Friday, August 28, 2026

Wendy Doniger Rig Veda Pressing Stones




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట

10.94   The Pressing-Stones

10.94   సోమ రసమును పిండే రాళ్ళు

A hymn to the stones that press the Soma juice. The noise that they make while grinding the stalks of the plant, and their action in devouring (i.e. destroying) the fibres while releasing the juices, suggest the actions of animals (cows, bulls, horses) that growl or bellow and swallow the liquid.

ఈ ఋక్కులో సోమ రసము తయారు చేయుటకు వాడబడే రుబ్బుడు రాళ్ళు గూర్చి వివరింపబడినది. సోమ కాండములనుండి రసము తీయునప్పుడు వచ్చే శబ్దము, రాళ్ళ ద్వారా రసము పీల్చుట వలన కలిగే శబ్దము గోవులు, ఎద్దులు, గుర్రములు మొదలైన జంతువులు చేసే శబ్దాలతో పోల్చబడెను.

1 Let them1 raise their voices, and let us raise our voices. Speak your speech2 to the stones that speak, when you stones, you mountains full of Soma, rush to bring the rhythmic sound to Indra.

1. వాటి వలె మనము గొంతెత్తి పాడెదము1. మాట్లాడే రాళ్ళతో మాట్లాడు2. ఆ రాళ్ళు అమితమైన సోమ రసమును కలిగి, ఇంద్రునికి మన పాటను వినిపింపజేస్తాయి.

2 They speak in a hundred ways, a thousand ways, howling with their green jaws.3 Working busily and well to do the good work, the stones have succeeded in eating the oblation even before the priest of the oblation.

2.పచ్చని దవడలతో3 అవి అగణిత విధములుగా శబ్దములు చేయును. ఒక క్రమములో నిరంతరమూ మంచి కార్యమునకై పని చేస్తూ ఆ రాళ్ళు ఋత్విక్ ఆహుతి ఇచ్చే ముందే దానిని గ్రహిస్తాయి.

3 They speak: they have found the honey. They growl and gnaw on the cooked meat.4 As they snap at the branch of the red tree,5 the bulls who have grazed well begin to bellow.

3.అవి ఇలా మాట్లాడుతాయి: మకరందమును కనుగొంటిని. అవి వండిన మాంసమును పచనము చేస్తూ శబ్దాలు చేస్తాయి.4 ఎర్రని చెట్టు కొమ్మను రుబ్బుతూ ఉంటే, బాగా పచ్చిక మేసిన ఎద్దులు ఘీంకారములు చేస్తాయి.

4 They speak loudly, excited by the exhilarating drink. They shout to Indra: they have found the honey. Artfully they danced with the sisters that embrace them,6 making the earth echo with their stampings.

4.హుషారునిచ్చే పానీయము వలన అవి పెద్దగా శబ్దములు చేస్తాయి. అవి ఇంద్రునికి వినపడే టట్లుగా మేము మకరందమును కనుగొంటిమి అని అరుస్తాయి. రసవత్తరముగా వాటి దరి చేరిన6 అక్కాచెల్లెళ్లతో నాట్యము చేస్తూ, భూమిని తమ పాదములతో ప్రతిధ్వనింప జేస్తాయి.

5 The eagles have sent their cry up to the sky. Ardently the dark hinds danced in the meadow. They plunge deep to the rendezvous with the lower stone; they infuse it with floods of the seed of the sun-bright one.7

5.గ్రద్దలు ఆకాశంలో కూసేయి. ఆడ జింకలు పచ్చికలో నాట్యం చేసేయి. అవి లోతుగా పయనించి క్రిందనుండే రాళ్ళతో కలిసేయి. అవి సూర్యప్రకాశవంతుడైన వాని7 వీర్యాన్ని వాటితో కలుపుతాయి.

6 Like brawny draught animals yoked together, these bulls bear the shaft and pull as a team. When they bellow, panting and chewing the cud, they sound like racehorses whinnying.

6. బలిష్టమైన జంతువులచే పూన్చిన బండి వలె, ఈ ఎద్దులు వాటిని జతగా లాగుతాయి. అవి ఆయాస పడుతూ, నెమరు వేస్తూ చేసే శబ్దాలు గుర్రపు శకిలింపులవలె ఉంటాయి.

7 Sing to them that have ten girths,8 ten yoke-straps, ten harnesses, ten reins that never wear out, to them that are yoked ten times to bear ten shafts.

7. పది వేళ్ళ వెడల్పు గల8 , పది త్రాళ్ళతో పూన్చబడిన, పది జీన్లు గల, ఎప్పటికీ తరిగి పోని పది కళ్ళేలు గల, పది గానుగులకు పది మార్లు కట్టబడిన వాటికై పాడండి.

8 The stones are swift horses; their bridle with ten thongs fits them comfortably. They have tasted the filtered juice of the first pressing of the Soma juice milked from the stalk.

8.ఆ రాళ్ళు పందెము గుర్రముల వంటివి; వాటిపై అమర్చబడిన ఆసనము పది తోళ్ళు గలిగి సుఖముగా నుండెడిది. సోమ కాండము నుండి తాజాగా పిండబడిన రసమును అవి ఆస్వాదించినవి.

9 These Soma-eaters kiss Indra’s pair of bays. As they milk the stalk they sit upon the ox.9 When Indra has drunk the honey they have milked he grows great and acts like a bull.

9. ఈ సోమ భక్షకులు ఇంద్రుని కోవలను చుంబిస్తారు. కాండమును పిండుతున్నప్పుడు అవి ఎద్దును అధిరోహించి ఉంటాయి9 . అవి పిండిన రసమును ఇంద్రుడు గ్రోలినప్పుడు అతడు వర్ధమానుడై వృషభము వలె ప్రవర్తిస్తాడు.

10 Your stalk is a bull; surely you will not be harmed. You are always over owing with nourishment, sated with food. You are lovely in your splendour like the daughter of a rich man at whose sacrifice you stones rejoice.

10. నీ కాండము వృషభము; నీకు ఏ ఆపదా రాదు. నీకు తగిన పోషకములు అందుతూ, సదా ఆహారముతో నిండి ఉంటావు. నీవు ధనవంతుని కుమార్తె వలె సదా సుందరముగా నుండి, వాని యజ్ఞములో సంతోషముగా నుండెదవు.

11 Porous or not porous, the stones never tire, never rest, never die; they are never sick or old or shaken by passion; nicely fat, they are free from thirst and desire.

11.అంతరాలు కలిగి ఉన్నా లేక పోయినా, రాళ్ళు ఎప్పటికీ అలసి పోవు, విశ్రాంతి కోరవు, మరణించవు; అవి రుగ్మత పొందవు, వృద్దులు కావు, కామముతో ప్రవర్తించావు; తగు మోతాదులో లావుగా నుండి, దప్పిక మరియు కోరికలు లేకుండా ఉంటాయి.

12 Your fathers10 are entirely firm in age after age; peace-loving, they do not budge from their spot. Untouched by age, the companions of the tawny one11 are like the saffron tree;12 they have made the sky and the earth listen to their uproar.

12. మీ తండ్రులు 10 వృద్ధాప్యంలో గూడా ఆరోగ్యంగా ఉంటారు; శాంతిని కోరేవారు; వారి స్వస్థానమునుండి చలించరు. వయస్సుతో మార్పు చెందక, బంగారు వర్ణముగలవాని 11 మిత్రులుగా గల వారు గంధపు చెట్టు వలె నుండెదరు12 . వారి కేరింతలతో భూమ్యాకాశములను ప్రవర్తింప జేస్తారు.

13 The stones speak the same when they are unyoked and when they are on their journey, with their stampings like the noises of men who drink deeply. Like those who sow seed and grow grain, they gobble up the Soma without diminishing it as they lap it up.

13.ఆ రాళ్ళు పూన్చబడనప్పుడు కూడా అదే విధముగా మాట్లాడతాయి; అవి కదులుతున్నప్పుడు, తాగుబోతుల అడుగుల వలె ప్రతిధ్వనిస్తాయి. విత్తుని నాటి, ధాన్యమును పండించు వారల వలె, అవి సోమమును కొరత లేకుండా గ్రహిస్తాయి.

14 They have raised their voices for the sacrificial juice, like playful children jostling a mother. Set free the inspiration of the one who presses Soma, and let the stones that we hold in awe return to being stones.13

14.తల్లులను ఆట పట్టించే పిల్లల వలె, వారు సోమ రసమునకై ఉత్సాహముగా ధ్వనులు చేసేరు. మనకు ఆశ్చర్యము కలిగించే సోమ రసమును పిండే వాటి ఉత్సాహమును కట్టడి చేయక వాటి స్వస్వరూపములో ఉంచెదము13 .

NOTES

వివరణ

1. The stones are first referred to, and then are addressed after the priests, at the end of the verse.

1. మొదట రాళ్ళను సూచించగా, పాదాంతములో ఋత్విక్కుల తరువాత సూచింపబడెను.

2. Here the poet addresses the priests, whose chants of invocation to Indra are equated with the noise of the stones that Indra hears.

2.ఋత్విక్కుల నుద్దేశించి, వారు ఇంద్రునికై పలికే మంత్రాలను ఇంద్రుడు వినే రాళ్ళ శబ్దాలతో పోల్చెను.

3. Their jaws are green with the juice of the Soma plant, also called yellow, red (as in v. 3), or tawny.

3. సోమ రసము కారణముగా వారి దంతములు పచ్చని వర్ణము కలిగినవి.

4. Soma is here imagined as a sacrificial animal eaten by the stones.

4. రాళ్ళతో పచనము చేయబడే సోమ ఇచ్చట బలి పశువుగా ఊహించబడినది.

5. Soma.

5. సోమ

6. The ten fingers that hold the stones.

6. రాళ్ళను పట్టి ఉంచే పది వేళ్ళు

7. Soma.

7. సోమ

8. The ten fingers again, here imagined as draught animals as in the previous verse.

8. పది వేళ్ళు; క్రిందటి పాదము వలె పశువులుగా ఊహించబడెను

9. The Soma stalks are placed upon an oxhide.

9. సోమ కాండములు ఎద్దు చర్మముపై ఉంచబడెను

10. The mountains, as in verse 1, are the fathers of the stones.

10. మొదటి పాదము వలె పర్వతాలు రాళ్ళ తండ్రులు

11. Soma is the tawny one; as he grows in the mountains, they are his companions.

11.బంగారు వర్ణము గలది సోమ; అది పర్వతములలో ఉండేది కనుక, అవి దాని మిత్రులు

12. The stones (or the mountains) become yellow through contact with Soma.

12. రాళ్ళు (పర్వతాలు) సోమ కారణంగా బంగారు వర్ణము కలిగి ఉంటాయి.

13. That is, lose those awesome qualities that they took on during the ritual and return to being mere stones. The ritual objects must be desanctified after the ritual.

13. యజ్ఞ క్రమములో అనేక భావములు కలిగిన రాళ్ళు తమ స్వస్వరూపము పొందుట.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Pressing Stones

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...