స్వభావ కర్కశ వృవర్తనాది అన్యాయాలను విడిచి సుఖించాలి.

Saturday, January 20, 2024

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 36)

upanishad


  


రెండవ ప్రకరణము

36

విశోకావా జ్యోతిష్మతీ

విశోకా = శోకములేనిది
వా = లేక
జ్యోతిష్మతీ  = వెలుగుతోనిండినది 


  
మనస్సునందు జ్యోతిని నింపుటనే దుఃఖమును తొలగించ
వచ్చును.

  

మనస్సుకు దుఃఖము మొదలైనవి కలుగడం అభ్యాసము
చేత జరుగుతుంది. అలాగే కొన్నికొన్ని పరినరములు మనస్సుపై 
ప్రభావము కలిగిస్తాయి. ఉదాహరణకు, ఒక దుఃఖిస్తున్న వ్యక్తిని 
చూస్తే, సానుభూతిచే, తనకుకూడా దుఃఖము పుడుతుంది.  
అలాగే  ఒంటరిగా చీకటిలోను౦టే భయము కలుగుతుంది. అంతేకాక
అలాంటి  సంఘటనలు స్మరణకు వచ్చినపుడల్లా, ఆా అనుభూతులు 
మనస్సుకు కలుగుతాయి. అలాగే  ఒక గాలి వెలుతురు లేని 
గుహను కాని, సొరంగమునుగానీ ఊహించుకొ౦టే 
తనకు ఉక్కిరిబిక్కిరిగానున్నట్టు అనిపిస్తుంది. తనకు తీవ్రహాని 
చేసినవారు జ్ఞప్తికి వస్తే  ఆవేశముతో  ముఖ మెఱ్ఱబడుట,
చేతులు బిగిసికొనుట గుండెవేగముగా కొట్టుకొనుట మొదలైనవి 
కలుగుతాయి. అ౦టే ఇక్కడ వస్తువు ఎదురుగా లేకున్నా,
కేవలము స్మరణ చేతనే మనస్సును ప్రభావితము చేయవచ్చునని 
తెలుస్తోంది. అంతేకాక సంపెంగ, మంచిగంధము మొదలైనవి 
స్మరిస్తే, వాటి సువాసనతో మనస్సు నిండుతుంది. కనుక 
మనస్సులోని వస్తువును బట్టి తన చుట్టునున్న వాతావరణము 
ఆనందకరముగా గానీ దుఃఖమయముగా గాని పరిణమిస్తుంది. 

మనస్సుకు సంతోషము, ఉల్లాసము కలిగించు 
విషయములను, రూపములను ఎన్నుకోవచ్చును కదా 
అని అంటే, అది మంచిదేకాని, మనస్సు ఒకే రూపముపై 
ఎక్కువ కాలం నిలువదు. మార్పుకోరడం మనస్సుకు సహజము. 
రూపములననుసరించి కొత్తరూపములు, విషయములు
మనస్సులో సాక్షాత్కరిస్తాయి. ఆకారములు, రూపములు, 
రంగులు మొదలైనవి మనస్సును బంధిస్తాయి. కనుక
పెద్దలు మరొక మార్గము కని పెట్టేరు. అదే  కాంతిని దర్శించడం. 
అంటే కనులు మూసుకొని కాంతిని ధ్యానము చెయ్యాలి. 
ఒక పెద్ద వెలుగు భూమ్యాకాశములంతటా వ్యాపించియున్నట్టు,
తానా వెలుగులోనున్నట్టు, తాను కూడా ఆ వెలుగులో భాగమై,
ఆ వెలుగునకు కేంద్రముగానున్నట్టు, తనకు పైన, క్రింద, చుట్టూ 
కాంతియున్నట్టు ధ్యానము చెయ్యాలి. ఇది చేయడం 
కొంచెము కష్టమనిపిస్తే, సూర్యకాంతిని ధ్యానము చెయ్యాలి. 
సమస్తము బంగారు కాంతిగానున్నట్టు, ఈ ప్రపంచమంతా అటువంటి  
బంగారువర్షముతో నిండియున్నట్టు ధ్యానము చెయ్యాలి. 
లేక ఇది కూడా కొంచెము కష్టమనిపిస్తే, దీపమును
వెలిగించి, దీపమును చూస్తూ, కనులు మూసుకుని ఆ
దీపకళికను లేక జ్యోతిని చూస్తున్నట్లుగా ధ్యానము చెయ్యాలి. 
క్రమేణా ఆ జ్యోతి సమస్తమును ఆవరించియున్నట్లు 
ధ్యానము చెయ్యాలి. ఇదే  నారాయణోపనిషత్‌ లో 

"ఆర్దృ౦ జ్వలతి జ్యోతిరహమస్మి 
బ్రహ్మాహమస్మి  జ్యోతిరహమస్మి "

అని వివరింపబడినది. ఇలా ధ్యానము చేయడంవలన 
మనస్సు కాంతివంతమై ప్రకాశవంతమవుతుంది. మనస్సులోని 
రూపములు, ఆకారములు నశించి పైన చెప్పబడిన 
సంస్కారములన్నీ క్రమేణా నశిస్తాయి. ఇలా ప్రతిదినం 
ఒకే సమయాన, ఒకే ప్రదేశాన ప్రశాంతముగా కూర్చొని 
జ్యోతిని ధ్యానం చెయ్యాలి. ఒకవేళ ఏదో రంగును ధ్యానం 
చేయడం సులభమనిపిస్తే, బంగారు వర్ణము, లేదా 
గులాబి వర్ణము లేదా ఆకాశ నీలము అనే మూడు వర్ణాలు 
యోగసాధనకు సౌలభ్యము కలిగిస్తాయి. కాబట్టి 
ఆ వర్ణాలలో ఒకదానిని ధ్యానం చేస్తే, మనస్సు ఆ 
వర్ణమునుండి కాంతి వైపు క్రమేణా మరలుతుంది. అలా 
కాంతిని దర్శించి, అనుభవిస్తే అంతఃకరణానికి సుఖ 
దుఃఖముల స్పర్శ ఉండదు. 

Saturday, January 13, 2024

Bhagavata Origin Melancholy Of Vyasa






upanishad

వ్యాసుని నెరాశ్యము

ద్వాపర యుగము ముగియు సమయ మాసన్నమాయెను. సత్యవతీ నందనుడగు వ్యాసుడు ఒకనాడు సరస్వతీ నదీజలములలో స్నానాది కర్మములను ముగించి, నిర్మలమై పవిత్రమై నొప్పారు బదరికాశ్రమమున ధ్యానచిత్తముతో కూర్చొని యుండెను.

వ్యాసుడు వేదములను సంస్కరించిన మహనీయుడు. అష్టాదశపురాణములకు కర్తయైనవాడు. (బహ్మసూత్రములను రచించినవాడు. వేదవ్యాసుడని క్రీర్తింపబడెను.

వ్యాసుడు అశ్రుపూర్ణవదనుడై విచారముతో గూర్చొని యుండెను. ఆ దారిన అదే సమయానికి వెడుచుండిన నారదమహర్షి వ్యాసుని గాంచెను. వ్యాసుని ముఖారవిందమున గోచరమయ్యే బాధను గ్రహించెను. వ్యాసుని ప్రశ్నించెను. “పరాశరాత్మజా! మీ వదనమున విషాదఛాయలు అలుము కొనుటకు కారణమేమి? సర్వశాస్త్ర పారంగతులెన మీకు అశాంతి ఎలా ఏర్పడినది?"

ఉ|| ధాతవు భారతశృతి విధాతవు వేదపదార్థజాల వి

జ్ఞాతవు కామ ముఖ్యరిపు షట్క విజేతవు (బహ్మ తత్త్వ ని

ర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చలించి చెల్లరే

కాతరు కైవడిన్‌ వగవ గారణవేమి పరాశరాత్మ జా

నారదుని మాటల నాలకించిన వ్యాసుడు ఇలా పలికెను.“నారదమునీంద్రా! అదియే నాకును అవగత మగుటలేదు. నీవు త్రిలోక సంచారివి. జ్ఞానివి. నీకు తెలియని విషయము లేదు. నీవు మూడులోకముల యందు చరించుచుందువు. వాయుదేవుని వలె నిఖిల లోకముల మెలగుచుందువు. బ్రహ్మశరీరము నుండి పుట్టినవాడవు. పురాణపురుషుడైన విష్ణుమూర్తిని కీర్తించుచుందువు. అన్ని దిక్కులయందు నీ పవిత్ర పాదముల నుంచితివి. గొప్ప జ్ఞానవంతుడవై తరించితివి .

క || పుట్టితి వజు తనువున జేపట్టితివి పురాణపురుషు భజనము పదముల్

మెట్టితివి దిక్కులం దుది ముట్టితివి మహాప్రబోధ మున మునినాథా

“మునీంద్రా! నీకు తొలియని ధర్మము ఏ లోకమునను లేదు. సమస్తమును దర్శించినవాడవు. ఈ నా నైరాశ్యమునకు కారణమేదియో నీకు తెలియును. దయతో నాకు వివరింపుము"

క||నీ కెఱుగరాని ధర్మము లోకములను లేదు బహువిలోకివి నీ వీ

నా కొఱత యెట్టి దంతయు నాకున్‌ వివరింపవయ్య నారద కరుణన్‌

నారదుడు క్షణకాల మాలోచించి వ్యాసునితో ఇలా పలికెను. “మహాత్మా! నీవు ధర్మార్థ కామములను తెలిపెడి (తివర్గములను గూర్చి మహాభారతాది గ్రంథములలో రచించితివి. శ్రీ మహా విమ్హవు యొక్క దివ్యగాథలను కీర్తించు మోక్షప్రదాయకమగు గ్రంథమును రచింపకుంటివి. హరినామ స్తుతికి నోచుకోని కావ్యము విచిత్రార్థములతో గూడి యుండినను కాకుల గర్తమువలె యుండును.

మహాత్మా! వ్యాసా! జటిలమైన వేదాంత శాస్త్రమును ప్రవచించిన నీవు భగవద్భక్తిని గూర్చి ( పత్యేకముగా (పవచించవైతివి. ఎంతటి జ్ఞానము కలిగినను భక్తిలేనిదే ముక్తిరాదు. భగవానుని అనంత కళ్యాణ గుణములను కీర్తి౦చకపోవుటయే నీ ఆవేదనకు ముఖ్యకారణము. వారిభక్తిని విరివిగ పంచెడి భాగవత కావ్యమును రచించి మీ హృదిలోని ఆవేదనను పోగొట్టుకొనుడు" యని తెలియజేసెను.

ఉ|| అచింత్యమైన ధర్గచయ మంతయు జెప్పితి వందులోన నిం ఆ కణము నిం

చించుక గొని విష్ణుకథ లేర్పడి జెప్పవు ధర్మముల్‌ (పవం

చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నిన గాక నీకు నీ

కొంచెము వచ్చుటెల్ల వారి గోరి నుతింవుమి నార్యవూజితా ‌ నిర్గతకర్మము, నిరుపాధికమునగు జ్ఞానము హరిభక్తి లేకుండా సిద్దించదు. ఈశ్వరార్పణ బుద్దితో చేయబడని కర్మము ఈశ్వరప్రియము గాబోదు. భక్తిరహిత కర్మ జ్ఞానములు నిరర్ధకములు. కనుక భవబంధములను తొలగించు వాసుదేవుని లీలా విశేషములను వర్తింపుమని నారదుడు వ్యాసునికి చెప్పెను. భక్తియుతుడు సంసారమున చిక్కడు. భక్తిరస వశీకృతుండై హరిచరణ సేవను సదా చేయుచుండు ననెను.

ఓం నమో భగవతో వానుదేవాయ ధీమహి

(పద్యుమ్నాయా నిరుద్దాయ నమ స్స౦కర్షణాయ చ

అని నారదుడు కీర్తించి కృష్ణనామ వైభవమును వివరించుచు తన పూర్వజన్మ వృత్తాంతమును

At the denouement of dwapara yuga Vyasa, the son of Satyavati, was in deep meditation on the banks of Saraswati river. He had restructured Vedas, wrote eighteen puranas and authored Brahma Sutras. He was called Veda Vyasa.

Vyasa was in melancholy and shedding tears as the Narada muni was passing by. Narada was stunned and said "O son of Parasa, your face looks very sad. Being an omniscient what is the reason for this melancholy?"

Vyasa replied: "O Narada, I don't know why I am depressed. You tour all the worlds. You are well versed with all the lokas. You are born to Brahma Deva and praise Lord Krishna. You accomplished a lot and made your life fruitful.

Narada interjected: "O sage, you described dharma, artha (wealth) and kama (desire) in various ways in Maha Bharata and puranas. But you have not dwelled on the devotion to Sri Hari. No matter how much knowledge you gain from reading books, without devotion such knowledge won't bear fruits. Why don't you write Bhagavata describing the greatness of Sri Hari? This will certainly end the depression. The nirguna (devoid of qualities) and nirupadhika (devoid of body) knowledge cannot be gained without devotion. The karma done without offering the fruits to the Lord, won't please the Lord. In a nutshell, knowledge without devotion is useless. Why don't you write about the lila of Sri Hari that will offer salvation to the devotees? With devotion one will not be caught in the unending samsara and attain Sri Hari."

Sunday, December 31, 2023

Vishnu Index

upanishad
Prologue/పూర్వ పీఠిక (English/Telugu)
1000 Names/సహస్ర నామములు (English/Telugu)
Epilogue/ఉత్తర పీఠిక (ఫల శృతి) (English/Telugu)

Vishnu1000 Prelude

Vishnu Sahasranama In English With Meaning:

INVOCATION

Shuklam Baradaram Vishnum, Sasi Varnam Chatur Bhujam, Prasanna Vadanan Dyayet, Sarva Vignoba Sandaye.

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥

Dressed in white you are, Oh, all pervading one, And glowing with the color of the moon. With four arms, you are, the all-knowing one, I meditate on your ever-smiling face, And pray,” Remove all obstacles on my way”.

శ్వేత వర్ణము గల వస్త్రములు ధరించినవాడా, సర్వాంతర్యామి, చంద్రుని వర్ణము గలవాడా, చతుర్ భుజములతో సర్వము తెలిసినవాడా, నేను మందహాసముతో నున్న ముఖము గల నిన్ను పూజిస్తున్నాను. నా మార్గములోని విఘ్నములు తొలగించు.

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతం । విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥ 2 ॥

Vyasam Vasishtanaptharam, Sakthe Poutramakalmasham, Parasarathmajam vande, Shukathatham Taponidhim.

I bow before you Vyasa, The treasure house of penance, The great-grandson of Vasishta, The grandson of Shakthi, The son of Parasara, And the father of Shuka.

పూర్వ పీఠికా

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం । పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ॥ 3 ॥

నేను వ్యాసునికి నమస్కారము చేయుచున్నాను. అతడు తపస్సుకు నిధి వంటి వాడు. అతడు వశిష్ఠుని ముని మనుమడు, శక్తి యొక్క మనుమడు, పరాశరుని కుమారుడు, శుకుని తండ్రి

Vyasa Vishnu Roopaya, Vyasa Roopaya Vishnave, Namo Vai Brahma Vidaya, Vasishtaya Namo Nama.

Bow I before, Vyasa who is Vishnu, Vishnu who is Vyasa, And again and again bow before, He, who is born, In the family of Vasishta.

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే । నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥ 4 ॥

వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. వసిష్ఠుని వంశములో జన్మించిన వానికి మరల మరల నమస్కారము చేయుచున్నాను

Avikaraya Shuddhaya, Nityaya Paramatmane, Sadaika Roopa Roopaya, Vishnave Sarva Jishnave.

Bow I before Vishnu Who is pure, Who is not affected, Who is permanent, Who is the ultimate truth. And He who wins over, All the mortals in this world.

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే । సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ॥ 5 ॥

శుద్ధమైన, నిత్యమైన, సత్, అందరి జీవుల హృదయాలను ఆకట్టుకున్నవాడైన విష్ణువుకి నమస్కారము చేయుచున్నాను

Yasya smarana Mathrena, Janma Samsara bandhanath. Vimuchayate Nama Tasmai, Vishnave Prabha Vishnave. OM Namo Vishnave Prabha Vishnave

Bow I before Him, The all-powerful Vishnu, The mere thought of whom. Releases one forever, Of the ties of birth and life. Bow I before the all-powerful Vishnu.

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ । విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥ 6 ॥

ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే ।

అతని స్మరణము చేస్తే సంసార బంధములు తొలగును. అట్టి గొప్ప శక్తిమంతుడైన మహావిష్ణువుకి పదే పదే నమస్కారాము చేయుచున్నాను

Shri Vaisampayana Uvacha:- Shrutva dharmaneshena, Pavanani cha Sarvasha, Yudishtra santhanavam Puneravabhya Bhashata

Sri Vaisampayana said:- After hearing a lot, About Dharma that carries life, And of those methods great, That removes sins from one’s life, Forever and to cleanse, Yudhishtra asked again, Bheeshma, the abode of everlasting peace.

శ్రీ వైశంపాయన ఉవాచ

శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః । యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ॥ 7 ॥

జీవితాన్ని నడిపించే ధర్మము గురించి విని, గొప్ప సాధనాల గూర్చి తెలుసుకొని, పాపముల ప్రక్షాళనము చేసే, తత్త్వమును గూర్చి యుధిష్టరుడు భీష్ముని ఆడిగెను

Yudishtra Uvacha:-

Kimekam Daivatham Loke, Kim Vapyegam Parayanam, Sthuvantha Kam Kamarchanda Prapnyur Manava Shubham, Ko Dharma sarva Dharmanam Paramo Matha Kim Japan Muchyathe Jandur Janma Samsara Bhandanat

Yudhishthira asked: In this wide world, Oh Grandpa, Which is that one God, Who is the only shelter? Who is He whom, Beings worship and pray, And get salvation? Who is He who should oft, Be worshipped with love? Which Dharma is so great, There is none greater? And which is to be oft chanted, To get free from these bondages of life?

యుధిష్ఠిర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిం వాఽప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం ॥ 8 ॥ కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః । కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ ॥ 9 ॥

ఓ తాతా!ఇంత విశాలమైన ప్రపంచమునకు, ఎవరు అందరికీ ఆశ్రయమయమైన దేవుడు? ఎవరిని పూజించడము వలన మోక్షము కలుగుచున్నది? ఎవరిని పదే పదే ప్రేమతో అర్చించ వలెను? ఎట్టి ధర్మము అన్ని ధర్మాలలో ఉత్కృష్టమైనది? సంసార బంధములు తొలగాలంటే దేనిని స్మరించవలెను?

Bheeshma Uvacha:-

Jagat Prabhum devadevam Anantham Purushottamam,
Stuvan nama Sahasrena, Purusha Sathathothida,
Tameva charchayan nityam, Bhaktya purushamavyayam,
Dhyayan sthuvan namasyancha yajamanasthameva cha,
Anadi nidhanam vishnum sarva loka Maheswaram
Lokadyaksham stuvannityam Sarva dukkhago bhaved,
Brahmanyam sarva dharmagnam Lokanam keerthi vardhanam,
Lokanatham Mahadbhootham Sarva Bhootha bhavodbhavam,
Aeshame sarva dharmanam dharmadhika tamo matha,
Yad bhaktyo pundarikaksham Stuvyr-archanayr-nara sada,
Paramam yo mahatteja, paramam yo mahattapa
Paramam yo mahad brahma paramam ya parayanam
Pavithranam Pavithram yo mangalanam cha mangalam,
Dhaivatham devathanam cha bhootanam yo vya pitha
Yatha sarvani bhoothani bhavandyathi yugagame
Yasmincha pralayam yanthi punareve yuga kshaye
Tasya Loka pradhanasya Jagannatathasya bhoopathe
Vishno nama sahasram me Srunu papa bhayapaham.

Bheeshma Replied:- That Purusha with endless devotion, Who chants a thousand names, Of He who is the lord of the Universe, Of He who is the God of gods, Of He who is limitless, Would get free, From these bondages of life.

ఎవరైతే విశ్వ పాలకుడు, దేవతలకు దేవుడు, అవధులు లేనివాడు, సంసార బంధములు తొలగించేవాడు అయిన విష్ణువుని సహస్రనామాలుతో స్మరిస్తాడో

He who also worships and prays, Daily without break, That Purusha who does not change, That Vishnu who does not end or begin, That God who is the lord of all worlds, And Him, who presides over the universe, Would loose without fail, All the miseries in this life.

ఎవరైతే ప్రతిదినము విష్ణువుని పూజిస్తాడో, స్మరిస్తాడో; మార్పు చెందని వానిని అర్చిస్తాడో, ఆద్యంతము లేనివానిని, అన్ని లోకాల పాలకుడను, విశ్వమునకు అధ్యక్షుడుని పూజిస్తాడో, అట్టివానికి సంసార బంధములు తొలగేవి

Chanting the praises, Worshipping and singing, With devotion great, Of the lotus-eyed one, Who is partial to the Vedas, Who is the only one, who knows the dharma, Who increases the fame, Of those who live in this world, Who is the master of the universe, Who is the truth among all those who have life, And who decides the life of all living, Is the dharma that is great.

కమలాక్షుని; వేదములను అభిలషించేవాడిని; తనకు సాటి లేనివాడను; ధర్మమును తెలిసినవాడిని; పేరు ప్రఖ్యాతులను వృద్ధి చేసేవాడు, లోకానికి పాలకుడు, సత్ స్వరూపము, మిక్కిలి ఆశ్రయుడయిన వానిని ఎవరైతే స్మరిస్తారో వారు కొప్ప ధర్మపరులు

That which is the greatest light, That which is the greatest penance, That which is the greatest brahmam, Is the greatest shelter that I know.

నాకు తెలిసి గొప్ప ప్రకాశము, గొప్ప తపస్సు, గొప్పవాడైన బ్రహ్మన్ మనకు ఆశ్రయము

Please hear from me, The thousand holy names, Which wash away all sins, Of Him who is purest of the pure, Of That which is holiest of holies, Of Him who is God among Gods, Of That father who lives Without death, Among all that lives in this world, Of Him whom all the souls, Were born at the start of the world, Of Him in whom, all that lives, Will disappear at the end of the world, And of that the chief of all this world, Who bears the burden of this world.

నేను చెప్పే సహస్రనామములను విను. అవి అన్ని పాపాలను ప్రక్షాణలము చేసేవి. అతడు శుద్ధమైన వారలలో శుద్ధమైన వాడు, పవిత్రమైన వారలలో పవిత్రుడు, దేవతలకు దేవుడు, జీవులకు తండ్రి అయి మరణము లేనివాడు, సర్వ జగత్తు మోసేవాడు, ఆత్మలను సృష్టి ఆదిలో జీవులుగా పుట్టించేవాడు, కల్పంలో జీవులను మాయము చేసేవాడు, విశ్వానికి అధిపతియైన వాడు, ప్రపంచ భారమును మోసేవాడు.

I would teach you without fail, Of those names with fame. Which deal of His qualities great, And which the sages sing, So that beings of this wide world, Become happy and great.

నేను ఆ ప్రసిద్ధమైన సహస్రనామములు చెప్పెదను. అవి ఎవడు సద్గుణములు గలవాడో, ఋషులచే కీర్తింప బడేవాడో, జీవులకు ఆహ్లాదము కలిగించేవాడో అతనిని ఉద్ఘటించేవి.

శ్రీ భీష్మ ఉవాచ

జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమం । 
స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః ॥ 10 ॥ 
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం । 
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ ॥ 11 ॥ 
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం । 
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ॥ 12 ॥ 
బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనం । 
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం॥ 13 ॥ 
ఏష మే సర్వ ధర్మాణాం ధర్మోఽధిక తమోమతః । 
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ॥ 14 ॥ 
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః । 
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం । 15 ॥ 
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం । 
దైవతం దేవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా ॥ 16 ॥ 
యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే । 
యస్మింశ్చ ప్రలయం యాంతి పునరేవ యుగక్షయే ॥ 17 ॥ 
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే । 
విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహం ॥ 18 ॥ 
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ।
 ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ॥ 19 ॥ 
 

Rishir Namnam Sahsrasya Veda Vyaso Maha Muni Chando aunustup stada devo bhagawan devaki sutha Amruthamsu Bhavo Bhhejam Shakthir devaki nandana Trisama hridayam tasya santhyarthe viniyujyade Vishnum Jishnum Mahavishnum Prabha vishnun Maheswaram Aneka Roopa Daityantham Namami purushottamam.

These thousand names Yudishtra Are Sung for peace, And has Vyasa as the sage, And is composed in Anusthup meter, And has its God the son of Devaki, And its root is Amrutamsudbhava And its strength the baby of Devaki, And its heart is Trissama

ఈ సహస్రనామములు శాంతికై జపించేవి. వాటికి వ్యాసుడు ఋషి; అవి అనుష్టుప్ ఛ౦దస్సులో చెప్పబడేవి; వాటిలోని దేవుడు దేవకీ పుత్రుడు; వాటి మూలము అమృతం సుద్భవ ; అవి దేవకీ పుత్రుని గూర్చి చెప్పబడినవి; వాటి హృదయము త్రిస్సమ

Bow I before Him, Who is everywhere, Who is ever victorious, Who is in every being, Who is God of Gods, Who is the killer of asuras, And who is the greatest, Among all purushas.

అతడు సర్వాంతర్యామి; విజయుడు; అన్ని జీవులలో ఉండేవాడు; దేవతలకు దేవుడు; అసురులను సంహరించేవాడు; మిక్కిలి శ్రేష్ఠుడు. అట్టి వానికి నమస్కారం చేస్తున్నాను

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ॥ 
ఛందోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ॥ 20 ॥ 
అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకినందనః । 
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ॥ 21 ॥ 
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం ॥ 
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం ॥ 22 ॥ 

DHYANAM

Ksheerodanvath pradese suchimani vilasad saikathe Maukthikanam Malaklupthasanastha Spatikamani nibhai maukthiker mandithanga Shubrai-rabrai-rathabrai ruparivirachitai muktha peeyusha varshai Anandi na puniyadari nalina Gadha sankapanir Mukunda

Let that Mukunda makes us all holy, Who wears all over his body Pearls made of spatika, Who sits on the throne of a garland of pearls, Located in the sand of precious stones, By the side of the sea of milk, Who gets happy of the white cloud, Sprayed of drops of nectar, And who has the mace, the wheel and the lotus in His hands.

ముకుందుడు మనని పవిత్రులను చేయుగాక. అతడు స్పటికముతో కూడిన మణులను ధరించేవాడు; మణులతో చేయబడిన సింహాసనముపై కూర్చొనేవాడు; అతడు మణుల మధ్యలో నివసించేవాడు; అతని చుట్టూ పాల సముద్రమున్నది; తెల్లని మేఘము వలె ఆనందముతో ఉండేవాడు; తేనెను జల్లబడేవాడు; గధ, చక్రము, కమలము చేతిలో ధరించెడివాడు

Bhoo padau yasya nabhi r viyadasu ranila schandra suryaau cha nether Karnavasasiro dhaumugamabhi dhahano yasya vasteyamabhdhi Anthastham yasya viswam sura nara khaga go bhogi gandharva dhaityai, Chitram ram ramyathe tham thribhuvana vapusham vishnumeesam namami.

I bow before that God, Vishnu Who is the lord of three worlds, Who has earth as his feet, Who has air as his soul, Who has the sky as his belly, Who has moon and sun as eyes, Who has the four directions as ears, Who has the land of gods as head, Who has fire as his mouth, Who has the sea as his stomach, And in whose belly play and enjoy, Gods, men birds, animals, Serpent men, Gandharvas, and Asuras.

అతడు ముల్లోకములకు అధిపతి; భూమి అతని చరణాలు; వాయువు అతనికి ఆత్మ; ఆకాశము అతని కుక్షిలో నుండేది; అతడు సూర్యచంద్రులు కన్నులుగా గలవాడు; అతనికి నలు దిక్కుల చెవులున్నవి; దేవలోకము అతని శిరస్సు; అగ్ని అతని నోరు; అతని నాభిలో సముద్రమున్నది; దేవతలు, మనుష్యులు, పక్షులు, జంతువులు, సర్పములు, గంధర్వులు, అసురులు అతని నాభిలో క్రీడించేవారు. అట్టి వానికి నమస్కారము చేయుచున్నాను.

Santhakaram Bujaga sayanam Padmanabham suresam, Viswadharam Gagana sadrusam Megha varnam shubangam Lakshmi kantham kamala nayanam Yogi hrid dyana gamyam Vande vishnum bava bhayaharam sava lokaika nadham.

I bow before the God Vishnu, Who is the personification of peace, Who sleeps on his folded arms, Who has a lotus on his belly, Who is the God of gods, Who is the basis of earth, Who is similar to the sky, Who is of the color of the cloud, Who has beautiful limbs, Who is the consort of Lakshmi, Who has lotus like eyes, Who is seen by saints through thought, Who kills all worries and fears, And who is the lord of all the worlds.

అతడు శాంతికి ప్రతిరూపము; ముడుచుకున్న హస్తాలపై అతడు పరుండి ఉంటాడు; అతని నాభిలో కమలమున్నది; అతడు దేవతలకు దేవుడు; అతడు భూమికి మూలము; అతడు ఆకాశము వంటివాడు; అతడు మేఘము యొక్క వర్ణము గలవాడు; అతని కరములు, చరణములు మిక్కిలి శోభాయమానమైనవి; అతడు లక్ష్మీ దేవి యొక్క భర్త; అతని కన్నులు పద్మమువలె నుండేవి; అతనిని యోగులు ధ్యానము వలన తెలుసుకోబడేవాడు; అతడు అన్ని దుఃఖాలను, భయములను తొలగించేవాడు; అతడు సర్వ లోకాలకు అధిపతి. అట్టివానికి నేను నమస్కారము చేయుచున్నాను

ధ్యానం

క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం 
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః । 
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః 
ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః ॥ 1 ॥ 
భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే 
కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః । 
అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః 
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి ॥ 2 ॥ 

ఓం నమో భగవతే వాసుదేవాయ !

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం । లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥ 3 ॥

Megha syamam Peetha kouseys vasam Srivatsangam Kausthuboth bhasithangam

Punyopetham pundareekayathaksham Vishnum vande sarva lokaika natham.

I bow before that God Vishnu, Who is the lord of all the universe, Who is black like a cloud, Who wears yellow silks, Who has the sreevatsa on him, Whose limbs shine because of Kousthubha, Who has eyes like an open lotus, And who is surrounded by the blessed always.

మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగం । పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం ॥ 4 ॥

నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే । అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ॥ 5॥

పంచపూజ లం – పృథివ్యాత్మనే గంథం సమర్పయామి హం – ఆకాశాత్మనే పుష్పైః పూజయామి యం – వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి రం – అగ్న్యాత్మనే దీపం దర్శయామి వం – అమృతాత్మనే నైవేద్యం నివేదయామి సం – సర్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

Sasanga chakram sakerita kundalam sappeethavastram saraseruhekshanam,

Sahara vaksha sthala shobhi kousthubham namai Vishnum sirasa chaturbhujam.

I bow before the God Vishnu, Who has four arms, Who has a conch and wheel in his hands, Who wears a crown and ear globes, Who wears yellow silks, Who has lotus-like eyes, Who shines because of Kousthbha, Worn in his garlanded chest.

Chayayam Parijatasys hemasimhasanopari, Aseenamam budha syama Mayathakashamalangrutham, Chandranana chathurbahum sreevatsangitha vakshasam, Rukmani Satyabhamabhyam Sahitham Krishnamasraye.

I seek refuge in Lord Krishna, Who is with Rukhmani and Satyabhama, Who sits on a golden throne, In the shade of Parijata tree, Who is of the color of the black cloud, Who has long broad eyes, Who has a face like a moon, Who has four hands, And who has a chest adorned by Sreevatsa.

నేను శ్రీ కృష్నుని శరణు కోరుతున్నాను. అతడు రుక్మిణీ, సత్యభామలతో కూడి యున్న వాడు. అతడు బంగారు సింహాసనముపై పారిజాత వృక్షము ప్రక్క ఆశీనుడయ్యేవాడు. అతడు నల్లని మేఘమువంటి ఛాయ గలవాడు. అతనికి సువిశాలమైన కన్నులు గలవు. అతడు చంద్రునివంటి మోము గలవాడు. అతడు చతుర్భుజుడు. అతడు శ్రీవత్సముని వక్ష స్థలమందు కలిగినవాడు

సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం । సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం । 6॥ ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం ॥ 7 ॥ చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ॥ 8 ॥

పూర్వన్యాసః

అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ॥ 
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః । అనుష్టుప్ ఛందః । 
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా । 
అమృతాంశూద్భవో భానురితి బీజం । 
దేవకీనందనః స్రష్టేతి శక్తిః । 
ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః । 
శంఖభృన్నందకీ చక్రీతి కీలకం । 
శారంగధన్వా గదాధర ఇత్యస్త్రం । 
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం । 
త్రిసామాసామగః సామేతి కవచం । 
ఆనందం పరబ్రహ్మేతి యోనిః । 
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ॥ 
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానం । 
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే పారాయణే వినియోగః । 

కరన్యాసః

విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః నిమిషోఽనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసః

సువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయ నమః సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా సహస్రార్చిః సప్తజిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్ త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్ శాంగధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్ ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః

Vishnu1000 Phalam

ఉత్తర పీఠిక ఫలశ్రుతిః

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః । నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం। ॥ 1 ॥

Bhishma said:

Thus was told, all the holy thousand names of Kesava, who is great.

భీష్మ ఉవాచ

ఈ విధముగా కేశవుని సహస్ర నామములు చెప్పబడినవి

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్॥ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోఽముత్రేహ చ మానవః ॥ 2 ॥

He who hears this daily and whoever recites it shall not attain to any evil, he shall be protected in this world and in the next.

ఈ నామాలను నిత్యము చదివిన వానికి శుభములు కలుగును; అతడు ఈ లోకమునందు, రాబోవు లోకములయందు సంరక్షింప బడతాడు

వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ । వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥ 3 ॥

The Brahmin will get knowledge, the Kshatriya will get victory, the Vaisya will get wealth, the Shudra will get pleasures by reading these.

బ్రాహ్మణులకు జ్ఞానము, క్షత్రియులకు జయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సంతోషము కల్గును

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ । కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజాం। ॥ 4 ॥

He who seeks righteousness obtains righteousness, and he who seeks wealth obtains wealth; he who seeks progeny obtains his desires.

ధర్మమును కోరువానికి ధర్మ ఫలము, ధనమును కోరువానికి సంపద, సంతతి యొక్క వృద్ధిని వారికి కోరికలు తీరును

భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః । సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ॥ 5 ॥

Whichever devoted man, getting up early in the morning and purifying himself, repeats this hymn devoted to Vasudeva, with a mind that is concentrated on Him...

ఎవరైతే ప్రాతః కాలమున నిద్రలేచి, కాలకృత్యములు చేసి, వాసుదేవుని సహస్రనామాలతో పూర్తి శ్రద్ధతో పఠించిన

యశః ప్రాప్నోతి విపులం యాతిప్రాధాన్యమేవ చ । అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం। ॥ 6 ॥

That man attains to great fame, leadership among his peers, wealth that is secure and the supreme good unsupassed by anything...

అతనికి పేరు ప్రఖ్యాతులు, అధికారము, స్థిరమైన సంపద, శుభములు కల్గును

న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి । భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥ 7 ॥

He will be free from all fears and be endowed with great courage and energy and he will be free from diseases.

అతడు భీతి లేక, ధైర్యము, శక్తి గల్గి, సంపూర్ణ ఆరోగ్యముతో నుంటాడు

రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ । భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥ 8 ॥

Beauty of form, strength of body and mind, and virtuous character will be natural to him.

అతడు సౌందర్యము, మనోదేహాలకు శక్తి, మంచి నడవడిక కలిగి యుంటాడు

దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమం । స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥ 9 ॥

A man quickly crosses over difficulties by praising the Supreme Person with a thousand names, ever accompanied by devotion.

ఎవరైతే సహస్రనామాలు భక్తితో పఠిస్తారో వారు కష్టములను శీఘ్రముగా దాటుతారు

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః । సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం। ॥ 10 ॥

A mortal who takes refuge in Vāsudeva and is devoted to Vāsudeva, purified of all sins, attains to the eternal Brahman.

ఎవరైతే వాసుదేవుని భక్తితో పూజిస్తారో, వాసుదేవుని పరమావధిగా కొలుస్తారో వారి సర్వ పాపములు తొలగి బ్రహ్మన్ ని పొందుతారు

న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ । జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే ॥ 11 ॥

There is nothing inauspicious for the devotees of Vāsudeva. They are not afraid of birth, death, old age or disease.

వాసుదేవుని భక్తులకు అశుభములు కలగవు. వారు జరామరణములు, పునర్జన్మము, వ్యాధులుచే భీతి నొందరు

ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః । యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ॥ 12 ॥

One who studies this hymn with faith and devotion will be endowed with happiness, forbearance, prosperity, patience, memory and fame.

ఎవరైతే నిత్యము భక్తితో చదువుతారో వారికి సంతోషము, సంపద, సహనము, జ్ఞాపక శక్తి, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః । భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥ 13 ॥

The devotee of the Lord Purushottama, has neither anger nor fear, nor avarice and nor bad thoughts.

పురుషోత్తమును భక్తునికి క్రోధము, భయము, లోభము, దుష్ట ఆలోచనలు నుండవు

ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః । వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥ 14 ॥

The heavens, the moon, the sun, the stars, the sky, the directions, the earth and the ocean are sustained by the might of the great soul Vasudeva.

ఊర్ధ్వ లోకములు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, ఆకాశము, దిక్కులు, భూమి, సాగరములు, పరమాత్ముడైన వాసుదేవుని శక్తి వలన ఆవిర్భవించినవి

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసం । జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరం। ॥ 15 ॥

All this world, that which moves and moves not, and which has Devas, Rakshasas and Gandharwas, and also Asuras and Nagas, are under the control of Lord Krishna.

మార్పు చెందని, మార్పు చెందే జగత్తు; దేవతులు, రాక్షసులు, గంధర్వులు, అసురులు, నాగులు శ్రీ కృష్ణునిచే నియంత్రింపబడేవి

ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః । వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ॥ 16 ॥

The senses, mind, intellect, Sattva, splendour, strength and patience are said to be composed of Vasudeva, the field and the knower of the field.

ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సత్త్వ గుణము, తేజస్సు, బలము, సహనము అనే గుణములు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఆ వాసుదేవుడే

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే । ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥ 17 ॥

The conduct of all the Vedas is first conceived as the origin of conduct, the Dharma, the Lord of Dharma, the infallible.

వేదములో చెప్పిన ఆచరణ ప్రప్రధమము; ధర్మము, ధర్మమును నిలబెట్టే అధిపతి, అపజయము నొందనివాడు

ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః । జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం ॥ 18 ॥

The sages, the forefathers, the gods, the great beings, the metals, the movable and the immovable, this universe is born of Narayana.

ఋషులు, పితృదేవతలు, దేవతలు, గొప్పవారు, లోహములు, స్తావర జంగములు, సృష్టి నారాయణు నుండి ఆవిర్భవించినవి

యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ । వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ॥ 19 ॥

Yoga, knowledge and also Sāṅkhya, the sciences, crafts and other actions, the Vedas, the scriptures and knowledge, all this comes from Janardana.

యోగ, సాంఖ్య, శాస్త్రములు, కౌశల్యము, వేదాలు, స్మృతులు, శృతులు, జ్ఞానము జనార్ధను వలన ఆవిర్భవించినవి

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః । త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ॥ 20 ॥

Vishnu alone, the Great Being, pervading the three worlds with many separate beings, the Soul of beings, enjoys the expanse of the Enjoyer of the universe.

విష్ణువు ఒక్కడే గొప్పవాడు, ముల్లోకములలో అనేక జీవుల రూపమును దాల్చిన వాడు; జీవులలో ఆత్మ; సృష్టిని అభిలషించేవాడు

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం । పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥ 21 ॥

Any man who desires to attain prosperity and happiness should recite this hymn of Lord Vishnu recited by Vyasa.

ఎవరైతే సంపద, సంతోషములను కోరుతారో, వారు వ్యాస మహర్షి చెప్పిన విష్ణు సహస్ర నామములు స్మరించవలెను

విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం। భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవం ॥ 22 ॥

Those who worship the lotus-eyed Lord of the universe, the unborn God, the Lord of the universe, the inexhaustible, do not get defeated.

ఎవరైతే పద్మము వంటి నేత్రములు గల, ప్రపంచమునకు అధిపతియైన, జన్మించని వాడైన, క్షయము లేనివాడైన విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి పరాజయము కలుగదు

న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి ।

అర్జున ఉవాచ

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ । భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥ 23 ॥

Om Namah Arjuna said — O lotus-petalled, large-eyed, lotus-naveled, best of the gods, be the savior of the devotees who are devoted to you, O Janardana.

పద్మమువలె కన్నులున్నవాడా, పద్మము నాభిలో గలవాడా, దేవతలలో ఉత్తమమైనవాడా, నీ భక్తులను రక్షింపుము జగన్నాథా

శ్రీభగవానువాచ

యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ । సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ॥ 24 ॥ స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి ।

The Lord said:

He who likes, Oh Arjuna, to sing my praise, using these thousand names, should know Arjuna, that I would be satisfied By his singing of even one stanza, without any doubt. Om Nama, without any doubt.

ఎవరైతే నన్ను కీర్తిస్తారో, సహస్రనామాలు స్మరిస్తారో వారు ఒక్క శ్లోకము నమ్మకముతో చదివినా నేను వారి వలన సంతృప్తి చెందుతాను

వ్యాస ఉవాచ

వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం । సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ॥ 25 ॥ శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ।

Vyasa said:

My salutations to you Vasudeva, because you who live in all the worlds make these worlds as places where beings live, and also Vasudeva, You live in all beings as their soul. Om Nama salutations to Vasudeva.

వందనము వాసుదేవా, నీవు సర్వ లోకములు వ్యాపించి వాటిని జీవులకు నివాస యోగ్యము చేసి, వాటిలో ఆత్మగా ఉన్నందుకు పునః వందనము

పార్వత్యువాచ

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకం । పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ॥ 26 ॥ ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే । సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ 27 ॥ శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి ।

Parvathi said:

I am desirous to know, Oh Lord, how the scholars of this world will chant without fail these thousand names, by a method that is easy and quick.

నేను ఈ సహస్రనామములు పండితులు సులభముగా చదువు రీతిని తెలిసికో దలిచాను

Hey beautiful one, I play with Rama always, by chanting Rama Rama and Rama. Hey lady with a beautiful face, chanting of the name Rama, is same as the thousand names. Om Nama Rama Nama Rama.

ఓ సుందరీ, నేను రాముని స్మరణము చేయువాడను; రామ నామ స్మరణము చేయుట వలన కలిగే ఫలితము ఈ సహస్రనామాలు చదివే ఫలితమునకు సమానము

బ్రహ్మోవాచ

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే । సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥ 28 ॥ శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి ।

Brahma said:

Salutations to Thee, Oh lord, Who runs the immeasurable time of thousands of crore yugas, Who has no end, Who has a thousand names, Who has a thousand forms, Who has a thousand feet, Who has a thousand eyes, Who has a thousand heads, Who has a thousand arms, and Who is always there. Om Nama He who runs thousands of crore yugas.

కోట్ల యుగాల కాలమును నడిపించేవాడా, ఆద్యంతములు లేనివాడా, సహస్ర నామములు కలవాడా, అనేక రూపాములలో భాసించేవాడా, అసంఖ్యాకమైన పాదాలు, కన్నులు, శిరస్సులు, కరములు గలవాడా , సదా నిత్యముగా ఉండేవాడా, నీకు నా ప్రణామములు

సంజయ ఉవాచ

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః । తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 29 ॥

Sanjaya said:

Where Krishna, the king of Yogas, and where the wielder of bow, Arjuna, is there, there will exist all the good, all the the victory, all the fame, and all the justice in this world.

ఎక్కడైతే యోగములకు రాజైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ శ్రీ, జయము, కీర్తి, నీతి ఉంటాయి

శ్రీ భగవాన్ ఉవాచ

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే । తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। ॥ 30 ॥ Sri Bhagavan said:

I would take care of worries and cares of him who thinks and serves Me without any other thoughts.

నేను నన్ను స్మరించి, పూజించే వారి దుఃఖములు, అవసరాలు తప్పక తీర్చేవాడను

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం। । ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 31 ॥

I save the righteous and destroy the wicked, and establish righteousness in every age.

నేను సజ్జనులను కాపాడి పాపులను శిక్షిస్తాను; ధర్మాన్ని ప్రతి యుగములో సంస్థాపిస్తాను

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః । సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి ॥ 32 ॥

If he who is worried, sad, broken, afraid, severely ill, if he who has heard tidings bad, sings Narayana and Narayana, all his cares would be taken care of.

దుఃఖముతో ఎవడైతే ఆందోళన, బాధ, ధృడము కాక ఉండుట, భీతి , వ్యాధి మొదలైన వాటితో ఉంటాడో, అతడు నారాయణ నామము స్మరిస్తే అతని అవసరములు నేను తీరుస్తాను

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ । కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ 33 ॥

Whatever I do either by body, speech, mind or sensory organs, either with my personal knowledge or natural trait, I surrender and submit all to that to supreme divine Narayana.

నేను దేహముతో, వాక్కుతో, మనస్సుతో, ఇంద్రియములతో, నాకు కల్గిన జ్ఞానముతో లేక సహజముగా ఏది చేసినా, దానిని నారాయణునికి సమర్పించెదను

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ।

విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ॥

ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక పర్వణి, మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్రం నామైకోన పంచ శతాధిక శతతమోధ్యాయః ॥ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్తం ॥

ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ॥. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...