Saturday, April 25, 2026

Wendy Doniger Rig Veda Aswa




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి

1.163   Hymn to the Horse

1.163   అశ్వము

The sacrificial horse is identified with the sun and fire; here he is also identified with several other gods, as well as with the earthly racehorse (who is himself a figure with whom many gods are identified).

యజ్ఞ ఆశ్వాన్ని సూర్యునితో, అగ్నితో పోలుస్తారు. ఈ ఋక్కులో ఆశ్వాన్ని పలు దేవతలతో, అలాగే పందేలలో పాల్గొనే ఆశ్వాలతో కూడా పోల్చేరు.

1 When you whinnied for the first time, as you were born coming forth from the ocean or from the celestial source,1 with the wings of an eagle and the forelegs of an antelope – that, Swift Runner, was your great and awesome birth.

1 శర వేగంతో పరిగెత్తగల, ఒక సముద్రము లేదా పరలోకమునుండి1, గ్రద్ద రెక్కలు మరియు లేడి ముందు కాళ్లు కలిగినట్లుగా, నీవు పుట్టినపుడు చేసిన మొదటి శకలింపు నీ విస్మయము చెందించే ప్రసవము,

2 Yama gave him and Trita harnessed him; Indra was the first to mount him, and the Gandharva grasped his reins. You gods2 fashioned the horse out of the sun.

2 యమధర్మరాజు దానిని దానం చేసేడు; త్రిత దానికి కళ్ళేలు పూన్చేడు; ఇంద్రుడు దానిని అధిరోహించేడు; గంధర్వుడు దాని కళ్ళేలు పట్టుకొన్నాడు. దేవతలు2 ఆశ్వాన్ని సూర్యుని ద్వారా తయారు చేసేరు.

3 Swift Runner, you are Yama; you are Aditya; you are Trita, through the hidden design.3 You are like and not like Soma.4 They say you have three bonds in the sky.5

3 ఓ శర వేగంతో పరిగెత్తే అశ్వమా, నీ దేహ అమరికలో 3 నీవు యముడవు; నీవు ఆదిత్యుడవు; నీవు త్రిత. నీవు సోమము కావచ్చు కాకపోవచ్చు4 ; నీకు ఆకాశముతో మూడు బంధాలు ఉన్నాయని అంటారు5 .

4 They say you have three bonds in the sky, three in the waters, and three within the ocean.6 And to me you appear, Swift Runner, like Varuna, that is said to be your highest birth.

4 నీకు ఆకాశంతో మూడు బంధాలు ఉన్నాయని అంటారు; నీటితో మూడు బంధాలు; సముద్రముతో మూడు బంధాలు ఉన్నాయని అంటారు6 . నాకు నీవు వరుణుని వలె శర వేగంతో కదిలే ఉన్నతమైన దానిగా అగుపడుతావు.

5 These are the places where they rubbed you down when you were victorious; here are the marks where you put down your hooves. Here I saw your lucky reins, which the Guardians of the Order keep safely.

5 నీవు విజయము పొందినప్పుడు, ఈ మూడు ప్రదేశాలలో స్పర్శించ బడినావు. నీ గిట్టల జాడలు ఇక్కడ గలవు. విశ్వ క్రమమును పరిరక్షించే వారలచే రక్షింపబడిన నీ అదృష్టమైన కళ్ళేలను చూసేను.

6 From afar, in my heart I recognized your soul, the bird7 flying below the sky. I saw your winged head snorting on the dustless paths easy to travel.8

6 దూరంనుంచి ఆకాశంలో పక్షి వలె7 కదులుచున్న నీ ఆత్మను చూసేను. నీ రెక్కలు గల శిరము సునాసయంగా ప్రయాణించ గల దారులలో పయనించడం చూసేను8 .

7 Here I saw your highest form eager for nourishment in the place of the cow.9 As soon as a mortal gets the food that you enjoy, the great devourer of plants awakens him.10

7 నీవు గోవు స్థానంలో ఆహారము భుజించుటకై మిక్కలి కుతూహలంతో ఉండడం చూసేను9 . ఎప్పుడైతే ఒక జీవి నీవు ఆహ్లాదంతో తినే భోజనాన్ని పొందుతుందో, ఓషధులను భుజించే వాడు వానిని నిద్ర లేపుతాడు10 .

8 The chariot follows you, Swift Runner; the young man follows, the cow follows, the love of young girls follows. The troops follow your friendship.11 The gods entrusted virile power to you.

8 ఓ శర వేగంతో కదిలే అశ్వమా, రథం నీ వెనుకనే వస్తుంది; యువకుడు వెనుక వస్తాడు; గోవు వస్తుంది; బాలికల ప్రేమ దాని వెనుకనే వస్తుంది. సేనలు నీ మైత్రి వెనుక వస్తాయి 11 ; దేవతలు నీకు అమిత శక్తిని ప్రసాదించేరు.

9 His mane is golden;12 his feet are bronze. He is swift as thought, faster than Indra. The gods have come to eat the oblation of the one who was the first to mount the swift runner.13

9 వాని మెడ వద్ద నున్ను జూలు బంగారు వర్ణంతో ఉంది12; వాని పాదాలు కంచు. వాడు ఆలోచన వలె అతి వేగంతో కదిలేవాడు; ఇంద్రునికన్నా వేగంతో కదిలేవాడు. శరవేగంతో కదిలేవానిని మొదట అధిరోహించిన వాని హవిస్సుని స్వీకరించడానికి దేవతలు వచ్చేరు13 .

10 The celestial coursers, revelling in their strength, fly in a line like wild geese, the ends held back while the middle surges forward, when the horses reach the racecourse of the sky.

10 ఆశ్వాలు ఆకాశంలో పందెపు గుర్రాలు పరిగెత్తేవిగా, దేవతలు తమ అమితమైన శక్తితో, ఒకే వరుసలో చివర్లు వెనుకన ఉండగా మధ్యము ముందుకు కదిలే బాతుల వలె, ఎగురుతున్నారు.

11 Your body flies, Swift Runner; your spirit rushes like wind. Your mane,12 spread in many directions, flickers and jumps about in the forests.14

11 నీ దేహం శర వేగంతో కదులుతుంది; నీ ఆత్మ వాయువు వలె పయనిస్తుంది. నీ జూలు 12 అడవులలో అనేక దిక్కులలో మెరుస్తూ చలిస్తుంది14 .

12 The racehorse has come to the slaughter, pondering with his heart turned to the gods. The goat, his kin,15 is led in front; behind come the poets, the singers.

12 శరవేగంతో కదిలే అశ్వము బలికై హృదయములో దేవతలను స్మరిస్తూ వచ్చింది. దాని మిత్రుడైన మేక 15 ముందు నడుస్తోంది. కవులు, గాయకులు వెనుక వస్తున్నారు.

13 The swift runner has come to the highest dwelling-place, to his father and mother. May he go to the gods today and be most welcome, and then ask for the things that the worshipper wishes for.

13 శర వేగంతో కదిలే వాడు ఉత్కృష్టమైన లోకాలలో నుండే తలిదండ్రుల వద్దకు వచ్చేడు. అతడు దేవతలచే ఆదరముతో ఆహ్వానింప బడుగాక. వారికి యజ్ఞ యజమాని కోరేవి విన్నపించుగాక

NOTES

వివరణ

1. A possible reference to the sun born in the ocean and also born from the waters in the sky.

1 బహుశా సముద్రము నుండి ఉదయించే, అలాగే ఆకాశమనే సముద్రము నుండి ఉదయించే సూర్యునికి సంకేతము

2. The Vasus are a group of gods associated with the sun.

2 వసువులు సూర్యునితో సంబంధమున్న దేవతలు

3. Perhaps the magic power of the sacrifice, or the secret power associated with the mysterious Trita, or simply the “Vedic power of secret equivalences.

3 యజ్ఞము యొక్క మహత్తు లేదా త్రిత యొక్క గుహ్యమైన శక్తి, లేదా వైదికపరమైన గుహ్యమైన ఉపమానములు.

4. As Agni, he is both likened to and contrasted with Soma through the mechanism of parallel oppositions and the Vedic concept of liquid fire or the fiery liquid; as a sacrificial animal, he is joined with Soma in the ritual dimension.

4 అగ్ని రూపంలో, వైదికపరమైన ద్రవము వలె నుండే అగ్ని లేదా అగ్నితో మండించబడిన ద్రవము వలె, అతడు సోమముతో పోల్చబడెను

5. The bonds are the three gods named in the first sentence of this verse.

5 బంధాలు మొదట చెప్పబడిన మూడు దేవతలు.

6. The three bonds are multiples of the bond in each of three places named: the sky (v. 3, and the ‘highest birth’ in Varuna), the waters (v. 1, and perhaps also v. 5, where the gods bathed the celestial horse), and the ocean (v. 1, and also implicit in the birth from Varuna, god of the ocean).

6 మూడు బంధాలు మూడు ప్రదేశాలకు సూచితము: వరుణుని జన్మ స్థానమైన ఆకాశము , దేవతలు దివ్య ఆశ్వాన్ని స్నానము చేయించిన జలము , మరియు వరుణుడు అధిపతియైన, వానినుంచి ఉద్భవించిన సముద్రము.

7. The sun as a bird.

7 సూర్యుడు పక్షి వలె నుండుట

8. The paths that lead to the sun.

8 సూర్యుని వద్దకు చేర్చే మార్గములు

9. the cows won by the victorious racehorse ; and as the cattle won in raids on horseback.

9 పరుగు పందెంలో జయించిన అశ్వము పొందిన గోవులు; ఆశ్వాలపై స్వారీ చేసి గెలుచుకున్న గోవులు.

10. A mysterious sentence. Agni, who devours plants (in forest fires), awakens man every morning (as the sun); the herbivorous horse also devours plants, and is awakened every morning to be fed. The worshipper who ‘feeds’ the sacrificial fire (or offers oblations to the sun) is ‘awakened’ when he arrives in heaven. All of these are possible (as the final ‘him’ must be supplied and has no clear referent).

10 ఒక అనిర్వచనీయమైనది. అడవిని కాల్చి ఓషథులను భుజించే అగ్ని ప్రతి ఉదయము సూర్యుని వలె మనిషిని నిద్రలేపుట; శాఖాహారి అయిన అశ్వము కూడా ఓషథులను భుజిస్తుంది మరియు ప్రతి ఉదయము గ్రాసముకై లేప బడుతుంది; ఆహుతులు ఇస్తూ అగ్నికి లేదా సూర్య భాగవానునికి ఆహారమిస్తూ యజ్ఞ యజమాని స్వర్గ ద్వారము చేరిన పిమ్మట మేల్కొనుట

11. A martial procession behind the war-horse; a sacrificial procession behind the consecrated stallion; a triumphant procession behind the racehorse.

11 యుద్ధములో పాల్గొనే అశ్వము వెనుక నడిచే సైన్యము; యజ్ఞ అశ్వము వెనుక నడిచే వారు; విజయోత్సాహముతో పందేలలో పాల్గొనే అశ్వం వెనుక కదిలేవారు.

12. The mane (literally, the ‘horns’) of the horse as a metaphor for the rays of the sun.

12 అశ్వము మెడ క్రింద నుండే జూలు, సూర్యకిరణాలకు సంకేతము.

13. ‘The one’ would be Indra, rider of the solar horse according to verse 2, but here it would seem to designate the earthly king, the owner of the earthly horse.

13 సూర్య ఆశ్వాన్ని స్వారీ చేసే ఇంద్రుడు; కానీ ఇక్కడ భూలోకంలో ఆశ్వాన్ని రాజు స్వారీ చేయుట

14. Here the rays are scattered by the foliage.

14 కిరణాలు ఓషథులచే వెదజల్లబడుట

15. Either a scapegoat for the sacrificial horse (cf. 1.162.2-3), or just a companion for the racehorse (as racehorses often have goats, to this day).

15 అశ్వంతో బలి ఇవ్వబడే మేక లేదా అశ్వముతో మైత్రి గలది.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Aswa

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...