|
|
|
|
Table Of Contents
CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire
Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle
Soma Drinker's Self Praise
Drinking Soma
Kesini
Indra
సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద
సోమ రసమును త్రాగే వాని పొగడ్తలు
కేశిని
ఇంద్రుడు
4.18 The Birth and Childhood Deeds of Indra
4.18 ఇంద్రుని బాల్యము
This obscure dialogue is partially illuminated by the recognition of its place in Indo- European mythology: it refers, in purposely mysterious tones, to the story of a male god concealed by his mother from a father who threatens to kill him, a father whom he himself then kills.
ఈ ఋక్కు ఒక దేవతా బిడ్డను కన్న తల్లి తన భర్త నుండి తన బిడ్డకు కలిగే ఆపద నుండి రక్షించే ప్రయత్నం వివరిస్తూ , ఆ బిడ్డ తన తండ్రిని వధిస్తాడని చెప్తుంది.
The hymn alternates between narrative and direct discourse, the latter spoken by Indra and his mother, the former by the poet who questions them and elicits answers that attempt to vindicate and justify the actions of the two protagonists.
ఈ ఋక్కులో ఇంద్రుని, వాని తల్లి మధ్య జరిగే సంభాషణ మరియు ద్రష్ట యొక్క వివరణ యుండగా, ద్రష్ట వారిరువురిని నిర్దోషులుగా నిరూపించడానికి అనేక ప్రశ్నలు సంధిస్తాడు.
None of the principals in the drama is named except Indra; later commentary identifies the mother with Aditi and the father with Tvastr(who appears in the hymn, though not explicitly as the father).
ఈ ఋక్కులో ఇంద్రుని తలిదండ్రుల పేర్లు చెప్పకపోయినా వారు అదితి మరియు త్వస్త్రలుగా వేరొక చోట చెప్పబడినది.
The hymn begins with the story of Indra’s birth: his mother kept him in the womb for many years (v. 4), not, she insists, in absence of maternal feeling but for Indra’s sake – i.e. to protect him; the hymn does not tell us why this was necessary, but it may well be because his father was jealous of Indra’s great powers (v. 5), a suspicion ultimately proved valid when Indra kills his father (v. 12).
ఈ ఋక్కు ఇంద్రుని జననముతో మొదలవుతుంది. వాని తల్లి అనేక సంవత్సరాలు వానిని గర్భములో నుంచుతుంది. అది మాతృ ప్రేమ లేకపోయిన కారణాన కాదు. అది ఇంద్రుని క్షేమమునకై. కానీ ఎందుకన్నది ఈ ఋక్కు వివరించదు. మనము అతి శక్తిమంతుడైన ఇంద్రునికి తండ్రి అసూయ కారణాన మరణ గండము కలదని ఊహించవచ్చు. ఈ ఊహ ఇంద్రుని చేతిలో తండ్రి యొక్క వధ వలన బలపడుతుంది.
As the dialogue begins, Indra is still inside the womb and wishes to break out through her side; she attempts to dissuade him (v. 1), but he insists on being born (v. 2).
సంభాషణ మొదల ఇంద్రుడు గర్భములో నుండికి వెలుపలకు రావడానికి ప్రయత్నించగా, తల్లి వానిని నివారించి నప్పటికీ, అతడు బయటకు రావడానికి నిశ్చయించుకుంటాడు.
She then hides him (v. 3), presumably still in fear of his father.
తండ్రి ఇంద్రుని వధిస్తాడనే భయముతో ఆమె ఇంద్రుని దాచి పెడుతుంది.
Again Indra refuses to be protected, but follows her to Tvastr’s house, where he drinks the Soma (v. 3).
కానీ ఇంద్రుడు ఆమె రక్షణను నిరాకరించి, తన తండ్రి అయిన త్వస్త్రని ఇంటి వరకు వెంబడించి అక్కడ సోమ రసమును త్రాగుతాడు.
In response to the narrator’s accusations (vv. 4-5), she calls upon the waters to witness her good motives in treating Indra as she did (vv. 6-7), and speaks of being guiltless of the wounds Indra incurred in fighting the demon Vrtra(vv. 8-9), who is analogized with Indra’s father.
ద్రష్ట వేసే నిందలకు బదులుగా ఆమె జల దేవత సాక్షిగా తన స్వచ్చమైన మనస్సుతో ఇంద్రుని రక్షించుటకై చేసేనని చెప్పి, ఇంద్రునికి తండ్రి సమానమైన వృత్రాసురునితో జరిగిన యుద్ధములో కలిగిన గాయాలకు తాను కారణము కాదని చెప్పెను.
The narrator then recapitulates the story of Indra’s birth (v. 10) and the slaying of Vrtra, in which Visnuu came to Indra’s aid (v. 11).
అటు పిమ్మట ద్రష్ట ఇంద్రుని జననము, వృత్రాసుర వధలో విష్ణు మూర్తి ఇంద్రునికి చేసిన సహాయం మననం చేసుకుంటాడు.
Upon being questioned about killing his father (v. 12), Indra protests that he had no choice, being in terrible danger until the eagle brought him the Soma (v. 13).
ద్రష్ట ఇంద్రుని తండ్రిని ఎందుకు వధించేవాని ప్రశ్నించగా, తనకు వేరే దారి లేదని గ్రద్ద సోమ రసమును తెచ్చుట వరకు తాను మిక్కిలి ప్రమాదములో నుండెనని చెప్పెను.
1 [Indra’s mother:] ‘This1 is the ancient, proven path by which all the gods were born and moved upward. By this very path he should be born when he has grown great. He should not make his mother perish in that way.’2
1.ఇంద్రుని తల్లి: సనాతన కాలం 1నుండీ ఈ మార్గములో దేవతలు జన్మించి వృద్ధిని పొందేరు. కావున అతడు ఈ మార్గములోనే జన్మించుటకు ముందే గర్భములోనే మిక్కిలి శక్తి మంతుడవ్వాలి. అతడు వేరే విధంగా నుండి తల్లి మరణానికి కారణం కాకూడదు. 2
2 [Indra:] ‘I cannot come out by that path; these are bad places to go through. I will come out cross-wise, through the side. Many things yet undone must I do; one 3 I will fight, and one 4 I will question.’
2. ఇంద్రుడు: నేను ఆ మార్గములో రాలేను. అనేక ప్రమాదకరమైన ప్రదేశాలలో ముందు ముందు వెళ్ళ వలసి వస్తుంది. నేను ప్రక్కల నుండి వెలుపలకు వస్తాను. నేను అనేక కార్యాలు చెయ్య వలసి ఉంది. నేను ఒకనితో యుద్ధం చేస్తాను3 , మరొకని ప్రశ్నిస్తాను. 4
3 [Narrator:] He watched his mother as she went away:5 ‘I cannot help following : I will follow.’ In Tvastr’s house Indra drank the Soma6 worth a hundred cows, pressed in the two bowls.
3.ద్రష్ట: అతడు తన తల్లి నిష్క్రమించగా చూసెను5 . "నేను వెంబడిస్తాను." అని తలచెను. త్వస్త్ర నివాసములో ఇంద్రుడు వందలాది గోవుల విలువ గలది, రాళ్ళతో పిండ బడిన సోమ రసమును
4 Why has she pushed him far away, whom she carried for a thousand months and many
autumns? For there is no one his equal among those who are born and those who will
be born.7
4. వందలాది నెలలు, ఋతువులు వానిని గర్భములో నుంచి, ఆమె వానిని ఎందుకు దూరంగా పంపింది? బ్రతికి యున్న వారలు, ముందు పుట్ట బోయేవారు వానికి సమానము కాలేరు7 .
5 As if she thought he was flawed,8 his mother hid Indra though he abounded in manly strength. Then he stood up and put his garment on by himself; as he was born he filled the two world-halves.
5.ఇంద్రుడు అతి శక్తిమంతుడైన వాడయినప్పటికీ, ఏదో కళంకము8 యున్నవానిగా, వాని తల్లి వానిని దాచి పెట్టెను. పిదప అతడు పైకి లేచి, స్వయంగా వస్త్రము ధరించెను. తన జననముతో అతడు భూమ్యాకాశాలను వ్యాపించెను.
6 [Indra’s mother:] ‘These waters9 flow happily, shouting “ Alala! “, waters that were screaming together like righteous women.10 Ask them what they are saying, what encircling mountain11 the waters burst apart.
6.ఇంద్రుని తల్లి: ఈ జలములు9 "ఆలల" యనుచు ఆనందముగా స్వచ్చమైన వనితల 10కేరింతల వలె ప్రవహించును. అవి ఏమని చెప్తున్నాయి, ఏ చుట్టుముట్టిన పర్వత 11 శ్రేణులను చీల్చుకొని వేగంగా ప్రవహిస్తున్నాయో అడగండి.
7 ‘Are they speaking words of praise and invitation12 to him? Do the waters wish to take on themselves the flaw of Indra?13 With his great weapon my son killed Vrtra and set these rivers free.
7. "అవి వానిని పొగుడుతూ ఆహ్వానిస్తున్న విధముగా పలుకుచున్నాయా12 ? ఆ జలములు ఇంద్రుని కళంకమును తీసికోగలవా? వజ్రాయుధముతో13 నా కుమారుడు వృత్రాసురుని సంహరించి ఈ జలములను విడిపించేడు"
8 ‘ Still a young woman, I did not throw you away for my sake; nor did Evil-childbirth14 swallow you up for my sake. But for my sake the waters were kind to the child,15 and for my sake Indra stood up at once.
8."నేను బాలికనయినప్పటికీ, నా స్వార్థమునకై నిన్ను దూరం చేయలేదు; అలాగే పాపిష్టి జననము 14 నిన్ను నా కొరకై కబళించలేదు. కానీ నా కొరకై జలములు నా బిడ్డపై కరుణ చూపించినవి15 . నా కొరకై ఇంద్రుడు ఒక్క మారు లేచి నుంచున్నాడు."
9 ‘Not for my sake did the shoulderless one16 wound you, generous Indra, and strike away your two jaws;17 though wounded, you overpowered him, and with your weapon you crushed the head of the Dasa.’18
9. "ఉదారుడవైన ఇంద్రా, నా కొరకై భుజములు లేనివాడు16 నిన్ను, నీ దవడలను గాయ పరచలేదు17 . గాయపడినప్పటికీ నువ్వు వానిని అధిగమించు దాస 18 యొక్క శిరస్సును నీ వజ్రాయుధముతో ఖండించేవు"
10 [Narrator:] The heifer19 gave birth to the firm, strong, unassailable bull, the stout Indra. The mother let her calf wander unlicked,20 to seek his own ways by himself.
10.ద్రష్ట: మేలైన గోవు 19బలిష్టమైన, ఎదురులేని వృషభము వంటి ఇంద్రునికి జన్మము నిచ్చింది. తల్లి గోవు వత్సని నాలుకతో నాకకుండా20, తన ఇచ్చకు వదలి వేసింది
11 And the mother turned to the buffalo:21 ‘My son, the gods here are deserting you.’22 Then Indra, wanting to kill Vrtra, said, ‘Visnu, my friend, stride as far as you can.’23’
11.తల్లి21 "ఓ పుత్రా, దేవతలు నిన్ను వదిలి వెళ్ళి పోయేరు" అని విలపించింది. 22ఇంద్రుడు వృత్రాసురుని వధింప గోరి: "విష్ణూ, మిత్రమా, ముందుకు రా" అని పలికెను. 23
12 Who made your mother a widow?24 Who wished to kill you when you were lying still or moving?25 What god helped you when you grabbed your father by the foot and crushed him?26
12.నీ తల్లిని వితంతువుని చేసిన వారెవ్వరు24? నిన్ను చలనము లేనప్పుడు, చలిస్తున్నప్పుడు వధించాలని ఎవరు కాంక్షించేరు25? నువ్వు నీ తండ్రిని వధించినప్పుడు, ఏ దేవత సహాయం చేసెను26?
13 [Indra:] ‘Because I was in desperate straits, I cooked the entrails of a dog,27 and I found no one among the gods to help me. I saw my woman28 dishonoured. Then the eagle brought the honey to me.’29
13."నేను దౌర్భాగ్యమైన స్థితిలో నుండి, శునకమాంసమును 27 వండేను. ఏ దేవతా నా సహాయానికి రాలేదు. నా పడతులు28 అవమానింపబడగా చూసేను. ఏ దేవత సహాయం చేసెను29?"
1. The conventional birth passage through the womb; Indra, like so many folk heroes,
refuses to be born in this way. Cf. Soma talking in the womb, 4.27.1.
1. సాధారణంగా జరిగే ప్రసవం; అనేక యోధుల వలె ఇంద్రుడు సాధారణ ప్రసవం నిరాకరించేడు.
2. She argues that he will kill her if he bursts out through her side. In fact, several
Indian mythological heroes (including the Buddha) are conceived and/or born through
the side without injury to the parent (as is about to be the case with Indra now), but
some do indeed kill their mothers (or androgynous fathers) in this way.
2.ఇంద్రుడు ప్రక్క నుంచి అంటే పొట్ట చీల్చుకొని వస్తే తాను మరణిస్తుందని తల్లి వాదిస్తున్నది. బుద్ధుడు, మరియు అనేక చారిత్రాత్మిక పురుషులు, తల్లికి హాని కలిగించ కుండా ప్రక్కనుంచి వెలుపలకి వచ్చినట్లు ప్రసిద్ధి.
3. Vrtra, who is alluded to several times in this hymn.
3.వృత్రాసురుడు
4. The verb ‘to question’ here contrasts with the verb ‘to fight’, and indicates that Indra will either speak to make a treaty (with Visnu) or speak before killing (Tvastr). The
former seems more likely; the question that he asks of Visnu is the request to have him
stride forward (v. 11).
4. ఇంద్రుడు విష్ణువుతో ఒప్పందం చేసుకుంటాడు లేదా త్వస్త్రను సంహరించే ముందు సంభాషిస్తాడు. బహుశా మొదటిది కావచ్చు. విష్ణువును అడిగే ప్రశ్న సహాయమునకై విన్నపం.
5. The commentator says that she died, but the hymn makes this unlikely; she merely
abandons him, as the true mother of the Indo- European hero usually does. Cf. 5.2.1-2,
where Agni’s mother hides him from his father for many years in her womb.
5.ద్రష్ట ఆమె మరణించినదని చెప్పెను. నిజానికి ఆమె అతనిని విడిచి పెట్టింది. ఉదాహరణకు అగ్ని దేవత తల్లి అనేక సంవత్సరాలు తండ్రికి తెలియకుండా గర్భ ధారణ చేసెను.
6. According to later tradition, Indra killed Tvastr in order to get the Soma away from
him.
6.వేరొక చోట ఇంద్రుడు త్వస్త్రను సోమ రసమును సంగ్రహించుటకు అతనిని సంహరించెను అని చెప్పబడినది.
7. The argument is either, Why did she try to kill him when she knew he was so
powerful that he couldn’t be killed, or, Why did she try to kill him when she knew he
was destined to be a great hero? In fact, she merely pushed him away in order to
preserve him, but one is reminded of the mother of Martanda’, Aditi (who is
traditionally identified as the mother of Indra as well), who pushed her son away to kill
him (10.72.8).
7.ఇక్కడ జరిగిన వాదన: అతడు మిక్కిలి శక్తిమంతుడు మరియు అకాల మృత్యువు లేనివాడయినప్పుడు ఆమె అతనిపై హత్యా ప్రయత్నము ఎందుకు చేసెను? లేక అతడు విధి నిర్ణయక మహా యోధుడు కాగలడని తెలిసినప్పుడు ఆమె అతనిని ఎందుకు సంహరించ దలచింది? నిజానికి ఆమె వాని క్షేమము గోరి తోసి వేసినది. మరొక చోట మార్తాండుని తల్లి అయిన అదితి (ఇంద్రుని తల్లి కూడా), పుత్రుని సంహరించుటకై తోసి వేసినదని చెప్పబడినది.
8. The flaw may be a physical birth flaw such as Martanda’ had, the cause of Aditi’s
rejection of him. Again, this suspicion is invalid: Indra is not physically flawed. But the phrase may also foreshadow the moral flaw which is to be a problem to Indra, the guilt
of the slaughter of Vrtra, alluded to in verse 7.
8.ఆ కళంకము ఏమన , మార్తాండుని ఏ కారణం చేత అదితి దూరం పెట్టిందో, జననమే ఒక పాతకం కాబట్టి. కాని ఈ అనుమానం చెల్లదు. ఎందుకంటే ఇంద్రునికి అంగ వైకల్యము లేదు. కానీ వృత్రాసురుని సంహరించుట వలన ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం కలిగింది.
9. The waters set free when Vrtra was killed (1.32.1, 1.32.8, 1.32.11-12, etc.). Also,
perhaps, the waters in which Indra was placed to hide him from danger (cf. 1.32.10 and
10.51).
9. వృత్రాసురుని మరణము తరువాత జలములు విడిపింప బడినవి. లేదా ఇంద్రుడు తన రక్షణకై జలము యందు ప్రవేశింపబడెను.
10. At first the waters scream for help when Vrtra assaults them; then they chortle
onomatopoetically when they are set free.
10.వృత్రాసురుడు జలములను దండించి నప్పుడు అవి హాహాకారములు చేసెను. .
11. The cavern where Vrtra kept the waters penned up. Cf. 1.32.11 and 3.31.5.
11.వృత్రాసురుడు జలములను బంధించి యుంచిన గుహ.
12. A technical term for a formula of praise and laudatory epithets, used to call a god.
12. ఒక దేవతను ప్రత్యక్షము చేసుకొనుటకై చేసే స్తోత్రం.
13. The flaw or stain is the sin incurred in killing Vrtra. Later myths narrate at great
length the way in which Indra asked the waters (and other creatures) to take upon
themselves a portion of this stain.
13. వృత్రాసురుని సంహరించుట వలన కలిగిని బ్రహ్మహత్యా పాతకము. భాగవతాది గ్రంధములలో ఇంద్రుడు పాతకమును మిగతా జీవులకు పంచి పెట్టెనని చెప్పబడినది.
14. This may be the name of a demonness who swallows children, whose name
indicates that she brings evil to those in childbirth (i.e. causes the death of the child or the mother or both) or brings forth evil. More likely, however, it is the name of the
river who’swallows up’ Indra – not for the sake of his mother (i.e. not because she was a
rejecting mother), but for his sake – to save him from danger.
14.ఇది పుట్టబోయే శిశువులను కబళించే రాక్షసి కావచ్చు. ఆమె పేరు ప్రసవ సమయాన గర్భస్త శిశువుకు లేదా తల్లికి హాని చేసేదని సూచితము. బహుశా ఇంద్రుని కబళించే నది కావచ్చు. అది తల్లి కోసము కాక అతని క్షేమము కొరకై.
15. The mercy of the waters may be their kindness in adopting him when his mother
was forced to abandon him, or their willing ness to forgive him for the sin of killing the
demon (for their benefit) and to take part of the sin upon them. Indra’s mother takes
credit for persuading them to do this, and for letting Indra stand up at once, though
earlier (v. 5) the poet emphasizes that Indra did this despite her efforts to hide him.
15.జలములు అతనిని తల్లి నిరాకరించిన పిదప దయతో దత్తత చేసుకొనుట. లేదా తమను బాధించిన అసురుని సంహరించి ఇంద్రుడు పొందిన పాతకమును క్షమించుట మరియు ఆ పాతకములో ఒక వంతు తాము భరించుట. ఇంద్రుని తల్లి జలములను అది చేయుటకై అర్ధించెను. దానికి మరియు ఇంద్రుడు లేచి నుంచొని యుండుట కారణాన తల్లి పుణ్యము సంపాదించుట. ద్రష్ట తల్లి దాచి పెట్టుటకు ప్రయత్నించనప్పటికీ ఇంద్రుడు ఆ కార్యము చేసెనని చెప్పెను.
16. Vrtra. Cf. 1.32.5.
16.వృత్రాసురుడు
17. Elsewhere it is said that Vrtra wounded Indra in this way, shattering his jaws
(1.32.12). Indra’s mother seems to be saying that it wasn’t her fault that Indra got into
such trouble; she had tried to keep him safe in her womb.
17.వృత్రాసురుడు ఇంద్రుని దవడలను గాయ పరచెను. దానికి కారణము తాను కాదని ఇంద్రుని తల్లి చెప్పుచున్నది. హాని కలుగ కూడదనే ఆమె అతనిని ఎంతో కాలము తన గర్భములో మోసెను.
18. The serpent is identified with the native enemy, or slave, of the conquering Aryan.
See 1.32.11.
18. శత్రువుతో సమానమైన సర్పము లేదా ఆర్యుల బానిస.
19. Indra’s mother is here called a cow who has not yet given birth to a calf. Indra is
her first-born. Cf. the mothers of Agni as primaparas, 2.35.5.
19.ఇంద్రుని తల్లి దూడని ప్రసవించని గోవుతో పోల్చ బడెను. ఇంద్రుడు ఆమె మొదటి సంతానము.
20. That is, she did not hold him close to her after he was born, but pushed him away
uncared for, like a cow who fails to eat the afterbirth and lick the calf. Moreover, as
Indra was not born through the womb, there would be no afterbirth.
20.ఆమె దూడను ప్రసవించిన తరువాత మావిని తినక లేదా దూడను నాకక యున్న గోవు వలె, వానిని నిరాకరించెను. ఇంద్రుడు ప్రసవింపబడలేదు కనుక పునర్జన్మ లేదు.
21. Indra.
21. ఇంద్రుడు
22. A possible reference to the episode in which the Maruts left Indra to fight Vrtra all
alone. This point is debated (by the Maruts) in 1.165.6-7.
22. మరుత్తులు వృత్రాసురునితో జరిగిన యుద్ధములో ఇంద్రుని విడిచి వేసిరని సూచితము.
23. Indra asks Visnu to stride forward to help him, but he also refers to Visnu’s famous
talent for creating space (as Indra does by killing Vrtra) by striding. Cf. 1.154.
23.ఇంద్రుడు విష్ణువును తనకు సహాయము చేయమని అర్థించెను. అలాగే సృష్టి చేయగల విష్ణు సామర్థ్యమును సూచించెను.
24. This might be a question put by Visnu to Indra, but is more likely asked by the
narrator.
24.ఈ ప్రశ్న విష్ణువు ఇంద్రుని అడిగి యుండవచ్చు లేదా ద్రష్ట అడిగి యుండ వచ్చు.
25. That is, while he was still lying in the womb or coming out of it. Indra himself tries
to kill the Maruts when they are in the womb of their mother.
25.ఇంద్రుడు గర్భములో నుండు సమయాన. ఇంద్రుడు గర్భములో నున్న మరుత్తులను సంహరించుటకు ప్రయత్నించెను.
26. The same language is used to describe the killing of Vrtra and the killing of Indra’s
father. This is not to imply that these are one and the same, but they are strangely
linked: Tvastr is Vrtra’s father in later Indian tradition. In any case, the two deeds are
closely parallel in this hymn : Indra’s father must be killed, just as the dragon must be
killed, and Indra’s mother tries to prevent both slaughters at first (as Vrtra’s mother is
said to participate in the battle with Indra, in 1.32.9) and finally acquiesces and takes
Indra’s side, at least in the fight with Vrtra and perhaps, by implication, in the parricide.
26.ఇంద్రుడు వృత్రాసురుని మరియు తండ్రిని చంపుట ఒకటి కానప్పటికే, త్వస్త్ర వృత్రాసురుని తండ్రిగా వేరొక చోట చెప్పబడినది. ఇంద్రుని తండ్రిని ఒక అసురుని చంపునట్లు సంహరించవలెను. ఇంద్రుని తల్లి రెండు సంహారములను నిరోధించుటకు మొదట ప్రయత్నించెను. కానీ వృత్రాసురుని తల్లి యుద్దములో ప్రవేశించెను. కాబట్టి చివరకు ఆమె ఇంద్రుని పక్షము వహించెను.
Cf. the way in which the mother of Agni holds Agni by the foot when she abandons
him, 1.164.17.
27. This comes to be the quintessential polluting act in later Hinduism, an act that is
particularly used in mythology as an example of what one is allowed to do in dire straits:
one may even eat a dog. Indra seems to be arguing that, if this is so, one can surely kill
one’s father under similar circumstances.
27.ధర్మ శాస్త్రములో అతి క్లిష్ట పరిస్థితిలో శునక మాంసము తినవచ్చునని యున్నది. ఇంద్రుడు అటువంటి పరిస్థితిలో తండ్రిని సంహరించుట వలన పాపము కలుగదని వాదించుట.
28. Indra’s wife has not yet been mentioned in this hymn, nor is it clear why she would
be dishonoured: elsewhere (10.86.1. 1.86.4-5. 1.86.9) she is dishonoured when Indra
loses power, and the gambler’s wife is dishonoured when he is ruined (10.34.11). It is
possible that the ‘woman’ is Indra’s mother, whom he regards as dishonoured by the
actions of her husband, Indra’s father, and therefore avenges by committing parricide.
28.ఇంద్రుని భార్య గురించి ఈ ఋక్కులో ప్రస్తావన లేదు. మరొక చోట ఇంద్రుడు శక్తిని కోల్పోయినప్పుడు భార్యను అవమానించిరని చెప్ప బడినది. ఎలాగైతే జూదములో ఓడిపోయిన వాని భార్యను అవమానించినట్లు. లేదా పడతి తన భర్త వలన అవమానింపబడిన ఇంద్రుని తల్లి కావచ్చు.
29. This seems to contradict the statement that Indra took the Soma from Tvastr’s house
(v. 3), as well as the implication that Indra accompanied the eagle on the journey to get
the Soma (4.26.7, 4.27.3-4). Evidently what is meant is that once Indra had killed his
father (Tvastr), he had access to the Soma in all of its forms.
29. ఇది ఇంద్రుడు త్వస్త్ర నివాసమునుండి సోమ రసమును సంగ్రహించెనని మరియు ఇంద్రుడు గ్రద్ద సహాయముతో సోమ రసమును పొందెనని ముందు చెప్పిన వ్యాఖ్యలకు వ్యతిరేకముగా నుండు నట్లు అనిపించవచ్చును. కానీ ఇంద్రుడు తండ్రిని సంహరించిన తరువాత సోమ రసమును పొందే మార్గము సుగమమైనది.
NOTES
వివరణ