Friday, March 25, 2022

Book3-Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

13.1
13.2
13.3
13.4
13.5-13.6
13.6
13.7
13.8
13.9
13.10-13.11
13.12
13.13-13.15
13.16-13.17
13.18-13.19
13.20-13.21
13.22-13.23
13.24-13.25
13.26
13.27-13.28
13.29-13.30
13.31-13.34

గుణత్రయ విభాగ యోగము

14.1-14.2
14.3-14.4
14.5
14.6
14.7
14.8
14.9
14.10
14.11
14.12
14.13
14.14-14.15
14.16
14.17
14.18
14.19-14.20
14.21
14.22-14.23
14.24
14.25
14.26
14.27

పురుషోత్తమ ప్రాప్తి యోగము

15.1
15.2
15.3-15.4
15.5
15.6
15.7-15.8
15.9
15.10
15.11
15.12
15.13-15.14
15.15
15.16
15.17-15.19
15.20

దైవాసుర సంపద్విభాగ యోగము

16.1-16.3
16.4
16.5
16.6
16.7-16.9
16.10
16.11
16.12
16.13
16.14-16.15
16.16
16.17-16.20
16.21-16.22
16.23-16.24

శ్రద్ధాత్రయ విభాగ యోగము

17.1
17.2
17.3
17.4
17.5-17.6
17.7-17.10
17.11-17.13
17.14-17.16
17.17-17.19
17.20-17.22
17.23-17.26
17.27-17.28

మోక్ష సన్యాస యోగము

18.1-18.2
18.3-18.4
18.5
18.6-18.10
18.11
18.12
18.13
18.14-18.16
18.17-18.18
18.19-18.22
18.23-18.25
18.26-18.28
18.29-18.32
18.33-18.35
18.36-18.39
18.40-18.44
18.45-18.48
18.49-18.50
18.51-18.52
18.53
18.54-18.56
18.57
18.58
18.59-18.60
18.61-18.62
18.63-18.64
18.65-18.66
18.67
18.68-18.69
18.70-18.71
18.72-18.73
18.74-18.78

Thursday, March 10, 2022

Chapter 18 Section 32

Bhagavat Gita

18.32

సంజయ ఉవాచ:

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః {18.74}

సంవాద మిమ మశ్రౌష౦ అద్బుతం రో మహర్షణమ్

ఈ విధముగ ఆశ్చర్యకరమైనదియు, గగుర్పాటును కలిగించునదియు, మహాత్ముడైన అర్జుననుకును, శ్రీ కృష్ణునకు మధ్య జరిగిన ఈ సంవాదనమును వింటిని

వ్యాసప్రసాదా చ్చృతవాన్ ఏతద్గుహ్యమహం పరం {18.75}

యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్కథయత స్స్వయమ్

వ్యాస భగవానుని అనుగ్రహము వలన గుహ్యమైనట్టియు, ఉత్తమమైనట్టియు నగు ఈ యోగ్యశాస్త్రమును యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వినగలిగితిని

రాజన్ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య సంవాద మిను మద్భుతం {18.76}

కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః

ధృత రాష్ట్ర మహారాజా! శ్రీ కృష్ణార్జునుల కళ్యాణకరమైన, అద్భుతమైన ఈ సంవాదమును భావించుకొలదియు నేను పరవశించి పోతున్నాను

తచ్చ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య రూపమత్యద్భుతం హరేః {18.77}

విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః

రాజా! శ్రీహరి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విశ్వరూపమును తలచిన కొలదియు నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుచున్నది. ఆనందము కలుగుచున్నది.

యత్ర యోగేశ్వరః కృష్ణో {18.78}

యత్ర పార్థో ధనుర్థరః

తత్ర శ్రీ ర్విజయో భూతిః

ధృవా నీతిర్మతిర్మమ

యోగేశ్వరుడగు శ్రీ కృష్ణుడును, ధనుర్థరుడైన అర్జునుడును ఎచ్చట ఉందురో అచ్చట సంపదయు, విజయము, ఐశ్వర్యము, సుస్థిరమగు నీతి (రీతి) యుండునని నా అభిప్రాయము

ఎక్కడైతే కృష్ణుడు, అర్జునడు వలెనుండి ఈ కాలాతీతమైన సత్యాలచే మార్గదర్శకత్వం పొందుతారో అక్కడ కాంతి వలె నుండెడి శక్తులు విజయవంత మౌతాయి. జీవితము గ్రుడ్డి శక్తులచే మలచబడే గ్రుడ్డి వస్తువు కాదు. భౌతిక శాస్త్రములోని సిద్ధాంతముల వలె, ఆధ్యాత్మిక శాస్త్రములోని సిద్ధాంతాలు మన ఐకమత్యానికై ఉన్నాయి. ఆ ఐకమత్యాన్ని పాటించకపోతే కొన్ని దుష్ఫలితాలు వస్తాయి. అలాగే దానికనుగుణంగా నడిస్తే ప్రపంచం మనకు చేయూత నిస్తుంది. మనం మానవ మాత్రులమే, కానీ విశ్వ శక్తులు మనకు మద్దతు ఇస్తాయి. మహాత్మా గాంధీ ఇట్లు చెప్పెను:

నేను చేసిన శపథం గొప్పదీ కాదు, ప్రత్యేకమైనదీ కాదు. దేవుడు శరణాగతి కోరిన వారందిరినీ రక్షిస్తాడు. గీత చెప్పింది భగవంతుడు త్యాగ౦ చేసిన వారలచే కర్మ చేయిస్తాడు. ఇక్కడ ఎటువంటి భ్రాంతి లేదు. నేను చెప్పినది ఒక సామాన్య శాస్త్రీయ సిద్ధాంతం. ఎవరికైతే ఓర్పు, సంకల్పం ఉందో వారు దీన్ని పరీక్షించవచ్చు. తద్వారా వాళ్ళు అర్హతను సంపాదించవచ్చు. ఇవి తొందరగా అర్థంఅవుతాయి. ధృడత్వం ఉంటే అవి సులభంగా వంటబడతాయి.

గాంధీ దేశానికి తండ్రివంటివాడు అంటారు. ఆయన ప్రపంచ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయుడు. ఆయన మనకు చూపినది ఒక సామాన్య మానవుడు తన శక్తిని బహిర్గిత౦ చేసి, దేవుని కృపచే పనిముట్టువలె పనిచేసి, ప్రపంచాన్ని కొంతవరకు మార్చవచ్చు.

గాంధీని అర్థం చేసికోవాలంటే గీతని అర్థం చేసికోవాలి. అలాగే గీతని సులభంగా అర్థం చేసికోవాలంటే, గాంధీని అవగాహనకి తెచ్చుకోవాలి. ఆయని గొప్ప ప్రవచనం ఏమిటంటే చెడుకి శాశ్వతమైన స్థానం లేదు. దేవుడు నిజము. అతడు మన అంతర్గతమైన శక్తుల సముదాయము. అతన్ని తీసి పారేయలేము, మార్చలేము, మోసుకుపోలేము. చెడుకి ఉనికి మనము దానితో సహకరిస్తున్నప్పుడే. మనం సూర్యుని ముందు నుంచుంటే, మన నీడ పడదా? మార్గంలో చీకటి ఉంది. అయినా సూర్యుడు ప్రకాశిస్తాడు. సూర్యుని కాంతికి కలిగే అవరోధాన్ని తీసేస్తే నీడ పోతుంది. చెడు నీడ వంటిది. అది కాంతికి కలిగిన అవరోధాన్ని తీసేస్తే మాయ మౌతుంది. చెడుకు సహకారం చేసే వారికి ఒక భయానకమైన బాధ్యత ఉంది : కొంతకాలం చెడుకు ఉనికి ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ దానికి సహకారం ఆపితే --అనగా నిర్దయ, అవినీతి, హింస, యుద్ధం మొదలైనవి--చెడు మాయమౌతుంది.

మనము రాష్ట్రపతులను, ప్రధాన మంత్రులను మన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించుకోనక్కరలేదు. మనం అంతర్ముఖులమవుతే చాలు. నేను ఐకమత్యాన్ని విఫలం చేసే శక్తికి సహకారం ఆపితే, నేను చెడును కొంత లేకుండా చేసినట్టు. అది మనలో గొప్ప శక్తిని విడుదల చేసి, మన కర్మలను, బాంధవ్యాలను ప్రభావితం చేస్తుంది. ఆ శక్తి క్రమంగా మన చుట్టూ ఉన్నవారి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.

గాంధీ వ్యష్టి యొక్క సామర్థ్యతను వివరిస్తున్నాడు. సత్యానికి ఎందరో అవసరం లేదు. ఎవడు చెడుని మనసా వాచా కర్మా విడనాడితే, వానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుంది. గాంధీని "మీరు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొని విజయ౦ పొందేరు?" అని అడిగితే, ఆయన సమాధానం: "అది నేనే చేసేనని ఎలా అంటారు? నేను ఒక పనిముట్టును మాత్రమే". ఆయన చెప్పేది దేవుడు --అనగా సత్యము, ప్రేమ, ఐకమత్యము--ఎల్లప్పుడూ ఉన్నాడు. తన అహంకారాన్ని ఖాళీ చేసి, తన అంతర్గత శక్తికి ఒక వాహనంలా పనిచేసేడు. ఇది అయినప్పుడల్లా, కొంత ఆలస్యమైనా--ఇతరుల హృదయాలు స్పందిస్తాయి.

మనముందున్న శక్తులను పరిశీలిస్తే, మన చిన్న వ్యక్తిత్వం ఎలా వాటిని ఎదుర్కోగలదనే అనుమానం రావచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది "నువ్వు ఒక్కడివే పని చేస్తున్నవాని ఎందుకు తలుస్తున్నావు?" గురుత్వాకర్షణ ఎలా సదా భూమ్మీద ఉంటుందో, ప్రేమ, సత్యము, దయ అన్ని చోట్లా ఉంటాయి. అలాగే ప్రేమ, ఐకమత్యము జీవితానికి సహజం. మనమెలా వాటికి స్పందిస్తామో, ఇతరులూ అలాగే స్పందిస్తారు. మనం కర్మ ఫలాన్ని దబాయించి అడగలేము. "నీ కర్మ నువ్వు చెయ్యి. దాని ఫలితం నాకు వదిలిపెట్టు" అని శ్రీకృష్ణుడు చెప్పేడు.

ఆధ్యాత్మిక సాధన చాలా కఠినమైనది. దాని వలన జ్ఞానము పొందడం అతి కష్టం. దైవ కృపవలనే అది సాధ్యం. అదే లేక పోతే ఈ ప్రపంచానికి భవిష్యత్తు లేదు.

మనం ఒక్కళ్ళమే లేము. మన ప్రపంచం యాధృచ్చికంగా ఆనందం, ప్రేమ, కాంతి, దిశ, శాంతి, బాధ నుంచి ఉపశమనం లేక లేదు. మన చుట్టూ గాలి, కాంతి, గురుత్వాకర్షణము ఉన్నట్టే సృజనాత్మక శక్తి ఉన్నది. మనం వాటితో ఏకీభావంతో ఉండక పోతే అవి మనకి సహకరించలేవు. మన ఏకీభావం ఇవ్వగలిగితే, ప్రేమ జయిస్తుంది. ఇది గుర్తు పెట్టుకొంటే విశ్వాసం, ఆశ కలిగి విజయం తప్పక వస్తుంది.

Chapter 18 Section 31

Bhagavat Gita

18.31

కచ్చి దేత చ్చృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా {18.72}

కచ్చి దజ్ఞానసమ్మోహః ప్రణష్ట స్తే ధనంజయ

అర్జునా! నిశ్చల చిత్తముతో నీవు గీతా శాస్త్రమును ఆలకించితివా! అజ్ఞానము వలన కలిగిన నీ మోహము నశించినదా?

అర్జున ఉవాచ :

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయా అచ్యుత

స్థితో అస్మి గతసందేహః కరిషే వచనం తవ

కృష్ణా! నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది. {18.73}
సంశయ రహితుడ నైతిని. నీ ఆజ్ఞను శిరసావహింతును ఀ

గీత చెప్పేది: యుద్ధం మరియు భక్తి. సంస్కారాలతో, ఎప్పుడూ విడువకుండా, పోరు సల్పి తక్కిన వాటికై భక్తి సల్ప౦డి. అర్జునుడు "నాకు గత స్మృతి కలిగింది. నేనెవరినో తెలిసికొన్నాను" అని చెప్పెను. మన ప్రస్తుత పరిస్థితి మతిమరుపుతో కూడినది. మన దైవత్వాన్ని మరిచిపోయేం. ఒకరికి మతిమరుపు కలిగితే వాని బంధుమిత్రులు వచ్చి వానికి ఎరుక కల్పించరూ? మన౦ ఆధ్యాత్మిక మరపు నుండి లేచి ఇలా గుర్తు తెచ్చుకుంటాము: మనమొక విడిపడిన జీవి కాదు. మనం ఒక రాజ కుమారులం. మన కర్తవ్యం స్వరాజ్యానికి తిరిగి వెళ్ళడం.

శ్రీకృష్ణుడు మనకొక సవాలు ఇచ్చేడు: మీరు క్షమిస్తే, నిర్దయ కు బదులుగా దయ చూపితే, ప్రేమతో స్పర్థను జయించ గలిగితే, వెలుగులో ఉన్నారు. కానీ మీరు క్షమించ లేక పోతే, హింసను హింసతో ఎదుర్కొంటే, ప్రతిపక్షంలో ఉన్నారు. కావున గీత చెప్పేది: ప్రపంచం యొక్క విధి మీ చేతులలో ఉంది. మన ఎన్నిక చేసికొని, ప్రపంచాన్ని మలచుకోవాలి.

మనలోని క్రూరమైన శత్రువును ఎన్నో ఏళ్లు తెలికోలేదు. మన ప్రవృత్తి, తిరుగుబాటు తనము, భయం లేకుండుట ఇందుకని: మనం ప్రపంచాన్ని ఒంటరిగా పడవలో ప్రయాణించే ధైర్యం, ఎవ్వరూ ఎక్కని కొండని ఎక్కే ధైర్యం, ఎందుకంటే మన అహంకారాన్ని జయించడానికి. ఏ పోరూ దీనికి సరి కాదు. ఏ యుద్ధం ఇంత భీకరంగా ఉండదు. కాని యుద్ధం గెలిచిన తరువాత, మన అచేతన మనస్సులోని క్రోధము, భయము, దురాశ సమసి మన చేతనము కాంతితో నిండి యుంటుంది.

ఉపనిషత్లు చెప్పినట్లు: మనము అవాస్తవము నుంచి వాస్తవమునకు, చీకటినుంచి వెలుగుకు, మరణము నుండి అమరత్వమునకు వెళ్తాం. 480

Chapter 18 Section 30

Bhagavat Gita

18.30

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్య౦ సంవాదవయోః {18.70}

జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః

మన ఈ ధర్మరూపమైన సంవాదమును ఎవరు చదువునో వాడు జ్ఞాన యజ్ఞముతో నన్ను పూజించిన వాడగుచున్నాడు. ఇది నా అభిప్రాయము

శ్రద్ధావాననసూయశ్చ శృణుయోదపి యో నరః {18.71}

సో అపి ముక్తశ్శుభాన్ లోకాన్ప్రాప్నుయా త్పుణ్యకర్మణామ్

ఈ గీతాజ్ఞానమును శ్రద్ధావంతుడై, అసూయా రహితుడై ఆలకించెడి మనుజుడు పాపరహితుడై పుణ్యాత్ములు పొందెడి లోకములను పొందుచున్నాడు ఀ

సంప్రదాయం ప్రకారం సంతోషమైన ప్రపంచం అనగా స్వర్గం, మరణించిన తరువాత పొందేదని చెప్పబడుచున్నది. గీతా పారాయణం చేసినంత మాత్రాన స్వర్గం వస్తుందని నమ్మేవారిని చూసి పండితులు నవ్వుతారు. ధ్యానం చేయక పోయినా ఒక శాస్త్రాన్ని ఔపాసన భక్తితో, శ్రద్ధతో చేస్తే మనస్సు శుద్ధి చెందుతుంది. ఆ విధంగా మన కర్మలు కూడా శుద్ధమవుతాయి.

శ్రీకృష్ణుడు "ఎవరైతే గీతని భక్తితో, శ్రద్ధతో చదువుతారో, వాళ్ళు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు" అని చెప్పెను. ఇది మూఢ నమ్మకము కాదు. శ్రద్ధ గలవారు--అనగా తమను భౌతికంగా కాక, ఒక రసాయన సముదాయము కాక చూచువారు -- దానిని నమ్ముతారు. ఇది జ్ఞానమనే ఒక కిటికీని తెరవడానికి చాలు. అటువంటివారు తమకు జీవితం లేదా మనుష్యుని గూర్చి పూర్తి అవగాహన లేదని నిజాయతీగా చెప్తారు. వారు మేమి౦కా వెదుకుతున్నామని చెప్పవచ్చు. హృదయం అంగీకరిస్తే అది చాలు. గీత మొదలైన శాస్త్రాలను నిష్కపటంగా చదివి, వానిని నిజ జీవితంలో పరీక్షిస్తే గొప్ప ఆశను పొందుతారు.

శ్రీకృష్ణుడు వారు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు అని ప్రమాణం చేయలేదు. వారు ప్రపంచ సమస్యలు: పేదరికం, కాలుష్యం, జాత్యాహంకారం, కుటుంబంలో స్పర్థలు, అహంకారం మొదలైనవాటిని స్పష్టంగా చూస్తారు. కానీ ఎన్నిక చేయడానికి అవకాశం ఉందని తెలుసుకొంటారు. వారు తమ జీవితానికి ఒక లక్ష్యం ఉందని, ప్రపంచానికి సహాయ పడగలమని తెలుసుకొంటారు. దానికి కావలసిన పనిముట్లుతో -- ధ్యానం మొదలగునవి-- తమ అంతర్గత శక్తిని వెలికి తీయగలగుతారు. శ్రీకృష్ణుడు "అటువంటివారు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు" అని చెప్పెను. నేననేది "వారు ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా చేస్తారు." బాధల మధ్యలో ఇతరులకు సహాయం చేయడం వలన ఆనందాన్ని పొందుతారు.

విపష్చిత్ అనే ఒక రాజు పూర్వం ఉండేవాడు. అతను అశోకుడి లాగ తన దేశ ప్రజల సౌఖ్యముకై పాటుపడ్డాడు. ప్రజలు అతన్ని ప్రేమించి గౌరవించేవారు. అతను మరణించిన తరువాత శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై స్వర్గానికి తీసికువెళతానన్నాడు. కానీ విపష్చిత్ కు ఒక ప్రశ్న కలిగింది. "దేవా నేను స్వర్గ సుఖాలు అనుభవించే ముందు, నరకంలో కలిగే దుఃఖాలను చూడవచ్చా?"

శ్రీకృష్ణుడు అలాగే అని, ఒక దూతనిచ్చి నరకానికి తీసికెళ్లమన్నాడు. కాని అతడు ఎక్కడకి వెళ్ళినా జనులు ఆనందంతో వచ్చి ఆయనను ఆదరించేరు. ఆయన దూతని "నేను నరకాన్ని చూడాలనుకొన్నాను. నన్ను స్వర్గానికి ఎందుకు తీసికు వచ్చేవు?" అని అడిగేడు.

దూత "మహానుభావా, ఇదే నరకం" అన్నది.

"నాకు అర్థమవ్వటంలేదు. నేను నరకం దుఃఖ మయం అనుకొన్నాను. కానీ ఇక్కడ అందరూ ఎందుకు ఆనందంగా ఉన్నారు?"

"ప్రపంచం దుఃఖంతో కూడియున్నది. నీవు వాళ్ళను చూడడానికి వచ్చినందుకు అంత ఆనందం పొందుతున్నారు"

"నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను. నా స్వర్గం ఇక్కడే" అని విపష్చిత్ అన్నాడు 478

Chapter 18 Section 29

Bhagavat Gita

18.29

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వ భిధాస్యతి {18.68}

భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః

పరమ రహస్యమైన గీతా జ్ఞానమును నా భక్తులకు ఎవ్వడు చెప్పుచున్నాడో వాడు నాయందు ఉత్తమమైన భక్తిని కలిగి, సంశయ రహితుడై నన్నే పొందగలడు

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః {18.69}

భవితా న చమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి

మనుష్యులలో అతని కంటెను నాకు ప్రియమైనవాడు మరొకడు లేడు. అతని కంటెను మిక్కిలి ప్రియ మొనర్చువాడు మరి యొకడు ఉండబోడు ఀ

ప్రపంచంలో పేదరికం, కాలుష్యం, అణ్వాశ్త్రములు ఉండగా, మంచివారు కూడా, ధ్యానం అవసరమా అని అడుగుతారు. భౌతిక సమస్యలు కళ్ళకు కనబడతాయి. ధ్యానం నిశ్శబ్దంగా ఉండి దైనిందన కార్యములతో ఎటువంటి సంబంధం లేనట్టు ఉంటుంది. "ధ్యానం రక్తపు పోటును తగ్గించవచ్చు, కానీ అది ప్రపంచ సమస్యలకు ఎలా పరిష్కారం ఇస్తుంది?" అని అడిగేవారున్నారు.

ధ్యానం ఒక పనిముట్టు వంటిది. ఎవ్వరైనా దానిని ఉపయోగించి తమలోని గొప్ప శక్తిని వెలికి తీసి ఇతరుల సేవకై వినియోగించవచ్చు. గీత చెప్పే జ్ఞానం మనలో గుప్తంగా ఉన్న శక్తిని నిస్వార్థమైన కర్మలు, చాకచక్య౦తో నాచరించుకొనడానికి ఉపయోగపడుతుంది. కర్మలు మనిషి మనిషికి తేడాగా ఉంటాయి. ధ్యానం చేయగలగింది మనలోని శక్తిని విడదల చేయడం. శ్రీకృష్ణుడు చెప్పేది: ఇంకొక బోధకు ఇంత విలువ లేదు. ఏ అంశంలో నైనా, అంతర్గతమైన శక్తిని బయట పెట్టడంవలన, మానవాళి సమస్యలను పరిష్కరించడం వీలవుతుంది. అందుకే బుద్ధుడు ఇట్లు చెప్పెను: ఎవరైతే క్రోధం, భయం, దురాశ మన హృదయాల లోంచి దూరం చేస్తారో, అటువంటివారు ప్రపంచానికి అత్యుత్తమ సేవ చేసిన వారవుతారు.

ఎన్నిక చేసుకోవడానికి వీలులేని ప్రపంచంలో అటువంటివారు గొప్ప ఆశను కల్పిస్తారు. యోగులు చెప్పేది మంచితనం, ప్రేమ, భక్తి ప్రపత్తులు గురించి. వారు మనలోని సహజమైన ప్రేమ గూర్చి చెప్తారు. వారు దానిని మనకు చూపిస్తారు కూడా. ఒక ఆధ్యాత్మిక గురువుకు అట్టి ప్రేమ ఉంటుంది. మనం మంచిని మనస్సులోకి ఎక్కించుకోనక్కరలేదు. మనస్సు నుండి చెడుని తీస్తే చాలు. మనం ప్రేమ స్వభావమును ఎక్కడనించో తెచ్చు కొనక్కరలేదు. మనలోని ప్రేమ మీద ఉన్న దుమ్మును దులిపితే చాలు. అలాచేస్తే మానవాళి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విలియం లా చెప్పినట్లు "సమస్యలు ప్రేమ లేకపోవడం వలన కలుగుతాయి". 476

Chapter 18 Section 28

Bhagavat Gita

18.28

ఇదం తే నాట్యపస్కాయ నా భక్తాయ కదాచన {18.67}

న చాశుశ్రూషవే వాచ్యం న చమా౦ యో అభ్యసూయతి

నేను నీకు బోధించిన ఈ గీతామృతమును తపస్వి కాని వానికి, భక్తుడు కానివానికి, శుశ్రూష చేయని వానికి, నన్ను ద్వేషించినవానికి చెప్పగూడదు

గీత ఎవరైతే శ్రద్ధతో విని, పాటిస్తారో వారి గురించై చెప్పబడినది. గీత జీవితం, మరణం గురించి చెప్పిన జ్ఞానము అనిర్వచనీయము. కాని ఆ జ్ఞానము అక్కరలేదు అనే వారికి గీత బోధించుట వ్యర్థము.

మనము ప్రపంచాన్ని చేతన మనస్సుతో అనుభవిస్తాము. జీవితాన్ని మనమెలా ఉన్నామో అలాగ చూస్తాము. అది మన నడవడికకు మూలము. నిర్దయ, తప్పుగా అర్థం చేసికోవడం, అసహనం మన తప్పుడు అవగాహన వలన కలుగుతాయి.

నా పెంపుడు కుక్క మూకాకు ఆకాశం నీలంగా ఉంది, మొక్కలు పచ్చగా ఉన్నాయి అని చెపితే అంగీకరించదు. ఎందుకంటే అది నలుపు, తెలుపు తప్ప మిగతా రంగులు చూడలేదు. అలాగే ఒక కళాకారుడు, నేను నీలం అనుకునే వస్తువులో, అనేక నీలి ఛాయలు చూస్తాడు. ఎవరి ప్రపంచం నిజం? నేను, మూకా, ఉండే ప్రపంచాలు వేర్వేరు.

నేను సాన్ ఫ్రాన్సిస్ కో వెళితే, నేను చూసే ప్రపంచం, పర్యాటకులు చూసే ప్రపంచం వేర్వేరు. మన మనస్సు అనుభవించే ప్రపంచంలో మనముంటాము. నేను చిన్నప్పుడు చూసిన ప్రపంచం, ఇప్పుడు చూసే ప్రపంచం వేర్వేరు. నేను మనుష్యులను నా మిత్రులు గాను, శత్రువులగాను చూడను. నేను వారిలో భగవంతుడ్ని చూస్తాను. ముఖ్యంగా నేను అర్థవంతమైన ప్రపంచాన్ని చూస్తాను. దాని రూపము కొన్ని శక్తుల వలన కలిగినది. ఆ శక్తులు మన అవగాహనకు వచ్చునవి, మనచే నియంత్రింపబడగలవి. ఎందుకంటే అవి కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. నేను చూసే ప్రపంచం యాదృచ్ఛికంగా రాలేదు. నేను అన్ని చోట్లా ఎన్నిక చేసికోవచ్చును. ఒకడు తన ప్రపంచంలో గుడ్డిగా పనిచేసే శక్తులు, అర్థంలేని సంఘటనలు, ఎన్నిక లేకపోవుట చూస్తే నేను ఏ విధంగా అభ్యంతరము చెప్పగలను?

ఈ శ్లోకం చెప్పేది ఆధ్యాత్మిక నిజాలను పరిహసించే వారిని ఖండించ కూడదని. మనం మూకాని రంగులు చూడలేదని శిక్షి౦చలేము. అలాగే అనాసక్తిగా ఉన్నవారికి గీత గురించి చెప్పడంవలన లాభం లేదు. మన చేతన మనస్సులో ఒక కిటికీ ఉంది. దానిని తెరిచి గీతను వినాలి. ఆ కిటికీ తెరవకపోతే గట్టిగా వక్కాణించే శక్తివంతమైన పదాలు ఒక చెవిలో ఎక్కి రెండవ చేవిలో౦చి వెళ్ళిపోతాయి. వాటి మధ్యలో ఎటువంటి జ్ఞానం కలగదు. 475

Chapter 18 Section 27

Bhagavat Gita

18.27

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు {18.65}

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసిమే

నా యందు మనస్సు నుంచుము. నా భక్తుడవు కమ్ము. నన్ను అర్చించుము. నాకు నమస్కరింపుము . అట్లు కావించెద వేని నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టుడవు. అందువలన సత్యమును ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ {18.66}

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

సర్వధర్మములను త్యజించి నన్నొక్కనినే శరణు పొందుము. నేను నిన్ను సకల పాపములనుండి విడిపించెదను. నీవు శోకింపకుము

గాంధీ మహాత్ముని ఒకరడిగేరు: "దేవుడు మనని ఎందుకు సంతృప్తి పరచడు?" ఆయన జవాబు: "అది ప్రేమకాదు. ఒప్పందం." నిజమైన దైవ భక్తుడు తనకున్నదంతా ఇతరులకై దారపోస్తాడు. బదులుగా ప్రేమ తప్ప ఏమీ అడగడు.

అతి తక్కువ యోగులు ఒకేమారు తమ కున్నదంతా త్యజిస్తారు. తక్కినవాళ్ళు ఇంద్రియ సుఖములను ఆశిస్తారు.

ధ్యానంలో మనము అచేతన మనస్సు లోతులకు వెళతాము. అక్కడ అనేక శక్తులు ఉంటాయి. మనస్సులో ఒక చేతనం నుంచి ఉంకొకదానికి వంతెనలు లేవు. మనము చేతనముగా ఉండి, అచేతన మనస్సుని పరిశీలించడం కల్ల, సాధింపలేనది అని మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటారు.

చూడడానికి మత్సరమనే సంస్కారం చిటికెన వేలంత ఉంటుంది. ధ్యానం గాఢమై, ఆ సంస్కారాన్ని లోతుగా పరిశీలిస్తే అది మణికట్టంత పెద్దదిగా కనిపిస్తుంది. ఇంకా లోతులో అది మన చేయంత ఉంటుంది. అది రాత్రి మన కలలలోకి వస్తుంది. ఇదే స్థిర భావం. అది చిత్రహింసలు పెడుతుంది. మనము దానిని విడిపించుకొనుటకై చాలా ప్రయత్నం చేయాలి.

మనకుండాల్సినది మీరా, సెయింట్ తెరెసా లాంటి వారి ప్రేమ. "నేను అంతా పోగొట్టుకున్నా, నిన్నే ప్రేమిస్తాను. వేరొకరిని ప్రేమించను. నీవే నా లక్ష్యం" అని దేవుడ్ని ప్రార్థించాలి. అటువంటి శరణాగతి తప్ప వేరేదేదీ మనను రక్షింపలేదు.

"నీవు నన్ను శరణాగతి కోరితే నిన్ను సర్వ కర్మలనుండి, సర్వ పాపాలనుండి విముక్తిని చేస్తాను" అని శ్రీకృష్ణుడు చెప్పెను. శరణాగతి కోరే ముందు మన మనస్సు నిశ్చలంగా ఉండాలి. అన్ని స్వార్థపూరిత ఆలోచనలినీ వదులుకోవాలి. అలాంటప్పుడు మనమేమి కర్మ చేస్తాము? మనం గతంలో చేసిన పాప కృత్యాలు మన మనస్సునుండి చెరిపివేయబడతాయి. అటు తరువాత మనం శుద్ధుల మవుతాము. మనం ఎంతో గొప్ప యోగులు మొదట నిర్లక్ష్యంగా బ్రతికి సాధన చేసేరని విన్నాము. వారిని ఎవరైనా "మీరు నిజంగా ఇటువంటి పనులు చేసేరా?" అని అడిగితే వారి సమాధానం: "అదొక కల. అది చాలా కాలం క్రింద జరిగింది. నేను అటువంటి వ్యక్తిని ఒకనాడు. కాని వాడు మరణించేడు. శరీరం ఒకటే, కాని అందులో పూర్తిగా మారిన మనిషి ఉన్నాడు". ఒక సినిమా అంతమైనప్పుడు అంతకు ముందు ఒక కాలుతున్న అడవిని చూపించినా తెర ఎలా తెల్లగా మిగులుతుందో, మన గతం మనమీద ఆరోపింపబడదు.

Chapter 18 Section 26

Bhagavat Gita

18.26

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా {18.63}

విమృశ్త్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు

ఈ విధముగ రహస్యము లన్నిటి కంటెను అతి రహస్యమైన జ్ఞానమును నేను నీకు బోధించితిని. దీనిని బాగా విచారించి, ఆ తరువాత నీకు తోచినట్లు చేయుము

సర్వగుహ్యతమం భూయః శృణు మే సరమ౦ వచః {18.64}

ఇష్టో అసి మే ధృడమితి తతో వక్ష్యామి తే హితమ్

రహస్యము లన్నిటి కంటెను రహస్యమైనదయు, ఉత్తమ మైనదియు నగు నా వచనములను మరల ఆలకింపుము. నీవు నాకు మిగుల ఇష్టుడవు. అందువలన నీ మేలు గోరి చెప్పుచున్నాను

శ్రీకృష్ణుడు చెప్పేది "నేను నీకు ఎక్కడా దొరకని జ్ఞానమును ఇచ్చేను. దానిని విచారించుము. దానిగురించి లోతుగా ఆలోచింపుము. దానిని అన్ని చోట్ల, ప్రతి పరిస్థితిలోనూ పరీక్ష చేయుము. నీకు తోచినది చేయుము". కానీ అతడు "నేను చెప్పినది చేయకపోతే వెయ్యేళ్ళు నరకమనుభవిస్తావు" అనలేదు. "మీరు హేతుబద్ధమైన వారు, శ్రధ్ధ గలవారు. మీకు మంచి చెడు, ఆరోగ్యం రోగం, ప్రేమ అసహ్యం గురించి తెలుసు. కాబట్టి మీరు ఎన్నిక చేసుకోండి" అని మనకి అతిగొప్ప నివాళి చేసేడు. ఇది గీత యొక్క గొప్పదనం: బెదిరింపులు లేకుండా పూర్తి గౌరవం.

ఇలా చెప్పడంలో ఒక కళ ఉంది. హిందూ సంప్రదాయంలో ధ్వని అనే అంశముంది. ఒక కళాకారుడు రెండు స్వరాలు మీటుతాడు. వాటి మధ్య శ్రావ్యత మనల్ని నింపుకోమంటాడు. ఇది మన ఊహకు నివాళి.

నా విద్యార్థులు ప్రతీ విషయాన్ని విపులంగా చెప్పాలని కోరేవారు. "నాకు మీరు చెప్పేది అర్థం కాలేదు. దాన్ని ఎక్కడా వాడలేను" అని నిర్మొహమాటంగా చెప్పేవారు. నేను వారిని ఆంగ్ల పద్యాలలో ఉన్న ధ్వనిని పరిశీలించండి అని చెప్పేవాడిని. అప్పడి నుంచి వాళ్ళు నే చెప్పే పాఠాన్ని ఆహ్లాదంగా వినేవారు.

కాళిదాసు ఒక గొప్ప రచయిత. అతని ప్రతి పద్యంలోనూ ధ్వని ఉంది. "వాని ప్రేమ అస్తమించిన సూర్యునివలె ఉన్నది" అని చదివితే కొత్తగా వచ్చిన విద్యార్థులు దిక్కులు చూసేవారు. నేను "మీకు తెలీదా సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడాని?" అనేవాడిని. వాళ్ళు అర్థం చేసికొని నేచెప్పేది శ్రద్ధగా వినేవారు. వాళ్ళకి ధ్వని గురించి చెప్పి ఆసక్తిని ఎక్కువ చేసేవాడిని.

నా ఉపాధ్యాయిని అటువంటి కళా కారిణి. ఆమె చెప్పే ప్రతి పాఠంలోనూ ధ్వని ఉంది. ఆమె నన్ను ఊహించడానికి ప్రోత్సాహించేది. ఆమె మహాభారతంలో అర్జునుడు చేసినది చెప్పేది. కాని దాని నుంచి నైతిక మైన ముగింపును చెప్పేది కాదు. ఆమెకు నా మీద అపారమైన అభిమానము౦డి, నేను ప్రయత్నించి నా జీవిత౦తో ఎలా అనుసంధానం చేయాలో తెలిసికొ౦టానని నమ్మేది. ఆమె చాలా తక్కువ మాట్లాడి, ఏదీ విపులంగా చెప్పేది కాదు. అందువలన ఆమె యందు నా గౌరవము ఎక్కువయ్యేది. ఇటువంటి బోధనలో సంపూర్ణమైన గౌరవము, ప్రేమ, నమ్మకము ఉన్నాయి. అది అనేకమైన ఆంక్షలతో కూడిన నేటి విద్యా విధానంకి పూర్తి వ్యతిరేకం. ఉపాధ్యాయుడు రెండు స్వరాలను చెప్తాడు. వాటి మధ్య మన౦ శ్రావ్యత పూరించుకోవాలి. 469

Chapter 18 Section 25

Bhagavat Gita

18.25

ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి {18.61}

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా

అర్జునా! ఈశ్వరుడు యంత్రము నారోహించిన వారివలె యున్న సకల ప్రాణులను తన మాయచేత త్రిప్పుచు, సమస్త జీవుల హృదయముల యందు వెల్గొందుచున్నాడు

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత {18.62}

తత్ప్రసాదాత్పరాం శా౦తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్

భారతా! సమస్త భావముల చేత అట్టి పరమేశ్వరునే శరణు పొందుము. అతని అనుగ్రహము వలన ఉత్తమమైన శాంతి, శాశ్వతమైన మోక్షమును పొందగలవు

నా గ్రామంలో ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు, అతని కొడుకులు అనేక వస్తువులు: కుండలు, ప్రమిదలు మొదలైనవి చేస్తూ ఉండేవారు. రోజూ ఉదయాన్నే అతడు నది దగ్గరకు వెళ్ళి బంక మన్నును సేకరించేవాడు. అతని కొడుకు చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఆ మట్టితో వస్తువులు చేసేవాడు.

కొన్ని కోట్ల సంవత్సరాలు జీవుడు అనేక మార్లు పుట్టి, మరణించి, పరిణామ౦ చెంది కాలమనే చక్రములో తిరిగి, కర్మను పోగుచేసుకొని, తద్వారా మలచబడ్డాడు. అలా తిరగడం, మలచబడడం మాయ వలన జరుగుతుంది. మానవ జీవితం బంక మన్నుతో ఏ గుణాలూ --మంచి చెడు లేదా స్వార్థం నిస్వార్థం-- లేకుండా మొదలయ్యెను. కుమ్మరి మనమే. మనం చేసే కుండ సరిగ్గా లేకపోతే మనం దాన్ని వెనక్కి తీసికెళ్ళి మన సొమ్మును ఇమ్మని అడగలే౦.

బంక మన్ను ఎక్కువగా ఉంటే, ఆకారం సరిగ్గా లేని కుండను బాగు చేయవచ్చు. అది ఇంకా సరిగ్గా లేకపోతే దానిని పరులకు ఇవ్వచ్చు. కాబట్టి మనం పరులకై జీవిస్తే మన నష్టాలను భర్తీ చేసికోవచ్చు. ఈ విధంగా మన చెడ్డ కర్మను తగ్గించుకోవచ్చు.

కర్మ తక్కువవుతున్న కొద్దీ మనస్సు శాంతంగా ఉంటుంది. మన స్వార్థపూరిత కోర్కెలను తీర్చుకోవడానికై ప్రయత్నించడము వలన చెడు కర్మ పోగవుతుంది. ఇతరుల యందు దయతో ఉండి , మన సంస్కారములను నియంత్రించుకొంటే, చెడు కర్మ తగ్గి మనస్సు ప్రశాంతతను పొందుతుంది. క్రమంగా మనం కోర్కెలను త్యజించి, వాటికై ప్రయత్నించక ఉంటాము. ఒక సంస్కారము ఎదురైతే దానిని మంత్రము ద్వారా నియంత్రించవచ్చు. దానివలన చెడు కర్మ పోగు అవ్వదు. మన౦ క్రియలు, బంధాలు ఏర్పరచుకొన్నది మంచి కర్మను చేసి, చెడు కర్మను పోగొట్టుకోవడానికి.

క్రమంగా మనం చేసే కుండ చక్కగా అవుతుంది. మన వ్యక్తిత్వం లోని చెడున౦తా తొలగించి ఒక ఆదర్శవంతునిగా తయారవుతాము. కాని ఆ కుమ్మరి చక్రము వెంటనే ఆగదు. అది కొంచెంసేపు తిరిగి ఆగుతుంది. అలాగే సాధన చివరి దశలో ఇంకా కొన్ని కోర్కెలు ఉండవచ్చు. కాని వాటిని పట్టించుకోకపోతే అవి మన చేత క్రియలు చేయించలేవు.

నేను ఒకమారు ఒక మిత్రుని కారులో వెళుతున్నాను. అప్పుడు వర్షం పడింది. అతను విండ్ షీల్డ్ వైపర్ ల స్విచ్ వేసేడు. కానీ రెండిట్లో ఒకే వైపర్ పనిచేసింది. రెండోది తిరిగింది కానీ వర్షపు నీరుని తియ్యటం లేదు. ఈ విధంగానే ఒక పనికిరాని సంస్కారం పని చేస్తుంది. దానిని పట్టించుకోక పోతే మనకయ్యే నష్టం ఏమీ లేదు.

మనకు కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన అలవాట్ల వల మనస్సు కుమ్మరి చక్రం లాగా మళ్ళీ తిరగడం మొదలుపెడుతుంది. ఆ సమయంలో విచార పడకుండా, బంక మన్నుతో కుమ్మరి చక్రం మీద వస్తువులు చేయనట్లుగా ఉండాలి. ఒక బలమైన కోర్కె వస్తే దాన్ని పట్టించుకోకూడదు. అది ఎలా వచ్చిందో అలాగే పలాయనమౌతుంది.

ధ్యానంలోని ఏకాగ్రత వలన దేహంలో మార్పులు వస్తాయి. మన మనస్సుతో పాటు మన దేహంలో ఒకప్పుడు వేగంగా జరిగే మార్పులు నెమ్మదిగా జరుగుతాయి. ఉదాహరణకి మన ఉఛ్వాసనిశ్వాసలు నిమిషానికి 16 నుంచి 3 వరకు తగ్గుతాయి. ఆ వ్యవధిలో మన మనస్సు, అహంకారం పని చేయవు.

గీత చెప్పేది మనం ఈశ్వరుడికై పరిగెత్తి వెళ్ళి ఆయనిని ఆశ్రయించి మనశ్శాంతిని పొందమని. ఇది పారిపోవడం కాదు. మన నిజమైన ఇంటికి వెళ్ళడం. శ్రీకృష్ణుడు "నీ ఆత్మలో ఆశ్రయం పొందు" అని అంటున్నాడు. అక్కడ దేశకాలములు లేవు. కారణము, కార్యము, క్రియ అనబడే త్రిపుటి లేదు. పూర్ణమైన మనశ్శాంతి ఉంటుంది.

సాధన చివరి దశలో మన ధ్యానం ఎంత లోతుగా ఉంటుందంటే, ఒక పక్షి మన తల మీద వాలినా మనకు తెలియదు.

మన మనస్సులో ఏకగ్రీవత జరుగుతుంది. మోక్షం తప్ప వేరే కోరిక ఉండదు. మనకున్న ప్రతి కోరికను అనుభవించాలి. లేకపోతే మనస్సనే కుమ్మరి చక్రం మళ్ళీ తిరిగి క్రొత్త కర్మలను చేయిస్తుంది. ఒక రోజు ధ్యానంలో ఉన్నప్పుడు, సెయింట్ తెరెసా చెప్పినట్లు, దేవుడు పక్షిలా వచ్చి మనని ఆకాశంలోకి తీసుకవెళ్తాడు.

మన ఆ దశను ఇమ్మని దాబాయించి అడగలేము. మనం వినమ్రతతో "నా మనస్సు ఖాళీ అయింది. నా అహంకారం తొలగింది. నీవు ఎంతకాలం నిరీక్షించమంటే అంతకాలం నిరీక్షిస్తాను" అని ప్రార్ధన చేయగలం. అలా నిరీక్షించడం ఒక పరీక్ష వంటిది. దేవుడు చివరకు ప్రత్యక్షమైతే అది ఒక గొప్ప బహుమతి.

కఠ ఉపనిషత్లో "ఆత్మ ఎవరికి సాక్షాత్కారము చెయ్య దలచుకుందో వారికి కనబడుతుంది" అని చెప్పబడెను. మనం ఎంత ప్రయత్నించినా మనస్సు నిశ్చలము చేయడం చాలా కష్టం. అలాగే అహంకారాన్ని పూర్తిగా తీసేయలేము. "నేను ఇంతకన్నా ఏమీ చేయలేను" అని అవగాహనకు వస్తుంది. చివరకు మన సాధన ఫలిస్తుంది. 467

Chapter 18 Section 24

Bhagavat Gita

18.24

యదహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే {18.59}

మిథ్త్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి

నీవు అహంకారమును ఆశ్రయించి, యుద్ధము చేయనని తలంచెదవేని నీ ప్రయత్నము వ్యర్థమగును. నీ స్వభావము నీ చేత ఆ పనిని చేయించును

స్వభావజేన కౌన్తేయ నిబద్ధ స్స్వేన కర్మణా {18.60}

కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్యవశో అపి తత్

అర్జునా! నీవు అవివేకము వలన నీ కర్మను ఆచరించ నిచ్చగింపకపోయినను, స్వభావసిద్ధమైన నీ కర్మ చేత బంధింపబడిన వాడవై, పరవశుడవై చేయుదువు

రెండు శక్తులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి: రాబోయే పరిణామం మరియు మన గతం. కాని ప్రతి అనుభవంలోనూ, స్వభావములోనూ ఒక ముఖ్యమైన పరిణామ కారణం ఉన్నది: మన జీవిత గమ్యానికి దగ్గర చేయడం.

మన౦ అనుభవించే ప్రతి సమస్య, లక్ష్యం దగ్గరకు తీసికెళ్ళే అవకాశం ఇస్తుంది. గాంధీకి 20 ఏళ్ల వయస్సులో, స్వదేశంలో ఉద్యోగం దొరకక, ఉద్యోగమునకై తక్కువ జీతానికి ఒప్పుకొని సౌత్ ఆఫ్రికా కి వలస వెళ్ళడం, ఆయన వ్యక్తిత్వం, స్వభావం మార్పు చెందిడానికి, అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశం ఒక అపజయాన్ని, నిరాశను కల్పించవచ్చు. దేవుడు ఆయనకు ఆత్మ జ్ఞానము, మరే భరోసా ఇవ్వలేదు. ఆయనకు కష్టాలు ఇచ్చేడు. అందువలన అతడు ఇతరులకై పాటు పడడానికి నిశ్చయించుకొన్నాడు. ఎన్నో వేల మంది సౌత్ ఆఫ్రికా లో అవమానాలు పొందేరు. కాని ఒక్క వ్యక్తి తనకు జరిగిన అమానుషత్వాన్ని ఎదుర్కొని అందరి తరపున పోరాడడానికై పూనుకొన్నాడు.

ప్రతి అంశం మన ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగ పడుతుంది. నేను ఒక తిరుగుబాటుదారుడను చూసి, అతని స్వభావ౦ ఒక కారణం వలన ఉన్నదని తలుస్తాను: లక్ష్యం చేరడానికై మన స్వార్థం మీద, అహంకారం మీద తిరుగుబాటు చేయాలి. ఎంతో మంది యోగులు తమ జీవితాల్లో వివేకంతో కూడి తిరుగబాటు చేసేరు. సెయింట్ తెరిసా ఇన్క్విజిషన్ పై తిరుగుబాటు చేసేరు. ఆమె చిన్నప్పుడు క్రూసేడ్స్ కి వ్యతిరేకంగా వెళ్లాలని ఊహించుకునేవారు. ఆమె తన తిరుగుబాటు స్వభావాన్ని సన్మార్గములో పెట్టి జీసస్ కై అంకితం చేసేరు. ఆమెపై ఇతరులు అభాండాలను వేసినా ఆమె చిరునవ్వుతో సహించేరు. ఆమె ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక మేధావి. ఎందుకంటే ఆమె తన తిరుగుబాటు స్వభావాన్ని తనకు కలిగిన అవరోధాలను తొలగించు కొనుటకై ఉపయోగించుకొన్నారు.

మనం చేసే ప్రతి తప్పుకు ఒక ప్రయోజనం ఉంది. అది కర్మ వలన చేయబడి, కర్మను తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది జీవితంలో కలిగే పెద్ద యుద్ధం. చికాకు, అసంతృప్తి, మనస్సాక్షి వలన కలిగే ఇబ్బంది, మనలో పరిణామం వలన కలిగే పోరాటం వలననే. అలాగ పోరాటం లేకపోయినా, దాని అవగాహన ఉంటే మన పరిణామానికి మనమే బాధ్యత తీసికొన్నట్టు.

నేను సముద్రపుటొడ్డున నడవడానికై వెళ్తూ ఉంటాను. గాలి నన్ను ముందుకు తోస్తూ ఉంటే నడవడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నేను తిరిగి వస్తున్నప్పుడు అదే గాలి నా మీదకి ఇసుక జల్లుతూ నాకు ఇబ్బంది కలిగిస్తుంది.

ఆ గాలివంటి అనుభవం మన మనస్సులో కూడా ఉంది. మనకి నచ్చే విషయాల పై మనను తీసికెళ్ళి, మనకి నచ్చని విషయాలనుంచి దూరం పెడుతుంది. మనం వెనక్కి వస్తున్నప్పుడు వేల కొలది ఆలోచనలు మన మొహం మీద ఇసుక జల్లినట్లు౦డి మనం చక్కగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు మనం చిన్న చిన్న అడుగులు వేసి ముందుకు వెళతాం. ఎక్కువ ఈదుర గాలి మన ప్రయత్నానికి ఆటంకం కలగించి మనకు నిరాశ కలిగించవచ్చు. దానికై మన దృష్టిని లక్ష్యం పై కేంద్రీకరించి, "సదా నీ చూపును నా మీదే ఉంచు" అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు, అవరోధాలను అధిగమించాలి.

కొందరు "నా సంస్కారాలనే ఈదురు గాలిని ఎదిరించి బ్రతకలేను. నా మొహం మీద ఇసుక జల్లబడితే సహించలేను" అంటారు. ఇది మానవ సహజం. గీత ఇచ్చే సమాధానం కొంచెం కటువుగా ఉంటుంది. మీరు ఈదురు గాలిని ఎదిరించకపోతే, మీ సంస్కారాలు తిరగబడి మిమ్మల్ని దానిని అనుభవించేటట్టు చేస్తాయి అంటుంది. అదే దుఃఖం, బాధ. ఒకడు ఎంతో దుఃఖాన్ని అనుభవించ లేడు. దానికి ఒక పరిమితి ఉంది. దాని వలన మనశ్శాంతి కోల్పోయి, బంధుత్వాలను పోగొట్టుకొని, ఆరోగ్యం చెడి పోతుంది. శ్రీకృష్ణుడు "నా ఆదరువు నీకు ఎంతో అవసరమై, ఆ బాధే నిన్ను గాలికి ఎదురుగా నడిపింప జేస్తుంది" అంటాడు. మనం ఎంత దూరం పయనిస్తే, తిరిగి వెనక్కి అంత దూరం నడిచి, ఇంకా ఎక్కువ ఈదుర గాలిని ఎదుర్కోవాలి. "నీవు నడవలేని పరిస్థితి వచ్చే వరకు వేచి ఉండకు. వెనక్కి తిరిగి నీ సంస్కారాలను ఎదుర్కో" అని శ్రీకృష్ణుడు అంటాడు.

యోగులు శ్రీకృష్ణుని హెచ్చరికను వి౦టారు. తక్కినవాళ్లకు కొంచం కష్టం. మనం చేసే ప్రతి క్రియకూ ఒకే లక్ష్యం ఉంది. అది మనల్ని పరిమితమైన ప్రతి వస్తువు మీద అసంతృప్తిని కలుగజేసి, మన ఆత్మను గురించి తెలుసుకోడానికి ప్రోద్భలం చేస్తుంది.

ఈ మార్పు అకస్మాత్తుగా జరగక్కరలేదు. నేను సెయింట్ ఫ్రాన్సిస్ వంటి వాళ్ళ వలె నాటక ఫక్కీలో మార్పు జరుగుతుంది అనను. ఒక సాధారణ వ్యక్తి "నేను భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను" అని ఒప్పుకోకపోవచ్చు. "నేను మంచి జీవితాన్ని కోరుకుంటున్నాను. నాకు మనశ్శాంతి, మంచి బంధాలు అవసరం" అని అనవచ్చు. ఇది ధ్యానం మొదలుపెట్టడానికి చాలు. ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో మందులు వాడి, చివరకు ధ్యానం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు.

నేను 1959 నుంచి ధూమపానం అనారోగ్యమని చెప్తూ వచ్చేను. చాలామంది మిత్రులు ఆ అలవాటు ఎప్పటికీ పోదని, నేను సమయం వృధా చేస్తున్నానని అనేవారు.

కానీ కొన్నేళ్ళ తరువాత ధూమపానం అనారోగ్యమని అందరూ తెలిసికొన్నారు. చాలా మంది పట్టుదలతో ఆ అలవాటును మానుకొన్నారు. ఒక మనిషి ఒక దురలవాటుని మానడానికై ప్రయత్నిస్తే, ఎంతో హాని నుంచి రక్షింపబడతాడు.

ఈ విధంగానే సమాజం కూడా మారవచ్చు. ఒక మనిషి తరువాత ఉంకొకడు తమ అలవాట్లను మార్చుకొంటే, క్రమంగా సమాజంలో మార్పు వస్తుంది.

కొన్నేళ్ళ క్రిందట లాభాలనాశించి సంస్థలు చిన్న పిల్లలతో తమ పరిశ్రమలలో వారానికి 40 - 60 గంటలు పని చేయించుకొనేవారు. అటువంటి వెట్టి చాకిరీ ఈనాడు సంపన్న దేశాలలో చూడం. బాధ ఎక్కువవతున్నకొద్దీ మార్పు కై కోరిక ప్రబలుతుంది. ధూమపానం, పక్షపాతం, వెట్టి చాకిరీ, కాలుష్యం, యుద్ధం మొదలైనవాటివలన కలిగే అపార నష్టం వలన మార్పు తప్పక వస్తుంది.

సాధనలో పరిపక్వత పొందుతున్న కొద్దీ, మన అహంకారం తన ఆధిపత్యానికై పోరాడుతుంది. దానివలన మన సంస్కారాలు, ఇంద్రియాలు, భావాలు, భయాలు ప్రభావిత మవుతాయి. ఒకడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడితే, అహంకారం వానిని ఇంకా ఎక్కువ అలవాటుపడడానికై ప్రోత్సాహం చేస్తుంది. బుద్ధుడు సన్న్యాసానికి ముందు రాజ సుఖాలు అనుభవించలేదా? అలాగే మనం కూడా అని అహంకారం వాదిస్తుంది.

మనం అచేతన మనస్సు లోతులకు వెళ్తున్న కొద్దీ, మన సంస్కారాలు మనం వెళ్ళిన త్రోవలోనే బయటకు వస్తాయి. చివరకు అవి మనతోనే యుద్ధానికి వస్తాయి. మనం వాటితో యుద్ధం చేయవలసిందే.

తెలివైనవారు ఇలాంటి సమయంలో మెలకువగా ఉంటారు. ఇంద్రియ సుఖాలు మనల్ని తప్పు దారి పట్టిస్తాయి. సంస్కారాన్ని ఎదిరించక పోతే అది మన పట్టుదలని సడలించడానికై ప్రయత్నిస్తుంది.

అర్జునుడు ఎలాగైతే తన బంధుమిత్రులతో యుద్ధానికి వెళ్ళనన్నాడో, అలాగే మన పట్టుదల సడలి సంస్కారాలతో యుద్ధం చేయలేనని అనవచ్చు.

శ్రీకృష్ణుడి చెప్పే యుద్ధ నిశ్చయతలో ఎన్నిక చేసికోవడానికి ఆస్కారం లేదు. మనం వద్దనుకొన్నా సంస్కారాలు మనతో యుద్ధానికి వస్తాయి. మన౦ కర్మ సిద్ధాంతం నుండి విముక్తిని పొందలేము. బ్రతికి ఉండడం వలన మనమీ యుద్ధాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. అందుకై మనం యుద్ధం చేయవచ్చు, లేదా పలాయనం చేయవచ్చు.

అర్జునుడు క్షత్రియుడు. నిజమైన క్షత్రియులు యుద్ధ భూమినుండి పలాయనము చేయరు. వారి దూకుడు, క్రోధం, గర్వం, సంకల్పం ఇందుకై ఉన్నాయి.

శ్రీకృష్ణుడు "మన స్వభావం మనలను మారుస్తుంది" అంటాడు. మనం వలలో చిక్కిన చేప వలె ఉన్నాము. ఆ వల చేసికొన్నది మనమే. చాలా కాలం దానికి అలవాటు పడి దానినుంచి బయటకు రావడానికి ఇష్ట పడం. శ్రీకృష్ణుడు ప్రకృతి మనలను చివరకు స్వంతంత్రులను చేస్తుందని అంటాడు. కటిక చీకటిలో ఒక కాంతి కిరణం వస్తే, దాని వైపే వెళతాం. ఒకడు కటిక చీకటి ఫరవాలేదు, దానిలో నివసించడానికి నాకు అభ్యంతరం లేదు అనవచ్చు. కాని దానివలన లాభం లేదు. ఎందుకంటే మనకు కావలసినది సార్వత్రిక కాంతి. 463

Chapter 18 Section 23

Bhagavat Gita

18.23

మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా త్తరిష్యసి {18.58}

అథ చేత్త్వమహంకారాత్ స శ్రోష్యసి వినంక్ష్యసి

నా యందు చిత్తము గల నీవు నా అనుగ్రహము వలన సర్వ సంకటములను దాటగలవు. ఒకవేళ నీవు అహంకారము వలన వినని యెడల చెడిపోయెదవు

మనం జీవిత అంచులలో బ్రతుకుతూ ఉంటే మన సమస్యలు కూడా చిన్నవై ఉంటాయి. అవి పెద్దవి అనిపిస్తే, మన౦ చేతన మనస్సు లోతులకు వెళ్లలేదని అర్థం. మన౦ లోతుకు వెళితే, ఇంకా ఎన్నో సమస్యలు ఎదురవ్వవచ్చు. కాని అవి మనం భరించలేనంతగా ఉండవు. మనం ఆధ్యాత్మికత వలన కలిగే కష్టాలను ఎదుర్కోలేమని అనుకోవడం శ్రద్ధ లేకపోవటం వలన. ఆ కష్టాలు సహజం, మరియు అవసరం కూడా. ప్రతి ఒక్కరూ వాటిని ఎదుర్కోగలరు. నా సాధనలో లోతుగా వెళ్ళే వేగం ఎక్కువైతే, నేనెంత క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్నా అంతర్ముఖుడినై, ఇంకా లోతుకు వెళ్ళి వాటిని పరిష్కరించే మార్గం వెతకుతాను. ఇటువంటి సాధన ప్రయత్నం చేసే వారందరికీ వర్తిస్తుంది. అలా చేయగలిగితే ఓటమివాదం పోతుంది.

మనము మానవాతీత శక్తి ఉంటే తప్ప సాధన చేయలేమని అనుకోవడం అపోహ. యోగులు కూడా ఏ ఒక్కడూ ఆత్మ జ్ఞానాన్ని తనంతట తానే కలుగజేసికోడు అని అంటారు. దానికి దైవ కృప ఉండాలి. మనం చెయ్యగలిగిందల్లా ప్రయత్నంతో, క్రమశిక్షణతో కూడిన సాధన. మనకున్న శక్తినంతా సాధనకై వెచ్చించక పోతే మన అహంకారం ధృడమవుతుంది. శ్రీకృష్ణుడు అందుకే "నువ్వు అహంకారంతో నా మాట వినకపోతే, నేను నిన్ను రక్షింపలేను" అని చెప్పెను. అలాగని శ్రీకృష్ణుడు మనయందు తన ప్రేమను వెన్నక్కి తీసికొ౦టానని చెప్పటం లేదు. కష్టాలు వస్తాయి అని చెప్పుచున్నాడు.

మన సాధన మొదట్లో అనేక అనుమానాలతో కూడి ఉంటాము. వాటిలో కొన్ని చిన్నవి కొన్నాళ్ళు సాధన చేస్తే తొలగిపోతాయి. కాని కొన్ని మన వ్యక్తిత్వంలో ధృడంగా పాతుకు పోయి మనకు లోతుకు వెళ్తే తప్ప అవగాహనకు రావు. ఆ సమయంలో ఎంతో విచారము పొందవచ్చు. "నేనేమి చేసేది? గీత సంపూర్ణమైన మనస్సుతో సాధన చెయ్యమంది. అది ఎలాగ?" అని నిరుత్సాహపడవచ్చు. ఇది సహజం. మన అహంకారాన్ని చంపుకోడానికి ప్రయత్నిస్తున్నాం. అది అంత సులభంగా కాక మనని ఒక వైపుకు లాగుతుంది. మన ఆత్మ మనల్ని ఉంకోవైపుకు లాగుతుంది. మన౦ చేసే ఎన్నికలకు, మన కోర్కెలకు వాడే శక్తిని ఆత్మ వైపుకు తిప్పుకోవాలి. శ్రీకృష్ణుడు తక్కినది చేస్తాడు. ఆగస్టీన్ "మనం చెయ్యగలిగింది చేస్తే, దేవుడు తన ఇష్టమైనట్టు చేస్తాడు" అనెను.

అచేతన మనస్సు అపారమైనది, అంతం లేనిది. దానిని అర్థం చేసికోవడం సాధ్యం కాదు. అచేతనమంటేనే మనకి చేతన మనస్సుతో విశ్లేషించడం సాధ్యం కానిది. కానీ యోగులు వినియపూర్వకంగా "అవును అది అసాధ్యం. కానీ మేము చేసేము. కాబట్టి మీరు కూడా చేయవచ్చు" అని చెప్తారు. ఇటువంటి అధ్బుతమైన జ్ఞానం, జగత్తులో ఎటువంటి దానితోనూ పోలిక పెట్టలేం. 456

Chapter 18 Section 22

Bhagavat Gita

18.22 చేతసా సర్వకర్మాణ్యపి మయి సన్న్యస్య మత్పరః {18.57}

బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ

చిత్తముచే సర్వ కర్మలను నాయందు సమర్పించి మత్పరాయనుడవై, బుద్ధి యోగమును ఆశ్రయించి, సదా నా యందే చిత్తము గలవాడవు కమ్ము

శ్రీకృష్ణుడు చివరగా అర్జునినికి బోధ చేయుచున్నాడు. "నీ మనస్సులో ఎటువంటి సంశయాలు ఉండకూడదు" అని పదే పదే చెప్పుచున్నాడు.

ఒక పేరుపొందిన గాయకుడు "నాకు ప్రేమలో పడడం చాలా ఇష్టం. కాని అది 6 నెలల ముచ్చట" అన్నాడు. బంధాలు భౌతికమైనవి అయితే 6 నెలలే ఎక్కువ. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ చెప్పేది: "నీవు నన్ను నీ హృదయంతో, బలముతో, ఆత్మతో ప్రేమించ గలిగితే నీవు సదా ప్రేమతో ఉంటావు".

కొంతమంది అడుగుతారు "పరమాత్మని సదా స్మరించడం అంటే ఏమిటి?" దానికి బదులుగా మనం ఆడగవలసింది పరమాత్మని స్మరించక పోతే ఏమవుతుంది? క్రోధం, శతృత్వం, చికాకు, అసహనం మొదలైన వాటితో కూడిన మానసిక స్థితి కలుగుతుంది. మన హృదయంలో దేవుని స్మరిస్తే, నిర్దయ రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ.

మీరు నాలాగ ఇళ్లలోనూ, బస్సు ల్లోనూ, దుకాణాల్లోనూ, హోటల్ లోనూ రోజూ కలిగే కలహాలు చూస్తే తెలుస్తుంది. మనకి భూమి మీద ఎంతో తక్కువ సమయం ఉండి, ఎంత చేయవలసినది ఉందో తలచుకొంటే అవి హాస్యాస్పదం గా ఉంటాయి. ఒక యోగికి జీవితమంతా వేగిరంగా సాగుతుంది. కలహాలు, స్వార్థ కర్మ, మొదలైన లక్ష్యాన్ని చేర్చలేని పనులకు వ్యర్థం చేసేట౦త సమయం లేదు.

అలా అని చిన్న చిన్న ఆనందాన్ని వద్దనటంలేదు. నా ఉదాహరణ తీసికో౦డి. నేను నా గురువు దయ వలన ఒక చిన్న యోగిని. నేను శ్రీకృష్ణుని ఎప్పుడూ మరచిపోను; నిద్రలో కూడా ఆయని ఎరుక ఉంటుంది. కానీ నేను జీవితాన్ని ఆహ్లాదంగా గడుపుతానని నా బంధు మిత్రులు చెప్తారు. నేను పోషకాహారాన్ని తింటాను; నాకు చాలా గట్టి బంధాలు ఉన్నాయి; సముద్రపు టొడ్డున దీర్ఘంగా నడుస్తాను; నేను పుస్తకాలు చదువుతాను; నేను సినిమాలకు, కచేరీలకు వెళ్తాను. నేను ఆనందం కలిగించే దానిని దేన్నీ విడవలేదు. కానీ నేను ఆనందించడానికై బ్రతకటం లేదు. నేను జీవితాన్ని ఆహ్లాదంగా అనుభవిస్తాను. ఎందుకంటే నేను ఇతరుల ఆనందానికై జీవిస్తాను కనుక. నేను చేసే ప్రతి కర్మా దానికై.

నా ప్రాధాన్యతలను మార్చుకోవడం మీకు లాగే కష్టం. ఒక కళాకారుడు తన కళను ఎలా ఆరాధిస్తాడో నేనూ అలాగే ఏకాగ్రతతో నా విధులను చేస్తాను. నేను చిన్నప్పుడు సాహిత్యం, సంగీతం, క్రీడలు చాలా ఇష్టపడేవాడిని. ధ్యానం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ, నేను శ్రీకృష్ణునికి దగ్గర అవ్వాలంటే నా ఇష్టాలను వదలి వెయ్యాలి అని గ్రహించేను.

నా కది మొదట్లో కష్టమనిపించి, ఎప్పటికీ చెయ్య లేననుకొనేవాడిని. నా బుద్ధి "ఇది అవసరమా? వీటి వలన కలిగే అపకారం ఏమిటి?" అని అడిగేది. నేను గొప్ప కవినైనా, నోబెల్ ప్రైజ్ పొందినా, అసంతృప్తిగా మరణిస్తానని అర్థం చేసికొని బంధాలను త్రె౦పుకొన్నాను. అటు తరువాత కళల మీద ఇష్టం పోయింది. ఇప్పుడు దేనిమీదా అయిష్టత లేదు. నేను పూర్తి స్వతంత్రంతో అన్నిటినీ ఆనందిస్తున్నాను. ఒకప్పుడు వాటిని త్యాగంచేయడం నష్టమనిపించింది. నాకిప్పుడు తెలుస్తోంది నేను ఎంత ఎక్కువ పొందేనో.

"నీ ప్రతి కర్మ నాకు అర్పిత౦ చేయి" అని శ్రీకృష్ణుడు చెప్పేడు. దాని అర్థం మన స్వీయ సంకల్పాన్ని వదులుకోవాలి. సాధన మార్గంలో --ముఖ్యంగా ధ్యాన మార్గంలో -- సారథ్యం వదలకూడదు. మనం ఎరుక క్రిందనున్న శక్తిని వెలికి తీస్తున్నాము. మన అచేతన మనస్సులోని శక్తులు మనకి ఎరుక లేకుండా సారథ్యం వహించవచ్చు.

చాలా సంవత్సరాల సాధనతోనే మన౦ సదా సారథ్యం వహించగలం. నేను సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా యొక్క ఉదాహరణ ఇస్తాను. ఆమె ధ్యానం లో ఉండగా ఒక పెద్ద గ్రద్ద వచ్చి, ఆమె శరీరాన్ని నేలపై విడచి, ఆకాశం లోకి తీసికెళ్ళినట్లు ఆమెకు అనిపించింది. కాని "నాకున్న ప్రేమ వలన నేను భయపడలేదు" అని చెప్పేరు. ఆమెకు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగేయి. ఆమెకి ఎంత నియంత్రణ శక్తి ఉందంటే, అన్నం వండుతున్నప్పుడు దేవుడే వచ్చి ఆకాశంలోకి తీసికివెళితే, ఆమె చెయ్యి గిన్నెను పట్టుకునే ఉంటుందని ఆమె సహచరులు చెప్పేరు.

మన మనస్సు చంచలంగా ఉంటే, అటువంటి అనుభవం వస్తే, మన లక్ష్యాన్ని చేర గలిగే ద్వారం మూసుకొంటుంది. పరవశం రాకుండా ఆశ గొల్పు సంఘటనలు కలుగుతాయి. కొందరు యోగులు వాటిని ఇలా చెప్తారు: "నేను దేవుడు అడుగుల చప్పుడు నా హృదయంలో విన్నాను. నేను ఎంతో ఉత్సాహపడుతుండగా ఆయన వెనక్కి తిరిగి వెళ్లిపోయేడు." అందుకే మీరు సారథిగా ఉండాలని చెప్పేది. భావోద్వేగము మిమ్మల్ని తప్పు దారులు పట్టించకుండా చూసుకోండి. ఉత్సాహం తరువాత నిరాశ వస్తుంది. మన దేవుని తిరోగమమం అటువంటిదే. సెయింట్ తెరెసా అది ఒక అతి వేదన కలిగించే ఘటన అంటారు. క్రిష్టియన్ లు దానిని డార్క్ నైట్ ఆఫ్ సోల్ అంటారు. నేను చెప్పేది అటువంటి డార్క్ నిరాశలు కలగకుండా చేసికోవచ్చు. దానికై మన మనస్సుని ఉత్సాహభరితం చేయకుండా ఉండాలి.

మన మనస్సులో కలిగే ప్రతి కోరిక, భయం, ఒక శక్తిని కూడి ఉంటాయి. చిన్న కోరికకైనా శక్తి ఉండి, క్రోధము, భయము, దురాశ ఒక తుపాను లాగ చెలరేగి తమ దారిలో ఉన్న ప్రతిదానిని అతలాకుతలం చేస్తాయి. మనం కోర్కెలను ఏకీకృతం చేసినా, మనమెలా మనస్సులో చెలరేగే తుపానులను ఎదుర్కోగలం? అవి ప్రతి మానవునిలో ఇలాగే ఉంటాయి. మంత్రోపాసన తోనూ, ధ్యానం వలన వాటిని నిరోధించవచ్చు.

ఒక తుపానుని మంత్రంతో ఎదుర్కొనడం, మన నమ్మకం బట్టి ఉంటుంది. చేతన మనస్సు అంచులలో -- క్రొత్తగా ధ్యానం మొదలు పెట్టినవారలలాగ -- మంత్రోచ్చారణ వలన గొప్ప శక్తి రాదు. అది మంత్రంలో శక్తి లేక కాదు. ఆ మంత్రాన్ని ఇంకా చేతన మనస్సు లోలోపలికి తీసికెళ్లలేదు కాబట్టి.

కొందరు నాకు ఉత్తరాల్లో "మీరిచ్చిన మంత్రం పని చేయడం లేదు" అని వ్రాస్తారు. నా సమాధానం "మీరు గట్టి ప్రయత్నం చేయలేదు". మంత్రం ప్రతిసారీ పని చేస్తుంది. కానీ మనస్సులోని తుపానులను ఎదుర్కోవాలంటే ఆ మంత్రం అవి ఏ లోతులో ఉన్నాయో, అక్కడికి తీసికెళ్ళి ధ్యానించాలి.

నేను నా మంత్రాన్ని ఎడతెరిపి లేకుండా మననం చేసికొ౦టాను. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా, కొన్ని నిమిషాలు ఖాళీ దొరికితే, మంత్రాన్ని ధ్యానించు కుంటాను.

మొదట్లో నేను ఎక్కువ భక్తితో చేయలేదు. చాలా మంది హిందువులు తమకిష్టమైన దైవ స్వరూపాన్ని --కృష్ణుడు, రాముడు, శివుడు -- తలచుకొ౦టారు. కానీ నేను అలాగ చెయ్యను. ఇటువంటి భక్తి ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మందిలో చూస్తాం. నేను మొదట నా అమ్మమ్మను ఆనందింప చేయడానికై మంత్రాన్ని మననం చేసేవాడిని. క్రమంగా అది శ్రీకృష్ణునిపై అపరిమిత ప్రేమగా మారింది. అందులో నా గురువు సహాయం కూడా ఉంది.

చాలా కాలం మననం యాంత్రికంగా జరిగేది. కానీ ధ్యానంలో పరిపక్వం చెందితే దానివలన భక్తి భావం కలుగుతుంది. నేను నా మంత్రాన్ని పట్టుదలతో, వీలైన ప్రతి సారీ, ఒక్కొక్కప్పుడు రాత్రి నిద్రలో గంటల తరబడి, చేసేను. ఎందుకంటే నేను అజపజపం అనే స్థితికి ఎదగాలని. అంటే చేతన మనస్సుకు తెలియకుండానే మంత్ర జపం జరగాలి. క్రిస్టియన్ గురువులు "ఆపకుండా ధ్యానం చెయ్యి" అని సెయింట్ పాల్ ను శాసించేరు. ప్రస్తుతం నా మంత్రం చేతన మనస్సు లోతులలో అమిత శక్తివంతమైనదిగా ఉన్నది. నిద్రలో స్వప్న దశ తరువాత, దానిని చేతన మనస్సులో ప్రతిధ్వనిస్తూ, దాని శక్తితో నా దేహాన్ని కంపింపజేస్తుంది. ఎలాగంటే ఒక యంత్రంతో నడపబడే పనిముట్టు వాడుతూ ఉంటే మన దేహం ఎలాగ కంపిస్తుందో అలాగ. కాని నాకు నిశ్శబ్దంగా ఉండి, చల్లని సంగీతంలాగ ఉత్సాహాన్ని ఇస్తుంది. 452

Chapter 18 Section 21

Bhagavat Gita

18.21

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి {18.54}

సమస్సర్వేషు భూతేషు మద్భక్తి౦ లభతే పరామ్

బ్రహ్మభూతుడైన ప్రసన్నాత్ముడు దేనిని గూర్చి దుఃఖి౦పడు. దేనిని కోరడు. సమస్త ప్రాణుల యందును సముడై ఉత్తమమైన నా భక్తిని పొందుచున్నాడు

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్శ్చాస్మి తత్త్వతః {18.55}

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్

అతడు భక్తిచేత నేనెవడనో, నా ప్రభావమెట్టిదో తెలిసికొను చున్నాడు. నన్ను ఈ విధముగ వాస్తవముగ గ్రహించినవాడై అనంతరము నా యందే ప్రవేశించుచున్నాడు

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్ప్యపాశ్రయః {18.56}

మత్ప్రాసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్

సర్వ కర్మములను సదా ఆచరించుచున్నను ఎవడైతే నన్ను శరణు పొంది యున్నాడో అట్టివాడు నా అనుగ్రహము వలన నాశరహితమైన మోక్షమును పొందుచున్నాడు

శాశ్వతమైన జీవితం గూర్చి గురువులు చెప్పెదరు. అది అతిశయోక్తి కాదు.

కొన్ని సంస్కృతులలో మరణం గురించి మాట్లాడరు. హిందూ మతములో మరణం ఒక తలుపు లాంటిది. ఇక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఒక సొరంగం ఉంది. దానిలోనుండి ఒక రహదారి వుంది. దాని లోకి నాలుగు వాహనాలు ఒకేమారు వెళ్ళవచ్చు. అలాగే నాలుగు వాహనాలు ఒకే మారు బయటకు రావచ్చు. చావు పుట్టుక అటువంటివే. ఒక వైపు వస్తే పుడతాము. రెండవవైపు వెళ్తే మరణిస్తాము.

ఒక విమానం ఆ సొరంగం లోంచి వెళ్ళక పైనించే ఎగిరి పోతుంది. . అదే సమాధిలో చేయగలం. మనం సొరంగం లోంచి, చేతనంలో ఎటువంటి మార్పు లేక వెళ్లగలం. అలాగే వెనక్కి వస్తాం. ఆ అనుభూతి మాటలలో చెప్పలేం. ఒక మరణిస్తున్న వ్యక్తితో ఆ రహదారి అంతమయ్యేవరకూ వెళ్ళి, మరణం గురించి ఉన్న అపోహలు తొలగించుకోవచ్చు.

సొరంగం ఆరంభం మన ఎరుక వంటిది. అక్కడ మరణం అంటే ఏమిటో తెలుస్తుంది. చేతన మైన జీవుడు, వ్యక్తిత్వము, లోతైన అచేతన మనస్సులోకి లాగ బడతాయి. ధ్యానంలో ఇదే జరుగుతుంది. మరణం ధ్యానం ద్వారా ఎరుకతో ఉండి అనుభవించవచ్చు. మరణం ఒక జీవుని అంతం కాదు. ఎందుకంటే ధ్యానంలో ఎరుకతో ఉండి మరణాన్ని అనుభవించి తిరిగి వెనక్కి రావచ్చు.

చేతన మనస్సు లోతులలో కాలం కదలదు; గతం, భవిష్యత్తులు లేవు; మనస్సు నిశ్చలమై ఉంటుంది. అక్కడ కాలం లేదు కాబట్టి ఎటువంటి కార్యము జరుగదు. గురువులు చెప్పేది అది శుద్ధమైన జీవి. ఇది తర్కమునకు అందనిది.

మనస్సు చంచలంగా ఉంటే ఆ స్థితిని పొందలేము. హిందూ సంప్రదాయంలో ధ్యానంలో ఒక్క కోరిక కలిగినా, సమాధి సాధ్యం కాదు. గాంధీ మహాత్ముడు దీనికై ఓర్పు ఎంత ఉండాలంటే సముద్రాన్ని గడ్డి పూచతో ఖాళీ చేయడం అని వర్ణించేరు. నా స్వీయ అనుభవంతో అది నిజమని చెప్పగలను. మనం ద్వారం దగ్గర ఉండి, తలుపు తెరుచుకోవడం చూస్తాము. కాని ఒక్క కోరిక కలిగినా, మనం లోపలికి వెళ్ళలే౦. నాకు పూర్వంలో చాలా ఓర్పు ఉండి ఎన్నిమార్లైనా ప్రయత్నించడానికి సిద్ధమయ్యేను. కాని నా మేధతో నేను చేయలేనని తెలిసికొన్నాను. దాని వలన నాకు చాలా విచారం కలిగింది. శ్రీరామకృష్ణ సాధనలో ఒక కత్తి పట్టుకొని దేవి కాళ్ళ మీద పడి "నువ్వు ప్రత్యక్షమవ్వకపోతే, నేను దేహాన్ని వీడుతాను" అని వేడుకొన్నారు. నేను అటువంటి స్థితి గురించి చెప్తున్నాను. మనం తలుపుని కొ౦చెం తెరిచి లోపల ఏముందో చూద్దామని అనుకొంటాం. కాని ఎంత ప్రయత్నించినా మనం లోపలికి వెళ్లగలిగినంత తలుపుని తెరవలేం.

ఇక్కడ గురువు ఆవశ్యకత ఉంది. నా గురువే లేకపోతే సమాధి స్థితి పొందడానికి ఆ తలుపుని పూర్తిగా తెరిచేవాడిని కాను.

ఒక మారు ద్వారం గుండా రావడం పోవడం చేయ గలిగితే, ఒక మరణిస్తున్న వ్యక్తితో ప్రయాణం చేసి, ద్వారం అవతలనుంచి తిరిగి అదే జీవిగా ప్రపంచంలోకి రావడం సాధ్యం కాదని తెలిసికొ౦టా౦. మరణిస్తున్న వ్యక్తి మన ప్రియుడు అయితే, వానితో మన౦ ఈ సంభాషణ చేయవచ్చు: మరణంతో అంతం కాదు. అది ఒక తలుపు, ద్వారం లేదా వంతెన వంటిది. దాన్ని దాటి కొంత కాలం విశ్రమించి మళ్ళీ వెనక్కి -- అంటే పరిణామంలో ఎక్కడ వీడి పోయేమో అక్కడికి--వస్తాం. ఈ విషయం తెలిసిన జ్ఞానికి చావు అంటే భయము౦డదు. అలాగే ఒక నూతన శరీరాన్ని ధరించి, మళ్ళీ జీవితాన్ని సాగించాలనే కోరిక కలగవచ్చు. 448

Chapter 18 Section 20

Bhagavat Gita

18.20

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం {18.53}

విముచ్య నిర్మమశ్శా౦తో బ్రహ్మభూయాయ కల్పతే

విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధైర్యముతో మనో నిగ్రహమును పొంది, శబ్దాది విషయములను మరచి, రాగ ద్వేషములకు దూరుడై, ఏకాంత వాసియు, మితాహారియు, స్వాధీనమైన మనో వాక్కాయములు కలవాడు, సదా ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు, మమకార రహితుడు, శాంతుడు నగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు.

ఇద్దరు ఎంత అన్యోన్య౦గా ఉన్నా వారు వాళ్ళ ఏకాంతం కోరుకొంటారు. గాంధీగారు బ్రతికున్నప్పుడు ఆయన ఇంటికి ఎవరైనా వెళ్ళవచ్చు; ఆయన ఎలా జీవిస్తారో, ఆలోచిస్తారో, ఆయన ప్రేరణ ఏమిటో తెలిసికోవచ్చు. సాధారణ మానవులు అలా కారు.

మనం ఒకర్ని ప్రేమిస్తే, కొంత నిస్వార్థత ఉన్నా, మేము ఏకం అనడంతో, మన ప్రేమను భౌతిక శరీరానికే పరిమితం చేసేము. శ్రీకృష్ణుడు అటువంటి భౌతిక బంధాలలోని ప్రమాదాలను సూచించెను. అన్ని భౌతికమైన వస్తువుల లాగే భౌతిక బంధాలు మార్పు చెందుతాయి. కోరికలు క్షణికమైనవి.

స్వార్థమైన కోరికలు మనస్సులో అలజడి కలిగిస్తాయి. అది అలజడి కాకపోతే ఉత్తేజం చెందుతుంది. దానివలన ఆనందం, భద్రత క్షీణిస్తాయి. మనం ఆత్మ నుండి వేరౌతాము. కోరికలు ఆనందదాయకమే. గీత ఆనందం బాధ కలిగించేది అని చెప్పదు. గీత చెప్పేది ఆనంద౦ వచ్చి పోతూ ఉంటుంది. అది వెళ్ళినపుడు లేమి, నిరాశ, నిస్పృహలు కలిగిస్తుంది. సుఖ దుఃఖాలు కలసి ఉంటాయి. ఒకటి కోరుకొంటే రెండూ వస్తాయి.

నేను ఆనందానికై ప్రాకులాడిన వారితో మాట్లాడినప్పుడు అనేక విషయాలు తెలిసికొన్నాను. కొందరు స్వీయ జ్ఞానం ఉన్నవారు ఇలా చెప్పేరు: "నా దగ్గర డబ్బు౦ది, సమయముంది. ఆనందాన్నికలిగించే ప్రతి వస్తువును పోగుచేసికొన్నాను. నాకు ఏది కావాలనుకొన్నానో దాన్ని పొందేను. కాని దేన్నీ శాశ్వతంగా ఉంచ లేకపోయేను. ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత తక్కువ ఫలితం వచ్చింది. నిజంగా నాకు ఒకప్పుడు ఆనందం కలిగించినవి నను దుఃఖంలో ముంచేయి".

నాకు ఇది తెలిసికోవడానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ కాలంలో సాధారణ వ్యక్తులవలె ఎన్నో తప్పులు చేసేను. నాకు అది తెలిసిన తరువాత నా అమ్మమ్మతో "నువ్వు ఆనందం గురించి చెప్పినవన్నీ నిజం" అన్నాను. ఆమె నా తలమీద చెయ్యి పెట్టి "నువ్వు తెలివైన వాడివి" అన్నది. నాకు ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అని అడగలేదు. ఆమె చెప్ప దలచుకొన్నది కొంత మంది ఎన్నటికీ తెలిసికోలేరు. కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని వెంటనే పొందకపోతే వ్యధ చెందక్కరలేదు. ప్రతి సాధకునికీ కొన్నేళ్ళు పడుతుంది. మనస్సును కుదిపితే గతాన్ని తవ్వి, మంచి చెడు లతో భావోద్వేగము చెందుతాము. దాని వలన మన సాధనకు అవరోధం కలుగుతుంది. మనస్సు మళ్ళీ కుదుటుపడడానికి చాలా కాలం పడుతుంది.

ఒక ఉన్నతమైన లక్ష్యానికై బంధాలను విడనాడితే దానిలో చాలా ఆనందం ఉంది. ప్రపంచానికి సహకరిస్తున్నామనే భావంలో చాలా సంతృప్తి ఉంది. "ఇందులో నిజమైన ఆనందం ఉంది" అని బెర్నార్డ్ షా అన్నారు.

"మనమొక ఉన్నతమైన లక్ష్యానికై జీవిస్తున్నామని తలిస్తే దాని వలన చాలా ఆనందం ఉంది. అది కొందరు స్వార్థపరులు, వ్యాధిగ్రస్తులు, తమకు ప్రపంచం ఆనందం కలిగించట్లేదనే ఫిర్యాదులు చేసేవారిలా కాక మనని శక్తివంతులను చేస్తుంది."

ఇది చాలా శక్తివంతమైన వ్యాఖ్యానము. కాని అది మన త్యాగానికై ఉత్తేజ పరుస్తుంది. గీత చెప్పేది ప్రకృతి యొక్క శక్తి వలె కాక పరమాత్మ చేతిలో ఒక పనిముట్టుగా ఉండమని. నిస్వార్థమైన జీవి ఒక శక్తిమంతుడు. వాని సహాయం ఎన్నటికీ వృధా పోదు. అది మానవాళి చైతన్యంలో కలిసి పోతుంది.

పూర్వ కాలంలో మన జీవితం మన చేతుల్లో లేదు, అంతా భగవత్ ప్రసాదం అనేవారు. నేను చిన్నప్పుడు పూజ పునస్కారాలతో పెరగలేదు. ఏదో శక్తి నన్ను ఇతరులకు సహకరించని కర్మల నుండి కాపాడింది. ఇటువంటి ప్రేరణ గాఢంగా కలిగితే స్వీయ సంకల్ప౦తో ఇతరులను ఎదిరించి బ్రతకవచ్చు. ఎలాగంటే ఒక బిడ్డకు తల్లి తన సుఖాన్ని పట్టించుకోకుండా బిడ్డని చూసుకుంటుంది. మన స్వార్థం గురించి సదా ఆలోచిస్తూ ఉంటే, మనం ప్రపంచానికి సహకరించే కర్మల నుండి విడదీయ బడతాం.

జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ప్రాణ శక్తిని ఏకీకృతం చేసి, ఉపయోగించి, సంరక్షించాలి. ఎందుకంటే అది మన ఆనందానికి ఉపయోగపడే శక్తి.

గర్భంలోని శిశువు ఎలా రక్షింప బడతాడో, మన ప్రాణ శక్తి తప్పులనుండి రక్షింప బడుతుంది. మనం ప్రాణాన్ని ఇంద్రియ సుఖాలకి వెచ్చించవచ్చు. కాని మన లోతులలో ఉన్న ప్రాణ శక్తి ధ్యానం ద్వారా వెలికి తీయాలి. ఇలాగ ఒక వ్యక్తి ఉన్నత మైన లక్ష్యం చేరడానికి ఎప్పుడైనా సంకల్పించవచ్చు. ప్రాణ శక్తి వెంట ఉంటుంది.

కానీ స్వీయ సంకల్పం వలన కలిగే అహంకారం బహు చెడ్డది. అందుకే సాధనకి ఉపయోగపడే ప్రాణ శక్తిని స్వార్థపూరిత పనులకై వృధా చేయరాదు.

ప్రాణ శక్తి ద్వారా మన బుద్ధి ఇంద్రియములను, అభిరుచులను, స్పర్థలను నియంత్రించవచ్చు. ఇది ఒక సృజనాత్మక శక్తి. అలాగే ప్రాణం లైంగిక కార్యాలకు కూడా వర్తిస్తుంది. ఆధ్యాత్మిక భాషలో రతి భౌతికమైనది కాక, ఒక సృజనాత్మక శక్తి. మనలోని క్లిష్టమైన స్వీయ ఏకీకరణ. రతి దానియొక్క భౌతిక వ్యక్తీకరణము. మనం భౌతిక మని తలచినంత కాలము, రతి చేత ప్రభావితమౌతాము. దాని మూలాలు మనస్సు లోతులలో నుండి మన ఆత్మ జ్ఞానమును పొందటానికి సహకరిస్తుంది.

రతి ఒక భార్య భర్తల అనుభందంలో ఎంతో ఉపయోగకరం. కానీ అక్కడ కూడా రతి భౌతిక మైనదేకాక ఒక శక్తి. భౌతికమైన సుఖాలను వదిలి పెట్టి ప్రేమించిన వ్యక్తికి దగ్గరవుతే ఆ బంధం సున్నితంగా, భద్రతతో, ఆనందంతో నిండి ఉంటుంది. మనం ప్రేమించిన వ్యక్తికై వారికి బాధను కలిగించే అలవాట్లు వదిలి, కలసి ఒక నిస్వార్థ సేవకై పాటు పడితే శాశ్వతమైన సుఖం, ఇంద్రియ సుఖం కన్నా అనేక రెట్లు, పొందుతామ. దీనివలన సాధారణ సుఖాలు లేవని కాదు. కానీ మనం ఒక ఉత్కృష్టమైన కార్యానికై ఉన్నామని గుర్తు పెట్టుకోవాలి.

ధృఢమైన లైంగిక వాంఛలు ఎక్కువ ప్రాణ శక్తిని సూచిస్తాయి. నేను బెర్క్లీ లో మొదట్లో ఇలాగే చెప్పేవాడిని. ఆ తరువాత కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసింది. వారు బలమైన లైంగిక కోరికలు ఉంటే ఆధ్యాత్మికంగా బహు దూరం ప్రయాణించవచ్చునని తలచేవారు. అందుకై అటువంటి కోరికలను పెంచుకోవాలనుకునేవారు. అది అవసరం లేదు. అది పెట్రోల్ డబ్బా దగ్గిరి ధూమపానం చేసినట్లు. ధృడమైన అభిరుచులు ఉన్న వ్యక్తి వాటిని ఉపయోగించి ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదగ వచ్చు. మనము అభిరుచులను నియంత్రించక పోతే అవి మనని నియంత్రిస్తాయి. కాబట్టి బలమైన అభిరుచులు ఉంటే బాధ చెందక, వాటిని ఆధ్యాత్మిక చింతనకు వాడాలి. అలాగే ఆ శక్తిని నిస్వార్థ సేవకై; ఓర్పు, సున్నితము, నిస్వార్థమైన బంధాలకు రూపాంతరము చేసి వాడాలి.

కొందరు నా వద్దకు వచ్చి "నాకు ధృఢమైన లైంగిక వాంఛలు లేవు. అంటే నాకు ప్రాణ శక్తి తక్కువగా ఉందా, నా లక్ష్యాన్ని చేరలేనా?" అని అడిగేవారు. నేను స్వీయ సంకల్పం ఉంటే చాలు అని సమాధానము ఇచ్చేవాడిని. గీత ప్రతి వ్యక్తికి పనికివచ్చే శాస్త్రం.

ప్రాణ శక్తిని యోగులు కుండలిని అని అంటారు. అది తరతరాలుగా వృద్ధినొందిన పరిణామ శక్తి. కుండలినిని ఒక స్ప్రింగ్ లా భావించవచ్చు. అది పరిణామంలో చాలా శక్తికలిగి కుదించుకుపోయి ఉంది. దాని శక్తిని విడుదల చేయడానికి మనం చేయగలిగందల్లా మన చేతులను వాడి దాని శక్తిని విడుదల చేయడం. నాతో కొందరు "నేను పురోగతి చెందటంలేదు. నాకు ఎక్కువగా లైంగిక ఆలోచనలు కలుగుతున్నాయి" అని చెప్పేవారు. నా సమాధానము: "మన కుండలిని అనబడే స్ప్రింగ్ కొన్ని కోట్ల సంవత్సరాలు కుదించుకు పోయి ఉంది. నీవిప్పుడు వట్టి చేతులతో దాని శక్తిని విడుదల చేయదలచుకున్నావు. అది ఒక్క రోజులో అవుతుందా?"

కొన్నేళ్ళు సాధన చేసిన తరువాత కుండలిని శక్తి విడుదలవుతున్నాదని తెలుస్తుంది. ఆ భావన సాధారణంగా నిద్రలో వస్తుంది. అది స్వప్నావస్థలో కాక, శుషుప్తిలో తెలుస్తుంది. అనగా మన చేతన మనస్సు నిద్రలో మునిగి, మన అచేతన మనస్సు వేకువలో ఉన్నప్పుడు. అది ఆత్మకి చాలా దగ్గరగా నుండును. అది సూచించేది ఇంకా ఎన్నో సవాళ్ళు జీవితంలో వస్తాయి, దానికై గొప్ప శక్తి విడుదల చేయబడుతున్నాదని. దానిని సక్రమంగా వాడాలంటే మనము నిస్వార్థ సేవ చేయగలగాలి.

సాధనలో పరిపక్వత పొందుతున్న కొద్దీ తప్పులు చేయకుండా ఉండాలి. దానికి ఒక గురువు సహాయం తీసికోవచ్చు. కాని ముఖ్యంగా తెలిసికోవలసినది మన శరీరము తన శక్తితో సాధనకు కలిగిన అవరోధాలను దాట గలగాలి. అలాగే మన నాడీ వ్యవస్థ కూడా. మన సాధనలో క్రొత్తగా ప్రవేశించిన సమయంలో నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి సావధానంతో, స్వాధీనంలో ఉండాలి.

సాధన చివరలో, కుండలిని శక్తిని విడుదల చేయడానికి వారాలు, నెలలు పట్టవచ్చు. దానికై అనేక ప్రయత్నములు చేయవచ్చు. దానివలన అలసట కలగవచ్చు. ఆ సమయంలో శుషుప్తిలో పరమాత్మ ప్రత్యక్షమై తన చిటికెన వేలుతో కుండలినిని విడుదల చేయవచ్చు. దాని వలన మన దేహం అనేక బాధలు అనుభవించవచ్చు. ఎందుకంటే కుండలినుండి విడుదలైన శక్తి ఒక సామాన్య మానవుడు భరించడం బహు కష్టం. మన దేహం ఎంత కష్టం అనుభవిస్తుందో మన చేతన మనస్సు అంత ఆనందిస్తుంది. 445

Chapter 18 Section 19

Bhagavat Gita

18.19

బుద్ధ్యా విశుద్దయా యుక్తో ధృత్యా ఆత్మానాం నియమ్య చ {18.51}

శబ్దాదీన్ విషయా౦ స్తక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః {18.52}

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః

విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధైర్యముతో మనో నిగ్రహమును పొంది, శబ్దాది విషయములను మరచి, రాగ ద్వేషములకు దూరుడై, ఏకాంత వాసియు, మితాహారియు, స్వాధీనమైన మనో వాక్కాయములు కలవాడు, సదా ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు, మమకార రహితుడు, శాంతుడు నగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు.

ఆత్మ జ్ఞానం పొందటానికి నాలుగు అవరోధాలు ఉన్నాయి: శరీరము మరియు ఇంద్రియములతో తాదాత్మ్యము, మనస్సు, బుద్ధి, అహంకారం.

వీటిని ఆత్మను కప్పి పుచ్చిన 4 పొరలులాగ ఊహించవచ్చును. ఇంద్రియములు భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకున్న పై పొర. దాని తరువాత మనస్సు: భావోద్వేగం, భావాలు. అటు తరువాత బుద్ధి: అభిప్రాయాలు, ఎన్నికలు. చివరిగా అహంకారం. అది నేను, నాది అనే భావనని కలిగిస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే వీటన్నిటిని వదిలి వేయాలి.

వీటిని వదిలివేస్తే కలిగే నష్టం ఏమీ లేదు. ఇంద్రియాలు క్షీణించవు. అవి ప్రాణాధారమై, చైతన్యవంతమై, ప్రతిస్పందించి, విధేయతతో ఉంటాయి. మనస్సు నిర్మలమై, బుద్ధి పదునై ఉంటాయి. అందుకే జాన్ ఆఫ్ ది క్రాస్ "మీకు ఒకటి కలిగి ఉండాలంటే, ఏమీ కలిగి ఉండకుండా ఉండాలని కోరుకోండి" అన్నారు.

ఇంద్రియాలను విడనాడితే మనము అన్నిటితో ఆనందిస్తాము. కానీ ప్రస్తుతు కాలంలో ఇంద్రియ తాదాత్మ్యం వలన ఆనందం కలుగుతుందనే నమ్మకం ప్రబలమైయున్నది. కొన్నేళ్ళ క్రితం ఐస్ క్రీమ్ తినాలంటే ఒకేఒక రకం ఉండేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ లలో వందల రకాలు ఉన్నాయి.

ఇంద్రియ తాదాత్మ్యము వలన మన వ్యక్తిత్వాన్ని వీడుతాం.

ధ్యానంతో ఇంద్రియాలలో నిక్షిప్తమైన ప్రాణాన్ని వెనక్కు లాగుతాం. ఈ విధంగా ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి. ఒక చిహ్నం ఏమిటంటే ఇంద్రియాలు నిర్మలమై, ధృడమై ఉంటాయి. ఉంకో చిహ్నం భద్రత, మనలో వృద్ధిచెందుతున్న సఖ్యత.

రుచులు మన జన్యువులవలన కలిగినవి కావు. అవి మన అలవాట్లు బట్టి వస్తాయి. మొదటిసారి మనకి ఒక క్రొత్త రుచి వచ్చినపుడు, ఎక్కువ ప్రాణ శక్తి వ్యచ్చించ కుండా, తక్కువగా స్పందిస్తాము. రెండవమారు, ప్రాణ శక్తిని ఎక్కువ వెచ్చించి ఆ పదార్థాన్ని ఆశ్వాదిస్తాము. ఈ విధంగా క్రమంగా మనం క్రొత్త రుచిని అలవాటు చేసికొ౦టాము. ఇది ఆరోహణ క్రమ మైతే, అవరోహణ క్రమము ఇలాగ ఉంటుంది. మొదటిసారి మనమొక పదార్థాన్ని తిరస్కరిస్తే, తృష్ణ కలిగి, మన ఇంద్రియాలచే బాధింప బడతాము. రెండవసారి, ఇంద్రియాలు తగ్గుతాయి. మూడవమారు మనమా అలవాటునుండి విముక్తి పొందుతా౦.

ధ్యానం ఒక స్క్రూ డ్రైవరు లాంటిది. ఇంద్రియాలు స్క్రూలు. స్క్రూ డ్రైవరు వాడే ముందు స్క్రూలు ఎక్కడున్నాయో తెలిసికోవాలి. మన పంచే౦ద్రియాలు స్క్రూలై ఎంతో కాలం నుంచి గట్టిపడ్డాయి. ధ్యానం ద్వారా ఆ స్క్రూలను విప్పుకొని, మనస్సును స్వాధీనంలో పెట్టుకొంటాం.

ఈ విధంగా ధ్యానం ద్వారా మన పంచేంద్రియాలను జయించ వచ్చు. వాటిలో ధృడత్వం లేకపోతే, ఉద్రిక్తత ఉండదు.

ఇంద్రియాల క్రింద నున్నది మనస్సు. ఇంద్రియాలు తమ ప్రాణ శక్తిని దాని ద్వారా పొందుతాయి. అది విశ్రాంతిగా ఉంటే ఇంద్రియాలు కూడా విశ్రాంతితో ఉంటాయి; లేకపోతే ఉద్దీపన చెందుతాయి. శరీరంలోని ప్రతి అవయవము మనస్సుచే ప్రభావితమైనది. నిజమైన ఆరోగ్యం, పటిష్టమైన నాడీ వ్యవస్థ ఉండాలంటే మన శరీరంతో పాటు మనస్సుకు కూడా తర్ఫీదు ఇవ్వాలి. మనస్సు నిర్మలమై, దయతో కూడి ఉండాలి. ధ్యానంలో మనస్సు విశ్రాంతిని పొంది, సమస్యల చిక్కు విడిపడి, అలజడి లేక ఉంటాము.

భావోద్వేగముల పై నిర్లిప్తత, ప్రస్తుత కాలంలో కలిగే మానసిక ఒత్తిడిని జయించడానికై కాక, ప్రపంచానికి మేలు చేద్దామనే వారికి కూడా చాలా అవసరము. నిర్లిప్తమైన వాడే ఒక సంక్షోభమును పరిష్కరించగలడు.

మనస్సు నిర్లిప్తముగా ఉంటే భావోద్వేగాలను జయించవచ్చు. 439

Chapter 18 Section 18

Bhagavat Gita

18.18

అసక్తబుద్ధి స్సర్వత్ర జితాత్మా విగతస్పృహః {18.49}

నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి

సర్వ విషయములందు ఆసక్తి లేనివాడు, మనో నిగ్రహము కలవాడు, కోరికలు లేనివాడును నగు మనుజుడు కర్మఫల త్యాగముచే నైష్కర్మ్య సిద్ధిని పొందుచున్నాడు

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధ మే {18.50}

నమాసేనైన కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా

అర్జునా! సిద్ధిని బొందినవాడు బ్రహ్మమును ఎట్లు పొందగలుగుచున్నాడో, అలాగుననే ఉత్తమమైన జ్ఞాననిష్ఠ ఏదియో దానిని సంక్షేపముగ తెలిపెదను వినుము

దేవుని చేతిలో మనమొక పనిముట్టు. మనము ఆత్మకు కూడా ఒక పనిముట్టు. అనగా మనము భౌతిక లేదా మానసిక ప్రవృత్తులతో కాక ప్రేమతో కర్మ చెయ్యచ్చు. దానికై మన మనస్సును నియంత్రించాలి. మనం మనస్సు తప్ప ఏమీ లేదనుకొంటాము. కానీ ఆత్మ మనస్సుకన్న విశాలమైనది. అదే ప్రేమ పూరితమైనది.

ఆత్మ జ్ఞానము కలుగవలెనన్న మన భావాలను, అభిప్రాయాలను దాటి వెళ్ళాలి. మనం భావాలు, ఆలోచనల సముదాయం కాకపోతే మరి మన మెవ్వరము? మన సహజ స్వరూపము ప్రేమ. ప్రేమ అతి ముఖ్యమైన భావము కాదా? యోగులు కాదు అందురు. ఎందుకనగా అది ఒక మహా శక్తివంతమైన మానసిక స్థితి. ఐకమత్యము యొక్క ప్రతీక. మన ఇష్టాయిష్టాలు, ఆశలు, భయాలు మొదలగునవి స్థానికమైన ప్రేమకు చిహ్నాలు. ఎప్పుడైతే మనస్సు కుదురుగా ఉంటుందో మనము ప్రేమస్వరూపుల మౌతాము; మనం ప్రేమలో జీవిస్తాము; మన కర్మలన్నీ ప్రేమలోనుంచి ఉద్భవిస్తాయి.

మనస్సును దాటి ఎవ్వరూ చూడలేరు. కాని దానికై మనకు తీరని కోరిక ఉంది. ధ్యానము తీవ్రముగా చేస్తే, మనల్ని ప్రవాసులుగా, పర్యాటకులుగా భావిస్తాము. మారిపోయే జగత్తు మన స్వస్థలము కాదు. ఈ విధముగా వ్యామోహం చెందితే మనస్సులోని కోరికలన్నీ ఏకమై, అది మన స్వస్థలానికి వెళ్ళాలి అని అంటుంది. ఈ విధమైన ఏకమైన కోరికలో మనస్సు కరిగిపోతుంది.

మనస్సు చంచలమైనది. మనకు మనస్సు గురించి పూర్తిగా తెలలియదు. మనస్సును బలముతో కట్టడి చేయలేము. పట్టుదలతోనే దానిని స్వాధీనం చేసికోగలం. చివరికి అది మనని వదిలేస్తే మనం బాధపడం. ఇది మన౦ అతలాకుతలం చెందడానికి, మన బంధాలు త్రెంచుకోడానికి, మన దృష్టి చెదరడానికి మూల కారణం.

కొందరు మహనీయులు తమ మనస్సును స్వాధీనం చేసికొన్నారు. కాబట్టి అది సాధ్యమైన పని. దాని పర్యావసానము వారి జీవితాల్లో చూడవచ్చు. వాళ్ళు మనస్సును నిశ్చలంగా చేసి , కోపము, భయము, ఆశ, ఎడబాటు లేకుండా ఉన్నారు. మనమా స్థితిని పొందితే మన దుఃఖాలన్నీ సమసి పోతాయి.

మనో చాంచల్యం లేకుండా ధ్యానంలో ఉంటే మనమనుభవించేది స్వర్గం. సమస్యలు లేని స్థితి. కానీ అది ఎంతో కాలము సాధ్యము కాదు. ధ్యానంనుంచి వచ్చిన తరువాత మన సమస్యలు మళ్ళీ వెంటాడుతాయి.

నడివయస్సు వచ్చేక అలవాట్లు ధృడమై, పట్టుదల సడలి, మన స్వస్థలానికి వెళ్లాలనే కోరిక తగ్గుతుంది. కానీ మన హృదయము అలా కాదు. విసుగు, అభద్రత పొందినపుడు, మనయందు, ఇతరులయందు శాంతంగా వ్యవహరించ లేనప్పుడు, "ఇది నా ఇల్లు కాదు. నేను నన్ను మోసపుచ్చుకుంటున్నాను. నేనొక పరాయి వాడిని" అని హృదయం అంటుంది.

దీనినే మాయ అంటారు. మనను భ్రాంతికి లోనవుట చేసేది. ఇది పరమాత్మ యొక్క శక్తి. మన ప్రపంచమిలా ఉండడానికి అదే కారణం.

మాయ రజస్ మరియు తమస్ గా వ్యక్తమౌతుంది. రజస్ తో అది జిగ్సా పజిల్ లాగ మనతో ఆడుకొంటుంది. మనమా పజిల్ ని చేయాలంటే అంతర్ముఖులమవ్వాలి. మనము సంపూర్ణులమైతే, మనము ప్రపంచాన్ని సంపూర్ణముగా చూడవచ్చు. జీవితం యొక్క నిజమైన అనుభవాన్ని పొందవచ్చు. జీవితమనే పజిల్ లోని భాగాలు వాటి స్థానాన్ని పొంది ఉంటాయి. అప్పుడు మనము క్రియ చేస్తే అది పజిల్ లో వేరే భాగము కాదు. మనము ఊహాతీతమైన శక్తితో ప్రపంచాన్ని నడిపే పరమాత్మను దర్శిస్తా౦. దానికి మూలము ఐకమత్యము, సత్యము, ప్రేమ. మన కర్మలన్నీ వాటితోనే నిండి ఉంటాయి. కర్మలను మనమే చేసే మనుకొంటాము. నిజానికి ఆ ఊహాతీత శక్తే మనచేత కర్మలు చేయిస్తోంది. శ్రీకృష్ణుడు చెప్పేది "ఎప్పుడైతే అధర్మము ప్రపంచమంతా ఆవరిస్తుందో, నేను అవతారాన్ని దాల్చుచున్నాను". అది గాంధీ, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ తెరెసా లేదా మీరా కావచ్చు. శ్రీకృష్ణుని ఉద్దేశ్యము చీకటినుండి మనను వెలుగులోకి తీసికువెళ్లడానికి. అహంకారాన్ని వీడితే, మనము కూడా పరమాత్ముని చేతిలో ఒక పనిముట్టుగా ఉండి, శాంతికై ఉపయోగింపబడతాం. 435

Chapter 18 Section 17

Bhagavat Gita

18.17

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః {18.45}

స్వ కర్మ నిరత స్సిద్ధం యథా విందతి తచ్చృణు

మనుజుడు తనది యైన కర్మము నందు శ్రద్ధ గలవాడై సిద్ధిని పొందుచున్నాడు. తన సహజ కర్మమునందు నిరతుడైనవాడు సిద్ధిని ఎలా పొందుచున్నాడో దానిని ఆలకింపుము

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం {18.46}

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః

ఎవని వలన ప్రాణులకు ఉత్పత్త్యాదులు కలుగుచున్నవో, ఎవని చేత ఈ సకల ప్రపంచము పరివ్యాప్తమై యున్నదో, వానిని మానవుడు తన స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందుచున్నాడు

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ {18.47}

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

చక్కగా ఆచరింపబడిన పర ధర్మము కంటెను, గుణము లేనిదైనను స్వధర్మానుష్ఠానము శ్రేయోదాయకము. మనుజుడు స్వభావ సిద్ధమైన కర్మమును చేయుచు పాపము నొందడు

సహజం కర్మ కౌ౦తేయ సదోషమపి న త్యజేత్ {18.48}

సర్వారంభా హి దోషణ ధూమేనాగ్ని రివావృతాః

అర్జునా! పొగచేత నిప్పు కప్పబడినట్లు సర్వ కర్మములు దోషము చేత కప్పబడి యున్నవి. అందుచేత స్వభావ సిద్ధమైన కర్మను వదలరాదు ఀ

బంధాలతోనూ, పనితనం తోనూ మనం ప్రపంచానికి సహాయపడతాం. మనం ధ్యానం చేస్తే సరిపోదు. మన ధ్యాన ఫలాన్ని మన సహఉద్యోగులతో, బంధుమిత్రులతో పంచుకోవాలి. ముఖ్యంగా వారికి ఆదర్శంగా ఉండాలి. మన కర్మను తగ్గించుకోవాలంటే ఇదొక్కటే మార్గము. శ్రీకృష్ణుడు అడిగేది, మనం మన కర్మను తగ్గించుకోవడానికి ప్రయత్నించకపోతే ఇంకెవరు చేస్తారు?

శ్రీకృష్ణుడు మనం ఎలాగ పనిచేస్తామో, దేనికై పనిచేస్తామో రెండూ ముఖ్యమని చెప్పుచున్నాడు. ఒక కాపలాదారుగా పని చేసేవాడు, ప్రతిదినం సాధన చేస్తే, వానికి తెలియకపోయినా పరులకు సహాయపడతాడు. ఇవి ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. నా మిత్రులు కొందరు ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చి తమకు ఎక్కువ సంతోషం కలిగించినవారు ఉపచారికలు, నర్స్ లు అని చెప్పేరు. ఎందుకంటే వారు ఎంతో ఆహ్లాదంగా ఉండేవారు.

ప్రతి ఒక్కరూ తమ సాధనని వృద్ధి చేసికొని, తమ వంతు సహాయమును ప్రపంచానికి చెయ్యవచ్చు. దానికై మనకు తీవ్రమైన ఏకాగ్రత, వైరాగ్యం ఉండాలి. ఆ రెండూ ఉంటే మన బాధ్యతలు నిర్వహించడానికి ఆనందంగా ముందడుగు వేస్తాం. సాధన పెరుగుతున్న కొద్దీ మన పెరుగుతున్న అవసరాలకు, మన శక్తికి అనుగుణంగా క్రొత్త అవకాశాలు వస్తాయి.

ఇతరులు మనకన్న ఎక్కువ పేరు ప్రతిష్ఠలతో లేదా వేతనంతో పనిచేసినా అసూయ కలుగదు మన౦ ఎక్కడ, ఎటువంటి, పని చేస్తున్నామో వాటి నుండి నేర్చుకోవడానికై కేటాయించబడినది. మన కర్మ -- అనగా మన౦ చేసిన కార్యాలు, కోర్కెలు, ఆలోచనలు--ప్రస్తుత ఉద్యోగాన్ని ఇచ్చి , మన సహఉద్యోగులను నిర్ణయించి, పాత తప్పులను సరిదిద్దుకోవడానికై ప్రోద్భలం ఇస్తుంది. ఆ కర్మని తగ్గించుకొంటూ మనము ఎదుగుతాము. త్వరలో మన దశ మారి క్రొత్త సహఉద్యోగులు, క్రొత్త సవాళ్ళు, ఎక్కువ అవకాశాలు ఉన్న ఉద్యోగం రావచ్చు.

పరిపూర్ణమైన ఉద్యోగం ఎక్కడైనా ఉందా, అని శ్రీకృష్ణుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి కావలసినట్లు పని చేసే, ధ్యానమునకై విరామం తీసికోగలిగే, యజమానికి శాశ్వతమైన వాస్తవాలు బోధించి, వానికి తన సంస్థను ఎలా నడపాలో చెప్పే, ఉద్యోగం ఎక్కడైనా ఉంటుందా? ప్రతి ఉద్యోగం లోనూ కొన్ని పనులు మనకు ఇష్టం లేకపోయినా చెయ్యాలి. ఏ ఉద్యోగమూ సంఘర్షణ పడకుండా ఉండదు; అలాగే మానసిక ఒత్తిడి లేకుండా ఉండదు; మరియు; వేర్వేరు దృక్పథాలతో కూడిన వారు లేకుండా ఉండదు. చేసిందే చేయడం లేదా చాకిరీ చేయక తప్పదు. ఒక ఉద్యోగం సృజనాత్మకమై, క్రొత్త అవకాశాలను ఇస్తే దానిని మీరు ఇష్టపడ్డారా లేదా అని ప్రశ్నించుకోకండి. మీరు చేసే ఉద్యోగం ఇతరులకు సహకరిస్తుందా అని అడగండి. అలా అయితే పూర్తి ఉత్సాహంతో చేయండి. పరోపకార భావనతో చేసే ఉద్యోగము భగవంతునికి సమర్పణ చేసేది. 431

Chapter 18 Section 16

Bhagavat Gita

18.16

న తదస్తి పృథివ్యా౦ వా దివి దేవేషు వా పునః {18.40}

సత్త్వ౦ ప్రకృతిజైర్ముఖం యదేభిస్స్యా త్త్రి భిర్గుణ్ఐః

ప్రకృతి నుండి జనించిన ఈ మూడు గుణముల నుండి విడిపడిన వస్తువు భూలోకము నందు గాని, స్వర్గలోకము నందు గాని, దేవతలయందు గాని గోచరించదు

బ్రాహ్మణ క్షత్రియవిశా౦ శూద్రాణాం చ పరంతప {18.41}

కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవై ర్గణ్ఐః

అర్జునా! బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకును వారివారి స్వభావము వలన కలిగిన గుణములచేత వారివారి కర్మములు ప్రత్యేకించబడినవి

శమో దమ శ్శౌచం క్షాంతి రార్జనమేవ చ {18.42}

జ్ఞానం విజ్ఞానమాస్తిక్య౦ బ్రహ్మకర్మ స్వభావజమ్

మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుభ్రత , ఋజుత్వము, సహనము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము, బ్రాహ్మణులకు నియమిత కర్మమై యున్నది

శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్వ౦ యుద్ధే చాప్యపలాయనం {18.43}

దానమీశ్వరభావశ్చ క్షాత్ర౦ కర్మ స్వభావజమ్

శూరత్వము, తేజస్సు, ధీరత్వము, యుద్ధమున పారిపోకుండా పోరుట, దానము, స్వామి భావము క్షత్రియునకు నియమితమైన కర్మము

కృషి గోరక్ష వాణిజ్యం వశ్యకర్మ స్వభావజ౦ {18.44}

పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్

వ్యవసాయము, పశుపాలన, వర్తకము వైశ్యునకు స్వభావ సిద్దము కాగా, పరిచర్యను చేయుట శూద్రునకు స్వభావ సిద్దమైన కర్మయై యున్నది

ఈ శ్లోకాలు కులవ్యవస్థ గూర్చి చెప్పబడినవి. శతాబ్దాల తరబడి ఈ కుల వ్యవస్థ పాతుకుపోయి ఉన్నది. దానివలన అనేక కోట్ల మంది కుల బహిష్కరణకు గురైనారు. గాంధీ వాళ్ళకు హరిజనులు అని నామకరణం చేసేరు. వారు చాలా హీనమై, మిగతా కులములచే వాడుకోబడిరి.

గాంధీ కులవ్యవస్థకు వ్యతిరేకమైనా కులము గురించి సానుకూలంగా ఉండెను. ఆయన కుల వ్యవస్థ కున్న కఠినత్వమును సమూలంగా తీసివేయాలని సంకల్పించేరు. అలాగే కులవ్యవస్థ నుండి బహిష్కృతము చేయుటను సహించలేదు. కాని కులవ్యవస్థలో ఉన్న మంచి లక్షణములను పెంపొందించాలని చెప్పేరు. ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ గౌరవము గురించి పాటు పడే మహాత్మ, పుట్టుకతోనే కులము ఆపాదించిన కులవ్యవస్థను ఎలా సమర్థిస్తారు?

కులవ్యవస్థని సంస్కృతంలో వర్ణ వ్యవస్థ అనేవారు. దాని అవసరం ఎందుకంటే మనము సమంగా బ్రతకడానికి. వర్ణ మనగా మనము పోషించే పాత్ర. వర్ణ వ్యవస్థలో: బ్రాహ్మణులు పురోహితులుగా, జ్ఞాన సముపార్జనమునకై నియమితమైరి; క్షత్రియులు రాజ్య పాలనము, ప్రజా క్షేమము గూర్చి ఉండేవారు; వైశ్యులు వ్యాపరస్థులుగా, రైతులుగా, హస్త కళాకారులుగా ఉండేవారు; శూద్రులు సామాన్య కూలీలగా ఉండేవారు.

వర్ణము పుట్టుకతో వచ్చినది కాదు. ఎలాగంటే ఈ రోజుల్లో ఒక ఆటో రిక్షా నడిపే వాని పుత్రుడు ఒక దుకాణం పెట్టుకొని వస్తువులను అమ్మవచ్చు. ఒక శూద్రుడు ఒకానొకప్పుడు వైశ్యునిగా మారవచ్చు. మహాభారతంలో చూసినట్లు బ్రాహ్మణులు వేదాలను వలనించి, ధ్యానం చేసేవారు. వారు బహుశా అతి ముఖ్యమైన వర్ణము. మిగతా వర్ణాలవారు కూడా వేదాలను చదివి బ్రాహ్మణ వర్ణమును పొందవచ్చు. నేను చారిత్రాత్మక నిజం గురించ చెప్తున్నాను. క్షత్రియుడిగా జన్మించిన బుద్ధునికి తక్కువ కులములకు చెందిన అనేకులు శిష్యులుగా ఉండేవారు. ఒక శతాబ్దం క్రింద శ్రీ రామకృష్ణ బ్రాహ్మణ వంశంలో జన్మించిరి. మహాత్మా వైశ్య కులస్థులు. నా అమ్మమ్మ నామధేయము ఏకనాథ్ క్షత్రియ కులమునకు చెందినది.

వర్ణ వ్యవస్థ ఒక సంప్రదాయమై, కుల వ్యవస్థ గా మారి కొన్ని వేల సంవత్సరాలుగా ఉండేది. దానికి మొదట కారణం సంస్కృతి. కొన్ని వందల తరాలుగా ఒక వర్ణమునకు చెందినవారు తమ అలవాట్లు, విలువలు , ప్రమాణములు పూర్వీకుల నుండి పొంది యున్నారు. భారత దేశంలో అనేక ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు ఉండి ఒకే కులంలో అనేకా భేదాలు వచ్చేయి. కేరళ బ్రాహ్మణులకు ఉన్న సంప్రదాయం బెంగాలీ బ్రాహ్మణులకు లేదు. నేను కులం పరంగా క్షత్రియుడనైనా శాఖాహారిని. ఎందుకంటే తరతరాలుగా నా వంశస్థులు శాఖాహారులు కాబట్టి. బ్రాహ్మణుల లాగే నా వంశస్థులు ఆధ్యాత్మిక౦గా జీవించేవారు. ఈ కారణాలవలన, నా వంశస్థులలోని వారు -- ఉదాహరణకు నా అమ్మమ్మ --పొరుగున ఉన్న బ్రాహ్మణులను పెళ్ళాడేవారు.

వీటన్నిటినీ చూస్తే ఒక కులం వారు తమ కులస్తులనే ఎందుకు పెళ్ళాడుతారో తెలుస్తుంది. వర్ణ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం ఒకే విలువలు యున్న వారిని ఒకే సమూహంగా చేయడం. నేను చెప్పేది ఈ శ్లోకాల సారాంశం. నేను కులవ్యవస్థకు వ్యతిరేకిని.

వర్ణ వ్యవస్థ కొన్ని సమూహాలను చేసి, వారి వారి అభిరుచుల బట్టి ఆత్మ జ్ఞానం పొందటానికి చేయబడినది. కాని కొంతమందికి వేరే ఆలోచనలు, గమ్యం ఉంటుంది. వారివారి గుణాల బట్టి, వారి సంస్కారముల ననుసరించి, పునర్జన్మ వేరొక వర్ణంలో పొందుతారు.

ఇటువంటి వ్యవస్థ జీవితం యొక్క ముఖ్యోద్దేశం: ధనార్జన లేదా ఇతరుల మీద ఆజమాయిషీకై కాక వైరాగ్యం గురించి. చాలామందికి వేరే అభిరుచులు ఉండి తమ జీవితాన్ని గడుపుతారు. కానీ వారికి వైరాగ్యం గూర్చి అన్నిటికన్నా ఉత్కృష్టమైనదని, బ్రాహ్మణులు అలా ఉండాలని తెలుసు.

పూర్వ కాలంలో క్షత్రియుడుకి యుద్ధ భూమిలో పాటించవలసిన అనేక నియమాలు ఉండేవి. ఉదాహరణకి ఆయుధం లేని శత్రువుతో యుద్ధం చేయరాదు, యుద్ధం నుంచి పలాయనం చేయరాదు, స్త్రీలతో పోరాడరాదు. కానీ ఒక బ్రాహ్మణునికి నిషేధించిన కర్మ ఒక క్షత్రియుడు చేయవచ్చు.

నా అమ్మమ్మ దృష్టిలో అమితమైన ప్రమాణం ప్రతి సాధకునికీ ఉండాలి. కొన్నాళ్ళు మాతో ధ్యానం చేసినవారు మన నడవడికను గూర్చి అంచనాలు వేస్తారు. మనం కోపంతో మాట్లాడితే వాళ్ళు ఆశ్చర్యపడతారు.

బ్రాహ్మణుడనగా బ్రహ్మన్ గూర్చి తెలిసికోవాలనుకునేవాడు. బుద్ధుడు ఈ విధంగా వివరించేడు:

నేను ఎవరినైతే బ్రాహ్మణుడంటానో వానికి, కోపం రాదు, వానికి హాని కలిగినా ఇతరులకు హాని చేయడు. అలాగే సుఖాలను కోరడు, ఇతరులను నిర్దయమైన కర్మలతో, వాక్కుతో, ఆలోచనలతో బాధించడు

ఎవరైతే అటువంటి కట్టడులను అనుసరించి బ్రతుకుతారో, ఏ కులంలో పుట్టినా, వారిని బ్రాహ్మణులనవచ్చు. ఒకడు స్వార్థముతో కూడినా, మిక్కిలి భయం లేదా కోపంతో ఉన్నా, తామసిక దశ నుండి రాజసమునకు, రాజసము నుండి సాత్త్వికమునకు ఎదగవచ్చు. ఆ వ్యక్తి చివరికి ఆత్మ జ్ఞానమును పొందవచ్చు.

ఇది ధ్యానానికున్న శక్తి. మనం సూర్యుని శక్తి గురించి ఆలోచిస్తే తల మునకలవుతుంది. కొన్ని కోట్ల టన్నుల ఇంధనం సూర్యుని ఉపరితలం మీద ఉండి, తద్వారా చేయబడిన కాంతి, ఉష్ణము మనకి అందుతోంది. ఇలాగ సూర్యుడు వద్ద కొన్ని కోట్ల సంవత్సరాలకు సరిపోయే ఇంధనం ఉంది. ధ్యానం కూడా అటువంటిదే. గీత చెప్పేది: మన క్రోధం, భయ౦, దురాశలను ప్రేమగా మార్చుకొని బ్రతకాలని. అలా చేస్తే ఆ శక్తి మనం మరణించిన తరువాత కూడా పని చేస్తూ ఉంటుంది. మనకది అవగాహనకు రాకపోవచ్చు. మనకి దుశ్శక్తి ఎలాగ ప్రభావితం చేస్తుందో తెలుసు. అలాగే మనకి గాంధీ మహాత్ముని గురించి తెలుసు. ఆయన అట్టి శక్తిని ప్రేమగా మార్చి చరిత్రను మార్చెను. సూర్య మండలంలోని హైడ్రోజన్ ఇంధనం హీలియం గా మార్పు చెందుతున్నట్లు, మన అహంకారాన్ని ప్రేమగా మార్చవచ్చు. ధ్యానం వలన ఒక క్రోధి ప్రియమైన వానిగా మారవచ్చు; ఒక పిరికివాడు అమిత ధైర్యాన్ని పొందవచ్చు; ఒక బలహీనుడు శక్తివంతునిగా మారవచ్చు. 429

Chapter 18 Section 15

Bhagavat Gita

18.15

సుఖం త్విదానీ౦ త్రివిధం శృణు మే భరతర్షభ {18.36}

అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి

అర్జునా! దేని అభ్యాసము చేత మనుజుడు దుఃఖ నాశమును, సుఖానుభవమును, పొందుచున్నాడో అట్టి సుఖమిపుడు నా చేత మూడు విధములుగ తెలుపబడుచున్నది. ఆలకింపుము

యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం {18.37}

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్

తన యొక్క బుద్ధి ప్రసన్నత వలన కలిగిన ఏ సుఖము ఆదియందు విషము వలెను, అనంతరము అమృతము గను యుండునో అట్టి సుఖము సాత్త్విక సుఖ మనుబడును

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం {18.38}

పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్

విషయేంద్రియ సంయోగము వలన కలిగెడి ఏ సుఖము ఆరంభము నందు అమృత తుల్యము గను, అనంతరము విషతుల్యముగను ఉండునో అట్టి సుఖము రాజస సుఖ మనబడును.

యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః {18.39}

నిద్రాలస్య ప్రమాదోత్థ౦ తత్తామస ముదాహృతమ్

ఆద్య౦తముల యందు మనుజునకు మోహమును కలుగ జేయునదియు, నిద్ర, అలసత్వము, ప్రమాదము వలన కలుగునదియైన సుఖము తామస సుఖ మనబడును ఀ

ఈ శ్లోకములు ఆనందం గూర్చి చెప్పుచున్నాయి. మనందరము ఏదో ఒకనాడు మరణించు వారలమే. నా గురువు ఒక రోజు మరణిస్తానని తెలిసి ఆమెకు నాయందు ఉన్న ప్రేమవలన జీర్ణించుకోలేక పోయింది. ఆమె మరణానికి ఆవలకు తీసికు వెళ్లాలని, తనకు కలిగిన ఆత్మ జ్ఞానము నాకు చెప్పింది. బుద్ధుడు తన భార్య, కుమారుడు ఎప్పుడూ యౌవ్వనుముతో ఉండరని తలచి, అమరత్వం గూర్చి తెలుసుకోవడానికి తన రాజ్యాధికారాన్ని విడనాడెను. అతని ప్రేమ ఎంత పటిష్టమైనదంటే ఆ జ్ఞానము తన మనస్సులో కలిగినవెంటనే అందరికీ చెప్పాలనే కోరిక కలిగింది. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, లేదా మిత్రుడిని ప్రేమించడం సహజం. నేను చెప్పే ప్రేమ దీన్ని దాటి ఉన్నది. అది వాని జీవితమంతా బాధలు పడుతున్న, స్వార్థంతో బ్రతుకుతున్న, చావు గురించి భయపడుతున్న వారలను రక్షించడానకి కలిగిన ప్రేమ.

మన అమరత్వం గురించి తెలిసికొనవలెనన్న ముందు మన భౌతిక శరీరం యొక్క అనిత్యత్వం గూర్చి అవగాహన ఉండవలెను. ప్రతి రోజూ మనము చావుకు దగ్గరగా వెళుతున్నాము. ఒకడు వృద్ధుడైనా, యువకుడైనా సరే చావును తప్పించుకోలేడు. నా బాల్యంలో నా అమ్మమ్మ కాలం వేగంగా పరిగెడుతున్నాదని చెప్పేది. నేను ధ్యానాన్ని అలవరుచుకోవడం కన్నా ముందు, విశ్వవిద్యాలయంలోనికి కొత్తగా వచ్చిన తెలివి తేటలతో విరజిల్లే, అందమైన విద్యార్థులను చూసి వారు ఎంతో కాలం అలాగే ఉండరని తలచేవాడిని.

ఇవి విషాదంతో కూడిన ఆలోచన కాదు. వాళ్ళు ఎంతో సున్నితమైన హృదయంతో ఉండి, నా మాట పట్టించుకోక పోయినా, నన్ను కించ పరచినా నేను వారిని ప్రేమించకుండా ఉండడానికి, జీవితం చాలా చిన్నది అని అనుకునేవాడిని.

స్వార్థపరులు తమ అనిత్యత్వాన్ని మరచిపోయేరు. అలాగే నిర్దయులైన వారు కూడా. మన జీవితం స్థిరత్వము లేక ఎంతో వేగంగా పోతో౦ది. అందువలన మనం నిర్దయతో, స్పర్థలతో ఉండడం సరికాదు. సాధ్యమైనంత వరకు ఇతరుల సంక్షేమానికై పాటుపడాలి. ధ్యానంలో ఈ విషయాలు తెలియబడి మన చేతన మనస్సు లోతులకు వెళ్తాము.

మనం ఇంద్రియాలకు లోబడి, అవి చెప్పినట్లు నడిస్తే, అది ఎంతోకాలం ఉండేది కాదని తెలిసికోవాలి. ఇతరులను ప్రేమించుట లేదా ద్వేషించుట, వారితో స్పర్థలు కలిగించుకొనుట, వారియందు అసూయ కలిగి ఉండుట, ఎంతో కాలం సాగవు. ప్రతి వృద్ధునికి ఈ విషయము తెలుసును. కానీ అతడు వాటికి ఎంతో అలవాటు పడి తన నడవడిక మార్చు కొనడు. మనకు బాల్యము, ఓజస్సు, సంకల్పం ఉన్నప్పుడే అనిత్యత్వం గురించి ప్రతి రోజూ తలచుకొని జీవిస్తే ఇంద్రియాలు మనకు లోబడి, ధ్యానానికి ఎట్టి అవరోధాలూ కలుగవు.

రాబర్ట్ ఫ్రాస్ట్ వ్రాసిన స్టాపింగ్ బై వుడ్స్ పద్యం గుర్తుకు వచ్చింది:

అడవి అందంగా, చీకటిగా, అతి లోతుగా ఉన్నది

కాని నా వాగ్దానాలను నిలబెట్టుకోవాలి

నిద్ర పోయే ముందు చాలా దూరం వెళ్ళాలి

ఈ పద్యాన్ని జవహర్ లాల్ నెహ్రూ తన బల్ల మీద ఎప్పుడూ పెట్టుకొనేవారు.

కోరికలనే అడవి చీకటిగా, సర్వ వ్యాపితమై, తీరని కోరికలతో నిండి ఉన్నది. మనం దాని లోకి ప్రవేశించి, తిరిగిరావడానికి చాలా సమయం తీసికోవడం సహజం. కాని మనం చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి, ఇంటిని చేరడానికి చాలా దూరం వెళ్ళాలి. 424

Chapter 18 Section 14

18.14

ధృత్యా యయా ధారయతే మనః ప్రాణే౦ద్రియక్రియాః {18.33}

యోగేనా వ్యభిచారిణ్యా ధృతి స్సా పార్థ సాత్త్వికీ

పార్థా! ఏ ధైర్యముచేత మనస్సు, ప్రాణము, ఇంద్రియ చేష్టలను మనుజుడు చెదరకుండా నిలుపు చున్నాడో అట్టి దానిని సాత్త్విక ధృతి అందురు

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున {18.34}

ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ రాజసీ

ఫలము నాశి౦చువాడు దేనిచేత ధర్మార్థకామములను ఆసక్తితో ఆశ్రయించుచున్నాడో, పార్థా! అది రాజస ధృతి యగును

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ {18.35}

న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసీ

పార్థా! ఏ ధైర్యము చేత దుర్బుద్ధి గలవాడు స్వప్నమును, భయమును, శోకమును, విషాదమును, మదమును విడువకున్నాడో అట్టి ధృతి తామసిక ధృతి యగుచున్నది ఀ

వ్యక్తులను మేధస్సు లేదా తెలివితేటలతో కాక పట్టుదల గలవారుగా చూడవచ్చు. ప్రతిచోటా ఐ క్యు అనగా ఇంటెలిజన్స్ కోష౦ట్ నే చూస్తారు. అది ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. కాని పట్టుదల మేధ అంతటి ఉన్నత లక్షణము.

పట్టుదల తక్కువగా ఉంటే దానివలన మనం తీసికొనే నిర్ణయాలు కూడా అస్పష్టంగా ఉంటాయి.

సంస్కృతంలో పట్టుదలను ధృతి అంటారు. ధ్రి అనగా ఆధారము. దాని లోంచే ధర్మము కూడా వచ్చినది. ధృతి మనకు ఆదరవుగా ఉండి సామరస్యం, చైతన్యం, బలం ఇస్తుంది. గాంధీ "బలం శారీరిక పుష్టితో కాక అసాధ్యమైన పట్టుదలవలన వస్తుంది" అన్నారు. క్లిష్టమైన పరిస్థితులలో, సంపద హరించిపోయి, మిత్రులు వీడిపోయి ఉంటే పట్టుదలతో నిలదొక్కుకోవచ్చు. ఈ విషయం గాంధీ జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆయన అతి చెడ్డ ప్రతిపక్షాన్ని, దూషణని, నమ్మక ద్రోహాన్ని , తన జీవిత చరమదశ వరకు చూసేరు. అలాగే తెరెసా ఆఫ్ ఆవిలా, సెయింట్ ఫ్రాన్సిస్ మొదలగువారు.

గీత చెప్పేది: మనకు భద్రత, మన కాళ్ళ మీద నిలబడే శక్తి కావాలంటే మన పట్టుదలను వృద్ధి చేసికోవాలి. అలాగే ఇతరులను ప్రేమించి వారిచే ప్రేమించ బడడం, అవసరమైనప్పుడు మిత్రులు సహాయం చేయాలంటే పట్టుదల చాలా అవసరం. పట్టుదలను పెంపొందించు కోవాలంటే ప్రయత్నం, మెళుకువ అవసరం.

సాత్త్వికమైన ధృతి ప్రాణ శక్తిని శరీర అవయవాలకు, ఇంద్రియాలకు, మనస్సుకు సమంగా పంచుతుంది. ప్రాణ శక్తి కోరికలవలన వృధా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బలమైన పట్టుదల, తెలివి ఉండాలి. మనస్సులో స్వార్థ పూరితమైన ఆలోచనలను కట్టిపెట్టి మంచి ఆలోచనలను పాటించాలి. ఒక స్వార్థ పూరితమైన ఆలోచనను నియంత్రించిన దాని వలన ప్రాణ శక్తితో ఎన్నో లాభములను పొందవచ్చును. ఇది ఎలాగంటే బ్యాంక్ లు ఇచ్చే చక్రవడ్డీ వంటిది. మన ప్రాణ శక్తిని కోరికలకై వ్యర్థం చేయకుండా ఉంటే, చైతన్యం చక్రవడ్డీలాగ పెరుగుతుంది.

ఇది అతిశయోక్తి కాదు. గాంధీ 60 ఏళ్ల వయస్సులో ఆయన దైనందిన కార్యక్రమము చూస్తే ఒక సామాన్యుని కన్న కోటి రెట్లు ప్రాణ శక్తి ఉన్నదనిపిస్తుంది. ఉదయం మూడు గంటల నుండి అర్థరాత్రి వరకు వివిధ నాయకులతో మంతనాలు చేసి, పాత్రికేయులతో మాట్లాడేవారు. భారత దేశ భవిష్యత్ ఆయన పలికే మాటల మీద ఆధారపడి ఉంది. ఆయన దాని గురించి వ్రాస్తూ తాను ఆ సమయంలో వృద్ధి చెందేనని చెప్పేరు. ఆయన దృష్టిలో సవాలు లేని జీవితం వ్యర్థమని. స్వార్థంతో కాక మన జీవితాన్ని మలచుకుంటే మనకున్న శక్తి బహిర్గితమవుతుంది. 421

Chapter 18 Section 13

Bhagavad Gita

18.13

బుద్ధేర్భేదం దృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు {18.29}

ప్రోచ్యమాన మసేషేణ పృథక్త్వేన ధనంజయ

ధనంజయా! గుణముల ననుసరించి బుద్ధి యొక్కయు, ధైర్యము యొక్కయు భేదము మూడువిధములుగ చెప్పబడినది. సంపూర్ణముగ, వేర్వేరుగ చెప్పబడు ఈ విషయమును ఆలకింపుము

ప్రవృత్తి౦ చ నివృత్తి౦ చ కార్యా కార్యే భయాభయే {18.30}

బంధం మోక్షం చ యావేత్తి బుధ్ధి స్సా పార్థః సాత్త్వికీ

అర్జునా! ప్రవృత్తి నివృత్తి విషయములను, కార్యాకార్యములను, భయాభయములను ఏదయితే తెలిసికొనుచున్నదో ఆ బుద్ధి సాత్త్వికమైనది

యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ {18.31}

అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థః రాజసీ

అర్జునా! ధర్మాధర్మములను, కార్యాకార్యములను ఉన్న దున్నట్లుగాక భిన్నముగ గ్రహించెడి బుద్ధి రాజస బుద్ధి యనబడును

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా ఆవృతా {18.32}

సర్వార్థాన్ విపరీతా౦శ్చ బుద్ధి స్సా పార్థ తామసీ

పార్థా! ఏ బుద్ధి అజ్ఞానముచేత కప్పబడి అధర్మమును ధర్మముగను, సమస్త విషయములను విపరీతముగను గ్రహించుచున్నదో అది తామసిక బధ్ధి యనబడును ఀ

ఈ పై శ్లోకాలు బుద్ధి గూర్చి చెపుతున్నాయి. బుద్ధి అనగా తెలివి తేటలనే గాదు. వివక్షతో గూడిన తెలివి తేటలు. ఒక వస్తువుని చూడడమే కాదు, దాని అంతర్భాగములను కూడా చూచుట. మనము వ్యక్తులను భౌతికమైనవిగా కాక, వారి ఆత్మను చూడవలెను. ప్రపంచాన్ని చూడడమే గాక, దాని లోపల యున్న ఐక్యమత్యాన్ని కూడా చూడాలి. అలాకాక పోతే ఏదీ అర్థము కాదు. మనకు మంచి చెడు ఎన్నికల మధ్య తేడా తెలియదు.

తామసికుని బుద్ధి చీకటితో నిండి ఉంటుంది. వాడు తప్పుని ఒప్పని, ఒప్పుని తప్పని వాదిస్తాడు. అది నీతికి సంబంధించిన విషయాలకే పరిమితం కాదు. తామసికుడు ఇతరుల యందు దయ చూపడు. వాని బుద్ధి తప్పుని ఒప్పని చెప్తున్నాసరే. సమిష్ఠిలో తామసమును చూడవలెనన దిన పత్రికల వార్తలను చదివితే చాలు.

రాజసికుని బుద్ధి కొన్ని సార్లు తేటగా ఉంటుంది. కానీ స్వార్థమునకు సంబంధించిన విషయాలలో గజిబిజిగా ఉంటుంది. నేను కలిసిన కొందరు వ్యక్తులు తమ ఉద్యోగాలలో మిక్కిలి ఘనత సాధించినవారు. కానీ వారు భావోద్వేగంతో ఉంటే మూర్ఖుల్లా లేదా పిల్లల్లా వ్యవహిరిస్తారు. అట్టి వాళ్ళు రాజసికులు. నేను తలచేది సైన్స్ తదితర విభాగాలు సాత్త్వికంగా, నిస్వార్థంగా ఉండాలని.

తామసికులు, రాజసికులు సైన్స్ లో చేతులుకలిపితే కలిగేది విపత్తు. తామసికునికి ఏది ఒప్పో ఏది తప్పో తెలియదు. రాజసికుడు ఏది ఏమైనా పట్టించుకోడు. జన్యు శాస్త్రజ్ఞ్నులు సూక్ష్మక్రిములలో జన్యువులను మార్చి, మనకు కావలిసిన రసాయనాలను చేసుకోవచ్చు అని ప్రకటించేరు. దీనిలో సత్యం ఉన్నది కాని వారి మానసిక స్థితి అలా కాదు. జీవితం నుండి ఏది బలవంతంగా లాగుకొన్నా దానికి పర్యావసానము ఉంటుంది. అది తామసిక పద్దతి.

"మేము పరిణామాన్ని వేగవంతం చేసేము. ఒక సూక్ష్మ క్రిమిని అధ్యయనం చేసి, దాని జన్యువులను మార్చి మనకు కావలసిన లక్షణాలను ఎన్నుకోవచ్చు" అని చెప్పేరు. ఇటువంటి సాంకేతికత ఎంతో శక్తివంతమై నియంత్రింపక బడక అనేక అనార్థాలను కలిగిస్తుంది. అణుశక్తి వ్యర్థాలను మనమెలాగ వదిలించుకోవాలో తెలీదు. వాటిని నదులలో పడేయలేము. ప్రాణుల గూర్చి అధ్యయనం చేసే ఇంజనీర్ లు సూక్ష్మక్రిములతో పనిచేయడానికి మొగ్గు చూపుతారు. ఆ క్రిములు అనేక వ్యాధులను తెచ్చేవి. ఇ కొలై అనబడే సూక్ష్మ క్రిమి మన ప్రేగులలో ఉంటుంది. అవిగాని జన్యుమార్పు చెంది మనం త్రాగే నీళ్ళలో, తినే ఆహారంలో ఉంటే ఎటువంటి అనార్థాలు కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. క్రొత్త అంటువ్యాధులు రావచ్చు. సంస్థల తక్కువ కాలంలో వచ్చే లాభం కోసం, దీర్ఘ కాలంలో కలిగే సమస్యలను కప్పిపుచ్చుతాయి.

కొందరు మంచి శాస్త్రజ్ఞులు దీర్ఘంగా ఆలోచిస్తారు. ప్రొఫెసర్ లైబ్ కావలీరి (కార్నెల్ మెడికల్ స్కూల్) క్రిస్టియన్ సైన్స్ మానిటర్ లో వ్రాస్తూ మన ప్రస్తుత సమస్యలు శాస్త్రవేత్తలకు సంపూర్ణ అవగాహన లేకపోవడం వలననే అని చెప్పేరు. ఆ శాస్త్రవేత్తలే ఇప్పుడు జన్యువులను మార్పిడి చేద్దామంటున్నారు. వారి అవగాహన పూర్తిగా లేకపోవడం వలననే కదా ఇన్ని విపత్తులు కలుగతున్నాయి. జన్యువులని మార్చినంత మాత్రాన మనకున్న సమస్యలను పరిష్కరించలేము.

జన్యు శాస్త్రము యొక్క లోభత్వము విద్యాలయాలకు కూడా ప్రాకింది. రెండవ ప్రపంచ యుద్ధం లగాయతు విద్యాలయాలు ఆయుధాలు, ఆహారం, మందులు గూర్చి పరిశోధనలు చేసేయి. ఒక సైన్స్ విద్యార్థి తన చదువు భౌతికమైన ప్రపంచం గురించి కాక ఆయుధాలు మొదలగు అంశాలను పరిశోధన చేస్తున్నాడు. దానివలన కొందరు ప్రొఫెసర్ లు తమ పరిశోధనతో సంస్థలను స్థాపించి లాభం పొందాలని ఆశిస్తారు. ఇది మరింత లాభం పొందాలనే విద్యాలయాలకు సమ్మతము. నేను అట్టివారలను శాస్త్రజ్ఞులు అనను. వారు తీరికలో విద్యను బోధించే వ్యాపారస్తులు. నాకు ఒక ఉపాధ్యాయునికి బోధించడం ఇష్టం లేకపోతే ఫరవాలేదు. కానీ బోధన, తీవ్ర స్థాయిలో స్వార్థం కలిసి ఉండలేవు. అలాగే వాళ్ళకి తక్కువ వేతనం ఇయ్యమనట్లేదు. నేను చెప్పేది అమితమైన లాభం కోసం చేసే పనులు. వాళ్ళు నైతిక విలువను పాటించి తక్కినవాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు లాభాలకై పనిచేసే సంస్థలలో పనిచేయడం మంచిది కాదు.

పరిశోధనలకు ప్రభుత్వం, సంస్థలు ఎక్కువ మొత్తంలో ధనాన్ని వెచ్చిస్తాయి. అట్టి పరిశోధనల ఉద్దేశం: ఆయుధాల తయారీ లేదా సాధారణమైన వినియోగదారులకు వస్తువులు తయారు చేయడం. క్రొత్తగా వచ్చే విద్యార్థులు వేరే ఎన్నిక లేక అవే చేస్తారు. నేను చెప్పేది స్థూలంగా డబ్బు మరియు మేధ ఆ పరిశోధనలకై వినియోగిస్తున్నారు. టోయిన్ బీ చెప్పినట్లు: మానవాళి సాంకేతిక పరిజ్ఞానం ఇంత ఎక్కువగా వృద్ధి చెందటానికి కారణం, అనేకమైన వ్యక్తులు తమ శక్తిని దానికై దారపోసేరు. ఇప్పుడు శాంతికై, మానవాళి స్వస్థత కై ముందుకు రావాలి. మనము వీటిలో విఫలమైతే భవిష్యత్ లో ఏ చరిత్రకారుడు మన కంప్యూటరు జ్ఞానం గురించి పొగుడుతూ వ్రాయడు. 419

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...