Bhagavat Gita
18.32
సంజయ ఉవాచ:
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః
{18.74}
సంవాద మిమ మశ్రౌష౦ అద్బుతం రో మహర్షణమ్
ఈ విధముగ ఆశ్చర్యకరమైనదియు, గగుర్పాటును
కలిగించునదియు, మహాత్ముడైన అర్జుననుకును,
శ్రీ కృష్ణునకు మధ్య జరిగిన ఈ సంవాదనమును వింటిని
వ్యాసప్రసాదా చ్చృతవాన్ ఏతద్గుహ్యమహం పరం
{18.75}
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్కథయత స్స్వయమ్
వ్యాస భగవానుని అనుగ్రహము వలన గుహ్యమైనట్టియు,
ఉత్తమమైనట్టియు నగు ఈ యోగ్యశాస్త్రమును
యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు చెప్పుచుండగా నేను
ప్రత్యక్షముగా వినగలిగితిని
రాజన్ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య సంవాద మిను మద్భుతం
{18.76}
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః
ధృత రాష్ట్ర మహారాజా! శ్రీ కృష్ణార్జునుల కళ్యాణకరమైన,
అద్భుతమైన ఈ సంవాదమును భావించుకొలదియు
నేను పరవశించి పోతున్నాను
తచ్చ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య రూపమత్యద్భుతం హరేః
{18.77}
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః
రాజా! శ్రీహరి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన
విశ్వరూపమును తలచిన కొలదియు నాకు గొప్ప
ఆశ్చర్యము కలుగుచున్నది. ఆనందము కలుగుచున్నది.
యత్ర యోగేశ్వరః కృష్ణో
{18.78}
యత్ర పార్థో ధనుర్థరః
తత్ర శ్రీ ర్విజయో భూతిః
ధృవా నీతిర్మతిర్మమ
యోగేశ్వరుడగు శ్రీ కృష్ణుడును, ధనుర్థరుడైన అర్జునుడును
ఎచ్చట ఉందురో అచ్చట సంపదయు, విజయము,
ఐశ్వర్యము, సుస్థిరమగు నీతి (రీతి) యుండునని నా
అభిప్రాయము
ఎక్కడైతే కృష్ణుడు, అర్జునడు వలెనుండి ఈ కాలాతీతమైన
సత్యాలచే మార్గదర్శకత్వం పొందుతారో అక్కడ కాంతి
వలె నుండెడి శక్తులు విజయవంత మౌతాయి. జీవితము
గ్రుడ్డి శక్తులచే మలచబడే గ్రుడ్డి వస్తువు కాదు. భౌతిక
శాస్త్రములోని సిద్ధాంతముల వలె, ఆధ్యాత్మిక
శాస్త్రములోని సిద్ధాంతాలు మన ఐకమత్యానికై ఉన్నాయి.
ఆ ఐకమత్యాన్ని పాటించకపోతే కొన్ని దుష్ఫలితాలు
వస్తాయి. అలాగే దానికనుగుణంగా నడిస్తే ప్రపంచం
మనకు చేయూత నిస్తుంది. మనం మానవ మాత్రులమే,
కానీ విశ్వ శక్తులు మనకు మద్దతు ఇస్తాయి. మహాత్మా
గాంధీ ఇట్లు చెప్పెను:
నేను చేసిన శపథం గొప్పదీ కాదు, ప్రత్యేకమైనదీ
కాదు. దేవుడు శరణాగతి కోరిన వారందిరినీ
రక్షిస్తాడు. గీత చెప్పింది భగవంతుడు త్యాగ౦
చేసిన వారలచే కర్మ చేయిస్తాడు. ఇక్కడ
ఎటువంటి భ్రాంతి లేదు. నేను చెప్పినది
ఒక సామాన్య శాస్త్రీయ సిద్ధాంతం. ఎవరికైతే
ఓర్పు, సంకల్పం ఉందో వారు దీన్ని
పరీక్షించవచ్చు. తద్వారా వాళ్ళు అర్హతను
సంపాదించవచ్చు. ఇవి తొందరగా అర్థంఅవుతాయి.
ధృడత్వం ఉంటే అవి సులభంగా వంటబడతాయి.
గాంధీ దేశానికి తండ్రివంటివాడు అంటారు. ఆయన
ప్రపంచ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయుడు.
ఆయన మనకు చూపినది ఒక సామాన్య మానవుడు
తన శక్తిని బహిర్గిత౦ చేసి, దేవుని కృపచే
పనిముట్టువలె పనిచేసి, ప్రపంచాన్ని కొంతవరకు
మార్చవచ్చు.
గాంధీని అర్థం చేసికోవాలంటే గీతని
అర్థం చేసికోవాలి. అలాగే గీతని సులభంగా అర్థం
చేసికోవాలంటే, గాంధీని అవగాహనకి
తెచ్చుకోవాలి. ఆయని గొప్ప ప్రవచనం
ఏమిటంటే చెడుకి శాశ్వతమైన స్థానం లేదు.
దేవుడు నిజము. అతడు మన అంతర్గతమైన
శక్తుల సముదాయము. అతన్ని తీసి పారేయలేము,
మార్చలేము, మోసుకుపోలేము. చెడుకి ఉనికి
మనము దానితో సహకరిస్తున్నప్పుడే. మనం
సూర్యుని ముందు నుంచుంటే, మన నీడ
పడదా? మార్గంలో చీకటి ఉంది. అయినా సూర్యుడు
ప్రకాశిస్తాడు. సూర్యుని కాంతికి కలిగే
అవరోధాన్ని తీసేస్తే నీడ పోతుంది. చెడు
నీడ వంటిది. అది కాంతికి కలిగిన అవరోధాన్ని
తీసేస్తే మాయ మౌతుంది. చెడుకు సహకారం
చేసే వారికి ఒక భయానకమైన బాధ్యత ఉంది :
కొంతకాలం చెడుకు ఉనికి ఉన్నట్లు ప్రవర్తిస్తారు.
కానీ దానికి సహకారం ఆపితే --అనగా నిర్దయ,
అవినీతి, హింస, యుద్ధం మొదలైనవి--చెడు
మాయమౌతుంది.
మనము రాష్ట్రపతులను, ప్రధాన మంత్రులను
మన సమస్యలను పరిష్కరించడానికి
ఉపయోగించుకోనక్కరలేదు. మనం
అంతర్ముఖులమవుతే చాలు. నేను
ఐకమత్యాన్ని విఫలం చేసే శక్తికి
సహకారం ఆపితే, నేను చెడును కొంత
లేకుండా చేసినట్టు. అది మనలో గొప్ప
శక్తిని విడుదల చేసి, మన కర్మలను,
బాంధవ్యాలను ప్రభావితం చేస్తుంది.
ఆ శక్తి క్రమంగా మన చుట్టూ ఉన్నవారి
జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.
గాంధీ వ్యష్టి యొక్క సామర్థ్యతను
వివరిస్తున్నాడు. సత్యానికి ఎందరో అవసరం
లేదు. ఎవడు చెడుని మనసా వాచా కర్మా
విడనాడితే, వానికి ప్రపంచాన్ని మార్చే
శక్తి ఉంటుంది. గాంధీని "మీరు
అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని
ఎలా ఎదుర్కొని విజయ౦ పొందేరు?"
అని అడిగితే, ఆయన సమాధానం:
"అది నేనే చేసేనని ఎలా అంటారు?
నేను ఒక పనిముట్టును మాత్రమే".
ఆయన చెప్పేది దేవుడు --అనగా
సత్యము, ప్రేమ, ఐకమత్యము--ఎల్లప్పుడూ
ఉన్నాడు. తన అహంకారాన్ని ఖాళీ
చేసి, తన అంతర్గత శక్తికి ఒక వాహనంలా
పనిచేసేడు. ఇది అయినప్పుడల్లా,
కొంత ఆలస్యమైనా--ఇతరుల హృదయాలు
స్పందిస్తాయి.
మనముందున్న శక్తులను పరిశీలిస్తే,
మన చిన్న వ్యక్తిత్వం ఎలా వాటిని
ఎదుర్కోగలదనే అనుమానం రావచ్చు.
శ్రీకృష్ణుడు చెప్పేది "నువ్వు ఒక్కడివే
పని చేస్తున్నవాని ఎందుకు తలుస్తున్నావు?"
గురుత్వాకర్షణ ఎలా సదా భూమ్మీద ఉంటుందో,
ప్రేమ, సత్యము, దయ అన్ని చోట్లా ఉంటాయి.
అలాగే ప్రేమ, ఐకమత్యము జీవితానికి
సహజం. మనమెలా వాటికి స్పందిస్తామో,
ఇతరులూ అలాగే స్పందిస్తారు.
మనం కర్మ ఫలాన్ని దబాయించి అడగలేము.
"నీ కర్మ నువ్వు చెయ్యి. దాని ఫలితం నాకు
వదిలిపెట్టు" అని శ్రీకృష్ణుడు చెప్పేడు.
ఆధ్యాత్మిక సాధన చాలా కఠినమైనది. దాని
వలన జ్ఞానము పొందడం అతి కష్టం. దైవ
కృపవలనే అది సాధ్యం. అదే లేక పోతే
ఈ ప్రపంచానికి భవిష్యత్తు లేదు.
మనం ఒక్కళ్ళమే లేము. మన
ప్రపంచం యాధృచ్చికంగా ఆనందం,
ప్రేమ, కాంతి, దిశ, శాంతి, బాధ నుంచి
ఉపశమనం లేక లేదు. మన చుట్టూ
గాలి, కాంతి, గురుత్వాకర్షణము ఉన్నట్టే
సృజనాత్మక శక్తి ఉన్నది. మనం వాటితో
ఏకీభావంతో ఉండక పోతే అవి మనకి
సహకరించలేవు. మన ఏకీభావం
ఇవ్వగలిగితే, ప్రేమ జయిస్తుంది. ఇది
గుర్తు పెట్టుకొంటే విశ్వాసం, ఆశ కలిగి
విజయం తప్పక వస్తుంది.