Saturday, May 2, 2026

Wendy Doniger Rig Veda Aswa Bali




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట

1.162   అశ్వ బలి

1.162   The Sacrifice of the Horse

Strikingly concrete in its detail, this hymn describes the ancient Indian horse sacrifice, beginning with the ceremonial procession of the horse with the scapegoat, leading to the actual slaughter (vv. 1-7). It then dwells upon the material instruments of the sacrifice which are to accompany the horse to heaven.

ఈ ఋక్కు అశ్వ బలి గూర్చి వివరిస్తుంది. ఆశ్వాన్ని మేకతో పాటు బలి చేయుటకై పురోహితులు తీసుకుపోవుట వివరింపబడినది. అటు పిమ్మట అశ్వముతో పాటు స్వర్గ లోకమునకేగే బలికి వాడే పనిముట్ల గూర్చి చెప్పబడినది .

1 Mitra, Varuna, Aryaman the Active,1 Indra the ruler of the Rbhus,2 and the Maruts3- let them not fail to heed us when we proclaim in the assembly the heroic deeds of the racehorse who was born of the gods.4

1 మిత్రుడు, వరుణుడు, ఆర్యమాన్1, ఋభులకు పాలకుడైన ఇంద్రుడు2 , మరియు మరుత్తులు3 మేము ఈ దేవాంశశంభూతమైన ఈ దివ్య అశ్వము యొక్క వీర గాధను వివరిస్తూ ఉండగా వినిదెరు గాక 4

2 When they lead the firmly grasped offering5 in front of the horse that is covered with cloths and heirlooms, the dappled goat goes bleating straight to the dear dwelling of Indra and Pusan.

2 వారు దివ్య వస్త్రాలు మరియు ఆభరణాలతో అలంకరింపబడిన అశ్వము ముందు ఆహుతులు తీసికొని వెళ్తూ5 , అనేక వర్ణములైన మచ్చలు గల మేక 'మే' అనుచుండగా ఇంద్రుడు మరియు పూసన్ యొక్క గృహము దిక్కున పయనించిరి

3 This goat for all the gods is leds forward with the racehorse as the share for Pusan. When they lead forth the welcome offering5 with the charger, Tvastr urges him on to great fame.

3 పూసన్ వంతయిన మేక అశ్వం ముందు నడవగా, వారు ఆహుతులు తీసుకొని వెళ్ళు చుండగా5, త్వత్సరుడు వానికి మిక్కలి ఖ్యాతిని ప్రసాదించెను. 6

4 When, as the ritual law ordains, the men circle three times, leading the horse that is to be the oblation on the path to the gods, the goat who is the share for Pusan goes first, announcing the sacrifice to the gods.

4 శాస్త్రాన్ని అనుసరించి, పరోహితులు మూడు ప్రదిక్షణములు చేసి, దేవతలను చేరే మార్గమున ఆహుతిగా ఆశ్వాన్ని నడపగా, పూసన్ వంతయిన మేక వారి రాకను ప్రకటిస్తూ ముందు నడుస్తున్నది.

5 The Invoker,6 the officiating priest, the atoner,7 the re-kindler, the holder of the pressing-stones, the reciter, the priest who prays – fill your bellies with this well- prepared, well-sacrificed sacrifice.

5 హోత6 , అధ్వర్యు, ఉద్గాత్రి7, సోమరసాన్ని పిండే రాళ్ళను పట్టుకునే వాడు, మంత్రాలను వల్లించేవాడు, ప్రార్థన చేసే పురోహితుడు - తమ కడుపుల నిండుగా ఈ శుభకరమైన బలిని స్వీకరించెదరుగాక

6 The hewers of the sacrificial stake and those who carry it, and those who carve the knob 8 for the horse’s sacrificial stake, and those who gather together the things9 to cook the charger – let their approval encourage us.

6 యూప స్థంభమును చేసే వడ్రంగులు, దాన్ని మోసేవారు, ఆశ్వాన్ని బలి ఇచ్చే పీఠం చేసేవారు8 , ఆశ్వాన్ని వండుటకై అన్నీ సిద్ధం చేసేవారు9 - వారి సమ్మతి మమ్ములను ఉత్సాహభరితులను చేయుగాక

7 The horse with his smooth back went forth into the elds of the gods, just when I made my prayer. The inspired sages exult in him. We have made him a welcome companion at the banquet of the gods.

7 నేను ప్రార్థన చేయుచుండగా, నున్నని మేను గల అశ్వము దేవతల వద్దకు చేరినది. ఉత్సాహ వంతులైన మునులు జయజయ ధ్వనులు చేసేరు. వానిని దేవతల విందుకు తగిన వానిగా చేసితిమి.

8 The charger’s rope and halter, the reins and bridle on his head, and even the grass that has been brought up to his mouth – let all of that stay with you10 even among the gods.

8 ఆశ్వానికి కట్టే త్రాడు, దాన్ని నియంత్రించే సామగ్రి, కళ్ళేలు, దాని నోటికి అందించే పచ్చిక -- దేవతల సమక్షము అయినప్పటికీ అన్నీ నీ వద్దనే ఉండు గాక 10

9 Whatever of the horse’s flesh the fly has eaten, or whatever stays stuck to the stake or the axe, or to the hands or nails of the slaughterer11 – let all of that stay with you10 even among the gods.

9 ఈగలు తిన్న అశ్వము యొక్క మాంసము, యూప స్తంభమునకు అంటుకొన్నది, గొడ్డలికి అంటుకొన్నది, బలి చేసిన వాని చేతులకు మరియు గోళ్ళకు అంటుకొన్నది11 - -- దేవతల సమక్షము అయినప్పటికీ అన్నీ నీ వద్దనే ఉండు గాక

10 Whatever food remains in his stomach, sending forth gas, or whatever smell there is from his raw flesh11 – let the slaughterers make that well done; let them cook the sacrificial animal until he is perfectly cooked.

10 వాని జీర్ణ కోసములో నున్న పదార్థములు, వాని నుండి వచ్చే వాయువులు, మరియు వాని మాంసము వండగా వచ్చిన వాసనలు 11 - బలి ఇచ్చిన వారు శుద్ధము చేయుగాక; బలిని పూర్తిగా వండెదరు గాక

11 Whatever runs off your body when it has been placed on the spit and roasted by the fire, let it not lie here in the earth or on the grass, but let it be given to the gods who long for it.

11 ఇక నీ దేహము నుండి వెలువడిన తక్కినవి అగ్ని దేవునిచే శుద్ధము చేయుబడుగాక; అవి ఈ భూమి మీదగాని, పచ్చిక మీదగాని ఉండక ఎదురుచూసే దేవతలకు ఇవ్వబడు గాక

12 Those12 who see that the racehorse is cooked, who say, ‘It smells good! Take it away!’, and who wait or the doling out of the flesh of the charger – let their approval encourage us.

12 అశ్వము వండబడినదని కొందరు "సువాసనతో కూడి యున్నది. మంట నుండి తీసివేయి" అనేవారు12 , అశ్వము యొక్క మాంసపు ముక్కలకై ఎదురు చూసేవారు - వారి అనుమతి మమ్ములను ఉత్సాహవంతులను చేయుగాక.

13 The testing fork for the cauldron that cooks the flesh, the pots for pouring the broth, the cover of the bowls to keep it warm, the hooks, the dishes – all these attend the horse.

13 మాంసము వండిన పాత్ర, గరిటెలు, బిందెలు, వాటి మీద కప్పులు, తినే పాత్రలు -- అన్నీ అశ్వముతో పంపబడేవి.

14 The place where he walks, where he rests, where he rolls, and the fetters on the horse’s feet, and what he has drunk and the fodder he has eaten – let all of that stay with you10 even among the gods.

14 అతడు నడిచిన, విశ్రాంతి తీసికొన్న, పొరలిన స్థలములు, కాళ్ళకు కట్టిన సంకెళ్ళు, త్రాగే నీరు, తినే పచ్చిక -- -- దేవతల సమక్షము అయినప్పటికీ అన్నీ నీ వద్దనే ఉండు గాక 10

15 Let not the fire that reeks of smoke darken you, nor the red-hot cauldron split into pieces. The gods receive the horse who has been sacrificed, worshipped, consecrated, and sanctified with the cry of ‘Vasat!’13

15 అగ్ని నుండి వెలువడిన పొగ నిన్ను మాలిన్యముతో కప్పకుండా ఉండుగాక. మంటచే ఎర్రగా మారిన పాత్ర ముక్కలు అవ్వకుండు గాక. "వసత్" అనుచూ ఈ విధంగా బలి ఇవ్వ బడిన, పూజింప బడిన, శుద్ధము చేయబడిన, భక్తితో ఇవ్వబడిన ఆశ్వాన్ని దేవతలు స్వీకరించెదరు. 13

16 The cloth that they spread beneath the horse, the upper covering, the golden trappings on him, the halter and the fetters on his feet – let these things that are his own bind the horse among the gods.

16 అశ్వము క్రింద నుంచ బడిన వస్త్రము, మీదనుంచబడిన వస్త్రము, ఆభరణములు, కాళ్ళకు కట్టబడిన సంకెళ్ళు -- అవి వానివై యుండగా, అశ్వము దేవతలతో బంధము గావించు గాక

17 If someone riding you has struck you too hard with heel or whip when you shied, I make all these things well again for you with prayer,11 as they do14with the oblation’s ladle in sacrifices.

17 ఎవరైనా నిన్ను స్వారీ చేస్తూ పాదాలతో తన్నినా, కొరడాతో కొట్టినా, యజ్ఞములో ఆహుతులిచ్చే గరిటెతో చేసినట్టుగా 11 వాటిని ప్రార్థనతో1 1 సరి చేసెదను.

18 The axe cuts through the thirty-four ribs15 of the race horse who is the companion of the gods. Keep the limbs undamaged and place them in the proper pattern. Cut them apart, calling out piece by piece.16

18 గొడ్డలి దేవతల మిత్రుడైన అశ్వము యొక్క 34 పక్కటెముకలను15 ఖండించును. కాళ్ళను చెరపకుండా, సరియైన విధముగా పెట్టుడు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఖండించండి. 16

19 One is the slaughterer of the horse of Tvastr; two restrain him. This is the rule. As many of your limbs as I set out, according to the rules, so many balls I offer into the fire.17

19 ఒకడు త్వస్త్ర యొక్క ఆశ్వాన్ని ఖండించే వాడు. మరొక ఇద్దరు వానిని నియంత్రించే వారు. ఇదే శాసనము. ఎన్నెన్ని కర్మేంద్రియాలు గలవో, శాస్త్రాన్ని అనుసరించి, అన్ని ముద్దలను అగ్నికి ఆహుతి చేసెదను. 17

20 Let not your dear soul burn you18 as you go away. Let not the axe do lasting harm to your body. Let no greedy, clumsy slaughterer hack in the wrong place and damage your limbs with his knife.

20 నీవు నిష్క్రమించగా నిన్ను నీ ఆత్మ దహింపకుండుగాక18 . గొడ్డలి నీకు చిరకాలముండే గాయాన్ని కలిగించ కుండుగాక. దురాశ పరుడైన కసాయి నీ కాళ్ళను శాస్త్ర విరుద్ధంగా తప్పుగా కత్తితో ఖండించకుండు గాక.

21 You do not really die through this, nor are you harmed. You go to the gods on paths pleasant to go on. The two bay stallions, the two roan mares19 are now your chariot mates. The racehorse has been set in the donkey’s yoke.

21 నీవు నిజంగా మరణించ లేదు, గాయ పరచ బడలేదు. నీవు ఆహ్లాదకరమైన దారులలో పయనించి దేవతలను చేరెదవు. ఆ రెండు మగ గుర్రాలు, తెల్లని రోమాలతో కూడిన శ్వేత ఆశ్వాలు 19 ఇప్పుడు నీతో రథమునకు పూన్చబడే మిత్రులు. అశ్వము, గార్ధేభముతో కొయ్యకు కట్టబడినది.

22 Let this racehorse bring us good cattle and good horses, male children and all- nourishing wealth. Let Aditi make us free from sin.20 Let the horse with our offerings achieve sovereign power for us.

22 మాకు ఈ దివ్యమైన అశ్వము మంచి గోవులను, అశ్వాలను, పుత్రులను, ఐశ్వర్యమును ప్రసాదించు గాక. అదితి మా పాపాలను నిర్మూలించి గాక20 . మా ఆహుతులచే కూడిన అశ్వము మాకు మిక్కిలి సామర్థ్యమును ప్రసాదించుగాక

NOTES

వివరణ

1. This may be an epithet of Vayu or Agni, or the name of a distinct god, or an epithet of Aryaman.

1 ఇది వాయువు లేదా అగ్ని ని సూచించ వచ్చు; లేదా ఒక దేవత కావచ్చు; లేదా ఆర్యమన్ ను సూచించవచ్చు

2. The Rbhus are the craftsmen of the gods.

2 ఋభులు దేవతల కంసాలులు

3. This may be a list of five gods or of seven, depending upon whether one takes the adjectival terms as epithets or separate names.

3 ఐదు లేదా ఏడు దేవతలను సూచించ వచ్చు

4. Sayana says the horse was born from the essential forms of many gods, a common form of mythological creation.

4 శయనుడు అశ్వము అనేక దేవతల ధాతువులచే సృష్టింపబడినది అని చెప్పెను.

5. This almost certainly refers to the goat, though the commentary suggests that it might be the remains of the burnt offering made the night before.

5 ఇది మేకను సూచిస్తుంది; లేదా క్రిందటి రాత్రి చేసిన ఆహుతుల బూడిద

6. The Invoker is the Hotr priest, often identified with Agni. Cf. 1.1.1.

6 అగ్నితో పోల్చ బడే హోత

7. This term may designate the priest who portions out the offerings or the one who performs expiations for ritual errors or personal misdeeds (cf. v. 17). Here, as in verse 1, there may be five or seven terms, depending upon whether one takes the adjectival terms (here the third and seventh) as descriptions or separate titles.

7 ఇది ఆహుతులను వేల్చే వానిని సూచించవచ్చు; లేదా కర్మాచారణములో జరిగిన తప్పులకు పరిహారము కోరేవాడు.

8. A piece of wood attached crosswise at the top of the stake.

8 యూప స్తంభమునకు అడ్డంగా కట్ట బడే కొయ్య

9. These utensils would be the pot, the wood, etc.

9 కుండ, కర్ర మొదలైన పాత్రలు

10. Here the horse is directly addressed.

10 ఇది ఆశ్వాన్ని ఉద్దేశించి చెప్పబడినది

11. Cf. the hope that the human corpse will be made whole (10.16.6) and properly cooked (10.16.1-2).

11 మానవ కాయము పూర్ణముగా మరియు సరియైన విధముగా వండబడుననే ఆశాభావము.

12. These are the priests who eat the horse (cf. v. 5).

12 ఆశ్వాన్ని భుజించే పురోహితులు

13. The cry that is made when the offering is presented to the gods. Cf. 10.14.3 for the use of Svaha !, a similar call.

13 "స్వాహా!" అని పలుకుచూ దేవతలకు ఆహుతులు చేయగా తిరిగి దేవతలు పలికేది.

14. The Brahmins who repair the errors committed in the course of the sacrifice.

14 యజ్ఞాచారణముల కలిగే తప్పులకు ప్రాయశ్చితము చేసే బ్రాహ్మణులు.

15. Thirty-four of the horse’s ribs (he has thirty-six) are distributed, one to the sun, one to the moon, five to the planets, and twenty-seven to the constellations.

15 అశ్వము యొక్క 34 ప్రక్కటెముకలు (వానికి 36 యున్నవి) ఈ విధముగా పంచ బడినవి: సూర్యునికి ఒకటి, చంద్రునికి ఒకటి, ఐదు ఓషధులకు, 27 నక్షత్ర మండలాలకు

16. The priest names each part as he cuts it, and declares the divinity to whom it is dedicated.

16 పురోహితుడు ప్రతి భాగాన్నీ ఖండిస్తూ, ఏ దేవత కైతే అది నైవేద్యము చేయబడినదో చెప్పును

17. These are probably balls of rice that the wives of the king give to the stallion ; they may also be balls of meat.

17 రాణులు మగ గుర్రాలకు ఇచ్చే అన్నం ముద్దలు కావచ్చు; లేదా మాంసపు ముద్దలు కావచ్చు.

18. That is, do not be sad.

18 అంటే విచారము పొందకనుట

19. The two bay stallions are the horses of Indra, the two roan mares the horses of the Maruts, and the donkey belongs to the Asvins.

19 రెండు మగ గుర్రాలు ఇంద్రునికి చెందినవి; తెల్లని రోమములు గల శ్వేత అశ్వములు మరుత్తులకు చెందేవి; గార్ధభము అశ్వినులకు చెందేది.

20. This is both a general wish for expiation and a specific wish to be cleansed of the sin of killing the horse.

20 ఇది సామాన్యముగా కోరే ప్రాయశ్చితము మరియు ఆశ్వాన్ని సంహరించడంవలన కలిగే పాపమునకు ప్రాయశ్చితము కోరుట.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Aswa Bali

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...