Friday, July 24, 2026

Wendy Doniger Rig Veda Agni And Young Poet




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము

6.9   Agni and the Young Poet

6.9   అగ్నిని గూర్చి యువ ద్రష్ట పలుకులు

A young poet, doubting his powers in the ritual competition (v. 2), seeks inspiration from Agni himself in solving the riddle of Agni, as usual a riddle of origins.

ఒక ఆచార వ్యవహారముల పోటీలో ఆరితేరని యువకుడైన ద్రష్ట, అగ్ని దేవుని సృష్టి రహస్యమును తెలియగోరి ప్రార్థించెను.

The first and last verses (and v. 5) speak of the cosmic Agni, the sun that disappears at night (v. 1) or when he flees1 or is simply not present before light is created (v. 7).

మొదటి మరియు ఆఖరి పాదములు విశ్వవ్యాప్తమైన, రాత్రి అస్తమించే సూర్యుని కలుపుకొని, తప్పించుకొని పారిపోయే 1 లేదా కాంతి ఆవిర్భావమునకు ముందుండే అగ్నిని గూర్చి ప్రార్థన చేయబడినది.

He appears among mortals as the ritual fire (v. 4) and as the power of inspiration (5b-d), that teaches the poet how to surpass his own father (vv. 2-3);

మానవ సమాజంలో యజ్ఞములో కనిపించే అగ్ని యొక్క చరిత్ర ద్వారా ద్రష్ట తన తండ్రిని మించిన తనయునిగా ఎలా కాగలడో తెలిసికుంటాడు.

this inspiration transfigures the poet, but also makes him even more aware of the impossibility of describing Agni (v.6).

అది ద్రష్ట ఆలోచనలను పెంపొందించి అగ్నిని వివరించుట మిక్కిలి క్లిష్టతరమైనదని ద్రష్ట తెలుసుకుంటాడు.

1 The dark day and the bright day, the two realms of space,2 turn by their own wisdom. As Agni Of-all-men was born, like a king he drove back the darkness with light.

1. విశ్వమును ఆవరించే పగలు మరియు రాత్రి తమ జ్ఞానముతో వర్తిస్తాయి2. అగ్ని ఆవిర్భవించి చీకటిని తన ప్రకాశముతో పారద్రోలెను.

2 I do not know how to stretch the thread, nor weave the cloth, nor what they 3 weave as they enter the contest. Whose son could speak here such words that he would be above and his father below?

2. నాకు దారమును పేన్చుట, వస్త్రమును నేయుట తెలియదు. అలాగే వారు పోటీకి వచ్చినపుడు ఏమి నేస్తారో తెలియదు3. ఏ పుత్రుడు తనను తన తండ్రికంటా ఉత్తముడని చెప్పగలడు?

3 He4 is the one who knows how to stretch the thread and weave the cloth; he will speak the right words. He who understands this5 is the guardian of immortality; though he moves below another, he sees above him.

3.అతడు 4 దారమును, దారముతో వస్త్రమును చేయగల నేర్పరి. అతడు వినదగు మాటలను పలుకుతాడు. ఇది తెలిసినవాడు5 అమరత్వమును తెలిసినవాడు. అతడు ఒకని క్రింద చలిస్తూ, ఊర్థ్వ దిశగా దృష్టిగలవాడు.

4 This is the first priest of the oblation;6 look at him. This is the immortal light among mortals. This is the one who was born and firmly fixed,7 the immortal growing great in his body.

4. ఇతడు మొదటి ఆహుతికి హోత6. అతనిని చూడుడు. ఇది జీవులలోని మరణములేని అగ్ని. ఇదియే జన్మించి, అమరులు తమ శరీరములతో వృద్ధి చెందురీతిగా, స్థిరముగా నున్నది7.

5 He is light firmly fixed for everyone to see,8 the thought swiftest among all who fly. All the gods, with one mind and one will, rightly come to the one source of thought.9

5. అతడు అందరూ గాంచగల స్థిరమైన కాంతి8. అతడు అన్నిటికన్నా వేగంగా చలించే ఆలోచన వలె నున్నాడు. దేవతలందరూ ఒకే మనోబుద్ధులతో, ఆలోచనలకు కేంద్రమైన స్థానానికి వస్తారు9.

6 My ears fly open, my eye opens, as does this light that is fixed in my heart. My mind flies up, straining into the distance. What shall I say? What shall I think?

6.నా చెవుల, కళ్ళ కవాటాలు నా హృదయంలో స్థిరంగా నుండే కాంతి వలె తెరిచి యున్నాయి. నా మనస్సు బహు దూరము ఊర్థ్వ ముఖంగా పరిగెడుతున్నది. నేనేమి చెప్పేది? ఏమి ఆలోచించేది?

7 All the gods bowed to you in fear, Agni, when you hid yourself in darkness.10 May Agni Of-all-men save us with his help; may the immortal save us with his help.

7. అగ్నీ, నీవు చీకటి ప్రదేశంలో దాక్కొని యున్నప్పుడు10 దేవతలందరూ భయముతో వంగి నమస్కారం చేసేరు. అగ్ని మనలకు సహాయము నందించి కాపాడుగాక; అమరుడు మనలకు సహాయము నందించి రక్షించుగాక.

NOTES

వివరణ

1. Cf. 10.51 and 10.124.

1. 10.51 and 10.124.

2. Night and day, the dark and light sides of the sun, become part of the dark and light halves of the universe.

2. సూర్యుని వలన కలిగే రాత్రి మరియు పగలు, చీకటి మరియు కాంతి, సృష్టి యొక్క చీకటి మరియు కాంతి ప్రదేశములుగా మారుతాయి.

3. The other sages in the contest. For the image of weaving the sacrifice, cf. 10.130.1-2.

3.పోటీలో పాల్గొనే తక్కిన ఋషులు. యజ్ఞమును చేసే నేతను గూర్చి 10.130.1-2. చూడుడు.

4. Agni himself, or the inspired poet.

4.స్వయంగా అగ్ని, లేదా ఉత్సాహవంతుడైన ద్రష్ట.

5. The thread that stretches from earth to heaven, as well as the thread of inspiration that enables him to weave his poem; a form of the axis mundi as well as the spiritual link between gods and men.

5. భూమి నుండి స్వర్గము వరకు వ్యాపించే దారము, మరియు ఈ ఋక్కును కూర్చుటకు కావలసిన ఉత్సాహము. దేవతలను మరియు మానవులను కలిపే వారధి.

6. The Hotr of whom Agni is the archetype. The invoker of the gods.

6.హోత; దేవతలను ఆహ్వానించుట సూచితము.

7. The ritual fire established in the tradition; also the sun fixed in the sky.

7.సంప్రదాయముగా వచ్చే యజ్ఞాగ్ని; ఆకాశములో స్థిరముగా నుండే సూర్యుడు.

8. The sun, who sees all, is seen by all, and allows everyone to see.

8. అందరినీ చూడగల, అందిరిచే చూడబడే, అందరూ చూచే సూర్యుడు సూచితము.

9. Agni as the source of inspiration, or the man who knows Agni.

9.ప్రేరణకు కారణమైన అగ్ని సూచితము; లేదా అగ్ని గూర్చి తెలిసినవాడు.

10. Cf. 10.51.5 and 10.124.1.

10. 10.51.5 and 10.124.1.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Agni And Young Poet

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...