Friday, July 31, 2026

Wendy Doniger Rig Veda Riddles Of Agni




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట

10.5   The Hidden Agni

10.5   గుహ్యమైన అగ్ని

Riddles and speculations about the nature of Agni make use of various tropes and metaphors familiar from other hymns, not only the Agni hymns but the cosmological and cosmogonic corpus and the meditations on the sacrifice. The image of the hidden and concealed Agni predominates and links the other images.

అగ్నిని గూర్చి అనేక చిక్కుముడులు ఈ ఋక్కులో పొందుపరచ బడినవి.

1. The one sea with many births,1 support of treasures, he sees out of our heart. He clings to the udder in the lap of the two who are concealed;2 the path of the bird is hidden in the midst of the fountain.

1. అనేక సంపదలు గలిగి, అనేక జన్మములు గల సముద్రము వలె,1 అతడు మన హృదయ కవాటాముల ద్వారా చూచును. అతడు ఇద్దరు గుహ్యమైన వారల ఒడిలో పాల పొదుగును పట్టి యుండును; 2పక్షి యొక్క పథము జలాశయము మధ్యన గుహ్యముగా నున్నది.

2 The buffaloes bursting with seed, veiling themselves have united with the mares in the same stable.3 The poets hide the path of the Truth;4 they keep secret their highest names.

2. వీర్యముతో కూడిన ఎనుములు అదే శాలలో నున్న మగ గుర్రములతో కలసినవి. ద్రష్టలు సత్యము వైపు పోయే దారులను గుహ్యముగా నుంచెదరు; 3వారు తమ నామములను కూడా గుహ్యముగా నుంచెదరు.4

3 The two who are made of Truth yet made of magic have come together; they have made a child and given birth to him and made him grow. He is the navel of all that moves and is firm, who with his mind stretches the thread of the poet.

3.సత్యముతో గూడిన ఇద్దరు, ఇంద్రజాలముతో చేయబడినప్పటికీ, ఒకటి అయ్యిరి; వారు ఒక శిశువును కని పెద్ద చేసిరి. అతడు చరించే జీవుల నన్నిటికీ నాభి వంటివాడు; తన మనస్సుతో ద్రష్ట యొక్క ఆలోచనలను పొడిగించెను.

4 For the waves of truth, the refreshing foods, have always clung to the well-born child for reward.5 Wearing a cloak, the two world-halves made him grow on butter and food and honey.

4. ఎలా అంటే సత్యముతో గూడిన అలలు, ఆహ్లాద పరచే తినుబండారములు, ఉన్నతమైన శిశువును సంపదకై ఎల్లప్పుడూ పట్టి యుండును5 ; వస్త్రములు ధరించి, విశ్వము యొక్క రెండు భాగములు నెయ్య, ఆహారము, మకరందములతో వానిని పెంచి పోషించెను.

5 Full of desire, the wise one brought the seven red sisters out of the honey to see.6 Born long ago, he was yoked in mid-air; seeking a robe to hide him, he found Püsan’s.7

5.మిక్కిలి కామముతో, వివేకి ఎర్రని వర్ణముగల ఏడుగురు అక్కచెల్లెళ్ళను తేనె నుండి వెలుపలకి తెచ్చెను.6 పురాతన జన్మ గలిగిన అతడు ఆకాశము మధ్యలో వేళ్ళాడెను. దాగుకొనుటకు ఒక వస్త్రమును కోరి, పూశన్ యొక్క వస్త్రమును చూచెను. 7

6 The poets fashioned seven boundaries; he who was trapped8 went to only one of them. The pillar of life’s vigour, he stands in the nest of the Highest, among the supports at the end of the paths.

6.ద్రష్టలు ఏడు సరిహద్దులను చేసిరి; వాటి మధ్య చిక్కుకొన్నవాడు 8 ఒక సరిహద్దువైపు వెళ్ళెను. ప్రాణ శక్తి గలవాడై ఒక స్థంబము వలె, పథముల చివరనుండే స్థావరములలో, ఉన్నతమైన వారల ప్రదేశములో నిలిచి యుండును.

7 Non-existence and existence are in the highest heaven, in the lap of Aditi and the birth of Daksa.9 Agni is for us the first-born of Truth in the ancient vigour of life: the bull – and also the cow.10

7. అసత్ మరియు సత్ ఉన్నతమైన లోకములలో, అదితి యొక్క ఒడిలో మరియు దక్షుని 9 జననములో గలవు; సనాతనముగా నుండే ప్రాణ శక్తిలో అగ్ని సత్యము వలన మొదట జన్మించెను- వృషభము మరియు గోవు కూడా10

NOTES

వివరణ

1. A double meaning: Agni himself is born many times, and he is responsible for many births.

1.ద్వంద్వ అర్థములు; అగ్ని అనేక సార్లు జన్మించెను; అట్లే అనేక జీవుల పుట్టుకకు కారణము.

2. Heaven and earth are the parents of Agni, but so are the two fire-sticks.

2.స్వర్గము మరియు భూమి అగ్ని యొక్క తలిదండ్రులు. అలాగే రెండు అగ్నిని రగిల్చే కట్టెలు కూడా సూచితము.

3. The flames of Agni are often feminine, but they are also called male buffaloes, bulls, or stallions full of seed; their ‘stable’ (literally, their nest, as in v. 6) is the wood in which they rest together with the females of the breed, also the flames. Or the male and female animals may be the male and female sticks.

3.అగ్ని యొక్క శిఖలు సామాన్యముగా స్త్రీ లింగములో ప్రస్తావించబడేవి; కానీ వాటిని వీర్యముగల మగ ఎనుములు, ఎద్దులు, లేదా గుర్రములతో కూడా పోలుస్తారు. వాటి "శాల" కట్టెలు. వాటిలో అవి తమ స్త్రీలతో వసిస్తాయి. అలాగే అగ్ని శిఖలు కూడా. లేదా ఆడ మగ జంతువులు ఆడ మగ కట్టెలు కావచ్చు.

4. Rta, often translated as ‘Order’ (cf. 1.164.11, 1.164.37, 1.164.47), in this late hymn, seems better translated as ‘truth’.

4. తరచు క్రమమును సూచించే ఋత, ఇక్కడ సత్యమును సూచించును

5. The magic nourishment is part of the realm of Order or truth, embodied in Agni; these powers nurse him for pay, for the reward of maintaining their own prosperity and that of the world.

5.మాయా కల్పిత ఆహారము క్రమము లేదా సత్య లోకములో అగ్ని రూపములో నుండేవి. ఈ శక్తులు తమ సిరికై మరియు ప్రపంచము యొక సిరి సంపదలకై, వానిని తమ ఆదాయమునకై పోషించును;

6. The seven sisters are the mares who are Agni’s flames, here said to break out of the sweet butter poured on the fire. They come forth both to see and to be seen, a double meaning often attributed to the sun.

6.ఏడుగురు అక్కచెల్లెళ్ళు యజ్ఞములో నెయ్య వలన ప్రజ్వలించే అగ్ని యొక్క ఏడు శిఖలు. అవి తమను, సూర్యుని వలె, చూచుటకు మరియు చూడబడుటకు వెలుపలకు వస్తాయి.

7. Symbolism relating to the birth of the sun, as well as to the concealment of Agni.

7. సూర్యుని జననము, గుహ్యమైన అగ్నిని సూచించును.

8. Literally, suffering from the feeling of being unable to move freely, a word often translated as ‘in anguish’ but here perhaps more literally hemmed in.

8.అనగా స్వతంత్రముగా కదలలేని పరిస్థితి.

9. For existence and non-existence, cf. 10.129.1; for Daksa and Aditi, cf. 10.72.4.

9.సత్ మరియు అసత్; దక్ష మరియు అదితి ల గూర్చి 10.129.1 మరియు 10.72.4 లలో వివరింపబడెను.

10. The androgyny of Agni, already present in a veiled form in verse 2, here becomes explicit. For Parjanya as the bull and cow, see 5.83 and 7.101.

10.అగ్ని యొక్క పురుషత్వము రెండవ పాదములో గుహ్యముగా నున్నా, ఇక్కడ ప్రకటిత మయ్యెను. పర్జన్య ఎద్దు లేదా ఆవును గూర్చి 5.83 and 7.101 చూడుడు

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Riddles Of Agni

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...