|
|
|
|
Table Of Contents
CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
ఆశ్వ బలి
10.56 అశ్వమునకు వీడ్కోలు
10.56 Requiem for a Horse
This hymn is a funerary farewell to a beloved horse. Against this interpretation, later Indian commentarial tradition suggested that the subject of the hymn was the poet’s dead son, called ‘Victorious Racehorse’ (Vajin);
ఈ ఋక్కులో ఆశ్వానికి తుది వీడ్కోలు చెప్పబడినది. కొందరు పండితులు ఈ ద్రష్ట పుత్రుడైన వాజిన్ కు మరణానంతరము చెప్పిన వీడ్కోలు అని భావించిరి.
and it is worthy of note that the horse is said to travel to heaven, put on a new body, and dwell happily there afterwards, just as the dead man does in another hymn (10.14).
ఒక మృతుడైన మానవుని వలె ఆ అశ్వము స్వర్గలోకమునకేగి, నూతన శరీరమును ధరించి ఆనందముగా స్వర్గ సుఖములననుభవించునని భావన.
But the equine character of the verses is unmistakable. The hymn may refer to a particular ritual, possibly even to the immolation of a sacred horse;
ఈ ఋక్కు అశ్వముయొక్క దహన సంస్కారమును గూర్చి చెప్పును.
verse 3 opens with the exact phrase used at the beginning of the horse sacrifice. It may also be based upon the deification of a great racehorse, as is suggested by the hymn’s recurring use of the metaphor of winning heaven as one wins a race (though here it must be noted that the Rig Veda often refers to other goals – wealth, sons, long life – won as one wins a race).1
మూడవ పాదము ఒక పందేలలో పాల్గొనే అశ్వమును గూర్చి చెప్పును. ఎందుకంటే పదే పదే స్వర్గమును గెలుచుటే ధ్యేయమని తలచుట. ఋగ్వేదములో ఐశ్వర్యము, పుత్రులు, ఆయుష్యు కూడా ధ్యేయములని చెప్తుంది. 1
The idea of a hymn to a horse is not in itself un-Vedic; the Rig Veda knows other divine horses, such as Dadhikra, Tarksya, and Etasa.
ఒక ఋక్కు అశ్వం గూర్చి వ్రాయుట అవైదికము కాదు. ఋగ్వేదములో దధిక్ర, తర్క్స్య , ఏతస మొదలైన దివ్యమైన ఆశ్వాల గూర్చి చెప్పబడినది.
The horses of heaven are obliquely alluded to in verse 4, where they are said to have more powers than the Fathers and to have been given special mental power by the gods before taking on their heavenly bodies;
స్వర్గలోకంలో ఆశ్వాల గూర్చి నాల్గవ పాదంలో చెప్పబడినది. అవి పితరుల కంటే అతిశయమైన శక్తులు కలవని, దేవతలచే ఇవ్వబడిన దివ్యమైన శరీరములు ధరించి యుండునని చెప్పబడినది.
verse 5 may even imply that all living creatures are somehow bound to or encompassed by the powers of these celestial equines, who gallop around a racecourse made of the space between sky and earth.
ఐదవ పాదము సమస్త ప్రాణులు స్వర్గ లోకంలో నుండే దివ్యమైన అశ్వాలచే శాసింపబడేవని చెప్పును. అవి భూమ్యాకాశముల మధ్య నుండే ప్రదేశములో పరుగు పందేలలో పాల్గొనేవి.
Versa 1-5a describe the horse’s translation heaven, where he is given a new body, gathering into it the qualities that it had on earth (verse 4).
1-5a అశ్వము యొక్క స్వర్గాధిరోహణము, అచ్చట నూతన శరీర ధారణము వివరించును
He changes into this body as the sun changes its form (verse 2); the sun is also alluded to as the ‘light beyond’ (verse 1), mediating between the light here ( fire, probably the funeral pyre) and the third light (the light in the world of the dead).
సూర్యుడు తన రూపును మార్చుకొనునట్లు అశ్వము శరీరమును మార్చును. సూర్యుని భూమిపైన కాంతి, అనగా చితి పైన యుండే అగ్నిని, మరియు మరణించిన వారలు యుండే లోకాలలోని అగ్నితో అనుసంధానము చేయునని చెప్పబడినది.
The ‘god who finds the light’ (verse 6) may also be the sun; it may, however, be the spirit who leads the horse to the world of the dead, the third light;
ఆరవ పాదంలో "కాంతిని కనుగొనే దేవుడు" అని సూర్యుని సూచింపబడినది. అలాకాక, అది ఆశ్వాన్ని ఊర్ధ్వ లోకాలకు చేర్చే ఆత్మ కావచ్చు.
in general, the term often refers to Agni, Soma, or the Fathers, any of whom would be appropriate here.
ఆ పద ప్రయోగము తరచు అగ్ని, సోమ లేదా పితరులను సూచించుటకై వాడబడును.
The final verses speak of the body in more general terms, contrasting the body put on in heaven with the body left on earth in the form of off spring.
చివరి పాదము శరీరమును స్వర్గములో పొందే శరీరము లేదా మృతుని సంతతి రూపమున భూమిపై నుండే వారిని గూర్చి తెలుపును.
1 This is your one light, and there beyond is your other; merge with the third light. By merging with a body, grow lovely, dear to the gods in the highest birthplace.
1. ఇది నీ మొదటి కాంతి; గగనమావల యుండేది రెండవది; మూడవ కాంతితో ఐక్యము కమ్ము. నూతన శరీరము ధరించి సౌందర్యముతో ఓలలాడి, దేవతలకు ప్రియంగా నుండి స్వర్గసుఖాల ననుభవించు.
2 Victorious racehorse, let your body, carrying a body,2 bring blessings to us and safety to you. Staying straight,3 so that you may carry the great gods, change your own light as one does in heaven.
2. విజేతవైన పందెపు అశ్వమా, నీ శరీరము, మరొక శరీరమును మోయుచూ మాకు శుభమును2 , నీకు క్షేమమును కలిగించు గాక. నిఠారుగా3 నుండి, దేవతలను మోయుచూ స్వర్గములో పొందే నూతన తేజమును పొందుము.
3 You are a victorious racehorse with the power to win victory; go happily to the mares who long for you. Go happily to fame and heaven; go happily to the first orders and truths, go happily to the gods, go happily to your flight.
3 నువ్వు పందేలలో గెలిచే ఉన్నతమైన అశ్వము. నీ గురించి ఎదురు చూసే మగ ఆశ్వాలుండే ప్రదేశమునకు సంతోషముగా వెళ్ళుము. ఆనందముగా పయనించి కీర్తి, స్వర్గమును పొందుము. సత్యము, దేవతల వద్దకు ఉత్సాహముతో వెళ్ళుము. నీ ప్రయాణము సుఖముగా గావించుము.
4 Even the Fathers have no control over their4 majesty; the gods have placed the power of understanding in the gods.5 They4 have gathered together all things that shine, and these have entered their4 bodies again.
4. పితరులకు వారిపై నుండే వానిపై అధికారము లేదు4 . దేవతలు గ్రహణ శక్తి దేవతలకు ప్రసాదించేరు5 . వారు4 తేజోవంతమైన వాటిని ప్రోగుచేసేరు. అవి మరల వారి 4 శరీరములోకు ప్రవేశిస్తాయి.
5 With their great powers they have circled all the middle realm of space, measuring out ancient domains never measured before. All creatures are bound to their bodies.6 They shower down their off spring in many ways.
5. వారి దివ్య శక్తులచే భూమ్యాకాశాల మధ్య స్థలమును, మునుపు కొలత వేయబడని పురాతన లోకములను, కొలిచేరు. అన్ని జీవులు వారి శరీరములతో బంధములు గలవి6 . వారు తమ సంతతిని అనేక విధములుగా ఆవిర్భవింప చేస్తారు.
6 By the third action, and in two ways,7 the sons have set in place the god 8 who finds the light. The fathers have established their own off spring as paternal power, like a thread stretched out among those who are to follow.
6. మూడవ క్రియతో, రెండు విధములుగా7 , కాంతిని వెదికే దేవతను8 పుత్రులు ప్రతిష్టించేరు. పితరులు ఒక దారము పుట్టబోయే సంతతిని కలిపి యుంచినట్లు తమ సంతతిని శక్తి మంతులుగా ప్రతిష్టించేరు.
7 As if on a ship sailing through high water to all horizons of the earth, crossing over all dangers with ease, Brhaduktha9 has through his great power established his own off spring among those who are to follow and those who have come before.
7 ఒక నావ భూమి అంచులకు, ప్రమాదాలను అతిక్రమించి పయనించునట్లు, మిక్కిలి శక్తివంతమైన బృహదుక్త9 తన సంతతిని మునుపు ఉన్నవారిలో, భవిష్యత్ లో వచ్చే వారిలో ప్రతిష్టించెను.
NOTES
వివరణ
1. Cf. especially the racehorses of Dawn, 1.92.7.
1 పందేలలో పాల్గొనే ఆశ్వాలు.
2. The image of the horse carrying a rider (a body carrying a body) suggests they are carrying the dead body to heaven and going on (v. 3) to carry the oblation to the gods. Cf. Agni, the horse, as the conveyer, in 1.26.1, 5.2.1 and 10.51.6.
2 అశ్వము వేరొక దేహమును మోయుట అనగా మృత శరీరాన్ని స్వర్గమునకు, ఆహుతులను దేవతలకు అందించుట. అశ్వము అగ్ని వలె పయనించుట
3. Both straight on the path and with a straight (i.e. uncollapsed) back under the weight.
3.మార్గములో సూటిగా, శరీరము నిఠారుగా బరువును మోస్తూ పయనించుట
4. ‘They’ are the horses; the shining things enter the horses’ bodies, as the god-inspired powers enter their minds.
4 అవి ఆశ్వాలు సూచించును; తేజోవంతమైనవి ఆశ్వాల దేహాలలోకి ప్రవేశిస్తాయి. అలాగే దేవతల శక్తులు వాటి మనస్సులోనికి.
5. The gods in heaven give inspiration to the ‘gods’ newly made, the horses who succeed in reaching heaven.
5 స్వర్గాధిరోహణము చేసే ఆశ్వాలు నూతన మైన దేవతలు కాగా అవి ఇప్పుడుండే దేవతలచే ఉత్తేజింపబడినవి.
6. This may refer to the heavenly horses of verses 4-5 or imply that each creature is bound to his own body.
6. 4-5 పాదాలలో చెప్పబడిన స్వర్గ వాసులయిన ఆశ్వాలు సూచింపబడినవి. అనగా ప్రతి జీవి తన దేహంలో బంధింపబడినది.
7. The third action is the begetting of children, the ‘debt’ each Hindu must pay to the Fathers (the first two debts being Vedic study, paid to the sages, and sacrifice, paid to the gods). The ‘two ways ‘ may refer to sons and fathers, achieving their ends on earth
7. మూడవ క్రియ సంతతిని కనుట. హిందువులు పితరులకు మూడు ఋణాలను కలిగి యుంటారు: వేద పఠనము, ఋషి ఋణము, దేవ ఋణము. ఆ రెండు విధములు భూమిపై మనుగడ సాగించే పుత్రులు మరియు తండ్రులను సూచించును.
(by children) and in heaven (by ritual). 8. The sun is here called an Asura, an ancient god.
8 సూర్యునిచే అసుర అనబడే సనాతన దైవమును సూచింపబడినది.
9. Name of the sage to whom the hymn is attributed.
9 ఈ ఋక్కు యొక్క ద్రష్ట నామము.
No comments:
Post a Comment