Friday, March 20, 2026

Wendy Doniger Rig Veda Lament of a Bard




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Parts Of Yagna

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
యజ్ఞ భాగములు

10.33 వృద్ధ గాయకుని వేదన

10.33 Lament of the Aged Priest

A bard has lost his patron, King Kurusravana, whose son, Upamasravas, has succeeded to the throne and no longer employs the old man. The bard invokes Indra (the quintessential generous patron), tries to arouse the young king�s pity, and even employs veiled threats to avenge the (perhaps untimely?) death of the old king (vv. I, 8). Finally, he is resigned to his fate (v. 9).

ఒకడు కురుశ్రవనుడనే రాజు ఆస్థానంలో గాయకుడుగా ఉండేవాడు. కొంత కాలం తరువాత ఉపమశ్రవసునడనే యువరాజు రాజ్యాధికారం చేబట్టి ఆ గాయకుడిని పదవిలోనించి తొలగించేడు. ఆ గాయకుడు ఇంద్రుని స్తుతించి ఉపమశ్రవసుని దయకై ఎదురు చూసేడు. కానీ రాజు చలించ లేదు. గాయకుడు రాజుని తండ్రి మరణానికి కారకుడని కూడా నిందించేడు. అయినా ఫలితం శూన్యం. చివరకు అతడు విధితో రాజీ పడ్డాడు.

1 The harnessers of the people1 have harnessed me; I carry Pusan along the way2. All the gods protected me. Then a cry arose: "An evil taskmaster is coming!"

1. జీవులను నియంత్రించే1 వాడు నన్ను కూడా నియంత్రించేడు. నేను పూసుని మోసేను2. దేవతలందరూ నన్ను రక్షించేవారు. ఒక కర్కశమైన ఆర్తనాదం వినిపించింది. ఒక దుర్మార్గుడు వస్తున్నాడు.

2 My ribs encircle me with pain like rival wives; poverty, nakedness, weakness bind me. My mind flutters here and there like a bird.

2. నా ప్రేగులు నన్ను శత్రువులైన భార్యలవలె చుట్టుముట్టేయి. పేదరికం, దిగంబరత, బలహీనత నన్ను ఆవహించేయి. నా మనస్సు పక్షి వలె అటునిటూ తిరుగుతోంది.

3 As rats gnaw at their tails, cares gnaw at me, your singer of praises, O lord of a hundred powers3. Have mercy on us once more, generous Indra, and be like a father to us.

3. తమ తోకలను కొరుక్కొనే ఎలుకులు తీరుగా నన్ను కోర్కెలు బాధిస్తున్నాయి, ఓ సహస్రములైన మానవాతీత శక్తులు గల దేవా3. ఓ దయగల ఇంద్రా, మాపై తండ్రి వలె కరుణ చూపించు.

4 As a sage I chose as my king Kurusravana the descendant of Trasadasyu, most generous to those who offer prayer,

4. ఒక మునినై యుండి, నేను అమిత దయామయుడైన, త్రసదాస్యు కుమారుడైన కురుశ్రవణుని ఆశ్రయం కోరేను.

5 whose three bays carry me in this chariot toward better times4. I will praise him who gave a thousand cows to the priests5,

5. వాని రథం నన్ను ఆనంద భరిత దూర తీరాలకు4 చేరిస్తుంది. పండితులకు5 వందలాది పశువులను దానం చేసిన వానిని పొగడెదను.

6. Upamasravas's father, whose words were sweet as a field is a delight to the one who lives on it.

6.ఉపమశ్రవసుని తండ్రి యొక్క తీయని పలుకులు సర్వులను రంజింపజేసేవి.

7 Upamasravas, his son, and grandson of Mitratithi6 remember I am the one who sang the praises of your father.

7. ఓ మైత్రతిథి6 మనవడైన ఉపమశ్రవసా, నీ తండ్రిని పొగిడినవాడిని నేనేనని గుర్తుతెచ్చుకో.

8 If I had power over the immortals or over mortals, my generous patron would be alive.

8. నాకే గాని దేవతల శక్తులు ఉండే వుంటే నా రాజు బ్రతికి ఉండేవాడు.

9 No one lives beyond the decree of the gods, not even if he has a hundred souls7. So I am parted from my companion.

9. ఎవ్వరూ దేవతల శాసనాన్ని అతిక్రమించ లేరు. వంద ఆత్మ7 లున్న వారికైనా అసాధ్యం. కాబట్టి నేను నా మిత్రుని నుండి విడబడ్డాను.

NOTES

వివరణ

1. Perhaps the gods are meant, as they are said to have protected the singer.

1. బహుశా దేవతలను ఉద్దేశించినది. ఎందుకంటే గాయకుడు వారిని రక్షకులుగా భావించేడు.

2. The singer, who imagines himself as the horse harnessed to the king's chariot, further imagines Pusan, the charioteer of the gods, riding in it.

2. గాయకుడు తనను రాజు యొక్క రథానికి పూన్చిన గుర్రములలో ఒకనిగా భావించి యుండవచ్చు. దేవతల రథ సారథి యైన పూసనుడు ఆ రథాన్ని నడిపేవానిగా ఊహించెను.

3. An epithet of Indra.

3. ఇంద్రుని ఉద్దేశించి పలికినది.

4. Now that the tables are turned (the old king being dead), the singer is himself in the chariot, pulled by he king's horses that are all he has left of his patronage.

4. ఎప్పుడైతే రాజు మరణించేడో, గాయకుడే తన కంటూ మిగిల్చిన గుర్రాలతో లాగబడే రథాన్ని అధిరోహించేడు.

5. Perhaps a subtle hint to Upamasravas to do the same.

5. బహుశా ఉపమశ్రవసుని అదే చేయమని అర్థిస్తున్నాడు.

6. Perhaps another name for Trasadasyu, the ancestor of Kurusravana. The name, meaning "guest of a friend", has significance for the poet.

6. బహుశా త్రశదస్యు యొక్క మరొక నామము లేదా కురుశ్రవనుని పూర్వీకుడు. ఆ పేరు "మిత్రుని అతిథి" అని అర్థము కలిగి తనకు మిక్కిలి మక్కువ కలిగించేదని సూచించెను.

7. Atman is the soul or the breath of life, as we might say that a cat has nine lives.

7. ఆత్మ సూచించ బడినది. ఎలాగైతే ఒక పిల్లికి అనేక జన్మలు కలదని ఆంగ్లంలో సామెత ననుసరించి.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Lament of a Bard

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...