Saturday, September 12, 2026

Wendy Doniger Rig Veda Soma-Indra-Eagle




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య

4.26-7 Soma and Indra and the Eagle

4.26-7 సోమ, ఇంద్ర మరియు గ్రద్ద

These two closely related hymns centre upon the myth of the theft of the elixir of immortality.

ఈ రెండు ఋక్కులూ అమృతమును తస్కరించుట గూర్చి వివరించును.

This Indo-European theme appears in Russia as the fire-bird and in Greece as the myth of Prometheus – for Soma is the ‘fiery juice’, simultaneously fire and water (Agni-Somau), that gives immortality.

Soma is born in heaven (or in the mountains) and closely guarded by demonic powers; an eagle carries Indra to heaven to bring the Soma to men and gods (or an eagle brings the Soma to Indra – cf. 4.18.13), escaping with merely the loss of a single feather from the one shot loosed by the guardian archer.

సోమ స్వర్గములో లేదా పర్వతములలో పుట్టునది. దానిని దానవులు కాపాడెదరు. ఒక గ్రద్ద ఇంద్రుని స్వర్గమునకు తీసికొని వెళ్ళి దేవతలకు, మనుష్యులకు సోమమును అందజేస్తుంది.

The first hymn begins with a song of drunken self-praise by Indra (vv. 1-4; cf. 10.119) and then tells the story of the eagle (vv. 5-7). The second hymn begins with the self-praise of the eagle (v. 1), then a verse spoken by Soma, and a return to the narration of the myth.

మొదటి ఋక్కు నిషాలో యున్న ఇంద్రుడు తనను తాను స్తుతించుకుంటూ గ్రద్దను గూర్చి వివరిస్తాడు. రెండవ ఋక్కు గ్రద్ద తనను తాను పొగుడు కొనుట. అటు పిమ్మట సోమ మాటలు.

4.26

4.26

1 [Indra:] ‘I was Manu and I was the Sun;1 I am Kaksivat, the wise sage.2 I surpassed Kutsa the son of Arjuna;3 I am the inspired Usanas4 – look at me!

1. [ఇంద్ర]: నేను మనువును మరియు సూర్యుడను1. నేను జ్ఞాని అయిన కక్శవితుడను2 . నేను అర్జునుని పుత్రుడైన కుత్శని అధిగమించినవాడను3. నేను ఔత్సాహికులైన ఉశనుడను4 . నన్ను గాంచండి

2 ‘I gave the earth to the Aryan; I gave rain to the mortal who made an offering. I led forth the roaring water;5 the gods followed after my wish.

2. నేను భూమిని ఆర్యన్ కు ఇచ్చేను. ఒక జీవి నాకు యజ్ఞ ఫలమును ఇవ్వగా వర్షము నిచ్చేను. ప్రవహించే జలములకు అధిపతిని5 . దేవతలు నా కను సైగలలో చలిస్తారు.

3 ‘Ecstatic with Soma I shattered the nine and ninety fortresses of Sambara6 all at once, finishing off the inhabitant as the hundredth, as I gave aid to Divodäsa Atithigva.

3.సోమతో ఆనందించి సంబరుని6 తొంబై తొమ్మది కోటలను ఒకేమారు ధ్వంసం చేసేను. వందవ కోటలోని నివసించే వారిని హతం చేసి, దివోదాస అతిథిగ్వ లకు సహాయం చేసేను.

4 ‘O Maruts, the bird shall be supreme above all birds, the swift-flying eagle above all eagles, since by his own driving power that needs no chariot wheels, with his powerful wings he brought to man the oblation loved by the gods.’

4.ఓ మరుత్తులారా, ఈ పక్షి అన్ని పక్షుల కన్న మిన్న, అన్ని గ్రద్దలకన్న పైకి ఎగరగలది. రథ చక్రముల అవసరము లేక తన స్వశక్తితో పయనించగలదు. తన బలమైన రెక్కలతో మనుష్యులకు దేవతలు అభిలషించే ఆహుతిని తెచ్చును.

5 Fluttering7 as he brought it8 down, the bird swift as thought shot forth on the wide path; swiftly the eagle came with the honey of Soma and won fame for that.

5.రెక్కలు కదుపుచూ 7 దానిని ఆలోచన కన్న వేగముతో తీసికొని వచ్చును8 . శర వేగముతో మధురమైన సోమను తెచ్చి ఘన కీర్తిని పొందెను.

6 Stretching out in flight, holding the stem, the eagle brought the exhilarating and intoxicating drink from the distance. Accompanied by the gods,9 the bird clutched the Soma tightly after he took it from that highest heaven.

6.రెక్కలు ఆడిస్తూ, కాండమును పట్టుకొని, బహు దూరం నుంచి మధురమైన, నిషా కలిగించే పానీయమును తెచ్చెను. స్వర్గము నుండి తెచ్చిన సోమను, దేవతలతో కూడి9 , గట్టిగా పట్టుకొనెను.

7 When the eagle had taken the Soma, he brought it for a thousand and ten thousand pressings at once. The bringer of abundance10 left his enemies behind there; ecstatic with Soma, the wise one left the fools.

7.ఆ గ్రద్ద అసంఖ్యాకమైన రసమును తీసే ప్రక్రియలకు సరిపడే సోమను తెచ్చెను. తన శత్రువులను విడిచి పెట్టి విరివిగా తెచ్చినది10. జ్ఞాని మూర్ఖులను విడిచెను.

4.27

4.27

1 [The eagle:] ‘While still in the womb, I knew all the generations of these gods. A hundred iron fortresses guarded me,11 but I, the eagle,12 swiftly flew away.’

1.[గ్రద్ద]: గర్భములో నున్నప్పుడు నుంచీ నాకు దేవతల పరంపర గూర్చి తెలుసు. నన్ను వంద ఇనుముతో చేయబడిన కోటలు నిర్భందించేయి11 . కానీ నేను 12శరవేగంతో ఎగిరి పోయేను.

2 [Soma:] ‘He]13 did not drag me out against my will, for I surpassed him in energy and manly strength. In a flash, the bringer of abundance left his enemies behind as he outran the winds, swelling with power.’

2.[సోమ]: అతడు 13 నా మనస్సుకు వ్యతిరేకంగా బయటకు తీసుకు రాలేదు. నేను వాని కన్న పౌరుషం, శక్తి నున్నవాడను. అతిశయమైన శక్తిని కలిగి, ఒక్క తృటి కాలంలో, విరివిగా తెచ్చేవాడు తన శత్రువులను వీడి, గాలి కన్నా వేగంతో పయనించేడు.

3 As the eagle came shrieking down from heaven, and as they 14 led the bringer of abundance down from there like the wind, as the archer Krsanu,15 reacting quickly, aimed down at him and let loose his bowstring,

3.గ్రద్ద శబ్దము చేస్తూ స్వర్గమునుండి వస్తూ, వాయువు వలె విరివిగా తెచ్చేవాడిని 14 స్వర్గము నుండి తెస్తూ నుండగా కృశన15 తేజముతో స్పందించి వానిపై దృష్టిని కేంద్రీకరించి, తన ధనుస్సును వీడెను.

4 the eagle bearing Indra brought him down like Bhujyu16 from the summits of heaven, stretching out in swift flight. Then a wing feather17 fell in mid-air18 from the bird as he swooped on the path of flight.

4. భుజ్యు16 స్వర్గపు పర్వత శిఖరాల నుండి వచ్చు నట్లు గ్రద్ద ఇంద్రుని మోస్తూ క్రిందకు శర వేగంతో వచ్చెను. అప్పడు ఒక ఈక 17 ఆ పక్షి నుండి మార్గ మధ్యంలో 18 వీడినది.

5 The white goblet over flowing with cows’ milk, the nest honey, the clear juice offered by the priests19 -now let the generous Indra raise it to drink until ecstatic with Soma; let the hero raise it to drink until ecstatic with Soma.

5.ఆవు పాలతో నిండిన శ్వేత పాత్ర, తేనె, హోతలు 19 ఆహుతి నిచ్చే శుద్ధ పానీయము--ఉదారుడైన ఇంద్రుడు నిషా వచ్చే వరకు సోమను త్రాగు గాక; మన నాయకుడు తనివి తీరా సోమను త్రాగు గాక.

NOTES

వివరణ

1. In his ecstatic sense of self-importance and omnipotence, Indra identifies himself with various mythic personages; the sun is another form of the prize won by the celestial fire-bird (or, in other variants, the sun is the fire-bird himself), and Manu, the eponymous ancestor of mankind, is the one to whom the Soma is brought (v.4).

1. గర్వంతో ఇంద్రుడు తనను తాను మిక్కిలి శక్తివంతునిగా భావించి అనేక మందితో పోల్చు కొనెను. సూర్యుడు స్వర్గములో పక్షి పొందిన మరొక బహుమతి. సోమ మనువుకై తేబడెను.

2. Indra identifies himself with the sage whom he inspires. Cf. Kaksivat in 9.74.8.

2.ఇంద్రుడు తాను ఉత్తేజ పరచిన ఋషి అయిన కక్శివత్ తో పోల్చుకొనుట.

3. Indra and Kutsa are sometimes enemies in the Rig Veda, sometimes allies in feats such as fighting with the serpent Susna and stealing the solar disc.

3.ఇంద్రుడు మరియు కుత్శ ఋగ్వేదంలో ముఖ్యంగా శత్రువులు, కొన్నిమార్లు మిత్రులు. పాము అయిన శుశ్నతో యుద్ధము చేసినప్పుడు, సూర్యుని తేజమును అపహరించునప్పుడు వారిద్దరూ మిత్రుల వలె కలిసిరి.

4. Usanas is an inspired sage and priest.

4.ఉశన ఋషి మరియు హోత

5. By destroying the fortresses of the demons, Indra releases the waters; cf. 1.32.

5. ఇంద్రుడు దైత్యుల కోటలను ధ్వంసం చేసి జలములను ప్రవహింప జేసెను.

6. A demon, the enemy of Indra and of Divodasa; with Indra’s help, Divodasa destroys the demon’s fortresses that imprison the eagle with the Soma.

6.ఇంద్రుని మరియు దివోదాస శత్రువైన దైత్యుడు. ఇంద్రుని సహాయముతో గ్రద్ద మరియు సోమలను బంధించి యుంచిన కోటలను దివోదాస ధ్వంసము చేసెను.

7. In fear of the archer shooting at him (4.27.3).

7. విలుకాడు తనపై బాణము ప్రయోగించుననే భయముతో

8. The Soma.

8. సోమ

9. The gods as the attendants of Indra.

9.దేవతలు ఇంద్రుని సేవించే వారలుగా

10. Indra, perhaps riding on the eagle. Elsewhere (cf. 1.116.13), the bringer of abundance (Purandhi) is a female divinity.

10.గ్రద్దపై కూర్చుని ఎగిరే ఇంద్రుడు. మరొక చోట విరివిగా ఇచ్చే పురంధి అనబడే దేవత.

11. Again an allusion to the demon’s fortresses (cf. 4.26.3), in which the eagle is kept; perhaps the Soma was guarded there and the eagle was kept there after the theft, though Soma may have been imprisoned alone earlier in order to forestall the theft.

11.గ్రద్దను నిర్భందించిన దైత్యుని కోట; దొంగలింపబడిన తరువాత సోమ మరియు గ్రద్ద లను అచ్చట నుంచిరి. లేదా అపహరింపబడకుండగా సోమను ఏకాకిగా నిర్భందించి యుండ వచ్చును.

12. The eagle boasts in response to Indra’s praise of him (4.26.4).

12.ఇంద్రుని పొగడ్తకు స్పందించి గ్రద్ద తనను తాను పొగుడు కొనుట

13. The eagle, or Indra riding on the eagle.

13. గ్రద్ద లేదా దానిపై కూర్చొని ఎగిరే ఇంద్రుడు

14. Probably the gods, or perhaps the winds mentioned in the previous verse.

14. దేవతలు లేదా వాయువు

15. A demon placed as guardian over the Soma.

15.సోమను నిర్భందించిన దైత్యుడు

16. The Asvins rescued Bhujyu from the ocean. Cf. 1.116.3-4.

16.సముద్రము నుండి భుజ్యను రక్షించిన అశ్వినులు

17. The feather turned into a plant used as a substitute for the Soma plant.

17. సోమ వృక్షము బదులుగా ఈక ఒక వృక్షముగా మారుట

18. Half-way between sky and earth.

18. నింగికి నేలకు మధ్య

19. The Adhvaryus, responsible for the performance of the Soma ritual.

19.సోమను శాస్త్రీయంగా పూజించే అధ్వర్యులు.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Soma-Indra-Eagle

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...