|
|
|
|
Table Of Contents
CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
10.101 యజ్ఞ హోతలు
10.101 The Sacrificial Priests
This hymn is a kind of work-song for priests, likening their ritual work to the work of the farmers in the field, as well as to other occupations (such as weaving, v. 2, and chariot racing, v. 7) and pastimes (such as sexual play, vv. 11-12).
ఈ మంత్రము యజ్ఞమాచరించే హోతలకు జానపదము వంటింది. వారు రైతులు, సాలెవారు, రథికులు, తక్కిన కులవృత్తులు సాగించే వారి వలె తమ దిన చర్యను చూసేరు.
1 Wake up with one mind, my friends, and kindle the fire, you many who share the same nest.1 I call Dadhikra and Agni and the goddess Dawn, all joined with Indra, to help you.
1. మేల్కోండి మిత్రులారా. నాతో సహవాసము1 చేసే వారలారా మేల్కొని అగ్ని రగిలించండి. నేను మీకు సహాయము చేయుటకై దధిక్ర, అగ్ని, ఉషస్సు, ఇంద్రునితో సహా రమ్మని ప్రార్థిస్తున్నాను.
2 Make your thoughts harmonious; stretch them on the loom; make a ship2 whose oars will carry us across; make the weapons ready and set them in place3; drive the sacrifice forward4, my friends.
2. మీ ఆలోచనలను కేంద్రీకరించుకోండి. వాటిని మగ్గాలపై నేయండి. ఆవలి ఒడ్డుకు చేర్చే పడవ2 తెడ్డులవలె పని చేయండి. ఆయుధాలను సిద్ధము చేసి ఒక చోట3 చేర్చండి. యజ్ఞాన్ని ముందుకు నడిపించండి, మిత్రులారా.
3 Harness the plough and stretch the yoke on it; sow the seed in the prepared womb. And if the hearing of our song is weighty enough5, then the ripe crop will come nearer to the scythes.
3. నాగలిని చేకొని కాడిని పూన్చండి. యోనిలో బీజమును నాటండి. మన పాట ఆర్తితో5 కూడిన దైతే పంట త్వరలోనే కోతకు వస్తుంది.
4 The inspired poets who know how harness the plough and stretch the yokes on either side to win favour among the gods.
4. నాగలిని ఎలా పూన్చాలో, కాడిని ఎలా తగిలించాలో తెలిసిన వివేకవంతులైన గాయకులు దేవతల కరుణకు పాత్రు లయ్యెదరు.
5 Make the buckets ready and fasten the straps well. We want to draw water from the fountain that is easy to draw water from, owing freely, inexhaustible6.
5. బిందెలను సిద్ధము చేసి వాటిని త్రాళ్ళతో కట్టండి. వాటితో మనము తోడుటకు వీలైన, అవ్యయమైన6, దైవ ప్రసాదితమైన జలధుల నుండి నీటిని తోడెదము.
6 I draw water from the fountain whose buckets are in place, with good straps, easy to draw water from, freely flowing and inexhaustible.
6. నేను మంచి త్రాళ్ళతో కట్టబడిన బిందెతో సునాయసంగా తోడుకోగల, అక్షయమైన, ప్రవహించే జలధుల నుండి నీటిని తోడెదను.
7 Keep the horses happy and you will win the stake. Make your chariot into the vehicle of good fortune. Drink at the fountain that has Soma-vats for buckets, a pressing-stone for its wheel, a consecrated goblet for its casing; this is the fountain where men drink.
7. అశ్వాలను ఆనంద పరచి గుంజెను సాధించండి. మీ రథాన్ని మంగళకరమైనదిగా చేయండి. సోమము చేసే పాత్రలు గలిగిన, సోమాన్ని పిండే రాళ్ళను చక్రములుగా గల, శుద్ధమైన త్రాగే పాత్ర చుట్టూరావున్న జలధి వద్ద సోమ పానము చేయండి. ఇక్కడే అసలైన మగవాళ్ళు త్రాగుతారు.
8 Make an enclosure7, for this is a drink for men. Stitch the breast-plates thick and broad. Make iron forts that cannot be breached; make your goblet strong so that nothing will flow out.
8. ఇది మగవాళ్ళకయి చేసిన పానీయము కావున వలయాకారముగా గుమి గూడండి7. కవచాలను దగ్గిరకు చేర్చి, ఒక అభేద్యమైన కోట వలె చేయండి. మీ త్రాగే పాత్రను పానీయమును చిందించని విధముగా గట్టిగా చేయండి.
9 I turn toward our cause here your sacrificial attention, gods, your divine thought that is disposed toward sacrifice and worthy of sacrifice. Let the great cow 8 give us milk in thousands of streams of milk, as if she were walking in a meadow.
9. నేను మనము యజ్ఞము చేసే కారణము వైపు మీ దృష్టిని మళ్లించిగా, మన ప్రార్థనలు విని దేవతలు మన మాచరించే యజ్ఞమునకు సుముఖులై యుండెదరు. ఘనమైన గోమాత8 తన సహస్రములైన పొదుగులతో, పచ్చిక భూమిలో ఉన్నట్లు వలె, మనకు పాలను ఇస్తుంది.
10 Pour the tawny one9 into the lap of wood; carve it with knives made of stone. Embrace it all around with ten girths; yoke the draught animal to the two shafts10.
10. బంగారు వర్ణముగల9 దానిని కర్రలతో కలపండి. రాయితో చేసిన కత్తులతో దానిని చెక్కండి. పది మొలల విశాలముతో దానిని హత్తుకోండి. బలి పశువుని రెండు పిడికలల మధ్య కట్టండి. 10
11 The draught animal is pressed tight between the two shafts, like a man in bed with two women. Stand the tree up in the wood; sink the well deep without digging11.
11. ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలతో సంభోగించువాని వలె, బలి పశువును రెండు పిడికలల మధ్య బంధించ బడినది. వృక్షాన్ని చెక్క పై ఎత్తండి. త్రవ్వ కుండా11 బావిని లోతుగా చేయండి.
12 The penis, men, take the penis and move it and stick it in to win the prize12. Inspire Indra, Nistigri’s son13, to come here to help us, to come eagerly to drink Soma.
13. పురుషాంగమును దానిలో ప్రవేశపెట్టి బహుమతిని12 పొందండి. ఇంద్రుని, నిస్త్రిగ్రి పుత్రుని,13 మనకి సహాయము చేయమని అడగండి. ఇక్కడకు వచ్చి సోమ రసాన్ని ప్రీతితో త్రాగమని ఆహ్వానించండి.
వివరణ
NOTES
1. This term denotes companions in general, but here may literally indicate a group of priests who live together. Cf. 10.5.2.
1. ఇది మైత్రిని సూచిస్తుంది. కానీ ఇక్కడ సహవాసము, అనగా ఒకే ప్రదేశంలో నివసించే హోతలుగా చెప్పబడినది.
2. The ship that carries the worshipper ‘to the other shore’ is a common metaphor; here there may be a pun between ship and shuttle (‘little ship’, in Sanskrit), from the first part of the verse.
"ఆవలి గట్టును చేర్చే పడవ" అనేది వాడుకలో సర్వ సాధారణం. కానీ ఇక్కడ దాన్ని వక్రీకరించే విధంగా పురుషాంగమును సూచించ వచ్చు.
3. The weapons are the instruments of the ritual; here the priest’s work is likened to that of a warrior, as in verse 8.
3. ఆయుధాలనగా యజ్ఞానికి వాడే పనిముట్లు. ఇక్కడ హోతల పని యుద్ధంలో పోరాడే యోధులతో పోల్చబడినది. (8 వ పాదం వలె)
4. The sacrifice as a chariot, as in verse 7; cf. .1.164, 10.135, etc.
4. యజ్ఞము ఒక రథము వంటిది (7 వ పాదం). 1.164, 10.135
5. That is, if the patrons pay well enough for it, the sacrifice will yield a harvest as rich as a grain harvest in which the plants bend to the scythe.
5. యజ్ఞము చేసే యజమానులు ఉదారంగా పారితోషకము ఇస్తే మంచి కోతకు వచ్చిన పంట పండి నట్లు
6. The fountain of inspiration and the well of Soma.
6. శక్తిని ప్రసాదించేది మరియు సోమముతో గూడిన నిధి.
7. That is, a walled fortress or a cow-pen, to protect Soma the bull. A series of martial metaphors follows in this verse.
7. సోమ అనే ఎద్దును రక్షించుటకు కట్టుదిట్టమైన కోట ప్రహరీ లేదా గోశాల.
8. The cow as a symbol of the inspiration implicit in the thought of the gods.
8. దేవతల ఉద్దేశంలో గోమాత శక్తివంతమైనదని అంతర్లీనముగా సూచింపబడినది.
9. Soma, here imagined as a sacrificial animal. The knives of stone are the pressing stones. Cf. 10.94.3.
9. ఇచ్చట సోమ రసము బలి పశువుగా భావించ బడినది. రాతితో చేయబడ్డ కత్తులనగా సోమ రసమును పిండే రాతి రోలు.
10. The two shafts are the two hands that hold the Soma; the ten girths are the ten fingers.
10. రెండు పిడికలులు సోమరసమును ధరించే రెండు చేతులు. పది మొలలు అనగా పది వేళ్ళు.
11. A triple entendre: the tree in the wood (forest) is the Soma plant in the wooden bowl and the penis in the womb, the latter simile extended in the last quarter of the verse, that further echoes the imagery of verses 3, 5, 6, and the final verse.
11. అడవి లోని వృక్షము చెక్క పాత్రలోని సోమ వృక్షమునకు మరియు యోనిలో నుండే పురుషాంగములకు సూచితము .
12 A sexual metaphor for Soma pressed in the mortar and pestle.
12. సోమ రసమును పిండే రోలు మరియు దాని యందు తిప్పే రాయి లైంగిక పరమైన ఉదాహరణతో సూచింప బడినవి.
13. Indra is the son of Aditi, who may be called Nistigri (‘swal- lower of the rival wife’) as she overcomes her rival, Diti. Cf. 10.145.
13. అదితి పుత్రుడైన ఇంద్రుని మరొక నామము నిస్తిగ్రి
No comments:
Post a Comment