Friday, August 28, 2026

Wendy Doniger Rig Veda Pressing Stones




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట

10.94   The Pressing-Stones

10.94   సోమ రసమును పిండే రాళ్ళు

A hymn to the stones that press the Soma juice. The noise that they make while grinding the stalks of the plant, and their action in devouring (i.e. destroying) the fibres while releasing the juices, suggest the actions of animals (cows, bulls, horses) that growl or bellow and swallow the liquid.

ఈ ఋక్కులో సోమ రసము తయారు చేయుటకు వాడబడే రుబ్బుడు రాళ్ళు గూర్చి వివరింపబడినది. సోమ కాండములనుండి రసము తీయునప్పుడు వచ్చే శబ్దము, రాళ్ళ ద్వారా రసము పీల్చుట వలన కలిగే శబ్దము గోవులు, ఎద్దులు, గుర్రములు మొదలైన జంతువులు చేసే శబ్దాలతో పోల్చబడెను.

1 Let them1 raise their voices, and let us raise our voices. Speak your speech2 to the stones that speak, when you stones, you mountains full of Soma, rush to bring the rhythmic sound to Indra.

1. వాటి వలె మనము గొంతెత్తి పాడెదము1. మాట్లాడే రాళ్ళతో మాట్లాడు2. ఆ రాళ్ళు అమితమైన సోమ రసమును కలిగి, ఇంద్రునికి మన పాటను వినిపింపజేస్తాయి.

2 They speak in a hundred ways, a thousand ways, howling with their green jaws.3 Working busily and well to do the good work, the stones have succeeded in eating the oblation even before the priest of the oblation.

2.పచ్చని దవడలతో3 అవి అగణిత విధములుగా శబ్దములు చేయును. ఒక క్రమములో నిరంతరమూ మంచి కార్యమునకై పని చేస్తూ ఆ రాళ్ళు ఋత్విక్ ఆహుతి ఇచ్చే ముందే దానిని గ్రహిస్తాయి.

3 They speak: they have found the honey. They growl and gnaw on the cooked meat.4 As they snap at the branch of the red tree,5 the bulls who have grazed well begin to bellow.

3.అవి ఇలా మాట్లాడుతాయి: మకరందమును కనుగొంటిని. అవి వండిన మాంసమును పచనము చేస్తూ శబ్దాలు చేస్తాయి.4 ఎర్రని చెట్టు కొమ్మను రుబ్బుతూ ఉంటే, బాగా పచ్చిక మేసిన ఎద్దులు ఘీంకారములు చేస్తాయి.

4 They speak loudly, excited by the exhilarating drink. They shout to Indra: they have found the honey. Artfully they danced with the sisters that embrace them,6 making the earth echo with their stampings.

4.హుషారునిచ్చే పానీయము వలన అవి పెద్దగా శబ్దములు చేస్తాయి. అవి ఇంద్రునికి వినపడే టట్లుగా మేము మకరందమును కనుగొంటిమి అని అరుస్తాయి. రసవత్తరముగా వాటి దరి చేరిన6 అక్కాచెల్లెళ్లతో నాట్యము చేస్తూ, భూమిని తమ పాదములతో ప్రతిధ్వనింప జేస్తాయి.

5 The eagles have sent their cry up to the sky. Ardently the dark hinds danced in the meadow. They plunge deep to the rendezvous with the lower stone; they infuse it with floods of the seed of the sun-bright one.7

5.గ్రద్దలు ఆకాశంలో కూసేయి. ఆడ జింకలు పచ్చికలో నాట్యం చేసేయి. అవి లోతుగా పయనించి క్రిందనుండే రాళ్ళతో కలిసేయి. అవి సూర్యప్రకాశవంతుడైన వాని7 వీర్యాన్ని వాటితో కలుపుతాయి.

6 Like brawny draught animals yoked together, these bulls bear the shaft and pull as a team. When they bellow, panting and chewing the cud, they sound like racehorses whinnying.

6. బలిష్టమైన జంతువులచే పూన్చిన బండి వలె, ఈ ఎద్దులు వాటిని జతగా లాగుతాయి. అవి ఆయాస పడుతూ, నెమరు వేస్తూ చేసే శబ్దాలు గుర్రపు శకిలింపులవలె ఉంటాయి.

7 Sing to them that have ten girths,8 ten yoke-straps, ten harnesses, ten reins that never wear out, to them that are yoked ten times to bear ten shafts.

7. పది వేళ్ళ వెడల్పు గల8 , పది త్రాళ్ళతో పూన్చబడిన, పది జీన్లు గల, ఎప్పటికీ తరిగి పోని పది కళ్ళేలు గల, పది గానుగులకు పది మార్లు కట్టబడిన వాటికై పాడండి.

8 The stones are swift horses; their bridle with ten thongs fits them comfortably. They have tasted the filtered juice of the first pressing of the Soma juice milked from the stalk.

8.ఆ రాళ్ళు పందెము గుర్రముల వంటివి; వాటిపై అమర్చబడిన ఆసనము పది తోళ్ళు గలిగి సుఖముగా నుండెడిది. సోమ కాండము నుండి తాజాగా పిండబడిన రసమును అవి ఆస్వాదించినవి.

9 These Soma-eaters kiss Indra’s pair of bays. As they milk the stalk they sit upon the ox.9 When Indra has drunk the honey they have milked he grows great and acts like a bull.

9. ఈ సోమ భక్షకులు ఇంద్రుని కోవలను చుంబిస్తారు. కాండమును పిండుతున్నప్పుడు అవి ఎద్దును అధిరోహించి ఉంటాయి9 . అవి పిండిన రసమును ఇంద్రుడు గ్రోలినప్పుడు అతడు వర్ధమానుడై వృషభము వలె ప్రవర్తిస్తాడు.

10 Your stalk is a bull; surely you will not be harmed. You are always over owing with nourishment, sated with food. You are lovely in your splendour like the daughter of a rich man at whose sacrifice you stones rejoice.

10. నీ కాండము వృషభము; నీకు ఏ ఆపదా రాదు. నీకు తగిన పోషకములు అందుతూ, సదా ఆహారముతో నిండి ఉంటావు. నీవు ధనవంతుని కుమార్తె వలె సదా సుందరముగా నుండి, వాని యజ్ఞములో సంతోషముగా నుండెదవు.

11 Porous or not porous, the stones never tire, never rest, never die; they are never sick or old or shaken by passion; nicely fat, they are free from thirst and desire.

11.అంతరాలు కలిగి ఉన్నా లేక పోయినా, రాళ్ళు ఎప్పటికీ అలసి పోవు, విశ్రాంతి కోరవు, మరణించవు; అవి రుగ్మత పొందవు, వృద్దులు కావు, కామముతో ప్రవర్తించావు; తగు మోతాదులో లావుగా నుండి, దప్పిక మరియు కోరికలు లేకుండా ఉంటాయి.

12 Your fathers10 are entirely firm in age after age; peace-loving, they do not budge from their spot. Untouched by age, the companions of the tawny one11 are like the saffron tree;12 they have made the sky and the earth listen to their uproar.

12. మీ తండ్రులు 10 వృద్ధాప్యంలో గూడా ఆరోగ్యంగా ఉంటారు; శాంతిని కోరేవారు; వారి స్వస్థానమునుండి చలించరు. వయస్సుతో మార్పు చెందక, బంగారు వర్ణముగలవాని 11 మిత్రులుగా గల వారు గంధపు చెట్టు వలె నుండెదరు12 . వారి కేరింతలతో భూమ్యాకాశములను ప్రవర్తింప జేస్తారు.

13 The stones speak the same when they are unyoked and when they are on their journey, with their stampings like the noises of men who drink deeply. Like those who sow seed and grow grain, they gobble up the Soma without diminishing it as they lap it up.

13.ఆ రాళ్ళు పూన్చబడనప్పుడు కూడా అదే విధముగా మాట్లాడతాయి; అవి కదులుతున్నప్పుడు, తాగుబోతుల అడుగుల వలె ప్రతిధ్వనిస్తాయి. విత్తుని నాటి, ధాన్యమును పండించు వారల వలె, అవి సోమమును కొరత లేకుండా గ్రహిస్తాయి.

14 They have raised their voices for the sacrificial juice, like playful children jostling a mother. Set free the inspiration of the one who presses Soma, and let the stones that we hold in awe return to being stones.13

14.తల్లులను ఆట పట్టించే పిల్లల వలె, వారు సోమ రసమునకై ఉత్సాహముగా ధ్వనులు చేసేరు. మనకు ఆశ్చర్యము కలిగించే సోమ రసమును పిండే వాటి ఉత్సాహమును కట్టడి చేయక వాటి స్వస్వరూపములో ఉంచెదము13 .

NOTES

వివరణ

1. The stones are first referred to, and then are addressed after the priests, at the end of the verse.

1. మొదట రాళ్ళను సూచించగా, పాదాంతములో ఋత్విక్కుల తరువాత సూచింపబడెను.

2. Here the poet addresses the priests, whose chants of invocation to Indra are equated with the noise of the stones that Indra hears.

2.ఋత్విక్కుల నుద్దేశించి, వారు ఇంద్రునికై పలికే మంత్రాలను ఇంద్రుడు వినే రాళ్ళ శబ్దాలతో పోల్చెను.

3. Their jaws are green with the juice of the Soma plant, also called yellow, red (as in v. 3), or tawny.

3. సోమ రసము కారణముగా వారి దంతములు పచ్చని వర్ణము కలిగినవి.

4. Soma is here imagined as a sacrificial animal eaten by the stones.

4. రాళ్ళతో పచనము చేయబడే సోమ ఇచ్చట బలి పశువుగా ఊహించబడినది.

5. Soma.

5. సోమ

6. The ten fingers that hold the stones.

6. రాళ్ళను పట్టి ఉంచే పది వేళ్ళు

7. Soma.

7. సోమ

8. The ten fingers again, here imagined as draught animals as in the previous verse.

8. పది వేళ్ళు; క్రిందటి పాదము వలె పశువులుగా ఊహించబడెను

9. The Soma stalks are placed upon an oxhide.

9. సోమ కాండములు ఎద్దు చర్మముపై ఉంచబడెను

10. The mountains, as in verse 1, are the fathers of the stones.

10. మొదటి పాదము వలె పర్వతాలు రాళ్ళ తండ్రులు

11. Soma is the tawny one; as he grows in the mountains, they are his companions.

11.బంగారు వర్ణము గలది సోమ; అది పర్వతములలో ఉండేది కనుక, అవి దాని మిత్రులు

12. The stones (or the mountains) become yellow through contact with Soma.

12. రాళ్ళు (పర్వతాలు) సోమ కారణంగా బంగారు వర్ణము కలిగి ఉంటాయి.

13. That is, lose those awesome qualities that they took on during the ritual and return to being mere stones. The ritual objects must be desanctified after the ritual.

13. యజ్ఞ క్రమములో అనేక భావములు కలిగిన రాళ్ళు తమ స్వస్వరూపము పొందుట.

Friday, August 21, 2026

Wendy Doniger Rig Veda Extraction Of Soma




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ

9.74   Soma Pressed in the Bowls

9.74   సోమ రసము

This hymn describes in metaphors the pressing of Soma in the Soma-bowls and the pouring of the juices through a filter made of wool.

ఈ ఋక్కులో సోమ రసమును తయారు చేయు ప్రక్రియ అనేక ఉపమానములతో వర్ణించబడినది.

The processes are likened to the milking of rain out of the clouds and the downpouring of the torrents upon the earth; to the pouring of seed into a womb to produce children;

ఈ ప్రక్రియ మేఘములనుండి వర్షమును కురిపించుట, వీర్యముతో గర్భ శిశువుని తయారు చేయుట మొదలైన వాటితో పోల్చబడినది.

In addition to their function as metaphors, these images serve also to express the goals of life that the poet hopes will be achieved by the Soma sacrifice: rain, fertility, and wealth.

ఇవి ఉదాహరణముల వలెనె మాత్రము కాక, సోమ యజ్ఞము వలన పొందబడే కామ్య వస్తువులు అనగా వర్షము, సంతతి మరియు సంపద సూచింపబడినవి.

Cows appear in all of these metaphors : as symbols of the milk or water with which the Soma is mixed; as clouds from which rain is milked; as women who bear children; and as the prize to be won by the racehorse.

గోవులు అనేక చోట్ల ఉదహరింపబడినవి: వాటి పాలు లేదా సోమ రసము తయారు చేయుటకై ద్రవ పదార్థము; మేఘములనుండి వర్షమును పితుకుట; సంతతిని కలిగిన స్త్రీలు; గుర్రపు పందేలలో గెలుచుట.

Soma appears sometimes as a male animal (calf, horse, bull), sometimes as a female (identified with the cows), like Parjanya and Agni in other hymns;

సోమ కొన్ని చోట్ల పురుష లింగమైన దూడ, గుర్రము లేదా వృషభములుగా వర్ణింపబడగా, మరి కొన్న చోట్ల స్త్రీ లింగమైన గోవుగా లేదా పర్జన్య మరియు అగ్నిగా కూడా వర్ణింపబడెను.

he is further identified with more abstract and general forms such as the navel of Order, the pillar of the sky (here identified with the stalk of the Soma plant), and the pasture or lap of Aditi – the highest heaven (here identified with the Soma bowl).

సోముని ఆకాశమునకు ఆధారముగా నుండే స్థంబముగా (సోమ వృక్షము యొక్క కాండము), పచ్చిక లేదా అదితి వొడి సూచించే స్వర్గము (సోమ రసముండే పాత్ర).

The metaphors intertwine in many ways, as when rain is called the seed of the sky or the water in the bowl is called a wave of the cosmic ocean.

వర్షము ఆకాశము యొక్క వీర్యము లేదా పాత్రలో నుండే ద్రవము దేవలోకములోని సముద్రము యొక్క అల అనబడే ఉపమానములతో కూడ సోమ రసము వర్ణింపబడెను.

1 Like a new-born child he bellows in the wood,1 the tawny racehorse straining to win the sun. He unites with the sky’s seed that grows great with milk.2 With kind thoughts we pray to him for far-reaching shelter.

1.అప్పుడే జన్మించిన శిశువు యొక్క ఏడుపు వలె, సూర్యుని పొందవలెననే కాంక్షతో పరిగెత్తే గుర్రము వలె అతడు శబ్దము చేయును1 . అతడు పాలతో వృద్ధినొందిన ఆకాశము యొక్క వీర్యముతో ఏకమవును.2 ఆశ్రయమును కోరి మేము అతనిని దయతో సేవించెదము.

2 He who is the pillar of the sky, the well-adorned support, the full stalk that encircles all around, he is the one who by tradition sacrifices to these two great world-halves. The poet3 holds together the conjoined pair, and the refreshing foods.

2.ఆకాశమునకు ఆధారమైన స్థంబము వలె, అన్ని దిక్కుల వ్యాపించే కాండము వలె నుండి, అతడు భూమ్యాకాశములకై శాస్త్ర రీతిన యజ్ఞము చేయును. ద్రష్ట 3 కవలల వలె నుండే వాటిని మరియు అపురూపమైన ఆహారమును చేత పట్టుకుని యుండును.

3 The honey of Soma is a great feast; the wide pasture of Aditi is for the man who follows the right way. Child of dawn, the bull who rules over the rain here, leader of the waters, worthy of hymns, he is the one who brings help here.

3.తేనె వలె నుండే సోమము విందులో వాడెదము; అదితి యొక్క విశాలమైన ఒడి సన్మార్గములో నడుచువానికి. ఉషస్సు యొక్క శిశువు, వర్షమును శాసించే వృషభము, జలముల యొక్క అధిపతి, ఋక్కులతో పొగడబడే వాడు, మనకు సహాయము చేయును.

4 Butter and milk are milked from the living cloud; the navel of Order, the ambrosia is born. Together those who bring fine gifts satisfy him; the swollen men4 piss down the fluid set in motion.

4.జీవించి యున్న మేఘము నుండి నెయ్య మరియు పాలు పితుక బడెను; ఆ విధముగా అమృతము జన్మించెను. వాటితో కలిపి, బహుమతులు తెస్తే వానికి సంతృప్తి కలుగును. లావైన పురుషులు 4 కదిలింపబడిన ద్రవమును విసర్జించెదరు.

5 The stalk roared as it united with the waves5 for man he swells the skin that attracts the gods. He places in the lap of Aditi the seed by which we win sons and grandsons.

5.కాండము అలలతో మిళితమై ఘర్జించగా, పురుషుడు దేవతలను ఆకర్షించే ఉబ్బిన చర్మము పొందెను.5 అతడు అదితి ఒడిలో నుంచబడిన బీజము వలన మనము పుత్రులను, పౌత్రులను పొందెదము.

6 Relentlessly they6 flow down into the alter of a thousand streams; let them have offspring in the third realm of the world. Four hidden springs pouring forth butter carry down from the sky the ambrosia that is the oblation.

6.ఎడతెరిపి లేకుండా 6 అవి లెక్కపెట్టలేని ధారలుగా ప్రవహించును; ప్రపంచము యొక్క మూడవ స్థానములో వారికి సంతతి కలుగు గాక. అగుపడని నాల్గు ధారలు నెయ్య ఆకాశమునుండి ఆవిర్భవించి, అమృతమును ఆహుతి చేయును.

7 He takes on a white colour when he strains to win; Soma, the generous Asura, knows the whole world. He clings to inspired thought and ritual action as he goes forth; let him hurl down from the sky the cask full of water.

7.అతడు గెలుచుటకై తీవ్ర ప్రయత్నము చేయునపుడు శ్వేత వర్ణుడుగా అగును; ఉదారుడు ఆసురుడైన సోమకు ప్రపంచ మంతా తెలియును. అతడు ఉత్సాహమైన ఆలోచనలకు, ఆచారవ్యవహారములకు అంటిపెట్టి యుండును. అతడు ఆకాశము నుండి జలము గల పాత్రను విడుచుగాక.

8 Now he has gone to the white pot coated by cows; the racehorse has reached the winning line and has won a hundred cows for Kaksivat, the man of a hundred winters.7 Longing for the gods in their heart, they8 hasten forth.

8.అతడు గోవులచే కప్పబడిన తెల్లని పాత్రవైపు వెళ్ళెను. గుర్రము పందెములో గెలిచి, వంద చలి కాలములకు పురుషుడైన కక్శివత్7 కు వందలాది గోవులను గెలిచి పెట్టెను. దేవతల దర్శనమునకై హృదయములో వాంఛించచు ముందుకు సాగిరి 8

9 Clarifying Soma, when you are sated with waters your juice runs through the sieve made of wool. Polished by the poets, Soma who brings supreme ecstasy, be sweet for Indra to drink.

9. సోమ నీవు జలముతో నిండినపుడు, నీ శుద్ధమైన రసము జల్లెడనుండి వచ్చును. కవులచే పొగడబడే సోమ మిక్కిలి సంతసమును కలిగించి, ఇంద్రుడు సేవించుటకై తీయగా నుండుగాక.

NOTES

వివరణ

1. Soma as a new-born calf or horse wanders in the ‘forest’ of the wooden pressing- bowls.

1.అప్పుడే జన్మించిన దూడ లేదా గుర్రము వలె సోమ రసమును పిండే రాళ్ళ అడవిలో నడుచును.

2. The seed of heaven is the rain that mixes with the milk of the clouds, as Soma mixes with the milk in the bowls.

2.స్వర్గము యొక్క వీర్యము అనగా మేఘముల యొక్క పాలతో మిళితమయ్యే వర్షము; ఈ విధముగా సోమ పాత్రలలో యున్న పాలతో మిళిత మవును.

3. Soma is identified with the sun, who is called a poet, propping apart and holding together the pair of sky and earth, his parents.

3. కవి అనబడే సోమ, తన తలిదండ్రులైన భూమ్యాకాశములను కలుపుతూ, ఆధారముగా నుండే సూర్యునితో పోల్చ బడెను

4. The Maruts are the swollen men (clouds) who urinate the Soma (a male image) after it has been milked from the clouds (a female image).

4. లావైన పురుషులు అనగా మరుత్తులు (మేఘములు). వారు మేఘముల (స్త్రీ లింగము) నుండి పితికిన పాలను సోమ (పుంలింగము) రూపముగా విసర్జించెదరు.

5. Soma is the living, androgynous cloud from which milk and rain are pressed. Soma is the stalk; the wave is the water that mixes with it. The skin of the plant swells like the leather water-skin likened to the rain-clouds (cf. 1.85.5, 5.83.7) or the overturned cask (v. 7), both attributes of Parjanya.

5.సోమ పాలను మరియు వర్షమును పితకబడిన సజీవమైన స్త్రీ లేదా పుంలింగమైన మేఘము. సోమ కాండము. అల అనగా దానితో మిళితమైన జలము. వర్షాకాల మేఘములతో పోల్చబడిన నీటి తిత్తె వలె చెట్టు యొక్క ఉపరితలము ఉబ్బును. లేదా బోల్తాపడిన పాత్ర. రెండూ పర్జన్యుని సూచించును.

6. The streams of Soma likened to rains are to have their ‘off spring’ in the third realm, for the floods of rain renew themselves in heaven. Cf. 1.164.

6. వర్షముతో పోల్చబడిన సోమ ధారల యొక్క సంతతి జగత్తు యొక్క మూడవ స్థానమున కలుగును. ఏల అనగా వర్షము వలన కలిగే వరదలు స్వర్గములో వినూత్నమవును.

7. Kaksivat, said to have been saved by the Asvins (1.116.7), may have regained his youth, as did many others helped by the Asvins.

7.కక్శివత్ అశ్వినులచే రక్షింపబడి, తన యౌవనమును తిరిగి పొందెను.

8. The Soma juices, or the priests.

8. సోమ రసము లేదా హోతలు.

Friday, August 7, 2026

Wendy Doniger Rig Veda Impatience of Soma




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు

SOMA

సోమ

THE Soma plant is visualized in the Rig Veda as a god and as a liquid, pressed by stones in wooden bowls and filtered through a woollen sieve.

ఋగ్వేదములో సోమ ను ఒక దేవతగా మరియు రాళ్ళతో పిండి కర్ర పాత్రలలో వడబోసిన పానీయముగా వర్ణించెదరు.

These processes are described in some detail (9.74, 10.94) and are the inspiration for a rich cloth of imagery woven by the Vedic poet,

ఆ ప్రక్రియ లోని అంశాలను అనేక ఋక్కులలో వర్ణించబడెను

an imagery also applied to the flowing of the sacrificial butter (4.58): women uniting with lovers, wild animals attacking, rivers flowing to the sea.

ఆ వర్ణనే ప్రవహించు యజ్ఞములో వాడే నెయ్యకు పలు రూపములలో, అనగా జాణలు ప్రేమికులతో కలియుట మరియు క్రూర మృగాల వేట మరియు సముద్రము వైపు పారే నదులు, ఆపాదింపబడినది.

Soma can be dangerous (8.79.7-8; 8.48.10) but the effects of drinking Soma are usually admired, or at least sought after: a sense of immense personal power (10.119, particularly valuable in the god Indra), intimations of immortality (9.113), the assurance of immortality (8.48), and the hallucinations of trance (10.136).

సోమరసము ప్రమాదకరమైనది. కానీ దానిని త్రాగుటవలన కలిగే మత్తును అందరూ కోరెదరు: అతిశయమైన శక్తి (ముఖ్యంగా ఇంద్రునికి), అమరత్వము, మరణము లేకుండుట , నిషా మొదలైన వాటికై సోమరసమును త్రాగుదురు.

Soma’s form and activities are referred to in several other hymns in this collection: 8.91, 9.112, 10.85, 10.94, 10.109; the story of his descent from heaven (4.26-7) is the only episode in his mythology narrated in any detail.

స్వర్గమునుండి సోముడు భూమిపై అవతరించుట ఇక్కడ వివరింపబడినది.

8.79   This Restless Soma

8.79   సోమ అశాంతి

1 This restless Soma – you try to grab him but he breaks away and overpowers everything. He is a sage and a seer inspired by poetry.

1.సోముడు మిక్కిలి అశాంతితో గూడినవాడు. వానిని పట్టుట అసాధ్యము. అతడు ఒక ఋషి, కవులచే ప్రశంసింపబడినవాడు.

2 He covers the naked and heals all who are sick. The blind man sees; the lame man steps forth.

2.అతడు దిగంబరులను కప్పుతాడు. రోగులను నయం చేస్తాడు. అంధులు అతనివలన చూపును పొందెదరు; వికలాంగులు నడిచెదరు.

3 Soma, you are a broad defence against those who hate us, both enemies we have made ourselves and those made by others.

3.సోమా, మమ్ములను అసహ్యించుకొనే వారలనుండి రక్షణ ఇచ్చేవాడవు. వారు మా జన్మతః లేదా ఇతరుల ద్వారా కల్పింపబడిన శత్రువులు కావచ్చు.

4 Through your knowledge and skills, rushing forward you drive out of the sky and the earth the evil deed of the enemy.

4.నీ జ్ఞానము మరియు కౌశల్యముతో, క్రూర కర్మల నాచరించే శత్రువులను భూమ్యాకాశములనుండి వెళ్ళగొట్టెదవు

5 Let those who seek find what they seek: let them receive the treasure given by the generous and stop the greedy from getting what they want.

5.ఎవరు కోరినది వారు పొందెదరు గాక: ఉదారులైన వారు ఇచ్చే ధనమును పొందెదరు గాక; అలాగే దురాశ గలవారు కోరినది దొరక కుండు గాక.

6 Let him1 find what was lost before; let him push forward the man of truth. Let him stretch out the life-span that has not yet crossed its span.

6. ముందు పోగొట్టుకున్నది అతడు 1 తిరిగి పొందు గాక; అతడు సత్యమును ఆచరించే వానిని ముందుకు నడిపించు గాక; దీర్ఘాష్యుమంతుడు అగు గాక

7 Be kind and merciful to us, Soma; be good to our heart, without confusing our powers in your whirlwind.

7.సోమ, మా యందు దయ యుంచు; హృదయమునందు స్వచ్చముగా నుంచు; నీ అతిశయమైన శక్తులు మాపై ప్రయోగించకుము.

8 King Soma, do not enrage us; do not terrify us; do not wound our heart with dazzling light.

8.రాజైన సోమా, మాకు క్రోధము కలిగింపకుము; మమ్ములను భయభ్రాంతులకు గురి చేయవద్దు. నీ ప్రజ్వలించే కాంతితో మా హృదయాలను గాయ పరచకుము.

9 Give help, when you see the evil plans of the gods in your own house.2 Generous king, keep away hatreds, keep away failures.

9.నీ స్వగృహములో దేవతల కుయుక్తులు చేసిన మాకు చేయూతనివ్వు2. ఓ ఉదారుడవైన రాజా, అశుభముల నుండి మరియు ప్రయత్నలోపము వలన కలిగే అపజయముల నుండి రక్షించు.

NOTES

వివరణ

1. Soma or the man inspired by Soma.

1. సోమ లేదా సోమరసముచే ఆవహింపబడినవాడు.

2. Soma is asked to intercede for the worshipper among the other gods, as Agni often does.

2.అగ్ని దేవత వలె, సోముని భక్తులు రక్షింపమని కోరెదరు.

Wendy Doniger Rig Veda Pressing Stones

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...