|
|
|
|
Table Of Contents
CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
1.164 The Riddle of the Sacrifice (Asya Vamasyd)
1.164 యజ్ఞ ప్రశ్నలు
This long and complex hymn has inspired many elaborate, detailed glosses and still remains largely obscure. The language, however, is not particularly difficult, and certain major themes emerge with sufficient clarity to encourage the translator to present the hymn in a relatively raw state of exegesis, rather than burden the reader with a critical apparatus out of proportion to the poem itself. Those who seek enlightenment on the many points left unglossed are encouraged to pursue the books and articles listed in the bibliography.
ఈ దీర్ఘమైన ఋక్కు ఎన్నో ఊహాగానాలకు కారణమైనప్పటికీ ఇప్పటికీ అవగాహన కానిది. దీని వ్యాకరణము క్లిష్టమైనది కాక, అనువాదము చేయుటకు కొన్ని సులభమైన విషయాలు ఆవిష్కరింపబడినవి.
One reason for the great scholarly attention paid to this hymn is that it is traditionally regarded as a riddle – a tradition that waves a red flag before the eyes of Vedic exegetes.
ఈ ఋక్కును పండితులు ఒక చిక్కుముడిగా భావించేరు.
And there are solid grounds for this tradition, for many questions are asked outright in the hymn, and others are hidden in a symbolism that seems deliberately labyrinthine. Yet it seems that the poet thought he knew the answers to some of his questions and posed others merely rhetorically, as questions no one would dream of trying to answer. The reader is thus encouraged to solve those that can be solved and to leave the others unanswered.
ఈ ఋక్కు అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అలాగే కొన్ని నిఘూడమైన విషయాలు వంకరటింకరగా ఆవిష్కరిస్తుంది. అయినప్పటికీ ద్రష్ట కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసని భావించగా, మరి కొన్ని వివాదమునకై లేవనెత్తెను. వాటి సమాధానాలు ఎవ్వరి వద్దా సిద్ధముగా లేవు. కావున అందరూ తమకు తాముగా సమాధానం వెతుక్కోవాలి.
The hymn demonstrates a unity on two distinct but intersecting levels, explicit and implicit. That is, certain tropes emerge repeatedly to express different ideas, and certain ideas emerge repeatedly to be expressed by different tropes. For example, the hymn mentions cows and birds in several verses; the cow may stand for the Dawn (who is not explicitly named) or the goddess of Speech (who is), and the birds for the sun or the mortal (both explicitly named), while the Dawn may also be represented in verses ostensibly about a woman, and the sun in verses about a horse. I will here try to summarize the recurrent tropes and ideas, and devote the notes to particular idiosyncrasies of the individual verses.
ఈ ఋక్కు ఆవులను, పక్షులను పలు మార్లు ఉంటంకిస్తు0ది. ఆవు ఉషస్సును లేదా వాగ్దేవతను సూచిస్తుంది. పక్షులు సూర్యుని లేదా చావు పుట్టుకలు గల జీవుని సూచిస్తాయి. కొన్ని చోట్ల ఉషస్సు స్త్రీని సూచించగా, సూర్యుడు గుర్రాలను సూచించెను.
A central theme on the explicit level is the poet’s uncertainty about his knowledge and his joy in experiencing an enlightening vision (v. 37; cf. 6.9). Several verses are questions, some never explicitly answered (vv. 4, 6, 17, 18, 48) and perhaps regarded as unanswerable, an expression of the inability of the mystic vision; others are posed and answered immediately, almost as a catechism (vv. 34-5). The poet speaks often of the contrast between those who know and those who do not know the answers (4-7, 10, 16, 20-23, 39) or those who say one thing and those who say another (12, 16, 19, 38, 46); elsewhere he merely expresses his scepticism or grateful acceptance of what ‘they say’ (15, 25). The hymn refers often to things that are hidden or secret (3, 5, 7, 14, 32, 37-8, 45).
ద్రష్ట తన జ్ఞానము సంశయాత్మకమని భావించినప్పటికీ, కొన్ని మార్లు జ్ఞానోదయము పొందుతాడు. అనేక పాదాలు ప్రశ్నలుగా వివరించబడ్డాయి. కొన్నిటికి సమాధానాలు లేవు. అంటే అవి ద్రష్టకి అంతుపట్టలేదు. మరికొన్నిటికి సమాధానాలు వెంటనే స్పురించినట్టుగా సూచితమైనది. ద్రష్ట పలు సార్లు సమాధానాలు తెలిసినవారు, తెలియని వారలు గూర్చి ప్రస్తావిస్తాడు. లేదా కొందరు ఒకటనగా, మరి కొందరు వేరొకటి యందురు. అలాగే ఇతరులు చెప్పే సమాధానాలయందు నమ్మకము లేదా అపనమ్మకము కలదని సూచించేడు. ఈ ఋక్కు గుహ్యమైన వాటి గూర్చే ప్రస్తావిస్తుంది.
Another aspect of the riddle content on the explicit level is the use of deliberate circumlocutions, particularly in association with numbers. Many things come in threes: brothers (1), naves of the wheel (2, 48), stages of the journey (9), mothers and fathers (10), metres (23-5), kindling-sticks (25), longhaired ones (44), hidden parts of speech (45).
ఈ చిక్కుముడిలో డొంకతిరుగుడు, ముఖ్యంగా అంకెల గారడీ ఉంటుంది. అనేకమైనవి 3 అంకెతో కూడినవి: అన్నదమ్ములు, చక్రము మధ్య భాగము, ప్రయాణములోని స్థితిగతులు, తల్లులు మరియు తండ్రులు, ఛందస్సు, అగ్నిని రగిల్చేవి, పొడుగైన కేశాలు గలవి, వాక్కులో ప్రకటితము కానివి.
Closely related to these are the pairs of threes, or sixes : realms of space (6), spokes of the wheel (12), sets of twins (15);
అలాగే జోడీగా నుండే మూడు లేదా ఆరు కలవి: ఆకాశములోని దిక్కులు, చక్రము యొక్క ఊచలు, కవలలు.
and these in turn are doubled to produce twelves : spokes of the wheel (11), shapes of the father (12), twins (15), fellies (48).
వాటిని ద్విగుణీకృతము చేసి పన్నెండు సంఖ్యతో: చక్రము ఊచలు, తండ్రుల యొక్క ఆకారాలు, కవలలు, చక్రము చుట్టూరా నుండే ఇనుప కవచము.
By further multiplication, we obtain 360 (48) and 720 as a doublet of 360 (11).
అలా పొడిగించుకొని పోగా 360, దాని ద్విగుణీకృతమైన 720 సంఖ్యలు వస్తాయి.
Other things come in fives – feet (12) and spokes (13)
మరికొన్ని ఐదు అంకెతో కూడినవి: పాదాలు మరియు చక్రపు ఊచలు.
– or tens – horses (14).
మరికొన్ని పది అంకెతో కూడినవి: గుర్రాలు
Seven is a great favourite: sons (1), horses and horses’ names (2-3), wheels (3, 12), riders, sisters, and names of cows (3), threads (5), half-embryos (36).
ఏడు అంకె ప్రియమైనది: పుత్రులు, గుర్రాలు, వాటి పేర్లు, చక్రాలు, సారథులు, అక్క చెల్లెళ్ళు, ఆవుల పేర్లు, దారాలు, పిండాలు.
A few other numbers occur once: eight, nine, and a thousand (41).
మరికొన్ని సంఖ్యలు ఒకే మారు కనిపిస్తాయ: ఎనిమిది, తొమ్మిది, వెయ్యి.
Four appears only once (as an addition to three, rather than a doublet of two, in verse 45), a remarkably rare occurrence in a hymn about four-footed animals and four-footed verses.
నాలుగు ఒకే మారు తటస్తిస్తుంది--కానీ మూడు ఒకటి గాను, రెండు యొక్క ద్విగుణీకృతముగా కాదు. విచిత్రం ఎందుకంటే చతుష్పాదులను ప్రస్తావించేవి నాలుగు పాదాలు గలిగిన ఋక్కులు
Sometimes several different numbers are applied to the same things (spokes being five or six or twelve, horses being seven or ten, and so forth).
కొన్ని మార్లు అనేక సంఖ్యలు ఒకే వస్తువుని సూచిస్తాయి: ఐదు, ఆరు, లేదా పన్నెండు ఊచలు; ఏడు లేదా పది గుర్రాలు.
This should warn us that it is not possible to make a direct connection between a number and what it symbolizes, though a certain amount of speculation along these lines is possible, as we will see when we consider implicit levels of symbolism in the hymn.
అంటే సంఖ్యకి, అది సూచించే వస్తువుకి సాపేక్షత లేకపోవచ్చు. అయినప్పటికీ కొంత వివేకము అవసరము.
Most important of all the numbers are one and two.
ముఖ్యంగా అన్ని సంఖ్యలు ఒకటి మరియు రెండు
The One as the Absolute appears several times (6, 10, 15, 46), and both it, explicitly, (46) and other things, implicitly, are said to be many as well as one: the horse (2), the wheel (14, 48), and the foot of the cow (41).
ఏక సంఖ్య అద్వితీయమనే రూపములో పలుమార్లు వస్తుంది. కొన్నిట్లో బహిరంగంగా, మారికొన్నిట్లో లోపాయకారంగా : గుర్రము, చక్రం, గోవు యొక్క పాదము
Twos form basic oppositions on the explicit level.
రెండు సంఖ్య ద్వంద్వాలను సూచిస్తుంది
We have noted the contrast between the wise and the foolish;
పండితులు-మూర్ఖుల గూర్చి ముందు చెప్పబడినది
another, related to this, is the contrast between the mortal and the immortal (30, 38),
అలాగే జననమరణములు గల మానవులు; అమరులు
supported by recurrent references to one or the other side of the pair: that which is ageless or undying or unbreaking (2, 10-11, 13-15) and that which ages and dies (29, 32).
అటులనే కాలాంతరంలో మార్పు చెందనివి, మరణము లేనివి, అవ్యయములైనవాటి ద్వంద్వములైన జరామరణము గల్గినవి.
Further contrasts between that with bones and that without bones (4), the near and far sides of the sky (12, 17), up and down (17, 43), two bowls (33), male and female (16), and past and future (19) enrich the dialectic structure of the hymn.
అలాగే ఎముకలు గలవి, లేనివి; ఆకాశము యొక్క దగ్గిర లేదా దూరపు ప్రదేశాలు; క్రింద లేదా మీద; రెండు పాత్రలు; పురుషులు-స్త్రీలు; గతము-భవిష్యత్తు; మొదలైన ద్వంద్వాలు ఋక్కునకు అలంకారమై యున్నవి.
The most explicit and developed contrast is between the two birds (20-22), who occur in other forms as well, as an individual bird (7, 46, 52) and a group of birds (21, 47).
అన్నిటికన్నా ముఖ్యంగా రెండు పక్షుల ఉపమానము తలమానికమై యున్నది; ఏక పక్షి లేదా పక్షుల గుంపుగా కూడా వ్యక్తము చేయబడినది.
Related to the birds, as we shall see, are horses (2, 3, 34, 35), which are in turn related to the chariot (2-3, 9, 12-14, 31, 48); the ‘naves’ of the chariot pun on the ‘navel’ of the universe (33-5, nabhi referring to both terms).
పక్షులవలె, రథాలకు పూన్చబడే గుర్రాలు కూడా; రథాల మధ్య భాగము విశ్వము యొక్క నాభితో పోల్చబడినది.
By far the most important animal in the hymn is the cow (7, 9, 17, 26-9, 40-44) with her calf (5, 7, 17, 27-8) and bull (43).
ముఖ్యమైన జంతువు ప్రస్తావన ఆవు, దూడ, ఎద్దుల గురించియై ఉన్నది.
The cow is closely related to the images of human procreation: father (12, 18, 22), mother and father (8, 10, 33) (referred to as earth and sky explicitly in 33 and implicitly in others such as 51), mother and son (4, 9), father and son (16), brothers (1), sisters (3), and twins (15, 36).
గోవు మానవ ఉత్పత్తికి సంకేతమై యున్నది: తలిదండ్రులు (భూమ్యాకాశాలతో పోల్చబడినారు); తల్లి కుమారుడు; తండ్రి కుమారుడు; అన్నదమ్ములు; అక్కాచెల్లెళ్ళు; కవలలు
Two Vedic myths lie behind several verses: the mother bears her son and then abandons him (9, 17, 32) and the father incestuously procreates with his own daughter (8).
రెండు అవైదిక మైనవి గలవు: తల్లి బిడ్డను కని విడిచి పెట్టి వేయుట; తండ్రి కుమార్తెతో సంభోగము చేయుట
A final explicit image is closely related to the problem of the inspired solution of the riddle; this is the image of the sacrfice.
చివరకు చిక్కుముడిని ఎలా విప్పుట: అది యజ్ఞము ద్వారానే సాధ్యము
The hymn begins with a priest (1) and poets who are inspired priests (5, 6); it speaks of the priest’s cow (9).
ఋక్కు హోతతో మొదలవుతుంది; వాని గోవు గురించి ప్రస్తావిస్తుంది.
There are several references to the goddess of sacred speech (10, 37, 45, 49), to hymns (23-5) and syllables (24, 39, 41-2), ritual laws (43) and the Order which underlies them (11, 37, 47), and nally to the sacrifice itself (15, 35, 50).
వాగ్దేవత, ఛందస్సు, ఆచార పద్దతులు, వాటి క్రమము, యజ్ఞము మొదలైన వాటి ప్రస్తావన కూడా ఉంది.
How do these interwoven images express meaning in the hymn?
ఇలాగ అంతర్లీనంగా ఉండేవి ద్రష్ట చెప్పదలుచు కున్నదానితో ఎలా మిళిత మవుతాయి?
On one level, it is clear that the hymn is about the things it is talking about – about riddles and numbers and wisdom and immortality and birds and chariots and horses and cows and speech and the sacrifice, all of which are described in vividly naturalistic detail.
ఒక విధంగా ఋక్కు చెప్పే చిక్కు ముడులు, సంఖ్యలు, జ్ఞానము, అమరత్వము, పక్షులు, రథాలు, గుర్రాలు, గోవులు, వాక్కు, యజ్ఞము సర్వ విదితము.
But they are also described in terms that make no sense on a naturalistic level (what chariot could have a single wheel, or five spokes at the same time as seven spokes?), and it appears that these distortions arise through the identification of several of the images with abstract ideas,
కానీ అవి కొంత అజ్ఞానముతో కూడినవి: ఏ రథానికి ఒంటి చక్ర ముంటుంది? దానికి ఒకే సమయమున ఐదు మరియు ఏడు ఊచలు ఎలా ఉంటాయి? ఇవి పూర్తిగా అజ్ఞానము కావు; ఊహకందే విజ్ఞానానికి ఆలంబనాలు.
particularly the chariot and birds identified with the sun or year or yearly sacrifice or immortal soul, and the cow or the mother identified with Dawn or Speech.
ముఖ్యంగా రథము మరియు పక్షులు, సూర్యుడు, సంవత్సరము, ఏడాది కొకమారు చేసే యజ్ఞము, నిత్యమైన ఆత్మ, ఉషస్సు మరియు వాక్కును సూచించే గోవు మరియు తల్లి.
Qualities appropriate to these ‘signified’ concepts are then redirected back upon the ‘signifiers’ to stretch the naturalistic image into the realm of pure imagination.
జ్ఞ్నేయము యొక్క గుణములను జ్ఞాతతో ముడి పెట్టి, ఊహకు మాత్రమే అందేటట్టు వివరింప బడినవి.
That the bird in the hymn is the sun or fire is a conjecture supported by many explicit references to the sun-bird in the Rig Veda (cf. 10.123, 10.177) and by references to the sun in this hymn (14, 26).
ఋగ్వేదములో అనేక చోట్ల సూర్యుడు-పక్షుల గురించి ప్రస్తావించబడినది.
Many of the verses seem to refer to the birth of the sun/year/sacrifice/sacrificial fire as a calf begotten by his father, the sky, in his mother, the earth (in the form of a cow), or by the sky in his daughter the dawn cow.
ఈ ఋక్కు పాదాలు సూర్యుడు-సంవత్సరము-యజ్ఞము-యజ్ఞ అగ్ని-తండ్రిచే, ఆకాశము ద్వారా, తల్లిలో, భూమిలోనున్న ఆవుతో, లేదా ఆకాశములో ప్రతిబింబించే కూతురు, ఉషస్సు దూడల ఆవిర్భావమును సూచిస్తున్నట్లు ఉంటాయి.
So, too, the verses about the mortal and immortal may refer to the death and rebirth of the sun at the end of each day or year.
అలాగే అమరులు, ఆద్యంతములు గల జీవులు, ప్రతి రోజూ లేదా ప్రతి సంవత్సరము జనన మరణము పొందే సూర్యునికి సంకేతాలు.
The dead one who ‘wanders with the sacrificial drink’ (30, 38; cf.10.16.5) or ‘enters Destruction’ when he is within the womb (32) is the soul of the mortal (or of the mortal sun) whose wandering and rebirth are dependent on the enduring qualities of his nature.
గర్భములో నుండే సోమ రసముతో కదలాడే లేదా ప్రళయమున ప్రవేశించే ప్రేతము, ఆద్యంతములు గల జీవుడు లేదా సూర్యుడు యొక్క సహజ ధర్మములైన గమనము మరియు పునః ఆవిర్భావము వలె నున్న ఆత్మ.
Since the cow that represents the earth or Dawn also stands for the priest’s fee (9) or for the goddess of Speech, she serves as a pivot for several symbolic layers;
గోవు భూమిని సూచించగా, ఉషస్సు హోత యొక్క దక్షిణ లేదా వాగ్దేవతను సూచిస్తుంది
moreover, there is an extended pun throughout the hymn based on the ‘feet’ of the cow (7, 12, 17, 41) and of the sacred verses (23-4), as well as the ‘footprints’ or sacrificial traces of the gods (5) – all designated by the term pada.
అలాగే గోవు యొక్క పాదాలు మరియు ఋక్కు పాదాలు దేవతలు అడుగు జాడలతో సాపేక్షంగా సూచింప బడినవి. ఇచ్చట గమనించ వలసినది "పాదము".
Similarly, the word akshara which means both ‘syllable’ and ‘undying’ serves as a link between the sacrifice and the immortal sun/ soul (24, 39, 42).
అక్షర మనగా భాష యొక్క ఆధారము లేదా క్షయము కానిది. అది యజ్ఞము మరియు మరణము లేని సూర్యుడు లేదా ఆత్మలను కలిపేది.
Working with these implicit and explicit patterns, it is possible to explain more of the hymn.
ఇట్టి ఆధారాలతో ఈ ఋక్కుని మరింత వివరింప సాధ్యము.
The sun is often identified with Agni, who is mentioned in the hymn at several points: he is explicitly identified with the One (46); he appears in three forms (1) ; and he has flames that are like long hair (44).
సూర్యుడు అగ్నికి సంకేతము. అగ్నిని ఒకటి అంకెతో అనగా అద్వితీయము, మూడు ఆకారములతో, పొడవైన కేశాల వలె నుండే జ్వాలలతో నుండేదిగా సూచింపబడినది.
Agni lurks behind other images: he is, like the sun, the first-born child of Order (11, 37, 47) or Truth (cf. 10.5.7) and is born of the waters (52).
అగ్ని పరోక్షంగా, సూర్యుడు, క్రమము యొక్క జ్వేష్ట పుత్రుడు లేదా సత్యము, జలంలో ఆవిర్భవించేదిగా చెప్పబడినది.
The interaction of the sun and the waters makes sense of a number of obscure references to a Vedic theory of the rain cycle: the rays of the sun (cows) drink up earthly waters with the lowest point of the ray (the foot) and then give back rain (milk) from their top (head) after they carry the moisture back up to the sun (7, 47, 51, 52).
వర్షము యొక్క కారణమైన సూర్యుడు, జలము ఈ విధంగా చెప్పబడినవి: గోవుల వలె నుండె సూర్యుని కిరణాలు, భూజలాలను కనిష్టమైన కిరణాలు అనగా గోపాదాలతో పీల్చి, గరిష్టమైన అనగా గోవు తలనుండి సూర్యునికి ఆవిరిగా అందజేస్తాయి
The sun is thus clothed in the waters (7, 31).
అంటే సూర్యుడు జలముతో చుట్ట బడిన వాడు.
The relationship between the sun and the sacrifice (through the concept of the yearly solar renewal and yearly sacrifice) is present in the number symbolism linking the chariot (of the sun) with the sacrifice (as in the extended metaphor of 10.135, the opening verse of which is echoed in verse 22 of the present hymn).
సూర్యునికి యజ్ఞముతో గల సంబంధము, ప్రతి సంవత్సరము పునరుత్పత్తి చెందే సూర్యుడు మరియు ప్రతి ఏడాదీ చేసే యజ్ఞము అనేక చోట్ల నున్నది. అనగా సూర్యుని రథము, యజ్ఞముతో జోడింపబడినది.
The seven horses or sons or embryos are seven priests or offerings, the three or six or five naves or spokes are seasons (variously enumerated in different sacrificial reckonings), the twelve are the months, the 360 the days of the years (the 720 the days and nights in pairs), and so forth.
సూర్యుని ఏడు గుర్రాలు, కుమారులు, పిండాలు ఏడు హోతలు లేదా దానాలకు సంకేతము; మూడు లేదా ఆరు లేదా ఐదు రథ మధ్య భాగములు, లేదా ఊచలు ఋతువులకు సంకేతము; పన్నెండు సంఖ్య మాసాలకు సంకేతము; 360 రోజులు సంవత్సరము, 720 సంవత్సర కాలములోనుండే రేయింబగళ్ళకి సంకేతములు.
Many particular obscurities remain, of course, and many verses mean several things at once, but when viewed in this overarching framework the hymn reveals a number of consistent questions and answers expressed through a careful network of highly charged symbols.
అనేక క్లిష్టమైనవి, బహుళార్థములు గల పదప్రయోగములు ఉన్నప్పటికీ, ఈ ఋక్కు మనలో తలెత్తే అనేక సంశయాలకు సమాధానములు సర్వ విదితమైన సంకేతాలతో వివరింపబడినవి.
1 This beloved grey priest has a middle brother who is hungry and a third brother with butter on his back.1 In him I saw the Lord of All Tribes with his seven sons.
1 వృద్ధ హోతకి ఆకలితో నున్న మధ్యముడైన తమ్ముడు, నెయ్య పూయబడిన వీపు 1 గల్గిన మూడవ తమ్ముడు గలరు. వానిలో ఏడు పుత్రులు గల సర్వ జాతులకు అధిపతి అయినవానిని చూసాను.
2 Seven yoke the one-wheeled chariot drawn by one horse’ with seven names. All these creatures rest on the age less and unstoppable wheel with three naves.2
2 ఏడు కళ్ళాలు, ఏక చక్రము, ఒకే గుర్రముతో గల రథమునకు ఏడు నామములున్నవి. ఈ జీవులు అవ్యయమైన, నిరోధింప శక్యము గాని, మూడు ఆసనములు2 గల రథములో స్థితమై యున్నవి.
3 Seven horses draw the seven who ride on this seven-wheeled chariot. Seven sisters call out to the place where the seven names of the cows are hidden.
3 ఏడుగురు ఆశీనమైన, ఏడు చక్రాలు గల రథమును ఏడు గుర్రాలు లాగుతున్నాయి. ఏడు నామములు గల గోవులు దాచి పెట్టబడిన స్థలాన్ని ఏడు అక్కచెళ్ళెల్లు ప్రకటించిరి.
4 Who saw the newborn one, the one with bones who was brought forth by the boneless one?3 Where was the breath and blood and soul of the earth? Who can go to ask this from someone who knows?
4 ఎముకలు లేని వాడు, ఎముకలు గల శిశివుని గనుట ఎవరు చూసేరు? 3 భూమి యొక్క శ్వాస, రక్తము, ఆత్మ ఎక్కడున్నాయి? వీటి సమాధానాలు తెలిసినవాడు ఎవరికి ఎరుక?
5 An ignorant fool, I ask in my mind about the hidden footprints4 of the gods. Over the young calf the poets stretched out seven threads to weave.
5 మూర్ఖుడనైన నేను నా స్వగతంలో కంటికి కానరాని దేవతల యొక్క అడుగు జాడల4 గూర్చి ఆలోచిస్తున్నాను. పండితులు ఏడు దారాలతో దూడపై నేత నేస్తున్నారు.
6 Unknowing, ignorant, I ask for knowledge about it from the poets who know: What is the One who in the form of the unborn propped apart these six realms of space?
6 అవిద్యతో, అజ్ఞానముతో కూడిన నేను పండితులను జ్ఞాన భిక్ష కోరుతూ ఇలా అడుగుతున్నాను: ఎవడు ఆరు ఆకాశాలలో స్థితమై, అనాదియై యున్నవాడు?
7 Let him who really knows proclaim here the hidden place of that beloved bird. The cows give milk from his head; wearing a cloak, they drank water with their feet.
7 పక్షి దాచబడిన ప్రదేశాన్ని జ్ఞాని తెలపాలి. గోవులు తల నుండి పాలు ఇస్తాయి; కప్పుని ధరించి పాదాలతో నీళ్ళను త్రాగుతాయి.
8 The mother5 gave the father a share in accordance with the Order, for at the beginning she embraced him with mind and heart. Recoiling, she was pierced and sowed with the seed of the embryo. The reverent came to praise.
8 తల్లి5 క్రమమును అనుసరించి తండ్రికి ఒక భాగాన్ని ఇచ్చింది. ఎందుకంటే వానితో మనసావాచా జత చేసింది. ఆమెలో పిండమునకు కారణమైన బీజము నాటబడినది. పూజ్యులు ఆమెను పొగిడేరు.
9 The mother was harnessed to the chariot pole of the priest’s cow; the embryo remained within the cow-pens. The calf lowed and looked for the many-coloured cow on the three stages of the journey.6
9 హోత ఆవు యొక్క రథమునకు తల్లి కట్టబడింది. పిండము గోశాలలో స్థితమై యున్నది. దూడ అనేక వర్ణములు గల గోవుకై మూడు అవస్థలు గల ప్రయాణములో 6 అరుస్తూ, వెదకుచున్నది.
10 The One has risen up, holding up three mothers7 and three fathers, who never wear him down. On the back of the distant sky they speak of Speech, who knows all but does not move all.
10 ఎప్పటికీ ఆయాసములేక మూడు తలిదండ్రులను మోస్తూ ఒకడు లేచేడు 7 . సర్వజ్ఞుడు, చలనము లేని వాగ్దేవత గూర్చి దూరమైన ఆకాశ అంచులలో వారు మాట్లాడుతున్నారు.
11 The twelve-spoked wheel of Order rolls around and around the sky and never ages. Seven hundred and twenty sons in pairs rest on it, O Agni.
11 పన్నెండు ఊచలు గల క్రమమును సూచించే చక్రము ఎన్నటికీ మార్పు చెందక ఆకాశంలో వృత్తాకారంలో చలిస్తున్నాది. అగ్నీ! జతలైన 720 పుత్రులు దానిపై ఆశీనులై యున్నారు.
12 Some say that the father with his five feet and twelve shapes dwells in his fullness in the farther half of the sky. But others here say that the far-seeing one in the seven- wheeled, six-spoked chariot moves in he near half.8
12 కొందరు ఆకాశ అంచులలో ఐదు పాదములు, పన్నెండు ఆకారములు గల పూర్ణ స్వరూపుడైన తండ్రి నివసిస్తున్నాడని అంటారు. మరికొందరు దగ్గరగా నుండే ఆకాశంలో దివ్య దృష్టి గల వాడు ఏడు చక్రములు గల, ఆరు ఊచలు గలిగిన రథములో చలిస్తున్నాడాని అంటారు.8
13 All the worlds rest on this five-spoked wheel that rolls around and around. Though heavy-laden, its axle does not get hot, nor has it ever broken in its naves.
13 సర్వ లోకాలు ఐదు ఊచలు గలిగి ద్రొల్లే చక్రములో స్థితమై ఉన్నాయి. అది బరువైనది అయినప్పటికీ, దాని ఇరుసు వేడి అవ్వదు. అట్లే దానిలో ఏ భాగమూ మ్రుక్కలవ్వదు.
14 The unageing wheel rolls out on its rim; the ten yoked horses draw it up the outstretched path. All the worlds are kept in motion on the eye of the sun, that moves on though shrouded in dark space.
14 మార్పు చెందని చక్రము ఇరుసు ఆధారంగా ద్రొల్లుచున్నాది. కళ్ళాలతో కట్టబడిన పది గుర్రాలు దానిని లాగుతున్నాయి. అంధకారాన్ని దూరం చేసే సూర్యుని కనుసన్నెలలో సమస్త లోకాలు చలిస్తున్నాయి.
15 They say that besides those born in pairs there is a seventh born alone,9 while the six’ sets of twins are the sages born from the gods. The sacrifices for them are firmly set, but they change their forms and waver as he stands firm.
15 కవలలుగా గాక, ఏడవ వానిగా జన్మించిన వాడు గలడని అందురు9 . ఆరుగురు కవలలు దేవతల వలన జన్మించిన ఋషులు. వారికై యజ్ఞమునాచరించుటకు సర్వము సిద్ధము. అతడు స్థిరముగా నుండగా, వారు మార్పు చెందుతున్నారు.
16 They are female, but people tell me they are male.10 He who has eyes sees this, but the blind one does not understand. The poet who is his son has understood this well; the one who knows it would be his father’s father.
16 వారు స్త్రీలు. కానీ జనులు వారిని పురుషులు అందురు10 . కళ్ళున్నవానికి ఇది విదితము. గ్రుడ్డివానికి ఇది కానరాదు. వాని పుత్రుడైన హోత దీనిని బాగా అర్థం చేసికొన్నాడు. దీన్ని తెలిసినవాడు తన తండ్రికి తండ్రి.
17 Beneath what is above, and above what is beneath, the cow went upward, holding her calf by the foot.11 In what direction and to what half of the sky has she gone away? Where did she give birth? Not within the herd.
17 మీద యొక్క క్రింద, క్రింద యొక్క మీద, ఒక గోవు తన దూడను పాదముతో పట్టుకొని ఊర్ధ్వ ముఖంగా వెళ్ళింది11 . అది ఏ దిక్కులో, ఏ ఆకాశ భాగంలోకి వెళ్ళింది? అది ఎక్కడ ప్రశవించింది. గోకులంలో కాదు.
18 Whoever here knows his father12 beneath what is above and above what is beneath – who with such mystical insight can here proclaim the source from which the mind of god was born?
18 ఎవనికి మీద ఏముందో దాని క్రింద, క్రింద ఏముందో దాని మీద తండ్రి12 ఉండునని తెలుసో, అటువంటి ప్రజ్ఞానము గల వాడు దేవుని మనస్సు యొక్క జన్మ స్థానమేదో ప్రకటించగలడా?
19 Those that are in the future they say are in the past; those that are in the past they say are in the future.13 The things that you and Indra did, Soma, still pull the axle pole of space as though yoked to it.
19 భవిష్యత్తులో ఉన్నవారు గతంలో ఉన్నామని అంటారు. గతంలో ఉన్న వారు భవిష్యత్తులో ఉన్నామని అంటారు13 . సోమా, ఇంద్రునితో గూడి నీవు చేసిన పనులు, ఇంకా ఆకాశముతో బంధింప బడినట్లుగా దాని యొక్క ఇరుసును లాగుతున్నాయి.
20 Two birds, friends joined together, clutch the same tree. One of them eats the sweet fruit; the other looks on without eating.14
20 రెండు పక్షులు, మిత్రులు కలిసి ఒకే చెట్టును ఆశ్రయించారు. ఒకటి తియ్యని పండును తింటుంది. మరొకటి పండుపై దృష్టి పెట్టక ఉంటుంది14 .
21 Where the birds sing unblinkingly about their share of immortality among the wise, there the mighty herdsman15 of the whole world, the wise one, entered me, the fool.
21 ఎక్కడైతే రెప్పార్పకుండా పక్షులు జ్ఞానులలో తమ భాగమైన అమరత్వం గురించి గానము చేస్తున్నాయో, అక్కడ విశ్వమంతటిలోనున్న సమర్థులైన గోపాలురు15 , జ్ఞానులు మూర్ఖుడనైన నాలో ప్రవేశించేరు.
22 The birds that eat honey nest and brood on that tree on whose tip, they say, is the sweet fruit. No one who does not know the father12 eats that.
22 తేనెను ఆస్వాదించే పక్షులు నివసించే చెట్టు చివరన తియ్యటి ఫల మున్నదని అంటారు. దానిని ఆరగించే తండ్రి 15 ఎవరికీ అంతు బట్టడు.
23 Only those gain immortality who know that the Gayatrï foot is based on the Gayatri hymn, or that the Tristubh foot is made from the Tristubh hymn, or that the Jagat foot is based on the Jagat hymn.
23 ఎవరికైతే గాయత్రి పాదము గాయత్రి ఛందస్సు గల ఋక్కులో, త్రిస్తుభ్ పాదము త్రిస్తుభ్ ఛందస్సు గల ఋక్కులో, జగత్ పాదము జగత్ గల ఛందస్సులో ఉన్నవని తెలుసో వారే అమరత్వము పొందగల్గిన వారు.
24 With the Gayatrï foot they fashion a hymn; with the hymn, a chant; with the Tristubh foot a strophe; with the strophe of two feet or four feet they fashion a speech. With the syllable they fashion the seven tones.
24 గాయత్రి ఛందస్సుతో ఋక్కును కూర్చుతారు; ఋక్కును జపిస్తారు. త్రిస్తు భ్ ఛందస్సు శబ్దాన్ని ఉచ్చరిస్తారు. రెండు లేదా నాల్గు పాదాలు గల్గిన శబ్దాలతో వాక్కును తయారు చేస్తారు. వాటినుండు సప్త స్వరాలు చెయ్య బడతాయి.
25 With the Jagat he fixed the stream in the sky. In the Rathantara chant he discovered the sun. They say the Gayatrï has three kindling-sticks, and so its power and magnificence excels.
25 జగత్ ఛందస్సుతో అతడు ఆకాశంలో ధారను స్థిర పరిచేడు. రథాంతర జపముతో సూర్యుని కనుగొన్నాడు. గాయత్రికి మూడు అగ్నిని రగిల్చే కర్ర లున్నాయి అంటారు. అందుకే దాని శక్తి, ప్రతిభ.
26 I call to the cow who is easy to milk, so that the milker with clever hands may milk her. Let Savitr17 inspire us with the finest vigour. The pot of milk is set on the fire – this is what I would happily proclaim.
26 నేను ఏ ఆవైతే సులభంగా పితక బడునో దానిని ఉద్దేశించి పలుకుతున్నాను. ఎందుకంటే గోపాలుడు దాని పొదుగుల నుండి అనాయాసంగా పాలను పితక గలడు. సవిత్రుడు 17 మనకు శక్తిని ఉత్సాహాన్ని ఇచ్చుగాక. పాల బిందె అగ్నిపై పెట్ట బడింది.
27 The mistress of riches has come, snuffling and longing in her heart for her calf. Let this cow give milk for the Asvins and grow greater for good fortune.
27 శ్రీమంతురాలు తన దూడకై ఎదురు చూస్తూ, కలవరిస్తూ వస్తున్నాది. ఈ గోవు అశ్విని దేవతలకు పాలిచ్చి అందరికీ శిరులిచ్చు గాక
28 The cow has lowed at her blinking calf, snuffling at his head to make him low. Longing for his warm mouth, she lows and swells with milk.
28 ఆవు అంబా యనుచు తనను రెప్పలార్పిస్తూ చూసే దూడను చూస్తూ, దాని తలను నాకుతూ దానిని అంబా అనేటట్లు ప్రేరేపిస్తూ యున్నది. దాని వెచ్చని నోటికై పరితపిస్తూ, తన పొదుగుని ఉన్నతం చేసి అంబా అనుచున్నది.
29 The one that encloses the cow hums; she that is set over the spluttering flame lows. With her hissing she has put down the mortal; becoming lightning, she has thrown off the cloak.
29 ఏదైతే ఆవును ఆవరించి యున్నదో అది మెల్లగా గానం చేస్తోంది. ఏదైతే అగ్నిపై ఉంచ బడినదో అంబా యనుచున్నది. బుసలతో ఆద్యంతము గల వానిని క్రింద ఉంచినది. మెరుపై తన కప్పును విసర్జించింది.
30 Life that breathes now lies still and yet moves fast, rushing but firmly fixed in the midst of the resting places.18 The life of the dead one wanders as his nature wills. The immortal comes from the same womb as the mortal.
30 సతతము శ్వాసించే ప్రాణము అచలమైనా మిక్కిలి వేగంగా పయనించి, ప్రవహిస్తున్నా ఆరామ స్థలములలో స్థిరంగా యున్నది18 . మరణించినవాని ప్రాణము తన ఇష్టాను సారము పయనిస్తుంది. అమరుడు, ఆద్యంతములు గలవాడు ఒకే యోని నుండి ఆవిర్భవిస్తారు.
31 I have seen the cowherd who never tires, moving to and fro along the paths. Clothing himself in those that move toward the same centre but spread apart, he rolls on and on inside the worlds.
31 నేను దారులలో నడుస్తూ అలసట లేని గోపాలుని చూసాను. అతడు ఒకే కేంద్రము వైపు పయనించే విస్తారముగా నుండే వారలచే ఆవరింపబడి లోకాలలో పయనిస్తున్నాడు.
32 He who made him knows nothing of him.19 He who saw him – he vanishes from him. Enclosed within the mother’s womb, yet full of progeny, he entered Destruction.
32 ఒకనిని తయారు చేసిన వానికి వాని గురించి తెలియదు19 . ఎవడైతే వానిని చూచాడో, వానికి అగుపడదు. తల్లి గర్భములో నుండి, సంసారయోగ్యుడైనప్పటికీ అతడు నాశనము చెయ్య బడుతున్నాడు.
33 The sky is my father; here is the navel that gave me birth. This great earth is my mother, my close kin. The womb for me was between the two bowls20 stretched apart; here the father placed the embryo in the daughter.
33 ఆకాశము నా తండ్రి. ఈ నాభి స్థానము నా జన్మకు కారణము. భూమి నా తల్లి. నా బంధువు. నా గర్భ స్థానము ఈ రెండు పాత్రల20 మధ్య యున్నది. ఇచ్చట తండ్రి కూతురులో పిండమును ఉంచేడు.
34 I ask you about the farthest end of the earth; I ask you about the navel of the universe. I ask you about the semen of the stallion bursting with seed; I ask you about the final abode of Speech.
34 నేను భూమి యొక్క అతి దూరమైన అంచును గూర్చి అడుగుతున్నాను. నేను విశ్వముయొక్క నాభిని గూర్చి అడుగుతున్నాను. నేను గుర్రముయొక్క బీజాలతో గూడిన వీర్యము గూర్చి అడుగుతున్నాను. నేను వాక్కు గమ్య స్థానము గూర్చి అడుగుతున్నాను.
35 This altar is the farthest end of the earth; this sacrifice is the navel of the universe. This Soma is the semen of the stallion bursting with seed; this Brahmin priest is the final abode of Speech.
35 ఈ ప్రదేశము భూమి నుండి అతి దూరమైనది. ఈ యజ్ఞమ విశ్వము యొక్క నాభి. ఈ సోమము బీజములతో ప్రజ్వరిల్లే గుర్రము యొక్క వీర్యము. ఈ హోత వాక్కు యొక్క గమ్యము.
36 The seven half-embryos portion out the semen of the world at Visnu’s command. Wise in their thoughts and their heart, themselves surrounded, they surround it on all sides.21
36 విష్ణువు ఆజ్ఞతో ఏడు సగ భాగములైన పిండములు విశ్వము యొక్క శుక్రమును పంచుతాయి. ఆలోచనలు, హృదయము జ్ఞానముతో గూడి, ఆవరింప బడి, సర్వమును ఆవరించి యున్నవి21 .
37 I do not know just what it is that I am like. I wander about concealed and wrapped in (th)ought. When the first born of Order came to me, I won a share of this Speech.
37 నా శ్వస్వరూపాము నాకు తెలియదు. నేను ఆలోచనలతో కప్పబడి, గోప్యంగా తిరుగు తున్నాను. నేను నా వద్దకు వచ్చిన క్రమము యొక్క జ్వేష్ట పుత్రుని నుండి వాక్చక్తిని పొందేను.
38 The one who is compelled as his own nature wills goes away and comes back; the immortal came from the same womb as the mortal.22 The two constantly move in opposite directions ; when people perceive the one, they do not perceive the other.
38 ఒకడు తన స్వభావము వలన వెళ్ళి వస్తూ ఉంటాడు. అమరుడు, ఆద్యంతములు గలవాడు ఒకే యోని నుండి ఆవిర్భవించేరు22 . వారిరువురూ వ్యతిరిక్త దిశలలో సదా పయనిస్తూ ఉంటారు. ఒకనిని గుర్తు పెడితే, ఇంకొకరిని గుర్తు పెట్టలేరు.
39 The undying syllable of the song is the final abode where all the gods have taken their seat. What can one who does not know this do with the song? Only those who know it sit together here.
39 పాట యొక్క అక్షరము దేవతలు ఆశీనులైన చివరి స్థానము. ఇది తెలియని వాడు పాటతో ఏమి చెయ్యగలడు? అది తెలిసిన వారే ఇక్కడ కలిసి కూర్చోగలరు.
40 Be happy eating good fodder, and then we will be happy too.23 O inviolable cow, eat grass and drink pure water as you graze for ever.
40 మంచి గడ్డిని తింటూ మమ్మలిని సంతోష పెట్టు23 . ఓ పవిత్రమైన గోమాతా, సదా గడ్డిని తింటూ, తియ్యటి నీటిని త్రాగుతూ ఉండు.
41 The buffalo-cow lowed as she fashioned the flowing waters; she who has a thousand syllables in the final abode became one-footed, two-footed, eight-footed, nine-footed.
41 ఎద్దు ప్రవహించే జలము వద్ద ఱంకె వేసింది. దేనికైతే అది గమ్య స్థానములో వంద అక్షరములు గలవో ఏక పాది, ద్విపాది, అష్ట పాది, నవ పాది అయి ఉన్నది.
42 The quarters of the sky live on the oceans that flow out of her in all directions. The whole universe exists through the undying syllable that flows from her.
42 ఆకాశము తన నుండి దూరముగా అన్ని దిక్కులా ప్రవహించే సముద్రములు ఆలంబనము కాగా స్థితమై యున్నది. సమస్త విశ్వమునకు తన నుండి ప్రవహించే అక్షరము ఆధారమై యున్నది.
43 In the distance I saw the cowdung smoke midway between what is above and what is below. The heroes roasted the dappled bull.24 These were the first ritual laws.
43 నేను పేడ పిడకల పొగ క్రింద మీద కప్పబడిన ప్రదేశం చూసాను. వీరులు ఎద్దుని వండేరు24. అవే మొదటి ఆచారములు.
44 The three long-haired ones25 reveal themselves at the right moment. During the year, one of them shaves; one looks upon everything with his powers; of one the onrush is visible, but the form is not.
44 పొడుగు కేశములు గల ముగ్గురు 25 తగిన సమయములో తమ శ్వస్వరూపాము చూపిస్తారు. ఒకడు సంవత్సర కాలంలో గడ్డము గీసుకొంటాడు. ఒకడు ప్రతి వస్తువును తన దివ్య దృష్టితో చూస్తాడు. ఒకని యందు ప్రవాహము కాననగును, కానీ ఆకారము కానరాదు.
45 Speech was divided into four parts that the inspired priests know. Three parts, hidden in deep secret, humans do not stir into action; the fourth part of Speech is what men speak.26
45 ఉత్సాహవంతులైన పండితులకు వాక్కు నాల్గు భాగములుగా యున్నదని తెలుసు. మూడు భాగాలు గుహ్యముగా ఉంటే మానవులు అచేతనముగా ఉంటారు. మనిషి పలికేది నాల్గవ భాగము మాత్రమే 26.
46 They call it Indra, Mitra, Varuna, Agni, and it is the heavenly bird that flies. The wise speak of what is One in many ways ; they call it Agni, Yama, Matarisvan.
46 దానిని ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, స్వర్గములో నుండే ఎగిరే పక్షి అని అందురు. జ్ఞానులు అనేక విధములుగా అద్వితీయమైన దాని గురించి ప్రస్తావిస్తారు. దానిని అగ్ని, యమ, మతరిశ్వన్ అందురు.
47 The yellow birds clothed in waters fly up to the sky on the dark path. They have now returned from the home of Order, and at once the earth was drenched with butter.
47 పసుపు రంగు పక్షి జలములతో కప్పబడి, ఆకాశములో గుండా అంధకార మార్గములో ఎగురుతోంది. క్రమము యొక్క ఇంటి నుండి తిరిగి రాగా, భూమి ఒక్కమారు నెయ్యతో కప్పబడినది.
48 Twelve fellies, one wheel, three naves – who has under stood this? Three hundred and sixty are set on it like poles that do not loosen.
48. పన్నెండు చక్రపు కవచాలు , ఒంటి చక్రం, మూడు రథ మధ్య భాగాలు-- వీటిని ఎవ్వరు అర్థము చేసుకొన్నారు? 360 మంది దానిపై కదిలింప శక్యముగాని కర్రలతో స్థితమై యున్నారు.
49 Your inexhaustible breast, Sarasvati,27 that flows with the food of life, that you use to nourish all that one could wish for, freely giving treasure and wealth and beautiful gifts – bring that here for us to suck.
49 సరస్వతీ 27 ప్రాణమునకు ఆధారమైన ఆహారము ఇచ్చే, ఎవనికి కావలసిన పోషణ వారికి ఇచ్చే, ఉదారముగా సంపద మరియు దానము ఇచ్చే, సదా ప్రవహించే స్తన్యములను మా నోట్లకు అందజేయి.
50 The gods sacrificed to the sacrifice with the sacrifice. These became the first ritual laws. These great powers went to the dome of heaven where dwell the Sadhyas, the ancient gods.28
50 దేవతలు యజ్ఞమునకు యజ్ఞముతో హోమము చేసేరు. ఇవి మొదటి ఆచారములు అయినవి. పురాతనమైన దేవతులైన సాధ్యులు నివసించే స్వర్గ స్థానమునకు ఈ శక్తులు ప్రసరించేయి28.
51 The same water travels up and down day after day. While the rain-clouds enliven the earth, the flames enliven the sky.29
51 ఒకే జలము క్రిందకీ మీదకీ సదా ప్రవహిస్తున్నది. వర్ష మేఘాలు భూమిని ఉత్తేజింప చేయగా, అగ్ని శిఖలు ఆకాశాన్ని ఉత్తేజ పరుస్తున్నాయి29.
52 The great heavenly bird with wonderful wings, the beautiful embryo of the waters and the plants, that delights us with rains over flowing – I call to him for help.
52 శక్తివంతమైన, రమ్యమైన రెక్కలు గల స్వర్గములో నుండే పక్షిని, అందమైన జలము యొక్క పిండాన్ని, వర్షాకాలంలో రంజింపజేసే ఓషధులను నన్ను రక్షింపమని ప్రార్థిస్తున్నాను.
NOTES
వివరణ
1. The first brother is the oblation fire with his grey beard of smoke; the second is the southern fire, hungry because it seldom receives the oblation; the third is the domestic fire that is ‘fed’ the butter oblation. Agni is the Lord of All Tribes, and his sons are the priests.
1 తెల్లటి గడ్డము గల మొదటి తమ్ముడు యజ్ఞములో మొదటి ఆహుతికి సంకేతము. రెండవ తమ్ముడు దక్షిణాగ్ని -- ఆహుతులు తరచుగా నుండవు గావున ఎప్పుడూ ఆకలితో నుండేది; మూడవది నెయ్యతో ఆహుతులు అందించే గృహములో నుండే అగ్ని. అన్ని జాతుల ఆరాధ్య దైవము అగ్ని. హోతలు వాని పుత్రులు.
2. For the magic powers of the three naves, cf. the curing of Apala (8.91.7).
2 మూడు రథ మధ్య భాగముల దివ్య శక్తులకై.
3. The newborn sun or fire has bones (the male element) though it is born from the boneless one (the female, who gives soft things – blood, breath, spirit), the earth.
3 క్రొత్తగా ఆవిర్భవించిన సూర్యుడు, పురుషుడైన అగ్ని ఎముకలు కలిగియుండి, రక్తము, శ్వాస, ప్రాణము, పోసే ఎముకలు లేని స్త్రీ అంశ అయినట్టి భూమి నుండే జన్మించెను.
4. The footprints of the gods may be the sacrificial laws, which are ‘woven’ when the gods as poet-priests perform the sacrifice, by weaving their words.
4 దేవతల అడుగుజాడలు యజ్ఞ ఆచారములు. అవి హోతలు ఆచరించి నప్పుడు కూర్చిన ఋక్కులవలె అల్లబడినవి.
5. The mother of the sun is Dawn, who is pierced by her father as well as the sun’s father, the Sky; recoiling from incest, she nevertheless does what must be done (the ‘Order’) and is praised for this.
5 సూర్యుని తల్లి ఉషస్సు. ఆమె తన తండ్రి మరియు సూర్యుని తండ్రియైన ఆకాశముతో సంయోగము చెందినది. వెనకంజ వేయుట తండ్రితో సంభోగము చెయ్య మనస్కరించక. కానీ సృష్టి రీతి వలన చేయక తప్పలేదు. అందుకై ఆమె పొగడ బడినది.
6. The calf searches for the mother who has abandoned him, as the mothers of Indra and Vivasvan (another form of the sun) abandon them in Vedic mythology. The three stages of the journey are one-tenth of the thirty-stage journey that the sun traverses every twenty-four hours; or they are the three-day journey of the dead man (cf. 10.14.16).
6 దూడ తల్లి గోవుచే విసర్జించ బడి తల్లికై వెదకుచున్నాది. వేదములో మరొకచోట ఇంద్ర, వివస్వన్ యొక్క తల్లులు వారలను విసర్జించేరు. ప్రయాణములోని మూడు అవస్థలు: ప్రతి 24 గంటలలో 30 అవస్థలలో పదవ వంతు పయనించే సూర్యుని గమనము. లేదా మరణించిన జీవి పయనించే మూడు రోజులు.
7. The three mothers and fathers are the three earths and three skies as parents of the sun, here identified with the Absolute. Speech does not inspire every priest, though she is present in them all.
7 మూడు తలిదండ్రులు మూడు భూమ్యాకాశాలు తలిదండ్రులుగా గల సూర్యుడు ఇచ్చట అద్వితీయముతో పోల్చబడినది. వాక్కు అందరిలో ఉన్నప్పటికీ, ప్రతి హోతను ఉత్తేజింప చేయదు.
8. The sun is imagined either as supreme in heaven, or as ruling only the lower half, the upper being the abode of Speech.
8 సూర్యుని ఆకాశమునకు చక్రవర్తిగా వర్ణింప బడినది. ఆకాశములో ఊర్థ్వ భాగము వాక్కు యొక్క నిలయము కాగా, సూర్యుడు తక్కిన భాగమునకు అధిపతి.
9. In Vedic mythology, Aditi gives birth to the immortal Adityas in pairs, while she rejects the sun, Vivasvan, born alone (cf. 10.72.8-9). In the ritual, there are twelve paired months and one odd one, the intercalary month which interrupts the sequence and causes the others to ‘change and waver’.
9 వేదములో అదితి అమరులైన ఆదిత్యులను కవలలుగా కంటుంది. ఒక్కరొక్కరుగా జన్మించిన సూర్యుని, వివస్వుని విసర్జించెను. ఆచార వ్యవహారములలో 12 జత జేయబడిన మాసములు కాగా, ఒకటి అధిక మాసము.
10. The androgyny of the creators appears, on the ritual level, in the fact that the months (a masculine term in Sanskrit) are procreative. The second half of the verse puns upon the father of the sun (the sky) and the father of the poet who competes with and surpasses his own father. Cf. 6.9.2.
10 సృష్టికర్తను ఆచార వ్యవహారములలో పురుషునిగా వర్ణింపబడెను. మాసములు పుంలింగముగా భావించినా అవి గర్భము దాల్చేవిగా వర్ణింపబడినది. పాదము యొక్క రెండవ భాగములో సూర్యుని తండ్రియైన ఆకాశముతో, ద్రష్ట తండ్రితో పోటీ పడగా, ద్రష్ట తన తండ్రిని అధిగమించేడు.
11. The dawn cow, between sky (above) and earth (below), has her calf at her heels as she kicks him away; she is alone because she has abandoned him.
11 ఉషస్సనే గోవు, భూమ్యాకాశాల మధ్యన, తన కాళ్ళ వద్దనున్న దూడను తన్ని, దూరము చేసికొని, ఒంటరి దైనది.
12. ‘His’ father refers both to the poet who knows his own father and the one who knows the sun’s father.
12 తన తండ్రిని తెలిసిన ద్రష్ట మరియు సూర్యుని తండ్రిని తెలిసిన వానికిని సంకేతము.
13. The rituals of the past become the rituals of the future; the deeds of the gods still remain effective for us now.
13 గతములోని ఆచారములు, భవిష్యత్తులో ఆచారములుగా నుండేవి. దేవతల కర్మలు ఇప్పటికీ మనలను ప్రభావితము చేస్తున్నాయి.
14. On the tree of knowledge and immortality, some eat and some cannot.
14 జ్ఞానము, అమరత్వము అనే వృక్షములో కొందరు భుజించ గలరు మరి కొందరు భుజించలేరు.
15. Agni is the herdsman or the cowherd.
15 అగ్ని గోపాలుడు
16. These deeds are attributed to Indra or the creator in other hymns. The Gayatri has three feet, here identified with the kindling-sticks of fire.
16 ఈ కార్యములు ఋక్కుల ద్రష్ట లేదా ఇంద్రునికి ఆపాదించబడ్డాయి. గాయత్రి చందస్సులోని మూడు పాదాలు ఇచ్చట మూడు అగ్నిని రగిల్చే కర్రలుగా చెప్పబడ్డాయి.
17. Savitar, the divine obstetrician and embodiment of twilight (cf. 2.38, 1.35), is called to assist the Pravargya ritual in giving birth to the sun. The milk hissing in the pot is the dawn cow snuffling at her calf, the sun; the milk that swells in her udder is the milk that boils; the pot sings a chant, and the cow (the milk) throws off her cover (the lid), as the milk boils over.
17 దేవతల వైద్యుడు, ప్రాతః సంధ్య కాలమునకు సూచితమైన సవిత్రుని సూర్యుని ఆవిర్భవింపజేసే ప్రవర్గ్య అనే కార్యమునకు ఆహ్వానింపబడ్డాడు. పాత్రలో బుస కొట్టే పాలు, ఉషస్సనే గోవు దూడను చూచినపుడు చేసే శ్వాస ప్రక్రియ శబ్దము. తన పొదుగును పెద్దది చేయుట పాత్రలోని పాలు పొంగుట. పాత్ర జపము జేయగా, గోవు అనబడే పాలు పొంగగా, పాత్ర పై నున్న కప్పు తీయబడుతుంది.
18. The death and rebirth of the mortal, or of the mortal sun. The resting-places of the sun or fire are sky, earth, and the waters, or just the waters.
18 మరణము, పునర్జన్మము గల జీవుడు లేదా జీవునివలె ప్రవర్తించే సూర్యుడు. సూర్యుని లేదా అగ్నుల ఆరామ ప్రదేశములు: ఆకాశము, భూమి, జలము, లేదా జలము మాత్రమే
19. The sun who disappears from the sky (his father), or the breath of life that disappears from the dead body (of the mortal or the mortal sun).
19 తండ్రియైన ఆకాశములో అంతర్ధానమయ్యే సూర్యుడు; లేదా ప్రాణము జీవి మరియు జీవుని వలె జనన మరణములు గల్గిన సూర్యుడు నుండి నిష్క్రమించుట
20. The two bowls, literally wooden bowls for Soma, are sky and earth. Cf. 1.160.1.
20 రెండు సోమమును ఉంచే కర్ర పాత్రలు: భూమ్యాకాశములు
21. The seven creators or priests fashion the sun from the seed split by the father when he incestuously embraces his daughter. Or the Adityas fashion the sun from the misformed embryo; while they themselves are still embryos ‘surrounded’ in the womb, they ‘surround’, i.e. form into a ball, the semen.
21 ఏడు హోతలు సూర్యుని కూతురిని ఆలింగనము చేసిన తండ్రి శుక్లముతో జేసిరి. లేదా ఆదిత్యులు గర్భములోనుండగా సూర్యుని అసంపూర్ణముగా తయారైన పిండముతో జేసిరి. అనగా తాం గర్భ కోశముతో కప్పబడి, సూర్యుని చుట్టూ ఆవరించిరి.
22. The soul that is reborn according to its nature, or the sun. The immortal soul/sun and the mortal body/dead sun or night are on opposite sides of the earth/mind at any given time.
22 పునర్జన్మము పొందే ఆత్మ లేదా సూర్యుడు. నిత్యమైన ఆత్మ లేదా సూర్యుడు, అనిత్యమైన దేహము లేదా రాత్రి మరణించే సూర్యుడు భూమి లేదా మనస్సులకు వ్యతిరేక దిక్కులలో నుండేవారు.
23. Here and in the next two verses the cow is Speech.
23 గోవు అనగా వాక్కు
24. Soma (explicitly mentioned in verse 35) is the bull. The final phrase also appears as 10.90.16.
24 సోమ అనగా ఎద్దు.
25. Three forms of Agni with flames for hair, or three ecstatic sages (cf. 10.136.1). The former interpretation is supported by the second half of the verse: Fire shaves the earth; the sun watches; the wind’s path is perceived, but the wind itself is invisible. Cf. 10.168.4.
25 యజ్ఞములో వాడే మూడు అగ్నుల రూపాలు, జ్వాలలు కేశములు; లేదా ముగ్గురు తన్మయులైన ఋషులు. పై క్రమంలో మొదట చెప్పబడినవి, పాదములోని రెండవ భాగములో వివరింప బడినవి: అగ్ని భూమి పైన యున్నవాటిని నిర్మూలిస్తుంది; సూర్యుడు సాక్షిగా నుంటాడు; గాలి గమనము తెలిసినా, దానిని చూడలేము.
26. This verse closely resembles 10.90.4.
26 ఇది 10.90.4 నకు దగ్గర
27. Sarasvati as goddess of Speech and as the river in the sky (cf. v. 25) and on earth.
27 సరస్వతి అనగా వాగ్దేవత, భూమ్యాకాశాలలో ప్రవహించే నది.
28. This verse appears also as 10.90.16.
28 ఈ పాదము 10.90.16 లో కూడా వస్తుంది.
29. Rain falls from the sun in the sky in return for flame from the sacrifice on earth.
29 యజ్ఞమునుండి ఎగసిపడే అగ్ని జ్వాలలవలన వర్షము ఆకాశమునందు ఉండే సూర్యుని వలన కలిగేది.
No comments:
Post a Comment