Friday, April 3, 2026

Wendy Doniger Rig Veda Praising Generosity




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట

10.117   దానగుణ విశిష్టత

10.117   In Praise of Generosity

This hymn, which seems constructed at least in part out of aphorisms, exhorts the worshipper to be generous, both to the gods (through sacrifice) and to the poet (through patronage), as well as to mankind in general. There is also a self-serving level to the advice: fortune is sickle, and the man to whom you give now may have given to you in the past, and may do so again.

ఈ ఋక్కులో ద్రష్ట భక్తులను దేవుని యజ్ఞముల ద్వారా, తనను పోషణ ద్వారా, మానవాళినంతటితో ఉదార స్వభావముతో వ్యవహరించమని అనేక సామెతలతో చెప్పెను. ఇందులో స్వార్థం కూడా ఉంది. ఎలాగంటే ఒక రైతు కొడవలిని మరొకని ద్వారా పొంది ఉండవచ్చు. అతడు వేరొక వాని ద్వారా. అలా చెప్పుకు పోతుంటే కొడవలిని తయారుచేసిన కమ్మరి వరకు పోవచ్చు.

1 The gods surely did not ordain hunger alone for slaughter1; various deaths reach the man who is well-fed. The riches of the man who gives fully do not run out, but the miser finds no one with sympathy.

1. దేవతలు బలికి శిక్షగాఆకలి ఒక్కదాన్నే శాసించలేదు1. కడుపు నిండా తినగలే వానికి అనేక వ్యాధులు ఎదురవుతాయి. దానాలు చేసే వాని ధనము వృధా కాదు. అలాగే పిసిని వానిని ఆదరించే వారెవ్వరూ ఉండరు.

2 The man with food who hardens his heart against the poor man who comes to him suffering and searching for nourishment – though in the past he had made use of him 2–he surely finds no one with sympathy.

2. ఒక ఉన్నవాడు తన ఆశ్రయమును కోరిన పేదవాని యందు కఠిన హృదయంతో ఉంటాడు -- అంటే వాని పేదరికాన్ని నిర్మూలించడానికి కాని, పట్టెడు అన్నం పెట్టడానికి సుముఖంగా ఉండడు. ఆ పేదవాడు గతంలో వానికి సేవకుడు అయి ఉండవచ్చు గాక2. అట్టి ఉన్నవానిని ఎవరూ ఆదరించరు.

3 The man who is truly generous gives to the beggar who approaches him thin and in search of food. He puts himself at the service of the man who calls to him from the road, and makes him a friend for times to come.

3. తన భిక్ష కోరిన శల్యమైన వానిని ఉదార స్వభావము గలవాడు ఆదరిస్తాడు. దారిన పోయే వాడు సహాయాన్ని కోరితే దాత ముందుకు వస్తాడు. తద్వారా ఒక మంచి మిత్రుని పొందుతాడు.

4 That man is no friend who does not give of his own nourishment to his friend, the companion at his side. Let the friend turn away from him; this is not his dwelling-place. Let him find another man who gives freely, even if he be a stranger.

4. తన ప్రక్కనున్న మిత్రునితో తనకున్నదాన్ని పంచుకోనివానికి కాల క్రమేన మిత్రులుండరు. ఆ మిత్రుడు వానిని తిరస్కరించాలి. అది వాడు మన గలిగే ప్రదేశం కాదు. ఒక ఉదారుడైన అపరిచిత వ్యక్తికై వెదకాలి.

5 Let the stronger man give to the man whose need is greater; let him gaze upon the lengthening path3. For riches roll like the wheels of a chariot, turning from one to another.

5. ఒక ఉన్నవాడు తనకన్న ఎక్కువ అవసరముగల వానితో తనకున్నదాన్ని పంచుకోవాలి. అతడు విస్తృతమైన కర్మసిద్ధాంతాన్ని చూడాలి3. ఎలాగంటే సంపద రథ చక్రము వలె ఒకని నుండి మరొకరికి చేరుతుంది.

6 The man without foresight gets food in vain; I speak the truth: it will be his death4. He cultivates neither a patron nor a friend. The man who eats alone brings troubles upon himself alone5.

6. ముందు చూపులేని వానికి ఆహారము వృధా. నేను సత్యమునే పలుకుతున్నాను. ఎందుకంటే వానికి అది మరణం కలిగిస్తుంది గనుక4. అతడు ఒక దాతను గాని, మిత్రునిగాని పొందలేడు. ఎవడైతే ఒంటరిగా ఆహారం భుజిస్తాడో అతడు ఆపదను కొని తెచ్చుకుంటాడు. 5

7 The plough that works the soil makes a man well-fed; the legs that walk put the road behind them. The priest who speaks is better than the one who does not speak. The friend who gives freely surpasses the one who does not.

7.భూమిని దున్నే నాగలి ఒకని ఆకలిని తీరుస్తుంది. రహదారిన నడిచే పాదాలు దూరాన్ని తగ్గిస్తాయి. మంచి మాటలాడే వాడు మౌన వ్రతమునాచారించే మునికన్న మేలు. దాత అయిన మిత్రుడు అందరికన్నా అధికుడు.

8 One-foot surpasses Two-foot; and Two-foot leaves Three-foot behind. Four-foot comes at the call of Two-foot, watching over his herds and serving him6.

8. ఏకపాది ద్విపాదికన్నా మిన్న. ద్విపాది త్రిపాదిని అధిగమిస్తాడు. చతుష్పాది ద్విపాది చెప్పుచేతలలో ఉంటుంది: వాని పశువులను రక్షిస్తూ మరియు వానిని సేవిస్తూ6.

9 The two hands, though the same, do not do the same thing. Two cows from the same mother do not give the same amount of milk. The powers of two twins are not the same. Two kinsmen do not give with the same generosity.

9.రెండు చేతులూ ఒకేలాగ నున్నా, వేరు వేరు కర్మలను ఆచారిస్తాయి. ఒకే తల్లికి పుట్టిన ఆవులు సమ పరిమాణంలో పాలను ఇవ్వవు. కవలల ప్రతిభ ఒకేలాగ ఉండదు. ఇద్దరు దాతలు ఒకే లాగ దానాలు చేయరు.

వివరణ

NOTES

1. The meaning is that hunger does not always kill, and that there are other ways to die; that though the poor are hungry, the rich man should not forget that he too will die, and so he should share his food with the poor and with the gods.

1. దీని అర్థమేమంటే ఆకలి ఎప్పుడూ మరణాన్నే సూచించదు. మరణానికి అనేక కారణాలు ఉంటాయి. ధనవంతుడు మరణం అందరికీ ఆసన్నమయ్యేదే అన్న సత్యాన్ని మరవక ఒక పేదవానిని సమ దృష్టితో చూడాలి. కావున అతడు తన కున్నదాన్ని పేదలతో, మరియు దేవతలతో పంచుకోవాలి.

2. The implication is that the man who is now poor was once powerful, and was flattered and used by the man now rich; the next verse emphasizes the need to foresee future reversals of this kind.

2.దీని నిఘూడ అర్థమేమిటంటే ఒక పేదవాడు గతంలో ధనవంతుడై ఉండగా, ఇప్పుడు ఉన్నవాడు వానిని పొగిడి, వానిని తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. తదుపరి పాదం భవిష్యత్తులో ఇటువంటి "ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం" పరణామాలను దర్శించమని సూచిస్తుంది.

3. The path of life still to come, in which many upsets are possible.

3. జీవితమనే రహదారి ముందున్నది. అది ఎన్నో అవాంతరాలతో కూడి యున్నది.

4. A return to the theme of the first verse : by hoarding food one not only does not avoid death, but brings upon oneself the loss of one’s future happiness.

4. మొదటి పాదంలో చెప్పినదాన్నే మరొక విధంగా చెప్పబడింది. ఆహారాన్ని పోగుచేస్తే ఒకడు మరణాన్ని జయించలేకపోవడం గాక కనీసం సంతోషాన్ని కూడా పొందలేడు.

5. By committing the sin of greed, he brings upon himself evils such as poverty and hunger.

5.పేరాశ అనబడే పాపము వలన పేదరికం, ఆకలి బ్రతుకులు కలుగుతాయి.

6. In the Greek riddle of the sphinx, man walks first on four feet (the crawling baby), then on two feet (the mature man), and nally on three feet (the old man with a cane). In this Indian variant of the riddle, One-foot is the sun (an enigmatic but widespread Vedic theme), Two-foot the human, Three-foot the old man with a cane and Four-foot a dog. In later tradition, the four Ages of man are characterized by the fact that Dharma walks on four, three, two feet, and one foot, as time degenerates.

6. గ్రీకు చరిత్రలో మనిషి పిల్లవాడుగా నాలుగు కర్మేంద్రియాలతో పాకి, యువకునిగా రెండు కాళ్లతో నడిచి, ముసలితనంలో ఒక కర్రను ఊతగా మూడవ పాదంగా చేసుకొంటాడు అని చెప్పబడినది. మన శాస్త్రాల ప్రకారం ఏకపాది అనగా సూర్య భగవానుడు. ద్విపాది అనగా మనిషి. త్రిపాది అనగా ఊత కర్రతో నడిచే మనిషి. చతుష్పాది అనగా ఒక శునకము లేదా గోవు. పురాణాల్లో ఈ నాలుగు దశలను ధర్మాన్ని ఉద్దేశించి చెప్పేరు. అంటే సత్య యుగంలో ధర్మం నాల్గు పాదాలతో, త్రేతా యుగంలో మూడు పాదాలతో, ద్వాపర యుగంలో రెండు పాదాలతో, చివరికి ప్రస్తుత కలి యుగంలో ఒకే పాదంతో నిలిచి యున్నదనే సూక్తి అందరికీ విదితమే.

Wendy Doniger Rig Veda Praising Generosity

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...